11, మే 2019, శనివారం

సమస్య - 3015 (కలనుఁ దలఁచుకొన్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము"
(లేదా...)
"కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్"

99 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  బలుపుగ సీట్లు గెల్వగను భండన మందున భారతావనిన్
  చెలువము మీర నన్నుగొని చెంతను జేరుచు కాళ్ళుబట్టుచున్
  తలను కిరీట మిచ్చుటను తన్నుకు చచ్చిరి నేతలెల్లరన్
  కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్

  రిప్లయితొలగించండి
 2. వయసు మైక మందు వాస్తవమ్ము మరచి
  గగన భాగ మంత కలియ దిరిగి
  తీపి స్వప్న మంటు తేరుపై పయనించి
  కలనుఁ దలఁచు కొన్నఁ గలుఁగు సుఖము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'స్వప్న మనుచు' అనండి.

   తొలగించండి
  2. వయసు మైక మందు వాస్తవమ్ము మరచి
   గగన భాగ మంత కలియ దిరిగి
   తీపి స్వప్న మనుచు తేరుపై పయనించి
   కలనుఁ దలఁచు కొన్నఁ గలుఁగు సుఖము

   తొలగించండి
 3. ( బాణాసురుని పుత్రిక ఉషాసుందరి చెలి చిత్రరేఖతో )
  చెలియవు చిత్రరేఖ ! విను ;
  చిత్రపు స్వప్నము వచ్చె వేకువన్ ;
  కలకల నవ్వుచున్ సఖుడు ;
  కాంచనవర్ణుడు ; సుందరాంగుడే ;
  మలయపు మారుతమ్మువలె
  మాటికి మాటికి నాకు ముద్దిడెన్ ;
  కలను స్మరించినంతనె
  సుఖమ్ము - ముదమ్ము - శమమ్ము జేకురున్ .

  రిప్లయితొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  మెలకువ యందు మానసము మిక్కిలి దేనిని చింత జేయునో
  కలయగునద్ది రాత్రి యనగాదగు , నద్ది నిశావసానమం...
  దలిదగునేని సత్యమగు, దైవమునెంచి భజించి పొందుమా
  కలను, స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 5. ఇలనసాధ్య మైన యెన్నెన్నొ విషయాలు
  సాధ్య పడును గాదె స్వప్నమందు
  రాజు వవగ వచ్చు రాజ్యమేలగ వచ్చు
  కలనుఁ దలటు కొన్నఁ గలుఁగు సుఖము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అవగ' అనడం సాధువు కాదు. 'రాజు వగుచు గొప్ప రాజ్యమేలగ వచ్చు' అనండి.

   తొలగించండి
 6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 7. భాజపా గుమి గెలువవలె తప్పక యను
  చక్కనైన కార్య సాధకునికి
  వారిజ గఱుతు గలవాడె గెలిచెనన్న
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వారిజ గుఱుతు' అనడం దుష్టసమాసం. "వారిజంపు గుఱుతువాడె..." అనవచ్చు.

   తొలగించండి
 8. ఇలను పొందలేనివెన్నియో వరములు
  కలల పొందవచ్చు కాంక్ష దీర
  సామి కరుణ గల్గు చక్కగా మనకును
  కలను దలచుకొన్న గలుగు సుఖము.

  రిప్లయితొలగించండి
 9. ఇలను కుదరవన్ని కలను కుదురవచ్చు
  పొలము బీడుదయిన ఫలము వచ్చు
  చెలియె సౌఖ్యమిచ్చు శృంగార దేవతౌ
  "కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దేవత + ఔ' అన్నపుడు సంధి లేదు.

   తొలగించండి
 10. భర్త దూర మైన భరియింప లేనట్టి
  విరహ మందు కుములు విమల చరిత
  కలను దలచు కొన్న గలుగు సుఖము శోభ
  నం పు రాత్రి తంతు లింపు సొంపు

  రిప్లయితొలగించండి
 11. బలమును జూపి యుద్ధమున ప్రద్విషునే పరిమార్చి వేయగాన్,
  చెలియను జూసి మోహమున చేరిక కోరుచు విన్నవించగాన్,
  మెలకువ వచ్చినంత- తన మితృలతోడను చర్చ చేయుచో
  కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ము చేకుఱున్.

  రిప్లయితొలగించండి
 12. ఆటవెలది:
  వాలు కన్నులున్న వయ్యారి యరుదెంచి
  ముచ్చటాడి నాకు ముదము గూర్చె
  కలవరింపు చేత కల నుండి మేల్కొని
  "కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము"

  గొర్రె రాజేందర్
  సిద్ధిపేట

  రిప్లయితొలగించండి


 13. అలక లల్ల లాడ నామది యేపెండ్లి
  పిదప "నొడయురాల ప్రియ" యటంచు
  మగడె నూసు లాడె! మది గిలిగింతల
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము!  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో 'నా మది' అని స్వీకరిస్తే యతిదోషం. 'ఆడన్ + ఆమది' అని స్వీకరిస్తే దోషం లేదు. కాని అన్వయం కుదరదు. "మగడె యూసులాడె" అనండి.
   అన్నట్టు... ఈరోజు ఆకాశవాణిలో మీ పేరు వినబడలేదు?

   తొలగించండి


 14. పిలిచెను పెండ్లి యాడగనె ప్రేయసి మోహన! రా జిలేబి యం
  చు లసిత మైన కైపుల వచోగ్రహమున్ తను‌ మీటి సుందరీ
  లలన! ప్రపుల్ల! రమ్మనె! విలాసపు కాలమదేను! నేటికా
  కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. ఎన్ని సంస్కరణల జేసిన నెయ్యది
  ఫలము? పార్టి మారి బలము తారు మారు జేయ డబ్బు మార్పిల్ల యీయెన్ని
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గంగాప్రసాద్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. "ఎన్ని సంస్కరణల నెటుల జేసిన నేమి । ఫలము..." అనండి.

   తొలగించండి
 16. విలవిలలాడె ప్రాణములు ఫెళ్ళున దుర్ఘటనమ్ములోన ము
  క్కలుగఁ కరమ్ములోవిరుగగా యెముకల్ కడునొప్పిపెట్టగా
  జలజల రాలెనశ్రువులు సన్నిహితుండొకడిట్లనెన్ చెలిన్
  *"కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఇప్పుడు మీకెలా ఉంది? సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటున్నారా?

   తొలగించండి
 17. ధర్మవర్తనుండు దశరథ తనయుడు
  దర్శనంబు నిచ్చె దయను జూపి
  అత్రి యాశ్రమమున నాతిథ్య మొందుచు
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము

  రిప్లయితొలగించండి
 18. చిన్న నాటి వలపు చిలిపి తలపులన్ని
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము
  ముదిమి వయసునందు ముచ్చటేమి యనక
  మదిని పడుచుదనము మరల నీకు 😇

  రిప్లయితొలగించండి
 19. నష్టజీవి యెపుడు నలతతో నిదురింప
  కలను దలచుకొన్న గలుగు సుఖము
  గమ్య మెంచి మనిషి ఘనతతో సాధింప
  అయిన కలల రూపు అరయ వచ్చు

  అయినకల-మంచికల

  రిప్లయితొలగించండి
 20. తలజడలందు గంగమ వ
  దాన్యత చిహ్నము ప్రాణధారగా
  తలకొక వైపు క్రొన్నెలను
  దాల్చుట వెన్నెలఁ బంచనెంచియే
  నలుపది కంఠమందు భువ
  నైకమహోన్నతియౌ,మహేశు వం
  కలను, స్మరించినంతనె సు
  ఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాధ మోదములవి వచ్చును వెనువెంట
   నెవరికైన నిలువ దెపుడు నేది
   కష్టకాల మందు గత వైభవపు మన్ని
   కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము

   మన్నికలు= సన్మానాలు

   తొలగించండి
  2. రాకుమార గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 21. చెలి కడు విరహమ్ము కలిగించు నిత్యము
  తలపులందు సతము కదలు కతన
  రాత్రి వేళలోన ప్రత్యక్షమైనట్టి
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 23. తలపులలోన నిత్యమును తాచరియించుచు మత్తిఁ బెంచుచున్
  నళిన దళాయ తాక్షి మది నాట్యము చేయుచు నుండ నేనిటన్
  సలుపగ లేను కార్యముల సత్వరమౌ గతి, నా ప్రియాంగనన్
  కలను స్మరించినంతనె, సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 24. మిత్రులందఱకు నమస్సులు!

  సలలిత భావజాలములు శయ్యలు పాకములున్ నవద్విక
  మ్ములునగు వర్ణనల్ పదపుఁ బొందికలున్ దశ ప్రాణముల్ సుభూ
  షలునగు వృత్తులున్ నవరసమ్ములు ముప్పదిరెం డలంకృతుల్
  కలసిన మేటి సత్కృతియె కమ్మని విందిడు; నట్టి పద్య స
  త్కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్!

  రిప్లయితొలగించండి
 25. విశ్వ మందు నున్న వివిధ కులముల య
  వన వరులకు నెల్లఁ బన్నుగ విను
  మ నిరతోపవాస మాసాంత మందునఁ
  గలనుఁ దలఁచుకొన్నఁ గలుగు సుఖము

  [కల = చంద్రునిలోఁబదునాఱవభాగము]


  కలవర మేల మానవ నికాయము వొందఁగ సంకటమ్ములన్
  సలలిత చిత్త వృత్తి ఘన సన్నుతి సేయుచుఁ గాంచి నంతఁ గ
  న్నులలర శాంభవీ గిరి తనూజ సుపింగళ వర్ణ పార్వతీ
  కలను స్మరించి నంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్

  [కల = శిల్పము]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 26. ప్రేమ వలను జిక్కిపెంపగుతిండిచే
  హాయినింపుటన్న మాయ నింపు!
  తలచుకొనెడి తన్వి మలపునకలరాగ?
  కలనుదలచుకొన్నకలుగుసుఖము

  రిప్లయితొలగించండి

 27. భక్తి తోడ వెళ్లి బ్రహ్మోత్సవాలకు
  పరవశమ్ము మదిని మఱువకుంటి
  తిరుమలేశు తోడ దేవేరుల నిరు వం
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'వెళ్ళి' అన్నది వ్యావహారికం. "భక్తితోడ నేగి" అనండి.

   తొలగించండి
  2. ధన్యోస్మి గురుదేవా. సవరించిన పూరణ :

   ఆటవెలది
   భక్తి తోడ నేగి బ్రహ్మోత్సవాలకు
   పరవశమ్ము మదిని మఱువకుంటి
   తిరుమలేశు తోడ దేవేరుల నిరు వం
   కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము

   తొలగించండి
 28. ఆటవెలది
  మిత్రునింట కేగ మేడనుంచుచు మమ్ము
  తీర్థమున్ ప్రసాద తృప్తు లమరె
  పగలురేయి మఱచి పాల్గొన్న నాటఁ బే
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మిత్రునింటి కేగ' టైపాటు.

   తొలగించండి
 29. ఎన్నికలలో పోటీ చేసి గెలుపుకై ఎదురు చూచె
  అభ్యర్థి అంతరంగం...

  చంపకమాల
  మలమల మండు నెండలకు మాడి నియోజక వర్గమెల్లెడన్
  పెళపెళ లాడు నోట్లనిడి వేడితి ఓటరు సాములెల్లరిన్
  కళకళలాడ 'నార్వొ' నట కైగొని గెల్చితి వంచు నిచ్చు కా
  కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్

  రిప్లయితొలగించండి
 30. జలధి నిదాఁటి గాంచెనవి జానకి మాత పదమ్ములాతడున్
  వలదు విచారమొందకు నవశ్యము రాముడు రాగలండనిన్
  పలికి వనంబు చేరిమురిపంబున కోతుల గూడె నట్టిమూ
  కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. అక్కడ "రాముడు వచ్చునంచు తా। పలికి..." అనండి.

   తొలగించండి
 31. అలసియు ధర్మమార్గముల నాస్తులు వాస్తవరీతి కూర్చ ,ని
  య్యిలను నసాధ్యకార్యమగు, నిట్లు నభోనిభపుష్పరాశులౌ
  కలుములు భుక్తిభాగ్యములు కావవి, పేదల కూహ్యసౌఖ్యముల్
  కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్.

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురము.

  రిప్లయితొలగించండి
 32. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  తలచుచు గాంధి వంశమున తండ్రిని తాతను నాయనమ్మనున్
  చెలువము మీర చెల్లెలిని చెన్నగు బావను నెత్తికెత్తుచున్
  కులమును గోత్ర మెంచకయె గ్రుడ్డిగ వోట్లను నాకు వేయు నా
  కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 33. సెలవులలో విహారముగ స్నేహితులందరు గూడి యాత్రలన్
  సలుపుచు గాంచినట్టి సహజంబగు దృశ్యము దల్పగా మదిన్
  పులకరమౌను, వేగముగ పొంగులు వారుచు పారు వాగు వం
  కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్

  రిప్లయితొలగించండి
 34. ఆటవెలది
  అర్ద రాత్రి వేళ ననుభవ కలలన్ని
  కల్ల లౌను గాదె కలియుగాన
  స్వప్నములు ఫలించు ప్రత్యూష కాలాన
  కలను దలచు కొన్న గలుగుసుఖము
  ఆకుల శివరాజలింగం వనపర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శివరాజలింగం గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అనుభవ కలలు' దుష్టసమాసం. "అనుభవ స్వప్నముల్" అనండి.

   తొలగించండి
 35. పెరటిలోన తరువుల్ కరువాయె ,రోడ్లపై చెట్లన్ని విఫణిలో చేరి పోయె,
  మండు టెండలతోడ మానవ జాతికి మరుగాయెగా నిద్ర, పరుగులు బెట్టి
  శీతల యంత్రముల్ చెలిమి తో కొని తేవ విద్యుతు కోతతో వెతలు కలిగె,
  నారు బయట చేర, చోరులు కని బెట్టి చేయు దొంగ తనము, చిన్న నాటి

  రోజు లెంత ఘనము, మోజుతో చేరగ
  నారు బయట, తెల్ల వారు వేళ
  చల్ల గాలి నిడును సంతసంబున్, యెవ
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము

  ఎవకల = వేకువ


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండు సూచనలు చేసాను వాట్సప్ సమూహంలో...చూడండి.

   తొలగించండి
 36. త్రిజట తన స్వప్న వృత్తాంతముతో సీతను ఓదార్చుట

  కలతపడగ వలదు కాంతరో సీతమ్మ!
  కాంచితేను నొక్క కలనురాత్రి
  ఖరమునెక్కి చనగ ఖలుడు దశముఖుండు
  కలను దలచుకొన్న కలుగు సుఖము

  కలతనువీడు సీత!నిజకాంతుడు నీదరిజేరు శీఘ్రమే
  వెలుగుచు శ్వేతభద్రమున వేడ్కగ రాముడు వచ్చినట్లుగన్
  మలగగ రావణుండు యవమానము తోడను గార్ధభమ్ముపై
  కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము యశమ్మ జేకురున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'రావణుండు + అవమానము' అన్నపుడు యడాగమం రాదు. "రావణుండె యవమానము" అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!

   తొలగించండి
 37. ఎన్ని సంస్కరణల నెటులజేసిననేమి
  ఫలము? పార్టి మారి బలము తారు మారు జేయ డబ్బు మార్పిల్ల యీయెన్ని
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము!!

  రిప్లయితొలగించండి
 38. రిప్లయిలు
  1. చెలియలి పొందునన్ గతవశీకృతమన్మథరాజ్యసౌఖ్యముల్
   దలచిన స్వప్నమందు మెయి తన్మయమొందు వియోగవేళలో
   మెలకువ యేల వచ్చెనొ!, నిమేషమె యామె శరీరమందు వం
   కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
  2. రామాచార్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 39. పిలచిన రావు స్వప్నములు వేళయు నుండదు వాటి రాకకున్
  దలపుల లోని వాంఛలకు దర్పణ మందలి బింబమట్టులన్
  నిలగన లేని కృత్రిమము లింపుగ జూపగ నోలలాడుచున్
  కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ము జేకుఱున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిల గనలేని'?

   తొలగించండి
 40. సమస్య :-
  "కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము"

  *ఆ.వె**

  కలుపు దీసి రైతు పొలము పండిన మొల
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము
  కంటి నిండ నిదుర నొంటి యలుపు దీరి
  రాత్రి కరిగి పోయె రయ్యి మనుచు
  ..........................✍చక్రి

  రిప్లయితొలగించండి
 41. కలలుకనగనెట్టి కాసుతోఁబనిలేదు
  కనులుమూసియుంచఁగలుగుకలలు
  ఇలను పేదవాని కిదియె పెన్నిధియౌను
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము

  రిప్లయితొలగించండి
 42. కలలు సుధాంబురాశివలె కాంక్షలుదీర్చెడిరత్నగర్భ, యా
  కలలె పదారువన్నెల వికాసములన్ కనులందునిల్పుఁ నే
  కలతలుచేరరావు కలికాలమునందున నెల్లవారికిన్
  కలనుస్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁజేకురున్

  రిప్లయితొలగించండి
 43. బాల్యమందు కడచె బంగారు దినములు
  మరలి రాని మేటి మంచి రోజు
  లాట లందు నేనె యందు కొనిన జ్ఞాపి
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము
  **)()(**
  జ్ఞాపికలు = Memontos.

  రిప్లయితొలగించండి
 44. నమస్కారములు
  వచ్చే వారానికి ఇచ్చిన కొత్తసమస్యను తెలుపగలరు

  రిప్లయితొలగించండి
 45. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము

  సందర్భము: ఇది ఒక స్వీయానుభవం. సంప్రదాయ సాహితీ ప్రియులతో పంచుకునే ఉత్సుకతతో మాత్రమే ఉద్ధరిస్తున్నాను.
  నాకు కలిగిన అనేక స్వప్న దర్శనాలలో ఇదొకటి. 23.7.1999 శుక్రవారం రాత్రి 4. 30 ప్రాంతంలో (తెల్లవారితే 24.7.99 ఆషాఢశుద్ధ ఏకాదశి) దేవీ సంబంధమైన యీ కల వచ్చింది.
  సంగ్రహంగా వివరా లివి. కలలో నే నేదో (గుర్తు తెలియని) ఆలయానికి (ఎంతో) శ్రమపడి వెళ్లాను. ఏవో ప్రత్యేక పూజలు. ఏ ప్రాంతమో ఏ ఆలయమో ఏ పూజలో గుర్తు లేదు. వచ్చేటప్పుడు దారి తప్పాను. చిమ్మ చీకటి.. సందుగొందులు. నిర్జన ప్రాంతం. అక్కడక్కడ మాత్రమే యిండ్లు. రాత్రి 8.30 దాటినట్టుంది.
  ఛాయామాత్రంగా ఒక స్త్రీ మూర్తి కనిపించింది. ఆడవాళ్ళను పరికించి చూడడం.. ఎక్కువగా మాటాడడం నా కలవాటు లేదు కాబట్టి ఆమె ఎలా వున్నదో నేను సరిగా చూడనే లేదు. నా దారిగురించి మాత్రం అడిగాను ముక్తసరిగా.
  "పద! పద! నీ వెంటనే నే నున్నానుగా!" అన్నది. ఆ ఒక్క మాటే విన్నాను. భయం తీరిపోయింది. నేను ముందు.. ఆమె వెనుక. నాలుగై దడుగులు వేశామో లేదో సరియైన.. తెలిసిన దారిలోకి వచ్చాను. ఇక భయం లేదు. (నేనే దారిలోకి వచ్చానో!.. దారే నా పాదాల కిందికి వచ్చిందో!)
  ఆ కరుణామూర్తి ఎవరా అని వెనక్కు చూశాను. ఎవరూ లేరు. ఆమె జగన్మాత అని నా కర్థ మయింది. పొరపాటు చేశా ననిపించింది.
  తల దించుకొని మాటాడినా ఆమె స్పష్టాస్పష్టంగా కనిపించకపోలేదు. ఆ రూపాన్నే మననం చేసుకుంటే పద్యంలో చెప్పిన విధంగా వున్నది. 45..50 సంవత్సరాల వయ సుంటుం దేమో! నిండైన విగ్రహం. దాక్షిణ్యం రూపు కట్టినట్టున్నది.
  మెలుకువ వచ్చింది. తొలి ఏకాదశి. ఎంత కమ్మగా పలికినావమ్మా!.. అనే పాటకూడా ఆరోజు వ్రాశాను. దేవి నా జీవితంలో సర్వదా మార్గదర్శనం చేయగలదన్న విశ్వాసం దృఢతరమయింది.
  పాత కాగితాలలో (వ్రాసిపెట్టుకున్న సంఘటనలు) వెదికి ఇది రూపొందించటం జరిగింది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  పొలుపు మీరు చీర ముదు రాకుపచ్చన..
  నడి వయస్సు.. కొలది నలుపు చాయ..
  దారిఁ జూపె దేవి దయతో వెనుక వచ్చి..
  కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  11.5.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 46. డా.పిట్టా సత్యనారాయణ
  కలము బట్టి పద్య కవిని నేనగుదని
  నిరతము శ్రమియించ నేది ఫలము?
  వచన కవిత లల్లు వాసి జెల్ల;నాటి
  కలను దలుచుకొన్న కలుగు సుఖము!

  రిప్లయితొలగించండి
 47. డా.పిట్టా సత్యనారాయణ
  "వెలగల రామ రాజ్యమన వింతయె గాదను గాంధి బాటలో
  జెలగు కుటీర సాధనలు ,జీవనమార్గమునన్ సమృద్ధి ,గా
  వలెనని పోషకత్వము నెవారలు వారల వృత్తులన్ గనన్
  సలిత ధర్మమార్గమున సాగును భారత దేశమ"న్న నా
  కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ము జేకురున్

  రిప్లయితొలగించండి
 48. ఆట పాటలందు మేటిగా రాణించి
  యందుకొన బహుమతు లవనియందు
  మదికి ముదము గూర్చు మరువని యాజ్ఞాపి
  క లను దలచుకున్న కలుగు సుఖము  పసిడి కలలు కనెడి బంగారు బాల్యాన
  చీకు చింత లేని జీవితాన
  ఆట పాట తప్ప అన్య మెఱుగనట్టి
  కలలు దలచుకున్న కలదు సుఖము


  రాత్రి వేళలందు రాకాశశిని గని
  పరవశించు చుండ వాసి గాను
  కొత్త నగల నెల్ల కొన్నట్లు వచ్చిన
  కలలు దలచుకున్న కలుగు సుఖము


  రిప్లయితొలగించండి