4, ఏప్రిల్ 2019, గురువారం

సమస్య - 2977 (కరిముఖుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు"
(లేదా...)
"కరిముఖుఁ డబ్ధినందనకు కన్నకుమారుఁ డనంగుఁ డన్నయున్"

97 కామెంట్‌లు:



  1. విఘ్న‌ములను బాపు వేడగాను జిలేబి
    కరిముఖుండు; లక్ష్మి కన్నకొడుకు
    నొసటి రాత తీర్చు నొప్పురీతి మనకు
    విశ్వదాభిరమణి వినవె భామ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "విశ్వదాభిరమణి విను జిలేబి" మకుటంతో ఒక శతకం రాసేయండి!

      తొలగించండి

    2. కంది వారి పల్కు కాదన కమ్మరో
      శతక మునిక వ్రాయి సకల జనులు
      పారి పోవ నీదు పద్యముల చదివి
      విశ్వదాభిరమణి విను జిలేబి :)



      జిలేబి

      తొలగించండి
    3. అలాగేమీ లేదండి జిలేబిగారూ,యెవరి ఫాన్స్ వారికుంటారు.నిర్భయంగా వ్రాసేయండి.విషయం క్యాచీగా ఉంటేచాలు!

      తొలగించండి
  2. ప్రాతఃకాల ప్రార్థన:

    పరువులు బెట్టి పోయితిని వంగల భూమికి చిన్ననాడు నే
    నరయక మాతృభాషనిట హైరన చెందుచు నర్ధసున్నలన్
    కరుణను పాసు జేయుమయ! కైపద మిట్టిది కంపమిచ్చెనే :( 👇
    "కరిముఖుఁ డబ్ధినందనకు కన్నకుమారుఁ డనంగుఁ డన్నయున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      పాస్ మార్కులే కాదు... కొంతకాలం మాతృభాషకు దూరమైన బాధను వ్యక్తపరచినందున పది గ్రేస్ మార్కులు పొందారు.

      తొలగించండి
    2. నమో నమః

      పాసు చేసి గ్రేసు మార్కులివ్వడమే కాకుండా నా ప్రార్థనను సమూహములో ప్రచురించినందుకు మీకు ఐదు వరహాలు; మాకు పప్పుబెల్లాలు

      🙏

      తొలగించండి
  3. విఘ్నములను బాపు వినాయకుడె గదా
    కరిముఖుండు, లక్ష్మి కన్న కొడుకు
    చిలుక రౌతు చెరుకు విలుకాడు రుద్రారి
    మనసిశయుడు వాడె మధుసఖుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వినాయకుడు' అన్నచోట గణదోషం. సవరించండి.

      తొలగించండి


  4. మరువగ నేల సంస్కృతిని మాలిని రాగిణి శోభలొల్కగా
    నరె! రమణీ! కళింగ! లలనా! మన పూర్వపు గాధ రీతిగా
    కరిముఖుఁ డబ్ధినందనకు కన్న, కుమారుఁ డనంగుఁ డన్నయున్,
    శరజుడు కాగ పుత్రునిగ శాంకరి కమ్మరొ సాదరమ్ముగాన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. గౌరి పెద్దకొడుకు భారతమ్ము లిఖించె
    కరిముఖుండు ; లక్ష్మి కన్నకొడుకు
    విరుల శరము వేసి పురుషుల లలనల
    మదుల నొకటి జేసె మన్మథుండు .

    రిప్లయితొలగించండి
  6. విఘ్న ము లను బాపు వేలు ప దె వ్వరో ?
    పాల సంద్ర మందు ప్రభ వ మం దె
    తెలుపు కృష్ణు డే మి దేవకీ దేవికి ?
    క రి ముఖుండు ;లక్ష్మి ; కన్న కొడుకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    కరిముఖుఁ డ , బ్ధినందనకు కన్నకుమారుఁ డనంగుఁ , డన్నయున్
    గిరిజకు విష్ణుమూర్తి చిరకీర్తి గడించిరి విఘ్నహారిగా ,
    నిరవుగ సౌఖ్యహారిగ , మహిన్ గన దుర్మదదైత్యహారిగా !
    వరదుల వారి మ్రొక్కుడు శుభమ్ముల పొందుడు శాశ్వతమ్ముగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    ముక్కు మూడ్రకాలు మేదిని జనులకు
    కోట,గరుడ,లబ్బ గురుతు లవియ
    గజపు తొండమాయె గమనించగా"లబ్బ"
    కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ భావం బోధపడలేదు. వివరించండి.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా. లబ్బ (చివరకు ఉబ్బిన)ముక్కు గల వారు ధనవంతులు.వీరే కరిముఖులంటే.ఇక మీరూహించుకోవాలి ,మనుజుల గత జాతకమును ఇప్పటి ఉన్నత స్థితిని గమనించాలి.ఇది లోకులు అనుకునే విషయం.)

      తొలగించండి
  9. క్షీర సాగర తనయ లక్ష్మికిని గంగ
    తల్లి,యందువల్ల శివుడు తండ్రి వరుస
    తండ్రి నన్నగ పిలుతురు ధరన, కాన
    కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "కరిముఖుండు లక్ష్మి కన్న కొడుకు"
      గా ఉండాలి.

      తొలగించండి
    2. రాకుమార గారూ,
      లాజిక్కుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధరను' అనండి.

      తొలగించండి
  10. ఆఖు వాహనుండు అచలాత్మ జసుతుఁడు
    కరి ముఖుండు; లక్ష్మి కన్న కొడుకు
    మకరికేతనుండు మరులు గొల్పుచునుండు
    వొకనిc దల్పు మెప్డు వొకని నిల్పు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వొక' అనడం సాధువు కాదు. "గొల్పుచునుండు । నొకనిఁ... మెప్పు డొడని నిల్పు" అనండి.

      తొలగించండి
  11. కార్తికేయ,గౌరి,కంసారి,నరసిం హ,
    కరి ముఖుండు,లక్ష్మి,కన్నకొడుకు,
    హనుమ,శంకరాది అసురారులెల్లరు
    ప్రేమతోడ మమ్ము నోముగాక!

    కన్నకొడుకు=విష్ణుమూర్థి గన్న కొడుకు(బ్రహ్మ)

    రిప్లయితొలగించండి
  12. సమస్య :-
    "కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు"

    *ఆ.వె**

    గౌరి నాయువిచ్చి కాపలా యుంచిన
    గౌరి పుత్రుడౌను కరిముఖుండు
    వావి వరుస జూడ యే విధముగయౌను
    కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు?
    .........................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గౌరి యాయువిచ్చి... జూడ నే విధముగ నౌను' అనండి.

      తొలగించండి
  13. తల్లి వాకిట తన తండ్రి నాపెనెవరు
    భర్త యురము నుండు భార్య యెవరు
    వరము తాను నిలుపు వంశమ్మునెవరన్న
    కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు

    రిప్లయితొలగించండి


  14. పార్వతి says to లక్ష్మి :)



    నాదు భర్త నైన నాయాన గా ద్వార
    మందు నిలిపి వేసె మాట దాట
    డమ్మ విఘ్నముల నెడపునితడేనమ్మ
    కరిముఖుండు, లక్ష్మి! కన్నకొడుకు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      లక్ష్మి శబ్దాన్ని సంబోధనగా చేసి పూరించిన మీ పద్యం ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  15. విఘ్నరాశినూడ్వ వేలుపు నెవ్వండు?
    ధర్మబద్ధమైన దంపతులకు
    కామవాంఛనొసగు కామదేవుడెవడు?
    *"కరిముఖుండు ;లక్ష్మి కన్నకొడుకు"*

    రిప్లయితొలగించండి
  16. గిరిజ కుమారుడెవ్వడగు?గృత్సుడు నేసతికిన్ జనించెనో?
    నరుడు బసిండిబొజ్జదొర యా రమ కేమగు?మాధవాత్మజుల్
    మరుడును,దమ్మిచూలియు గ్రమంబున బేరును బెంపునెట్టులో?
    *"కరిముఖుఁ ;డబ్ధినందనకు; కన్నకుమారుఁ ;డనంగుఁ డన్నయున్"*

    రిప్లయితొలగించండి
  17. శంభుపత్నిగాగ జక్రికిజెల్లెలు
    లక్ష్మియౌను గాదె లక్షణముగ
    ననుజ హరుకు వరుస,కనుక సందియమేల?
    కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు!
    లక్ష్మికి అన్నకొడుకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హరునకు' అనడం సాధువు.

      తొలగించండి
    2. ధన్యవాదముల గురుదేవా!
      సవరించిన పూరణ
      శంభుపత్నిగాగ జక్రికిజెల్లెలు
      లక్ష్మియౌనుగాదె లక్షణముగ
      ననుజ శివుని కరయ నార్య!ముద్దులొలుకు
      కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు!

      తొలగించండి
  18. విఘ్న నాథుగభువి బేరువడసెనుగ
    గరిముఖుండు,లక్ష్మికన్నకొడుకు
    చెఱకువిల్లుదాల్చి శివునిమూర్కొనినయా
    మకరకేతనుండుమన్మధుండు

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అడ్డముల నదుమును అంబకుమారుడు
    కరిముఖుండు; లక్ష్మి కన్న కొడుకు
    తన శరములతో నితరులలో మోహమ్ము
    పుట్టు నట్లు జేసి పొలయు వాడు

    రిప్లయితొలగించండి
  20. డా.పిట్టా సత్యనారాయణ
    సరియిది గొప్ప నానుడియె సర్వులు వాడుకొనంగ వింటి ని
    ప్పరి గణనాయకుం దలచి బారిన పాదము వావి వర్సలున్
    మరి యెటులౌనొ నే నెరుగ మాన్యతనందె"తలాయె(తల॥అయె) తమ్ముడున్
    బరితెగ తోకగా జెలగె బావ మరింది" యటన్న నీమమై
    "కరిముఖు డబ్దినందనకు కన్న కుమారుడనుంగు డన్నయున్"
    (తలకాయ తమ్ముడు;తోక బామ్మర్ది తెలంగాణా నానుడి,జాతీయము ఈ సమస్యకు సరిపోలినది.ఆనాడు దేవతల బాంధవ్యాల నుండియే ఈ తెలుగు సామెత వచ్చినదేమో!)

    రిప్లయితొలగించండి
  21. డా. బల్లూరి ఉమాదేవి

    విఘ్నములనుబాపు విఘ్నేశ్వరుడె గను
    "కరిముఖుండు; లక్ష్మి కన్నకొడుకు"
    పంచబాణుడనగ వసుధలో ఖ్యాతి
    నందినట్టి వాడనంగు డతడు.

    వ్యాసభారతమును వాసిగా వ్రాసెను
    కరిముఖుండు; లక్ష్మి కన్నకొడుకు
    త్ర్యక్షుని తపమాప తాపత్రయము చెంది
    భవుని క్రోధమునకు భస్మమయ్యె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా, ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మూడవ పాదం చివర గణదోషం. "వసుధలో ప్రఖ్యాతి" అనండి.

      తొలగించండి
  22. గణములకధినాయకత్వము పొందెను
    కరిముఖుండు,లక్ష్మి కన్నకొడుకు
    మకరకేతుడయ్యె మానస హరుడుగ
    కార్యసిద్ధుడొకరు,కాముడొకరు
    (తొలి ప్రయత్నం, తప్పులున్న తెలుప ప్రార్థన)

    రిప్లయితొలగించండి
  23. గౌరి మనము దోచు గారాల పుత్రుడు
    విష్ణుదేవుని మది వెలయు వనిత
    వాసు దేవుడు గన వసుదేవు మురిపాల
    కరిముఖుండు ; లక్ష్మి ; కన్నకొడుకు

    రిప్లయితొలగించండి
  24. విఘ్నములను బాపి విజయము నొనరించు
    కరి ముఖుండు; లక్ష్మి కన్నకొడుకు
    మరుడు శివగిరిజల మధ్య రక్తి
    నొనర్చె
    ఆదిదంపతులగ నడరిరపుడు

    రిప్లయితొలగించండి
  25. వరుఁడు సుందరుండు ప్రద్యుమ్నుఁ డయ్యెను
    వర యదు కులజాతుఁ డరయ నతఁడు
    రమణి రుక్మిణీ లలామకు దనయుఁ డు
    క్కరి ముఖుండు లక్ష్మి కన్నకొడుకు

    [తనయుఁడు +ఉక్కరి; ఉక్కరి=శౌర్యవంతుఁడు; శౌర్యవంతమైన ముఖము కలవాఁడు]


    సురుచిర భాషణుండు శ్రుతిసూరి వధూమణి బృంద చిత్త మం
    దిర గత మన్మథుండు ఘన దీర్ఘ భుజుండు సునీల మేఘ సుం
    దరతర దేహుఁ గాంచు మువిదా సుమనో విల సత్సరోవ రా
    కరి ముఖుఁ డబ్ధినందనకు కన్నకుమారుఁ డనంగుఁడన్నయున్

    [సరోవర +ఆకరి ; ఆకరి = ఖనిజము; సరోవరమను ఖని నుండి పుట్టినది: పద్మము.
    అనంగుఁడన్న ( రామన్న వలె) = మన్మథుడు,]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరార్యుని పద శైలి‌‌ పద్య శైలి‌వేరు నమస్కారము కవివరా అధ్బుతమైన పూరణ

      తొలగించండి
    2. నమస్కారమండి కుమార్ గారు. నా పూరణము మీకు నచ్చినందులకు ధన్యవాదములండి.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  26. మిత్రులందఱకు నమస్సులు!

    హరి యగు నన్న పార్వతికి! నట్టులె కావలె నందనుండుగాఁ
    గరిముఖుఁ! డబ్ధినందనకుఁ గన్నకుమారుఁ డనంగుఁ! డన్నయున్
    సిరికిని శంకరుండు కనఁ, జెన్నుగ గంగకుఁ బెన్మిటౌ! నిటుల్
    వరుసల నెంచుచో హరుఁడు, పంకజనాభున కల్లుఁడే యగున్!!

    రిప్లయితొలగించండి
  27. కరుముఖుడ!బ్ధినందనకుకన్నకుమారుడనంగుడన్నయు
    న్బరగునుగాదెజూడగనుబంధముగాసరివోవునెప్పుడున్
    నరయననంగుడేగద యయాచితబాణమువేయగానటన్
    నిరవుగభస్మమాయెనటయీశునిగంటికితాళజాలకే

    రిప్లయితొలగించండి
  28. గౌరికి ప్రియ సుతుడు గణముల కధిపతి
    కరిముఖుండు, లక్ష్మి కన్నకొడుకు
    మరులుకొలుపు నట్టి మన్మథుండు, శివుని
    కంటి మంట తోడ కాలిపోయె

    రిప్లయితొలగించండి
  29. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అరయగ రామభద్రునికి హాయిగ తీయగ పిల్లలెందరో!
    బరువుగ పుత్రులెన్మిదిర పండుగ జేయుచు నాల్గు పుత్రికల్
    సరిసరి వారి పిల్లలుర చక్కగ జేతురు పూరణమ్మిటన్:
    "కరిముఖుఁ డబ్ధినందనకు కన్నకుమారుఁ డనంగుఁ డన్నయున్"

    రిప్లయితొలగించండి
  30. గౌరిప్రియసుతుండుగాద?కరిముఖుండు
    లక్ష్మి కన్నకొడుకు"లౌఖ్యమందు
    మన్మదుండుయనిరి!మంగళకరమగు
    వంశవృద్దికొరకె!సంశయంబ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లౌక్యమందు మన్మథుం డటంద్రు..' అనండి.

      తొలగించండి
  31. ఓటరు లిస్టు లో ఓట్లు గల్లంతయినట్లు బ్లాగులో మన పోటోలు గల్లంతా తెలియటము లేదు గురువుగారు కొత్త ఆశ్రమమునకు వెళ్లిన తర్వాత???ఏమన్నా ???

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బ్లాగర్ ఇక గూగుల్ అకౌంటును సపోర్ట్ చేయదని కొన్ని రోజులుగా సందేశం వస్తున్నది. దాని ప్రభావమేమో?

      తొలగించండి
  32. ఆటవెలది
    పశుపతి ప్రియరాణి పార్వతమ్మ సుతుడు
    కరిముఖుండు. లక్ష్మి కన్న కొడుకు
    మీనకేత నుండు.మినుసిగ వేల్పుని
    తపము జెరచి తాను దగ్ధ మయ్యె.

    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి

  33. చంద్ర దృష్టి సోక చఛ్చిన దెవ్వరో,
    చంద్రు డెవరొ తెల్పు సరస గతిని,
    చంద్రు డేమి యగును జలధి తలచినంత,
    కరి ముఖుడు,లక్ష్మి కన్న,కొడుకు

    రిప్లయితొలగించండి
  34. గిరిజను పెండ్లియాడినది క్ష్వేళగళుండు సదా శివుండెగా,
    హరిహయుడా యుమా తనయుడాదిగ పూజల నందువాడయెన్
    కరిముఖు, డబ్ది నందనకు కన్నకుమారుఁడనంగు, డన్నయున్
    హరుడట! శారదాంబ పతి యంబుజ గర్భుడు కంజుడే గదా!

    రిప్లయితొలగించండి
  35. బల్లూరి ఉమాదేవి

    పార్వతీ శివులకు పరమ ప్రీతి కరుడు
    కరి ముఖుండు లక్ష్మి కన్నకొడుకు
    కూడా యౌను వినుము కూరిమి తో జూచు
    హరికి మేనయల్లు డతడు నిజము.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కూడా' గణదోషం. 'కూడ' అనండి.

      తొలగించండి
  36. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  37. ఆటవెలది //
    నలుగు పిండి జేయ నగజసుతుండాయె
    కరిముఖుండు, లక్ష్మి కన్నకొడుకు
    రుక్మిణీసుతుండు రుద్రారి ప్రద్యుమ్న
    సుముఖ కామదేవ సొత్తు సిద్ధి. ..

    రిప్లయితొలగించండి
  38. ఆటవెలది
    శ్రీహరి సతియైన క్షీరాబ్ధి కన్యకు
    శైలజపతియైన శూలియన్న
    పార్వతి సుతుడౌచు పరమేశు దయగొన్న
    కరిముఖుండు లక్ష్మికన్న కొడుకు

    రిప్లయితొలగించండి