3, మే 2019, శుక్రవారం

దత్తపది - 156 (బాల్‌-రన్‌-వికెట్‌-విన్)

బాల్ - రన్ - వికెట్ - విన్
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి. 

43 కామెంట్‌లు:


  1. ఉత్తరుని ప్రగల్భము

    బాలకుడనుకాను సుమా
    చాలమి దరిచేరదింక! చాపము విన్నం
    గా లాగి రన్తృ వయ్యెద
    నాలాటి తరస్వికెట్టు నానమ్ములగున్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    బాల్ - రన్ - వికెట్ - విన్
    భారతార్థంలో..

    పరులన్ ద్రుంచుట యెంత ? పల్కులివి డంబాల్ కావు , సారథ్యమున్
    నెరపంగా గల ధీరుడెవ్వడవనిన్ ? జేరన్ రణమ్మున్ సఖా !
    ఇరవౌ నిన్ బిలువన్ బృహన్నవికెట్లేమందు ? శౌర్యమ్మునూ...
    పిరిగా గల్గిననుత్తరుండననె ఠీవిన్ జూప యత్నించుచున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  3. బాల్ ముడువంగ బోనని పట్టు బట్టి
    దుష్ట సేనుని యరయంగ తొడలు విరిచి
    రుధిర మేతెచ్చి కురులకు లోక వికెటు
    చాటి జెప్పగ వేగిరన్ చాలు విన్ను
    -----------------------------
    హమ్మయ్య ఎలాగో కిట్టిం చాను

    రిప్లయితొలగించండి
  4. శంకరాభరణం
    03/05/2019 శుక్రవారం

    దత్తపది - 156

    బాల్ - రన్ - వికెట్ - విన్

    పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో

    నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి. 


    నా పూరణ. తే.గీ.
    ***** ***

    ( ధృతరాష్ట్రుడు తన పుత్రుడు సుయేధనునికి చెబుతున్న హిత వచనములు...)


    వినుము!దుర్యోధన!తగవు పృథ్వికెటుల?

    మెచ్చరు భువిన్ కుమార! నీ యిచ్చ నెవరు

    ఏక్కదు చెవికెట్టుల నీకు?యేమిజేతు?

    పాండుసుతులు బాలన్ జేయ బాడియౌను

    కొమరులే నాకు మీ"రం"దరు మరువకిది!


    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  5. (కణ్వాశ్రమంలో శకుంతలతో దుష్యంతమహారాజు)
    తలప బాల్కడలిని బుట్టు లలన వీవు ;
    కన్నులారన్ మునులవాటి గాంచినాడ ;
    శీర్ణహృదయపు విన్వీథిసీమలోన
    జేరు చంద్రకాంతి వికెట్టు చెప్పగలను !

    రిప్లయితొలగించండి
  6. శిశుపాలుడు ధర్మ రాజుతో కృష్ణుని గురించి దుర్భాష లాడుట


    ధర్మజా! యాగ ఫలము పొందగ నితనికి
    యేమి ఘనత గలదు? జంపె మామ నితడు,
    యేల గోవిందు డర్హుడు? బాలు డనుచు (గో విన్)
    పాల నిత్తునని తలచి పడతి యితని
    దరిని చేరంగ చంపెను దయను వీడి, (చే రన్)
    బాల్యమున దొంగిలించెగా పాలు వెన్న, (బాల్ యము)
    చీరల బరి యితడు, నజాజీవి కెట్లు ( వికెట్ లు)
    ముఖ్య పీఠము నిడినావు? మోజు పడిన
    పరువు పోవు మీకని శిశుపాలుడనెను

    నజాజీవి = గొల్లవాడు



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నజాజీవి కాదండీ...అజాజీవి...
      అజా....మేకలవలన...జీవి...జీవించువాడు. మేకల క్రయవిక్రయాదులచె జీవించువాడు "అజాజీవి"

      తొలగించండి
    2. నమస్కారము మధు సూధన్ గారు కరెక్ట్ అజా జీవి యితడున్ + అ యితడు‌ నజాజీవి అని‌వ్రాశాను‌‌ అర్థం చెప్పటము లో‌ నజాజీవి అని పొరబాటు గా వివరించాను ధన్యవాదాలు మిత్రమా

      తొలగించండి

  7. (బాలు)ని వలె మొండితనమె పైకొనంగ
    నంద(రన్)గాదనెను గాదె యంధుడయ్యి
    యెన్ని మార్లు చెప్పిన చె(వి కెట్టు)లెక్కు?
    దుష్టుడు సుయోధనునకును (విన్న)వింప!

    రిప్లయితొలగించండి
  8. శ్రీకృష్ణ ఉవాచ

    అస్త్ర విన్నాణమంతయు హస్తగతము
    యుద్ధమందున బాల్గొను యుక్తిదెలియు
    నరిని జేరను నడయంగ నబ్బురంబు
    కెరలు రణఘోష నీచెవి కెట్టులూను?
    పార్థ!లెమ్ము!చేబట్టుము బాణచయము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. మొదటి పాదములో
      అస్త్ర విన్యాసమంతయు హస్తగతము గా చదువ ప్రార్ధన!

      తొలగించండి
  9. 🙏శ్రీ గురుభ్యోన్నమః🙏
    దుర్యోధనుడు ద్రౌపదిని కురుసభ కీడ్చు సన్నివేశం
    నా పూరణము.
    రారాజు బలికె బాలను
    తేరా తమ్ముడ సభకును దేరన్ టనుచున్
    తీరా జెవికెట్ట వినడు
    వారింపగ విబుధులనుచు వాపోవ జెవిన్

    రిప్లయితొలగించండి

  10. (బాలు)ని వలె మొండితనమె పైకొనంగ
    నంద(రన్)గాదనెను గాదె యంధుడయ్యి
    యెన్ని మార్లు చెప్పిన చె(వి కెట్టు)లెక్కు?
    వేమరు సుయోధనునకును (విన్న)వింప!

    రిప్లయితొలగించండి
  11. పద్మ వ్యూహంలో, అసమాన ధైర్య సాహసాలతో,కదన రుద్రుడై,వీర మరణం చెందిన కుమారుని,
    అభిమన్యుని జూచి అర్జునుడు విలపిస్తూ అన్న మాటలు:

    అరయగా బాల్ప్రకండుడ వగుచు నిలచి
    పోరులో బింక మారంగ పోరి,పోరి,
    భావి కెటులైన ధైర్యము పల్కునట్లు
    ఠీవి నాదర్శ మూర్తి ధాటివుయు నీవె!

    రిప్లయితొలగించండి
  12. బాలు డ భి మన్యు డొక్క డే బ వ ర మందు
    పగ తు ర న్వ ధియించు ను బలిమి తోడ
    నని న శత్రు వు చెవి కెట్టు హాయి నొసగు ?
    నె ట్టు లైన భువి న్ గెల్వ నిచ్చ వొ డ మె

    రిప్లయితొలగించండి
  13. భారతార్తంలో
    (శ్రీకృష్ణుని తో అర్జునుడు)


    విన్నపములు వినకనె వా
    రన్నారుగ సిద్ధమనుచు ననికిని, బావా!
    దున్నలుగ మనవికెట్టుల
    పన్నుగ నొప్పుదురు? నిహతి బాలగుదురికన్.

    రిప్లయితొలగించండి
  14. . *మధుపానాసక్తుడై కీచకుడు పరిచారిక యందించిన మధువు గ్రోలెడు వేళ ద్రౌపదిని గాంచి మదోన్మత్తుడై పలికిన పలుకులుగా నూహించి వ్రాసిన పద్యం*


    భువనైక సుందరన నీ
    నవలామణి యొప్పు గాదె , నరులుండెడి యీ
    భువికెట్టుల చేరెనొ గద
    దివినుండీ దేవకాంత తెలుపవె బాలా!

    రిప్లయితొలగించండి
  15. మురిపెము మీరన్ హరి బాల్
    పెరుగుద్రావి బలికె కురుపెద్దల కడకున్
    తరలెద మీవిన్నపమున్
    అరపది నూళ్లవి చెవికెటులైన తెలిపెదన్

    రిప్లయితొలగించండి
  16. బాలుం డభిమన్యుడు ఘన
    వీరుండై యుద్ధ భూమి వేగమె జేరన్
    వీలుగ చిక్కితి వికెటుల
    జాలము దాటెదవనుచును జంపిరి జివ్విన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలుడయ్యును సాహసమ్మున పద్మ వ్యూహము జేరి యా
      ధీరుడా అభిమన్యుడే ఘన దిగ్గజమ్ముల నందరన్
      చేరి పోరున నుండగా; వల చిక్కినావికెటున్నదో
      దారి నీకని గూల్చగా; జిఱుతండు జేరెను దా దివిన్

      తొలగించండి
  17. మిత్రులందఱకు నమస్సులు!

    [కర్ణుని మరణానంతరం కుంతీదేవి యుద్ధభూమికి పోయి, కర్ణుని కోసం హృదయ విదారకంగా విలపించిన సందర్భము]

    "నిన్నున్ బ్రేమగఁ బెంచనైతినిర తండ్రీ చన్ను[బాలి]చ్చియున్!
    కన్నా[రన్] నినుఁ గాంచఁగాను కొడుకా కాంక్షల్ నశించెన్ గదా!
    కన్నా! కర్ణుఁడ! నీ[వికెట్లు] భువినిన్ గాన్పింతువో? నాయనా!
    నన్నీరీతిని వీడి స్వర్గపద[విన్] గాంచంగఁ బోనేలరా?"

    రిప్లయితొలగించండి
  18. కృష్ణుడు దృతరాష్ట్రుని తో :

    పిన్నతండ్రి 'బాలు' రనుచు విడువ కుండ
    నడ'వికెట్టు'ల పంపిరో యాక ళించి
    అంగజు గి'రన్ను'తించక నైదు పల్లె
    లిచ్చివేయ యశము 'విన్ను' కెక్కు టెరుగు

    గిర= పలుకు,మాట

    రిప్లయితొలగించండి
  19. బాలుఁ'డుకాడతండుఁనరిభండనమందునఁనుక్కడంచుచున్
    కాలునిపాలుజేయగలకవ్వడిగాదిలిసూనుడెల్ల'రన్'!
    జాలముఁజేసియొక్కనినిఁజంపుటయన్నదియస్త్రజీ'వికెట్'
    లాలమునందుధర్మువగుఁనట్టులఁజెప్పిన వారు 'విం'దురే.

    రిప్లయితొలగించండి
  20. కందం
    సరసాలన్ బాల్గొన నే
    మురిపెమ్మున్జూపి నీదు ముందుకుఁ జేరన్
    విరిపాన్పున విన్దుఁ గొనన్
    నిరీక్షణల మోవికెట్లు నిలకడ పార్థా!


    రిప్లయితొలగించండి
  21. రవి కెట్టు లకట మూరన్
    ఛవి తెలియక యుండు బాల సదమల పదవిన్
    భువి నుండ నీదు కోరిక
    రవి నిభ నందనుని నిత్తు రాజీవాక్షీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్తరుని వలె డంబములు పల్కుట, సూర్యుని వలె నడుగ రాని దడుగుట యోగ్యమా మున్ముందు! యని యచ్చెరు వందు సందర్భము:


      చిత్రపదము.
      రాజకుమారుని డంబాల్
      తేజ విహీనతఁ గోరన్
      భోజనమా రవి కెట్టుల్
      భాజనమే తగ భావిన్

      తొలగించండి
  22. ధర్మజుడె భువిఁ “బాలిం”చు దక్షుడనగ
    గుడ్డి రాజు, కోప మడ”రన్” కుత్సిత మది
    వారు పద”వి కెటు”ల తగువారటంచు
    పలికి పద”విన్” విడువనంచు తెలిపె సుతుడు

    రిప్లయితొలగించండి
  23. బాలుడని తలచక నీవు పారవేసి

    నావు, రవి కెట్టుల జవాబు నీవు యివ్వ

    గలవు ,నీవు కోరంగ నా కమలధరుడు

    నొసగె తనయుని,నీవింత పిసను గలిగి

    యుందువని నే తలచకుంటి, డెంద మున్న

    పడతి వా నీవనుచు కుంతి యెడద పలికె

    రిప్లయితొలగించండి
  24. బాల్యమునందు మిక్కుడుగ బాధల బెట్టెను వీరి జూదచా
    పల్యము చొప్పునన్ వనుల బంపె సుయోధను డందరన్ కటా
    లౌల్యము మీర రాజ్యమున రాదనె భాగము నీవికెట్టు లీ
    శల్యము ద్రుంచి నాయెదను సంతును గాతువొ కృష్ణ యీ భువిన్.

    రిప్లయితొలగించండి
  25. బాలా రిష్టము దీరగ!
    కాలముకదురొడ్డిరంట కష్టమునందే
    మాయగ పాండవులన్గన?
    జాలముగా కృష్ణుడేగ చవికెటు మార్చెన్ (చవి=శక్తి)

    రిప్లయితొలగించండి
  26. దత్త పదికి నా ప్రయత్నం..

    చనుబాలిత్తు నటంచు పూతనయె కృష్ణస్వామినే బిల్వగా
    అనుకూలంబని చంకనెక్కి నగి నుయ్యాలించి జేరన్ వడిన్
    దునుమన్ జూచెను! పావికెట్టులకటా దుగ్ధంబు నంజాయెనో!
    కనగా వింతయె జంపె రక్కసిని తా కన్నయ్య లీలన్ భళా!

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  27. డా. పిట్టా సత్యనారాయణ
    భారతగాథ బట్టగ గ"బాలు"న సాధ్యమె నాటి శోధనల్
    వీర రసంపు పోషణయె విద్యయదై యల"రన్"బ్రజాళి ని
    స్సారపు నాటి దుస్థితులె; సాధు"వికెట్టు"ల నేర్చె శాస్త్రమున్(విజ్ఞాన శాస్త్రమును)
    వీరల మూఢ నమ్మికల "విం"తలు బ్రాకెను పశ్చిమంబు న(పాశ్చాత్య దేశాలలో)
    న్వారలు బంచ నా ధృతి సవాలుగ మారెను ;భారతావనిన్
    మీరె తదుక్త(మహాభారతము యొక్క)భాష్యములె మిడ్కగ నాదిమ జీవనంబునన్!

    రిప్లయితొలగించండి
  28. ఆకుల శివరాజలింగంశనివారం, మే 04, 2019 8:11:00 PM

    విద్యానంతర మొనరే
    యుద్యోగము జేయనేమి యుపయోగమనే
    విద్యార్థులుండ తెలుగున
    నధ్యాపక వృత్తి కంటె నధమము

    రిప్లయితొలగించండి
  29. ఆకుల శివరాజలింగంశనివారం, మే 04, 2019 8:17:00 PM

    కందము
    ఘనమగు భాగవతంబును
    మనుజేశుల కంకితమిడ మనసొప్పక పో
    తన యిలవేల్పున కిడె వా
    గ్వనితా లోలుండు వెలిగె పండిత నుతుడై

    రిప్లయితొలగించండి