25, మే 2019, శనివారం

సమస్య - 3028 (కలహమ్ములు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలహమ్ములు గల్గు భువినిఁ గాంతలచేతన్"
(లేదా...)
"కలహము లీభువిన్ గలుగఁ గాంతలె కారణమౌదు రెప్పుడున్"

94 కామెంట్‌లు:

 1. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


  గురుభ్యోనమః నిన్నటి పూరణ మధ్యాక్కర లో‌
  ..........................................................................

  { మొదట కామిని కనులతో రమ్మని ప్రియునకు సైగ జేసెను .

  అతడు ‌దరిజేర‌ లేదు . అపు డామె ప్రియునిపై అలిగి తన

  కాలినూపురము దీసి నేలపై విసరగా అది ఖంగున

  మ్రోగెను . ఆడవారు తమ కోపమును చాలా విచిత్రముగా

  ప్రదర్శించెదరు }  కామిని పాదనూపురము ఖంగున మ్రోగెను ‌ హేతు

  వేమొకో యనుచు యోచించ నేల మందమతివై || మొదట

  కామ రసార్ద్ర మైనట్టి కనులతో సైగయొనర్చి ,

  నా మన్మథేఛ్ఛను దీర్చి , నన్నేలు మనె | మిన్నకుంటి

  వా మన్ను దిన్నట్టి సర్ప మన ‌నీవు | విరహకోపమున

  కాముకి యందియ దీసి ఖంగున నేలపై విసరె ! !

  కోమలి చూపించును తన క్రోధమును విచిత్ర గతిని
  ------------------------------------------------------------------------


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి గారూ,
   మీ మధ్యాక్కర పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. వలపుల మోహము నందున
  కలతలు రేపగ వనితలు కాలా తీతుల్
  మలినపు యోచన జేయగ
  కలహమ్ములు గల్గు భువినిఁ గాంతల చేతన్

  రిప్లయితొలగించండి
 3. అల త్రేతాయుగము మొదలు
  ఇల నేతా యుగము వరకు ఇంతుల కొఱకై
  పలు యుద్ధంబులు జరిగెను-
  కలహమ్ములు గల్గు భువిని కాంతల చేతన్.

  నేతా యుగము = నేటి కలి యుగము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వామన కుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నేతల యుగము' అనండి.

   తొలగించండి
 4. వలదయ్య పరస్త్రీపై
  నిల మోహము వదలవయ్య నీకు దెలువడా?
  వలగొను మంబుజ గర్భుని
  కలహమ్ములు గల్గు భువిని గాంతల చేతన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. యజ్ఞేశ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నీకు దెలియదా' అనండి.

   తొలగించండి
 5. తలలో కోరికలే.. వని
  తలకు నమితముగాను దోచు తగవుకు నవియే
  బలమైన కారణములౌ
  కలహమ్ములు గల్గు భువినిఁ గాంతలచేతన్ ..

  రిప్లయితొలగించండి
 6. తలలో కోరికలే.. వని
  తలకు నమితముగాను దోచు తగవుకు నవియే
  బలమైన కారణములౌ
  కలహమ్ములు గల్గు భువినిఁ గాంతలచేతన్ ..

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మల్లేశ్వర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "..తల కమితముగాను..." అనండి.

   తొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  కలిగెను రామరావణుల కయ్యము జానకి కారణమ్ముగా
  నల కురుపాండుపుత్రుల మహారణమయ్యెను కృష్ణ కారణం..
  బిల ననియండ్రు ! సత్యమదియేని వచింపగవచ్చునీగతిన్
  కలహము లీభువిన్ గలుగఁ గాంతలె కారణమౌదు రెప్పుడున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది.
   మరి మీ (సరదా) పూరణ?

   తొలగించండి
  2. వయసు మీరి ఓపిక తగ్గుతోంది సార్!

   ఆటవిడుపులో ప్రయత్నం చేస్తాను


   🙏

   తొలగించండి
  3. మరో పూరణ..


   బలయుతుడౌను పూరుషుడు , పట్టిన పట్టును వీడబోవడే...
   లలనను మెచ్చునో తన విలాసముకోరి , తదేకదృష్టితో
   తలచుచు పిచ్చివాడగును , తద్దయు యుద్ధము గోరు , నే గతిన్
   కలహము లీభువిన్ గలుగఁ గాంతలె కారణమౌదు రెప్పుడున్ ?!!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  4. మరొక పూరణ..

   శంకరయ్య గారూ.. భారం పెంచినందుకు మన్నించండి🙏

   తెలతెలవారినన్ ముసుగు తీయరదే చరవాణి చేతిలో !
   పలుకరు ! ముద్దు చేయరెదొ భావుకులట్లు నటింతురింక నా..
   వలనను కాదు కాదనెడి భార్యను మేలములాడకున్నచో
   కలహము లీభువిన్ గలుగఁ గాంతలె కారణమౌదు రెప్పుడున్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  5. మైలవరపు వారి పూరణలన్నీ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. చ. అలుగుట స్తీల హక్కు పరిహారము చేయుట భర్తధర్మమౌ
  అలుకలు తీర్చకున్న పరి పాలన కష్టమె జీవితమ్ములో
  చులకన గాదె ప్రాణసఖి క్షోభలు దీరినఁ బ్రేమయాత్రలో
  కలహము లీభువిన్ గలుగఁ గాంతలె కారణమౌదు రెప్పుడున్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర ప్రసాద్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
  2. అలుగుట స్తీల హక్కు పరిహారము చేయుట భర్తధర్మమౌ
   పలుచన చేయకున్న పరి పాలన కష్టమె జీవితమ్ములో
   చులకన గాదె ప్రాణసఖి క్షోభలు దీరినఁ బ్రేమయాత్రలో
   కలహము లీభువిన్ గలుగఁ గాంతలె కారణమౌదు రెప్పుడున్!!

   తొలగించండి
 9. తలపున విషమును జిమ్ము చు
  పలు విధముల చేటు గూర్చు పలుకుల వలనన్
  వలపు లు విడనాడి మెల గ
  కలహమ్ములు కలుగు భువి ని కాంతల చేతన్

  రిప్లయితొలగించండి
 10. కలిగెను యుద్ధము సీతన
  కలిగెను ద్రౌపదిన రణము,కలహములేనా?
  తెలియగ మగవారలకు స
  కలహమ్ములు గల్గు భువినిఁ గాంతలచేతన్"

  హము= సంతోషం

  రిప్లయితొలగించండి
 11. అలుకలునీసునాసయునునందలమెక్కదురాశలోద్ధతుల్
  పలుమరునోర్వజాలమి శుభంబులవెల్లువజాలువార లే
  మలు సిరి యాలమందలును మానవకోటిహితంబుగూర్చ యే
  కలహము లీభువిన్ గలుగ గాంతలె కారణమౌదు రెప్పుడున్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దురాశ లుద్ధతుల్' అని ఉండాలి. అక్కడ గుణసంధి రాదు.

   తొలగించండి
 12. అలసులునోపజాలక రయంబున బల్కుదు రివ్విధిన్నహో
  కలహము లీభువిన్ గలుగ గాంతలె కారణమౌదు రెప్పుడున్
  గలువలబోలుగామినులు కాంతుని వృద్ధికి నిచ్చెనల్గదా
  యలుకలు హావభావములు నాలివలంపుతళత్తళల్లగున్

  రిప్లయితొలగించండి
 13. కలలన్ దేల్చెడు ప్రణయపు
  కలహమ్ములు గల్గు భువిని కాంతల చేతన్;
  కిలకిల నవ్వుచు హృదయము
  పులకింప మరందకంద పూర్ణోదయమై.

  రిప్లయితొలగించండి


 14. అలకయు నదేల చెప్పగ
  కలహమ్ములు గల్గు భువినిఁ గాంతలచేతన్
  విలవిల నేడ్చుటదేల క
  లలచెలి చెప్పను మరల కలతను వదలవే !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. ఇల నీర్ష్యా ద్వేషమ్ముల
  కలహమ్ములు గల్గు భువిని, గాంతలచేతన్
  వలపుల జల్లుల దడుచుచు
  కలతలు భువిలో దొలగెను కాంచగ నెన్నో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ద్వారకానాథ్ గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. ( అంబ తనను నిరాకరించిన సాళ్వునిపై అలుగకపోగా అత్యంత మూర్ఖమతితో గురుశిష్యులకు యుద్ధం తెచ్చింది )
  అలరుచు సాళ్వభూపతికి
  నంతగ నంకితయైన అంబయే
  యలకల జూపినట్టి ఖలు
  డాతని యందున ద్వేషమూనకన్
  బలమగు వైరమున్ నెరపె
  భార్గవ - భీష్ముల మధ్య మూర్ఖతన్ ;
  గలహము లీభువిన్ గలుగ
  గాంతలె కారణమౌదు రెప్పుడున్ .

  రిప్లయితొలగించండి
 17. రిప్లయిలు
  1. మిత్రులందఱకు నమస్సులు!

   కలహ మయెన్ గనన్ ముదిత కారణమై దశకంఠుఁ డీల్గెఁ బో;
   కలహ మయెన్ గదా తరుణి కారణమై కురుపాండవాళికిన్;
   గలహ మయెన్ దివిన్ మగువ కాంక్షను గృష్ణునకున్ బలారికిన్;
   గలహము లీభువిన్ గలుగఁ గాంతలె కారణమౌదు రెప్పుడున్!

   తొలగించండి
  2. మధుసూదన్ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 18. తిలకింపగ నితిహాసము
  మెలతలదగు హ్రస్వదృష్టి మేదిని లోనన్
  పలు రణముల కతమాయెను
  "కలహమ్ములు గల్గు భువినిఁ గాంతలచేతన్"

  రిప్లయితొలగించండి
 19. అల బెంగాలున కాంగ్రెస్
  చిలువలుపలువలుగ చీలె చిక్కులఁబడెగా
  తెలుగున దేశము తెలియగ
  కలహమ్ములు గల్గు భువినిఁ గాంతలచేతన్

  రిప్లయితొలగించండి
 20. కందము
  చెలగుచుఁ జెప్పిరి సరియే
  బలమౌ కారణముఁ జూపి భావించుమనన్
  సులువగుఁ, జెప్పుడి యెటులం
  "గలహమ్ములు గల్గు భువినిఁ గాంతలచేతన్"

  చంపకమాల
  వలువలు విప్పదీయుటయు వారిజనేత్రకు వాంఛితమ్మ? హా!
  చెలగుచు లంకలో నిడుటఁ జెప్పుము కోమలి కోరుకున్నదా?
  సులువగుఁ నిందవేయఁ బరిశోధనఁ జేయక, మూర్ఖమౌ యనం
  "గలహము లీభువిన్ గలుగఁ గాంతలె కారణమౌదు రెప్పుడున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యం చెప్పారు!అభినందనలు!

   తొలగించండి
  2. ధన్యవాదాలు సీతాదేవిగారూ
   🙏🏻☺️

   తొలగించండి
  3. విట్టుబాబు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "మూర్ఖమౌ ననం" అనండి.

   తొలగించండి
  4. ధన్యవాదాలు గురువుగారూ!
   పద సవరణలో ఆగమం గమనించలేదు.
   ☺️🙏🏻🙏🏻

   తొలగించండి
 21. అలనాటి రామ రావణ
  బలజమునకును కురుపాండవ కలనుకైనన్
  లలనలె గద హేతువు గద
  కలహమ్ములుగల్గు భువినిఁ గాంతల చేతన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో 'కద' పునరుక్తమయింది. సవరించండి.

   తొలగించండి
 22. వలలుడు జంపెను కీచకు
  కలతయె జెందెకురురాజు కాంత వలననే
  నెలతయె కారణ మయ్యెను
  కలహమ్ములు గల్గు భువినిఁ గాంతలచేతన్!!

  రిప్లయితొలగించండి
 23. తొలినుండి నమ్ము పదమిది
  ''కలహమ్ములు గల్గు భువినిఁ గాంతలచేతన్''
  వెలువరచకుమీ సత్యము
  లలనామణుల యెదురుంగ , రచ్చ సలుపరే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లలనామణు లెదుట నుండ...' అంటే ఇంకా బాగుంటుంది.

   తొలగించండి
  2. 🙏🏽
   బాగుంది గురువుగారూ . ధన్యవాదములు

   తొలగించండి
 24. బలమైనది మోహమిలను
  వలరాజు వలనుదగులక బ్రతుకగదరమే?
  నలినాక్షుని మాయవలన
  కలహమ్ములు గల్గుభువిని కాంతలచేతన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆర్యా!కాంతల కొరకున్ అంటే మరింత సమంజసముగ నుండునేమో! నమస్సులు!

   తొలగించండి
  2. విలువగు శాస్త్రవాక్యముల వీనులబెట్టక దుష్టసంగతిన్
   కులసతి నీసడించి మది కూరిమితోడను వారకాంతలన్
   గలియగ నేరమెవ్వరిది?కన్నుల గంతలుగట్టి బల్కనౌ
   కలహము లీభువిన్ గలుగ కాంతలె గారణమౌదు రెప్పుడున్!

   తొలగించండి
  3. వలపుల రాజగు నాకని
   కులసతి యనగా విలువగు కొమరుడు నాకున్
   కులముద్ధరింప వలెనని
   కలహమ్ములు గల్గు భువిని కాంతల చేతన్

   మలమల మాడ్చెడి నెండను
   కొళాయిలకడ సతులంత క్యూకట్టంగా
   విలువైన నీటికొరతను
   కలహమ్ములు గల్గుభువిని కాంతలచేతన్

   తొలగించండి
  4. సీతాదేవి గారూ,
   మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  5. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

   తొలగించండి
 25. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  కలహము లీ భువిన్ గలుగఁ గాంతలె
  కారణ మౌదు రెప్పుడున్

  సందర్భము: బిల్వ మంగళుడు మంచి పండితుడు. సంస్కారవంతుడు. చింతామణి యనే వేశ్య యతనిపై మనసుపడినది. సాహితీ కళారాధన పేరిట అతనిని లోబరచుకొన్నది. అత డామెను వీడి యుండలేని పరిస్థితికి వచ్చినాడు. తండ్రి మరణ శయ్యపై నున్నా భార్య మొర పెట్టుకుంటున్నా లెక్క చేయలేదు. ప్రాణాలకు తెగించి గాలివానలో వేశ్యా గృహం చేరుకున్నాడు.
  బలవా నింద్రియ గ్రామో విద్వాంస మపి కర్షతి.. అన్నారు. ఇంద్రియా లెంతటి విద్వాంసు ణ్ణైనా కట్టిపడవేస్తాయి.. అన్నది యథార్థం కదా!
  ఇటువంటి సందర్భాలలోను గృహ కలహాలలోను పురుషునికి యింద్రియ నిగ్రహం లోపించటం కారణం అని చెప్పాలి గాని కాంతలు కారణ మని చెప్పరాదు గదా!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  వెల గల సాని కొంపకును
  వేగమె చేరగ బిల్వమంగళుం
  డల కులకాంతఁ ద్రోసె.. మది
  నారయడే! జనకున్ గణింపడే!
  బలమగు నింద్రియంబులకు
  బానిస గాడె!.. యనంగరా దిటుల్
  "కలహము లీ భువిన్ గలుగఁ
  గాంతలె కారణ మౌదు రెప్పుడున్"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  25.5.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 26. పలుకులుచేష్టలులేకను
  నలుకలతోనిండియుండియఱుపులతోడన్
  గలకలముగల్గజేయుత
  కలహమ్ములుగల్గుభువిని గాంతలచేతన్

  రిప్లయితొలగించండి
 27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 28. తలపుల సీత రూపుగొని దానవ ఱేడు వరించె కయ్యమున్
  వలదని దెల్సి మంత్రమును వాడిన కుంతియె దెచ్చె యుద్ధమున్
  తెలియక దెల్సి నిట్లు తమ తీరు వెలుంగ చరిత్ర జూచినన్
  కలహము లీభువిన్ గలుగఁ గాంతలె కారణమౌదు రెప్పుడున్ ౹౹

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రఘురామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దానవ ఱేడు' అన్నది దుష్టసమాసం. "దానవరాజు" అనండి. 'తెల్సినిట్లు'?

   తొలగించండి
 29. అల నలినాక్షునకును జి
  క్కులు వెక్కులు తప్పలే దుగువు సెడి కాంతుల్
  వలపున దరిఁ జేర ప్రణయ
  కలహమ్ములు గల్గు భువినిఁ గాంతలచేతన్


  కలహపు మాట లేల బలుకంగ నకారణ మివ్విధిన్ సఖా
  నలినదళాక్షు లెంచ భువి నంద విదాయిను లయ్య దొమ్మికిన్
  జల ఖల విత్త శాసన దిశాదులఁ దల్చవె స్వార్థ నిర్దయా
  కల హము లీ భువిం గలుగఁ గాంతలె? కారణమౌదు రెప్పుడున్

  [కల = జీర్ణము కాని; హములు =ఆయుధములు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 30. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కలములు గంటముల్ కదిలి గాభర కొల్పెడు గాథలందునన్
  చలనపు చిత్రముల్ మొదలు జాలము వచ్చిన నేటినాటికిన్
  మలినపు రాజకీయముల మమతలు మాయలు కూడి యాడగా
  కలహము లీభువిన్ గలుగఁ గాంతలె కారణమౌదు రెప్పుడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. * "మలినపు రాజకీయముల మాయలు మమ్తలు కూడియాడగా"

   తొలగించండి
 31. కలహములీభువిన్గలుగగాంతలెగారణమౌదురెప్పుడున్
  బలికిరిమీరుసత్యమగుభాషణమియ్యదిగానెఱుంగుమా
  యలికులవేణిద్రౌపదియునారమసీతయుకారణంబయే
  కలియుగమందున్గలరుకాంతలుకారణభూతులందుకున్

  రిప్లయితొలగించండి
 32. కలకంఠికలతచెందస
  కలజగములుకలవరమునగజగజలాడున్
  చలముకొనుతరుణమందున
  కలహమ్ములుఁగల్గుభువినికాంతలచేతన్ !

  రిప్లయితొలగించండి
 33. తలపోయుతత్వమంతయు
  తలక్రిందలు జేయగలుగు తరణీమణులే
  అలుకలు బూనగ ?పేలును
  కలహమ్ములు గల్గుభువిని గాంతలచేతన్!

  రిప్లయితొలగించండి
 34. ఇలఁగన రామ రావణుల కేలమహారణ మంకురించెనో
  బలజను దేల గల్గె కురుపాండవ వీరులకోయి తెల్పుమా
  వలలుడు నీచ కీచకుల భండన మెందుకు సంభవించెనో
  కలహము లీభువిన్ గలుగఁ గాంతలె కారణమౌదు రెప్పుడున్.

  రిప్లయితొలగించండి
 35. నా ప్రయత్నం :

  కందం
  జ్వలనము పాలయ్మె సతియె
  పిలువని వియ్యాలవారి వేడుకనందున్
  దలఁచ హరునకే కాదయ!
  కలహమ్ములు గల్గు భువినిఁ గాంతలచేతన్

  చంపకమాల
  చెలియకు పారిజాతమును చేరగ వేసిన కృష్ణమూర్తికా
  యలుకల సత్యయే పొగిలి యాలము నింద్రుని తోడ బూన్చెనే
  దలఁచ సురాళికే కలత దప్పక జేయఁగ గిల్లికజ్జముల్
  కలహము లీభువిన్ గలుగఁ గాంతలె కారణమౌదు రెప్పుడున్

  రిప్లయితొలగించండి
 36. ఇల నెంచిన ధర్మ ము కున్ కలతలు గలుగంగ కలహ కారణ మొద వున్ ,తెలివిని వారే మెరుగవ,కలహ మ్ము లు గ ల్గు భువిని గాంతల చే తన్
  డా
  పిట్టా సత్య నారాయణ

  రిప్లయితొలగించండి