18, ఏప్రిల్ 2019, గురువారం

సమస్య - 2990 (అరిషడ్వర్గమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అరిషడ్వర్గమ్ము నొసఁగుమని వేడఁ దగున్"
(లేదా...)
"అరిషడ్వర్గ మొసంగ శ్రీహరిని నిత్యం బీవు ప్రార్థింపుమా"

77 కామెంట్‌లు:

  1. హరి!నారాయణు, విష్ణు,న
    సురసంహారి,సిరిమగని, శుభములనిడగా
    స్థిరమగు శక్తిని ద్రుంచగ
    నరిషడ్వర్గమ్ము, నొసఁగుమని వేడఁ దగున్

    రిప్లయితొలగించండి
  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    వరముల్ కోరక భక్తిమార్గమున ఛీ! భాగ్యమ్మునిమ్మంచుచున్
    బరువౌ దీక్షను యోగమార్గముననున్ బంధింపకే శ్వాసలన్
    సరియౌ పోరగ జ్ఞానమార్గమున భల్ శాస్త్రీయ వాదమ్ముతో
    నరిషడ్వర్గ మొసంగ శ్రీహరిని నిత్యం బీవు ప్రార్థింపుమా!

    రిప్లయితొలగించండి
  3. అరిగా నెంచినయట్టి దుర్గుణము లా
    హా ! బ్రహ్మ లోకమ్ములో
    నరిషడ్వర్గ మొసంగ ; శ్రీహరిని ని
    త్యంబీవు ప్రార్థింపుమా !
    మరపం దైనను వాని మాయలకు నే
    మారున్ వశంబందకన్
    సరియౌ సన్నుతమార్గవర్తి వగుచున్
    సారూప్య మోక్షార్థివై.

    రిప్లయితొలగించండి
  4. దరిజేరనీయ కంటిని
    యరిషడ్వర్గమ్ము, నొసఁగుమని వేడఁ దగున్
    నిరతము నరుండు శ్రీహరి
    చరణములనె ముక్తి గోరి సద్గతి కొరకై

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    స్థిరమున్ కోరెడి కామమున్ , హరిని విద్వేషించు వారిన్ గనన్
    వరమౌ క్రోధము , భక్తిలోభము , సదా వైరాగ్యమోహమ్ము , త..
    త్పరతా సమ్మద , మన్యవస్తుగతమాత్సర్యాఖ్య గేయమ్మునౌ
    అరిషడ్వర్గ మొసంగ శ్రీహరిని నిత్యం బీవు ప్రార్థింపుమా!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. శ్రీ సూరం వారికి వందనములతో 🙏చిరు సవరణ..

      శంకరాభరణం.. సమస్యాపూరణం

      అరిషడ్వర్గ మొసంగ శ్రీహరిని నిత్యం బీవు ప్రార్థింపుమా!

      స్థిరధర్మప్రియకామమున్ , హరిని విద్వేషించు వారిన్ గనన్
      వరమౌ క్రోధము , భక్తిలోభము , సదా వైరాగ్యమోహమ్ము , త..
      త్పరతా సమ్మద , మన్యవస్తుగతమాత్సర్యాఖ్య గేయమ్మునౌ
      అరిషడ్వర్గ మొసంగ శ్రీహరిని నిత్యం బీవు ప్రార్థింపుమా!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  6. నిరతము కోర్కెల తోడను
    ధరణీ తలమందు నను సతమత మగుట శ్రీ
    హరి ప్రత్యక్షమయిన జిత
    యరిషడ్వర్గమ్ము నొసఁగుమని వేడఁ దగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జిత + అరిషడ్వర్గము = జితారిషడ్వర్గము' అవుతుంది. యడాగమం రాదు. "పతత్ + అరిషడ్వర్గము = పత। దరిషడ్వర్గము' అనండి. పతత్ = పతనమయ్యే.

      తొలగించండి
    2. గురువర్యులకు గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు

      తొలగించండి


  7. హరినామము! సద్భావన !
    స్మరణము! శ్రవణము! విడువక మననము! జావా
    హిరిగా సత్సంగము! ఉప
    మరి! షడ్వర్గమ్ము నొసఁగుమని వేడఁ దగున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. డా.పి సత్యనారాయణ
    సరిపోయెను తాయిలములు
    బరిదెగి నీయంగ నెన్ని ప్రాపులొ ప్రజకున్
    అరకొర కోర్కెలె, నాయకు
    నరిషడ్వర్గమ్ము నొసగుమని వేడ దగున్

    రిప్లయితొలగించండి
  9. డా.పి సత్యనారాయణ
    సరియోగంబునుజేయలేని కతనన్ సాయుజ్యమే లేదు యి
    త్తరి భావంబుల భక్తి నిల్ప తరమే, తారాడ యాత్రాదులన్
    మరికొన్నాళ్ళుగ నైటి(I.T) జీవనమదే మాన్యంబుగాన్ జన్మలన్
    వరుసన్నెత్తగ జూడు వింతల నహో!వైవిధ్యమౌ జీవిక
    న్నరిషడ్వర్గ మొసంగ శ్రహరిని నిత్యంబీవు ప్రార్థింపుమా

    రిప్లయితొలగించండి
  10. శ్రీ గురుభ్యోన్నమః🙏
    మహా విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుతో ననిన మాటలు:
    నాకు దోచిన పూరణ.

    హరి వేడు తండ్రి, గెలువగ
    అరిషడ్వర్గమ్ము; నొసఁ గమనివేడ దగున్
    కరివరదుని పరమ పదమె
    సరియైన విధము తరింప సర్వుల కీశా!

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టానుండి
    ఆర్యా, ఆ ఆహ్వానమును ప్రకటింప ప్రార్థన,శం.భ.లో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రయత్నించాను. ఆహ్వానం పిడియఫ్ ఫైలుగా ఉంది. బ్లాగర్ దానిని ఆక్సెప్ట్ చేయడం లేదు.

      తొలగించండి
  12. నరుడా!పామరుడా!చె
    చ్చెర,కీర్తియు,పాడు బుధ్ధి,చేరును నిన్నున్
    పరితాప మందనేలా?
    అరిషడ్వర్గమ్ము నొసగు మని వేడదగున్.

    రిప్లయితొలగించండి
  13. పరికింపగ సంసారమె
    యరిషడ్వర్గమ్ము సార మని దెలియునుగా!
    పరిమితి దాటక యుండెడి
    అరిషడ్వర్గమ్ము నొసఁగుమని వేడఁ దగున్
    ****)(****
    (కామక్రోధాదులు పూర్తి అదృశ్యమైనచో అందరు సన్యాసులై తుదకు సమాజమే నశించి పోతుంది కదా !కావున పరిమితులకు లోబడిన అరిషడ్వర్గము వాంఛనీయమే !)

    రిప్లయితొలగించండి
  14. స్థిరు లను జేర o గ వెరచు
    నరి ష డ్వర్గ మ్ము;; నొసగు మని వేడ దగున్
    పరమ పదమ్మును కరుణ ను
    హరి చరణ మ్ములను నమ్మి యని శము భక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అరిషడ్వర్గమ్మున్' అని ద్వితీయలో ఉన్నది. అన్వయం కుదరడం లేదు.

      తొలగించండి
    2. అప్యర్థం తీసుకుంటే కుదురుతుంది.

      తొలగించండి
    3. స్థిర ముగ వదల గ నెంచె ద
      ర రి షడ్వర్గమ్ము______:

      తొలగించండి
  15. దురితమ్ముల గురిపించుగ
    నరిషడ్వర్గమ్ము,నొసగుమని వేడదగున్
    హరిచరణమ్ముల గురిగొను
    శరణాగతి,పరమపదము,శాశ్వతసౌఖ్యమ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!సౌఖ్యమ్ అనవచ్చునా?లేనిచో శాంతిన్ యని స్వీకరించ ప్రార్ధన!

      తొలగించండి
    3. సవరించిన పూరణ
      మరలించగ మోకరిలుచు
      నరిషడ్వర్గమ్ము,నొసంగుమని వేడదగున్
      హరిచరణమ్ముల గురిగొను
      శరణాగతి,పరమపదము,శాశ్వతశాంతిన్

      తొలగించండి
  16. పరికించిచూడ నిపుడీ
    పరి కొనసాగెడి యెనికల పరిగణనములో
    నరిమూ కలపై నెగ్గగ
    నరిషడ్వర్గమ్ము నొసగుమని వేడదగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎన్నికల'ను 'ఎనికలు' అనరాదండీ.

      తొలగించండి
    2. 🙏🏽 ధన్యవాదములు. సవరించ యత్నించెద

      తొలగించండి
  17. లంకలో విభీషణుడు చాలా సౌమ్యుడు.అతడు రావణాసురుని తప్పులు ఎత్తి చూపుతూ చాలా ఇబ్బంది కి తన సోదరుని గురి చేస్తుంటాడు .అది రావణునికి నచ్చక సోదరుని మీద ప్రేమ చంపు కోలేక మన రాక్షసులలో ఉండ వలసిన లక్షణాలు ఇతనిలోలేవు. ఇతనికి అరిషడ్వర్గంలు ప్రసాదించమని ఆశివుని కోరుకుంటాను అను సందర్భము

    భరువును కోరెద సహజున
    కరి షడ్వర్గమ్ము నొసఁగుమని ,వేడఁ దగున్
    పురుషాదులు తమ చరితము
    నరయగ ననె రావణుoడు నతిఘము తోడన్

    రిప్లయితొలగించండి


  18. అరె!మూర్ఖత్వము వృద్ధి గాన తృటిలో నావేశముల్ హెచ్చుగా
    నరిషడ్వర్గ మొసంగ, శ్రీహరిని నిత్యం బీవు ప్రార్థింపుమా
    పరమాప్తుండతడే జిలేబి మనకైవారమ్ము స్తోత్రమ్ములన్
    వరదా కావుమటంచు వేడ మనలన్ ప్రత్యంతమై గాచునే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. సరగొనిపలుకుటనిట్లుగ
    నరిషడ్వర్గమ్మునొసగుమనివేడదగున్
    నరిషడ్వర్గములనునవి
    నరులకుపుట్టుకనవచ్చునరములుసిట్లన్

    రిప్లయితొలగించండి
  20. హరి నామమును వీడని ప్రహ్లాదుని దండించుటకు మనసురాక పుత్రవాత్సల్యముతో దానవలక్షణాలనలవర్చుకొమ్మని సూచిస్తున్నట్టుగా నూహించిన పద్యం...


    గురువుల్ జెప్పిన నాలకింపవట, సంకోచింపకన్ శత్రువౌ
    హరినామమ్మును తల్చుచుందువట నా యాక్షేపణన్ ద్రోయుచున్
    సరికాదంటిని బాలకా వినుము వాత్సల్యమ్ముతో జెప్పెదన్
    నరిషడ్వర్గమొసంగ శ్రీహరిని నిత్యంబీవు ప్రార్థింపుమా!

    రిప్లయితొలగించండి
  21. కర మరుదు నిన్ను గెలువఁగ
    ధరను గృపా భరిత చిత్త ధారిణి కమ్మా
    వరముగ విముక్తి నింపుగ
    నరిషడ్వర్గమ్ము నొసఁగుమని వేడఁ దగున్

    [నీవే దిక్కని యరిషడ్వర్గమునే వేడుట మంచిది]


    ధరలోఁ గన్పడు బాహ్య శత్రు తతికిం దల్చంగ దాడిన్ భయం
    కరమై వర్తిలి మానవాళికిని నిర్ఘాతాభమై నిల్చి య
    స్థిర భావ మ్మలరారఁ జేయు నిదియే తేజంబు ఖండింప నీ
    యరిషడ్వర్గ మొసంగ శ్రీహరిని నిత్యం బీవు ప్రార్థింపుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు

      తొలగించండి
  22. తరుణుల ముందఱ నోరును
    తెరువగ భయపడు పతులకు తెలిపితి నిటులన్
    తరుణుల గెలువగ మాధవ!
    "యరిషడ్వర్గమ్ము నొసఁగుమని వేడఁ దగున్"

    రిప్లయితొలగించండి
  23. మరి మరి హరినే దలచుచు
    పరమాత్ముని మదిని గాంచి ప్రార్ధన లిడుచున్
    వరముగ శస్త్రము దునుమగ
    అరిషడ్వర్గమ్ము నొసఁగుమని వేడఁ దగున్

    రిప్లయితొలగించండి
  24. సవరణతో

    పరికించిచూడ నిపుడీ
    పరి కొనసాగు ప్రతినిధుల పరిగణనములో
    నరిమూ కలపై నెగ్గగ
    నరిషడ్వర్గమ్ము నొసగుమని వేడదగున్

    రిప్లయితొలగించండి
  25. దరిచేర్చగనీకుము హరి
    యరిషడ్వర్గము,నొసంగు మని వేడదగున్
    నిరతము మీనామజపము
    మరవక చేసెడి తమకము మదిలో నిమ్మా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒసంగుమని', 'ఇమ్మా' పునరుక్తి. "మదిని స్థిరముగా" అంటే సరి!

      తొలగించండి
  26. అరయన్ జీవులు కర్మబద్ధులగు మాయామోహ జాలంబుచే
    నరిషడ్వర్గ మొసంగ,శ్రీహరిని నిత్యంబీవు ప్రార్ధింపుమా
    కరుణన్ గావగ జన్మమృత్యువుల చక్రంబందు నుండీక్షచే
    పరమౌధామము జేరగా దుదకు సంభావించి సాన్నిధ్యమున్

    ఈక్ష = చూపు అయ్యవారి కడగంటి చూపుతోనే అన్నీసంభవము (కరుణాపాంగుడు)
    రోజూ ప్రార్ధించడంవల్ల సాన్నిధ్యము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. డా. సీతా దేవి గారు మీసుందర పూరణామృతకిరణునిలో నాకు రెండు శశచ్ఛాయలు గోచర మగుచున్నవి.
      1. జీవులు – బద్ధులగు : వచనభేదము.
      2. నుండి + ఈక్ష : సంధికృతము
      గమనించండి. గురువు గారు నిర్దేశించ గలరు.

      తొలగించండి
    3. దోషములు సూచించినందులకు ధన్యవాదములార్యా! క్రింది సవరణలు సరిపోవునేమో పరిశీలించ వినతి!

      అరయన్ జీవుడు కర్మబద్ధుడగు మాయామోహ జాలంబుచే
      నరిషడ్వర్గ మొసంగ, శ్రీహరిని నిత్యంబీవు ప్రార్ధించుమా
      కరుణన్ గావగ జన్మమృత్యువుల చక్రంబందు భ్రామించకే
      పరమౌధామము జేరగా తుదకు సంభావించి సాన్నిధ్యమున్

      తొలగించండి
    4. గురుదేవులకు ధన్యవాదములు,నమస్సులు!

      తొలగించండి
  27. అరిషడ్వర్గ మొసంగ శ్రీహరిని నిత్యం బీవు ప్రార్థింపుమా"
    యరిషడ్వర్గముపుట్టుకన్గలుగునాయాజాతివంశాళికిన్
    బరగన్బ్రార్ధనజేయగావలదునెవ్వారున్జగంబందునన్
    నరిషడ్వర్గమునెప్పుడున్మనకునన్యాయంబుజేకూర్చుగా

    రిప్లయితొలగించండి

  28. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కడపలో:

    అరెవో! చూడర నాంధ్రదేశమున భల్ హంగామతో నెన్నికల్
    వరముల్ తెచ్చును మద్యపానమునకున్ బ్రహ్మాండ బిర్యానికిన్...
    హరిజన్ రెడ్డులు బల్జె కాపు ద్విజులన్ హైరానతో బాబుకౌ
    నరిషడ్వర్గ మొసంగ శ్రీహరిని నిత్యం బీవు ప్రార్థింపుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చూడర + ఆంధ్రదేశమున = చూడర యాంధ్రదేశమున' అవుతుంది.

      తొలగించండి
  29. దురహంకారము నింపును
    అరిషడ్వర్గమ్ము!"నొసగుమనివేడదగున్
    పరులకు మేలొనగూర్చెడి
    కరుణయు మదికొసగుమనుచు కార్తీకునితో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అరిషడ్వర్గమ్మున్' అని ద్వితీయలో ఉంది. అన్వయం కుదరదు.

      తొలగించండి
  30. పరులం దొప్పు కృపాగుణమ్మున,దురభ్యాసమ్ము, దుష్కర్మలన్,
    సరవిం జేయు పరోపకారములఁ, దా సాధించు ధర్మంబులన్,
    దురితాదాయముఁ గూడబెట్టు పనులన్,
    దోదుహ్యపుణ్యమ్ములౌ
    నరిషడ్వర్క మొసంగ శ్రీహరిని నిత్యంబీవు ప్రార్థింపుమా!.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  31. మరొక పూరణ

    కరివరదా పుట్టించకు
    అరిషడ్వర్గమ్ము, నొసగమని వేడెదగున్
    సురవంద్యా సతతము నీ
    చరణములను కొలుచు నట్టి సన్మతి నిడుమా

    రిప్లయితొలగించండి