ప్రాతః కాలపు సరదా పూరణ: చేడియ గొప్పగా పలికి చిందుచు నవ్వులు చేతులెత్తుచున్ దాడిని జేయగా మురిసి దండము లిచ్చుచు పైకినెత్తుచున్మోడిని స్వీకరించనని మొండిగ దీదిని నెన్నబోకెటుల్ గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్?
ప్రభాకర శాస్త్రి గారూ,వ్యంగ్యాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
ఏడికి బోయెద జముడా వేడుక మీరగ వరమని ప్రియుడే బ్రతుకన్ నేడిట నిలలో సాద్వికి గాడిద కాల్పట్ట మోక్ష గతి లభ్యమగున్
అక్కయ్యా,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'సాధ్వికి' టైపాటు.
మైలవరపు వారి పూరణ ఆడది శక్తిరా ! యనిన ఆఁ అది ఒట్టిదటంచు బల్కి , వెం... టాడితి , చూడు రక్షకభటాలయవాసివి ఐతివిప్డిటుల్చూడకు జాలిగా ! యడిగిచూడు క్షమాపణ , తప్పులేదురా ! గాడిద ! కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్ !! మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
కూడకు కుజనుల పొంతకువీడకుమీ సాధుజనుల వెరవెన్నటికిన్ కూడుట కుజనులకన్ననుగాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
ఫణీంద్ర గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చూడర పరమాత్మ యునికివీడుచు నీ భోగవాంఛ, వీడుచు నహమున్వేడుము భక్తిని ముక్తిన్,"గాడిద! కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్"
విట్టుబాబు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
( చిలకమర్తివారి "గణపతి"గాడిదస్వారీ చేస్తూ మిత్రులతో )ఏడకొ పోయినారుగద !యిచ్చట నుండక మీరలందరున్ ;జూడుడు నాదువాహనము ;సోకుగ గంతుల వేయుచున్నదే !యాడుచు బాడుచున్ జదువు నంతయు జంకను బెట్టు ; డింక నీ గాడిదకాలు బట్టుకొన గల్గును మోక్షము తన్నకుండినన్ .(విజయవాడ ఆకాశవాణిలో బందావారి దర్శకత్వంలో నండూరి సుబ్బారావు , సీతారత్తమ్మలు గణపతిగా తల్లి సింగమ్మగా నవలకు ప్రాణం పోశారు )
జంధ్యాల వారూ,ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదాలండీ !
చేడియతో తగవేలర?మూడును నీకు మరణమ్ము భువిపై నా పూబోడి ప్రియసఖుని చేతను గాడిద ! కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
అన్నపరెడ్డి వారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆడది శక్తి స్వరూపిణి చూ డ కు చులకన గ నామె శోభిత మతి యౌవేడు ము మన్నించు మనుచు గాడి ద !కాల్పట్ట్గ మోక్ష గతి లభ్యమగున్
రాజేశ్వర రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'శక్తి స్వరూపిణి' అన్నపుడు 'క్తి' గురువై గణదోషం. సవరించండి.
ఆడది శక్తి కి రూప గు అని సవరణ చేయడమైనది
బాగుంది.
వాడికడ నేపనైననురూడిగ కోరు విధముగ జరుగవలె నన్నన్వాడుకగ లంచమిడి యాగాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
సీతారామయ్య గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాడే విష్ణువు మరియున్ వాడే హరుడును విరించి వాడే కాదే వీడుచు వారిని మరియే గాడిద కాల్పట్ట మోక్ష గతి లభ్యమగున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడెను నీ జాతి కిలనువేడుము రాముని, విడచుచు వేగమె సీతన్వీడుము దురహంకారముగాడిద! కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
పోడిమితో వేడుకొనుమునాడెంబగు జీవనమును నయముగ బొందన్మూడును దేవుని దూరినగాడిద! కాల్పట్ట మోక్ష గతిలభ్యమగున్!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కాడే సర్వోత్కృష్ఠుడువేడిన కాపాడు వాని, వెన్నునితా కాపాడగ వసుదేవుడికిలగాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వసుదేవున కిల' అనండి.
🙏 ధన్యవాదములు
మిత్రులందఱకు నమస్సులు![ఎవరితోనూ కలవకుండా, ఒంటరిగా, తనలో తానే మాట్లాడుకొంటూ, సమాజంతో సంబంధం లేకుండా బతుకుతున్న తన తమ్ముని నుద్దేశించి, అన్న ఎవరితోనో మాట్లాడుతున్న సందర్భం]"తో డెవఁడేని లేఁడు! తనతో మఱి మాటలనాడువార లీవీడుఁ గవేషణన్ జలుపఁ, బెక్కుఱు లేరయె! యొక్క రిద్దఱోకూడఁగ, సంతసానఁ జని, కోరిక తీఱఁగ మాటలాడు! నీగాడిద కాలుఁ బట్టుకొనఁ, గల్గును మోక్షము, తన్నకుండినన్!"[ఈ గాడిదకు+ఆలున్+పట్టుకొనన్+కల్గును మోక్షము]
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.'వీడుఁ గవేషణన్'?
చూడుము!పండితోత్తముడ!శోభిలు కీరితి గల్గియున్ననున్వేడగ జింత యేల నవివేకుల నల్పుల కార్యసిద్ధికై ?వీడి యశంబు గాడిదను వేడిన నా వసుదేవు రీతిగన్గాడిద కాలు బట్టుకొన గల్గును మోక్షము తన్నకుండినన్"🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿 🌷 వనపర్తి 🌷
వాడుక భాషను సామెతచూడగ వింతగు విషయము చోద్యంబగు నేగాడిద బల్కిన నెవ్విధిగాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
ఆడుట తెలియని నటియేచాడీల్ చెప్పుచు పలికెను చక్కగ నేదైనా డైరెక్టరనబడెడుగాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్!జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ఏదైనా' అనడం వ్యావహారికం.
మేడని నిల్చె దేవుడు సమేతము తల్లియు చూడ రే సుమా గోడకు బాదుకొంచు తల కూడ జిలేబియ బొప్పికట్టెనే !వేడుట మాని నీశుని హవిస్సుగ గడ్డిని చూపి చట్టనన్ గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మాని యీశుని' అనండి. మొదటి పాదం కొంత గందరగోళంగా ఉన్నది. అర్థం కాలేదు.
రూథర్ ఫర్డ్ తో అల్లూరి సీతారామరాజు?గాడిద గుడ్డని (god, the good) చెప్పుచుగీడొనరించ దొరగావు కీటకుడవు పోవీడర నీవొక కంచరగాడిద, కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్?
మాడుగుల!గురువుపలుకులుగాడిదకాల్పట్టమోక్షగతిలభ్యమగున్ వీడకపట్టుమునీవునుగాడిదపాదాలనిపుడగలుగునుశమమున్
వాడిగ పలుకగ నేలాగాడిద, కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్!వీడుము కోపము అమ్మయెవేడిగ నీకెన్నొరుచుల ప్రేమగ బెట్టున్!!
ఇద్దరు దొంగల సంభాషణ... కుక్క చేయవలసిన పని గాడిద చేయునో యని... ఉత్పలమాలకూడదు నే ప్రయత్నమని గోప్యముగా నిల నెంచి చౌర్య మివ్వాడను నింట దూర మన పంటయె పండెను సొమ్ము గూరెనేవీడని శ్వానమున్ వదిలె బిస్కతు నీయఁగ, నోండ్ర పెట్టు నాగాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'కూడదు + ఏ = కూడదే' అవుతుంది. అక్కడ నుగాగమం రాదు. పద్యంలో కొంత అన్వయక్లేశ మున్నది.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన :ఉత్పలమాలకూడక రాబడుల్వగచి గోప్యముగా నిల నెంచి చౌర్య మివ్వాడను నింట దూర మన పంటయె పండెను సొమ్ము గూరెనేవీడని శ్వానమున్ వదిలె బిస్కతు నీయఁగ, నోండ్ర పెట్టు నాగాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్!
వేడగ రోగము బోవునుతోడుగ నిలుచును యడఁకువ తోడుత కొలవన్షోడశి శీతల నెక్కెనుగాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'నిలుచును + అడఁకువ' అన్నపుడు యడాగమం రాదు. "తోడుగను నిలుచు నడఁకువ" అనవచ్చు. 'శీతల నెక్కెను' ?
బీడీ సిగరెట్టు గొనుచుపాడగు నలవాట్లవల్ల ప్రల్లదుడౌచున్ గాడిదల గాయగా నేగాడిద కాల్బట్ట మోక్షగతి లభ్యమగు?
కూడగ యాత్రజేయగను కోరికమీరగ శీతశైలమున్ గూఢపు వంపులన్ మిగుల ఘోరపు కోనల మార్గమందునన్ వేడుచు జేర్చగా దరిని వేసటలేకయె వాహనమ్ముగాగాడిద కాలుబట్టుకొన గల్గును మోక్షము తన్నకుండినన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.రెండవ పద్యంలో డ-ఢ ప్రాస వేసారు.
చేడియలన్ కనుంగొనుచు చేయుచు సైగల కన్నుగొట్టుచున్దాడులు చేయుచున్ తిరుగ తప్పక కీడు ఘటిల్లు పృథ్విపై వేడు క్షమించ మంచు చని పెద్దల ముందర చిత్తశుద్ధితోగాడిద! కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్
వేడుక మీఱఁ బరుండఁగ నీడ యనంగ మెలఁగంగ నిత్యముఁ బ్రీతిం జూడుమ బాలిక బాలుఁడు గా డిద కాల్పట్ట మోక్షగతి లభ్య మగున్ [..గాడు +ఇది+అ = ..గా డిద; కాల్పట్ట: గూఢార్థము భార్య యయితే]ఏడ గలండు విష్ణువు మహిం గన నంచును దాను దైవమే యీడ చెలంగు రా జని యథేచ్ఛ చరించుచు మించి మెచ్చఁ బూఁ బోఁడులు నిచ్ఛ స్వర్ణకశిపుం డనె, దైత్య వరుండు గర్వి రాగాడిద, కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్ [రా గాడిద = రాచ గాడిద]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. బాలుఁడు కాఁ డను నర్థము గ్రహించుటలోఁ గించిద్దోషము విస్మరించితిని. అరసున్న రావలసి యున్న విస్మరించితిని. సమస్యా పాదములోని గాడిద లో నరసున్న లేదు కదా. కాని కాఁడు వాడిన నరసున్న కావలెను కదా. కాన పూరణ మామోద యోగ్యము కాదని నా బాధ.
నేను అంత నిశితంగా పరిశీలించలేదు.
వేడగ నా వసుదేవుడు వీడిన బింకమున ఖరము వెన్కకు మరలన్ కూడదె జగదానందము!గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్!
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) గాడిద లెందరో నిలిచి గమ్మున మమ్ముల నెన్నరోయనన్నేడిట గాభరా కలిగి నేనిక భీతిల వోటు వేయుటన్వేడెద నిన్ను శాస్త్రివర! వేగమె తెల్పు ప్రభాకరుండ! ఏగాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్?
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
గాడిదకాలుబట్టుకొనకల్గునుమోక్షముతన్నకుండినన్వీడకయున్నచోపదమువెన్కకుబోర్లగనౌనునట్లుగామాడుననొక్కతాపునిడిమంచిగమోక్షముగల్గజేయుసూవేడుడుమోక్షమున్వలయుపెద్దలుపట్టుడుగార్దభంబునున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వెన్కకుబోర్లగనౌ'?
ఏడుపుయెరుగక మంచిగకాడెద్దుగ పనినిజేసి!కర్షకుడిగ యేనాడు స్వార్థమెరుగకగాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ఏడుపు నెరుగక... కాడెద్దుల... కర్షకుడుగ నే... స్వార్థ మెరుంగక...' అనండి.
నీడను కూడ నమ్మడవి నీతిని నమ్మిన వాడు తల్లికిన్ కూడును పెట్టడాతడట కుట్రలు పన్నుటలో ఘనుండెయౌ వాడొక చండశాసనుడు వాడిని వేడుట కంటె వీధిలో గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్.
గాడిద కాలు నందు నొక గాయము గా నల చాకి, వైద్యునిన్వేడె చికిత్సకై, పసుల వెజ్జువు మందును బూయ నిచ్చినన్గాడిద బాధ దొల్గుచు సుఖమ్మొనగూరును చాకి వానికిన్ గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్కంజర్ల రామాచార్యవనస్థలిపురము.
కూడదు దుష్టమానవులఁ గూడిచరించుట, గొప్పవారితోవేడుక భాషణల్ జరుప వేగిరపాటును వీడఁ నిమ్మగున్ వేడగరాదుమూర్ఖులను బేలతనంబుననైన, మారుగాగాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్
ఉత్పలమాలచేడియ వన్నె చిన్నెలకు చిత్తవికారము జెందబోకుడీరూడిగ రుద్రచాపమును ద్రుంచిన శ్రీరఘురాము పాదమల్పాడిగ గొల్వ మోక్షము నవశ్యము గల్గును పృథ్వి నెవ్విధిన్గాడిదకాలు బట్టుకొన గల్గును మోక్షము తన్నకుండినన్ ఆకులశివరాజలింంగం వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'పాదముల్' టైపాటు.
వడిగా పనికావలెనన గడియ గడియకును ధనమును కానుక నొసగన్ నడుగగ మామూలిడుచాగాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
దోష నివారణార్థము పూరణాంతరము:వేడుక నుండును శ్రీహరి చూడఁ జరాచర జగతినిఁ జోద్యం బగునే యోడకు చతుష్పదం బని గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్య మగున్
__/\__
డా. పిట్టా సత్యనారాయణగాడిని భాట్ట ప్రభాకర("భాట్టప్రభాకరాది గ్రంథంబులు శోధనను బెంచు..".తిరుపతి వేంకటకవులుసూడిదముల వలని దృష్టి సోకగ తర్కాల్పాడియె?నరవర! సమదృగ్గాడిద కాల్బట్ట మోక్షగతి లభ్యమగున్
డా.పిట్టా సత్యనారాయణపాడియె సర్వ వ్యాపకుని బాడగనే సరిపోదహంకృతిన్వీడిన భక్తి చేకురదె వెన్నుని జూడగ సర్వ జీవులందాడిన తేజమున్ గనుము, దౌష్ట్యము కాలిని దాక; తద్ధృతిన్గాడిద కాలు బట్టుకొన గల్గును మోక్షము;తన్నకుండినన్
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిచేడియ గొప్పగా పలికి చిందుచు నవ్వులు చేతులెత్తుచున్
దాడిని జేయగా మురిసి దండము లిచ్చుచు పైకినెత్తుచున్
మోడిని స్వీకరించనని మొండిగ దీదిని నెన్నబోకెటుల్
గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్?
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండివ్యంగ్యాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండిఏడికి బోయెద జముడా
రిప్లయితొలగించండివేడుక మీరగ వరమని ప్రియుడే బ్రతుకన్
నేడిట నిలలో సాద్వికి
గాడిద కాల్పట్ట మోక్ష గతి లభ్యమగున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సాధ్వికి' టైపాటు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఆడది శక్తిరా ! యనిన ఆఁ అది ఒట్టిదటంచు బల్కి , వెం...
టాడితి , చూడు రక్షకభటాలయవాసివి ఐతివిప్డిటుల్
చూడకు జాలిగా ! యడిగిచూడు క్షమాపణ , తప్పులేదురా !
గాడిద ! కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికూడకు కుజనుల పొంతకు
రిప్లయితొలగించండివీడకుమీ సాధుజనుల వెరవెన్నటికిన్
కూడుట కుజనులకన్నను
గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చూడర పరమాత్మ యునికి
రిప్లయితొలగించండివీడుచు నీ భోగవాంఛ, వీడుచు నహమున్
వేడుము భక్తిని ముక్తిన్,
"గాడిద! కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
( చిలకమర్తివారి "గణపతి"గాడిదస్వారీ చేస్తూ మిత్రులతో )
రిప్లయితొలగించండిఏడకొ పోయినారుగద !
యిచ్చట నుండక మీరలందరున్ ;
జూడుడు నాదువాహనము ;
సోకుగ గంతుల వేయుచున్నదే !
యాడుచు బాడుచున్ జదువు
నంతయు జంకను బెట్టు ; డింక నీ
గాడిదకాలు బట్టుకొన
గల్గును మోక్షము తన్నకుండినన్ .
(విజయవాడ ఆకాశవాణిలో బందావారి దర్శకత్వంలో
నండూరి సుబ్బారావు , సీతారత్తమ్మలు గణపతిగా
తల్లి సింగమ్మగా నవలకు ప్రాణం పోశారు )
జంధ్యాల వారూ,
తొలగించండిప్రశస్తమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదాలండీ !
తొలగించండిచేడియతో తగవేలర?
రిప్లయితొలగించండిమూడును నీకు మరణమ్ము భువిపై నా పూ
బోడి ప్రియసఖుని చేతను
గాడిద ! కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆడది శక్తి స్వరూపిణి
రిప్లయితొలగించండిచూ డ కు చులకన గ నామె శోభిత మతి యౌ
వేడు ము మన్నించు మనుచు
గాడి ద !కాల్పట్ట్గ మోక్ష గతి లభ్యమగున్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శక్తి స్వరూపిణి' అన్నపుడు 'క్తి' గురువై గణదోషం. సవరించండి.
ఆడది శక్తి కి రూప గు అని సవరణ చేయడమైనది
తొలగించండిబాగుంది.
తొలగించండివాడికడ నేపనైనను
రిప్లయితొలగించండిరూడిగ కోరు విధముగ జరుగవలె నన్నన్
వాడుకగ లంచమిడి యా
గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాడే విష్ణువు మరియున్
రిప్లయితొలగించండివాడే హరుడును విరించి వాడే కాదే
వీడుచు వారిని మరియే
గాడిద కాల్పట్ట మోక్ష గతి లభ్యమగున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడెను నీ జాతి కిలను
రిప్లయితొలగించండివేడుము రాముని, విడచుచు వేగమె సీతన్
వీడుము దురహంకారము
గాడిద! కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపోడిమితో వేడుకొనుము
రిప్లయితొలగించండినాడెంబగు జీవనమును నయముగ బొందన్
మూడును దేవుని దూరిన
గాడిద! కాల్పట్ట మోక్ష గతిలభ్యమగున్!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాడే సర్వోత్కృష్ఠుడు
రిప్లయితొలగించండివేడిన కాపాడు వాని, వెన్నునితా కా
పాడగ వసుదేవుడికిల
గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వసుదేవున కిల' అనండి.
🙏 ధన్యవాదములు
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[ఎవరితోనూ కలవకుండా, ఒంటరిగా, తనలో తానే మాట్లాడుకొంటూ, సమాజంతో సంబంధం లేకుండా బతుకుతున్న తన తమ్ముని నుద్దేశించి, అన్న ఎవరితోనో మాట్లాడుతున్న సందర్భం]
"తో డెవఁడేని లేఁడు! తనతో మఱి మాటలనాడువార లీ
వీడుఁ గవేషణన్ జలుపఁ, బెక్కుఱు లేరయె! యొక్క రిద్దఱో
కూడఁగ, సంతసానఁ జని, కోరిక తీఱఁగ మాటలాడు! నీ
గాడిద కాలుఁ బట్టుకొనఁ, గల్గును మోక్షము, తన్నకుండినన్!"
[ఈ గాడిదకు+ఆలున్+పట్టుకొనన్+కల్గును మోక్షము]
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'వీడుఁ గవేషణన్'?
చూడుము!పండితోత్తముడ!శోభిలు కీరితి గల్గియున్ననున్
వేడగ జింత యేల నవివేకుల నల్పుల కార్యసిద్ధికై ?
వీడి యశంబు గాడిదను వేడిన నా వసుదేవు రీతిగన్
గాడిద కాలు బట్టుకొన గల్గును మోక్షము తన్నకుండినన్"
🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
🌷 వనపర్తి 🌷
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాడుక భాషను సామెత
రిప్లయితొలగించండిచూడగ వింతగు విషయము చోద్యంబగు నే
గాడిద బల్కిన నెవ్విధి
గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆడుట తెలియని నటియే
చాడీల్ చెప్పుచు పలికెను చక్కగ నేదై
నా డైరెక్టరనబడెడు
గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఏదైనా' అనడం వ్యావహారికం.
రిప్లయితొలగించండిమేడని నిల్చె దేవుడు సమేతము తల్లియు చూడ రే సుమా
గోడకు బాదుకొంచు తల కూడ జిలేబియ బొప్పికట్టెనే !
వేడుట మాని నీశుని హవిస్సుగ గడ్డిని చూపి చట్టనన్
గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మాని యీశుని' అనండి. మొదటి పాదం కొంత గందరగోళంగా ఉన్నది. అర్థం కాలేదు.
రూథర్ ఫర్డ్ తో అల్లూరి సీతారామరాజు?
రిప్లయితొలగించండిగాడిద గుడ్డని (god, the good) చెప్పుచు
గీడొనరించ దొరగావు కీటకుడవు పో
వీడర నీవొక కంచర
గాడిద, కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమాడుగుల!గురువుపలుకులు
రిప్లయితొలగించండిగాడిదకాల్పట్టమోక్షగతిలభ్యమగున్
వీడకపట్టుమునీవును
గాడిదపాదాలనిపుడగలుగునుశమమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాడిగ పలుకగ నేలా
రిప్లయితొలగించండిగాడిద, కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్!
వీడుము కోపము అమ్మయె
వేడిగ నీకెన్నొరుచుల ప్రేమగ బెట్టున్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇద్దరు దొంగల సంభాషణ...
రిప్లయితొలగించండికుక్క చేయవలసిన పని గాడిద చేయునో యని...
ఉత్పలమాల
కూడదు నే ప్రయత్నమని గోప్యముగా నిల నెంచి చౌర్య మి
వ్వాడను నింట దూర మన పంటయె పండెను సొమ్ము గూరెనే
వీడని శ్వానమున్ వదిలె బిస్కతు నీయఁగ, నోండ్ర పెట్టు నా
గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కూడదు + ఏ = కూడదే' అవుతుంది. అక్కడ నుగాగమం రాదు. పద్యంలో కొంత అన్వయక్లేశ మున్నది.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన :
తొలగించండిఉత్పలమాల
కూడక రాబడుల్వగచి గోప్యముగా నిల నెంచి చౌర్య మి
వ్వాడను నింట దూర మన పంటయె పండెను సొమ్ము గూరెనే
వీడని శ్వానమున్ వదిలె బిస్కతు నీయఁగ, నోండ్ర పెట్టు నా
గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్!
వేడగ రోగము బోవును
రిప్లయితొలగించండితోడుగ నిలుచును యడఁకువ తోడుత కొలవన్
షోడశి శీతల నెక్కెను
గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నిలుచును + అడఁకువ' అన్నపుడు యడాగమం రాదు. "తోడుగను నిలుచు నడఁకువ" అనవచ్చు. 'శీతల నెక్కెను' ?
బీడీ సిగరెట్టు గొనుచు
రిప్లయితొలగించండిపాడగు నలవాట్లవల్ల ప్రల్లదుడౌచున్
గాడిదల గాయగా నే
గాడిద కాల్బట్ట మోక్షగతి లభ్యమగు?
కూడగ యాత్రజేయగను కోరికమీరగ శీతశైలమున్
తొలగించండిగూఢపు వంపులన్ మిగుల ఘోరపు కోనల మార్గమందునన్
వేడుచు జేర్చగా దరిని వేసటలేకయె వాహనమ్ముగా
గాడిద కాలుబట్టుకొన గల్గును మోక్షము తన్నకుండినన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవ పద్యంలో డ-ఢ ప్రాస వేసారు.
చేడియలన్ కనుంగొనుచు చేయుచు సైగల కన్నుగొట్టుచున్
రిప్లయితొలగించండిదాడులు చేయుచున్ తిరుగ తప్పక కీడు ఘటిల్లు పృథ్విపై
వేడు క్షమించ మంచు చని పెద్దల ముందర చిత్తశుద్ధితో
గాడిద! కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేడుక మీఱఁ బరుండఁగ
రిప్లయితొలగించండినీడ యనంగ మెలఁగంగ నిత్యముఁ బ్రీతిం
జూడుమ బాలిక బాలుఁడు
గా డిద కాల్పట్ట మోక్షగతి లభ్య మగున్
[..గాడు +ఇది+అ = ..గా డిద; కాల్పట్ట: గూఢార్థము భార్య యయితే]
ఏడ గలండు విష్ణువు మహిం గన నంచును దాను దైవమే
యీడ చెలంగు రా జని యథేచ్ఛ చరించుచు మించి మెచ్చఁ బూఁ
బోఁడులు నిచ్ఛ స్వర్ణకశిపుం డనె, దైత్య వరుండు గర్వి రా
గాడిద, కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్
[రా గాడిద = రాచ గాడిద]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
తొలగించండిబాలుఁడు కాఁ డను నర్థము గ్రహించుటలోఁ గించిద్దోషము విస్మరించితిని.
అరసున్న రావలసి యున్న విస్మరించితిని.
సమస్యా పాదములోని గాడిద లో నరసున్న లేదు కదా. కాని కాఁడు వాడిన నరసున్న కావలెను కదా.
కాన పూరణ మామోద యోగ్యము కాదని నా బాధ.
నేను అంత నిశితంగా పరిశీలించలేదు.
తొలగించండివేడగ నా వసుదేవుడు
రిప్లయితొలగించండివీడిన బింకమున ఖరము వెన్కకు మరలన్
కూడదె జగదానందము!
గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
గాడిద లెందరో నిలిచి గమ్మున మమ్ముల నెన్నరోయనన్
నేడిట గాభరా కలిగి నేనిక భీతిల వోటు వేయుటన్
వేడెద నిన్ను శాస్త్రివర! వేగమె తెల్పు ప్రభాకరుండ! ఏ
గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్?
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగాడిదకాలుబట్టుకొనకల్గునుమోక్షముతన్నకుండినన్
రిప్లయితొలగించండివీడకయున్నచోపదమువెన్కకుబోర్లగనౌనునట్లుగా
మాడుననొక్కతాపునిడిమంచిగమోక్షముగల్గజేయుసూ
వేడుడుమోక్షమున్వలయుపెద్దలుపట్టుడుగార్దభంబునున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వెన్కకుబోర్లగనౌ'?
ఏడుపుయెరుగక మంచిగ
రిప్లయితొలగించండికాడెద్దుగ పనినిజేసి!కర్షకుడిగ యే
నాడు స్వార్థమెరుగక
గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఏడుపు నెరుగక... కాడెద్దుల... కర్షకుడుగ నే... స్వార్థ మెరుంగక...' అనండి.
నీడను కూడ నమ్మడవి నీతిని నమ్మిన వాడు తల్లికిన్
రిప్లయితొలగించండికూడును పెట్టడాతడట కుట్రలు పన్నుటలో ఘనుండెయౌ
వాడొక చండశాసనుడు వాడిని వేడుట కంటె వీధిలో
గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగాడిద కాలు నందు నొక గాయము గా నల చాకి, వైద్యునిన్
రిప్లయితొలగించండివేడె చికిత్సకై, పసుల వెజ్జువు మందును బూయ నిచ్చినన్
గాడిద బాధ దొల్గుచు సుఖమ్మొనగూరును చాకి వానికిన్
గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్
కంజర్ల రామాచార్య
వనస్థలిపురము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికూడదు దుష్టమానవులఁ గూడిచరించుట, గొప్పవారితో
రిప్లయితొలగించండివేడుక భాషణల్ జరుప వేగిరపాటును వీడఁ నిమ్మగున్
వేడగరాదుమూర్ఖులను బేలతనంబుననైన, మారుగా
గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండిచేడియ వన్నె చిన్నెలకు చిత్తవికారము జెందబోకుడీ
రూడిగ రుద్రచాపమును ద్రుంచిన శ్రీరఘురాము పాదమల్
పాడిగ గొల్వ మోక్షము నవశ్యము గల్గును పృథ్వి నెవ్విధిన్
గాడిదకాలు బట్టుకొన గల్గును మోక్షము తన్నకుండినన్
ఆకులశివరాజలింంగం వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పాదముల్' టైపాటు.
వడిగా పనికావలెనన
రిప్లయితొలగించండిగడియ గడియకును ధనమును కానుక నొసగన్
నడుగగ మామూలిడుచా
గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదోష నివారణార్థము పూరణాంతరము:
రిప్లయితొలగించండివేడుక నుండును శ్రీహరి
చూడఁ జరాచర జగతినిఁ జోద్యం బగునే
యోడకు చతుష్పదం బని
గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్య మగున్
__/\__
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిడా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిగాడిని భాట్ట ప్రభాకర("భాట్టప్రభాకరాది గ్రంథంబులు శోధనను బెంచు..".తిరుపతి వేంకటకవులు
సూడిదముల వలని దృష్టి సోకగ తర్కాల్
పాడియె?నరవర! సమదృ
గ్గాడిద కాల్బట్ట మోక్షగతి లభ్యమగున్
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిపాడియె సర్వ వ్యాపకుని బాడగనే సరిపోదహంకృతిన్
వీడిన భక్తి చేకురదె వెన్నుని జూడగ సర్వ జీవులం
దాడిన తేజమున్ గనుము, దౌష్ట్యము కాలిని దాక; తద్ధృతిన్
గాడిద కాలు బట్టుకొన గల్గును మోక్షము;తన్నకుండినన్