27, ఫిబ్రవరి 2019, బుధవారం

సమస్య - 2942 (రమ్ము జనులకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రమ్ము జనులకు శరణమ్ము గాదె"
(లేదా...)
"రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ"

90 కామెంట్‌లు:

  1. అమ్ములు క్రోధ కామములు యాతన జేయగ మానవాళినిన్
    వమ్మగు లోకచింతనపు భారము జీవుల క్రుంగదీయగా
    కమ్మని గీతబోధనల కర్మము జ్ఞానము భక్తియోగ సా
    రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ

    రిప్లయితొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
    గీతాసారమ్ముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. సమస్య :-
    "రమ్ము జనులకు శరణమ్ము గాదె"

    *ఆ.వె**

    దేశ ప్రజల కొరకు దేశాల సూత్రాలు
    కలిపి రాసి నట్టి గ్రంథ మదియె
    రక్ష నిచ్చు భరత రాజ్యాంగ సూత్ర సా
    రమ్ము జనులకు శరణమ్ము గాదె !
    .....................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      రాజ్యాంగ సారమ్ముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వ్రాసినట్టి' అనండి.

      తొలగించండి
  4. ధర్మబద్ధమైన కర్మయోగములోని
    విహిత తత్త్వములను విశదపరచు
    కిల్బిషాంతకమ్ము గీతార్థ వేద సా
    రమ్ము జనులకు శరణమ్ము కాదె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయకుమార్ గారూ,
      గీతార్థ వేద సారమ్ముతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  5. ప్రాణ భయము లేక పరులర క్షణకోరి
    యుద్ధ భూమి కేగు బుద్ధు లనగ
    గీత బోధ కన్న చేతసాయ మిడగ
    రమ్ము జనులకు శరణమ్ము కాదె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రమ్ము అని ఆహ్వానించారు. కాని జనులకు ఏది శరణం?

      తొలగించండి
  6. వమ్ము భవమ్మునందు పరువమ్మును నమ్ముచు సొమ్ముఁ గూర్చ, వ్య
    ర్థమ్మగు జీవనమ్ము, దరిదాపున నుండవు శాశ్వతమ్ము, ఘో
    రమ్మగు జీవనమ్ము, మధురమ్మగు మాధవపాదభక్తిపూ
    రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  7. పరమ పావనమ్ము పరమాత్మ నామమ్ము
    ఇడుము లెల్ల బాసి ఇలను గాచు
    మోక్ష పధము చూపు మురహరి గీత సా
    రమ్ము జనులకు శరణమ్ము కాదె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నామమ్ము +ఇడుములు = నామమ్ము లిడుములు' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు. అక్కడ "పరమాత్మ శుభనామ। మిడుములెల్ల..." అనవచ్చు. '...బాసి యిలను' అని యడాగమం వస్తుంది. 'గీతాసారమ్ము' అన్నది సాధు సమాసం.

      తొలగించండి
    2. ధన్యోస్మి. పూరణ చేశాక మీ అభినందన కానీ సవరణ కానీ చూస్తే సంతోషంగా ఉంటుంది.

      తొలగించండి
  8. సమత మమత కల్గి సాత్విక భావాన
    దైవ భక్తి దయయు ధర్మ ములు ను
    సత్య పాల నంబు నిత్య మౌచు మమ కా
    రమ్ము జనుల కు శరణ మ్ము కా దె !

    రిప్లయితొలగించండి
  9. ఆలితోడుపాడునందించుసంసార
    యానమందుసుఖమునభ్యుదయము
    సర్దుబాటుశాంతి సహనంబుతోగాపు
    *"రమ్ము జనులకు శరణమ్ము గాదె"*

    రిప్లయితొలగించండి
  10. కమ్మని విష్ణుగీర్తనల గావ్యసుధాపగ లోకమంతకున్
    నమ్మినతీర్థమైయొసగునాత్మ నివృత్తి పిపాసనణ్చుచున్
    గ్రమ్మిన ద్వంద్వమోహముల కల్మషమున్ గడుగున్ విరక్తి పూ
    *"రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ"*

    రిప్లయితొలగించండి
  11. ఎన్ని జన్మలెత్తి యెన్నాళ్ళు బొగడినా
    కానరావె నీవు కరుణజూపి
    బడుగు జీవి బ్రతుకు బాగుపరచవేగ
    రమ్ము జనులకు శరణమ్ము గాదె"!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గంగాప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...బొగడినన్' అనండి.

      తొలగించండి
  12. కష్ట నష్ట చయము క్రమ్మిన సమయాన
    దిక్కు తోచ కుండ తిరుగు వేళ
    యఘములను దరిమెడి రఘుపతి పదశిబి
    రమ్ము జనులకు శరణమ్ము గాదె !

    రిప్లయితొలగించండి
  13. ఆ.వె.పాప పంకమునిల ప్రక్షాళనము జేసి
    జన్మ సంచితముల సడలజేసి
    మోక్ష సౌఖ్య మునకు మూలమ్ము భక్తిసా
    రమ్ము జనులకు శరణమ్ము గాదె.
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  14. విలువలుడిగి వైరి కలిగించ కష్టముల్
    శాంతి యంచు నిలువ సాధ్యమగునె?
    తగిన బుద్ధి చెప్ప ధరణిపైనను సమ
    రమ్ము జనులకు శరణమ్ము గాదె

    రిప్లయితొలగించండి

  15. బాధలందు మునిగి పరితపించెడివేళ
    యార్తి బాపి మదికి హాయి నొసగు
    నట్టి తావదేది యన్నరాముని మంది
    రమ్ము.జనులకు శరణమ్ము గాదె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేళ నార్తి...' అనండి.

      తొలగించండి
  16. ఇమ్మగు మానవాళికిని నింద్రియమిశ్రిత తోషసాధనల్
    వమ్మని ద్రోసిపుచ్చెదరు వానిని ధీటుగ యోగసాధకుల్
    యిమ్మహి భక్తిపూరముగ నీశ్వరునమ్ముచు సాగుధర్మసా
    రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సాధకుల్ + ఇమ్మహి' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!

      తొలగించండి
  17. ఓటు పదను భువికి చాటి చెప్ప కదలి
    రమ్ము! జనులకు శరణమ్ము గాదె
    మేలు గొల్పునట్టి యేలుబడిని కోరి
    నీతిని నియమమును నిలుప నేడు!

    రిప్లయితొలగించండి
  18. మమత సమత పెంచి మానవ జన్మకు
    ముక్తి గలుగ జేయు శక్తి నిడెడు
    సాధనముగ వెలుగు చక్కని గీత సా
    రమ్ము జనులకు శరణమ్ము గాదె

    నిన్నటి సమస్యకు నా పూరణ

    వాసన పోయిన పూవులు
    వీసమునకు బనికి రావు ; వేనకు వేలౌ
    కాసుల వెచ్చించి గొనిన
    వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'గీతాసారమ్ము' అనడం సాధుసమాసం.

      తొలగించండి
  19. రామరాజ ! నీవు రాముని రీతిగా
    అడలగొట్టితయ్య ! యాంగ్లదొరల ;
    భరతవీరపుత్ర ! భవదీయ ధీశరీ
    రమ్ము జనులకు శరణమ్ము గాదె !

    రిప్లయితొలగించండి


  20. గురువర్యులకు నమస్సులు, నా నిన్నటి, మొన్నటి పూరణలు కూడా పరిశీలించ ప్రార్థన.

    వనవాసము జేసెడి రా
    ముని గని దనుజాంగన కడు మోహము నందెన్
    ఇనకుల తిలకుండివ్వగ
    ననుమతి, సౌమిత్రి కోసె నామె ముకు చెవుల్!

    ఏ సుమముల తావియు తన
    నాసికకు పడని వధూటి నా సతి యనగా
    నా సిగ ముడువంగ నెపుడు
    వాసన లేని పువులనిన భామకు బ్రియమౌ!

    రిప్లయితొలగించండి
  21. అణ్వాయుము గల్గి యసువులు దీతువా?
    పాకుదేశమోడ పాపి గొడుక!
    విడుము చెడ్డ, మంచి వహించు శాంతి సా
    రమ్ము జనులకు శరణమ్ము గాదె?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. కొన్ని దోషాలున్నవి. మీ ప్రయత్నాన్ని కొనసాగించండి.

      తొలగించండి
    2. యజ్ఞ భగవాన్ గంగాపురంబుధవారం, ఫిబ్రవరి 27, 2019 7:37:00 PM

      నేను ఈమధ్య మీ బ్లాగ్ చూసి కవిత్వం పట్ల కార్యోన్ముఖుడినయ్యాను. మీరు గురువులుగా భావిస్తున్నాను. సరిదిద్ది ప్రోత్సహించ ప్రార్థన.

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. నా తప్పులు సరి జేస్తారని భావిస్తూ...
      నమస్సుమాంజలులతో..
      యజ్ఞేశ్

      తొలగించండి
  22. మైలవరపు వారి పూరణ

    రమ్ము ! సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ
    నిమ్మహి విష్ణుభక్తి యొకటే ! యని నమ్ముము , చేర్చు నిన్ను పా...
    రమ్మును , వేయునేల ? యనరా ! వినరా హరినామమున్ నరా !!
    క్రమ్మక మున్నె వార్ధకము కంజదళాక్షు భజింపరా ! త్వరన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  23. ఎప్పు డెవ్విధిఁ జరియింత్రు నేర్వ గలమే
    ముళ్ళ మీద నడక కళ్ళు తెఱచు
    ధన మదాంధ జనుల దగ్గర కొలువు భా
    రమ్ము జనులకు శరణమ్ము గాదె


    ఇమ్ముగ నిచ్చు భక్త జను లెల్లర కెంతొ ముదమ్ము పుణ్య ధా
    మమ్ము వికుంఠ పత్తన రమా సతి నాథు ధరా బృహచ్ఛరి
    త్రమ్ము గుణప్రకీర్తిత నితాంత సమంచిత కీర్తనాది వా
    రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ

    [వారము = సమూహము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవా దాభివందనములు.

      తొలగించండి
  24. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కైపద దాతలకు ప్రభుత్వ హెచ్చరిక: "మద్యపానము ఆరోగ్య హానికరము"


    తమ్ములు సోదరీమణులు తంపట బెట్టగ నాస్తికోసమై
    ఝమ్మని యత్తమామలును జౌరుకు బోవగ శాంతిభద్రతల్
    గమ్మున బారుకేగుచును కమ్మని బాటిలు కోకుతోడుతన్
    రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ

    సుధీజనాళి = అమృతము గ్రోలు వారు

    రిప్లయితొలగించండి
  25. పరమ పూజ్యమైన పండితసూక్తిసా
    రమ్ముజనులకు శరణమమ్ముగాదె
    మంచిమార్గమునకు మళ్ళించిమనుజుని
    దేశభక్తునిగను దీర్చిదిద్దు

    రిప్లయితొలగించండి
  26. సవరించిన పూరణ
    ఇమ్మగు మానవాళికిని నింద్రియమిశ్రిత తోషసాధనల్
    వమ్మని ద్రోసిపుచ్చెదరు వానిని ధీటుగ యోగసాధకుల్
    నమ్ముచు నీశ్వరున్ సలుపు నైగమశాస్త్రపు జీవనమ్ము పా
    రమ్ము సుధీజనాళికి,శరణ్యము, మోక్షపథానుగుణ్యమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదములో సా రమ్ము గా చదువ ప్రార్ధన!

      తొలగించండి
    2. గ్రీష్మ తాపమునకు గృహమునుండగ లేక
      తీర ప్రాంతములకు పారిపోయి
      చల్లదనము కొరకు సంద్రపు జలవిహా
      రమ్ము జనులకు శరణమ్ము గాదె

      తొలగించండి
    3. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

      తొలగించండి
  27. షడ్రుచులుగ నుండు సంసారసారమ్ము
    భార్య బిడ్డలన్న? బంధమందు
    చింతలెన్నియున్న చెలియలకట్ట తీ
    రమ్ము జనులకు శరణమ్ముగాదె!

    రిప్లయితొలగించండి
  28. రిప్లయిలు
    1. భద్ర శైల నాధు పాద దర్శనమని
      కొన్ని నాళ్ళు వెడలె నన్ను వదలి,

      గ్రంధ ముద్రణమని గైరు హాజరు
      కొన్ని
      నాళ్ళు, కావ్య గోష్టి, వెళ్ళు
      చుంటి

      ననుచు వీడినావు నన్నిట కొన్నాళ్ళు,
      యాశ్రమమున పనుల నలస ట వల

      న కన లేను నిన్ను , నమ్ముమా నన్నని
      తెలుపు చుందువు గద తిరుగు లేక

      కొన్ని నాళ్ళు,కంది గురు వర్య, శంకరా
      నీదు శరణు లేక లేదు నాదు

      బ్లాగు పైన దృష్టి, పండి తోత్త ములకు
      లేదు సమయ మిచట నాదు‌ మోము

      చూడ ,శంకరార్య, వేడు చుంటిని ,వేగ
      రమ్ము ,జనులకు‌ శరణమ్ము గాదె

      నీదు రాక, విడిచి‌ నీవెపుడు వెడల
      బోకు, ననుచు బ్లాగు మోకరిల్లె






      గురువు గారి పాద పద్మ ముల పైన ఒక క్షమాపణ కుసుమము ముంచి

      తొలగించండి
    2. పూసపాటి వారూ,
      మీ పద్యంపై నా స్పందనను వాట్సప్ సమూహంలో చూడండి.

      తొలగించండి
  29. ఇమ్ముగయుధ్ధరంగమునగృష్ణునిసూక్తులనెన్నగాసుసా
    రమ్ము,సుధీజనాళికిశరణ్యముమోక్షపథానుగమ్యమౌ
    నిమ్మహినెవ్వరింటవిననింపునుగల్గుచునున్నవివ్వియే
    నమ్మితినామనంబునసనాతనమైనవిగావుతన్సుమా

    రిప్లయితొలగించండి
  30. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ.. .

    ఇమ్మహిలోన మానవులు నించుక జేసిన పుణ్య కార్యముల్
    సమ్మతితోడ నీతిగను సాగిన పేదల నాదరించుచున్
    నెమ్మనమందు రాఘవుని నిత్యము గొల్చిన రామనామ సా
    రమ్ము సుధీ జనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ.

    రిప్లయితొలగించండి
  31. బాధలందు మునిగి పరితపించెడివేళ
    నార్తి బాపి మదికి హాయి నొసగు
    నట్టి తావదేది యన్నరాముని మంది
    రమ్ము.జనులకు శరణమ్ము గాదె.

    కాలినడకతోడ క్రమముగా జనములు
    నడచి వత్తురెపుడు నయము గాను
    నఘము లణచి వేయు ననలాక్షు గిరిశిఖ
    రమ్ము జనులకు శరణమ్ము గాదె"

    సహన భావమూని సాగుచుండ మనము
    సంహరించిరి కద సైనికులను
    మౌనమింక వలదు మహిని లెండిక సమ
    రమ్ము జనులకు శరణు కాదె.

    రిప్లయితొలగించండి
  32. పొరుగు దేశ మెపుడు పోరుకే కవ్వించ
    శాంతి యనుట మనకు సాధ్య మగునె?
    సత్తువ నెరిగింప సాగింప గా సమ
    రమ్ము జనులకు శరణమ్ము గాదె.

    రిప్లయితొలగించండి
  33. భక్త జనుల బ్రోవ వసుధాతలమ్మున
    వేంకటేశు డగుచు వెలసె హరియె
    మహిని దివ్య క్షేత్రమౌ తిరుమల శిఖ
    రమ్ము జనులకు శరణమ్ము గాదె.

    రిప్లయితొలగించండి
  34. ఇమ్మహి గాచనెంచుచు మహీపతి పంక్తిరథున్ సుతుండుగా
    నమ్మహి తాత్మజుండె భరతావని బుట్టెనటంచుగాథలెన్నియో
    బామ్మలు చెప్పిరే గుడిని భక్తినయోధ్యన గట్టగన్ వడిన్
    రమ్ము, సుధీజనాళికి శరణ్యము మోక్షపథాను గుణ్యమౌ.

    రిప్లయితొలగించండి
  35. పాకువాడువచ్చి పాకవేసిననాడు
    నులకకనుబలకక నురగమటుల
    ఎగిరెగిరి పడిపడియేలఘోషలు సమ
    *"రమ్ము జనులకు శరణమ్ము గాదె"*

    రిప్లయితొలగించండి
  36. తిమ్మిని బమ్మిజేయుచును దేశమలందున నంగనాచిగన్
    సమ్మెట పోటులంచు దొర సానికి సానికి విన్నవించు బా
    కిమ్మహి బాతకీయగు స్వకీయ కుతంత్రపు టాటకట్టు మా
    *"ర్గమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ"*

    రిప్లయితొలగించండి
  37. నా ప్రయత్నం :

    ఆటవెలది
    బుగ్గి జేయ మనల పుల్వామ దాడిలో
    యుగ్రవాద పాకు యురిమి యురిమి
    దేశము దనరఁగ ప్రతీకార సైన్య ధీ
    రమ్ము జనులకు శరణమ్ము గాదె!

    ఉత్పలమాల
    అమ్ముని సేవలో దనరి యాగము గాచిన రామమూర్తి స్థై
    ర్యమ్ము! జనార్దనాంచితనిరాయుధు నాయుధ ధారణా సుగీ
    తమ్మున మాతృదేశ భవితవ్యము నెంచెడు సైన్య ధైర్య వీ
    రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ!

    రిప్లయితొలగించండి
  38. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  39. ఇమ్ముగ మంచి కార్యముల నెన్నియొ జేయుచు స్వార్థమెంచకన్
    సొమ్ములు దాచి పెట్టినవి సోమరి వారికి దారిఁ జూప యో
    గమ్మని భావనెంచి సహకారమొనర్చెడిదౌ పరోపకా
    "రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ"

    రిప్లయితొలగించండి