26, మే 2019, ఆదివారం

సమస్య - 3029 (ఉష్ణీషముతోడ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఉష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్"
(లేదా...)
"ఉష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్"

79 కామెంట్‌లు:

  1. తృష్ణగ పూజలు జేయుచు
    విష్ణువు నేకొలిచి నంత వేయి విధమ్ముల్
    తృష్ణాళువు పట్టు దలగ
    ఉష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఉష్ణీకము'?

      తొలగించండి
    3. క్షమించండి గురువుగారు. ఉష్ణకమనబోయి ఉష్ణీకము అన్నా
      🙏🏻

      తొలగించండి
  3. హతవిధీ! నాకేది దారి!
    కృష్ణా!ఆపద్భాంధవా!!

    ఊష్ణంబును దెచ్చును గద
    ఉష్ణక కాలమున నిట్టి యూహలుఁ జేయన్
    కృష్ణా! పూరింపనెటుల?
    *"నుష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్"*
    😭😭

    (మనలో మన మాట - కృష్ణ అంటే గజము కూడా నల్లగా ఉంటుంది కదా!)
    😄🙏🏻

    రిప్లయితొలగించండి
  4. ప్రాతః కాలపు సరదా పూరణ:

    కృష్ణుండొక్కడు వ్రేలి పైన నిలిపెన్ క్రీడించి శైలమ్మునున్
    తృష్ణన్ జెందగ తాతగారు నరుడే తీర్చెన్గ బాణమ్ముతో
    నిష్ణాతుండయి గాంధితాత బ్రిటనున్ నెట్టెన్గ క్షారముతో...
    ఉష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ప్రాతః కాలపు సరదా పూరణ:

      కృష్ణుండొక్కడు వ్రేలి పైన నిలిపెన్ క్రీడించి శైలమ్మునున్
      తృష్ణన్ జెందగ తాతగారు నరుడే తీర్చెన్గ బాణమ్ముతో
      నిష్ణాతుండయి గాంధితాత బ్రిటనున్ నెట్టెన్గ క్షారమ్ముతో ...
      ఉష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్

      విట్టుబాబు గారికి ధన్యవాదాలతో

      తొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    కిరీటి.. వాసుదేవునితో..

    తృష్ణన్ ద్రుంచి , త్వదీయచింతనమునన్ తృప్తిన్ గొనన్ సాధ్యమౌ
    నుష్ణోష్ణేతరభావసంగతరణవ్యూహమ్మునన్ శ్రేయముల్ !
    కృష్ణా ! సాయము గోరితిన్ రథమునందీవుండగా ధైర్యమౌ
    నుష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  6. శ్రీ గురుభ్యోన్నమః🙏

    కృష్ణుని నమ్మిన యే మృగ
    తృష్ణల యైనను మనుజులు తృప్తిగ త్రావన్
    ఉష్ణోదకములు, యట్లే
    ఉష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్

    భగవంతుణ్ణి నమ్మిన వాడు ఎండమావులలో తేనీరు త్రాగవచ్చు, తలపాగాతో ఏనుగునీ బంధించగలడు అను అర్థంతో..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నమ్మిన నే మృగతృష్ణల నైనను ... ఉష్ణోదకము లటులనే...' అనండి.

      తొలగించండి
    2. 🙏 తప్పక సరి జేసుకొనెదను.

      తొలగించండి
  7. ధిష్ణాకృత ధీశాలిగ
    ఘృష్ణామృత పాశ బంధ కింకర గతులన్
    కృష్ణా!యని కీర్తించుచు
    ఉష్ణీషము తోడ గట్ట నొప్పును గజమున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధిష్ణ, ఘృష్ణ'?

      తొలగించండి
  8. కృష్ణను మునుగుచు తేలుచు
    నిష్ణాతుడు గజము బోలు నెగులును బొందెన్
    ఉష్ణము, శీర్షపు క్లేశము
    ఉష్ణీషము తోడ గట్టనొప్పును గజమున్.

    రిప్లయితొలగించండి





  9. (భీముడు ద్రౌపదితో కీచకవధకు ముందు పలికిన మాటలుగా..)
    కృష్ణా!భీతియు వలదు స
    హిష్ణుతఁ జూపు,కడతేరు హీనుడు జడుడా
    తృష్ణాళువు కీచకుడిక
    "ఉష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్"

    రిప్లయితొలగించండి
  10. నిష్ణాతుడైన మావటి
    వృష్ణీకృత శౌర్య ధైర్య వీర్యము లమరన్
    ఉష్ణోగ్రత సమతుల్యంబై
    ఉష్ష్ణీషముతోడ గట్ట నొప్పును గజమున్

    రిప్లయితొలగించండి
  11. ఉష్ణోగ్రత పమయుతమై అని చదువ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  12. కృష్ణుడు పడగల నాడగ
    నుష్ణములవి కరుగసాగె నురగము కంతన్
    నిష్ణాతుల కిది సాధ్యము
    ఉష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ద్వారాకానాథ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఉష్ణములు కరుగడం'?

      తొలగించండి
    2. ఒంట్లో బలం తగ్గి, శరీరం చల్లబడసాగిందని అర్థం వస్తుందని భావించాను గురువుగారు.

      తొలగించండి
  13. కృష్ణామానోద్ధారక
    కృష్ణాపరితాపహార! గిరిధర! శౌరీ!
    కృష్ణా! నీకే వీలగు
    *"నుష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్"*

    అంతులేని చీరలనిచ్చి కృష్ణ(ద్రౌపది)మానాన్ని రక్షించావు
    ఒక్క మెతుకు తిని మునిపరివారపు ఆకలి తీర్చి కృష్ణ(ద్రౌపది)పరితాపాన్ని తగ్గించావు.
    గోవర్ధనాన్ని ధరించినావు..
    తలపాగా తో ఏనుగును బంధించడం నీకు తప్ప మరెవరికి వీలవుతుందయ్యా కృష్ణా!

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. కృష్ణ శరీరుగ బెదరక
    కృష్ణుడు మాతులుని చంపగలిగె నెటులనన్
    నిష్ణాతుడైన మావటి
    యుష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్

    కృష్ణ = ఇనుము

    రిప్లయితొలగించండి
  16. తృష్ణను మడుగును డాసిన
    కృష్ణాపతులకును గల్గె కీడట,నరరే!
    విష్ణుని సంకల్పబలము
    నుష్ణీషముతోడ గట్టనొప్పును గజమున్

    రిప్లయితొలగించండి
  17. తూష్ణీంభావ మున జనులు
    తృష్ణ త జూపిoచి యని రి ధిక్కా ర మునన్
    కృష్ణుని కైనన దె ట్టు ల
    ఉష్ణీష ము తోడ గట్ట నొప్పు ను జగము న్?

    రిప్లయితొలగించండి
  18. బొమ్మలతో ఎండలో ఆడుతున్న మనుమడితో తాత

    ఉష్ణములో తిరుగకు రా
    కృష్ణా నీడన వసింపు కృపఁదలఁచుము; అం
    జిష్ణువు మఱుఁగు వఱకు నా
    ఉష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్

    రిప్లయితొలగించండి
  19. కృష్ణునిబదఘట్టనముల
    యుష్ఞమునకుకోరలుడిగియురగముభీతిన్
    గృష్ణునివేడగనంతన్
    నుష్ణీషముతోడగట్టనొప్పునుగజమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కృష్ణుని పద ఘట్టనముల । నుష్ణమునకు...' అనండి.

      తొలగించండి
  20. మిత్రులందఱకు నమస్సులు!

    [కామావేశుడైన సైంధవుడు ద్రౌపదిని అపహరించుకొనిపోయి, పాండవులచే ఘనావమానాన్నిపొంది, శివవరబలగర్వితుడై అర్జున రహిత పాండవులను ఒకనాడు పద్యవ్యూహంలో నిరోధింపగలిగాడు. మనిషి తలచుకొంటే తలపాగాతోనైనా మదపుటేనుగును కట్టివేయవచ్చును... అని చెప్పుట]

    తృష్ణోద్భూతమహాతమోగ్రగుణుఁడై తీక్ష్ణంపుఁగామమ్మునన్
    గృష్ణన్ మ్రుచ్చిలి, వేగ పాండవులచే రీఢాత్మకుండయ్యుఁ, గ్రో
    ధోష్ణుండై శివుకై తపించి, వర సంద్యుమ్నాన రోధించెరా!
    యుష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణ: మూడో పాదాన్ని...
      ...క్రో/ధోష్ణుండై శివుకై తపించి, బలుఁడై, వ్యూహాన రోధించెరా!...అని పఠించగలరు...

      తొలగించండి
    2. మధుసూదన్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  21. ఉష్ణీయపు ప్రక్షోభము
    తృష్ణక్కయి, పొందలేక తృప్తిని సఖుడా
    కృష్ణా! పల్కితివ? యెటుల
    ఉష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్?


    ఎండాకాలంలో ఇట్లాంటి సమస్యల నిస్తే యెట్లాండి ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబిగారూ! సులభమేనండీ!శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు!ఇది చూడండి!

      ఉష్ణాయాసము హెచ్చగా దరణి దానుగ్రత్వమేపారగా
      తృష్ణాళుండగుచున్ హరించ జలమున్ తీక్ష్ణంబులౌ గోవుల
      న్నుష్ణగ్రాహి మరల్ సురక్షితమగు న్నుల్లాసమున్ బెంచగా
      నుష్ణీషంబును గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్

      ఉష్ణగ్రాహి మరలు = AC లు గోవులు = కిరణములు

      తొలగించండి
    2. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

      తొలగించండి
  22. కృష్ణు సహిష్ణు నసిత రో
    చిష్ణు మహాలంకరిష్ణు జిష్ణుఁ జరిష్ణున్
    విష్ణున్ ధృష్ణున్ వేఁడఁగ
    నుష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్


    కృష్ణా యంచును వేఁడ గోపకులు నీ కేలన్ గిరిన్నిల్పవే
    కృష్ణా యంచును వేఁడఁ గృష్ణ యట నీ కృత్యమ్ము వీక్షించమే
    కృష్ణా యెవ్విధిఁ జెప్ప నేర్తు మయ సంక్షేమంపు నీ మాయలీ
    యుష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  23. ఉష్ణోపగమమునందున
    ఉష్ణోద్థతి తాళలేకఊఱటకొరకున్
    నిష్ణాతుఁడైన మావటి
    ఉష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్"

    రిప్లయితొలగించండి
  24. తృష్ణ గల భక్తుడైనను
    కృష్ణుడు వశమగును గాదె కీర్తన తోడన్
    నిష్ణాతుడు తాఁ దలచిన
    ఉష్ణీషముతోడ గట్టనొప్పును గజమున్

    రిప్లయితొలగించండి
  25. కృష్ణుని బట్టగ కౌరవ
    తృష్ణను యూహించినంత!దివ్యత్వమునన్
    తీష్ణత బందించినచో?
    ఉష్ణీషము తోడగట్ట నొప్పును గజమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తృష్ణను నూహించి...' అనండి.

      తొలగించండి
  26. కందము
    కృష్ణా! నీవే దిక్కని
    గృష్ణ సభక్తి గొనియాడ గృప నేలె గదా!
    విష్ణున్ దలచెడి భక్తులు
    నుష్ణీషము తోడ గట్ట నొప్పును గజమున్
    ఆకులశివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి


  27. పై వారమునకు ఆకాశవాణి సమస్య తెలుపగలరు



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "సతి పదసేవ జేయదగుసౌఖ్యముకై
      భవబంధ ముక్తికై"

      అనుకుంటా

      తొలగించండి
  28. కృష్ణా! త్వత్కరుణాకటాక్షమహిమన్ గీర్తించ శక్తుండనే?
    తృష్ణాపారవిశేషతోయనిధిలో తీరమ్ముఁ జూపింతువే,
    నిష్ణాతుం డగు గాదె! మందమతియున్, దీవ్యత్కృపాలబ్ధితో
    ఉష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  29. కృష్ణా! నామొర నాలకింపుమనుచున్ గీర్తించినన్ జాలదే
    తృష్ణన్ గల్గిన భక్తకోటి యెదలో తిమ్మప్పనే నిల్చునే
    నిష్ణాతుండగు మావటీడు తనదౌ నేర్పున్ ప్రదర్శించినన్
    ఉష్ణీషంబునఁ గట్టవచ్చును మద వ్యూఢోగ్ర శుండాలమున్.

    రిప్లయితొలగించండి
  30. కృష్ణా యేలర! యల్లరుల్ వలదురా! కేల్మోడ్తు నాప్రక్కనన్
    తూష్ణంబుండుము గొల్లలిండ్ల నపవాదుం దేకుమా యంచు రో
    చిష్ణున్ ద్రాడున గట్ట, బద్ధుడగునా?, చెన్నొంద నా తల్లి యే
    ఉష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  31. తృష్ణాళమ్మున సింగమొక్కటి కడున్ దీర్ఘంపు కాంతారపున్
    నిష్ణాతమ్మగు ఱేనిగాఁ దలచుచున్ నీల్గంగ కుందేలు నీ
    జిష్ణుం డక్కడ బావినన్ గలడనన్ సింగంబు దూకెన్ గదా!
    ఉష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్

    రిప్లయితొలగించండి
  32. శార్దూలవిక్రీడితము
    నిష్ణాతుండగు రామచంద్రుఁ డనిలో నిర్వేదనన్చెందగన్
    వృష్ణీరూపు నగస్త్యుఁడెంచుచు రణాపేక్షన్ ప్రబోధించగా
    నుష్ణాంశున్ మదిఁ దల్చ బల్కె" ప్రభు వా యోర్మిన్ ప్రసాధించగా
    నుష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్"

    రిప్లయితొలగించండి