నేటి శంకరా భరణము సమస్య (సారా తెమ్మనెను రామచంద్రుడు హనుమన్) ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
రావణు వధ అనంతరము రాముడు రామేశ్వరములో లింగ ప్రతిష్ట చేయ దలచి కాశి నుంచి హనుమంతుని శివలింగము తెమ్మని పంపుతాడు ముహుర్త సమయమునకు హనుమంతుడు రాలేక పోయిన కారణమున సీత సైకత లింగము చేసి పూజ చేయు సమయమున హనుమంతుడు వచ్చి కొంచెము బాధ పడుతాడు అతని ముఖమును చూచి రాముడు అతని కోపమును బాపదలచి సీతతో అదిగో చూడు పార్వతీ దేవి యొక్క నిజ మగు స్వామి హనుమంతుని చేతిలో, రావయ్యా హనుమ రా రా అనుచు పిలుచు సందర్భం, ( సా = సామి) పార్ధివి = సీత క్రచ్చు = కోపము
కాశీకి వెళ్ళిన కపివరు డింకను రాకుండె, లగ్నము రయముగ గడి పడుచుండె ననుచు నా పార్థివి సైకత లింగమునకు పూజ లిడగ నపుడు వచ్చిన హనుమకు క్రచ్చు కలిగెనట, నలిగిన కపివరు నలుక బాప కాంతతో ననెనిట్లు,కనుమోయి ముదముగ మల్లుని చేతిలో మలయ వాసి ని నిజ(సా,రా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్),రయముగ నీ హరుని లింగ మును ప్రతిష్టనమును చేతు, ఘనత నొప్పు కార్య మును చేసి శంకరు కరుణ బడసి నావు, మర్కట యోధుడా నీవు మా మ నసును దోచితి వని బల్కె నయము తోడ
పారా వారము దాటగ
రిప్లయితొలగించండిసారా తెమ్మనె నురామ చంద్రుఁడు హనుమన్
కోరిన సీతను గైకొన
భారము గదలంక జేరి బహు నిడుములతో
అక్కయ్యా,
తొలగించండినిజంగానే హనుమతో సారా తెప్పిస్తున్నారు... ?
dhanya vaadamulu
తొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(శంకరార్యునకు క్షమాపణలతో)
ఆ రామాయణమున్ పఠించకను నే హైరాన నొందంగ సార్!
భీరుత్వమ్మున జేయబూనితిని నే విశ్వాసమే లేక హా!...
పారావారము దాటి మూలికను భల్ భారమ్ముగా మోసి మ
న్సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగఁగన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధీసారా' అనండి. బాగుంటుంది.
__/\__
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఔరా! మూర్ఛను బొందె సోదరుడు , దివ్యంబైన సంజీవినిన్
దేరా ! వానరవీర ! మిత్రవర ! సందీప్తాగ్నిభాస్వచ్ఛుభా
కారా ! ధీర ! సమస్తవాఙ్మయలసత్కమ్రార్థవిజ్ఞానవా...
క్సారా ! తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగఁగన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఔరా! మూర్ఛను బొందె సోదరుడు , దివ్యంబైన సంజీవనిన్
తొలగించండిదేరా ! వానరవీర ! మిత్రవర ! సందీప్తాగ్నిభాస్వచ్ఛుభా
కారా ! ధీర ! సమస్తవాఙ్మయలసత్కమ్రార్థవిజ్ఞానవా...
క్సారా ! తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగఁగన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండివాహ్ ! క్యా తేజ్ హై ఉమంగ్ భరీ !
సమస్త వాఙ్మయ లసత్కమ్రార్థ విజ్ఞాన వాక్సారా
జిలేబి
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
నిజమైన సారాయి నిమ్మని అడిగిన రాముడు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
హోరాహోరి సుదీర్ఘరాగములతో " ఒన్స్ మోర్లు " హోరెత్తగా
శ్రీరామాయణవీధినాటకములో శ్రీరాము డొక్కింత కం
గారై పోయెను గొంతు డీల వడ | " మేకప్ రూము " లో జేరుచున్
సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగగన్ ! ! !
---------------------------------------------------------------------
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండినిజమే... అంది గొంతు దిగందే నటించలేని రంగస్థల నటులను కొందరిని నేను చూసాను.
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
సమస్య :-
రిప్లయితొలగించండి"సారా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్"
*కందం**
పోరున లక్ష్మణుడు పడగ
కారణ జన్ముడివి నీవు కడు వేగముగన్
చేరగ సంజీవని మన
సారా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్"
.......................✍ చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండినా పూరణ.
**** **** **
ఆ రావణ పుత్రునితో
పోరుసలిపి లక్ష్మణుండు మూర్ఛిల్ల తఱిన్
పేరగు సంజీవని మన
సారా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్"
🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
🌷 వనపర్తి 🌷
మూర్ఛిల్లు తఱిన్
తొలగించండిపోరెంచుచు లక్ష్మణుండు మూర్ఛిల్లు తఱిన్
తొలగించండిపేరౌ సంజీవని మన
సారా....
వామన కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం:
రిప్లయితొలగించండిపారావారము దాటియు
తేరా సీతమ్మ జాడ తెమ్ము రయమునన్
భారమ్మని తలపక మన
"సారా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్"
గొర్రె రాజేందర్
సిద్ధిపేట
రాజేందర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పోరాటమ్మున సొమ్మిల,
రిప్లయితొలగించండిశారీరక నౌషధంబు సంజీవనియౌ
ప్రోరాహమ్మును తా- మన
సారా తెమ్మనెను రామచంద్రుడు హనుమన్.
ప్రోరాహము=మొక్క
వామన కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వీరుని దీవించుచు మన
రిప్లయితొలగించండిసారా, తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్
పారావారమును కడచి
ధారుణి ప్రియ పుత్రి జాడ, తగు నమ్మికతో
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
క్రూరుం డింద్రజి చేత నయ్యొ ! క్షతగాంత్రుం డయ్యె సౌమిత్రి యం
చారాటించుచు - గంధమాదనగిరిన్ హస్తంబుపై నుంచి , సం
వీరత్వంబున డాయుచుండెడు తరిన్ " వేవేగమే వాయువ
త్సా ! రా ! తె " మ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగగన్
----------------------------------------------------------------
గురుమూర్తి గారూ,
తొలగించండిప్రశస్తమైన పూరణ. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికోరెన్ హేమకురంగమున్ మహిజ, తా క్రూరుండు పంక్త్యాస్యుడా
తొలగించండిపారావారహృదంతరన్ గొనెయె, నీవా జానకీమాతనున్
సారాసారజలప్రవాహకలితస్రవ్యత్సముద్యత్కృపా
సారా! తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగఁగన్
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
భారము నీపై బెడితిని
రిప్లయితొలగించండిరారా జానకిని జూచి రయమున దెలుపన్
తీరుగ శుభవార్తను మన
సారా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్
ద్వారకానాథ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పౌరాణిక నాటకమున
రిప్లయితొలగించండివేరెవ్వరు చేయలేని విధముగ దోపన్
వారు నటించిన తదుపరి
సారా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్ !
రామ పాత్రధారి హనుమ పాత్రధారిని కోరినాడు.
తొలగించండిజనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆరావణుc లంకేశుడు
రిప్లయితొలగించండిమారీచుని సాయమొంది మహిసుత గొనిపోన్
వారాశి దాటి కుజ మన
సారా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్
కుజ-సీత(పర్యాయ పద నిఘంటువు,GN Reddy-1990)
వారాశి-సముద్రము
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రావణు తర్వాత అరసున్న అవసరం లేదు. డు ప్రత్యయం లేకుండా వ్రాసారు. "ఆ రావణు డసురవిభుడు" అనండి.
ధన్యవాదములు🙏
తొలగించండిఆరావణుడసుర విభుఁడు
మారీచుని సాయమొంది మహిసుత గొనిపోన్
వారాశి దాటి కుజ మన
సారా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్
నైరాశ్యపు రావణు డొగి
రిప్లయితొలగించండిసారా తెమ్మనెను; రామచంద్రుడు హనుమన్
కారుణ్య దూరతన్ పరి
వారంబులతోడ దైత్యు వదియింపుమనెన్.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వధియింపు' టైపాటు.
చేరగ రావణ రాజ్యము
రిప్లయితొలగించండిపారావారమ్ము దాట వలెగద నిపుడున్
వారధి కై రాలను ధీ
సారా! తెమ్మనెను రామ చంద్రుఁడు హనుమన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గద యిపుడున్' అనండి.
పోరు న మూర్ఛిలె నను జు o
రిప్లయితొలగించండిడా రా ట ము జెంది పలి కె హనుమా పొమ్మా
ధీరత సంజీవి ని మన
సారా తెమ్మనె ను రామ చంద్రుడు హను మన్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పారావారము దాటుచు
రిప్లయితొలగించండిసారంబగు పర్వతమున సంజీవనినే
తీరుగ నరయుచు నది మన
సారా తెమ్మనెను రామచంద్రుడు హనుమన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కారుకు తామేతెంచిన
రిప్లయితొలగించండికారణమెరిగించి, లంక కడకేగి యటన్
దారను కనిన రుజువు మన
సారా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్
(కారు= అడవి)
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మేరునగధీర! సూక్ష్మవి
రిప్లయితొలగించండిచారా!భూమిసుత సీతజాడను నీవే
భారమనెంచక జని వ
త్సా!రా!తెమ్మనెను రామచంద్రుడు హనుమన్
భారమటెంచక ?
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండినాటక మై పోయే ! రిలేక్స్ అవుదాం రావోయ్ హనుమా :)
ధారాళమ్ముగ నటుడిన్
సారా తెమ్మనెను రామచంద్రుఁడు, హనుమన్,
కోరిన క్షణమే తెచ్చెను
తీరుగ నాటకము ముగియ తీరిక గానన్ !
జిలేబి
రిప్లయితొలగించండిఇస్తే వద్దంటానా ? యవనారిని గదా !
ధారాళమ్ముగ నిన్ను కొల్చితి సదా ధ్యానించుచున్ రామ! నీ
కైరవ్వంతగ సేవ, జాంబవతినే కళ్ళాలుగానిత్తునే
రారా!యల్లునిగాను కృష్ణ! నిదియేరానాదు నందంతి ని
స్తా రా! తెమ్మనె, రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగగన్
జిలేబి
(కొన్ని రోజుల క్రిందట రావణు డెత్తుకుపోతున్న ఒక కాంత
రిప్లయితొలగించండిఆభరణాలమూట పడవేస్తే పట్టుకున్నానంటున్న పావని )
"శ్రీరామా ! జయరామ ! శౌర్యరసమా !
సీతాలలామంబగున్
జారన్ వైచెను సొమ్ముమూట నొకటిన్ ;
జాగ్రత్తగా నుంచితం "
చీ రీతిన్ బలుకన్ విశాలనయనో
త్సేకుండునై " భక్తికా
సారా ! తె " మ్మనె రాఘవుండు హనుమన్
సంరంభమే పొంగగన్ .
నేటి శంకరా భరణము సమస్య
రిప్లయితొలగించండి(సారా తెమ్మనెను రామచంద్రుడు హనుమన్)
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
రావణు వధ అనంతరము రాముడు రామేశ్వరములో లింగ ప్రతిష్ట చేయ దలచి కాశి నుంచి హనుమంతుని శివలింగము తెమ్మని పంపుతాడు ముహుర్త సమయమునకు హనుమంతుడు రాలేక పోయిన కారణమున సీత సైకత లింగము చేసి పూజ చేయు సమయమున హనుమంతుడు వచ్చి కొంచెము బాధ పడుతాడు అతని ముఖమును చూచి రాముడు అతని కోపమును బాపదలచి సీతతో అదిగో చూడు పార్వతీ దేవి యొక్క నిజ మగు స్వామి హనుమంతుని చేతిలో, రావయ్యా హనుమ రా రా అనుచు పిలుచు సందర్భం, ( సా = సామి) పార్ధివి = సీత క్రచ్చు = కోపము
కాశీకి వెళ్ళిన కపివరు డింకను రాకుండె, లగ్నము రయముగ గడి
పడుచుండె ననుచు నా పార్థివి సైకత లింగమునకు పూజ లిడగ నపుడు
వచ్చిన హనుమకు క్రచ్చు కలిగెనట, నలిగిన కపివరు నలుక బాప
కాంతతో ననెనిట్లు,కనుమోయి ముదముగ మల్లుని చేతిలో మలయ వాసి
ని నిజ(సా,రా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్),రయముగ నీ హరుని లింగ
మును ప్రతిష్టనమును చేతు, ఘనత నొప్పు
కార్య మును చేసి శంకరు కరుణ బడసి
నావు, మర్కట యోధుడా నీవు మా మ
నసును దోచితి వని బల్కె నయము తోడ
వీరా సంజీవి వలయు
రిప్లయితొలగించండిఘోరాపదకూడె నా సహోదరుఁడదియే
ధీరా రవిప్రభా భా
సా రా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్
కందము
రిప్లయితొలగించండిధీరా!భజబల వానర
వీరా! సంరంభ మొప్ప వేడుకలర సీ
తా రమణీ జాడను మన
సారా తెమ్మనెను రామచంద్రుడు హనుమన్
ఆకుల శివరాజలింగం వనపర్తి
తా
ధీరుం డుంగరము నొసఁగి
రిప్లయితొలగించండిచేరువ కేఁగి కలతం గృశించిన గిరలం
బారువ, దీవన లిడి మన
సారా, తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్
[పారువ = జాడ]
గారాబమ్ము సెలంగఁ జిత్తమున నా కాకుత్స్థుఁ డాసక్తిఁ గాం
తారత్న మ్మిడ నాన వాలుగను దా ధాత్రీజ నీ వా యశో
కారామమ్మునఁ గొన్న రత్నమును ధీరా నిశ్చ యాతీత సం
సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగఁగన్
వీరులు వానర మూకల
రిప్లయితొలగించండితీరుగ నంపుచు ధర నలు దిక్కుల వెదుకన్
ఆ రమ సందేశము మన
సారా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండి"మీరా రాజులు నేమన
సారా నీ దాసు న"న్న ,"సరిగా బంచన్
తేరా తన్మయతాద్భుత
సారా తెమ్మ"నెను రామ చంద్రుడు హనుమన్
వారాసినితరియించిన
రిప్లయితొలగించండివీరా సంజీవిఁదెమ్మువేగిరమిపుడే
ధీరా! నినునమ్మితి మన
సారా, తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్
వారాశి
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఘోరవ్యాకరణా విశారదు నటన్ కొంగ్రొత్త ఛందస్సునన్...
సారాచార విశారదా యిన యతిన్ శార్దూల విక్రీడిత
త్సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగగన్
కారా పండితు లిర్వురాయెడ గనన్ కారుణ్య వారాశినిన్!
వీరాగ్రేసర! నీచే
రిప్లయితొలగించండినారీమణి సీత జాడ నాకుఁ దెలియు సా
మీరా!కనుగొను సమ్య
క్సారా! తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
శూరత్వమ్మున నీకు సాటి గలరే శోధించు నైపుణ్యమున్
కారాగారము నుండెనో హతవిధీ! గంధర్వులే దోచిరో!
హైరానాయను సీత జాడనిక నే యత్నమ్ముతో నైన వే
సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగఁగన్
వేసారు = వేసరు = శ్రమపడు
(శబ్దరత్నాకరము)
ఔరా!యుద్దము సాగుచుండె ఘనమై ఆరావణాంతమ్ముకై
రిప్లయితొలగించండిపోరున్సల్పగ లక్ష్మణుండు దొలుతన్మూర్చిల్లినేలన్బడన్
యారోగ్యంబునుగూర్చనౌషధులకై యాపన్ను గాపాడ"వ
త్సా!రా!తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగగన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
పారావారము దాటినట్టి ఘనుడా వాతాత్మజా గాంచుమా
రిప్లయితొలగించండిపోరాటమ్మున వీరలక్ష్మణుడు తా మూర్ఛిల్లె నయ్యో యటన్
జేరన్ లేరట యన్యులెవ్వరును, సంజీవిన్ వడిన్ భక్తకా
సారా! తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగగన్.
కందం
రిప్లయితొలగించండిపారావారము దాటగ
వారధి గట్టంగఁ దేల వ్రాయుచు నామం
బేరుచ శిలలన్ దరహా
సా! రా! తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్
శార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండిమీరెన్ రావణుడందఁగోరి కుజ నున్ భిక్షార్థిగా నాటవిన్
మీరల్ జేసిన రాయభారములఁ దా మేలెంచడే కూలగన్
బారావారము దాటు వంతెనకునై పాషాణముల్ వృక్షవా
సా! రా! తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగఁగన్
పోరాటమ్మున నింద్రజిత్తు కతనన్ మూర్ఛిల్ల సౌమిత్రి ఆ
రిప్లయితొలగించండిశ్రీరాముంగని జాంబవంతు డన సంజీవిన్ ప్రయోగింప, దో
స్సారా తెమ్మనె రాఘవుండు హనుమన్, సంరంభమే పొంగఁగన్
ధీరుండౌ హనుమంతుడప్డు కరమౌ తేజస్సుతోడన్ చనెన్
మారుతి! తేవలె యారవి
రిప్లయితొలగించండిజారక ముందే పడమట సంజీవనినిం
బోరన చను మర్దితసుర
సా! రా! తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్.
ఆరోగ్యపశ్వగంధము
రిప్లయితొలగించండితీరికగా తిన్నమనిషి దీర్ఘాయువుగా
మారును!నౌషదగుణ దిను
సా!రా!తెమ్మనెనురామచంద్రుడు హనుమన్
ఆరోజు నగల మూటనె
రిప్లయితొలగించండిఈ రాళ్ళను వనిత వైచె నిదె తెత్తుననన్
నారాణివె? కందును మన j
సారా, తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్.
వీరా చనుమిక లంకకు
రిప్లయితొలగించండిధీరా యొసగుము గురుతును దేవికి వేగన్
నారీమణిగురుతును మన
సారా తెమ్మనెను రామచంద్రుడు హనుమన్
పారావారముదాటగ
రిప్లయితొలగించండినీరాళ్ళనుదోడజేయనింపుగదారిన్
మీరందరుశిలలనుమన
సారాతెమ్మనెనురామచంద్రుడుహనుమన్
నా రాణిన్ గని క్షేమ సౌఖ్య మెరుగన్ నాకోసమే శూరతన్
రిప్లయితొలగించండివారాశిన్ తరియించి దెచ్చిన మణిన్ వ్యాపించె సీతా మన
స్సా? రా, తె మ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగఁగన్
ధారాపాతములైన కండ్లు మెరవన్ తాదాత్మ్యత న్నా నగన్౹౹
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండినారాచమ్ముల మేఘనాదుఁడు వెసన్ లక్ష్మన్ననుం గొట్టఁగా,
ఘోరమ్మైన శిఖీ విఘాతమునఁ దాఁ గూలన్ భువిన్ మూర్ఛిలన్,
శ్రీరాముం డడలన్, సుషేణుఁ డపుడున్ "శీఘ్రమ్మె సంజీవనీ
సారమ్మున్ గొని తెం!" డటంచుఁ దెలుపన్, "సప్తాశ్వు విద్యా ప్రభా
సా! రా! తె!" మ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగఁగన్!
తేరా పెన్నూపెన్సిలు
రిప్లయితొలగించండియేరాగీయంగచిత్రమెటులో రానిన్
గారాలపోకు మికమన
సారా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్!!