29, మే 2019, బుధవారం

సమస్య - 3032 (తాఁబేలును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా"
(లేదా...)
"తాఁబేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్"
(ఛందోగోపనము)

34 కామెంట్‌లు: 1. రోబో ప్రపంచమైనా
  తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా
  కోబాల్ ఫోర్ట్రాన్ లాంగ్వే
  జీ బాళిని జావ స్క్రిప్టు సీప్లస్సగునా :)  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  వాలములెత్తి గంతులిడు వారము మేమని గర్వమొందుచున్
  కాలము మారగా కనక కాంగ్రెసు నేతలు కున్కు తీయుచున్
  పాలకులమ్ము మేమనుచు పార్లియమెంటుకు పోటిలోన...తాఁ
  బేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్

  రిప్లయితొలగించండి


 3. ఏలెను నాడు నేలెనిక నిప్డు జిలేబివలెన్ భళారె కో
  బాలు! త్సునామి భాషలు గభాలు రొబోటికు లెన్ని వచ్చినా
  కాలము తీరి పోయినను గట్టిగ నిల్చెను దమ్ము జూపి!తాఁ
  బేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్!


  గోపాలు :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. ఏబా బైనను సుతులకు
  లాభా లనుపొంద గోరి డబ్బును దాచన్
  శోభాయ మాన మౌనని
  తాబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా ?

  రిప్లయితొలగించండి
 5. మాబడి తరగతి నందలి
  నాబాలుర కందరికిని నాచార్యుడనెన్
  తా బుద్ధి గలిగి యుండిన
  తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా?

  రిప్లయితొలగించండి
 6. గాబరపాటున పరుగున
  తాబేలది శశముఁగెల్వ తహతహలాడెన్
  కాబోదుతనకు సరియని
  తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా

  రిప్లయితొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  నేలనె బ్రాకు , దా పరుగు నేర్వదు , లక్ష్యమునెంచబోదు , నే
  కాలు కదల్చినంతనె యెకాయెకి చెంగున చేరగల్గెదన్ !
  పేలవమైన పందెమని , నీడను జేరి పరుండియున్న ., తా....
  బేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 123..ఉత్తమ పురుష..
   4 ప్రథమ పురుష...అన్వయం సరియేనా?
   సందేహం మాత్రమే...తీర్చగలరు..

   తొలగించండి
  2. ....చేరగల్గెద
   న్పేలవమైన పందెమని , నీడను జేరి పరుండియున్న ., తా.
   ఇప్పుడు చూడండి యతి.
   పందెమని , నీడను జేరి పరుండియున్న... ఇక్కటితో నుత్తమ పురుష మంతమైనది.


   తొలగించండి
  3. “యెకాయెకిఁ జెంగునఁ జేరఁ గల్గెద/ న్బేలవమైన” నిజాని కీ విధముగా నుండవలెను.

   తొలగించండి
 8. ఉ. కాలము మారుచున్నది వికారములన్నియు చేయవచ్చు! ఛా
  తీలను పెంచి వాదములఁ దిక్కగ బేలుచు మాటమార్చుచున్
  వీలును బట్టబద్ధములు పేర్చిన రాహులు నెగ్గనెంచె తా
  బేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్!!

  రిప్లయితొలగించండి
 9. పూబోణులె యధికారము
  చేబట్టినచోటనంట చేకురు జయముల్

  సౌభాగ్య, పట్టు దల గల
  తాఁబేలునుఁ జెవుల పిల్లి తవిలి గెలుచునా.

  రిప్లయితొలగించండి
 10. కాలిబలమ్మునే ఘనము
  గా నెదనమ్ముచు దంభబుద్ధితో
  మేలములాడుచున్ ; దనను
  మించుమటంచును పందెమొడ్డుచున్ ;
  వాలము ద్రిప్పుచున్ ; దుదకు
  బండగ నిద్దుర వోవ ; నెట్లు తా
  బేలును గెల్వగా జెవుల
  పిల్లికి సాధ్యమె స్పర్థ బూనినన్ ?

  రిప్లయితొలగించండి
 11. కం.జేబున పైసయు మిగులదు
  బాబుకు జూదమ్ములాట పైత్యము బట్టన్
  సాబయె జగనే చివరకు!
  తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా"

  రిప్లయితొలగించండి
 12. జాబుల ని చ్చె ద నను చును
  రేబవ లుదురాశ పెట్ట రిత్తని జనులా
  డా బును ది ర స్కరింపగ
  తాబేలు ను చెవుల బిల్ల్లి తవి లి గెలుచు నా ?

  రిప్లయితొలగించండి
 13. ఆ బీజేపీ లేదిట
  మా బాసలె నమ్ము జనులు మాదె జయమనం
  గా బీరముచెడె కారుకు
  తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా

  రిప్లయితొలగించండి
 14. డా.పిట్టా సత్యనారాయణ
  రాబోవు తరము మారును
  మాబాగీ పాత పాట మానుము నీవే
  రోబోటైతి వనకు మిక
  తాబేలును చెవులపిల్లి తవిలి గెలుచునా?(గెలుచుననుము)

  రిప్లయితొలగించండి
 15. డా.పిట్టా సత్యనారాయణ
  మేలును గోరి భౌతికత మీరినదీ పరుగెల్ల;నేడిదే
  చాలునె సత్ప్రవర్తనకు జాటిన తత్త్వము లెల్ల మిథ్య,న
  న్నేలిన కాలమే గెలుచు నిక్కమిదంచనబోకు భూమిపై
  బాలన మారె భద్రతకు పట్టము గట్టెను ఔ ననంగ తా
  బేలును గెల్వగా జెవులపిల్లికి సాధ్యమె!స్పర్ధబూనినన్

  రిప్లయితొలగించండి


 16. జాబిల్లిని విడిచి దుమికి
  పాబందిని తను విడచుచు పరుగుల నౌరా
  బాబా బ్రువ్వట యనుచున్
  తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. ఆబాబువరములీయగ
  నేబామయునిష్టపడకయిసుమంతయునున్
  డాబులబలుకులెయవియని
  తాబేలునుజెవులపిల్లిదవిలిగెలుచునా?

  రిప్లయితొలగించండి
 18. రిప్లయిలు
  1. తా బడిలోన వినిన కథ
   లోఁ బరు గిడు పందెమున నులుకి మిగుల న్గా
   రాబమున నడిగె బాలుఁడు
   తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా


   కాలుని కైన శక్యమె వికారపు మర్త్యుల చర్య లెంచఁగన్
   బేల శశేంద్ర మె ట్లెఱుఁగు భీకర మానవ వర్తనమ్ములన్
   వీలుగఁ బ్రేలు మందు నటఁ బెట్టఁగ గుంటను ముట్టి నంత దాఁ
   బేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్

   [తాను + పేలు = తాఁ బేలు]

   తొలగించండి
 19. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  బోలెడు సాహసమ్ముగొని పోరును జేరుచు గెల్వబూనగా
  చాలును వేగ మొక్కటను ఛాందసు లెల్లరి మాట నమ్మకే
  కీలక మైన కిట్కులను క్రిందను మీదను నేర్చినట్టి తాఁ
  బేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్

  రిప్లయితొలగించండి
 20. ఏబలమును భూతలమున
  తాబేలుకు లేదు గదర తర్కింపంగా
  నా బావిలోన గల యా
  తాబేలును జెవులపిల్లి తవిలి గెలుచునా?

  రిప్లయితొలగించండి
 21. రాబోవు యెన్నికందున
  బాబాయికి చెవులపిల్లి బాలన్నకిడన్
  తాబేలు గుర్తులుంచగ?
  తాబేలును జెవులపిల్లితవిలిగెలుచునా? (తప్పకమోసాన)

  రిప్లయితొలగించండి
 22. మిత్రులందఱకు నమస్సులు!

  జాలము లేక కృత్యమును జక్క నొనర్చెడు కార్యశీలితోఁ,
  గేళిగ స్పర్థఁ దాఁ గొనియుఁ, గ్రేణి యొనర్చుచుఁ, బర్వులెత్తుచున్,
  సోలి, యుపేక్ష తోడఁ జనుచున్, శయనించు శశమ్మె యద్ది! తాఁ
  బేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్?

  రిప్లయితొలగించండి
 23. ఏబాలుడు శ్రీకృష్ణుని
  చేబడి నిజరూపుడయ్యె చేదగు మాట
  ల్నాబాలుడె బల్కెనహో!
  తాబేలును చెవులపిల్లి దవిలి గెలుచునా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జాలిని మేనయల్లుడని జంపగనేరక నూరుతప్పులన్
   దాళుచు నూరుకొన్న దరిదాటుచు బ్రేలగ కారుకూతలన్
   లీలగద్రుంచె శీర్షమును లేకితనంబును జీదరించి,తా
   బేలును గెల్వగా జెవులపిల్లికి సాధ్యమె స్పర్ధబూనినన్ ?

   తొలగించండి
 24. ఉత్పలమాల
  తేలఁగ మందరన్ నిలుప తీరుగ కూర్మము నిబ్బరమ్ముగన్
  గ్రోలఁగ క్షీరసంద్రమున గూరెను కంజము దైవ సేవ్యమై
  వాలము నూపుచున్ వడిగ పారునె గాని భరమ్ము మ్రోయు తాఁ
  బేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్

  రిప్లయితొలగించండి
 25. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా

  సందర్భము: ప్రసిద్ధమైన నీతి కథ ఆధారంగా..
  ఒకసారి తాబేలు కుందేలు పరుగు పందెం వేసుకున్నా యట!
  తాబేలుకు పాకడమే తెలుసు గాని పరుగెత్తటం రాదు గదా! నా కేం పర్వా.. చెంగున గెంతుతూ చిటికెలో గమ్యం చేరుకోగలను. ఈ పందె మొక లెక్కా! కాసేపు చెట్టు నీడను మేను వాల్చి బయలుదేరినా సరిపోతుందిలే! కొంప లంటుకుపోయేదేమీ లేదు. అనుకున్న దట కుందేలు!
  ఈలోగా చెవులపిల్లి అతి విశ్వాసాన్ని (over cofidence) గమనించిన తాబేలు మెల్లగా పాకే దైనప్పటికీ నిరంతర కృషి తత్వం జాగరూకత గలది కావటంవల్ల గమ్యం చేరుకోనే చేరుకుంది. కుందేలు వెనుకబడింది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "తాఁ బాకు.. పరుగు నేర్వదు..
  నేఁ బరుగిడెదను.. రవంత నిదురింతు" ననెన్
  తా బేల గదా శశ మది..
  తాఁబేలునుఁ జెవుల పిల్లి తవిలి గెలుచునా!

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  29.5.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 26. మేలుగ వేగమున్ గలిగి మెండుగ ధైర్యము గూడి నుండినన్
  చాలు నటంచు గర్వముగ సాటియె గాదని విర్రవీగినన్
  నేలను నీట నైన గడు నేర్పుగ సాగెడి బుద్ధి శాలి తాఁ
  బేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్

  రిప్లయితొలగించండి