31, మే 2019, శుక్రవారం

సమస్య - 3034 (ఉత్పలగంధి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఉత్పలగంధి యిప్పు డూహూ యనకే"
(ఛందోగోపనము)
(లేదా...)
"ఉత్పలగంధిరో యిపుడు నీ వూహూ యనం బాడియే"
(ఛందోగోపనము)

49 కామెంట్‌లు:

 1. సత్ఫలము పొంద గోరిన
  నుత్పాదము లెదు రైన న్యూనత వీడన్
  తత్ఫలితము దక్కు ననుకొని
  ఉత్పల గంధిక యిప్పు డూహూ యనకే

  రిప్లయితొలగించండి
 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  చెమటల్ పోసెను నాకిటన్ సుఖముగా శీఘ్రమ్ముగా పల్కవే
  "కమలం" చిహ్నము వాడిపోయెగదనే కంగారునన్ భారతీ!
  సమరంబందున పారిపోయితివి నీ సల్లాపమే లేదుగా...
  ఉమరో! యుత్పలగంధిరో!యిపుడు నీ వూహూ యనం బాడియే!

  రిప్లయితొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  సుబ్బిశెట్టి...

  సకలార్థమ్ములు ధారవోసితిని నీ సాంగత్యమున్ కోరుచున్ ,
  వికలంబయ్యె మనంబు , చిత్తజుడు నన్ వేధించుచుండంగ ., వా...
  చికముల్ చాలునులే , రమించెదమికన్ చింతామణీ ! నీవునే...
  నొకటై , ఉత్పలగంధిరో యిపుడు నీ వూహూ యనం బాడియే !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలగంధి.... ఒక గాయని.. అని భావించండి

   ఎన్నోనాళ్లకె ముందు కోరితిమి నిన్నీ యూరి కార్యక్రమం...
   బెన్నన్ ముఖ్యమటంచు , చేసితిమిగా యేర్పాట్లు , నీ పాటకై
   యెన్నో యాశలతో మహామహులు తామెంతో ముదంబార రా...
   నున్నారుత్పలగంధిరో ! యిపుడు నీ వూహూ యనం బాడియే !

   మైలవరపు మురళీకృష్ణ
   వెంకటగిరి.

   తొలగించండి
 4. కాయజుఁ శరములు త్రాకగ
  నీ యామిని సెగలు గురిసె నే తాళగ లే
  నే, యెందుల కీ పంత
  మ్మో యుత్పలగంధి యిప్పు డూహూ యనకే.

  రిప్లయితొలగించండి


 5. సాయుజ్యము దైవముతో
  డై యోగము మార్గమై జడత్వము బోవన్
  మాయా లోకము మరువకు
  రోయుత్పలగంధి యిప్పు డూహూ యనకే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. మత్తేభవిక్రీడితము:

  కలలన్ కంటిరిపెద్దగా ఫలితమే కానంగ నిర్ఘాంతమే
  పలకన్ చౌక ప్రగల్భముల్ కసురుగా వాదమ్ముతో వీగరే
  తలలన్ బ్రద్దలు కొట్టుకొన్న గలదే దైవమ్ము రక్షించ! దా
  వులలోఉత్పలగంధిరో యిపుడు నీ వూహూ యనంబాడియే !!

  రిప్లయితొలగించండి


 7. కొత్తాటన్ మొదలెట్టు వేళ దరిరాన్ కోపమ్మదేలా ! సఖీ!
  మత్తున్ తూగితి నేను నమ్ము మిక భామారా! విశాలాక్షి గ
  మ్మత్తై నామది బిల్వ రావె రమణీ ! మావన్ గదా!నీకు నే
  కొత్తా? ఉత్పలగంధిరో యిపుడు నీ వూహూ యనం బాడియే?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. పాయని భక్తిని గల్గియు
  చేయుచు పూజలను శంభు చిన్మయ రూపున్
  ధ్యేయము మరచి తి వా యో
  హో యుత్ప ల గంధి యిప్పుడూ హూ యనకే !

  రిప్లయితొలగించండి
 9. మిత్రులందఱకు నమస్సులు!

  [తనపై అలిగి తల్లిగారింటికి పోవడానికి సిద్ధపడిన భార్యతో మగడు పలికిన మాటలు]

  "న్యాయమ్మే నను లెక్కసేయ కిటు కిన్కన్ దల్లిగారింటికిన్
  ధ్యేయమ్ముం గొని వోవఁగాను దలఁతే? యేమాయెనే నీ కిటన్?
  నా యుల్లమ్మిటు తల్లడిల్లి యొఱలన్, నా చెంతకున్ రాక యుం
  దోయీ యుత్పలగంధిరో? యిపుడు నీ ’వూహూఁ’ యనం బాడియే?"

  రిప్లయితొలగించండి
 10. మాయమ నింటికి దెత్తును
  ఛీయనకు,ముసలితనమ్ము జీవితమందు
  న్నేయమకైనను దప్పద
  హో!యుత్పలగంధీ!యిప్పుడూహూ యనకే!

  రిప్లయితొలగించండి
 11. కం. నాయుడు పరుగులు పెట్టగ
  సాయమ్ము కొరకు నిటునటు సర్వము బోయెన్
  ఖాయము చేసిరి చూడం
  డో యుత్పలగంధి యిప్పు డూహూ యనకే.

  రిప్లయితొలగించండి
 12. ఉత్పాతము జేసెదవే !
  సత్పథమున జనెడి నాకు సమ్మోహనమే
  యుత్పత్తి జేసియు మరల
  ఉత్పలగంధి ! యిప్పు డూహూ యనకే

  రిప్లయితొలగించండి
 13. (భార్య శశిరేఖతో భర్త భానుమూర్తి)
  శశియే వచ్చెను;పౌర్ణమిన్ గనుము;నా
  సర్వస్వభాగ్యోదయా!
  శిశిరం బెంతయు చేరువై యకట!కా
  శింబెట్టుచుండెన్ సఖీ!
  వశమున్ దెప్పెను నాదు మానసమహో!
  వయ్యారి!రారమ్ము!రా
  వొ శశీ!ఉత్పలగంధిరో!యిపుడు నీ
  వూహూ యనం బాడియే?
  (శిశిరము-చలికాలము;కాశింబెట్టుట-బాధపెట్టుట)

  రిప్లయితొలగించండి
 14. నీ సాంగత్యముఁ గోరి చేరితిగదా నీలాంబరీ యెప్పుడున్
  నా సాన్నిధ్యము వీడబోకుమని నిన్నర్థింతునే నిత్యమున్
  నే సంద్రమ్మును దాటి వచ్చితినిటన్ నీకోసమై ప్రేమతో
  నోసీ యుత్పల గంధిరో యిపుడు నీవూహూ యనంబాడియే.

  రిప్లయితొలగించండి
 15. నీవుప్రహేళికవుగా
  నావూహలసందడింపనగుబాటౌగా
  ఈవయసులోననన్నిటు
  లోఉత్పలగంధి యిప్పు డూహూ యనకే

  రిప్లయితొలగించండి
 16. సాయుజ్యము నొందగ నా
  రాయణ వ్రతము జేయ రమ్మంటిని గా !
  నా యత్నము భగ్నంబగు
  నోయుత్పలగంధి యిప్పు డూహూ యనకే

  రిప్లయితొలగించండి
 17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తీయని పల్లవమ్ముల యధేచ్ఛగ మెక్కుచు జింత లేక దా
   హాయిగ కొమ్మ కొమ్మల విహారమొనర్చుచు నాలపించు ఆ
   కోయిల వోలె నీవిటుల గూరిమి నుత్పల గంధి యిప్పు డూ
   హూ యనకే చెలీ శుభ ముహూర్తము నేడిటు చెంత జేరుమా

   తొలగించండి
 18. నర్తన శాలలో మేలిముసుగుతో కూర్చుని కీచకుని సరసాలకు మోముజూపక నుండ వలలుడు, సైరంధ్రిగా భావించి కీచకుడు....

  మత్తేభవిక్రీడితము
  పలుకన్ నేరిచి చాటుమాటనుచు నా ప్రాణంబు మెల్ద్రిప్పుచున్
  వలపుల్ నర్తనశాల యందు గురియన్ వాంఛించి రమ్మంటివే
  కలయే నేటికి రూపమున్ దొడిగి సంకల్పమ్ము సిద్ధించగన్
  బొలతీ! యుత్పలగంధిరో! యిపుడు నీ వూహూ యనన్ బాడియే

  రిప్లయితొలగించండి
 19. ఆయమలక్ష్మీదేవికి
  సాయంత్రముబూజజేయజనుదముసరియా?
  కాయలుబూవులుతెత్తును
  నోయుత్పలగ్రంధి!యిప్పుడూహుయనకే

  రిప్లయితొలగించండి
 20. ఆయాసమ్మున కలయక
  వేయం బత్రికల నెల్లఁ బెండ్లి కకట నీ
  వే యప్పు డౌనని మఱి య
  హో యుత్పలగంధి యిప్పు డూహూ యనకే


  వివశుల్ గారె కనంగ సుందర తనుల్ భీతాక్షులన్ మౌనులే
  యవలోకించుచు మత్స్యగంధి నటఁ గామావేశ చిత్తుండునై
  సవనజ్ఞాని ధరామరుం డనె నిటుల్ శక్త్యాత్మజుం డేలనో
  యువిదా యుత్పలగంధిరో యిపుడు నీ వూహూ యనం బాడియే

  రిప్లయితొలగించండి
 21. ఖాయముజేయ వివాహము న్యాయమె వలదనుచుచెప్పి ననుబాధింపన్ ధ్యేయము నీతో పెండిలి యోయుత్పల గంధి యిప్పుడూహూ యనకే

  రిప్లయితొలగించండి
 22. కామవాంఛతో యయాతి శర్మిష్ఠను పొందుగోరు సందర్భము- ఈ పూరణము.

  ఓయనె శర్మిష్ఠ దరిని
  పాయక మధుసఖుడు దన్నుఁ పదటనమున రా
  రాయనె యయాతి పడుచును
  యో యుత్పలగంధి! ఇప్పు డూహూ యనకే.

  మధుసఖుడు-మన్మథుడు;
  పదటనము-తొందర;
  ఉత్పలగంధి-మగువ

  రిప్లయితొలగించండి
 23. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)


  ఇల్లరికం అల్లుడు:

  చవుకన్ గొన్టిని గార్దభమ్ము ననుచున్ సంతోషమై బాదగా
  నవమానమ్మును సైచలేకనిక నే నత్తయ్యకున్ జెప్పకే
  కవరున్ దోపుచు త్యాగపత్రమును నే కర్నూలుకున్ పారగా
  యువతీ! ఉత్పలగంధిరో! యిపుడు నీ వూహూ యనం బాడియే!

  రిప్లయితొలగించండి
 24. కంజర్ల రామాచార్యశుక్రవారం, మే 31, 2019 12:01:00 PM

  వేసారెన్ తనువంతయున్ శ్రమమునన్, విశ్రాంతిఁ గాంక్షించితిన్,
  ఓసారిత్తరి చేరు పాదయగళం బొత్తన్ సుఖింతున్ సఖీ!,
  నీ సంవాహనమందు తృప్తిఁ గొనెదన్, నీవేల రానంటివే!
  ఓసీ ఉత్పలగంధిరో! యిపుడు నీ వూహూ యనం బాడియే!

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 25. కలువల్ విచ్చెను వెన్నెలల్ విరిసె నీకాంతారమందున్ సఖీ!
  వలపుల్ నాయెద బల్లవించె దగునా బాలామణీ కాదనన్ ?
  దలపుల్ మూగెను రాసకేళికయి ముగ్ధా!చెంతకుంరాగదే!
  చెలిరో!యుత్పలగంధిరో!యిపుడు నీవూహూ యనంబాడియే?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూడవ నాల్గవ పాదాలలో సవరణ
   చెంతకుం రావొకో?
   ఉలుకా?యయుత్పలగంధిరో!

   తొలగించండి
  2. చెంతకున్ రావొకో.రా,స్థిరము కనుక బిందువు రాదు.
   లోప సంశ్లేషలే విభాష నగును.

   తొలగించండి
  3. బల్లవించె మాట లేదు.
   పల్లవించె మాట కలదు.

   తొలగించండి
  4. ధన్యవాదములార్యా!సవరించ ప్రయత్నంచెదను!

   తొలగించండి
  5. కలువల్ విచ్చెను వెన్నెలల్ విరిసె నీకాంతారమందున్ సఖీ!
   వలపుల్ నాయెద పల్లవించె దగునా బాలామణీ కాదనన్ ?
   తలపుల్ మూగెను రాసకేళికయి ముగ్ధా!చెంతకుంజేరవే?
   ఉలుకా? యుత్పలగంధిరో!యిపుడు నీవూహూయనం బాడియే?

   తొలగించండి
  6. నా యెదఁ బల్లవించె అని నా యుద్దేశ్య మండి

   తొలగించండి
  7. నా కీబోర్డులో అరసున్న లేదండీ!క్షమించాలి!

   తొలగించండి
 26. ఓ యమ్మరో నను గనుమ !!
  నే యాతనలు బడ గనవ నీ తలపులతోన్ ?!
  నా యలజడి మదిని గనుమ
  యో యుత్పలగంధి యిప్పు డూహూ యనకే !!

  రిప్లయితొలగించండి


 27. ఈవెన్నెలసమయమ్మున
  రావేనాచెంత కిపుడు రమణీమణిరో
  యీవిరహమోపలేనిక
  యోవుత్పలగంధి యిప్పుడూహూ యనకే

  రిప్లయితొలగించండి
 28. సహచర్యపు కోరికయే
  తహతహ లాడించె మదిని తాపము నందున్
  అహమంత వేచితిన్, యిపు
  డొహొ యుత్పలగంధి యిప్పు డూహూ యనకే ౹౹

  రిప్లయితొలగించండి
 29. కవిమిత్రులకు నమస్కృతులు. ఈసారి నా నాలుగు రోజుల ప్రయాణం ఆహ్లాద విషాదాల సమ్మేళన మయింది. 27-5-2019 నాడు వరంగల్ ప్రయాణమయ్యాను కదా! అవధాని శ్రీ మద్దూరి రామమూర్తి గారు ఉప్పల్ దగ్గరికి వస్తే వారి కారులో తీసుకువెళ్తానన్నారు. నేను నాలుగు రోజులకు సరిపడా బట్టలు, పవర్ బ్యాంక్, సెల్ చార్జర్ వంటి ఇతర అవసర సామగ్రి ఒక బ్యాగులో సర్దుకొని ముందుగా చిటితోటి విజయకుమార్ గారిని కలిసి వారితో ఆటోలో ఉప్పల్ చేరుకున్నాను. తొందరలో నా బ్యాగును ఆటోలో మరిచిపోయాను. కట్టుబట్టలతో మిగిలాను. ఇదొక విషాదం!.... రామమూర్తి గారి కారులో వరంగల్ చేరుకున్నాక విజయకుమార్ గారు నాకు ఒక జత కుర్తా పైజామా (శతావధానానికి సంప్రదాయ దుస్తుల్లో రమ్మన్నారు), రెండు బనియన్లు,రెండు డ్రాయర్లు తదితర అవసర సామగ్రి ఇప్పించారు. మూడు రోజులు శతావధానం ఆహ్లాదకరంగా సాగింది. ఎందరో కవిమిత్రులు కలిసారు. ఆనందంగా గడిచింది.... నిన్న అవధానం తర్వాత నేను మా అక్కయ్య ఇంటికి బయలుదేరాను. ఒక బ్యాగులో పుస్తకాలు, మరొక క్యారీబ్యాగులో బట్టలు ఉన్నాయి. బస్ స్టాండులో కూర్చున్నాను. బస్ రాగానే సీటు దొరుకుతుందో లేదో అనే తొందరలో బట్టలున్న బ్యాగును మరిచిపోయి బస్సెక్కాను. 20 కిమీ. వెళ్ళాకు గుర్తుకు వచ్చింది. అంటే మళ్ళీ కట్టుబట్టలతో మిగిలినాను. ఇది మరో విషాద ఘట్టం. ఈరోజు తిరిగి వస్తూ మద్దూరి రామమూర్తి గారి అష్టావధానం ఉందని తెలిసి భువనగిరిలో దిగాను. నన్ను వాళ్ళు న్యస్తాక్షరి పృచ్ఛకుడిగా వేదిక నెక్కించారు. అదొ మరొక ఆహ్లాదకరమైన సంఘటన. ఇక్కడా వీరా గుడిపెల్లి వంటి మిత్రులు కొందరు కలిసారు. రామమూర్తి గారు శతావధానాన్ని, ఆ మరుసటి రోజే అష్టావధానాన్ని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలందుకున్నాను. వారి అవధానాలలో పృచ్ఛకస్థానాన్ని పొందడం ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందం ముందు పోగొట్టుకున్నవి చాలా అల్పమనిపించింది. అయినా మనసులో ఏ మూలో కొంత విచారం... ఇంతకుముందే నెలవు చేరుకున్నాను. అలసి ఉన్న కారణంగా ఈరోజు నన్ను మన్నించండి. రేపు ఉదయం నుండి మీ పూరణలను సమీక్షిస్తాను. ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అయ్యో .. ఎందుకిలా జరిగింది.. దొరికిన వారైనా తెలుసుకుని ఇచ్చివుంటే బాగుండేది...ధర్మం కుంటుంతోంది అన్నయ్య...సారీ చదవడానికి బాధగా ఉంది..

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 30. పూజ్యులు శంకరయ్య గారికి నమస్సులు.
  మఱపు మానవుల కతి సాధారణమైన లక్షణము విశేషించి వృద్ధాప్యమున. దానిని గణించక తదవాప్తమైన బాధను మఱచి పోవుటయే శ్రేయస్కరము. అంతా మన మంచికే యని తలఁచి మున్ముందు జాగ్రత్త వహించఁ బ్రార్థ నండి.

  రిప్లయితొలగించండి
 31. కొన్ని ఆనందాలముందు కొన్ని అనుభవాలు దిగదుడుపే . అలాంటప్పుడే ధైర్యం గా ఉండాలి. పోయిన వస్తువులు మళ్ళీ కొనుక్కోవచ్చు.అదొక చేదు ఘడియ. ఆరోగ్యం జాగ్రత్త . అసలే ఎండలు. కొంచం స్తిమిత పడ్డాక మాపద్యాలను సమీక్షించ వచ్చును . విశ్రాంతి అవుసరం. గురువులకు నమస్సులతో దీవించి అక్క

  రిప్లయితొలగించండి
 32. అనువుగ నున్న సమయమిది
  కనుగొన కవికాలమెయిది కావ్యరచనకై
  మనమున నీతలపులెయవి
  యొనరుత్పలగంధి యిప్పు డూహూ యనకే!!

  రిప్లయితొలగించండి
 33. కందం
  సుకుమార సుమ మధువులన్
  రకరకముల గ్రోలి నట్టి రసిక నరవరా!
  వికసిత నూర్వశి వలపుల
  కొక నుత్పలగంధి, యిప్పు డూహూ యనకేఁ!

  రిప్లయితొలగించండి
 34. ఆయువు తీరిన అమ్మకు
  చేయంగ క్రతువులు, పత్ని! చేరగ రావే
  గాయముల తోడ నెంచకు
  మో యుత్పలగంధి! యిప్పుడుహూ యనకే!

  రిప్లయితొలగించండి
 35. (రావణాసురుడు హనుమంతునితో)
  ఆ మునులందరున్ పనుల
  నన్నిటి వీడుచు వందిమాగధుల్
  సోమరిపోతులట్టులను
  జోద్యముగా వినుతించినారలా
  రాముని గీర్తనల్ సలిపి;
  రాక్షసలోకవిభుండ;నాకడన్
  రాముని;రాఘవున్;బొగడ
  రా దనిలాత్మజ!భక్తితో నిటన్.

  రిప్లయితొలగించండి