5, మే 2019, ఆదివారం

సమస్య - 3008 (కుడ్యముపై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుడ్యముపై నున్న తేలు కుట్ట దెవారిన్"
(లేదా...)
"కుడ్యము మీఁది వృశ్చికము కుట్ట దెవారిని ముట్టి చూచినన్"

51 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  ఈడ్యపు మాట పల్కితిరి యెన్నికలందున శంకరార్య వే
  జాడ్యము లేమి రావుగద చక్కగ వోట్లకు నోట్లు పుచ్చుచున్
  వీడ్యము నోట గ్రుక్కుచును విందును జేయగ చేతి కర్రతో,
  కుడ్యము మీఁది వృశ్చికము కుట్ట దెవారిని, ముట్టి చూచినన్

  ఈడ్యము = పొగడదగినది
  వీడ్యము = తాంబూలము
  (ఆంధ్రభారతి నిఘంటువు)

  రిప్లయితొలగించండి
 2. నిన్నటి సమస్యకు పూరణ.

  ప్రాపు నొసంగు వృత్తి యిదె భార్యసుతాదులపోషణార్థమై,
  యా పరమేశుడైన గురువా! యని పిల్వ ప్రశంసనీయమౌ
  యీ, పరమార్థదాయిని విహీనమటందువె, యే విధమ్ము న
  ధ్యాపక వృత్తి కంటె నధమాధమమైనది గల్గ దెద్దియున్?.

  రిప్లయితొలగించండి
 3. ఈడ్యపు చిత్రమ్మొకటిని
  జాడ్యము గలవాడు గాంచి జడవగ సతియే
  వీడ్యమ్మిచ్చుచు తెలిపెను
  కుడ్యము పై నున్న తేలు కుట్ట దెవారిన్

  రిప్లయితొలగించండి
 4. కుడ్యములు పంచ విధములు
  ఈడ్యము జేయంగ నేడు నెలమిన్ గాదే
  వీడ్యము మోదము నీయగ
  కుడ్యముపై నున్నతేలు కుట్ట దెవారిన్

  రిప్లయితొలగించండి
 5. మౌఢ్యమి దినమలు చూడగ,

  కుడ్యము పైనున్న తేలుకుట్టదెవారిన్,

  పాడ్యమిన. ఫణి కరవదను

  జాడ్యము వలదు ,కరచును జంతువు లెపుడున్


  చాదస్తపు తండ్రి కి కొడుకు తెలుపు సందర్భంలో

  రిప్లయితొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  దుర్యోధనుడు.. దుష్టత్రయముతో సమాలోచన...

  ఈడ్యము యుద్ధమే ! రిపులనెన్నగ మువ్వురె ముఖ్యు , లందులో
  జాడ్యము మెండు భీమునకు చాలును భోజ్యములాశజూపగా !
  రాడ్యతిఁ గ్రీడి గెల్చును సరాసరి కర్ణుడు ! ధర్మరాజనన్
  కుడ్యము మీఁది వృశ్చికము కుట్ట దెవారిని ముట్టి చూచినన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 7. పాడ్యమి దినమున నొక్కఁడు
  వీడ్యము నోటం బిగించి ప్రీతి లిఖించెన్
  జాడ్యమ్ము లేక కుంచెను;
  కుడ్యముపై నున్న తేలు కుట్ట దెవారిన్.

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. పాడ్యమి దినమున కట్టుచు
  కుడ్యముపై తేలుబొమ్మఁ గూర్చగ మేస్త్రీ
  జాడ్యమనె తండ్రి, బుడతనె
  కుడ్యముపై నున్న తేలు కుట్ట దెవారిన్

  రిప్లయితొలగించండి
 10. మిత్రులందఱకు నమస్సులు!

  [అసలే రోగంతో నున్న సంగయ్యగారు చక్కగా పోయి కల్లు త్రాగారు; ఆపైన నోట్లో జర్దా పాన్ బిగించారు; తూలుతూ నడుస్తున్నారు. వీరికి పోయేకాలం వచ్చిందని కోపించిన యమరాజు ఆజ్ఞతో, చెట్టుకిందినుండి పోతున్న వీరిని ఒక దయ్యం పట్టింది. ఎలాగోలా ఇంటికి పోయిన సంగయ్యగారు గోడమీది తేలును ముట్టిచూశారు...అయ్యో అది కుట్టకుండా వుంటుందా...కుట్టింది మఱి...యమునాజ్ఞయేనాయె....అదీ కథ!]

  జాడ్యముతోడఁ దల్లడిలు సంగయ చక్కఁగఁ గల్లుఁ ద్రావియున్
  వీడ్యము నోటఁ బెట్టియును బెద్ద మహీజము క్రింద నుండి పోన్
  రాడ్యము నాజ్ఞతోడ నట రక్తప మొక్కటి పట్ట, నింటిలోఁ
  గుడ్యము మీఁది వృశ్చికము కుట్టదె వారిని ముట్టి చూచినన్?

  రిప్లయితొలగించండి
 11. కుడ్యముపై చెక్కెనుగా
  యడ్యూరప్ప యను శిల్పి యట వృశ్చికమున్
  జాడ్యములు దొలగు తాకగ
  కుడ్యముపై నున్న తేలు కుట్ట దెవారిన్
  **)()(**
  (దేవళము గోడపై చెక్కిన తేలుబొమ్మను తాకితే వ్యాధు పోతాయని నమ్మకము)

  రిప్లయితొలగించండి
 12. కందము
  మౌఢ్యమి నందున జీవులు
  జాడ్యముతో నుండు నని యొక జడుడు దలంచెన్
  పాడ్యమి నందున ముట్టగ
  కుఢ్యము పైనున్న తేలు కుట్ట దె వారిన్
  ఆకులశివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి
 13. ( చిత్రకళామందిరంలో లకుమాదేవి నాట్యం -
  కర్పూరవసంతరాయల పారవశ్యం )
  నాట్యమొనర్చుచున్న దదె
  నర్తకి సుందరమందిరమ్మునన్ ;
  వీడ్యము బుగ్గ నుంచుకొని
  ప్రేమగ గాంచు వసంతరాయలే
  యీడ్యము నైన చిత్రకళ
  యెంతయొ నిండిన గోడకానగన్ ;
  గుడ్యము మీది వృశ్చికము
  కుట్త దెవారిని ముట్టి చూచినన్ .
  (ఈడ్యము - పొగడదగినది , వీడ్యము - తాంబూలము )

  రిప్లయితొలగించండి
 14. పాడ్యమి పెండ్లిరోజనుచు భర్తకు ప్రీతిగ జెంత జేరి తా
  వీడ్యము లందజేయు తరి విజ్ఞుడు భీతిలె దృష్టిలో పడన్
  గుడ్యము మీద వృశ్చికము కుట్టదెవారిని ముట్టిజూచినన్
  న్నీడ్యపు చిత్రకారుడట నింపుగ గీచిన చిత్రమే యనెన్.

  రిప్లయితొలగించండి
 15. ఈడ్యాపూజ్యా రంగా
  కుడ్యముపై నున్న తేలు కుట్ట దెవారిన్
  జాడ్యాంధకార నీపద
  తాడ్య మహిమ రంగపురము తావిషముగనన్

  రిప్లయితొలగించండి
 16. జాడ్యము . వచ్చిన మనుజుడు
  వీ డ్యము సేవించు చనె ను వెక్కస ము గ నే
  పాడ్యమి దిన మున నెట్టు ల
  కుడ్య ము పైనున్న తేలు కుట్టెను వారిన్?

  రిప్లయితొలగించండి
 17. శ్రీ గురుభ్యోన్నమః🙏

  స్త్రీ లోలత ఎంతటి వారికయినా తగదని వారించే ప్రయత్నముతో నా పూరణ:

  నడ్యాల వెంట దిరుగగ
  జాడ్యము జిలిపిది తగలగ జచ్చిరి జనులున్
  చేడ్యల నితరుల జేరకు
  కుడ్యముపై నున్న తేలు కుట్టదె వారిన్?

  నడ్యా-కిక్కిసపు వామి;గడ్డివామి
  చిలిపి జాడ్యము - సుఖరోగము
  చేడియ - చేడ్య(నా ప్రయోగం) - పడతి

  రిప్లయితొలగించండి
 18. మౌఢ్యము వీడి మారుచును మార్గము దప్పక గూడుజేరి ఆ
  పాడ్యమి నుండి తేనెలను బట్టుచు పౌర్ణమి నాడుజుఱ్ఱుటన్
  ఈఢ్యము గాదె ఈగలకు ఈశ్వరు డిచ్చిన జ్ఞానమున్ జలా
  కుడ్యము మీది వృశ్చికము కుట్టదె వారిని ముట్టి చూచినన్.

  రిప్లయితొలగించండి
 19. రెండు పూరణములలోను “కుట్టదె” గా గ్రహించక తప్పలేదు. లేనిచో “ఎవారిన్” సంశయాత్మక పద ప్రయోగము బాధించునని భయపడుచున్నాను.


  కుడ్యము నెక్కఁగఁ దగునే
  బాల్యపుఁ జేష్ట లవి యేల వారక యట్లుం
  బాడ్యమి నాఁ డేల దుడుకు
  కుడ్యముపై నున్న తేలు కుట్టదె వారిన్


  ఈడ్యపుఁ గావ్య సంచయము నెవ్వరు మెచ్చక యుందు రెంచఁగన్
  విడ్యము వేయ నాలుకయు వింతగఁ బండదె యెట్టి వారికిన్
  జాడ్యము రాఁగ నీయరె విచారము సేసి శుభంపు మందులం
  గుడ్యము మీఁది వృశ్చికము కుట్టదె వారిని ముట్టి చూచినన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాల. వ్యా. ఆచ్ఛిక. 24. అన్ని ప్రభృతులు సర్వనామంబులు.
   యత్కిమర్థకము: మహదర్థము: ద్వితీయ:
   ఏరిని
   ఏవారిని, ఏవారలను, ఏవాండ్రను
   ఎవ్వారిని, ఎవ్వారలను, ఎవ్వాండ్రను
   ఎవ్వరిని, ఎవ్వండ్రను
   ఎవరిని, ఎవండ్రను

   తొలగించండి
  2. ఆర్యా నమస్సులు కందంలో‌రెండవ పాదము ప్రాస కొద్దిగా పరశీలించండి

   తొలగించండి
  3. అభేద ప్రాస -
   ‘లళయో రభేదః, లడయో రభేదః’ అనే సూత్రాల వలన లళడలు అభేదాలు కనుక వానికి పరస్పరం ప్రాసమైత్రి చెల్లుతుంది.


   తొలగించండి
  4. క్షమించండి కొత్త. విషయము నేర్చుకున్నాను అన్యధా తలచవద్దు

   తొలగించండి
 20. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ఈడ్యపు మాట పల్కితిరి యెట్టుల మెచ్చెద శంకరార్య వే
  జాడ్యము లేమి రావుగద చక్కగ దుర్భిణి చేతబూనుచున్
  వీడ్యము నోట గ్రుక్కుచును విందును జేయుచు, నంతరిక్షమన్
  కుడ్యము మీఁది వృశ్చికము కుట్ట దెవారిని; ముట్టి చూచినన్


  అంతరిక్ష వృశ్చికము = Scorpio Constellation (వృశ్చిక రాశి)
  ఈడ్యము = పొగడదగినది
  వీడ్యము = తాంబూలము
  (ఆంధ్రభారతి నిఘంటువు)

  రిప్లయితొలగించండి
 21. ఈడ్యఫణాంతరమ్మున ఫణీంద్రవిషమ్ము, పృదాకుపుచ్చమం
  దాఢ్యవిషమ్ము లొప్పగ ప్రయత్నకృతమ్మున హానికారియౌ
  తాడ్యవిఘాత్యజీవివిషదాంగము దీసిన హాని
  కాదటుల్
  కుడ్యము మీఁది వృశ్చికము కుట్ట దెవారిని ముట్టి చూచినన్.

  పృదాకు = తేలు.

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురము.

  రిప్లయితొలగించండి
 22. మౌఢ్యముగాక మరేమది
  జాడ్యముపోగొట్టనీయుజంతువుబలులన్ ?
  ఈడ్యపు శిల్పి మలచినను
  కుడ్యముపై నున్న తేలు కుట్ట దెవారిన్.

  రిప్లయితొలగించండి
 23. కుడ్యము కావలి గదిలో
  వాద్యపు ధ్వనులను విని యది పాడునదెవరో
  చోద్యమ్ము జూడ నెక్కగ
  కుడ్యముపై నున్న తేలు కుట్టదె వారిన్ :-)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. (సరదా ప్రయత్నం)
   పద్యములన్న మక్కువగ పాఠము నేర్తు మటంచు జేరగా
   చోద్యము మీ సమస్య నిటు జూడగ పూరణ కష్టమాయెగా
   కుడ్యము మీఁది వృశ్చికము కొత్త సమస్యయె బృందమంతకున్
   కుడ్యము మీఁది వృశ్చికము కుట్ట దెవారిని ముట్టి చూచినన్ :-)

   తొలగించండి


 24. ఆవు పై వ్యాసం :)


  కుడ్యంబదిగో చూడుము
  కుడ్యంబనగా జిలేబి గోడయగునహో
  కుడ్యమును గెలుక గా నా
  కుడ్యముపై నున్న తేలు కుట్టదె వారిన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. శంకరాభరణం సమస్య - 93

   "చందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్"   Chandrayan - 10
   (our upcoming Moon Mission)

   హిందూ దేశపు ఘనులట
   చందురులో జింకనుగొని చకచక తేగా
   విందును జేయుచు వెఱ్ఱిగ
   చందురులో నిఱ్ఱి నేలచంగలి మేసెన్

   తొలగించండి
 25. మౌఢ్యముచే తంధుండై
  "కుడ్యముపై నున్న తేలు కుట్ట దెవారిన్"
  రూఢ్యైనటు లిట్లనిన బ
  లాఢ్యునిదౌ వ్రేలు కుట్టె లాంగూలముచేన్౹౹

  రిప్లయితొలగించండి
 26. ఈడ్యమది చూడ శిల్పము
  పాండ్యుల నాటిదిగఁ దోచుఁ,బడతికిఁ సర్ప
  మ్మోడ్యాణమళులు కమ్మలు
  కుడ్యముపై నున్న తేలు కుట్ట దెవారిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. జాడ్యపు బుద్ధి పెచ్చరిలె,
   జాగృతి లేదెట, కృష్ణపక్షపున్
   పాడ్యమి నాటి వెన్నెలగ
   భాసిలు ధర్మము తగ్గుచుండెగా!
   కుడ్యము పైన పిల్లులను
   కూలత జూడగ,కోర్టు బొమ్మ యౌ
   కుడ్యము మీఁది వృశ్చికము, కుట్ట దెవారిని ముట్టి చూచినన్

   తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  4. జాడ్యాంధ కార మగ్నపు
   పాడ్యమి రాజైన రాజు వర్ధిల్లున్ సం
   పీడ్యత, రాజా? బొమ్మగ
   కుడ్యముపై నున్న తేలు, కుట్ట దెవారిన్.

   తొలగించండి
 27. కుడ్యపు ప్రాంగణమందున
  కుడ్యపు పరిసరములందు కోడ్మూరందున్
  కుడ్యమునందేగాకను
  కుడ్యముపైనున్న తేలుకుట్టదెవారిన్!
  (కర్నూలు జిల్లాకోడుమూరందునీశ్వరుని దేవాలయానతేళ్లతోపూజలు జేయుటవింతే!తేలుకుట్టదు చిన్నపిల్లలు పట్టుకొందురు తేలును.నమ్మేనిజము)

  రిప్లయితొలగించండి
 28. ఉత్పలమాల
  జాడ్యము యింటి పెద్దకని చక్కఁగ వాస్తుకు నింటిగోడలన్
  మౌఢ్యము దాటినంతటనె మార్చిన దోషము వీడునంచనన్
  పాడ్యమి దివ్యమంచు పరిపాటిగఁ గూల్చఁగ వ్రాత మారునే?
  కుడ్యము మీఁది వృశ్చికము కుట్టదె వారిని ముట్టిచూచినన్?

  రిప్లయితొలగించండి
 29. పిట్టా సత్యనారాయణ
  ఆఢ్యులు "మీడియా"పరులు,యం(అం)టుకొనన్ సరి తేలు కైవడిన్
  జాడ్యమదేమొ "యీ ప్రభుత చక్కన పాలన యంద"టంచు వే
  పాడ్యపు చీకటుల్ మలిచి బార్చగబోరు విషాళి -తోకనున్
  "కుడ్యము మీది వృశ్చికము(గోడమీది పిల్లివలె)కుట్ట దెవారిని ముట్టి జూచినన్

  రిప్లయితొలగించండి
 30. డా.పిట్టా సత్యనారాయణ
  ఆఢ్యులు సిమెంటు నంటన్
  పాడ్యమి చీకటిని బొడిపె పడ వృశ్చికమౌ(Scorpion shades in a lantern light)
  జాడ్యమె మృగ్యము నగిషీ
  కుడ్యము పై నున్న తేలు కుట్ట దెవరినిన్

  రిప్లయితొలగించండి
 31. డా.పిట్టా సత్యనారాయణ
  ఆఢ్యుడహింసనున్నెరపి యైదవ జన్మన వృశ్చికంబయెన్
  పాడ్యమి చీకటిన్ గనగ బారె సిమెంటును గొన్న గోడపై
  జాడ్యమదేమొ చేరుకొన జాలడు ;ప్రాకగ దో(తో)క సాయమౌ
  కుడ్యము మీది వృశ్చికము కుట్టదెవారిని ముట్టి చూచినన్

  రిప్లయితొలగించండి
 32. డా.పిట్టా సత్యనారాయణ
  ఆఢ్యుడహింసనున్నెరపి యైదవ జన్మన వఠృశ్చికంబయెన్
  పాడ్యమి చీకటిన్ గనగ బారె సిమెంటును గొన్న గోడపై
  జాడ్యమదేమొ? చేరుకొన జాలడు ప్రాకగ దో(తో)క సాయమౌ
  కుడ్యము మీది వృశ్చికము కుట్ట దెవారిని(ఎవ్వరినీ),ముట్టి జూచినన్😢

  రిప్లయితొలగించండి