20, మే 2019, సోమవారం

సమస్య - 3024 (కావ్యమ్మును వ్రాసి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కావ్యమ్మును వ్రాసి తీయఁగా నగు నుసురుల్"
(లేదా...)
"కావ్యము వ్రాసి తీయనగుగాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ"

83 కామెంట్‌లు: 1. నవ్యత తొణికిసలాడగ
  సవ్యము గా తెలుపుచున్ పసందు తెనుగులో
  నవ్యాజమైన పేర్మిని
  కావ్యమ్మును వ్రాయ తీయఁగా నగు నుసురుల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. జిలేబి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'వ్రాసి' టైపాటు.

  రిప్లయితొలగించండి


 3. సవ్యము గాన ఛందమున చక్కగ కూర్చుచు భావజాలమున్
  దివ్యముగా ప్రకాశమగు తీయటి తెన్గున తేట తెల్లగా
  నవ్యత తోడు పేర్మిని జనాళికి నచ్చెడు కైపులద్దుచున్
  కావ్యము వ్రాసి తీయనగుగాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ!  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. ప్రాతః కాలపు సరదా పూరణ:

  భావ్యము కాదు నేతలకు బంగరు కోరుచు నంకితమ్మిడన్
  ద్రవ్యము ధారవోయుచును దండుగ మాలిన ముద్రణేలయా?
  ఏ వ్యధ లేక నీవు భళి యెన్నుచు బ్లాగున జాలమందునన్
  కావ్యము వ్రాసి తీయనగుగాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ

  రిప్లయితొలగించండి
 5. భావ్యము గాదట కవులకు
  కావ్యమ్మును వ్రాసి తీయఁ గా నగు నుసురుల్
  శ్రావ్యము సంగీత మనగ
  సేవ్యము జేయగ సురలను శుభమే కలుగున్

  రిప్లయితొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  నవ్యపదప్రయోగనిపుణప్రతిభాపరిపూర్ణమైన స...
  త్కావ్యము వ్రాసినన్ వినిన ధన్యము జన్మ , పఠించినంతనే
  దివ్యసుఖమ్ము గల్గును మదిన్ , మరి నీవెటులంటివీగతిన్
  "కావ్యము వ్రాసి తీయనగుగాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ" !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి అధిక్షేపాత్మక పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 7. దివ్య మనోహర ఫణతిని
  నవ్యత లొ ప్పా ర మిగుల నాణ్యత తోడ న్
  సవ్య త తొణికిస లా డ గ
  కావ్య మ్మును వ్రాసి తీయ గా నగు నసు రు ల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాల్గవ పాదం చివర నుసు రు ల్ అని సవరణ చేయడమైనది

   తొలగించండి
  2. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నవ్యత' శబ్దం పునరుక్తమయింది.

   తొలగించండి
 8. సవ్యపు పదములతోడుత
  కావ్యమ్మును వ్రాసి తీయఁగా నగు నుసురుల్
  భవ్యమనస్కులయి కడు
  దివ్యపు గ్రంథమును వ్రాయ తిరయశ మొదవున్
  సవ్యము: ప్రతికూలము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తిర యశము' అన్నది దుష్టసమాసం. "స్థిర యశము" అనండి.

   తొలగించండి
 9. శ్రావ్యమ్మగు పాటలతో
  భావ్యమ్మే చెలియ నాదు ప్రాణాల్ తోడన్
  సేవ్యమ్మౌ శాశ్వతమౌ
  కావ్యమ్మును వ్రాసి తీయఁగా నగు నుసురుల్

  రిప్లయితొలగించండి
 10. ( పోతనార్యుని భాగవతాన్ని తిలకిస్తేనే మన ప్రాణాలు
  మాధుర్యధుర్యా లవుతాయి )
  భవ్యములైన తొమ్మిదగు
  భక్తుల గూర్చిన పాఠకాళిసం
  సేవ్యుడ ! పోతనా ! కవిశ
  శీ ! చరితార్థుడవైతివీ మహా
  కావ్యము వ్రాసి ; తీయనగు
  గాదె ! రసజ్ఞుల ప్రాణముల్ కవీ !
  దివ్యము ; జ్ఞానశోభితము ;
  దీప్తము ; భాగవతమ్ము గాంచినన్ .
  ( భవ్యములు - యోగ్యములు ; దీప్తము - ప్రకాశించునది )

  రిప్లయితొలగించండి
 11. సేవ్యము భారతీచరణ చిత్కమలామృత పాన భాగ్యముల్
  భావ్యము దివ్య గాస విభవాంచిత శిల్పకళా విలోలముల్
  ఆ,వ్యతిరిక్త,దోష,విషమాన్విత,ఛీత్కృత,పద్యయుక్తమౌ
  కావ్యము వ్రాసి తీయనగుగాదె రసజ్ఞులప్రాణముల్ కవీ!

  రిప్లయితొలగించండి
 12. http://epaper.newindianexpress.com/m5/2161837/The-New-Indian-Express-Hyderabad/20-05-2019#page/4/1

  రిప్లయితొలగించండి
 13. గురువు గారి ఇంటర్వ్యూ ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో......

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చాల బాగున్నదండీ!అభినందనలు,ధన్యవాదములు!

   తొలగించండి

  2. Super ! Probably first ever exposure to Sankarabharana group on National English media

   Thanks Bala to bring this to forefront.   Cheers
   జిలేబి

   తొలగించండి
  3. బాలకృష్ణ గారూ,
   ధన్యవాదాలు. నిన్న కార్యక్రమపు హడావుడిలో మీతో ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను.

   తొలగించండి
 14. డా.పిట్టా సత్యనారాయణ
  భావ్యమె సాంఘిక నేరాల్
  శ్రావ్యముగా బాడి దురితు రాపిడి జెలగ
  న్నవ్యయ గీతము పద్యపు
  కావ్యమ్మును వ్రాసి తీయగానగు నుసురుల్

  రిప్లయితొలగించండి
 15. డా.పిట్టా‌సత్యనారాయణ
  భావ్యమె జెల్ల దుర్గుణము భావనకై తెగద్రాగి వ్రాయుటల్?
  సవ్యముగాని జీవికలు సాధనలే రచనా ప్రగల్బముల్
  అవ్యయమౌ ప్రచారముల నందెడు కీర్తులకైన మోజుపై
  కావ్యము వ్రాసి తీయనగు గాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ!

  రిప్లయితొలగించండి
 16. నవయుగ కవిచక్రవర్తి శ్రీ గుర్రం జాషువాగారికి సభక్తికంగా

  సవ్యముగానివౌ కులపు ఛాందసవృత్తుల బీరువోకనే
  నవ్యపు రీతిగన్నెదిరి నగ్నపుతీరుగ నెండగట్టుచున్
  భావ్యమె వేదనాభరిత భగ్నపుమానస క్షోభలీగతిన్
  కావ్యమువ్రాసి తీయనగుగాదె రసఙ్ఞుల ప్రాణముల్ కవీ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నవ్యతపేరున నేర్పుగ
   భవ్యపు రామాయణమును భ్రష్టముజేయన్
   భావ్యముగాని విధమ్మున
   కావ్యమును వ్రాసి తీయగానగు నుసురుల్

   తొలగించండి
  2. కావ్యమ్మును గా చదువ ప్రార్ధన!

   తొలగించండి
  3. సీతాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

   తొలగించండి
 17. నవ్యత యొప్పెడు రీతిని
  సవ్యముగా కృతి రచింప సరసగతులతో
  భావ్యమ్మే యిటు పలుకుట?
  "కావ్యమ్మును వ్రాసి తీయఁగా నగు నుసురుల్"

  రిప్లయితొలగించండి
 18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 19. దివ్యంబౌ యాలోచన
  సవ్యముగా వచ్చెనాకు సరసపు గతిలో
  నవ్యయ పదముల తోడనె
  *"కావ్యమ్మును వ్రాసి తీయఁగా నగు నుసురుల్"*

  రిప్లయితొలగించండి
 20. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సవ్యమ్మగు పథము లొసగి
  దివ్యముగా సంఘ మెపుడు దీపిలు నటులన్
  నవ్యమ్మగు బోధనతో
  కావ్యమ్మును వ్రాయ తీయగానగు నుసురుల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దీపించునటుల్' అంటే ఇంకా బాగుంటుంది కదా?

   తొలగించండి
 21. మిత్రులందఱకు నమస్సులు!

  [ప్రాచీన కాలంనుండీ సంప్రదాయానుసారంగా నిర్మింపఁబడుతున్న కావ్య లక్షణా లేవీ తెలియని ఒక ఆధునిక కవి, తాను మూడంగా నమ్మినవీ, కావ్య లక్షణాలకు లొంగనివీ ఐన కొన్ని ఆధునికమైన భావాలను ఆసరాగాచేసుకొని ప్రబంధం నిర్మిస్తానని ఒక కవితో అనగా, ఆ కవి ఈ కవికి ఇలాంటి కావ్యం రాయవద్దనీ, రాసి రసజ్ఞుల్ ప్రాణం తీయవద్దనీ సలహా ఇస్తున్న సందర్భం]

  భావ్యమె నీకుఁ బుస్తకము వ్రాయ? నెఱుంగవు కావ్య సూత్రముల్!
  నవ్య విధమ్మటంచు నెద నమ్మిన నీ వ్యవహార కౢప్తికిన్
  సవ్య ప్రబంధ రీతియె ప్రశంస నొసంగునె? మానుమయ్య! నీ
  కావ్యము వ్రాసి తీయనగుగాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ!

  రిప్లయితొలగించండి
 22. భవ్య మెరుగకుండగ నప
  సవ్యముగ పలుకుచు కవుల సత్తువ నెదురన్
  భావ్యముగ నెంచి పేరగు
  కావ్యమ్మును వ్రాసి తీయఁగా నగు నుసురుల్

  రిప్లయితొలగించండి
 23. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సవ్యత జూపు చందమున సంఘము నిచ్చలు వృధ్థినొందగా
  నవ్యత గూడి నట్టివగు నాణ్యపు భావము లేర్చి కూర్చుచున్
  దివ్యములై చెలంగు సరి తీర్పులు చాటుచు నిబ్బరించునౌ
  కావ్యము వ్రాసి తీయనగు గాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ!

  రిప్లయితొలగించండి
 24. అవ్యాజకరుణజూపుచు
  నవ్యతదాగోచరించునాణ్యతకరువై
  భవ్యతలేనివిధంబుగ
  కావ్యమ్మునువ్రాసితీయగానగునుసురుల్

  రిప్లయితొలగించండి
 25. భవ్యముగా నొక కమ్మని
  కావ్యమ్మును వ్రాసి తీయగా నగును, సురుల్
  నవ్యమ్మితని ప్రతిభ యని
  దివ్యంబుగ కీర్తి నొంద దీవనలీయన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నగును = నవ్వును అనే అర్ధంలో

   తొలగించండి
  2. సూర్య గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని 'దేవతలు' అనే అర్థంలో 'సురల్' అనడం సాధువు.

   తొలగించండి
  3. సురి = దేవతా స్త్రీ; సురుల్ = దేవతా స్త్రీలు.

   తొలగించండి
 26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 27. భవ్యతలేకయుండగనుభావమునింపుగలేనియట్టియా
  కావ్యమువ్రాసితీయనగుగాదెరసఙ్ఞులప్రాణముల్కవీ!
  శ్రావ్యపుకావ్యముల్రచనసర్వులుగోరుదురెల్లవేళలన్
  గావ్యములెప్పుడున్దనరుగాదెరసఙ్ఞులచేతనొప్పుచున్

  రిప్లయితొలగించండి
 28. సేవ్యమ్ములు సుర గణ సం
  భావ్యమ్ములు విష్ణు పాద పద్మమ్ములు త
  ద్దివ్య చరణాబ్జ వర్ణన
  కావ్యమ్మును వ్రాసి తీయఁగా నగు నుసురుల్

  [ఉసురు =ఉస్సురు = నిట్టూర్పు ధ్వని]


  దివ్యపు టస్త్ర జాలములుఁ దీక్ష్ణ కఠారము లేల విస్తృ తా
  భవ్య పదార్థ హీనతర భావ సమేత సు దారు ణోపమా
  నావ్యయ ఘోరముల్ కవిత లల్లి మనోవ్యయ కార కాభమౌ
  కావ్యము వ్రాసి తీయనగుఁ గాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు దివ్యంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 29. సవ్యము గాని పద్ధతుల శాస్త్రము లొప్పని వింత రీతులన్
  శ్రావ్యత లేని పాటలను స్వంతము గానిటు పాడ బూనుటన్
  భావ్యమె నీకు మమ్ములను బాధలు పెట్టుట నింత కన్న నో
  కావ్యము వ్రాసి తీయనగుగాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ

  రిప్లయితొలగించండి
 30. భావ్యమ్మే హరి వర్జిత
  కావ్యమ్మును వ్రాసి తీయగానగు నుసురుల్?
  నావ్యము భవసాగర మను-
  భావ్యము లోకేశు మనకు భారతి పుత్రా!

  నావ్య=ఓడ చేత దాటదగినది
  అనుభావ్యము= సేవింప దగినది

  రిప్లయితొలగించండి
 31. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ద్రవ్యము లేక యిల్లరిక దాసుని రీతిని ప్రొద్దుపుచ్చుచున్
  భావ్యమ భావ్యమెంచకయె పండుగ పూటను నస్యమున్ కొనన్
  సేవ్యపు మోమునున్ పొగిడి చిల్లర కర్చుల కత్తగారిపై
  కావ్యము వ్రాసి తీయనగుగాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఇల్లరికపు దాసుని' అనడం సాధువు.

   తొలగించండి
 32. శ్రావ్యఁపుగానమాధురులుసంశ్రవణమ్ములవిందుజేయు సం
  భావ్యము చిత్రలేఖనము భవ్యముగాఁనలరింప చిత్తమున్
  నవ్యపుపోకడల్ గదుర నవ్యసమాజముదీప్తివంతమౌ
  కావ్యము వ్రాసి తీయనగుగాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ

  రిప్లయితొలగించండి
 33. సవ్యమగు కావ్యమెప్పుడు
  నవ్యయు జేరగ నుతింప నవసరము గదే
  ద్రవ్యాపేక్షను గలిగిన
  కావ్యమ్మును వ్రాసి తీయగానగు నుసురుల్

  రిప్లయితొలగించండి
 34. నా ప్రయత్నం :

  కందం
  నవ్యపథమ్మున మెరయన్
  కావ్యమ్మును వ్రాసి, తీయఁగా నగు నుసురుల్
  భవ్యమ్మగు స్ఫూర్తి నొసఁగ
  సవ్యమ్ముగ వ్రాయవచ్చు సద్గ్రంథములన్

  ఉత్పలమాల
  భవ్య మనోఙ్ఞ భావనల వంకలు బెట్టఁగఁ దావులేదనన్
  నవ్యపథమ్మునన్ మెరయ నల్గురు మెచ్చెడు గాథనెంచుచున్
  శ్రావ్య గళమ్మునన్ లయల రంజిల పాడఁగ నొప్పు రీతిగన్
  కావ్యము వ్రాసి, తీయనగుగాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ!

  రిప్లయితొలగించండి
 35. కావ్యమురచియించి తగు
  శ్రావ్యమ్ముగ బాడినపుడె? సంతోషమిడున్!
  దివ్యత్వమ్మును బొందును!
  కావ్యమ్మును వ్రాసి తీయగానగును సురుల్

  రిప్లయితొలగించండి
 36. దివ్యమ్మౌ కృతులెన్నియొ
  నవ్యత కొరకై రచించినారుగద కవుల్
  భావ్యము కాదిట్టు పలుక
  కావ్యమ్మును వ్రాసి తీయగా నగు నుసురుల్.

  రిప్లయితొలగించండి
 37. సవ్యపు మార్గమందు తన జాతికి జాగృత మందజేయగన్
  కావ్యము వ్రాసిమేల్కొలిపె కావ్య ప్రదాత నంటివీ విధిన్
  కావ్యము వ్రాసి తీయనగు గాదె రసజ్ఞుల ప్రాణముల్, కవీ
  భావ్యము గాదు మీరిటుల పల్కుట పాపము మూటగట్టుటే.

  రిప్లయితొలగించండి
 38. నవ్యత గల కవితల భవి
  తవ్యమె సుందరమయమగు, ధారణతోడన్
  సవ్యముగవ్రాసెడు,కవుల
  కావ్యమ్మును వ్రాసి తీయఁగా నగు నుసురుల్!!

  రిప్లయితొలగించండి