27, మే 2019, సోమవారం

సమస్య - 3030 (గవ్వకుఁ గొఱగావు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందువొహో"
(లేదా...)
"గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుండ నందువే యొహో"

75 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    పువ్వుల బాట పట్టితివి పూజ్యుల నెల్లరి మధ్య చేరుచున్
    నవ్వుల మాటలాడుచును నందన మొందుచు రోజురోజునన్
    సవ్వడి లేక వ్రాసితివి శంకరు కొల్వున శాస్త్రివర్యుడా!
    గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుండ నందువే యొహో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      ప్రొద్దున్నే ఎంత బాగా నవ్వించారండీ! ఈమధ్యకాలంలో ఇంత హాయిగా, గట్టిగా నవ్విన సందర్భమే లేదు.
      ఆత్మాశ్రయమైన మీ పూరణ మనోరంజకంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "రోజురోజుకున్" అనండి.

      తొలగించండి
  2. మువ్వల వోలెగల గలలు
    రువ్విన చాలద టంచు రోకమున్
    నవ్విన నాముగల పొలము
    గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందు వొహో
    రోకము = వెలుగు , దీప్తి, రంధ్రము , ఓడ , మున్నగునవి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      ఈ పూరణలో మీరేం చెప్పదలచుకున్నారో అర్థం కావడం లేదు. రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    ఒక కవిపత్ని ఆవేదన...

    బువ్వకు దిక్కులేదు , పరిపూర్ణయశస్వినటంచు బల్కెదీ..
    వవ్వల చూపు మాని గృహమందలి బీదరికమ్ము జూడుమా !
    నవ్వులపాలగున్ బ్రతుకు , నల్వురి మెప్పులు పొట్టనింపునే ?!
    గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుండ నందువే యొహో !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిపత్ని ఆవేదనను కరుణరసాత్మకంగా వర్ణించిన మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  4. తువ్వవు నీవనిఁదెలిసియు
    కొవ్వున సుకవుల నడుమనుగొంతెత్తుదువా
    నవ్వరె ఫణీంద్ర యెల్లరు
    గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందువొహో

    రిప్లయితొలగించండి


  5. జవ్వాదులనద్దితివా !
    చివ్వున సింగము వలెన్ రచించితి వా? ఓ
    అవ్వా జిలేబి రమ్మా
    గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందువొహో


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. బువ్వకు నోచక లుళుళు
    క్కవ్వని పద్యంబు జెప్పి కవివైతివిగా!
    అవ్వ! విచిత్రము గాదే!
    గవ్వకు గొఱగావు మేటి కవినందువొహో!

    (బువ్వకు నోచక లుళుళు
    క్కవ్వలె పద్యాలు జెప్పి కవివైతివిగా!)

    రిప్లయితొలగించండి
  7. మువ్వల వోలెగల గలలు
    రువ్విన చాలద టంచు రోకము చూడగన్
    నవ్విన చేనులు పండగ
    గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందు వొహో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "రోకము కనగన్" అనండి.

      తొలగించండి
    2. మువ్వల వోలెగల గలలు
      రువ్విన చాలద టంచు రోకము కనగన్
      నవ్విన చేనులు పండగ
      గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందు వొహో

      తొలగించండి
  8. అవ్వా యీ పద్దియములు
    రవ్వంతయశంబునైనలలినీకిడునే
    నవ్వుదురెవ్విధిబువ్విడు
    *"గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందువొహో"*

    రిప్లయితొలగించండి
  9. సవ్వడిసేసె ప్రొద్దుననె చక్కగ సాధన సేయకుండనే
    నవ్వుల పాలు జేతువొకొ నారిహితంబిది నేరకుందువే
    యెవ్వరు శ్రీలబొందిరి మరెవ్వరు మేడలగట్టిరెందుకో
    *"గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుండ నందువే యొహో"*

    రిప్లయితొలగించండి
  10. మిత్రులందఱకు నమస్సులు!

    [ఒక ధనికుఁడు ఒక మహాకవిని ఉద్దేశించి పలికిన పలుకులు]

    నెవ్వలె నీకు నేస్తములు, నిత్యము నీ గృహసీమ నేలఁగా,
    బువ్వయుఁ గూడ దుర్లభమె; పోరుచు నుందువు తిండికోసమై;
    బువ్వయుఁ గైత లెప్పు డిలఁ బోవని చివ్వల నుండ, నీ విఁకన్
    గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు! "కవీంద్రుఁడ" నందువే యొహో?

    రిప్లయితొలగించండి


  11. బువ్వకు నోచ లేదు! సరి భూరిగమంబుల బర్వుమోయుచున్
    రువ్వకు చిల్లిగవ్వకు మరొక్కటికిన్ సరి బోని వాడివే
    అవ్వ! బుధాన యేల కసి యంటిన మాటలు మించె నీదె సూ!
    గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు! కవీంద్రుడ నందువే యొహో


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భూరిగమంబుల'?

      తొలగించండి


  12. నా పూరణ. ఉ.మా!
    ***** **** ***

    ఎవ్వడు నిన్ను మెచ్చరు కవీశ్వరు నన్న ను లోకమందునన్

    రవ్వకు మీఱి పాండితి విరాజిలునే రచియింప కావ్యముల్?

    నవ్వులపాలు గాకు రచనాధిపతుండనుచున్! జగంబునన్

    గవ్వకు గూడ జూడ గొఱగావు కవీంద్రుండ నందువే యొహో

    🌱 ఆకుల శాంతి భూషణ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అధిపతుడు'?

      తొలగించండి
  13. డా పిట్టా సత్ య నారాయణ
    అవ్వను జూ తు వు యే డ్వగ , బువ్వ యే
    లే దన్న రోజు, పూర్ణపు రుజలన్,
    అవ్వ (! యిదే కావ్యంబన?
    గవ్వకు గొరగావు మే టి కవివందువహో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవ్వను జూచెద వేడ్వగ' అనండి.

      తొలగించండి
  14. బువ్వకులేకనాడు గవిముఖ్యులు గావ్యము లమ్మినారు నీ
    వెవ్విధివ్రాయనేర్చిననువృద్ధులుఱేడులుసాహితీహితుల్
    నవ్వి నిరాశగాబలుక నాధుడెవండునుమెచ్చకున్న ఛీ
    *"గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుండ నందువే యొహో"*

    రిప్లయితొలగించండి
  15. ఎవ్వరుగారవించిరయ ఎవ్వరు సాయము జేసిరీభువిన్
    బువ్వను బెట్టలేవు పర మున్నిహమున్నిడజాలవెందుకీ
    సవ్వడి రాతపూతలిక చాలు కవిత్వము పద్యరత్నముల్
    *"గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుండ నందువే యొహో"*

    రిప్లయితొలగించండి
  16. (తుకారాం తో జిజియా బాయి)

    సవ్వడి సేయరు బిడ్డలు
    బువ్వను దినిమూడునాల్గు పూటలు గడిచెన్
    నెవ్విధి నింటిని నడుపను
    గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందు వొహో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ద్వారకానాథ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కడచెన్ + ఎవ్విధి = కడచె నెవ్విధి' అవుతుంది. అక్కడ "పూటలయె గదా । యెవ్విధి..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు,

      సవ్వడి సేయరు బిడ్డలు
      బువ్వను దినిమూడునాల్గు పూటలయె గదా
      యెవ్విధి నింటిని నడుపను
      గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందు వొహో

      తొలగించండి
  17. రువ్వకు నీచమైనఁ జతురోక్తులు దీనుల భాగ్యమెంచుచున్
    నవ్వకు కూలినట్టి చలనమ్ములఁ బాసిన వారిఁ గాంచుచున్
    నొవ్వకు మెవ్వరేని సుమనోహర రూపుడ! యిట్టులన్న నో
    *"గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుండ నందువే యొహో"*

    రిప్లయితొలగించండి
  18. కవ్వించు కవిత ల ల్లుచు
    నెవ్వరు మెచ్చ ని విధముగ నిచ్చా ర తు డై
    నవ్వుల పాలగు నీవి ల
    గవ్వ కు గొరగావు మేటి కవి నందు వొ హో !

    రిప్లయితొలగించండి
  19. పోతనతో శ్రీనాథుడు

    యవ్వనమున హరి యనెదవు
    బువ్వ గడుచునెట్లు నీకు భూసురుఁడ వినో
    నివ్వక కావ్యము రాజుకు
    గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందువొహో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భూసుర వినుమా । యివ్వక...' అనండి.

      తొలగించండి
  20. దవ్వున తెలవారకనే
    చివ్వున మేల్కొని రచించి చెల్లని కైతల్
    కెవ్వన జాలపు విబుధులు
    గవ్వకు గొరగావు మేటి కవినందువొహో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒక తండ్రి కొడుకుతో

      ఎవ్వరు జేప్పెనీకిటుల నెంచగ కైతల వ్రాయువృత్తి? నీ
      కివ్వవు కాసులీ కథలు,కీర్తియె చాలనియందువేని,యే
      జవ్వని నిన్వరించునొకొ? చక్కని జీవిక నేర్వజాలకే
      గువ్వకుగూడ జూడ గొరగావవు కవీంద్రుడ నందువేయొహో!?

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

      తొలగించండి
  21. డా.పిట్టా సత్యనారాయణ
    చువ్వలు peeyeselvilita chukkala

    రిప్లయితొలగించండి
  22. ఉ. పువ్వుల దండలే మిగలె పూటయు గడ్చుట కష్టమయ్యెగా !
    బువ్వకు వాచిపోవనతి బుూటక మెందుకు చేతువెల్లడన్?
    నవ్వదు రెల్ల బందుగులు! నాశన మైతిని తాళి గట్టగా
    గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుడ నందువే యొహో"

    రిప్లయితొలగించండి
  23. Kekkaga mekka thindi ye
    Avvaku neeku pillalaku naakaligonna yirungu vaarikin
    Ivvagajaalune rachana needchiyu jesina demi padyamul
    Rivvuna ningi kegaga pareevritha shankaru padya petikan
    Gavvaku gooda jooda gora gaavu kaveendruda nandu ve yoho

    రిప్లయితొలగించండి
  24. శ్రీ గురుభ్యోన్నమః🙏
    ఇతరుల నిందించలేక నాలో నేను😀

    ఎవ్వడు మూలము జగమున
    కవ్వాని దలపని కథలు కావ్యము లెల్లన్
    నవ్వుల బాలవు 'యజ్ఞా!'
    గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందువొహో!

    రిప్లయితొలగించండి
  25. (పేద వాడైన కవి ప్రేయసి తండ్రి పలుకులుగా...)

    బువ్వను పెట్ట లేవికను
    పుట్టము గట్టగ నెట్టులిత్తువో?
    దివ్వెకు నూనె లేదు సరి
    దివ్వెను పెట్టుట కిల్లుయున్నదా?
    ఎవ్విది నిత్తు నా తనయ
    నెట్టుల గోరుట,నీదు వ్రాతలున్
    గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱ
    గావు, కవీంద్రుండ నందువే యొహో

    రిప్లయితొలగించండి
  26. రువ్వకుమా ప్రల్లదములు
    గువ్వల వలె గూసినంత గొప్పెటులౌనో?
    యెవ్విధి నిను కవియనదగు?
    గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందువొహో!

    రిప్లయితొలగించండి
  27. అవ్వను గొట్టియే విజయ మాయది గొప్పలు జెప్పకో యహో
    మువ్వల ధారణే పదపు ముద్రయు మారగ మద్దెలోడనా
    త్రవ్వకు తాతలే నెయిని ద్రాగుట నేడిల యొప్పరే యహా
    గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుఁడ నందువే యొహో

    రిప్లయితొలగించండి
  28. ఎవ్వరు రచియించినదో
    నివ్వెరబోతి నిదిజూసి నిజముగ , నీవై
    యివ్విధముగ నకలు సలుప ,
    గవ్వకుఁ గొఱగావు ; మేటి కవి నందువొహో

    రిప్లయితొలగించండి
  29. అవ్వ ద్రుత సంధు లెఱుఁగవు
    నవ్వుల పాలై సళించ న్యాయమె నీకున్
    సవ్వడి సేయఁ దలంచకు
    గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందు వొహో


    బువ్వకు రాని విద్య లవి బూడిద లోని హిమాంబువుల్ కదా
    దవ్వుల కేఁగి యైనను నిదానము నూని ధనమ్ము వొందవే
    నొవ్వగునే వినంగ నిది నొచ్చవె యక్కట కాంచు మయ్యెఁ బీ
    న్గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుఁడ నందువే యొహో

    [పీన్గు + అవ్వకు = పీన్గవ్వకు; అవ్వ = తల్లి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  30. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గువ్వను జూచి నేర్వదగు గుట్టుగ శాంతికి చిహ్నమొందుటన్
    బువ్వను దెచ్చి ముక్కునిడ భూరిగ పిచ్చుక జూచి నేర్వుమా
    సవ్వడి నీది పోల్చెదవె శాఖల దాగిన కోకిలమ్మతో
    గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుండ నందువే యొహో!

    కవి = నీటికాకి

    రిప్లయితొలగించండి
  31. బువ్వకునోచనివాడనె
    చివ్వున మాటాడుటేల చిందులుయేలా?
    తొవ్వలుజూపవుకవితలు
    గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందువొహో!!

    రిప్లయితొలగించండి
  32. క: రవ్వంత కవితల కతన
    గవ్వకుఁ గొఱగావు, మేటి కవి నందువొహో
    దువ్వకు మీసములను నీ
    కివ్వదు విద్య పలుకుచెలి హీనుడ వగుటన్

    రిప్లయితొలగించండి
  33. గువ్వలుజేయునిస్వనము గుమ్ముగవీనులవిందొనర్చుచున్
    పువ్వులుగూర్చు హర్షణము పూయుచు కన్నుల విందుఁజేయుచున్
    ఎవ్విధినెంచిచూచిననుయెవ్వరితో సరిరావు యెందునన్
    "గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుండ నందువే యొహో"

    రిప్లయితొలగించండి
  34. తృవ్వట దలపై పువ్వట
    కవ్వము జిలికిన బెరుగును కమనీయంబన్
    ఎవ్వడు భువనవిజయమున
    గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందు వొహో

    రిప్లయితొలగించండి
  35. వచన కవితలంటూ ప్రాసలతో నాల్గు మాటలు పలికి విర్రవీగే శిశ్యునితో గురుదేవులు...

    కందం
    రువ్వుచుఁ బ్రాసలఁ బలుకుల
    జవ్వనమందున కవిత్వసరళి నెఱుఁగవే?
    యవ్వర కవిత్రయమెదుట
    గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందువొహో!

    ఉత్పలమాల
    రువ్వుచు ప్రాసలన్ పలికి లోకము నందు కవీశ్వరుండుగన్
    జవ్వన వేడి నందు నిజసారము నేర్వక మాటలాడితే
    యవ్వర నన్నయాది ప్రముఖాలికి పోల్చియు జూచినంతటన్
    గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుఁడ నందువే యొహో?

    రిప్లయితొలగించండి
  36. ఎవ్వరు నా సాటి యనుచు
    నువ్విటు లేన్నేని కధలు నుడివిన గానీ
    నవ్వుదురందరు నిను గని
    గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందువొహో

    రిప్లయితొలగించండి
  37. జవ్వని చెంతకు చేరుచు
    నవ్వుల పువ్వులను జల్లి నాలుగు మాటల్
    రువ్వుచు నదియే కవితన
    నవ్వుకు కొరగావు మేటికవి నందువొహో..
    (

    రిప్లయితొలగించండి
  38. నువ్వెందుకు వ్రాసితివో
    యెవ్వండును మెచ్చనట్టి యితివృత్తముతో
    జవ్వనులపైన కవితలు
    గవ్వకుఁ గొరగావు, మేటి కవినందువొహో.

    రిప్లయితొలగించండి
  39. జవ్వని పైన కైతలవి చక్కగ వ్రాసితినంచు జెప్పినన్
    నెవ్వడు మెచ్చరైరి గద యెందుకు వ్రాసితివోయి, లోకులే
    నవ్విరి పిచ్చివ్రాతలని నాణ్యత లేనివటంచు, ధాత్రిలో
    గవ్వకు గూడఁ జూడఁ గొఱగావు, కవీంద్రుడ నందువే యొహో.

    రిప్లయితొలగించండి
  40. 1)త్బృవ్వక బాబాతలపై
    మువ్వల టోపీ నిబెట్టిముంచినకవియా
    నవ్వుల వికటకవుండగ
    గవ్వకు కొరగావు మేటి కవినందువొహో !
    (కుహనా కవితో రాజు )
    2)
    నవ్విన పట్టించుకొనక
    నెవ్వరివోతస్కరించి నింపరె గోడల్
    త్రవ్వకములబయటపడగ
    గవ్వకుకొరగావు - మేటికవినఎదివొహో
    (కాపీ కొట్టే కవులు )

    రిప్లయితొలగించండి