6, ఏప్రిల్ 2019, శనివారం

న్యస్తాక్షరి - 62 (శ్రీ-వి-కా-రి)


నాలుగు పాదాలను వరుసగా 
శ్రీ - వి - కా- రి 
అనే అక్షరాలతో ప్రారంభిస్తూ 
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 
'ఆటవెలది' వ్రాయండి.
(లేదా...)
నాలుగు పాదాలలో యతిస్థానంలో వరుసగా
శ్రీ - వి - కా- రి 
అనే అక్షరాలను ప్రయోగిస్తూ 
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 
చంపకమాలను వ్రాయండి.

67 కామెంట్‌లు:

  1. శ్రీ వినాయక

    ఉగాది శుభాకాంక్షలు

    (కవి వరులకు మనవి : ఎక్కడన్నా ఏకవచన ప్రయోగము ఉన్నచో క్షమార్హుడను)
    కవులందరికీ వికారి శుభాకాంక్షలతో , గురువుగారి పద పద్మములకు చిరు కానుక



    శ్రీహర్ష పద్యాలు సీమరేగు ఫలముల్, అవుసుల వారివి అరటి పండ్లు,
    అసునూరి పద్యాలు ఆల్బొకారా పండ్లు, జంధ్యాల వారివి జామ పండ్లు,
    వీటూరి పద్యాలు వెలగపండ్లు, భమిడి పాటి పద్యమ్ములు పనస తొనలు,
    పెద్దింటి వారివి పేరిపండ్లు యెపుడు , నేదునూరి పదముల్ నిమ్మ పండ్లు ,
    అంజయ్య గౌడువి నల్ల నేరేడులు, దానిమ్మలే గదా దార్ల పదము ,
    తేనె సపోటాలు శ్రీనివాస పదముల్, యీడిగ వారివి యీత పండ్లు,
    కామేశ ఘనునివి ఖర్జూరంబులు, జిలేబీ పద్యములు రాసుబెర్రి లెపుడు,
    రారాజు మామిండ్లు రాజశేఖరునివి, దరిసి వారి పదముల్ ద్రాక్ష పండ్లు,
    చిటితోటి వారివి సీతాఫలంబులు, కిలపర్తి పద్యాలు కిస్సు మిసులు,
    గోలి శాస్త్రి పదముల్ గుమ్మడి పండ్లంట, సాగర్ల వారివి రేగు పండ్లు
    బొగ్గరం వారివి బొప్పాయి పండ్లాయె, బత్తాయి పండ్లంట బద్రి పల్లె
    కవివి, కమలములు గంగుల వారివి,సుబ్బదేవుని వేమో దబ్బపండ్లు
    భూసారపు కవివి పుచ్చ,కవి విరించి పద్యములు నారింజ పండ్లు.
    సీతమ్మ తల్లివి జీడి మామిడి పండ్లు ,హంసగీతి పదముల్ అత్తి పండ్లు,
    అంబటి వారివి అంజూర పండ్లు ,గురుచరణములవి ఖర్భూజ పండ్లు,
    స్వయము వర కవివి స్ట్రా బెర్రి లే, ఆముదాల పండితునివి తాటిపండ్లు
    గా చేర, ఘనుడు శంకర విబుధుడు ఫల హారమ్ము కావించె, నావు రావు

    రనుచు బ్లాగుసతి గనుచు మనసు బెట్టి ,
    ముదిమి మీద బడిన గాని ముదము తోడ
    కడుపు నిండుగా తినుమయ్య కంది శంక
    రా యని విళంబి దీవించె రసను వీడి



    అన్నపు రెడ్డయ్య ఆవకాయ నిడగ, అమరవాది ఘనుడు ఆలు కర్రి
    వడ్డించ,కంజర్ల వారు వంకాయ కూర నిడెను, మద్దూరి రామ మూర్తి
    గోంగూర పచ్చడి కొసరి కొసరి పెట్ట,మాచవోలు అరటి వూచ కూర
    చేరె, వెలిదె వారు చేగోడిలను పంప, వేలేటి వారేమో పాల కోవ
    పంపె, సొలస వారు బందరు లడ్లను వండగ,ప్రవళిక గుండ బెట్టి
    కంద బచ్చలి పంపె, కవిసిరి సత్తెయ్య గారెలు వండెను ఘనము గాను,
    శాంతి భూషణు డంపె జంతికలను, ప్రభాకర శాస్త్రి యొసగెను కజ్జి కాయ
    లను, విట్టు బాబేమొ పునుగులు వండగ , మహమ్మదు షరీఫు మనసు బెట్టి
    ఖీరు చేసెనుగ, సాంబారును మైలవరపు కవి బెట్టెను రమ్యగతిని
    తక్కాళి పండ్లతో చక్రాల వారు పప్పును జేయ, చిరుకవి పూసపాటి


    వేప పువ్వు పచ్చడిజేసె, వేగి రముగ
    వాట్సపుసతికూ డి తినగవలయు కంది
    శంకరా యనుచు వికారి సంత సముగ
    స్వాగ తములను బలికెను శంకరునకు



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొత్త వత్సరమును ఘనముగా స్వాగతించిన కుమార్ గారికి అభినందనలు...
      ఈ వత్సరమంత ఆ భగవంతుని కృపతో శుభమ్ములు గల్గుగాక!

      తొలగించండి
    2. కవిమిత్రుల నందరినీ ఆత్మీయ సంకలనం చేయడంలో మీకు మీరేసాటి కృష్ణకుమార్ గారూ!అభినందనలు!
      మీకు మా శుభాభివందనలు!

      తొలగించండి
    3. సూర్యకుమార కవివరులకు నమస్సులు...మీరు అందరికీ పంచిన ఫల "హారములు" అతి మధురముగా నున్నవి.

      తొలగించండి
  2. వివిధఫలవిరాజితమై ,రకరకముల వంటలతో పిండివంటలతో మీరు అందించిన విందు
    పసందుగా ఉన్నదండీ కుమార్ గారూ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు బాపూజీ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు

      తొలగించండి
  3. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ శ్రీవికారి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.

    ఆటవెలది
    శ్రీల నంద జేసి శ్రీలక్ష్మి వలెనీవు
    విభవమొసఁగ మాకు వేడుకొందు
    కామితమ్ముఁ దీర్చు కరుణామయివౌచు
    రిపుల ద్రుంచ రావె శ్రీవికారి

    రిప్లయితొలగించండి
  4. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    గు రు వ ర్యు ల కు క వి మి త్రు ల కు క వ యి త్రు ల కు

    నూ త న వ త్స ర శు భా కాం క్ష లు

    రిప్లయితొలగించండి
  5. న్యస్తాక్షరి :-
    నాలుగు పాదాలను వరుసగా
    శ్రీ - వి - కా- రి
    అనే అక్షరాలతో ప్రారంభిస్తూ
    నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ
    'ఆటవెలది' లో.

    *ఆ.వె**

    శ్రీ వికారి ప్రజకు సిరులనీయగవలె
    విశ్వ తెనుగు జనుల వృద్ధి కోరి
    కాంక్ష లన్ని దీర్చి కరుణించు శ్రీ వికా
    రి శుభములనొసగి మరి మురిపించు
    ....................‌✍చక్రి
    *నూతన వికారి నామ సంవత్సర శుభాకాంక్షల*

    రిప్లయితొలగించండి
  6. అందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు
    కుమార్ గారూ ధన్య వాదములు
    -------------------------
    శ్రీకర ముగ వచ్చి శ్రేయము జేగూర్చ
    విష్ణు పదము మ్రొక్కి విన్న వింతు
    కాల గమన మందు కల్లలు నిండగా
    రిక్త బ్రతుకు లయ్యె భుక్తి లేక

    రిప్లయితొలగించండి
  7. శ్రీ కర ము లొ సంగి చింత ల నె డ బాపి
    విమల సౌఖ్య ములను విత్త మొసగి
    కాంక్ష లన్ని దీర్చు కమనీయ ముగ వికా
    రి యని విశ్వ సింతు ప్రీతి మీర
    రి యని

    రిప్లయితొలగించండి
  8. శ్రీ వికారినామసంవత్సర శుభాకాంక్షలు కవివర్యులకు
    శ్రీ కరశుభకర విశేషమునింపగ
    విలువల వలువలు భవితకుబంచ!
    కామితంబు దీర్చ కారుణ్యరూపాన
    రిపువులేకజేయు రీతిరమ్ము

    రిప్లయితొలగించండి


  9. శ్రీకరము నడుగిడె శ్రీ శుభముల,ఘన

    విద్యల,విరివిగను విజయములను,

    కానుక లిడ శ్రీ వికారి వత్సరమె!భూ

    రి గలుగును ముదములు రిక్త మవక

    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🥀 వనపర్తి 🥀

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    శ్రీలు పొంగునట్లు క్షేమమ్ములగునట్లు
    వివిధ గతుల హితము వెలయ జేసి
    కాంతివంతమైన కాలమ్ము నీవన
    రివ్వుమనుచు రమ్ము శ్రీవికారి !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చివురులు వేసె కోరికలు శ్రీకరమైన వికారి ! నీవు రాన్
      వివిధశుభావళుల్ జగతి విస్తృతిగా లభియించు , సాహితీ
      కవనవనమ్ము వెల్గి రసకావ్యములున్ రవళించు , మోదకా...
      రివి యని నమ్ముచుంటిమి వరిష్ఠఫలప్రకరమ్ములీయవే !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  11. శ్రీలు విద్యలిమ్ము చిన్మయమూర్తివై ;
    విజయపథము మమ్ము వీడనీకు ;
    కాంక్ష దీర్ప నెట్టి యాంక్ష లుంపగవద్దు ;
    రిత్తవాక్కు లేని క్రొత్త యేడ !

    రిప్లయితొలగించండి
  12. కంజర్ల రామాచార్య.

    అల్లన పాంచభౌతికసమంచితదేహమొసంగి స్తన్యముల్
    మెల్లన గుడ్పి పెద్ద యగు మేరకు కంటికి రెప్ప వోలె తా
    నెల్లర నాదిదైవమగు నీమెను సాకని వారికట్లుగా
    తల్లికిఁ దింటి బెట్టుట వృథాయని జెప్పెను ధర్మశాస్త్రముల్.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురం, హైదరాబాద్.

    రిప్లయితొలగించండి
  13. చిరతర భోగభాగ్యములు.శ్రీకర చారు విశేష సౌఖ్యముల్,
    విరులు గులాబి సౌరులును,విస్తృత సుందర శుభ్ర భావనల్,
    కరమనురాగ సంగతులు,కాంతి పరంపర,దేవదేవు శౌ
    రి,రయపు దీవెనల్,సత మరిష్టము బాప,వికారి బ్రోచెడున్.

    రిప్లయితొలగించండి
  14. శ్రీలు పంచి మీకు క్షేమ మొసగ నెంచి
    విశ్వమునకు జేరె వేడ్క తోడ
    కాలశకట మందు కదలి వచ్చెను 'వికా
    రి' నవ వత్సరాంబ ఘనము గాను.

    రిప్లయితొలగించండి
  15. శ్రీవికారి నీవు చెన్నుగా నేతెంచి
    విశ్వ శాంతి నొసగు వేగిరముగ
    కావరుల మద మడఁచి, కావుము ప్రజల భూ
    రిగ సిరుల నొసంగి ప్రేమతోడ

    రిప్లయితొలగించండి
  16. శ్రీవికారి నీవు చేరినావు భువికి
    విశ్వ శాంతి నొసగ వేగిరముగ
    కావరుల మద మడఁచి, కావుము ప్రజల భూ
    రిగ సిరుల నొసంగి ప్రేమతోడ

    రిప్లయితొలగించండి
  17. శ్రీలు పంచి మనకు సేమము కూర్చుచు
    విజయ పథము నందు వేగ నడిపి
    కామితార్థ మొసగి కలత బాపగ వికా
    రియును వచ్చె నాదరించ రెండు.

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. 🙏🙏🙏
    శ్రీ గురుభ్యోన్నమః
    గురువులకు, కవిశ్రేణికి శ్రీ వికారి వత్సరాది శుభాభినందనలు, అభివందనములు

    శ్రీలు గురియ ప్రజల శ్రీమంతులను జేయ
    విఘ్నములను బాపు విష్ణు డెప్డు
    కాల గతుల మార్చి కారుణ్య మునుజూప
    రిక్త హస్తుc నింపు రీతి రమ్ము

    రిప్లయితొలగించండి
  20. శ్రీ కరణమును ఘనముగా చేత బట్టి
    విబుధు లెల్లరున్ పలికిరి వెల్కమును, వి
    కారి కన్నియా రమ్ము శంకరుని కావ్య
    రిక్థమును మాకు నిడ నజ్జరే యనెదము

    రిప్లయితొలగించండి
  21. డా.పిట్టా సత్యనారాయణ
    శ్రీ స్తవనాభిలాషినయి చిన్మయు దల్చి యుగాది వేళ నే
    విస్తర తోష పూర్ణముగ వీకన జేతు శుభాభినందనల్
    కాస్త వికారినిన్ గనగ కాతరతన్ గొనరాదు నామపున్
    రిస్తయె(సంబంధము,హిందీ)యీ సువర్ష మతిరేక శుభంబుల నిచ్చు గావుతన్!

    రిప్లయితొలగించండి
  22. డా.పిట్టా
    రిస్తైయె?.....ప్రశ్నార్థకముగా గొనగలరు.

    రిప్లయితొలగించండి


  23. శ్రీలు పొంగ గాను శ్రీవికారి శుభముల్
    విరివి గాంచు గాక విదురులార !
    కామనలివి యేను కవివరు లార! పు
    రికొను గాక నెల్లరి కవనములు!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  24. క్షేమము గా నుగాది యిక శ్రీలను గూర్చగ దేశమంతయున్
    వేమరు గైన వృద్ధి పృథివిన్ప్రభలొల్కగ భాసితంబుగా
    కామన లివ్వి పండితుల కాహక నాదము విస్తృతంబుగా
    రేమగడిన్ వళక్షముగ రిచ్చలు సేయవలెన్ సభాస్థలిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. క్రొత్త వత్సరమువికారి చిత్తమలర
    వచ్చుశుభసమయమ్మునబ్లాగునగల
    కవివరేణ్యులకివెశుభా కాంక్షలిడుదు
    నందుకొనుడయ్యమీరలుఋహర్షమొదవ

    రిప్లయితొలగించండి
  27. శ్రీనివాసుని కృప శ్రీవికారి మనకు
    విత్తమిచ్చి బ్రోచు చిత్తమలర
    కాలచక్రమందు కష్టాలులేకుండ
    రిక్కవలెను దగిన దిక్కుజూపు!

    రిప్లయితొలగించండి


  28. సిరులొలుకంగ దేశమిక శ్రీకరమై వెలుగొంద రాష్ట్రముల్
    విరివిగ పాడిపంటలు సువిద్రితమందున చేరగావలెన్
    కరిముఖ! వేడుకొందుమయ కావవలెన్ జనులన్ సదా విసా
    రి రువణమున్ సమగ్రముగ, రిక్తతయున్ తను గాక బ్రోచుమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈవారం ఆకాశవాణి వారిసమస్య
      తెలియజేయగలరు

      తొలగించండి


    2. పైవారానికి ఆకాశవాణి వారి సమస్య యేమిటో తెలియచేయుడీ !

      తొలగించండి
  29. శ్రీలు శుభము హితము క్షేమ సౌఖ్యమ్ములు
    విజయ మభ్యుదయము వెలుగు పంచి
    కామితముల దీర్చి కాల గమనము స
    రియగు రీతి మార్చు శ్రీ వికారి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సిరులను పంచ వచ్చెనదె శ్రీకరి లక్ష్మియె కాల రూపమై,
      విజయము నంద జేయగను విఘ్నములన్నియు బాపు రీతిగా
      కరిముఖుడయ్యె కాలమది కావగ లోకము, నీయుగాది తాఁ
      త్రినయనుడయ్యెఁ జూడగను రిక్తతఁ ద్రోలగ శ్రీవికారిగా!

      తొలగించండి
  30. శ్రీలనీయుమమ్మ చిద్విలాసివికారి,
    విజయఢంకమ్రోగ వీనులలర
    కాలయమునిబారిగావుమ మమ్ముల
    రిపుగణంబులేక రేయిబగలు

    రిప్లయితొలగించండి
  31. అందరికీ "వికారి" నామ తెలుగు వత్సర శుభాకాంక్షలు

    వినుమిక యో "వికారి" యొక విన్నపమింకను జేతుమమ్మ నిన్
    కనగన నీ "వికార"ముల గాన్పడనీయక లోకమందు యా
    తనలవి కారిపోవునటు తగ్గటు కాలము మార్చి వేసి భూ
    జనులకు భావికారిగను శాంతియు సౌఖ్యములంద జేయుమా!

    రిప్లయితొలగించండి
  32. మిత్రులందఱకు శ్రీ వికారి నామ సంవత్సర యుగాది పర్వదిన శుభాకాంక్షలు!

    సిరులనుఁ బంచి, యెప్పుడును [శ్రీ]కరమౌ సుగుణాళిఁ జేర్చియున్,
    విరుల సువర్షముల్ గురిసి, [వి]శ్రుతమౌ పికరాగ మిచ్చియున్,
    గరముల దాతృ కృత్య మిడి, [కా]మితముల్ ముదమార నిచ్చి, చే
    ర్చి రసిక హృద్యపద్యము ధ[రి]త్రిని, నేఁటి వికారి వెల్గుతన్!

    రిప్లయితొలగించండి
  33. శ్రీ వికారి సేసె సిరి సంపద లొసంగ
    విరివిగ వసుధా ప్రవేశము జన
    కాయ హృద్వికాస కారణ భూత గ
    రిమము వెల్గ నిడు శుభములు మనకు!


    చెలువము మీఱ వచ్చినది శ్రీద వికారి సువత్సరమ్ము దాఁ
    బెలుచ శుభమ్ము లీయఁగను విస్తృత భోగ వరప్రదార్థ భూ
    కలుష చయఘ్న సంభరిత కార్య నిమగ్న మనోవిలాస భూ
    రి లలిత భూషణ వ్రజ వరిష్ఠ కటిస్థలి యై సమోదమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. హారతు లొసంగ రండు వికారి నామ
      రాగ సంవత్సర ద్విజ రాజ రమ్య
      పక్ష విక్షేప సంజాత వాత వేగ
      చోదిత ప్రాప్త భాగ్య రాశు లరయంగ!

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  34. 'శ్రీ'వికారి వచ్చె, చిన్నగ సలహాలు
    'వి'రియు చుండు మీకువిధిగ, యతిని
    'కా'యు పదము తోడ, కైపద ములను ప
    'రి'ష్కరించ జేయు లేఖరిగను

    రిప్లయితొలగించండి
  35. అందరికీ వికారి నామ సంవత్సరం శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  36. ఆటవెలది

    శ్రీకరమగు సిరుల సిద్ధింపజేయను

    వివిధ శుభము లొసగ వినుతిసేతు

    కామితార్థసిద్ధి గలుగ జేయ,వికారి!

    రివ్వుమంచు రమ్ము ప్రేమమీర

    ఆకుల
    శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  37. సిరులొలికించుచుండియునుశ్రీకరమొప్పగజూడుమామమున్
    విరివిగబాడిపంటలనువిశ్రుతమందగగనిచ్చుచుండుమా
    కరమునుజాలిచూపుచునుగామితగోరికదీర్చుమోవికా
    రి!రసమయంబజీవనమురిక్తముగాకనుశుభంబయ్యెడున్

    రిప్లయితొలగించండి
  38. శ్రీవికారి వచ్చె సిరిసంపదల తోడ
    విరియు సర్వజనుల వెతలు నేడు
    కాదె దేశ భవిత కడగట్టు వేళ ప
    రిణతితోడ నెన్నుకొనుట పాడి?
    (విరియు = తొలగు)

    రిప్లయితొలగించండి
  39. శ్రీలు విలసిలగ నజేయస్థిర మనంబు
    విభవశుభకరుహరి పెరిమగొనుచు
    కారదుర్గుణములకాలరాయవికారి
    రిరినిహాటకమొనరించుగాత

    రిప్లయితొలగించండి
  40. శ్రీదమగువికారి శ్రీలనొసంగుత
    విభునిపెరిమవృద్ధివిభవమగుత
    కార్యకారణములు కార్యసిద్ధియు వికా
    రి ఋషితలపునిడుత ఱేపుమాపు

    రిప్లయితొలగించండి
  41. స్థిరమగుభోగభాగ్యములు శ్రీకరమైనవికారిసాక్షిగా
    పెరిమయుశాంతిసౌఖ్యములు విశ్వమునందునవెల్లిసూపుగా
    కరకుదనంబుదుర్గుణము కాల్చగలోకముసంతసించగా
    రిరిధర సత్యలోకమన రివ్వున జూడగవాలరేసురల్

    రిప్లయితొలగించండి
  42. సిరిగల తెన్గురాష్ట్రముల శ్రీద వికారి యుగాది పర్వమే
    బిరబిర కాలచక్రగతి విష్ణువు సోమకు ద్రుంచె వేడ్క న
    క్షరమధుశోభ చైత్రసఖు కారతినీయ కుహూకుహూపదా
    ళి రవములెల్లడన్ వరల శ్రేయమొసంగ నుగాది వచ్చెలే

    రిప్లయితొలగించండి
  43. ...పూజ్య గురుదేవులకు ,కవిమిత్రులెల్లరకూ ..ఉగాది శుభాకాంక్షలు....

    శ్రీలు కురియ జేసి శ్రీవికారి సతము
    విమల యశము లిడుచు విశ్వమందు
    కామితములు దీర్చి కలిలోనజనులకు
    రిప్రములను త్రుంచు లెస్సగాను!!!

    రిప్లయితొలగించండి


  44. పైవారానికి ఆకాశవాణి వారి సమస్య యేమిటో తెలియచేయుడీ !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  45. ఆకాశవాణి వారి కొత్త సమస్య
    " సుగ్రీవుని రాముడంచు శూర్ఫణక అనెన్ "

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. "అగ్రజ! గనుమా కోసెను"
      నాగ్రహమున్ చూపుచు తన నాసిక్యంబున్
      జాగ్రత్తగ తాకి, తలచి
      సుగ్రీవుని, "రాము డం" చు శూర్పణఖ యనెన్!


      జిలేబి

      తొలగించండి
  46. స్థిరముగ పాడిపంటలనె శ్రీలను జాతికి పంచనెంచుచున్
    బిరబిర వచ్చెనే యిలకు విజ్ఞత గల్గిన వత్సరాంగి తా
    గరమున పట్టి తెచ్చె నవ కాంతుల శోభలవెన్నియో వికా
    రి రమణి యామినిన్ గొని ధరిత్రికి జేరెను వేడ్కతోడుగన్.

    రిప్లయితొలగించండి
  47. శ్రీలు పంచి మనకు సేమము కూర్చుచు
    విజయ పథము నందు వేగ నడిపి
    కామితార్థ మొసగి కలత బాపగ వికా
    రియును వచ్చె నాదరించ రండు.

    రిప్లయితొలగించండి