26, ఏప్రిల్ 2019, శుక్రవారం

సమస్య - 2998 (రవికయె చాలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రవికయే చాలుఁ గద చీర రమణి కేల"
(లేదా...)
"రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్"

101 కామెంట్‌లు:

  1. (కురుసభలో ద్రౌపదిని గురించి దుశ్శాసనునితో దుర్యోధనుడు)
    రమ్ము!తమ్ముడ!దుశ్శాసనమ్ము నాది;
    లాగివేయుము చీరను ;లజ్జ యేల ?
    పంచపురుషుల గట్టిన పడతి యీమె ;
    రవికయే చాలుగద !చీర రమణి కేల ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జంధ్యాల వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శంకరార్యులకు , హనుమఛ్చాస్త్రిగారికి
      ధన్యవాదాలు .
      సంతోషం కామేశ్వరరావుగారూ !

      తొలగించండి
  2. వలువలెన్ని కావలెనయ్య వనిత చనులు

    గప్ప,ఆంధ్ర వనిత కేది గట్ట అంద

    మిడును,వేదపఠనములు మెచ్చబోక

    నేమి పలుకు దురు బుధులు నీర్ష్య బడసి

    రవికయె చాలు గద,చీర,రమణికేల

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    దుర్యోధనుడు....

    అవనిని వింతయౌ మయసభాంతరసీమను నన్ను జూచి దు...
    ర్వ్యవసితబుద్ధి నవ్వి యపహాస్యము జేసిన పాండవాంగనన్
    ప్రవిదితపంచభర్తృక వివస్త్రను జేయుడి చీర విప్పుడీ !
    రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  4. ప్రాతః కాలపు సరదా పూరణ:

    భువనమునందు తీవ్రమగు భూరిగ వేడిమిగల్గు కేరళన్
    భవనమునందు దాగుకొని భద్రపు రీతిని మెల్గుచుండగా
    చవుకగ కొన్న వోణినిడి చక్కగ పట్టుచు నందమైనదౌ
    రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్

    రిప్లయితొలగించండి
  5. నడుము లోతున్న వాగును గడవవలెను,
    చీర తడిసిన కష్టమే, చెంత లేరు
    కనుట కన్యులు, దాటుట కనుగమింప
    రవికయే చాలుఁ గద చీర రమణి కేల?

    రిప్లయితొలగించండి
  6. పవలు ప్రయాణమై పతి నివాసముఁ జేరగ సాగె ముద్దరా
    లు వలువ లార్ద్రమౌ నడుము లోతుగఁ బారెడి వాగు దాట, న
    య్యవసరమందు చూచుటకు నన్యులు లేరని యెంచి దాటుచో
    రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్?

    రిప్లయితొలగించండి
  7. ఖలుడు దుశ్శాసనుడు ఘన కటువు మీర
    అన్న యాజ్ఞను బాటింప నాశ తోడ
    రవికయే చాలుగద చీర రమణి కేల
    నంటు కృష్ణనీడ్వ సభకు నాథులు గన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదాన్ని "ననుచు కృష్ణ నీడ్చె..." అనండి.

      తొలగించండి


  8. తవికల నల్లు కౌముదికి తావిని జేర్చగ కైపదంబు చా
    లు! వెస జిలేబులై పదములున్ భళి దొర్లును; వేగ వేగమై
    కువకువ లాడు పెన్మిటిని కొమ్మమెకమ్ముగ మార్చివేయగా
    రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. ఇంట వేడుక కేతెంచి రెల్లరకును
    పెట్టెఁ జీరలు గృహిణి యవ్వేళ నింటి
    పనులఁ జేసెడి దాసినిఁ గని యనుకొనె
    'రవికయే చాలుఁ గద, చీర రమణి కేల?"

    రిప్లయితొలగించండి
  10. చంపకమాల
    చవితికి నాగులన్ గొలువ చక్కఁగ స్నేహితురాలు వచ్చెడిన్
    వివిధములైన వంటలను వేడుక జేసెదనన్న నొప్పెదన్
    జివరగ నిచ్చు వస్త్రముల చేర్చుము చేతి రుమాలు దానితో
    రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్

    రిప్లయితొలగించండి
  11. భరత భూమిని వనితకు పరమ పధము
    నిండు వస్త్రము చోలము మెండు ధనము
    రక్ష జేయును చోరుల కాంక్ష నుండి
    రవికయే చాలుఁ గదచీర రమణి కేల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం బాగుంది. కాని సమస్య పరిష్కారమైనట్లు తోచడం లేదు.

      తొలగించండి
  12. వెలనుచెల్లించలభియించె వెలది యింక
    చెప్పినట్లుగ చేసిన చేవ గల్గు
    అట్టి వెలయాలు తనువున అందమిడెడు
    రవికయే చాలుగద చీరె రమణికేల?
    ****************************
    రావెల పురుషోత్తమ రావు

    రిప్లయితొలగించండి
  13. చీర లెన్నియొ పెట్టెలో కూరి కూరి
    యున్న దానవు-మేలగు నొక్క రవిక
    సంతరింపుము సర్వులు సతసింప!
    *రవికయే చాలు గద చీర రమణి కేల*

    రిప్లయితొలగించండి
  14. భరత భూమిని వనితకు పరమ పధము
    నిండు వస్త్రము చోలము మెండు ధనము
    రవిక యేచాలుఁ గదచీర రమణి కేల
    రక్ష జేయును చోరుల కాంక్ష నుండి

    రిప్లయితొలగించండి
  15. వస్త్రాపహరణం చేయమనుచు దుశ్శాసనునితో సుయోధనుని మాటలుగా.....


    తనను తానోడి తమ్ములన్ దరుణి నోడ
    బానిసలయిరి మనకింక బాండవుండ్రు
    బానిసలకింత విలువైన వలువలేల?
    రవికయే చాలు గద చీర రమణికేల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మనకింక బాండుసుతులు...' అనండి.

      తొలగించండి
  16. కట్టు బొట్టు ను మారిన కాల మందు
    క్రొత్త దుస్తులు కోర్కె తో కొనె డు వేళ
    రవిక యే చాలు గద చీర రమణి కేల
    జీన్సు లున్నవి యని ర ప్డు చిత్ర ముగను

    రిప్లయితొలగించండి
  17. పండుగకు వచ్చినామెను భర్తకడకు
    కుదురుగా పంప బసుపుకుంకుమల తోడ
    రవికయే చాలుఁ గద ! చీర రమణి కేల
    యవసరంబయ్యె ? నామెనే యడుగరాద !

    రిప్లయితొలగించండి
  18. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,



    జరిగె పెండ్లి , ముగిసెను భోజనము , లింక

    పంచవలయు వస్త్రంబుల వనితలకును |

    కాని లెగ్గినుఫ్యాంటుతో కదలి వచ్చు

    చుండె మన సమీపమునకు నుడిగి సిగ్గు ,

    రవికయే చాలు గద , చీర రమణి కేల ?

    రిప్లయితొలగించండి
  19. నలచరిత్ర నాకు జ్యోతక మాయె!

    పంచ భూతాల సాక్షిగc బరిణc మాడి
    నలుడు దమయంతి దోడుత నడవి కేగె
    రవికయే జాలు గద చీర రమణి కేల
    ననుచు సతిచీర ధరియించి నడవి దిరిగె
    కలిని యెదిరించ శక్యంబె ఘనుని కైన?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పరిణయ మాడి'లో య విసర్జించారు. "సాక్షి నుద్వాహమాడి" ఆనండి.

      తొలగించండి
  20. సంప్రదాయ పంజాబి వస్త్రాల పేర
    క్రింది పైజామ హుందాగ సందడించ,
    యండగా మీది పొడవాటి యంగి యనెడి
    రవికయే చాలు గద! చీర రమణి కేల!

    రిప్లయితొలగించండి
  21. కనగను నవీన యుగమందు కాంతలందు
    ననుదినమ్మును సరికొత్త ననుకరించు
    పద్ధతులు హెచ్చె- తొడిగెడు ప్యాంటు రాగ
    రవికయే చాలుఁ గద, చీర రమణి కేల

    రిప్లయితొలగించండి
  22. తేటగీతి
    రవికయే చాలు గద చీర రమణికేల
    నంటు దుష్ట దుర్యోధనుం డహముచేత
    తమ్మి!దుశ్శాసనా వేగరమ్ము కృష్ణ
    మాన భంగము నొనరింప నానతివ్వ
    లజ్జ వీడి కురుసభకు లాగె నౌర!
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివరాజలింగం గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రమణి కేల ననుచు' అనండి.

      తొలగించండి
  23. చీర రవికెలు పాతవి చిక్కుబెట్టు
    చన్నుదాచగ కొత్తవి చక్కనైన
    తళుకులద్దిన సొగసైన దళసరైన
    రవికయే చాలుగద చీర రమణికేల?

    రిప్లయితొలగించండి
  24. అతిథిగా రాగ నాయింటి యాడ పడుచు
    బట్టలిడు వేళ పలికెను బావ మరది
    "యేల మరల మరల మొన్న యిడిరి గాదె!
    రవికయే చాలుఁ గద చీర రమణి కేల ? "
    ****)()(****
    మునుపిది ఒక అవధానంలో సీవీ సుబ్బన్న గారు పూరించిన సమస్యే .అంతకు మునుపే పండుగకు బట్టలు పెట్టి ఉన్నందున బావ మరది మొగమాట పడిపోయి బావతో అలా అన్నాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మదగజయానకున్ రవిక మాత్రము చాలదె చీర యేటికిన్?" అన్నది ఆ ప్రసిద్ధ సమస్య. ఎన్నో అవధానాలలో అడిగిందే. శంకరాభరణం బ్లాగులో ఎప్పుడో ఇచ్చిందే. దానినే కొద్ది మార్పులతో ఇచ్చాను.

      తొలగించండి
  25. చేత డబ్బులు లేక నెచ్చెలికి నొక్క
    బహుమతి కొనక తెలివిగఁ బలికె నిట్లు
    "జవ్వనికి యందమిచ్చు డిజైనులు గల
    రవికయే చాలుఁ గద చీర రమణి కేల ? "

    ఇష్టసఖికి చీర బహుమతిగా ఇవ్వాలని కోరిక ఉన్నా, చేతిలో సమయానికి డబ్బులు లేకపోవడంతో అందమైన డిజైన్లు ఉన్న రవికె ఒకటి బహూకరించి నీలాంటి అందగత్తెకు అందమైన కొత్త రవికె ఒకటైనా మరింత అందాన్నిస్తుంది. కొత్త చీరే కావాలా? అని పొగడ్తతో గట్టెక్కాడు ఆ తెలివైన భర్త.

    రిప్లయితొలగించండి
  26. రవికయేచాలుగదచీరరమణికేల
    బాగుచెప్పిరిసెహబాసుభవ్యచరిత!
    రవికయుననవసరముగరమణికిపుడు
    నైటుడ్రెస్సులెయున్నవినాతికిగద

    రిప్లయితొలగించండి
  27. చీర గట్టదు "లే" భామ జీన్సు ప్యాంటు
    వేయు, తాంబూల మందున వేయిమీద
    నూట పదహార్లు తోడుగా వేడ్కమీర
    రవికయే చాలుఁ గద చీర "రమణి" కేల?

    రిప్లయితొలగించండి
  28. వరమహాలక్ష్మి కొలువై వ్రతము జేయ
    పండు ముత్తైదు కిచ్చితి మెండుగాను
    పసుపు కుంకుమల్ జూచనె పిసిని మొగుడు
    "రవికయే చాలుఁ గద చీర రమణి కేల?"

    రిప్లయితొలగించండి
  29. లాంఛ నమ్ముగ ముదితాలలామ లింటి
    కొచ్చిన పసుపు గుంకాల గొలచి చీర
    లిడుట శుభమగు! ధనమంత లేక యున్న
    రవికయే జాలు గద చీర రమణి కేల?

    రిప్లయితొలగించండి
  30. తే.గీ :
    తావి జిమ్మెడు వనమున దాను హరిని,
    జీవిని, దెలియ తాపసి జేయ తపము
    దేవి నామమే బలికెలే దేహ వాంఛ
    మోవి గురుతులు దలఁపున మోహనమ్ము
    రవికయే చాలుఁ గద చీర రమణి కేల?
    కావి గట్టిన జాలదు గాంచ హరిని

    రిప్లయితొలగించండి


  31. దుష్టుడౌ రవి! గీరును దుందుడుకుగ
    నాడవాండ్ల పై వ్రేళ్ళు సన్నగ జొనుపగ
    చూచెనౌర జిలేబియె చుర్రుమనెను
    "రవి" కయే చాలుఁ గద, చీర రమణి, కేల
    నాతతాయి బాలుడి చెంప నాల్గు మార్లు !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  32. రిప్లయిలు
    1. చక్కని యతివ కందము సరిగ చీర
      రవికయే, చాలుఁ గద చీర రమణి కేల
      కురచ వస్త్రములన్నను కొత్త మోజు
      పరుల సంస్కృతి మనకేల వనితలార
      వరము మీకిచ్చె నొప్పుగ భరత మాత

      తొలగించండి
  33. మిత్రులందఱకు నమస్సులు!

    [గత కాలపు యువతికి చీరా, ఱవికా బాగా నప్పేవి! నేఁటి నవనాగరిక యువతికి చీర ఎందుకు? జీన్సూ, జాకెట్టూ చాలవా? ]


    పవలును రేయియున్ మిగులఁ బావనమౌ తను కాంతిఁ దేలి, తా
    నవిరళ తోషముం గొనెడి యంగనకున్ మును చీర ఱైక చాల్!
    నవయుగ కన్య కిప్పు డిట నప్పదు చీరయె! జీన్సుపాంటునున్
    ఱవికయె చాలు! నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చీరఁ గట్టెడి వయ సింకఁ జేరకునికి,
      తనయ రమణికిఁ గట్టుౘుఁ దల్లి యప్పు
      డొక్క లంగాయు ఱవికయు, మక్కువ ననె
      "ఱవికయే ౘాలుఁ గద! చీర రమణి కేల?"

      తొలగించండి


  34. ప్యాంటు చొక్కాలు కుట్టించ పర్సు ఖాళి,
    గుడ్డ రేటుకు రెట్టింపు కుట్టు కూలి,
    సూటు కుట్టించ వేతువా పూట ఐన,
    విందు నాడు మాత్రము నీవు వేతువయ్య,
    పట్టు ధోవతి కొన్నచో కట్ట లేవు
    నీవు నిత్యము, పంచెలు నీకు చాలు
    పనికి వెళ్ళునపుడు, కంచి పట్టు చీర,
    కొన్న కట్టునా ఘనముగా కోడలెపుడు,
    బీరువా లోకి దానిని చేర వేయు,
    రైక లైనింగు చేబోవ పైక మధిక
    మడుగు ,జిగ్జాగు కోరిన పడును డబలు
    రేటు, పూల డిజైనులు వేటు వేయు,
    నెక్కు లెస్సు చేయమనిన మెక్కు డబ్బు,
    లేసు లల్లమనిన ఫీజు లెక్క వేరు
    యిన్ని ఖర్చులు పెట్ట యీ కన్నె కసలు
    రవికయే చాలుఁ గద, చీర రమణి కేల,
    లుంగి కట్టి చేసెడి పనులు గద జామి
    కెపుడు యనుచు కొడుకు తోడ బలికె
    కేరళ జనకు డొక్కడు కినుక గలిగి






    రిప్లయితొలగించండి
  35. భర్త వెంబడి షాపుల పైబడి కొను
    చున్న తెలివైనఁ జక్కనిఁ జుక్క యొకటి
    వెల గలిగినట్టి రవికను వెదికి బలికె
    "రవికయే చాలుఁ గద చీర రమణి కేల?"

    రిప్లయితొలగించండి
  36. రవికయెచాలునొక్కటికురంగవిలోచనకేలచీరయున్
    పవనుడ!లెస్సజెప్పితివివారలుచీరనుద్రోసిపుచ్చిరే
    రవికయుజీరనున్వలదు,రామకునైటినివేయనిష్టమే
    భువనమునందుజూడగనునైటిలుతోడనునాతులుండీరే

    రిప్లయితొలగించండి
  37. రిప్లయిలు
    1. అద్భుతము కామేశ్వర రావు గారు

      తొలగించండి
    2. పిలిచి నంతట మిక్కిలి వినయ మెసఁగ
      నేఁగి లోపలకు వెదకి బాగుగాను
      రయమున నతివ నీతెచ్చిన యది పట్టు
      రవికయే చాలుఁ గద చీర రమణి కేల

      [చీర (న్) = పిలుచుట]


      నవయుగ భవ్య ధర్మ మట నారి కొసంగుట నూత్నవస్త్రముల్
      కవియ గృహమ్ము వొంద ననురాగము చారు చతుష్పదాన్వ యో
      ద్భవము సెలంగి మిక్కుటము భామకుఁ బ్రక్కన నిల్చెనొక్క పే
      రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్
      [పేరు +అవిక ; అవిక = గొఱ్ఱె (ఆడ); ఈ గొఱ్ఱె కురంగ లోచనయే]

      తొలగించండి
  38. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    స్మృతి ఇరాని ప్రియంక వద్రతో:

    పవలును రేయి కూసితివి భండన జేతును కాశినంచుచున్
    చివరకు తోక ముడ్చుచును చీకటి గొందిని పారిపోతివే!
    కువలయ నేత్ర! నీకునిడ కొట్టున నుండెడి భామ పల్కెనే:
    "రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్"

    రిప్లయితొలగించండి
  39. ప్రవిమలమౌ శరీరమును వాడి కరమ్ముల వాడు కాల్చగా
    ధవళపు దేహమందునను ధారగ కారుచునుండె స్వేదముల్
    భవనములోన నున్నపుడుఁ బాయగ తాపము పావడాకు వె
    న్రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్

    రిప్లయితొలగించండి
  40. నవయుగ నారికిన్ గన ననాగరికంబుగ దోచు జీరలే!
    గవునులు,జీన్స్ టాపులవి కాయము నంటుచునుండి గాలికిన్
    గవియక సౌఖ్యవంతమగు గావున ప్యాంటుకుతోడు క్రొత్తదౌ
    రవికయె చాలునొక్కటి కురంగవిలోచన కేలచీరయున్ ?

    రిప్లయితొలగించండి
  41. *పెండ్లికి వచ్చిన బంధువులకు రిటర్న్ గిఫ్ట్ లివ్వడం మన సంప్రదాయం కదా.... దానినికూడా బంధుత్వ ప్రాధాన్యతను పాటించే ఇస్తారని తెలుసుకదా ఆ సందర్భాన్ని గుర్తుచేస్తూ పద్యం* ...........

    అవిరళ ప్రేమతోడగద యంతటి దూరము నుండి యే గదా
    కవితయె వచ్చె పెండ్లికని కట్నము పెట్టుట ధర్మమే యనన్
    సవరణ లేమిలేవికను జవ్వని దూరపు బంధువే గదా
    రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్.

    రిప్లయితొలగించండి
  42. తేటగీతి
    విపణి వస్త్ర విక్రయమున వేదికెక్కు
    నందగత్తెలు ధరియించ సుందరమగు
    రవికయే చాలుఁ గద! చీర రమణి కేల
    నూగు భుజము జారి హొయల సాగుచుండ

    రిప్లయితొలగించండి
  43. ఎవరిది నన్ను లుబ్ధుడని హేయముగాదలపోయువాడు మా
    నవతికి కన్నవారిడిన నచ్చిన చీరకు నప్పు రైక కై
    న వసన మిప్పు డంగడిని నాడెము చేసితి గొంటి గాన నీ
    రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్?

    రిప్లయితొలగించండి
  44. సవరణతో

    దివి కెగఁ బ్రాకె మూల్యములు దిగ్గున, చీర కొనంగ సొత్తు త
    క్కువయగు నీక్షణమ్ము, మది కోరిన కోక మరొక్క మాసమం
    దువిద! నిజమ్ము కొందమిక, యోర్మి వహింపుము!, యల్క వీడు మీ
    రవికయె చాలు నొక్కటి, కురంగవిలోచన కేల చీరయున్?.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  45. చీర కొంటివి రమణికా చెప్పు రాధ?
    చాలు చోద్యము నదియింక బాలగాదె
    వలయు ఫ్రాకులు లేదంటె పావడాయు
    రవికయే చాలుగద చీర రమణి కేల?!!!

    రిప్లయితొలగించండి
  46. క్రొత్తచీరనుయంగడిగొన్నవనిత
    చీరరంగుకుసరియగు చేలిగొనియె
    చేలితోబాటువేరొక చీరనడిగె
    రవికయేచాలుగదచీర రమణికేల
    యనుచుతలబాదుకొనెమగడు యార్తితోడ.

    రిప్లయితొలగించండి
  47. కొమ్మ వయసుకు సరిపడు కోక వలదు
    ఱవికయే చాలు గద! చీర రమణి కేల?
    చిన్న దానికి కట్టిన చిత్ర మనరె
    ఏమి తెలియవి మనిషివి వెఱ్ఱి మగడ

    రిప్లయితొలగించండి
  48. డా.పిట్టా సత్యనారాయణ (అమెరికా నుండి)
    కళకు నూహ యొక్కటి చాలు కదుమ నుండు
    సొగసునే గను వక్షమున్ సోక దృష్టి
    "లెగ్గిను"ల (legs-in)చాటు చేయ బలే "కమీజు"(full shirt)_
    రవికయే చాలు గద చీర రమణి కేల?

    రిప్లయితొలగించండి
  49. డా.పిట్టా సత్యనారాయణ(USA)
    ఛవి గన నంగ గుంభనము చాటుగ నుంచగ వస్త్రముండు నీ
    భువిజన మాన రక్షణకు భూరి విచారణ జేయ నేడు వే
    కవిజన పోలికల్ జదివి కాంచిరి కానని లీలలెల్ల నా
    రవికయె చాలు నొక్కటి కురంగవిలోచని కేల చీరయున్

    రిప్లయితొలగించండి
  50. మానుగ వ్రతము చేయగ మనసులోన
    నెంచినా మిక మంచివి నెల్లవారి
    కొసగ తెచ్చెద మిప్పుడు కూర్మి తోడ
    రవిక చాలు కదాచీర రమణి కేల

    ఉవిదలకెల్ల యీనడుమ యొప్పగు కోకలు తెచ్చినాముగా
    శివమది కల్గు నింటికని చెప్పగ పెద్దలు వల్లె యంచునీ
    భవనము నందొసంగితిమి వాసిగ నింకనువారి కిప్పుడీ
    రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్

    రిప్లయితొలగించండి