తన వైదుష్యము కావ్య వైభవము విద్యా ధీమతీ కాంతులన్ ఘన పద్యామృత సార వర్షమున పొంగారున్ సుధల్ మేలు మే లనెడిన్ లోకుల మానసాంబుధుల తారా నాధుడై కావ్య శ్రీ వనితాలోలుఁడె రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే _/\_
పెద్దలు కామేశ్వరరావు గారికి నమస్కారములు. మీ సూచన శిరోధార్యం. నిజానికి ఆ పాదం గురించి నాకు కొంత చింతగానే ఉంది. అక్కడ నిందే కాని కీర్తన లేదని. సవరిస్తాను.
సందర్భము: త్రేతా యుగంలో కృతవీర్యు డనే చక్రవర్తి వేలయేండ్లు పాలించాడు. భార్య శీలధరాదేవి. వారి వందమంది పుత్రులూ ముని శాప హతులైనారు. రాజూరాణీ వృద్ధులైనారు. సంతానం లేదు. యాఙ్యవల్క్య ముని పత్ని మైత్రేయి అనంతవ్రతాన్ని ఉపదేశిస్తే రాణి ఆచరించగా శ్రీ హరి కలలో కనిపించి సత్సంతాన ప్రాప్తి ర స్తన్నాడు. రాజుకు బృహస్పతి సూర్యోపాసనను నేర్పాడు. ఎంతో శ్రద్ధతో ఆయన దాని నాచరించాడు. రాణి గర్భవతి అయింది. కలలో దివ్య తేజశ్చక్రం కనిపించింది. చక్రానికి అంచులు మటుకు మొక్కవోయివున్నవి. రాణి పుత్రుని కన్నది. కార్తవీర్యు డన్నారు. అన్నీ బాగానే వున్నాయి. చేతులుమాత్రం చొట్ట. అంతా దుఃఖించారు. ఈడు వచ్చాక రాజును చేద్దా మంటే "చొట్టచేతులతో రాజ్యాన్ని రక్షించలేను. తపస్సు చేసి శక్తి సంపాదించాక చూద్దా" మని బయలుదేరాడు. ఒక మంత్రి గర్గ ముని "దత్తాత్రేయు నాశ్రయించు. నీ కోరిక తీరుతుంది. ఆయన అవధూత. ఒక్కొక్కప్పుడు మద్య మాంసాలు సేవిస్తూనో మగువలతో క్రీడిస్తూనో పరమ అసహ్యంగానో కనిపించవచ్చు. పొరపడి విడిచిపెట్టవద్దు" అని హెచ్చరించాడు. కార్తవీర్యుడు దత్తాత్రేయుని చేరుకున్నాడు. అక్కడ కల్లుముంతలు అందిస్తున్నారు. మాంస ఖండాలు పడివున్నవి. ఒక యువతి అర్ధనగ్నంగా వొయ్యారా లొలుకబోస్తున్నది. పండితాః సమ దర్శినః.. అన్నది గుర్తుంచుకొని కార్త వీర్యుడు పట్టుదలతో సేవలన్నీ చేశాడు. ఎన్నో రోజులు గడిచాయి. దత్తస్వామి తిట్టాడు. చొట్టచేతులు రెండూ వూడిపోయాయి. కి మ్మనలేదు. స్వామి "నాలాంటి క్షుద్రోపాసకుని తాగుపోతునూ తిరుగుబోతునూ సేవిస్తే ఏ మవుతుంది. వెళ్ళిపో!" అన్నాడు. కార్తవీర్యుడు "దేవా! నీవు మాయాధ్యక్షుడవు. పురాణ పురుషుడవు. ఈ తల్లి సాక్షాత్తు రమాదేవి." అని ఎంతో ప్రస్తుతించాడు. "చేతులే కాదు. నా రెండు కాళ్ళు పోయినా వదలను" అన్నాడు. స్వామి కరుణించాడు. పరిసర మంతా పరమ పవిత్రంగా మారింది. ఆహ్లాదకరమైన ఆశ్రమ వాతావరణం. వేదికపై స్వామి. సుగంధాలు చిందే పూల మొక్కలు. మాంసం మద్యం మచ్చుకైనా లేవు. మాయా వనిత. మద్యం మాంసం అంతా మాయ. అనుకున్నాడు కార్తవీర్యుడు. "కావలసిన వరాలు కోరుకో!" అన్నాడు స్వామి. కార్తవీర్యుడు "నా పాలనలో ధర్మార్థాలు వర్ధిల్లాలి. తలచుకుంటే నాకు వేయి చేతులు కలుగాలి. న న్నెదిరించే వా డుండరాదు. నీటిలో నిప్పులో నింగిలో నేలపై సంకల్పమాత్రాన తిరుగగలుగాలి." అని కోరుకున్నాడు. స్వామి అనుగ్రహించాడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ కనిపించె దత్తదేవుడు..
వనితామణి మద్యపాత్ర పల శకలము లా
యన కడ, నౌరా!.. మాయా
వనితాలోలుండు వెలిఁగె పండిత నుతుఁడై
✒~డా.వెలుదండ సత్యనారాయణ 1.5.19 -----------------------------------------------------------
వనమున సుమముల సౌరులు
రిప్లయితొలగించండికనినంత నెకవిత లల్లి కడు మోదమునన్
కనివిని యెరుగని రీతిగ
వనితా లోలుండు వెలిగె పండిత నుతుడై
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..యెరుగని విధి వా।గ్వనితాలోలుండు...' అంటే బాగుంటుంది కదా
వనమున సుమముల సౌరులు
తొలగించండికనినంత నెకవిత లల్లి కడు మోదమునన్
కనివిని యెరుగని విధివా
గ్వనితా లోలుండు వెలిగె పండిత నుతుడై
అనితరసద్యస్స్ఫూర్తిన్
రిప్లయితొలగించండిఘనతరధారణ విలసిలు కవనాంచితుడై
వినుతించందగు శ్రీవా
గ్వనితాలోలుండు వెలింగె
పండితనుతుడై.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండివాగ్వనితాలోలునితో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
కనుచున్ దీటుగ రాజ్యపాలుర సభల్ గంటమ్ముతో దూరుచున్
తినుచున్ రాజుల దానముల్ విరివిగా దీవించి కొండాడుచున్
ఘనమౌ కైతలు నుడ్వుచున్ రసికతన్ గానంబులన్ జేయుచున్
వనితాలోలుఁడె రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే :)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
__/\__
తొలగించండి
రిప్లయితొలగించండిఅనితర సాధ్యంబాయె! చె
లినిపక్కనిడుకొని తృటిని లివ్వను రీతుల్
సునిశిత కవితల తోడై
వనితాలోలుండు వెలిఁగె పండితనుతుఁడై!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య :-
రిప్లయితొలగించండి"వనితాలోలుండు వెలిఁగె పండితనుతుఁడై"
*కందం**
అనవరతము వేశ్యా గృహ
మున తిరిగెడు వేమన కడు మోహము వీడెన్
కనువిప్పు జేయగ వదిన
వనితాలోలుండు వెలిఁగె పండితనుతుఁడై
........................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిచక్కని పూరణ. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఘనుడగు డిండిము గర్వము
రిప్లయితొలగించండిననితరభంగిని సకలము నణచిన ప్రతిభా
ధుని శ్రీనాథుడు సుయశో
వనితాలోలుండు వెలిగె పండితనుతుడై .
జంధ్యాల వారూ,
తొలగించండికీర్తికాంతాలోలునిపై మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండికనగనె యశమును ధనమును
రిప్లయితొలగించండిదన బుద్ధిని బయటఁ బెట్టెఁ దామసుడగుచున్
జనులనిరి హవ్వ! యితడా
*"వనితాలోలుండు! వెలిఁగె పండితనుతుఁడై!!"*
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఘనరాజన్యసభాంతరమ్ముఁ గొనె సత్కారమ్ము శ్రీనాథుడున్,
రిప్లయితొలగించండిమనసారం దగ కృష్ణభూవిభుడు సన్మానించ కవ్యగ్రి పె
ద్దననున్ మోయడె పల్లకిన్ భుజముపై, ధన్యాత్ముడౌ భారతీ
వనితాలోలుఁడె, రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే.
కంజర్ల రామాచార్య.
( కావ్యాలంకరణజ్ఞమేవ కవితాకన్యా వృణీతే స్వయమ్.)
తొలగించండిరామాచారి గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
కని విని యెరుగని రీతిగ
రిప్లయితొలగించండిఘనమ గు నవ ధాని గాగ గాంచె ను నుతు లన్
మనమున నిరతము శ్రీ వా
గ్వని తా లోలుండు వెలి గె పండిత సుతు డై
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వినయము,విజ్ఞత,పెనగొన
రిప్లయితొలగించండివినుతుడు శ్రీకృష్ణరాయ విభుడతి బలిమిన్
ఘనుడయ్యెను -రాజ్యంబను
వనితా లోలుండు వెలిగె పండిత నుతుడై.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిఅనువుగ శిగదాచె నొకరి
రిప్లయితొలగించండిపెనగొని జుట్టుచు నొకతెను పేరిమి సగమున్
ఘన తాపసి కీర్తి బడసి
వనితా లోలుండు వెలిగె పండిత నుతుడై
ద్వారకానాథ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ కృష్ణదేవరాయల గూర్చి....
రిప్లయితొలగించండిఘనులగు దిగ్గజ కవులను
వినయము తోనాదరించె విజ్ఞుడటంచున్
జనమెప్పునంది కవితా
వనితా లోలుండు వెలిఁగె పండిత నుతుడై.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జన మెప్పు' దుష్టసమాసం. "జన నుతుల నంది..." అనండి.
జనులను రంజిల జేసియు
రిప్లయితొలగించండిఘనమగు కీర్తిని వడసిన కవి వేమనయే
మునుపటి వేశ్యా లోలుడు
వనితాలోలుండు వెలిఁగె పండితనుతుఁడై!
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
రిప్లయితొలగించండిఘనుడౌ శంకరు నామన
మున నాచార్యుగ దలపగ మోదము తోడన్
ఘన శిష్యగణాధిపతి న
వనితాలోలుండు వెలిఁగె పండితనుతుఁడై
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మనమున్ కావ్యము లల్లుచున్ మురిసి బ్రమ్మానం దమున్ పొందగా
రిప్లయితొలగించండిఘనమౌ కీర్తిని కోరుచున్ జగతి లోకాంక్షిం చగా లౌల్యమున్
వనమా లీయని భక్తితో కొలిచి నన్ పాపమ్ము లేపోవగన్
వనితా లోలుఁడె రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బ్రహ్మానందమున్' టైపాటు.
మనమున్ కావ్యము లల్లుచున్ మురిసి బ్రహ్మానం దమున్ పొందగా
తొలగించండిఘనమౌ కీర్తిని కోరుచున్ జగతి లోకాంక్షిం చగా లౌల్యమున్
వనమా లీయని భక్తితో కొలిచి నన్ పాపమ్ము లేపోవగన్
వనితా లోలుఁడె రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే
ఘనమౌ ధారణ దివ్య ధీయుతు డు నై కై మోడ్పు లన్ బొందు చున్
రిప్లయితొలగించండివినయం బొప్ప గ రాణకెక్కి మహి లో విఖ్యాత ధీశాలి యై
మన మం దెప్పుడు భారతీ స్మరణ తో మాన్యుo డు నై కీర్తి యన్
వనితా లోలు డు రాజ పూజ్యుడు ను విద్వద్వంద్యుడైవెల్గెలే
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వనమాలి వెన్నదొంగ క
రిప్లయితొలగించండిదనరంగమునందుగీత తా బోధించెన్
ఎనిమిది పత్నుల గోపిక
వనితాలోలుండు వెలిఁగె పండితనుతుఁడై
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గోపికా వనితా...' అనడం సాధువు. అక్కడ "ఎనిమిది పత్నులు గలిగిన" అన్నా సరిపోతుంది.
ఘనమగు కావ్యములెన్నో
రిప్లయితొలగించండిమనసారగ చదివి వాటి మర్మము నేర్చెన్
ఘనుడా విబుధుడు కవితా
వనితాలోలుండు వెలిఁగె పండితనుతుఁడై 🙏
సూర్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందము
రిప్లయితొలగించండిఘనమగు భాగవతంబును
మనుజేశుల కంకితమిడ మనసొప్పక పో
తన యిలవేల్పున కిడె వా
గ్వనితా లోలుండు వెలిగె పండిత నుతుడై
ఆకుల శివరాజలింగం వనపర్తి
శివరాజలింగం గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
శంకరాభరణం
రిప్లయితొలగించండి01/05/2019 బుధవారం
సమస్య
వనితాలోలుండు వెలిఁగె పండితనుతుఁడై
నా పూరణ. కం!!
** *** *** ****
ఇన వంశస్థుడు వసుదే
వ నందనుడు సురమునిజన వందితుడు సురే
శ నుతుండా వ్రేపల్లియ
వనితాలోలుండు వెలిగె పండితనుతుడై
🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
🌷 వనపర్తి 🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కృష్ణునిది సూర్యవంశం కాదు, యదువంశం.
మనమున నవవిధ భక్తుల
రిప్లయితొలగించండిననవరతమ్ముదలపంగ నాదేవుండే
తనభక్తులగాచు నెపcమ
వని తాలోలుండు వెలిగె పండిత నుతుడై
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నెపఁమవని...'?
భక్తుల కాచు నెపము అవని
తొలగించండితా లోలుడు-ఆ భక్తలోలుడు
స్తుతమతియైన కవి ధూర్జటి
రిప్లయితొలగించండిఘనతర కవితామాధురి
ననితర సాధ్యంబుసేసి యల్లగకావ్యమ్
ఘనతాపహారి భక్తుడు
వనితాలోలుండు వెలిగె పండితనుతుడై
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కావ్యమ్' అని హలంతంగా వ్రాయరాదు. "...యల్లగ కృతినే" అనండి.
ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!
తొలగించండితననెదుగగ ఛందస్సును
రిప్లయితొలగించండితనయున కధికమగు పట్టుదలతో నేర్పన్
మనసు పులకించగ కవన
వనితాలోలుండు వెలిఁగె పండితనుతుఁడై
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమనుచారిత్రకనైషధాదిరసవన్మాన్యప్రబంధావళిన్
రిప్లయితొలగించండిమును గైకొన్న సమర్పణన్ చిరము సమ్మోహించు కీర్త్యంగులై,
ఘనులై వర్ధిలిరీ నృపుల్ కృతిపతిఖ్యాతిన్, మహాకావ్యగీ
ర్వనితాలోలుడు రాజపూజ్యుడును విద్వద్వంద్యుడై వెల్గెడిన్.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశిశుపాలుడు..
చిననాటన్ బహుదౌష్ట్యముల్ నెరపుచున్ స్త్రీహంతకుండయ్యె , జ...
న్మను గాంచన్ యదువంశమౌ , కడకు మామన్ జంపె , మీరిప్డు కృ...
ష్ణునకీయంగన నగ్రపూజ సరియే ? చోద్యంబిదే ! గోపికా
వనితాలోలుడు రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅని భీముండతగాడు శత్రువులనే సంహారమ్మునే జేయుచున్
రిప్లయితొలగించండివినయమ్మందున నాదరించెనుగదా విఖ్యాతులున్ మాన్యులున్
ఘనులౌ దిగ్గజ కావ్యస్రష్టలను సత్కార్యమ్ముగా సాహితీ
వనితాలోలుఁడె రాజ్యపూజ్యుఁడును విద్వంద్యుఁడై వెల్గెలే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధనమునుగోల్పోవునుగద
రిప్లయితొలగించండివనితాలోలుండు,వెలిగెపండితనుతుడై
వినసొంపురచనజేసియు
వినయముతోనుండుకతనవేవురియెదుటన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం:
రిప్లయితొలగించండిమనమున సంకల్ప బలము
ఘనముగ సాధన సలుపుచు కార్యోన్ముఖుడై
దినమును వదలక శారద
"వనితాలోలుండు వెలిఁగె పండితనుతుఁడై"
గొర్రె రాజేందర్
సిద్ధిపేట
రాజేందర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితన వైదుష్యము కావ్య వైభవము విద్యా ధీమతీ కాంతులన్
తొలగించండిఘన పద్యామృత సార వర్షమున పొంగారున్ సుధల్ మేలు మే
లనెడిన్ లోకుల మానసాంబుధుల తారా నాధుడై కావ్య శ్రీ
వనితాలోలుఁడె రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే _/\_
సూర్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనితరసాధ్యంబాకవి
రిప్లయితొలగించండిసునిసితకవితామధురిమసుశ్లాఘ్యంబౌ!
అనవరతమతడుకవితా
వనితా లోలుండు, వెలిగె పండితనుతుడై
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సునిశిత' టైపాటు.
ధన్యవాదములు!
తొలగించండిఅనితరసాధ్యంబాకవి
సునిశితకవితామధురిమసుశ్లాఘ్యంబౌ!
అనవరతమతడుకవితా
వనితా లోలుండు, వెలిగె పండితనుతుడై
అనయ వచన చయ దూరుఁడు
రిప్లయితొలగించండిఘనుండు విద్యా ధనుఁడు నిగర్వియు సుమహా
వినయుం డార్త నిచయ గో
వని తాలోలుండు వెలిఁగెఁ బండిత నుతుఁడై
[గోవు + అనిత + అలోలుఁడు; అనితము = పొందఁబడనిది; అని తాలోలుఁడు = పొందఁబడని దానిపై నాసక్తి లేని వాఁడు; గోవు = దిక్కు]
ఘన దోర్దండ బలాతిరేక సుర గంగా సూనుఁ డార్యుండునౌ
ఘన శస్త్రాస్త్ర విశారదుండు జిత సంగ్రామారి సంహారి శాం
తనవుం డద్భుతపుం బ్రతిజ్ఞను జగత్ప్రఖ్యాతుఁడై ధీరుఁడై
వని తాలోలుఁడె రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే
[వనితా + అలోలుఁడు = వని తాలోలుఁడు]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిఎప్పటి వలెనే మీ రెండు పూరణలు శబ్దచమత్కృతితో, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిమనసిజు జనకుండు దెలిపె
రిప్లయితొలగించండిననితర సాధ్యమగు గీతనాహవమందున్
వినుమని కవ్వడికా శ్రీ
వనితా లోలుండు వెలిగె పండిత నుతుడై
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
ఘనమౌ భాగ్యపునగ్రినిన్ తరలుచున్ గంభీరమౌ స్వామ్యమున్
చనుచున్ రాజ్యపు భవ్నమున్ సరసపున్ సయ్యాటలన్ తేలుచున్
కనుచున్ పుత్తడి కన్యలన్ ముదముతో కవ్వించి లాలించుచున్
వనితాలోలుఁడె రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
'నగ్రి, భవ్నము' అన్న ప్రయోగాలు సాధువులు కావు.
వినయంబొప్పగశేముషీరచనవేవేలంగదాజేయగా
రిప్లయితొలగించండివినువారయ్యెడబాగుబాగనుచువావేనోళ్ళచాటన్సుమీ
యనయంబాతనిపుస్తకంబులుసదాహస్తంబులైసాహితీ
వనితాలోలుడెరాజపూజ్యుడునువిద్వద్వ్యంద్యుడైవెల్గెలే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వనమున సారంబట్లుగ
రిప్లయితొలగించండిమనసును సంతోషబరచు మహిమాన్వితమౌ
ఘనమగు కవితా కీర్తియు
వనితా లోలుండువెలిగె పండితనుతుడై!!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనయము మంచిని చేయుచు
రిప్లయితొలగించండివినయముగ కవితలఁ జెప్పు విజ్ఞుండగుచున్
ఘనముగ వాణిఁ గొలుచు కుల
వనితాలోలుండు వెలిఁగె పండితనుతుఁడై
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరావణాసురుడు
రిప్లయితొలగించండితనదౌ దివ్యతపంబునన్ బడసి యత్యంతాధ్భుతాకాంక్షలన్
ఘనులౌ దిక్పతులన్ భయంబునను వాగ్భంధమ్మొనర్చంగ తీ
క్షణమౌ శౌర్యపరాక్రమంబుల త్రిలోకంబుల్ వడంకంగ నా
వనితాలోలుడె రాజపూజ్యుడును విద్వద్వంద్యుడై వెల్గెలే!
అద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి గురుదేవా,నమస్సులు!
తొలగించండికందం
రిప్లయితొలగించండిఅనిలో కర్తవ్యమెరుగ
వినిపించుచు 'గీత' నరుని ప్రేరేపించన్
ఘన విజయమమర, వెన్నుఁడు
వనితాలోలుండు వెలిఁగె పండితనుతుఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివనితంబట్టగ బూజ్యమైనధనువున్ ధ్వంస మ్మొనర్చెం గటా
రిప్లయితొలగించండివనిత న్వీడి మనంగ లేక జనియెం బ్రాణేశతో గానకున్
వనితం బాసి వనాన గొల్లుమనె తా వారాశినే దాటె నీ
వనితాలోలుఁడె రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే.
మిస్సన్న గారు బాగుంది మీ నిందాక్షర కీర్తన.
తొలగించండి“వనితాశన్ నెఱవేఱ్చ నెంచి చనియెం బ్రాణేశతోఁ గానకున్” అనిన సత్యదూరులు కారు!
పెద్దలు కామేశ్వరరావు గారికి నమస్కారములు. మీ సూచన శిరోధార్యం. నిజానికి ఆ పాదం గురించి నాకు కొంత చింతగానే ఉంది. అక్కడ నిందే కాని కీర్తన లేదని. సవరిస్తాను.
తొలగించండిపాటవమ్ము మెత్తు పద్యమ్మందు 👌👌👌👏👏👏👏🙏🙏🙏
తొలగించండిమీదు మెచ్చుకోలు మాదు హితము. 🙏
తొలగించండిమేటి పూరణమ్ము మిస్సన్న చెప్పెను
తొలగించండిఅభినుతింతు నయ్య హర్షమంది.
జనియించెన్ వరవంశమందు కవితా సంద్రమ్ము నీదాడె తా
రిప్లయితొలగించండిమనమందున్ వసియింప వాణి కడు సమ్మానమ్ముతోనిత్యమున్
ఘనమౌ కావ్యములన్ లిఖించి కొనె ప్రాకాశ్యమ్ము శ్రీనాథుఁ డా
వనితాలోలుఁడె రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే
అన్నపరెడ్ది పూరణ మహా మన మోహనమై విరాజిలున్ (పూరణము + అహా)
తొలగించండిగురువర్యులకు నమస్సులు. ధన్యావాదములు.
తొలగించండివనితంబట్టగ బూజ్యమైనధనువున్ ధ్వంస మ్మొనర్చెం గటా
రిప్లయితొలగించండివనితాశ న్నెఱవేఱ్చ నెంచి చనియెం బ్రాణేశతోఁ గానకున్
వనితం బాసి వనాన గొల్లుమనె తా వారాశినే దాటె నీ
వనితాలోలుఁడె రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే.
సవరించిన మీ పూరణ
తొలగించండిస్తవనీయమ్మగుచు మిగుల సంతస మొసఁగెన్
భవదీయ పద్యముం గని
కవనంబున మేటివందు గద మిస్సన్నా!
గురువు గారూ ధన్యవాదాలండీ.
తొలగించండిగురువు మెచ్చుకోలు పరువైన బహుమతి
పెద్ద లన్న మాట పెద్ద కాన్క
హితుని నుతి వినంగ హెచ్చును హర్షము
నేమి వలయు మనకు నింత కన్న?
రావణ జననం గురించి కైకసి విశ్రవసుని చేరిన సన్నివేశసన్నివేశం మత్తేభ విక్రీడితం
రిప్లయితొలగించండివనితా చిత్తము నాలకించి ముని సంవాదంబు లేకుండగా
కనుమా సంధ్యను కూడకూడదను శంకల్ లేక చేపట్టినన్
ఘనుడా రావణుడుద్భవించె , జగమే కంపించగా భీతితో
వనితా లోలుడె రాజ్యపూజ్యుడును విద్ద్వద్వంద్యుడై వెల్గెలే.
��.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిపనిగొని భృంగము పుష్పము
నను మని గొని వ్రాలియున్న నగణుండగునే
జన గణమునకగు సేవా--
వనితాలోలుండు వెలిగె పండిత నుతుడై!
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిపనిగా గేయము లల్లి సద్రచనలన్ భాసిల్ల,శ్రీశ్రీని వే
రనిరే స్రష్ట యటంచునున్ బొగడరే?రవ్వంతయున్ ద్రోసిరే?
తనకౌ దివ్య విచార ధార గలుగన్ తద్భావనాలోకపుం
వనితాలోలుడె రాజ్య పూజ్యుడును విద్వ ద్వందద్వంద్యుడై వెల్గెనే!
పిట్టా వారల పూరణ
తొలగించండిలట్టిట్టనరానివి గద యద్భుతములు పో!
డా.పిట్టా నుండి
తొలగించండిఆర్యా,ధన్యవాదాలు
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిమును లాక్షాగృహ గండమున్ గడువ సంపూర్ణమ్ముగా గాచి దు
ర్జనుడా ద్రౌపది నీడ్చి దెచ్చియు వివస్త్రన్ జేయఁ గాపాడి తా
నని గాండీవికి పార్థసారథిగ సాయమ్మిచ్చి బృందావనిన్
వనితాలోలుఁడె రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
వనితాలోలుండు వెలిఁగె పండిత నుతుఁడై
సందర్భము: త్రేతా యుగంలో కృతవీర్యు డనే చక్రవర్తి వేలయేండ్లు పాలించాడు. భార్య శీలధరాదేవి. వారి వందమంది పుత్రులూ ముని శాప హతులైనారు. రాజూరాణీ వృద్ధులైనారు. సంతానం లేదు.
యాఙ్యవల్క్య ముని పత్ని మైత్రేయి అనంతవ్రతాన్ని ఉపదేశిస్తే రాణి ఆచరించగా శ్రీ హరి కలలో కనిపించి సత్సంతాన ప్రాప్తి ర స్తన్నాడు.
రాజుకు బృహస్పతి సూర్యోపాసనను నేర్పాడు. ఎంతో శ్రద్ధతో ఆయన దాని నాచరించాడు. రాణి గర్భవతి అయింది. కలలో దివ్య తేజశ్చక్రం కనిపించింది. చక్రానికి అంచులు మటుకు మొక్కవోయివున్నవి.
రాణి పుత్రుని కన్నది. కార్తవీర్యు డన్నారు. అన్నీ బాగానే వున్నాయి. చేతులుమాత్రం చొట్ట. అంతా దుఃఖించారు. ఈడు వచ్చాక రాజును చేద్దా మంటే "చొట్టచేతులతో రాజ్యాన్ని రక్షించలేను. తపస్సు చేసి శక్తి సంపాదించాక చూద్దా" మని బయలుదేరాడు.
ఒక మంత్రి గర్గ ముని "దత్తాత్రేయు నాశ్రయించు. నీ కోరిక తీరుతుంది. ఆయన అవధూత. ఒక్కొక్కప్పుడు మద్య మాంసాలు సేవిస్తూనో మగువలతో క్రీడిస్తూనో పరమ అసహ్యంగానో కనిపించవచ్చు. పొరపడి విడిచిపెట్టవద్దు" అని హెచ్చరించాడు.
కార్తవీర్యుడు దత్తాత్రేయుని చేరుకున్నాడు. అక్కడ కల్లుముంతలు అందిస్తున్నారు. మాంస ఖండాలు పడివున్నవి. ఒక యువతి అర్ధనగ్నంగా వొయ్యారా లొలుకబోస్తున్నది.
పండితాః సమ దర్శినః.. అన్నది గుర్తుంచుకొని కార్త వీర్యుడు పట్టుదలతో సేవలన్నీ చేశాడు. ఎన్నో రోజులు గడిచాయి.
దత్తస్వామి తిట్టాడు. చొట్టచేతులు రెండూ వూడిపోయాయి. కి మ్మనలేదు. స్వామి "నాలాంటి క్షుద్రోపాసకుని తాగుపోతునూ తిరుగుబోతునూ సేవిస్తే ఏ మవుతుంది. వెళ్ళిపో!" అన్నాడు.
కార్తవీర్యుడు "దేవా! నీవు మాయాధ్యక్షుడవు. పురాణ పురుషుడవు. ఈ తల్లి సాక్షాత్తు రమాదేవి." అని ఎంతో ప్రస్తుతించాడు. "చేతులే కాదు. నా రెండు కాళ్ళు పోయినా వదలను" అన్నాడు.
స్వామి కరుణించాడు. పరిసర మంతా పరమ పవిత్రంగా మారింది. ఆహ్లాదకరమైన ఆశ్రమ వాతావరణం. వేదికపై స్వామి. సుగంధాలు చిందే పూల మొక్కలు. మాంసం మద్యం మచ్చుకైనా లేవు. మాయా వనిత. మద్యం మాంసం అంతా మాయ. అనుకున్నాడు కార్తవీర్యుడు.
"కావలసిన వరాలు కోరుకో!" అన్నాడు స్వామి. కార్తవీర్యుడు "నా పాలనలో ధర్మార్థాలు వర్ధిల్లాలి. తలచుకుంటే నాకు వేయి చేతులు కలుగాలి. న న్నెదిరించే వా డుండరాదు. నీటిలో నిప్పులో నింగిలో నేలపై సంకల్పమాత్రాన తిరుగగలుగాలి." అని కోరుకున్నాడు. స్వామి అనుగ్రహించాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
కనిపించె దత్తదేవుడు..
వనితామణి మద్యపాత్ర పల శకలము లా
యన కడ, నౌరా!.. మాయా
వనితాలోలుండు వెలిఁగె పండిత నుతుఁడై
✒~డా.వెలుదండ సత్యనారాయణ
1.5.19
-----------------------------------------------------------