ప్రాతః కాలపు సరదా పూరణ: పలువురు వైరులే గెలిచి పండుగ చేయుచు బీరు త్రాగెడిన్కలలవి చూచి నాయకుడు కంపర మొందుచు గుండెబాదగామెలకువ రాగనే తనకు మెండుగ స్వేదము పోయు క్లేశపుం కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో
ప్రభాకర శాస్త్రి గారూ,క్లేశపు కలలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు."బీరు త్రాగగా... మెలకువ వచ్చినంతటనె..." అనండి.
🙏
( అభిమన్యుడు పద్మవ్యూహానికి వెళుతూ ఉత్తరతో )మిలమిలలాడు కన్నులను మెల్లగ జార్చకు నీటిముత్తెముల్ ;విలవిలలాడు మానసపు వేదన కొంచెము చిక్కబట్టుమా !కిలకిలనవ్వుచున్ బనుపు ;కేళిగ యుద్ధమొనర్చి వత్తునే !కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో !!
జంధ్యాల వారూ,మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.'
ధన్యవాదాలండీ!
రాత్రి పగలు మదిని రావము గా తొలచు తలపులవి ఫలము శూన్యమయ్యెవిధి విలాసముగ భవితకు పనికిరానికలలు కల్లలైనఁ గల్గె ముదము!జిలేబి
జిలేబీ గారూ,చక్కని భావయుక్తమైన పూరణ. అభినందనలు.
పీడ కలలవెన్నొ వేదన కలిగింపకూడు నిద్ర మాని కుములుచు మదికలత చెంది నేను విలపించు నవ్వేళకలలు కల్ల లైనఁ గల్గె ముదము.
విరించి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య :-"కలలు కల్లలైనఁ గల్గె ముదము"*ఆ.వె**ఓట్లు గెలిచి పిదప కోట్లు కూడగ బెట్టరాజకీయ వ్యూహ రచన జేసెప్రజలు దెలిసి భంగ పరచ, నాకును వానికలలు కల్ల లైన గల్గె ముదము ......................✍చక్రి
చక్రపాణి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కనులు మూసి నంత కరణము లేకుండ కయ్య మాడు చుండె గరిత కాళి భీతి చెంది నేను బిగుసుకొ నియుండ కలలు కల్లలైనఁ గల్గె ముదము
అక్కయ్యా,మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
మలమల కొందలమ్ములసమానపు రీతిని కర్మ భోగముల్సలసల మాడు మూఢములు సవ్యత నవ్యత లేని చింతలున్ములముల బోవ గా సరసి, మోహన రాగపు పంక్తి దోచెడాకలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదోజిలేబి
జిలేబి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తలచి నట్టి దోకటి దైవ మొకటి చే సె గుడ్డి లో న మెల్ల కోర్కె తీరె జయము పొంది తాను సంబర మందు చు కలలు క ల్ల్ల లైన గల్గె ముదము
రాజేశ్వర రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా పూరణ. చం.మా.***** **** ***కలుషితమైన మానసము గల్గియు నిచ్చిన హామి దప్పుచున్పలువిధ యక్రమార్గమున పైకము గోరెడు నాయకుండు తాగెలువక నోడె ఘోరమున ;గేలొనరించె ప్రజాళి;వానిదౌకలలవి; కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో 🌱 ఆకుల శాంతి భూషణ 🌱 🌷 వనపర్తి🌷
శాంతిభూషణ్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'విధ + అక్రమ' అన్నపుడు సవర్ణ దీర్ఘసంధి వస్తుంది. 'అక్రమమార్గము' అనవలసింది 'అక్రమార్గము' అన్నారు.
Exit pollఆంధ్ర దాష్ట్ర మందు నాశపడి కనినకలలు కల్లలైనఁ ; గల్గె ముదముకేంద్ర మందు నేను కేకరించి నటులకుదిరె మిత్రపక్ష కూటమి జితి
సీతారామయ్య గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాకుమార గారూ,మొదటి పూరణ కందంలో చేసారు. సమస్యాపాదం ఆటవెలది.రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. సవరించండి.
తెలతెల వారు చుండగను దేహము నిండుగ పట్టె చెమ్మటల్మెలకువ వచ్చి చూడగను మేలది తోచెను స్వప్న మంచు నాకలతలు పెంచు పీడ కల కారణమా వ్యధకంచు,నిట్టివౌ కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో
తెల్లవారుజాము దేహము క్రమ్మెనుచెమ్మ చలియు లేక చిత్రముగనుపీడకలన,నిట్లు వేదన పెంచెడుకలలు కల్లలైనఁ గల్గె ముదము
🙏 నిదుర మబ్బు పొరపాట్లు 🙏
ఎన్నికలలుకందురెన్నికలందునతామెగెల్తుమంచు తథ్యముగనుఎదిరి పార్టివారు ఎన్నికనోడినకలలుకల్లలైన కల్గె ముదము
ఫణీంద్ర గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ నలుగురు దొంగలొక్కటయి నన్ బెదిరింపనరణ్యమందు నే... నలసితి వారితో పెనుగులాడుచు , గట్టిగ పిల్చునంతలోమెలకువ వచ్చి గిచ్చుకొని మేనును నవ్వితి., నివ్విధమ్ములౌ కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో !!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పీడకలతో మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రాజకీయమందు రాటుదేలిన నేతచంద్రబాబు నెన్న జనము నేడురాజపీఠమెక్క రంజిల్లెడి జగనుకలలు కల్లలైన గల్గె ముదము
సీతాదేవి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
డా. పిట్టా సత్యనారాయణఅస్తమించలేని అర్కుని సాధించుబ్రిటిషు వారి స్వప్న భేషజమునుగాంధి యడచగాదె గర్వ మణగె, నాటికలలు కల్లలైన కలిగె ముదము
డా. పిట్టా వారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మగత నిద్ర వంటి మనిషి జీవితమునరేపు నేటి మార్పు రెప్ప పాటుకనులు తెరచి నిజముఁ గాంచుట మోక్షమేకలలు కల్లలైనఁ గల్గె ముదము..
రామ్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణఇల బలు యూహలన్ జెలగి యీప్సితముల్ చిగురించ దైవమున్బలువిధ కార్యధుర్యుడవె భక్తిని గొల్వగలేవు దైవమున్మెలకువ గూర్చ మూలము సమేతముగా బెరికేయ నాశలన్;జలరుహనాభుడిచ్చునట జాలము జేయకు మోక్షమబ్బు నీకలలవి కల్లలైనపుడు కల్గెడు మోదమదెంత గొప్పదో!
కన్నవారికైన కావలసిన వారికైన కీడు చేటు గల్గినట్లుమనసు క్లేశ మందు మునుచేయు నీ పీడకలలు కల్లలైనఁ గల్గె ముదము ౹౹
రఘురామ్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భరత మాత యేడ్వ భారమాయెను గుండెనిద్ర లేచి జూడ నిజము దెలిసెమోడి మరల గెల్వ మోదంబు హెచ్చెగాకలలు కల్లలైనఁ గల్గె ముదము!
యజ్ఞేశ్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తెలతెల వారువేళ,నతి తీవ్రమునైనది,వింతయైనదిన్,కలచెడునట్టిదైన కల గంటిని, దుష్టుడు కత్తితో ననున్ కులుకుచు పొత్తలో పొడిచె క్రూరముగా;భయ మంది లేచితిన్;కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో!
ప్రసాద రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు."వింత గొల్పుచున్... పొట్టలో.." అనండి.
ధన్యవాదములు
ఫలితము దేలెడిన్ దినము పాలనపగ్గము జేకొనంగగన్ విలువగు సీట్లగోలుపడి వెర్రిగకేకలువేయు దృశ్యమున్ తెలతెలవారు ఝామున యధీరత బెంచెడురీతి గాంచగా కలలవి కల్లలైనపుడు కల్గెడి మోదమదెంత గొప్పదో!
సీతాదేవి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'...దేలు నీదినము... జేకొనంగ తా... జామున నధీరత..' అనండి. (ఝాము శబ్దాన్ని బ్రౌణ్యం, శ్రీహరి నిఘంటువు పేర్కొన్నా అది సాధురూపం కాదు)
ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!
ఫలితము దేలునీదినము పాలనపగ్గము జేకొనంగ తావిలువగు సీట్లుగోలుపడి వెర్రిగకేకలువేయు దృశ్యమున్ తెలతెలవారుజామున నధీరత బెంచెడురీతి గాంచగా కలలవి కల్లలైనపుడు కల్గెడి మోదమదెంత గొప్పదో!
చెట్టు పేరు చెప్ప చెల్లున కాయలుగాంధి పేరు జెఱచె గాంచగానుకాంగి రేసు గెలుపు కాంక్షలన్ని పగటికలలు కల్లలైనఁ గల్గె ముదము
బాలకృష్ణ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జనుల సేవజేయ జననేత గావలెఎన్ని కలలలోన యెన్నబడినఎంత పుణ్య మదియ,యేలనిజమగునుకలలు కల్లలైనఁ గల్గె ముదము!!
గంగాప్రసాద్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'లోన నెన్నబడిన..' అనండి.
పగలు రాత్రి లేక పదవి కొరకు తానుపడిన కష్టమంత వ్యర్థమంచుఫలితములను జూపి భయపెట్టునా పీడకలలు కల్లలైనఁ గల్గె ముదము
కలతలు లేక జీవితము కమ్మగ సాగుచు హాయి నుండగాకలవరమౌను కష్టముల గాధలనైనను గాంచినంతనేకలలనె యైన గాని నరకంబుగ దోచు భయానకమ్ములౌకలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో
సూర్య గారూ,మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏రైతు జీవితాన రాళ్లు మిగిలిననుకూడునిచ్చి మనకు, కుంగిపోకతానుపడిన బాధ, తాఁగన్న యా చేదుకలలు కల్లలైనఁ గల్గె ముదము🙏🙏🙏🙏🙏🙏🙏🙏ముడుంబై ప్రవీణ్ కుమార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రవీణ్ కుమార్ గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'క్రుంగిపోక' అనండి.
🙏🙏🙏🙏🙏
కలనుగంటినిన్నకాడుజూచినటులకలలుకల్లలైనగల్గెముదముకలలుకలలుగానెగాంచుచోగలుగునుసుఖముమనకునిజముసూర్య!వినుము
సుబ్బారావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవెలదిదున్నపోతు రౌతు ద్రుంచిన రీతిగకలను గాంచె రాజు కలత నొందెనిద్ర లేచి చూడ నిజమది కలయయ్యెకలలు కల్ల లైన గల్గె ముదము ఆకుల శివరాజ లింగం వనపర్తి ్్
శివరాజలింగం గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వర్ష ముద్భవంపు భంగి వరము లీయఁ గర్షకులకు నెల్ల మర్ష మలరి పంట కొఱకు నీయ దొంటి ఋణమ్ములఁ గలలు కల్లలైనఁ గల్గె ముదము [కల = వడ్డీ]నలిన దళాక్షి కైక నిజ నాథుని చావున కయ్యె హేతువే యెల పద మెత్తి తన్నె నొక యింతియె యెయ్యది సేయఁ నేర్చుఁ బే రలుక సతీ మతల్లి యిలు లందుఁ జెలంగును నుంకు లంచు శంక లలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో [శంకలు + అలవి; అలవి = కొలఁది; నుంకులు = పస్తులు]
కామేశ్వర రావు గారూ,మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) తలపులు మెండుగా మెరిసి తాండవ మాడగ మోహనమ్మునన్తలుపులు మూసి నా మదిని తన్నుకు వచ్చెడి కాంక్షనందునన్వలపున వంగ రాణినట బాహుల జేర్చుచు పెండ్లియాడెనన్ కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో
ప్రభాకర శాస్త్రి గారూ, మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
అంతు లేని వెతల యవినీతి పాలనెయంత మయ్యెను గద యెంత సుఖము !'తిరిగి గెలుపు మాదె'మరలయనెడి వారికలలు కల్లలైనఁ గల్గె ముదము
జనార్దన రావు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలలనుగందురందఱునుగాఢపునిద్రనుభీతిగొల్పువైకలలవికల్లలైనపుడుకల్గెడిమోదమదెంతగొప్పదోకలలులనుండుమంచివియుగంటికినింపునుగొల్పునట్టియౌతలపులలోనదాగుచునుదద్దయుహర్షముగల్గజేయుగా
కలలవి యెన్నొరీతులుగ గాంచితి రాతిరి నిద్రయందునన్ గలవరమాయె మానసము కన్నుల నీరునిండగన్ మెలకువ వచ్చెనాకపుడు మిథ్యయటంచునెఱంగినంతనే కలలవి కల్లలైనపుడు కల్గెడి మోదమదెంత గొప్పదో.
ఈ వారమునకు ఆకాశవాణి సమస్య తెలియ జేయగలరుజిలేబి
ధర్మా చరణము జనులకు దైన్యము పెంచున్ [ ఆకాశ వాణి వారి సమస్య ]
savarimchina pUraNa కనులు మూసి నంత కరణము లేకుండ కయ్య మాడు చుండె గరిత కాళి భీతి చెంది నేను బేజారు పడియుండ కలలు కల్లలైనఁ గల్గె ముదము
కేసియార్ ఊహల్లో....చంపకమాలగెలిచిన స్ఫూర్తితో దనరి కేంద్రమునందున త్రిప్ప చక్రమున్గలువగ కేసియార్ మొదట కాదని చెప్పక ముఖ్య నాయకుల్నిలువఁగ బాబు వెంటపడి నేరుగ కూటమి యోడ వైరివౌకలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో!
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిపలువురు వైరులే గెలిచి పండుగ చేయుచు బీరు త్రాగెడిన్
కలలవి చూచి నాయకుడు కంపర మొందుచు గుండెబాదగా
మెలకువ రాగనే తనకు మెండుగ స్వేదము పోయు క్లేశపుం
కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో
ప్రభాకర శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిక్లేశపు కలలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"బీరు త్రాగగా... మెలకువ వచ్చినంతటనె..." అనండి.
🙏
తొలగించండి( అభిమన్యుడు పద్మవ్యూహానికి వెళుతూ ఉత్తరతో )
రిప్లయితొలగించండిమిలమిలలాడు కన్నులను
మెల్లగ జార్చకు నీటిముత్తెముల్ ;
విలవిలలాడు మానసపు
వేదన కొంచెము చిక్కబట్టుమా !
కిలకిలనవ్వుచున్ బనుపు ;
కేళిగ యుద్ధమొనర్చి వత్తునే !
కలలవి కల్లలైనపుడు
కల్గెడి మోద మదెంత గొప్పదో !!
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'
ధన్యవాదాలండీ!
తొలగించండి
రిప్లయితొలగించండిరాత్రి పగలు మదిని రావము గా తొల
చు తలపులవి ఫలము శూన్యమయ్యె
విధి విలాసముగ భవితకు పనికిరాని
కలలు కల్లలైనఁ గల్గె ముదము!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిచక్కని భావయుక్తమైన పూరణ. అభినందనలు.
పీడ కలలవెన్నొ వేదన కలిగింప
రిప్లయితొలగించండికూడు నిద్ర మాని కుములుచు మది
కలత చెంది నేను విలపించు నవ్వేళ
కలలు కల్ల లైనఁ గల్గె ముదము.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య :-
రిప్లయితొలగించండి"కలలు కల్లలైనఁ గల్గె ముదము"
*ఆ.వె**
ఓట్లు గెలిచి పిదప కోట్లు కూడగ బెట్ట
రాజకీయ వ్యూహ రచన జేసె
ప్రజలు దెలిసి భంగ పరచ, నాకును వాని
కలలు కల్ల లైన గల్గె ముదము
......................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కనులు మూసి నంత కరణము లేకుండ
రిప్లయితొలగించండికయ్య మాడు చుండె గరిత కాళి
భీతి చెంది నేను బిగుసుకొ నియుండ
కలలు కల్లలైనఁ గల్గె ముదము
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
రిప్లయితొలగించండిమలమల కొందలమ్ములసమానపు రీతిని కర్మ భోగముల్
సలసల మాడు మూఢములు సవ్యత నవ్యత లేని చింతలున్
ములముల బోవ గా సరసి, మోహన రాగపు పంక్తి దోచెడా
కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తలచి నట్టి దోకటి దైవ మొకటి చే సె
రిప్లయితొలగించండిగుడ్డి లో న మెల్ల కోర్కె తీరె
జయము పొంది తాను సంబర మందు చు
కలలు క ల్ల్ల లైన గల్గె ముదము
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండినా పూరణ. చం.మా.
***** **** ***
కలుషితమైన మానసము గల్గియు నిచ్చిన హామి దప్పుచున్
పలువిధ యక్రమార్గమున పైకము గోరెడు నాయకుండు తా
గెలువక నోడె ఘోరమున ;గేలొనరించె ప్రజాళి;వానిదౌ
కలలవి; కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో
🌱 ఆకుల శాంతి భూషణ 🌱
🌷 వనపర్తి🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విధ + అక్రమ' అన్నపుడు సవర్ణ దీర్ఘసంధి వస్తుంది. 'అక్రమమార్గము' అనవలసింది 'అక్రమార్గము' అన్నారు.
Exit poll
రిప్లయితొలగించండిఆంధ్ర దాష్ట్ర మందు నాశపడి కనిన
కలలు కల్లలైనఁ ; గల్గె ముదము
కేంద్ర మందు నేను కేకరించి నటుల
కుదిరె మిత్రపక్ష కూటమి జితి
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిరాకుమార గారూ,
తొలగించండిమొదటి పూరణ కందంలో చేసారు. సమస్యాపాదం ఆటవెలది.
రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. సవరించండి.
తెలతెల వారు చుండగను
తొలగించండిదేహము నిండుగ పట్టె చెమ్మటల్
మెలకువ వచ్చి చూడగను మేలది తోచెను స్వప్న మంచు నా
కలతలు పెంచు పీడ కల కారణమా వ్యధకంచు,నిట్టివౌ
కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో
తెల్లవారుజాము దేహము క్రమ్మెను
తొలగించండిచెమ్మ చలియు లేక చిత్రముగను
పీడకలన,నిట్లు వేదన పెంచెడు
కలలు కల్లలైనఁ గల్గె ముదము
🙏 నిదుర మబ్బు పొరపాట్లు 🙏
తొలగించండిఎన్నికలలుకందురెన్నికలందున
రిప్లయితొలగించండితామెగెల్తుమంచు తథ్యముగను
ఎదిరి పార్టివారు ఎన్నికనోడిన
కలలుకల్లలైన కల్గె ముదము
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండినలుగురు దొంగలొక్కటయి నన్ బెదిరింపనరణ్యమందు నే...
నలసితి వారితో పెనుగులాడుచు , గట్టిగ పిల్చునంతలో
మెలకువ వచ్చి గిచ్చుకొని మేనును నవ్వితి., నివ్విధమ్ములౌ
కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పీడకలతో మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరాజకీయమందు రాటుదేలిన నేత
రిప్లయితొలగించండిచంద్రబాబు నెన్న జనము నేడు
రాజపీఠమెక్క రంజిల్లెడి జగను
కలలు కల్లలైన గల్గె ముదము
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండిడా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఅస్తమించలేని అర్కుని సాధించు
బ్రిటిషు వారి స్వప్న భేషజమును
గాంధి యడచగాదె గర్వ మణగె, నాటి
కలలు కల్లలైన కలిగె ముదము
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మగత నిద్ర వంటి మనిషి జీవితమున
రిప్లయితొలగించండిరేపు నేటి మార్పు రెప్ప పాటు
కనులు తెరచి నిజముఁ గాంచుట మోక్షమే
కలలు కల్లలైనఁ గల్గె ముదము..
రామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఇల బలు యూహలన్ జెలగి యీప్సితముల్ చిగురించ దైవమున్
బలువిధ కార్యధుర్యుడవె భక్తిని గొల్వగలేవు దైవమున్
మెలకువ గూర్చ మూలము సమేతముగా బెరికేయ నాశలన్;
జలరుహనాభుడిచ్చునట జాలము జేయకు మోక్షమబ్బు నీ
కలలవి కల్లలైనపుడు కల్గెడు మోదమదెంత గొప్పదో!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కన్నవారికైన కావలసిన వారి
రిప్లయితొలగించండికైన కీడు చేటు గల్గినట్లు
మనసు క్లేశ మందు మునుచేయు నీ పీడ
కలలు కల్లలైనఁ గల్గె ముదము ౹౹
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భరత మాత యేడ్వ భారమాయెను గుండె
రిప్లయితొలగించండినిద్ర లేచి జూడ నిజము దెలిసె
మోడి మరల గెల్వ మోదంబు హెచ్చెగా
కలలు కల్లలైనఁ గల్గె ముదము!
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తెలతెల వారువేళ,నతి తీవ్రమునైనది,వింతయైనదిన్,
రిప్లయితొలగించండికలచెడునట్టిదైన కల గంటిని, దుష్టుడు కత్తితో ననున్
కులుకుచు పొత్తలో పొడిచె క్రూరముగా;భయ మంది లేచితిన్;
కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో!
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వింత గొల్పుచున్... పొట్టలో.." అనండి.
ధన్యవాదములు
తొలగించండిఫలితము దేలెడిన్ దినము పాలనపగ్గము జేకొనంగగన్
రిప్లయితొలగించండివిలువగు సీట్లగోలుపడి వెర్రిగకేకలువేయు దృశ్యమున్
తెలతెలవారు ఝామున యధీరత బెంచెడురీతి గాంచగా
కలలవి కల్లలైనపుడు కల్గెడి మోదమదెంత గొప్పదో!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...దేలు నీదినము... జేకొనంగ తా... జామున నధీరత..' అనండి. (ఝాము శబ్దాన్ని బ్రౌణ్యం, శ్రీహరి నిఘంటువు పేర్కొన్నా అది సాధురూపం కాదు)
ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!
తొలగించండిఫలితము దేలునీదినము పాలనపగ్గము జేకొనంగ తా
తొలగించండివిలువగు సీట్లుగోలుపడి వెర్రిగకేకలువేయు దృశ్యమున్
తెలతెలవారుజామున నధీరత బెంచెడురీతి గాంచగా
కలలవి కల్లలైనపుడు కల్గెడి మోదమదెంత గొప్పదో!
చెట్టు పేరు చెప్ప చెల్లున కాయలు
రిప్లయితొలగించండిగాంధి పేరు జెఱచె గాంచగాను
కాంగి రేసు గెలుపు కాంక్షలన్ని పగటి
కలలు కల్లలైనఁ గల్గె ముదము
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జనుల సేవజేయ జననేత గావలె
రిప్లయితొలగించండిఎన్ని కలలలోన యెన్నబడిన
ఎంత పుణ్య మదియ,యేలనిజమగును
కలలు కల్లలైనఁ గల్గె ముదము!!
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లోన నెన్నబడిన..' అనండి.
పగలు రాత్రి లేక పదవి కొరకు తాను
రిప్లయితొలగించండిపడిన కష్టమంత వ్యర్థమంచు
ఫలితములను జూపి భయపెట్టునా పీడ
కలలు కల్లలైనఁ గల్గె ముదము
కలతలు లేక జీవితము కమ్మగ సాగుచు హాయి నుండగా
తొలగించండికలవరమౌను కష్టముల గాధలనైనను గాంచినంతనే
కలలనె యైన గాని నరకంబుగ దోచు భయానకమ్ములౌ
కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో
సూర్య గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రిప్లయితొలగించండిరైతు జీవితాన రాళ్లు మిగిలినను
కూడునిచ్చి మనకు, కుంగిపోక
తానుపడిన బాధ, తాఁగన్న యా చేదు
కలలు కల్లలైనఁ గల్గె ముదము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ముడుంబై ప్రవీణ్ కుమార్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రవీణ్ కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'క్రుంగిపోక' అనండి.
🙏🙏🙏🙏🙏
తొలగించండికలనుగంటినిన్నకాడుజూచినటుల
రిప్లయితొలగించండికలలుకల్లలైనగల్గెముదము
కలలుకలలుగానెగాంచుచోగలుగును
సుఖముమనకునిజముసూర్య!వినుము
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవెలది
రిప్లయితొలగించండిదున్నపోతు రౌతు ద్రుంచిన రీతిగ
కలను గాంచె రాజు కలత నొందె
నిద్ర లేచి చూడ నిజమది కలయయ్యె
కలలు కల్ల లైన గల్గె ముదము
ఆకుల శివరాజ లింగం వనపర్తి
్్
శివరాజలింగం గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వర్ష ముద్భవంపు భంగి వరము లీయఁ
రిప్లయితొలగించండిగర్షకులకు నెల్ల మర్ష మలరి
పంట కొఱకు నీయ దొంటి ఋణమ్ములఁ
గలలు కల్లలైనఁ గల్గె ముదము
[కల = వడ్డీ]
నలిన దళాక్షి కైక నిజ నాథుని చావున కయ్యె హేతువే
యెల పద మెత్తి తన్నె నొక యింతియె యెయ్యది సేయఁ నేర్చుఁ బే
రలుక సతీ మతల్లి యిలు లందుఁ జెలంగును నుంకు లంచు శం
క లలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో
[శంకలు + అలవి; అలవి = కొలఁది; నుంకులు = పస్తులు]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
తలపులు మెండుగా మెరిసి తాండవ మాడగ మోహనమ్మునన్
తలుపులు మూసి నా మదిని తన్నుకు వచ్చెడి కాంక్షనందునన్
వలపున వంగ రాణినట బాహుల జేర్చుచు పెండ్లియాడెనన్
కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
అంతు లేని వెతల యవినీతి పాలనె
రిప్లయితొలగించండియంత మయ్యెను గద యెంత సుఖము !
'తిరిగి గెలుపు మాదె'మరలయనెడి వారి
కలలు కల్లలైనఁ గల్గె ముదము
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలలనుగందురందఱునుగాఢపునిద్రనుభీతిగొల్పువై
రిప్లయితొలగించండికలలవికల్లలైనపుడుకల్గెడిమోదమదెంతగొప్పదో
కలలులనుండుమంచివియుగంటికినింపునుగొల్పునట్టియౌ
తలపులలోనదాగుచునుదద్దయుహర్షముగల్గజేయుగా
కలలవి యెన్నొరీతులుగ గాంచితి రాతిరి నిద్రయందునన్
రిప్లయితొలగించండిగలవరమాయె మానసము కన్నుల నీరునిండగన్
మెలకువ వచ్చెనాకపుడు మిథ్యయటంచునెఱంగినంతనే
కలలవి కల్లలైనపుడు కల్గెడి మోదమదెంత గొప్పదో.
రిప్లయితొలగించండిఈ వారమునకు ఆకాశవాణి సమస్య తెలియ జేయగలరు
జిలేబి
ధర్మా చరణము జనులకు దైన్యము పెంచున్ [ ఆకాశ వాణి వారి సమస్య ]
తొలగించండిsavarimchina pUraNa
రిప్లయితొలగించండికనులు మూసి నంత కరణము లేకుండ
కయ్య మాడు చుండె గరిత కాళి
భీతి చెంది నేను బేజారు పడియుండ
కలలు కల్లలైనఁ గల్గె ముదము
కేసియార్ ఊహల్లో....
రిప్లయితొలగించండిచంపకమాల
గెలిచిన స్ఫూర్తితో దనరి కేంద్రమునందున త్రిప్ప చక్రమున్
గలువగ కేసియార్ మొదట కాదని చెప్పక ముఖ్య నాయకుల్
నిలువఁగ బాబు వెంటపడి నేరుగ కూటమి యోడ వైరివౌ
కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో!