25, ఏప్రిల్ 2019, గురువారం

సమస్య - 2997 (పరులకు మేలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పరులకున్ మేలుఁ జేసినఁ బాపమబ్బు"
(లేదా...)
"పరులకు మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా"

111 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    తరుగగ నుల్లిపాయలను తల్లికి సేవను జేయబూనుచున్
    విరివిగ కంటి నీరములు భీతిని జేయుచు వచ్చు నీకురా!
    కరుగగ మానసమ్ము భళి కన్నులు పోవును భాగ్యనగ్రినిన్
    పరులకు మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా!

    రిప్లయితొలగించండి
  2. కరువు బ్రతుకున ప్రతివారు కలత బడుచు
    నింగి నంటిన కోర్కెల వంగి పోయి
    పిల్ల పాపలు లేకున్న పెల్లు సుఖము
    పరులకున్ మేలుఁ జేసినఁ బాప మబ్బు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      భావం కొంత అస్పష్టంగా ఉన్నది. అన్వయలోప మున్నది.

      తొలగించండి
  3. భోగ భాగ్యాలఁ గోరుచున్ పుడమి యందు
    పరుల వంచించుటొక్కటే పనిగ దలచి
    బ్రతుకు కుచ్ఛిత మతులైన పరమ స్వార్థ
    పరులకున్ మేలుఁ జేసినఁ బాప మబ్బు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కుత్సితమతులైన' అనండి.

      తొలగించండి


  4. సరసి! జిలేబి! చేయదగు చక్కగ నీదగు రీతి ప్రేమతో
    పరులకు మేలుఁ, జేయకుము, పాప మహాబ్ధిని మున్గఁబోకుమా,
    ‌నరులకు కీడు, కర్తృకవినాశముగా! యిది పట్టుగొమ్మగా
    తెరువును గాంచు జీవితము తెమ్మరగానిక సాగు నెప్పుడున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. పుణ్యగతులు కలుగునమ్మ పూవుబోడి
    పరులకున్ మేలుఁ జేసినఁ, బాపమబ్బు,
    కీడొనర్చిన వారికి! కిస్తి తప్ప
    దమ్మ సరిసమానముగ సదా బతుకున!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    ఒరులకు కీడొనర్పని మహోన్నత భారతదేశశాంతిసం...
    భరితవిధానమే జగతి మన్నన పొందు , మతాంధకారము...
    ష్కరులకు హింసతో కరుడుగట్టినవారికి నుగ్రవాదత...
    త్పరులకు మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  7. ఎందు లేడయ? తలపోయ ఈశ్వరుండు,
    ఇతరులెవ్వరు? తనవారలెవరు? తెలియ,
    మంచి సేయంగ వలయును, ఎంచుకొనక,
    పరులకున్ మేలుఁ జేసినఁ బాపమబ్బు..

    ("పరులు" అని అనుకొనుటే పాపమనే అర్థంలో..)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వలయును + ఎంచుకొనక = వలయు నెంచుకొనక' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు. "...సేయంగవలె సదా యెంచుకొనక' అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. ధన్యవాదములార్యా,
      మంచి సేయంగ వలయుఁదా నెంచుకొనక
      అన్నా బాగుంటుంది కదా..

      తొలగించండి
  8. తరువులు పండ్ల భారమున ధాత్రికి వంగియు పెంపునొందవా?
    ఝరులవి నేల బొర్లుచును సాకును జీవుల నీటి నిచ్చి,యం
    బరమున వ్రేలు మేఘుడును వానల నిచ్చును, కాని రాజ! దా
    పరులకు మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నరుడు సర్వ జీవులకు నున్నతుడు గాన
      పరుల కుపకారమును సేయఁ బాడి కాని
      ఒరులు నుగ్రవాద మెపుడు పెరుగ దలచు
      పరులకున్ మేలుఁ జేసినఁ బాపమబ్బు

      తొలగించండి
    2. రాకుమార గారూ,
      'పరోపకారాయ ఫలంతి వృక్షాః...' అన్న శ్లోక భావాన్ని చక్కగా పూరణలో ఇమిడ్చి మనోహరంగా చెప్పారు. రెండవ పూరణ కూడ బాగున్నది. అభినందనలు.
      'ఒరులు, పరులకున్' అనడం పునర్తుక్తి కదా? "వరల నుగ్రవాద..." అందామా?

      తొలగించండి
  9. 🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼
    ఆర్యులకు శుభోదయమ్💐🙏🏼

    శంకరాభరణం లో
    నేటి సమస్య

    పరులకు మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా !!

    నా పూరణ.

    నిరుపమ దుష్ట వైఖరి, పునీతులనెన్ని హసించు బుద్ధి, పా
    మరులను హింసపెట్టుట, సమస్తము దుర్గుణ పూర్ణచిత్తులై
    ధరను వసించు దుర్భర మదంబున మెల్గెడి ధూర్తులైన తెం
    పరులకు మేలుఁ జేయకుము. పాప మహాబ్ధిని మున్గఁబోకుమా.

    జైశ్రీమన్నారాయణ.
    చింతా రామకృష్ణారావు.🙏🏼

    రిప్లయితొలగించండి
  10. శ్రీ మహభ్యో గురుభ్యోన్నమః🙏🙏🙏

    పరులు దామంచు భావింపఁ బరగ కెపుడు
    సర్వ జనమందు గాంచుము సత్య మంత
    "బరులకున్ మేలు జేసిన బాప మబ్బు"
    ననిన నీలోని భగవానుc నవ్వి బోడె?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భగవాను' అని డుప్రత్యయం లేకుండా వ్రాసారు. "నీలోని దేవుడు/బ్రహ్మము" అనవచ్చు కదా?

      తొలగించండి
  11. (చెల్లెలు దుస్సల భర్తకదా అని దుర్మతి సైంధవుని వదలితే
    వరబలంతో పద్మవ్యూహంలో పాండవుల నడ్డగించాడు )
    అరయగ ద్రౌపదీసతిని
    నల్లరి బెట్టగ బూనినాడుగా
    సరగున చెంత జేరుచును
    సైంధవధూర్తు డరణ్యసీమలో ;
    మరలియు నాపె పాండవుల
    మత్సరి పద్మపువ్యూహమందునన్ ;
    బరులకు మేలు జేయకుము ;
    పాపమహాబ్ధిని మున్గబోకుమా !


    రిప్లయితొలగించండి
  12. వర్షమునకు తగు సుపరిపాల నకయి
    వ్రాయు చట్టములందలి భావములను
    చిత్రముగ తారుమారు జేసెడి కుయుక్తి
    పరులకున్ మేలుఁ జేసినఁ బాపమబ్బు

    రిప్లయితొలగించండి
  13. మాన వ త్వా న్ని మెచ్చు ను మాధవుండు
    పరుల కున్ మేలు జేసిన ;;బాప మబ్బు
    పరుల హింసించి స్వార్థ తన్ ప ర గు నట్టి
    వా రి కేనాడు సాయంబు వలదు సేయ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. శంకరాభరణం
    25/04/2019 గురువారం
    సమస్య

    పరులకు మేలు జేయకుము పాప మహాబ్ధిని మున్గ బోకుమా

    నా పూరణ. చం.మా.
    ** *** *** ****

    ఒరులకు కీడొనర్చుచును యోగ్యము నించుక లేని వారికిన్

    తరుణుల బాధ పెట్టుచును దారుణ కృత్య మొనర్చు వారికిన్

    నిరతము దోచుచున్ జనుల నేరము లెన్నియొ జేయునట్టి దో

    పరులకు మేలు జేయకుము పాప మహాబ్ధిని మున్గ బోకుమా

    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యోగ్యత యించుక లేని...' అనండి.

      తొలగించండి
  15. నా ప్రయత్నం :

    కౌరవ సభలో దుర్యోధనుడు....

    తేటగీతి
    పాండుసుతులెంచిరి మనపై భండనమ్ము
    పక్షపాతమ్ము పెద్దలు వదలవలయు
    మన బలాబలాలఁ దెలుపు మర్మమొసఁగి
    పరులకు మేలుఁ జేసినఁ బాపమబ్బు


    దేశభక్తి భారతీయుల్లో పెంపొందించుటకు మహాత్మాగాంధి ప్రసంగిస్తూ...

    చంపకమాల
    ధరణిని వేదభూమియని ధన్యత నందిన భారతావనిన్
    బరిపరి రీతులన్ తమరి స్వార్థము మీరగ తెల్లవారలున్
    బరిగొని దోచుచున్ మనల బానిసలన్ విధమెంచ నట్టి ఖ
    ర్పరులకు మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా!

    రిప్లయితొలగించండి
  16. కష్ట ఫలము భద్రమ్ముగఁ గట్టఁ గట్టి
    దాచు బ్యాంకుల పైబడి దారుణముగ
    కుట్ర సలిపెడు చోరులకు నవినీతి
    పరులకున్ మేలుఁ జేసినఁ బాపమబ్బు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు నిన్నటి పూరణలో ఒక పాదంలో యతి తప్పింది సరిగానే ఉంది కదా అని నానిపించింది. డా. సీతాదేవి గారు సందేహ నివృత్తి చేశారు

      తొలగించండి
  17. సతతము పలుకుచు పలు యసత్యములను
    దోచుకొనుచు ప్రజల సొమ్ము నీచ మదిని
    నవని జీవితము గడుపు నతి దురాశ
    పరులకున్ మేలుఁ జేసినఁ బాపమబ్బు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అసనారె గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దురాశాపరులు' అనడం సాధువు.

      తొలగించండి
  18. . *శ్రీ గురుభ్యో నమః*
    శంకరాభరణం సమస్యాపూరణ
    సమస్య :: పరులకు మేలు జేయకుము పాపమహాబ్ధిని మున్గబోకుమా.
    పూరణ
    పరులకు మేలుజేయుటకు పాత్రత నెంచుము, పుణ్య మందుమా;
    పర ధన ధాన్య రూప గుణ భాగ్యములన్ గని కుళ్లువారికిన్,
    గురు జన సూక్తులన్ వినని కూళలకున్, ఘనదుష్ట చింతనా
    పరులకు మేలు జేయకుము పాపమహాబ్ధిని మున్గిపోకుమా.
    రోజుకోపద్యం-శంకరాభరణం గ్రంథంలో పేజి-220 (కోట రాజశేఖర్ నెల్లూరు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      ధన్యవాదాలు! ఐతే ఇది గతంలో ఇచ్చిన సమస్యే అన్నమాట! గుర్తులేక మళ్ళీ ఇచ్చాను.
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. ఈ సమస్య గతంలో మీరు ఇవ్వలేదు గురువర్యా!
      సుమారుగా చాలా (20) సంవత్సరాలక్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ఇచ్చినారండీ.

      తొలగించండి
  19. పరిణతి లేక సంకుచిత భావ పరంపర లోన మ్రగ్గుచున్,
    సరియగు మార్గమున్ గనక,సారెకు దుందుడుకొప్ప ప్రేలుచున్,
    నిరతము నీచ యోచనల నిత్యము జేసెడు మోసకారి, తెం
    పరులకు మేలు చేయకుము పాప మహాబ్ధిని మున్ గ బోకుమా!

    రిప్లయితొలగించండి
  20. నీతి పథమును వీడియు నిష్ఠ లేక
    స్వార్థ చింతన తోడనె సాగుచుండి
    యుర్వి జనులకు గీడు జేయు యవి నీతి
    పరులకున్ మేలుఁ జేసినఁ బాపమబ్బు

    రిప్లయితొలగించండి
  21. తరతమ భేద భావముల ధారుణి కాష్ఠము జేయు కాటి కా
    పరులకు మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా
    పర హిత సాధు వర్తనము పాటి దలంచెడి సజ్జనాళికై
    బలముగ తోడు నిల్చుటయె బాధ్యత గావలె మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  22. పుణ్యలోకంబు లబ్బును భూతదయను
    పరులకున్ మేలుజేసిన,పాపమబ్బు
    సాధు జనులను హింసింప జాలిలేక
    కల్మషంబైన చిత్తంపు కారణమున

    రిప్లయితొలగించండి
  23. పరులకున్ మేలుఁ జేసినఁ బాపమబ్బు
    శంకరా గజా సురునకు శంక లేక
    నేల వరములు నిడినావు పాలు పోయ
    పన్నగము కరవక నిన్ను వదలబోదు
    దుష్టులకు వరములను విదుర్చ రాదు
    ననుచు పలికె హరి కపర్ది ననున యించి

    రిప్లయితొలగించండి
  24. ఎన్నికల ప్రచార పర్వము...

    చంపకమాల
    మరిమరి నాదు రాష్ట్రమని మాన్యతనంద తపించితెంతయో
    తిరిగితి నెన్నిమార్లొ నవ ధిల్లికి శ్రేయముగూర్చు కోరికన్
    మరచిరి మాటనిచ్చినది మారిరి వైరుల కొమ్ముకాయ న
    ప్పరులకు మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా!

    రిప్లయితొలగించండి
  25. చంపకమాల
    ఒరులను భేదభావమును చూపక నిండుమనంబుతో సదా
    కరుణను చిల్కు పల్కుల సుఖాస్పదమవ్వగ సేదతీర్చు స
    ద్గురులకు మేలుజేయ తగు, దుర్మతి తో జన తాప కారులౌ
    "పరులకు మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా"
    పెద్దలకు నమస్సులు.
    తొలి చంపకం గుణదోషములని దెల్పి కృతార్ధుని చేయ ప్రార్థన.��

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణతేజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  26. కేసియారు శాసనమునకెదురు లేదు
    ధర్మగంటను మ్రోగించె ధర్మ పరులు
    తెలియు లంచమిచ్చుచు మీరదె యవినీతి
    పరులకున్ మేలుఁ జేసినఁ బాపమబ్బు

    రిప్లయితొలగించండి
  27. పుణ్యమబ్బునుసందియంబువలదురమ!
    పరులకున్మేలుజేసిన,బాపమబ్బు
    కీడుజేయనెట్టివారికినిపుడమిని
    బాపపుణ్యములబ్బునుబనినిబట్టి

    రిప్లయితొలగించండి
  28. రిప్లయిలు
    1. పరులకు, వావియున్ విడిచి వాంఛితనైచ్యపు బుద్ధి గల్గు చూ
      పరులకు, సంతతద్విషితభావనులై చరియించు గాలిమే
      పరులకు, వారువీరనెడు విభాగము లెంచక మోసగించు దో
      పరులకు, మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా


      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. రామాచార్య గారూ,
      'పరులకు' అంటూ నాల్గు పాదాలను ప్రారంభిస్తూ అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  29. మదికి మంచియే జరుగును మాను గాను
    పరులకున్ మేలు చేసిన, పాప మబ్బు
    స్వార్థ చింతన ములతోడ సజ్జనులకు
    బాధ లనిడెడి వారికి వసుధయందు

    రిప్లయితొలగించండి
  30. తాపస జన ఘాతకులు నితాంత వర బ
    లాన్వితులు జగత్కంటకు లసుర వరులు
    నిత్య ఘోర కార్య రతులు నిర్జర గణ
    పరులకున్ మేలుఁ జేసినఁ బాపమబ్బు


    గురుజన నిత్య బాధకులు ఘోర మనస్కులు విత్త ముండగన్
    విరివిగ దర్ప ముంచెదురు వీగి ప్రపంచమునన్ మహా భయం
    కరు లగు నిర్దయా దురిత కార్య విచారణ సక్త చిత్త త
    త్పరులకు మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  31. అరయుమయొక్కసంగతినియాచితులైననుమోసగాండ్రు,దెం
    పరులకుమేలుజేయకుముపాపమహాబ్ధినిమున్గబోకుమా
    యిరవుగబుణ్యకార్యములనెవ్వరికైననుజేయుచోధరన్
    దిరమగుమోక్షమార్గమునుదేహయుతంబుగబొందురేగదా

    రిప్లయితొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    Circumstantial Evidence

    పరువులు పెట్టి పోవగను పన్నుగ బైకున పంజగుట్టలో..
    పరుగున పారిపోయెనొక భామను కొట్టుచు బుల్లెటోడు భల్...
    కరుణను పట్టిలేపగను కన్నియ నచ్చట కూలబడ్డదౌ...
    పరుగులు పెట్టి చేరిరట పట్టుకు నన్నటు తన్నబూనగా :(
    పరులకు మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా

    రిప్లయితొలగించండి
  33. దరణిని మంచి పాలనము తప్పక తెచ్చెద మంచు పల్కుచున్
    నిరతము సొమ్ములన్ గొనుచు నీతిని వీడి ప్రభుత్వ సేవలో
    వర పదమందునన్ నిలిచి పాలన మందు సదా నటించు కా
    పరులకు మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా

    రిప్లయితొలగించండి
  34. తరుల ,గిరులను,బీదను మరువబోక
    పరులకున్ మేలుజేయుట పాపమబ్బు
    యనెడి మాటలు దుష్టులమనుగడందు
    నిత్యకృత్యాల నియమా లసత్యవిధులు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అబ్బున్ + అనెడి = అబ్బు ననెడి" అనండి.

      తొలగించండి
  35. తేటగీతి
    సుజనులకు మేలొనర్చిన నిజముసుమ్ము
    పూరుషాళికి పుడమిలో పుణ్యమబ్బు
    ద్రోహులకు మూర్ఖ నరులకు ధూర్త స్వార్థ

    పరులకున్ మేలు జేసిన బాఫమబ్బు

    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివరాజ లింగ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధూర్త స్వార్థ' అన్నపుడు 'ర్త' గురువై గణభంగం. సవరించండి.

      తొలగించండి
  36. ఒరుల మెప్పును బొందగ గోర వలదు
    ఇరుకున బడి నీవు నలగ నీమది జెడు
    పరుగు దీయకు పరపతి యంచు, నేడు
    పరులకున్ మేలుఁ జేసినఁ బాపమబ్బు"

    రిప్లయితొలగించండి
  37. మిత్రులందఱకు నమస్సులు!

    [దానవులకు మేలు చేసి, పాపకూపంలో పడవద్దని నారదుఁడు విభీషణునికి తెలుపునట్టి సందర్భము]

    "కరుణనుఁ జూపఁబోక, ఘనకష్టములందఁగఁజేసి, నిత్య ము
    త్తరులకుఁ గీడొనర్చుచుఁ, బ్రతారణ సేయుచు, నెప్డు వేల్పుఁ దం
    పరఁ గడతేర్పఁబూనుచు, రమాపతి దూఱుచునుండు చియ్యమే
    పరులకు మేలు సేయకుము, పాప మహాబ్ధిని మున్గఁబోకుమా!"

    రిప్లయితొలగించండి
  38. అమిత పుణ్యము చేకూరు నవనిలోన
    పరులకున్ మేలుజేసిన, పాపమబ్బు
    తనకు సాయము జేసిన మనుజులకును
    కీడు చేయగ జూచిన కించు గాదె!!!


    రిప్లయితొలగించండి
  39. కరకగు చిత్తవృత్తిని సుకర్ముల చింతలవెట్టుచున్ సదా
    సరకును జేయనెంచకను శాస్త్రపువాక్కుల నీతిబాహ్యులై
    విరివిగ పాపకర్మలను వెక్కసమౌవిధి నిర్వహించు తెం
    పరులకు మేలుజేయకుము పాపమహాబ్ధిని మున్గబోకుమా

    రిప్లయితొలగించండి
  40. పుణ్యము కలుగు నుందురు పుడమి యందు
    పరులకున్ మేలు చేసిన ,పాపమబ్బు
    ద్రోహము ను చేయనెంచిన దుర్జనులకు
    సాయమును చేయనెంచిన జవము గాను.

    రిప్లయితొలగించండి
  41. పరువములోనె మేలుకొని పావన బ్రహ్మము జేరు నిర్దయా
    పరులకు మేలు జేయకుము పాపమహాబ్దిన మున్గబోకుమా
    పురుషుడు మంచి చేయుచును పుణ్యము జేయ మహానుభావులౌ
    దురు మనసంటె మంచిగద దుష్టుల జోలికి వెళ్ళవద్దయా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామ మోహన్ గారూ,
      ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు ఈ బ్లాగులో పద్యం వ్రాసారు? చాలా సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మహాబ్ధిని... జోలికి నేగవద్దయా' అనండి.

      తొలగించండి
  42. ఇంట నున్న వారి వెతలు దీర్చకుండ
    పరులకున్ మేలుఁ జేసినఁ బాపమబ్బు
    తనకు మాలిన ధర్మము తప్పదనుచు
    మమతను మరిచేను కపట మానవుండు

    రిప్లయితొలగించండి