24, మే 2019, శుక్రవారం

సమస్య - 3027 (కామిని పాదనూపురము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఇపుడు ఖంగున నూపుర మేల మ్రోగె"
(తేటగీతిలో పూరించరాదు)

(లేదా...)

"కామిని పాదనూపురము ఖంగున మ్రోగెను హేతువేమొకో"
(ఉత్పలమాలలో పూరించరాదు)

'...ఖంగున మ్రోగదు...' అని ప్రశస్తమైన సమస్యయే. కొద్దిగా మార్చవలసి వచ్చింది.

76 కామెంట్‌లు: 1. పుంస్త్వము పుంస్త్వంబనుచున్
  పుంస్త్వమ్మునుపొగుడుటేల ఫూల్ప్రూఫ్ టెక్నీక్
  పుంస్త్వమ్మును నింపగనే
  పుంస్త్వము లేనట్టి మగఁడు బుత్త్రు నొసంగెన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మేటరు లేని మేడము మేధావి :)


   జిలేబి

   తొలగించండి
  2. జిలేబి గారూ,
   పూరణ బాగున్నది. కాని ఇది గతంలో ఇచ్చిన సమస్య అన్న విషయాన్ని మిత్రులు గుర్తు చేసారు. అందువల్ల మార్చవలసి వచ్చింది. మన్నించండి.
   మరొక పూరణ వ్రాయండి.

   తొలగించండి

  3. సమస్య పాతదైన నేమి కొత్తదైన నేమి పూరణ మాత్రమే మా వంతు :)

   అవే ఎన్నికలు ఐదేండ్ల కొకసారి ఎన్ని కలలో ఎన్ని ఆర్భాటాలో కదా


   జిలేబి

   తొలగించండి
 2. పుంస్త్వము లేదని వగవక
  పుంస్త్వమును పొంద గోరి పోవగ వైద్యున్
  పుంస్త్వ మునకు వైద్యము
  పుంస్త్వము లేనట్టి మగఁడు బుత్త్రు నొసంగెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పూరణ బాగున్నది. మూడవ పాదంలో గణదోషం. "పుంస్త్వమ్మునకున్ వైద్యము" అనండి.
   సమస్యను మార్చాను. మరో పూరణ వ్రాయండి.

   తొలగించండి
  2. పుంస్త్వము లేదని వగవక
   పుంస్త్వమును పొంద గోరి పోవగ వైద్యున్
   పుంస్త్వ మ్మునకున్ వైద్యము
   పుంస్త్వము లేనట్టి మగఁడు బుత్త్రు నొసంగెన్

   తొలగించండి

 3. శంకరాభరణం 24/05/2019

  సమస్య


  నా పూరణ. కం!
  ***** **** ***

  పుంస్త్వము లేదని వగచక

  పుంస్త్వరాహిత్యపు పతి పుత్రుని బొందెన్

  పుంస్త్వ మిడంగ నొకండును

  పుంస్త్వము లేనట్టి మగఁడు బుత్త్రు నొసంగెన్  🌱 ఆకుల శాంతి భూషణ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
   ఇప్పుడు మార్చిన సమస్యకు కూడా పూరణ వ్రాయండి.

   తొలగించండి
 4. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,


  గురుభ్యో నమః నిన్నటి పూరణ స్వీకరింప మనవి


  పారిజకుసుమ ప్రభావమునన్ భీష్మ

  పుత్రి పరిచరు డయె పో ముకుందు

  డనుచు , సత్య కలల గని ఖేదపడె కాని

  కలలు కల్ల లైన కల్గె సుఖము

  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 5. సామజ గామి యైన నొక చక్కని చుక్క అనంగు బాధకున్
  వేమరు డస్సి,తా,ప్రియుని వెచ్చని కౌగిలి నందు జేరె;విం
  జామర వీచి,లేచి,బహు సంతస మందుచు నాట్య మాడగా
  కామిని పాద నూపురము ఖంగున మ్రోగెను హేతు వేమొకో!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మనోహరంగా ఉంది మీ పూరణ. కాని ఉత్పలమాలలో పూరించరాదన్న నియమాన్ని గమనించినట్టు లేదు.

   తొలగించండి
  2. అనండి గమనించలేదు క్షమించండి

   తొలగించండి
 6. రిప్లయిలు
  1. మధ్యాక్కరలో
   ఇంద్ర, ఇంద్ర, సూర్య , ఇంద్ర , ఇంద్ర , సూర్య గణాలు ఉండాలి.
   తేటగీతి సమస్య చివరి నుండి గణాలు విభజించే ప్రయత్నం చేస్తే,
   ఇపుడు ఖంగున నూపుర మేల మ్రోగె-
   మ్రోగె - సూర్య గణం సరిపోయింది.
   కానీ, రమేల - జగణం అయింది కదా !
   మరి మధ్యాక్కరలో ఎలా సాధ్యం ?

   తొలగించండి
  2. గురుమూర్తి ఆ చా రి
   ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


   ఉత్పలమాలను మధ్యాక్కరలో పూరించవచ్చు ఒకసారి ప్రయత్నించండి

   తొలగించండి
 7. ( అమరశిల్పి జక్కన చెక్కిన శిల్పసుందరిని చూచిన భార్య )
  ఘనమగు శిలపై జక్కన
  తనివారగ చెక్కగ సురతరుణిని ; నిజకా
  మిని పాదనూపురము ఖం
  గున మ్రోగెను ; హేతువేమొ ? కోర్కెల ఝరియా ?

  రిప్లయితొలగించండి
 8. తేటగీతి సమస్యకు ఉత్పలమాల పూరణ.

  వీరుడు మోడి తానిపుడు విజ్ఞత జూపుచు భారతావనిన్
  ధీరత గావగా నిలిచె! దేవర రెండవ సారి గెల్వగా,
  చారులు చోరులై ధరను జాణతనంబున మోసగించు పా
  కారులకంతకున్ ఇపుడు ఖంగున నూపురమేల మ్రోగెనో!

  రిప్లయితొలగించండి


 9. అనఘా సఖియ! యిపుడు ఖం
  గున నూపుర మేల మ్రోగె గుండమ్మా చె
  ప్పనగా చెప్పె జిలేబియు
  వినరా మగడా పతిసతి వేరే కాదోయ్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చెప్పుమనగా' అన్నది సాధువు. అక్కడ "గుండమ్మా చె।ప్పెను గద యిటుల జిలేబియు" అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 10. మైలవరపు వారి పూరణ

  ఘననీలదేహు దల ద..
  న్నెను కోపనయైన సత్య నెమ్మది, గన కా..
  మిని పాదనూపురము ఖం...
  గున మ్రోగెను హేతువేమొకో ? వలదనియా ?!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 11. కన కాలపు వైచిత్రిని
  కనిపెట్టను కష్టతరము కాలుని కైనన్!
  కనకపుఁ దోవ నిపుడు ఖం
  గున నూపుర మేల మ్రోగె? గురువర బాబూ!

  రిప్లయితొలగించండి


 12. అనఘా రమణి! యిపుడు ఖం
  గున నూపుర మేల మ్రోగె కోమలి ? మునుపి
  చ్చినకా లియంది యలు నా
  మనసంతా నిండె మగడ మరొకటి తెమ్మా !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. తీరని మోహ బంధ ము న దివ్య మనోహర చిత్తు లై మహా
  సారపు కామితం బు నను సంత స మందుచు నేకమైన వి
  స్తారపు రాసలీల నను తన్మయు లైన తరి న్ ప్రియం బు నై కారణ మౌచు తా నిపుడు ఖంగు న నూపుర మేల మ్రోఁగెనో !

  రిప్లయితొలగించండి
 14. వింతలు గావె చేష్టలు నవీన విధమ్మునఁ గాంచ దార నే
  కాంతము రాఁగ సేవలకు గంతులు నచ్చట వేయ కాగునే
  యంతకు మున్న లే వకట యందెలు నగ్గది కేఁగఁ గాలికిం
  గాంతకు వింతగా నిపుడు ఖంగున నూపుర మేల మ్రోగెనో


  తనర నిశీథము పెంపెసఁ
  గ నినద రాహిత్య ముండఁ గాంతుండటఁ గా
  మిని పాదనూపురము ఖం
  గున మ్రోగెను హేతువేమొకో పరమాత్మా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 15. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కనుమా! వంగల భామను!
  ఘనముగ మోడిని చరచగ ఘైఘైమని కా
  మిని పాదనూపురము ఖం
  గున మ్రోగెను హేతువేమొ?...కోరిక మూడెన్!

  రిప్లయితొలగించండి
 16. కాంత పదమ్ము నందిపుడు ఖంగున నూపుర మేల మ్రోగె న
  న్నంతను వెంగళప్ప యనె నామెకు వేసవి తాప మాపగా
  చెంతను వేడి నీళ్ళ గని చిమ్మితి నుష్ణము గూడి యుష్ణ మౌ
  కాంతరొ శీత మంచు మరి కాంతకు నచ్చక పోయె నయ్యయో.

  రిప్లయితొలగించండి
 17. తనదేహమందు సగమై
  యనపాయనియై దనరెడు నాయుమ నిజ కా
  మిని పాదనూపురము ఖం
  గున మ్రోగేను హేతువేమొ కోపించెనకో?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు! ఈరోజు పండితుల మార్గదర్శనము లేకపోయిన పూరణలు కష్టమయినవే మాబోంట్లకు!

   తొలగించండి
 18. అనఘా,చెపుమయిపుడుఖం
  గుననూపురమేలమ్రోగెగోప్యతగలదా
  ఘనమగుపాదపతాకిడి
  నెనరంగాదగులవలననెయ్యముగలిగెన్

  రిప్లయితొలగించండి
 19. చనియెను ప్రవరుం డింటికి
  తనువును దహియించి వేయ తాపం బట కా
  మిని పాదనూపురము ఖం
  గున మ్రోగెను హేతువేమొకో! కామమె గా.

  రిప్లయితొలగించండి
 20. బాలికలందు నృత్యపరిపక్వత నెంచుటలోన నోడగన్
  మేలగు నాట్యకారులకు మెప్పుగ కానుక లీయునంత కాం
  తాళము చెంది యాపడతి తాళక భూమము పైనయె ప్పుడో
  కాలిని కొట్టగా నిపుడు ఖంగున నూపుర మేల మ్రోగెనో

  రిప్లయితొలగించండి
 21. దశరథ విలాపము
  కారణమేమియున్ గననగమ్యపు గ్రోధముతోడ నిట్టులీ
  దూరమదేల బెట్టెనొ వథూమణి? రాముని యౌవరాజుగా
  నేరిచి కూర్చువేళ నిటు నిర్భర నిష్ఠుర మౌనమేలనో?
  గారడిగాదుగా నిపుడు ఖంగున నూపుర మేలమ్రోగెనో?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "గారడి గాదుగా యిపుడు" అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురీదేవా,సవరిస్తాను!

   తొలగించండి
 22. కామిని పాదనూపురము ఖంగున మ్రోగెను హేతు
  వేమొకోయందువ? కళల వేడుకలందునసంత
  సామోద బంధమున తన సాధనబంచగ నాట్య
  కోమలీ కృషికి బహుమతికో?నిటజేసె ప్రతిభగ

  రిప్లయితొలగించండి
 23. అనయము ఘల్లునమోగును
  కనమిదిఖంగనుటయందె కలలోనైనన్
  వినగానైతినిపుడుఖం
  గున నూపుర మేల మ్రోగె కోమలి జూడన్.

  రిప్లయితొలగించండి
 24. కామినిపాదనూపురముఖంగునమ్రోగెనుహేతువేమొకో
  యామినిబూర్తికాకయెనెనాలియుభర్తయురాసలీలలన్
  వామనగుంటలాడగనుబాదపుఘట్టనదాడనంబులున్
  వేమరునుంటకారణమెపీడననొందెనునూపురంబులున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాకయెనె'?

   తొలగించండి
 25. సమస్య :-
  ఇపుడు ఖంగున నూపుర మేల మ్రోగె"
  (తేటగీతిలో పూరించరాదు)

  *కందం**

  జనులు పులకించు నట్టుల
  తనువు నటనమాడవలయు తప్పులు లేకన్
  గునియు సమయము నిపుడు ఖం
  గున నూపుర మేల మ్రోగె? కొట్టెద నిన్నున్!
  ......................✍చక్రి

  గునియు : నాట్యమాడు
  నూపురము : అందె

  (గురువు లయ తప్పిన శిష్యురాలితో)

  రిప్లయితొలగించండి
 26. ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది

  *"కామిని పాదనూపురము ఖంగున మ్రోగెను హేతువేమొకో"*
  (ఉత్పలమాలలో పూరించరాదు)


  కనులార నిన్ను గాంచిన
  వనిత తనువు పులకరించె, పరవశమున కా
  మిని పాద మూపురము ఖం
  గున మ్రోగెను హేతువేమి కో, గోవిందా!

  రిప్లయితొలగించండి
 27. ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

  *"ఇపుడు ఖంగున నూపుర మేల మ్రోగె"*
  (తేటగీతిలో పూరించరాదు)


  నును జెక్కిలి యెరుపెక్కెను
  కనులందున కాంక్షరేగె కలికి పిలిచెనా
  పెనిమిటియె నిన్నిపుడు? ఖం
  గున నూపురము మ్రోగె కోమలి చెపుమా!

  రిప్లయితొలగించండి
 28. కం. పెను చీకటి సమయమ్మున
  తన ప్రేయసిఁగోరి మహలు దరిచేరగ కా
  మినిపాద నూపురము ఖం
  గున మ్రోగెను హేతువేమొ ! కోపము కాదా?

  మధ్యాక్కర

  కామిని పాదనూపురము ఖంగున మ్రోగెను హేతు
  వేమొ ?కోరిన సొమ్ములిచ్చి ప్రీతిని చూపనందులక?
  మోమున నే కురిపించు ముద్దులు తీయగ లేవ?
  లేమల మదులనెరంగ లిఖితమై జగతిఁలేదు గద!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర ప్రసాద్ గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 29. వినుమీ వింతను ప్రవరుని
  గనినం తనెచోద్య మేమొ కలవర బడకా
  మినిపా దనూపు రము ఖం
  గునమ్రో గెనుహే తువేమొ కోచెలీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదంలో గణదోషం. "గున మ్రోగెను హేతువేమొకో నా చెలియా" అనండి.

   తొలగించండి
 30. మిత్రులందఱకు నమస్సులు!

  [1]
  [తేటగీతి సమస్యకు చంపకమాలలో]

  చరణసరోజయుగ్జనిత శంకర నృత్య విశిష్టహృష్టసుం
  దరతర భంగిమమ్మునుఁ గనంగనె, చెంతనె యున్న మాత శాం
  కరి పదమందుఁ దా నిపుడు ఖంగున నూపుర మేల మ్రోగె? నా
  ద రమణి సఖ్యమే యిది! హృదబ్జమునం గళ లిట్లు వెల్లువౌ!

  [2]
  [ఉత్పలమాల సమస్యకు మధ్యాక్కర చ్ఛందంలో]

  ’కామిని పాదనూపురము ఖంగున మ్రోగెను! హేతు
  వేమొకో’ యని యన నేల? వేణువు నూఁదిన కృష్ణు
  నామెయే గ్రక్కునఁ జూచి, యానంద మంది వెన్వెంటఁ
  గామనల్ ప్రేరణ ల్వొంది, ఘనత నందఁగ నిట్లు మ్రోఁగె!

  [3]
  [ఉత్పలమాల సమస్య కందంలో]

  పెనచిన ప్రేముడి బలిమిఁ బ్రి
  యునిఁ జేరఁగఁ బరుగులెత్తియునుఁ జన నా కా
  మిని పాద నూపురము ఖం
  గున మ్రోగెను! ’హేతు వేమొకో’ యననేలా?

  [4]
  [తేటగీతి సమస్య కందంలో]

  మన కృష్ణునిఁ బిలువఁగఁ, దా
  విని, రాకున్న నలిఁగియు, భువిం దన్నెను! నా
  ఘన నాద మిదె! యిపుడు 'ఖం
  గున నూపుర మేల మ్రోఁగె గుణి!' యనెదె సఖీ?

  [5]
  [తేటగీతి సమస్య ఆటవెలదిలో]

  తకిట తధిమి తధిమి తద్ధిమి తద్ధిమి
  యనుచు నాట్యమాడ నతివ గజ్జె
  ఘల్లు మనఁగ; నిపుడు ’ఖంగున నూపుర
  మేల మ్రోఁగె’ నందువేల? కనవె?

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 31. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  *"ఇపుడు ఖంగున నూపుర మేల మ్రోగె"*
  (తేటగీతిలో పూరించరాదు)

  సందర్భము:వెన్న దొంగిలించే కోరికతో కృష్ణుడు గోపాలురు వెంట రాగా పాలు పెరుగులు దాచిపెట్టబడిన యింటి లోపలి గదిలోకి చడి చప్పుడు లేకుండా ఒక్క లాగు (లంఘనము) వేసినాడు.
  ఐతే పక్కనున్న గోడకు తలవని తలంపుగా తగిలినాడు. వెంటనే పాద నూపురం ఖంగు మని మ్రోగనే మ్రోగింది. గుట్టు బయట పడుతుం దని కంగారు పడిపోయినా రంతా.
  (శ్రీ కవి గంగుల ధర్మ రాజు గారి.. వెన్నను దొంగిలింప.. అనే పద్యం ప్రేరణతో...)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  వెన్నల దొంగ వేసె నట
  వెన్కను సంగడి గాండ్లు తోడు రాఁ
  జెన్నగు నట్టి పాదముల
  చిన్నగ మోపుచు లోని కొక్క లా
  గు.. న్నవనీతముం దినెడు
  కోర్కెను.. మెల్లగ.. గోడ తాకునన్
  ఖన్ను మనెన్ గదా!.. యిపుడు
  ఖంగున నూపుర మేల మ్రోగెనో!..

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  24.5.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 32. నా ప్రయత్నం :

  కందం
  కొనసాగఁగ త్రాగుడు నూ
  పున పతిఁ ద్రోసి గృహఁపు తలుపులు వైచెన్! కా
  మిని పాద నూపురము ఖం
  గున మ్రోగెను హేతువేమొకో! తాడనమో?

  ఉత్పలమాల
  భామల వెంట మూగుచును బ్రాందియు విస్కియు త్రాగ భర్తతో
  సేమము గాదు మీకిదని సేవన రోగమటంచుఁ బత్నియై
  ప్రేమగ జెప్ప మానకను వేదన పెంచఁగ నింటి లోనికిన్
  కామిని యీడ్చగా నిపుడు ఖంగున నూపుర మేల మ్రోగెనో?

  రిప్లయితొలగించండి