29, ఏప్రిల్ 2019, సోమవారం

సమస్య - 3001 (తాళము వేయఁగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్"
(లేదా...)
"తాళము వేయఁగా వలెను ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్"

86 కామెంట్‌లు:

  1. గోళము జుట్టిన రీతిగ
    మేళము వాయించు వారు మీరిన ముదమున్
    వేళము శృతినే గలుపుచు
    తాళము వేయంగ నొప్పు ధర్మము నిలుపన్
    వేళము = త్వరితముగ

    రిప్లయితొలగించండి
  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    వేళకు తిండి కావలెన? వేడిగ కూరయు పప్పుముద్దలున్?
    మేళము తోడ డప్పులను మేలుగ ప్రొద్దుట తప్పుకొందువా?
    తాళగ తిట్లు సణ్గుడును తప్పక నత్తయగారి నోటికిన్
    తాళము వేయఁగా వలెను ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్

    రిప్లయితొలగించండి
  3. సమస్య :-
    "తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్"

    *కందం**

    తాళిని మెడ కట్టెడు శుభ
    వేళన తప్పులు దెలిసిన విప్పకనే యా
    మేళము నందున నోటికి
    తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్
    ...........‌.....‌......✍చక్రి

    రిప్లయితొలగించండి
  4. వేళాకోళముఁ జేయు ప్ర
    హేళికగా కాలముఁ గడు హీనము నయ్యెన్
    కూళుల కారా గృహమున
    తాళము వేయంగ, నొప్పు ధర్మము నిల్పన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాకుమార గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రహేళిక'ను ప్రస్తావించడం సంతోషాన్ని కలిగించింది. నా 'తెలుగు ప్రహేళికలు' పుస్తకం ముద్రణకు పోతున్నది.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురూజీ! శ్రీశ్రీ పదబంధ ప్రహేళికలు గుర్తుకువచ్చి ఆ పదం వాడాను. మీ పుస్తకానికి స్వాగతం!

      తొలగించండి
  5. తాళము వోలె బెరి గిభూ
    గోళము నందున జనులకు ఘోర ము నౌ ని
    వ్వేళగడ గి య వి నీతి కి
    తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్ప న్

    రిప్లయితొలగించండి
  6. ( కొంతమందికి తాళంవేస్తేనే కాని దేశం బాగుపడదు )
    కాలము నంతటిన్ కనుల
    గానక స్తబ్ధుగ నుండువారికిన్ ;
    వేళను విజ్ఞతన్ మరచి
    వేడుకమాటల నెట్టువారికిన్ ;
    మేలగు " నాగరీక " మని
    మెత్తగ నూగెడి మత్తుగాండ్రకున్ ;
    దాళము వేయగావలయు
    ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్ .

    రిప్లయితొలగించండి
  7. వేళకు యింటికి రాకను
    గోళము వలెను తిరిగేటి కోరగొను పతిన్
    మేళము వలె మర్దించగ
    తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేళకు నింటికి... గోళమ్మును బోలి తిరుగు కొరగాని పతిన్' అంటే బాగుంటుందని నా సూచన.

      తొలగించండి
    2. వేళకు నింటికి రాకను
      గోళమ్మును బోలి తిరుగు కొరగాని పతిన్
      మేళము వలె మర్దించగ
      తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్

      తొలగించండి
  8. వేళకు భక్తిని మదిలో
    కాళీ మాతన్ భజించి కారుణ్య మనో
    కేళీ లోలాయతులై
    తాళము వేయంగనొప్పు ధర్మము నిల్పన్.

    రిప్లయితొలగించండి
  9. కందము
    కాళము నాట్యము జేయును
    మేళము నాగిని స్వరంబు మెప్పుగ బాడన్
    వేళకు సరిపడు లయతో
    తాళము వేయంగ నొప్పు ధర్మము నిలుపన్.
    ఆకులశివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  10. వేళయు పాళయు లేకయె
    కూళల బొగడంగనేర్వ కూడగ ధనమున్
    వేళము భృత్యుల నోటికి
    తాళము వేయంగనొప్పు ధర్మమునిల్పన్

    రిప్లయితొలగించండి
  11. హేళనజేయగా మిగుల హీనపుబుద్ధిని దేశవాసులే
    కూళల మాటలన్ గొనుచు క్రూరత వీడగ ధర్మపత్నినే
    వేళము నట్టివారికిని వెక్కసమయ్యెడి వెర్రివాక్కుకున్
    తాళము వేయగావలయు ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్

    రిప్లయితొలగించండి
  12. వేళకు దగ్గ యోచన లు ప్రీతి గ జేయుచు న ప్ర మత్తు లై
    గోళము నందు ఘోర మగు కూ ళల యాట లు సాగ నీయకన్
    మేళము చేసి సజ్జ నుల మేదిని బాగు ను కోరు వారికి న్
    తాళము వేయగా వలయు ధర్మ ము నిల్పగ బుద్ది జీవి కిన్

    రిప్లయితొలగించండి
  13. వేళయు పాళయు లేకను
    గోలగ రణగొణ ధ్వనముల గూతలు పెట్టే
    కూళల మైకుల నోళ్ళకు
    తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్ _/\_

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధ్వనములు' అన్న పదం లేదు. "రణగొణల ధ్వనుల" అనండి. 'పెట్టే' అనడం వ్యావహారికం.

      తొలగించండి
  14. కాళీయుని మర్ధనమున
    తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్
    పాళీ చేతన్ బట్టుచు
    రవళుళ్ మ్రోగంగ పాడెర హరిని గొల్వన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గంగాప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదం లఘువుతో ప్రారంభమయింది. ప్రాసకూడ తప్పింది.

      తొలగించండి
  15. మేళము వేయకవేయక స
    కూళలు చేసెడు పనులకు కువలయమందున్
    వేళకు సజ్జనులు పనికి
    తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం చివర 'స' అదనంగా టైపైనట్లుంది.

      తొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    కాళసమానుడై విసము గ్రక్కుచు , హైందవధర్మసారమాం..
    దోళన చెందుపద్ధతిని తోచిన భావమునెల్ల వ్యాఖ్యగా
    నూళను వేయునక్కవలె నుర్వి వచించెడి వక్త నోటికిన్
    తాళము వేయఁగా వలెను ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  17. శంకరాభరణం
    29/04/2019 సోమవారం
    సమస్య

    "తాళము వేయఁగా వలెను ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్

    నా పూరణ. ఉ.మా
    ** *** *** ****

    తాళిని గట్టియున్న వనితన్ కడు వేదన బెట్టు టేలనో

    వ్యాళుల వోలె శ్రీ గలిగి యన్యుల కాటును వేయుటేలనో

    కూళులు న్యాయ ధర్మములు కూలగ జేసిరి; దుష్ట బుద్ధికిన్

    తాళము వేయఁగా వలెను ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్



    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  18. వేళాకోళము లాడుచు
    కూళలతో తిరుగుచుండి కూటికి నైనన్
    వేళ గనని పతి నోటికి
    తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్

    రిప్లయితొలగించండి
  19. కందం:
    వేళాకోలపు మాటలు
    కూళలు నిస్సిగ్గు లేక కూయుచు పరులన్
    హేళన జేసెడి నోటికి
    తాళము వేయంగనొప్పు ధర్మమునిల్పన్

    గొర్రె రాజేందర్
    సిద్ధిపేట

    రిప్లయితొలగించండి
  20. గోళమునందవినీతికి
    తాళమువేయంగనొప్పుధర్మమునిల్పన్
    గూళులయాగడములకును
    దాళమునేవేయవలయుధరణినినెపుడున్

    రిప్లయితొలగించండి
  21. కాళీయ మర్దనుని వై
    తాళికు లట్టుల బొగడుచు దరియింపంగన్
    వేళకు భజనల జేయుచు
    తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్.

    రిప్లయితొలగించండి


  22. వేళాకోళము చేయన్
    చాళియపు విరుపుల నోటి చాలికకు సుమీ,
    కాళిక! కళింగ! కౌముది,
    తాళము వేయంగనొప్పు ధర్మము నిల్పన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  23. వేళకు రాక నింటికి కవేలపు కన్నుల వారకాంతతో
    మేళములాడ, నిన్విడిచి, మెంగతనమ్ముగ నుండబోకుమీ!
    కాళి! కళింగ! భర్తకు సకాలము లో, సరియైన రీతిలో
    తాళము వేయఁగా వలెను ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. కందం
    ఆలము విడు నరునకు హరి
    లీలగ బోధించి గీత ప్రేరేపించన్
    మేలు గెలువఁ దద్గీతకుఁ
    దాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్

    రిప్లయితొలగించండి
  25. వేళ కశనమిడు సతితో వేళాకోళములు వలదు ప్రేమనొసగుమా కూళులు కలిసిన నోటికి తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్

    రిప్లయితొలగించండి
  26. కేళీ లీల వచించఁ బ్ర
    వా ళాభ వచనముల ననపాయము నాయా
    వేళలఁ దగ నంచిత కర
    తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్


    పాళె మనంగ విగ్రహము వర్ధిలు రంధ్ర న వావృతమ్ము భూ
    గోళము నందు నింద్రియ సుఘోర పరావసథమ్ము మాన సా
    రాళ కుటీర వాసమున రాజిలు దూషిత చింత నాళికిం
    దాళము వేయఁగా వలెను ధర్మము నిల్పఁగ బుద్ధి జీవికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  27. తాళిని గట్టినట్టి సతి దాపున నుండగ నన్యకాంతతో
    కేళికి దూకు డెంద మది కేవల వాంఛకు లొంగి కాన నె
    వ్వేళను నైన నింద్రియపు స్వేచ్ఛనడంచి సునిగ్రహాఖ్యమౌ
    తాళము వేయఁగా వలెను ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      నిగ్రహమనే తాళమా? బాగుంది. ప్రశస్తమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
  28. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వేళకు నెన్నికందునట బెత్తము జూపుచు మోడివర్యుకున్
    గూళల రెచ్చగొట్టుచును గుప్పిడి ముడ్చుచు బొబ్బరిల్లగా
    కాళియఘాటు దూరుచును కంఠము మూయగ వంగరాణికిన్
    తాళము వేయఁగా వలెను ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      మోడీ వంగరాణికి తాళం వేయడం జరిగేనా? ఏమో రాజకీయాలలో ఏది అసాధ్యం?

      తొలగించండి
    2. ""Narendra Modi is coming to Bengal regularly to seek votes. But the people will give him rosogollas made of clay with fillings of gravel; his teeth will break if he tries to take a bite," Banerjee said at a rally at Raniganj."


      Read more at:
      //economictimes.indiatimes.com/articleshow/69060137.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

      తొలగించండి
  29. కూళులదుష్టచేష్టలకు గూరిమితోడనశాశ్వతంబుగా
    దాళమువేయగావలెనుధర్మమునిల్పగ,బుద్ధిజీవికిన్
    వేళయుబాళయున్ననకభీతినిగొల్పుచునుందురీధరన్
    బాళెపుగాండ్రునాబడెడుబద్ధవిరోధులెయెల్లవేళలన్

    రిప్లయితొలగించండి
  30. శ్రీరామ స్తుతి:
    రచన: కామేశ్వర రావు పోచిరాజు

    శ్రీరామ మంబుద శ్యామం సర్వ ధనుష్మతాంవరమ్
    సీతా హృద్వన మందారం వందే దశరథాత్మజమ్ ॥1॥

    కౌసల్యా సుప్రజా రామం ససీతా చ సలక్ష్మణమ్
    ధానుష్క మరవిందాక్షం వందే సత్య పరాక్రమమ్ ॥2॥

    జనస్థాన మహారణ్య ఖరాద్యసుర నాశకమ్
    పరిరక్షిత మున్యోఘం నమామి పురుషోత్తమమ్ ॥3॥

    విదారిత దశగ్రీవం సంభావిత విభీషణమ్
    పరిపాలిత సుగ్రీవం సమారుతిం నమామి తమ్ ॥4॥

    మంగళం రామచంద్రాయ సత్యసంధాయ మంగళమ్
    మంగళం నీల దేహాయ సీతానాథాయ మంగళమ్ ॥5॥

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్లోకాలు మనోహరంగా, నిత్య పారాయణ యోగ్యంగా ఉన్నాయి.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమస్సులు. ధన్యుఁడ నయ్యాను.
      జిలేబి గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  31. వేళలు మర్పులుజేయక
    తాళిమితో ధర్మవిధులు దలచెడి రీతిన్
    తాళినిగట్టగ?"జంటయు"
    తాళమువేయంగనొప్పు!"ధర్మమునిల్పన్"

    రిప్లయితొలగించండి
  32. వ్యాళమె భూషణముగ గల
    క్ష్వేళగళుని మది నిలుపుచు వితథమ్మాడే
    కూళుని మాటల కెప్పుడు
    తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆడే' అనడం వ్యావహారికం.

      తొలగించండి
  33. హేళన జరుగగ నోటికి
    తాళము వేయంగ నొప్పు ; ధర్మము నిల్పన్
    మాలిమి చేష్టలతో కాం
    తాళమును సహనము తోడ తగ్గించ వలెన్

    రిప్లయితొలగించండి
  34. కాలవిరుద్ధమైన తఱి కాంచ సుఖమ్మును పృథ్వి నోటికిన్
    తాళము వేయఁగా వలెను ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్
    వేళ గృహీతమైన కడు వేడుకతోడుత మాటలాడినన్
    మేలు ఘటిల్లు సంతతము మేదిని యందున నెంచి చూడగా

    రిప్లయితొలగించండి
  35. మేళము తో సుఖించుటయె మేలగు కార్యమటంచు తల్చెడిన్
    కూళుల కెప్పుడేని యను కూలతఁ జాటకు నెల్లవేళలన్
    వ్యాళమె భూషణమ్ముగల భద్రుని భక్తులు చెప్పు మాటకున్
    దాళము వేయగా వలెను ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్.

    రిప్లయితొలగించండి
  36. ఉత్పలమాల
    కూలుచ నొజ్జ ద్రోణునట కూలెను ద్రౌణి యటంచు గట్టిగన్
    బోలిన నామపున్ గజము బ్రుంగె నటంచును చిన్నగాననెన్
    జాలము వైచిధర్మజుని శైలధరుండు వచించ గోరగన్
    దాళము వేయగా వలెను ధర్మము నిల్పగ బుద్ధి జీవికిన్

    ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

    రిప్లయితొలగించండి
  37. డా.పిట్టా సత్యనారాయణ
    మేళము చావుకు ప్రాణపు
    కాళము వీడంగ దేహి కాయము గొనిపోన్
    వేళకు తత్త్వపు భజనల
    తాళము వేయంగ నొప్పు ధర్మము నిలుపన్
    (దహన సంస్కారమునకు గొనిపోవు మృతదేహము ముందు తత్త్వములు పాడుతూ శవయాత్రను పూర్వము కొనసాగించేవారు,ఉదాహరణకు, ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు ఎందుకీ మోహంబు జీవా! పన్నుగా నిహలోక భ్రాంతి వదలియు శివుని భజన సేయవె మాయ జీవా!)

    రిప్లయితొలగించండి
  38. గాలము వేయగ 'ఓటు'కు
    నాలాపించగనె నేత లప్రియ వాక్కుల్
    చాలన వారల నోటికి
    తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్!

    రిప్లయితొలగించండి
  39. డా.పి సత్యనారాయణ
    వేళకు దొంగలింటి గన వీకను మార్చ తెనాలి రాము గం
    గాళమొ1,బావియో గలదె గప్పున ద్రోయగ, సంగ్రహాది లో
    పాళికి దద్దరిల్ల దగు, పాడు ధనేషణ యందు గూర్మికిన్
    తాళము వేయగా వలయు ధర్మము నిల్పగ బుద్ధి జీవికిన్
    1. లోతు నిడివి గల పాత్రగాని ఇంటి బయట నుండవు,నిండుగా నీరు నింపి నగానట్రా అందులో పడవేశా మనటానికి,)

    రిప్లయితొలగించండి
  40. కాలమునకుతగురీతిని
    తాళమువేయంగనొప్పు ధర్మము నిలుపన్
    కాలముమారుచునుండగ
    కాలముతోబాటుజనులుగమకించదగున్

    రిప్లయితొలగించండి