2, మే 2019, గురువారం

సమస్య - 3004 (సత్కృతి నంకితము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్"
(లేదా...)
"సత్కృతి నంకితమ్ము గొన జంకెద రెల్ల జనుల్ విరక్తులై"

64 కామెంట్‌లు:

  1. సత్కృప జూపక యింతన్
    సత్కృషి దుష్కరపు ప్రాస సాధించుటకై
    సత్కృతిగ సమస్య నొసగ
    సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాకుమార గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిజానికి ఈనాటిది దుష్కర ప్రాస కాదు.

      తొలగించండి
    2. నిద్దుర లేస్తూ చూడగానే అలా అనిపించింది గురూజీ!

      తొలగించండి

  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    అత్కము భాగ్యనగ్రమున నందరి యిండ్లను చేర్చగోరుచున్...
    ఆత్కడు లెన్నియో విరిచి హాయిగ వోట్లను లెక్కబెట్టగా...
    అత్కుడు హైద్రబాదునను హైరన నొందగ మార్కులిచ్చుటన్
    సత్కృతి నంకితమ్ము గొన జంకెద రెల్ల జనుల్ విరక్తులై...

    అత్కము = జలము
    ఆత్కడి = సంకెళ్లు
    అత్కుడు = చంద్రుడు

    ఆంధ్రశబ్దరత్నాకరము, తెలంగాణ పదకోశము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగునన్నది. అభినందనలు.
      సరదా పూరణ అన్నారు కనుక దోషాలను పట్టుంచుకోను.

      తొలగించండి


  3. మగువా! సత్కృతి నంకిత
    ము గొనఁగ జంకెదరు జనులు మోదము కాదం
    చు గరికిపాటిగ త్రోయుచు
    సగర్వముగ తాము పల్క సరియే యనుచున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      సమస్యాపాదాన్ని స్థానభ్రంశం చేస్తూ చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు,

      తొలగించండి


    2. హమ్మయ్య ప్యాసై పోయామన్న మాట!


      జిలేబి

      తొలగించండి
  4. మ త్క్రతి గొను మా యనుచు ను
    సత్క్రుతి కర్త యొక డ డి గె సంపన్నుల నా
    సత్కృతి యే మో తెలి య క
    సత్కృ తి నం కి త ము గొన గ జంకె ద రు జనుల్

    రిప్లయితొలగించండి
  5. ఉత్కృష్ట మైన గ్రంధము
    సుత్కృత మని యంకిత మీయ సుజనుల కెల్లన్
    సత్కృతి గాకున్న భయము
    సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్

    రిప్లయితొలగించండి
  6. నిన్నటి పూరణ.

    చనగన్ ప్రాణము లెక్కచేయక అహింసాధర్మశస్త్రమ్ముతో
    మును స్వాతంత్ర్యము తెచ్చె దేశమున సమ్మోదమ్ము పెంపొందగన్
    ఘను లాంగ్లేయుల పారద్రోలి, విలసత్గాంధీప్రథన్ భారతా
    వని, తా, లోలుడె రాజపూజ్యుడును విద్వద్వంద్యుడై వెల్గెడిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      నిన్నటి సమస్యకు నేటి మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  7. (సహృదయత లేనివారిని గురించి సత్కవి ఆవేదన)
    మత్కృతి వ్రాసినాడగద
    మంజులభావములెల్ల నింపుచున్ ;
    ఛీత్కృతి జేతురేమి సొగ
    సేమియు నెంచని నేటిమానవుల్ ;
    సత్కృతి నంకితమ్ము గొన
    జంకెద రెల్లజనుల్ విరక్తులై ;
    తత్కృతదుష్టచేష్టలకు
    తత్తరమందెను నాదు డెందమే !!

    రిప్లయితొలగించండి

  8. 'సత్కృతి' యంచు పేరునిడి సారవిహీనతిరస్కృతీయమౌ
    తత్కృతినిన్ బలాత్కృతవిధాననిబద్ధము నంకితమ్మిడన్
    చీత్కృతి జేయుడే?, కృతిని చిత్తము రంజిల స్వీకరించ నా
    సత్కృతి నంకితమ్ము గొన జంకెద రెల్ల జనుల్ విరక్తులై.

    రిప్లయితొలగించండి
  9. రంగనాయకమ్మ ఆవేదన

    దుష్కృతముగ భావించుచు
    మత్కృత కావ్యము జదువరు మాత్సర్యముచే
    ఛీత్కృతి జేసెదవారల
    సత్కృతి నంకితముగొనగ జంకెదరు జనుల్ !

    రిప్లయితొలగించండి
  10. సత్కవులు కోరుచుందురు
    సత్కృతి నంకితము గొనఁగ ; జంకెదరు జనుల్
    మత్కృతి నందు కొనుమనగ ,
    సత్కారము వారికిడెద సరియగు రీతిన్

    రిప్లయితొలగించండి
  11. 🙏గురుభ్యోన్నమః🙏

    మత్కృతి నొక్కటి వ్రాసియు
    సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్
    సత్కృతుడన శంకరుగా
    సత్కృతు డతనిని దలచుచు శతకము సేతున్

    రిప్లయితొలగించండి
  12. సత్కృతి జగతికి దీపము
    సత్కృతి వికసింపజేయు సదసద్బుద్ధిన్
    ఛీత్కృత గర్హిత కవి విల
    "సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్"

    రిప్లయితొలగించండి
  13. సత్కృతులే కరువాయెను
    సత్కృతియే జీవనాడి జనులందరకున్
    సత్కృతి రచియింప నెటుల
    సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్?


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ ప్రశ్నార్థకమైన పూరణ బాగునన్నది. అభినందనలు.

      తొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. సత్కృతిలో విషమాక్షరి!
    ఉత్కృష్టము కానిదయ్యె,ఉపమలు లేవే!
    సత్కృతిగా నెట్టులగున్?
    సత్కృతి నంకితము గొనగ జంకెదరు జనుల్

    రిప్లయితొలగించండి
  16. మత్కృతి దైవముకేనని
    సత్కృప నొందిన కవి తను చాటించెనుగా
    ఉత్కృష్టంబగు నాతని
    సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్ _/\_

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్కృప నొందినట్టి కవి చక్కగ వ్రాసిన కావ్యమున్ మహా
      సత్కవు లెంత మెచ్చినను శాస్త్రము నేర్వని రాజు యా కృతిన్
      తత్కవితా విలాసముమ తక్కువ జేయుచు దూలనాడగన్
      సత్కృతి నంకితమ్ము గొన జంకెద రెల్ల జనుల్ విరక్తులై _/\_

      తొలగించండి
  17. మత్కృత శతకంబునదియె
    సాత్కృత మొనరించగా నసాధుపదములన్
    తత్కృతమందున గని నా
    సత్కృతి? నంకితము గొనఁగ జంకెదరు జనుల్

    రిప్లయితొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    మత్కృతదోషమేమొ ? యభిమానము మెండుగనుండె , భక్తితో
    సత్కృతిఁ జేయనెంచితిని శక్తికొలంది , యిదేమి భారతీ !
    తత్కృతి దుర్ముహూర్తమున దల్చితినేమొ ప్రకాశమందగా ?
    సత్కృతి నంకితమ్ము గొన జంకెద రెల్ల జనుల్ విరక్తులై !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  19. సత్కృపనుగోరి వ్రాసిన
    మత్కృప దయచేయుమంచు మనసున వేడన్
    ఉత్కృష్టమైనదేలా
    సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్!!

    రిప్లయితొలగించండి
  20. ఉత్కృష్ట కవి రచిత కవి
    తోత్కరములు పెక్కు లుండ నుర్వీ నాథా
    సత్కవి వర దేవాంకిత
    సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్


    సత్కవి సంఘ కృత్యములు చాలవె కైకొన సంస్కృ తాంధ్ర వి
    ద్యోత్కట దర్ప మానస మహోన్మదితమ్మును నిత్య గర్వ సం
    పత్కర హీన కృత్యమును వ్యాకర ణాదిగ దోష సంయు తా
    సత్కృతి నంకితమ్ము గొన జంకెద రెల్ల జనుల్ విరక్తులై

    [సంయుత + అసత్కృతి]

    రిప్లయితొలగించండి
  21. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సత్కృతి జేయగా ఘనుడు చావును పొందెను గాడ్సె చేతులన్
    సత్కృతి జేయగా కలికి చావును పొందెను సింగ్ల చేతులన్
    సత్కృతి జేయ రాజివుడు చావును పొందెను ధాను చేతులన్
    సత్కృతి నంకితమ్ము గొన జంకెద రెల్ల జనుల్ విరక్తులై!!!

    రిప్లయితొలగించండి
  22. ఈ నాటి శంకర భరణము సమస్య

    సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్"

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


    పోతనను వెక్కిరించుచు శ్రీనాధుడు “హాలికా” అని పిలుస్తాడు దానికి బదులిస్తూ పోతన తన భార్యా బిడ్డలకు ఉదర పోషణమునకు ఏ వృత్తి అయినను మంచి దే అని తెలుపుతాడు శ్రీనాధునకు భోజన సమయములో తన కావ్య కన్నియను రామునికి తప్ప ఎవరికీ అంకితము ఇవ్వను అను చెప్పు సందర్భము


    పెండ్లాడిన సతికి ప్రేతి నిడగ నాదు హాలిక వృత్తిలో హాయి గలదు ,
    సబబు ,బాల రసాల సాల నూతన పల్లవమగు కావ్య సుతను వంచకులకు
    నంకిత మిచ్చి నే నంఘస్సు చేయను, రసనేలు కోదండ రాము డెప్పు
    డర్హుడు సత్కృతి నంకితము గొనఁగ, జంకెదరు జనుల్, దృసాను కొలువు

    జేయు వారు, కావ్య సుతను సేవ్యు చెంత
    పంప వలదని భారతి బాధ పడుచు
    కంట తడిబెట్టె శ్రీనాధ, కనుము నామె
    ననుచు పోతన మాట్లాడె నబ్బురముగ

    రిప్లయితొలగించండి
  23. మత్కృతినరుడాశతకము
    సత్కృతిగాదలచమీరుజంకుటయేలా?
    సత్కృతులబాపమయ్యది
    సత్కృతినంకితముగొనగజంకెదరుజనుల్

    రిప్లయితొలగించండి
  24. చీత్కృతి చేయుచు హరి న
    సత్కార్యములనహరహము సలుపుచు శఠుడై
    మత్కృతిని గొనుమనిన నా
    సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్

    రిప్లయితొలగించండి
  25. సత్కృతులన్నవారికిలసవ్యపుభావనలేదుచేతనే
    సత్కృతినంకితమ్ముగొనజంకెదరెల్లజనుల్విరక్తులై
    సత్కృతులెప్పుడున్మనకుజక్కనిమార్గముజూపుగావుతన్
    సత్కృతిజేయగాదగునుశక్తికొలందినిమానవాళికిన్

    రిప్లయితొలగించండి
  26. రిప్లయిలు
    1. సత్కృతికర్తధీమసుఁడు;సత్కవికావ్యఁము సంస్తుతంబిలన్
      సత్కృపఁసత్కవీంద్రవర సంగత భాగ్యముఁనందుకొంటయా
      సత్క్రుతిఁమిత్రుఁకంకితముసల్పగబూనగ వద్దటంచనెన్
      సత్కృతిఁనంకితమ్ముగొనజంకెదరెల్లజనుల్ విరక్తులై

      తొలగించండి




  27. యత్కథ మతోగ్రవిధ్వం
    సత్కృతి, దూషితజనవికసత్కృతి, పుడమిన్
    యత్కథ పటునాస్తికవిక
    సత్కృతి, నంకితము గొనగ జంకెదరు జనుల్

    రిప్లయితొలగించండి
  28. సత్కృతినేరచియింపగ
    సత్కృతియనిదలుపరెవరు సాదరమొదవన్
    సత్కృతినిష్కృతిగాదా
    సత్కృతినంకితముగొనగ జంకెదరుజనుల్

    రిప్లయితొలగించండి
  29. సత్కృతి సద్గుణమౌనని
    సత్కృతిలోభాగమనుచు !"సంపదకొరకే
    సత్కృతి దలచరు!స్వార్థులు
    సత్కృతి నంకితముగొనగ జంకెదరుజనుల్

    రిప్లయితొలగించండి
  30. డా.పిట్టా సత్యనారాయణ
    సత్కృతి యని నవ కవితలు
    మత్కృత తాంబూల మనుచు మాన్యుని కిడినన్
    తత్కృతి కగు ఖర్చనుకొని
    సత్కృతి నంకితము గొనగ జంకెదరు జనుల్

    రిప్లయితొలగించండి
  31. డా.పిట్టా సత్యనారాయణ
    "సత్కృతి" పేరు కందు తన సర్వ సహం సహ జీవనమ్మునున్
    మత్కృతి యంచు ఛాందసుల మాటల దా పొగడించుకో గనన్
    సత్కృతి నెవ్వరెంచెదరు? సాహితి నెంచ "నకాడమీ"లె పో
    సత్కృతి నంకితమ్ముగొన జంకెదరెల్ల జనుల్ విరక్తులై

    రిప్లయితొలగించండి
  32. కందం:
    సత్కవి విరచితమైనను
    మత్కృతమున దైవ నింద మాటల చేతన్
    ఉత్కృష్ట గ్రంథమైనను
    "సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్"

    గొర్రె రాజేందర్
    సిద్ధిపేట

    రిప్లయితొలగించండి
  33. సత్కవి రచియించిన శుభ
    సత్కారంబను సుమధుర సద్గ్రందంబున్
    ఛీత్కారమొనర్చభువిని
    సత్కృతి నంకితము గొనగ జంకెదరు జనుల్

    రిప్లయితొలగించండి
  34. సత్కవి తెలిపిన నివ్విధి
    తత్కృతి ప్రచురణ విరాళ దాతకె ప్రేమన్
    మత్కృతి యంకిత మనినను
    సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్

    రిప్లయితొలగించండి
  35. సత్కవినేనటంచు కడు చక్కని కావ్యము వ్రాసితిన్ గదా
    మత్కృత కావ్య ముద్రణకు మాన్యులు సాయము జేయువారికిన్
    తత్కృతి నంకితమ్మదియె ధర్మమటంచును తేల్పినంతనే
    సత్కృతి నంకితమ్ము గొన జంకెదరెల్ల జనుల్ విరక్తులై

    రిప్లయితొలగించండి