28, ఏప్రిల్ 2019, ఆదివారం

ఒక విన్నపం!

          'మధురకవి'గా ప్రసిద్ధులైన గుండు మధుసూదన్ గారిది నిజానికి ప్రౌఢ కవిత్వం. అయితే వారు కొన్ని బాలల కథలను సరళమైన భాషలో పద్యఖండికా రూపంలో వ్రాసారని కొందరికే తెలుసు.
          కొందరు మిత్రులం ఆ ఖండికలను 'బాలల పద్య కథలు' అనే పేరుతో బొమ్మలతో సహా పుస్తక రూపంలో తీసుకురావాలని సంకల్పించాము. అయితే ముద్రణావ్యయాన్ని భరించే స్థితిలో మధుసూదన్ గారు లేరు. ముద్రణ కర్చు అంతా ఒక్కరే భరించే దాతలు దొరకలేదు.(ఎవరైనా ముందుకు వస్తే అంతకంటె అదృష్టమా?) అందుకే మేము తలా కొంత వేసుకుంటున్నాము. డి.టి.పి. నేనే చేస్తున్నాను. సహృదయులు, పద్యకవితాభిమానులు స్పందించి తమకు తోచినంత ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. నిర్బంధం ఏమీ లేదు. ఐచ్ఛికమే. పదిమందికి (ముఖ్యంగా పిల్లలకు) ఉపయోగపడే ఈ పుస్తకం వెలుగు చూడడానికి మనవంతు సాయం మనం చేద్దాం.
          డబ్బులు పంపవలసిన అకౌంటు వివరాలు క్రింద ఇస్తున్నాను.
MADHUSUDHAN GUNDU
STATE BANK OF INDIA,
Khammam Road Branch,
WARANGAL
A/c No. 62021705201
IFSC: SBIN0021851

6 కామెంట్‌లు:

  1. మంచి యాలోచన తప్పకుండా నావంతుగా నేను కొంత.......

    రిప్లయితొలగించండి
  2. పద్యాలు నాబోటివాళ్ళకే అర్ధం కావడం లేదు. బాలలకు అర్ధమయే రీతిలో తాత్పర్యం కూడా వ్రాసా(స్తున్నా)రా ?

    మధురకవి గారిని ప్రోత్సహించడం మధురమైన ఆలోచన ! నేను సైతం ....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తాత్పర్యం అవసరం లేకుండానే అర్థమయ్యే సులభశైలిలో వ్రాసారు.

      తొలగించండి
  3. మంచిప్రయత్నం! ఈ మంచిపనిలో నన్ను కూడా పాలు పంచుకోనివ్వండి.

    రిప్లయితొలగించండి
  4. ఎందుకు సంపుటాలు ముద్రించడం. ఈ-పుస్తకం పిడిఎఫ్ ఇవ్వండి. చాలు. బాలల పుస్తకాలు ఓకే. బూతు సమస్యల పుస్తకాలు మాత్రం దయచేసి ప్రచురించవద్దు.

    రిప్లయితొలగించండి
  5. గురుదేవులకు నమస్సుమాంజలి. నా వంతు సాయము ఈ రోజు పంపడం జరిగింది.

    రిప్లయితొలగించండి