18, మే 2019, శనివారం

సమస్య - 3022 (శర్కర చేఁదగును....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ"
(లేదా...)
"శర్కర చేఁదుగా నగు విషంబు గొనన్ మధురంబునౌ సఖా"

80 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరాదా పూరణ:

    కర్కట భంగినిన్ నడిచి గాభర జేయుచు వృద్ధ బ్రాహ్మణున్
    మర్కట రీతిగా చెలగి మర్దన జేయుచు నన్నియంగముల్
    శర్కర వ్యాధితో గునిసి చాలిక దేహమునంచు వానికిన్
    శర్కర చేఁదుగా నగు విషంబు గొనన్ మధురంబునౌ సఖా :)

    కర్కటము = cancer

    (కంది వారి సవరణతో)

    రిప్లయితొలగించండి
  2. శర్కరలో నమితంబుగ
    కర్కశమున మిళితమొనర్చ కాకర రసమున్
    శర్కర కలుప విషమ్మున
    శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో (మిళిత మొనర్చ) గణదోషం. సవరించండి.

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    కుర్కురె వంటి గడ్డి కొని కోరి భుజించును , మాతృహస్త సం..
    పర్క విశేషభోజ్యముల పాయసమున్ మరి బూరెలన్ గొనన్
    మర్కటలీల వద్దనునమాయకబాలుడు , వాని దృష్టిలో
    శర్కర చేఁదుగా నగు విషంబు గొనన్ మధురంబునౌ సఖా!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  4. కర్కశు డగుమగ డుమిగుల
    మర్కట మువలెగం తులేయ మతి పోవంగా
    తర్కము లేకను సతియట
    శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "మర్కటముగ/మర్కటమై..." అనండి.

      తొలగించండి
    2. కర్కశు డగుమగ డుమిగుల
      మర్కట ముగమర్క టమై మతి పోవంగా
      తర్కము లేకను సతియట
      శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ

      తొలగించండి
    3. 'మర్కటముగగంతులేయ మతి పోవంగా' అనుకుంటానమ్మా గురువుగారి సూచన..

      తొలగించండి
  5. తర్కము చేయగ తెలియును
    శర్కర చేద గును మఱి విషమ్ముమధురమౌ
    కర్కశ మధు మేహమునకు
    అర్కుని సాక్షి గ నిజ మగు నారోగ్యము కున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆరోగ్యమునకున్' అనడం సాధువు.

      తొలగించండి
    2. నాలుగవ పాదం చివర నాయవు కొరకై అని సవరించ డ మైనది

      తొలగించండి
  6. తర్కమునకొప్పదెన్నడు
    శర్కరచేదు మధురమువిషమగుటలుభువిన్
    మర్కముకర్కటమగునా
    శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ

    రిప్లయితొలగించండి
  7. ( బాలప్రహ్లాదుడు జనకుని బాధలు భరిస్తూ మిత్రునితో )
    కర్కశదృష్టితో హరిని
    గానక తండ్రియె యిచ్చినాడుగా
    తర్కపుచింతనన్ విడచి
    త్రాగుమటంచు హలాహలమ్మునే !
    యర్కుడు , పంచభూతములు ,
    నా శశి తానగు విష్ణుశక్తిచే
    శర్కర చేదుగా నగు ; వి
    షంబు గొనన్ మధురంబునౌ సఖా !

    రిప్లయితొలగించండి
  8. సర్కారు కొల్వులందని
    శర్కరయైయువత తెగువ చావంజూడన్
    అర్కానలేందునయనా
    "శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ"

    రిప్లయితొలగించండి
  9. తర్కమదేల నేటి యువతాశయమించుకలేక మూర్ఖతన్
    గర్కటభంగిద్రిమ్మరుచు గారులు గూయుచు వ్యర్ధభాషణన్
    గర్కశచిత్తులైదుదకు గన్యమనంబునెఱుంగరత్తఱిన్
    "శర్కర చేఁదుగా నగు విషంబు గొనన్ మధురంబునౌ సఖా"

    రిప్లయితొలగించండి
  10. కర్కశమైప్రభుత్వమనుకంపముజూపక కొల్వులీయకే

    తర్కములాడుచున్ ప్రజల దైన్యమునిస్పృహలాసరాయనన్

    మార్కొనిచోద్యమున్ గన నమాయికులాశనశించ వారికిన్
    "శర్కర చేఁదుగా నగు విషంబు గొనన్ మధురంబునౌ సఖా"

    రిప్లయితొలగించండి
  11. శర్కర పోలెలు వలదని
    కుర్కురెలను పిల్లలెల్ల గోరుచు నుండన్
    తర్కమ్మేమిక గాంచగ
    శర్కర చేదగును మఱి విషమ్ము మధురమౌ.

    రిప్లయితొలగించండి
  12. శర్కర మేహరోగులకు జావు నొసంగునుమంచిగాదు సం
    పర్క రసాయనాలయము పాడయి పోయె నిరోగ కాంక్షికిన్
    శర్కరయే విషంబట విచారము సల్పగ చేదుమేలగున్
    శర్కర చేదుగానగు విషంబు గొనన్ మధురంబుగా నగున్

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కుర్కురె తోచును సుధగా
      కర్కశ గరళముగ వేప కనిపించు సదా
      తర్కమున వాస్తవమ్ముగ
      శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ

      తొలగించండి
    2. మర్కటమైన మానసము
      మారునునిల్వదదొక్క కొమ్మపై
      తర్కపుఁ దోవలో నెపుడు
      త్రాడును పాముగ నెంచి సాగగా
      కర్కశమౌను కాలము చుఱ
      కత్తులదూయును చూడ నత్తరిన్
      శర్కర చేఁదుగా నగు వి
      షంబు గొనన్ మధురంబునౌ సఖా

      తొలగించండి
    3. రాకుమార గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి


  14. కర్కశపు మంచి పలుకగు
    శర్కర, చేఁదగును, మఱి విషమ్ము మధురమౌ
    తర్కమునకుతావివ్వక
    చర్కోలావలెనుకాని చడ్డగు పలుకున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. కర్కోటకునకు బెండ్లవ
    తర్కమునకు దావు లేదు దారే ముదమౌ
    అర్కను, దల్లిని మరచును
    శర్కర చేదగును మరి విషమ్ము మధురమౌ

    రిప్లయితొలగించండి
  16. సంస్కారియైన బాల్యమిత్రుడు చెడు దారిలో వెళ్ళుచున్న తన మిత్రునికై చెప్పిన హితవు.

    కర్కశబుద్ధి యేలర? యకారణకోపమదేమి? దుష్టసం
    పర్కమదేల? చూపవు కృపన్, తలిదండ్రుల మాట నొల్లవే?
    తార్కికధీయుతుండవయి దల్చుమిదే వ్యతిరేకబుద్ధితో
    శర్కర చేఁదుగా నగు విషంబు గొనన్ మధురంబునౌ సఖా!

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  17. కర్కశమగు విధినందున
    కర్కమయిన మాటలెన్ని యనినప్పటికిన్
    తర్కము నెరుగక వానికి
    శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ

    కర్క = మంచిది (ఆం.భా)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. 🙏🏽 ధన్యవాదములు
      సవరించెద

      తొలగించండి
  18. తర్కము లేని బుడతలకు
    శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ
    మార్కులె జీవితమనుకుని
    ఉర్కుచు నుండె మహిలో చదువులు చెడె గనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    [తనను నిర్దాక్షిణ్యముగా కానలకు పంపిన రాముని చేతలకు విషాదహృదయయై విలపించుచున్న సీత పలుకులు]

    అర్కకులావతంస!యిటు లాలినిఁ గానలయందు వీడఁగన్
    దర్క మదేమి? నన్ను గరుణన్ గన కీ విటు సేయ న్యాయమే?
    కర్కశమైన చేఁత యిది! కావుమ రామయ! చూడ నిప్పు డీ
    శర్కర చేఁదుగా నగు! విషంబుఁ గొనన్ మధురంబునౌ సఖా!

    రిప్లయితొలగించండి
  20. అర్కునిబోలికనుండగ
    నర్కునిసాక్షిగబరిణయమాడగనతడున్
    మర్కటపుజేష్టలొదవగ
    శర్కరచేదగునుమఱివిషమ్ముమధురమౌ

    రిప్లయితొలగించండి
  21. తర్కము లేని వాదనల దంభపు పోకడ జూపుచున్ ననున్
    మర్కటమంచు పోల్చుటయె మానుము మానస మెట్టు లొప్పె నీ
    కర్కశమైన మాటలకు గాయ పడెన్ గద నాదు డెందమే
    శర్కర చేఁదుగా నగు విషంబు గొనన్ మధురంబునౌ సఖా

    రిప్లయితొలగించండి
  22. డా.పిట్టా సత్యనారాయణ
    తర్కవిహీనా,గ్లొబరిన్!(IPE ఫలితాలను బ్రకటించిన సంస్థ)
    కర్కశ గణనమున ఛాత్ర గణములు గుందెన్
    మర్కట నిపుణుల బెరుకగ
    శర్కర చేదగును మరి విషమ్ము మధురమౌ!(బాధ్యులకు విద్యార్థుల బాధలు తెలిసిరావాలి!)

    రిప్లయితొలగించండి
  23. మర్కట చేష్ఠలు వలదని
    కర్కశముగ మందలింప కయ్యంబగునే
    తర్కము లేని కుమతులకు
    శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ

    రిప్లయితొలగించండి
  24. డా.పిట్టా సత్యనారాయణ
    కర్కశ జీవనంబునను గానకబోయితి కావ్య దీధితిన్
    అర్కులు వేవురైన మతికాన్చరు నా రచనల్ వృథా యయెన్
    తర్క విహీనుడన్, ముదిమి దర్పము జూప కవిత్వపుం గడన్(చెరుకు గడలో)
    శర్కర చేదుగానగు విషంబు గొనన్ మధురంబునౌ, సఖా!

    రిప్లయితొలగించండి
  25. శర్కర తినెనట వయసున
    శర్కర రోగమ్మువచ్చె చాలనె రుచులన్
    మర్కటబుద్దులె వినకను
    శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ"!!

    రిప్లయితొలగించండి
  26. ఉర్కులు పర్గులు నేలయ
    మూర్కొనిన వచింతు నిమిషముననే నీకుం
    దర్కించకు నే నెఱుఁగుదు
    శర్కర, చేఁదగును మఱి విషమ్ము, మధురమౌ


    కూర్కొన నప్పు లందున సుఘోర ముపాయము లేక తీర్చగం
    గర్కశ దుఃఖ షండములు కల్గిన మూర విరాగ మాత్మలోఁ
    దర్కము లేల నిస్పృహ హృదగ్ని నిభంబయి కాల్చుచుండగన్
    శర్కర చేఁదుగా నగు విషంబు గొనన్ మధురంబునౌ సఖా

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు
    1. అర్క సురాదు లెల్లరట నచ్చెరు వందగ దక్షుడంతటన్
      మర్కటపున్ విధంబు నవమానము జేయఁగ నీలకంఠునిన్
      తర్కము జూడనట్టి సతి దైన్యము జెందిన వేళ సాజమై
      శర్కర చేఁదుగా నగు విషంబు గొనన్ మధురంబునౌ

      తొలగించండి
  28. సవరణతో

    కర్కశమగు విధినందున
    కర్కమయిన మాటలెన్ని కథితము లైనన్
    తర్కము నెరుగక వానికి
    శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ
    కథితము = చెప్పబడినది
    కర్క = మంచిది (ఆం.భా)

    రిప్లయితొలగించండి
  29. కందం
    అర్కజ లోకము వలె న
    త్తిర్కపు వెతలంబడి దురదృష్టమటంచున్
    దర్కించెడు కోడలికిన్
    శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ!?

    రిప్లయితొలగించండి
  30. బొగ్గరం ప్రసాదరావు గుంటూరు
    అర్కోదయమాగినచో
    కర్కశముగ దైవకాంతి కసిమసగినచో
    మర్కట వీరుండలిగిన
    వర్కర్లు చేటును మఱి విష్ణు మధురమై.

    రిప్లయితొలగించండి
  31. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కర్కట రాశినిన్ పొడమి కమ్మగ గొల్చుచు కంది శంకరున్
    మర్కట రీతినిన్ చెలగి మర్దన జేయగ కైపదమ్ములన్
    కర్కశ రీతిగా పలుకు గౌరవ పండిత శబ్దశాస్త్రపున్
    శర్కర చేఁదుగా నగు విషంబు గొనన్ మధురంబునౌ సఖా!

    నా జన్మ లగ్నం: కర్కాటకం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      వ్యాకరణమనే శర్మర చేదైనదా? బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.
      అన్నట్టు.... నాదీ కర్కాటకమే!

      తొలగించండి
    2. "Venkataraman's English teacher had asked him, as a punishment for indifference in studies, to copy out a lesson from Bain's Grammar three times. The boy copied it out twice, but stopped there, realizing the utter futility of that task. Throwing aside the book and the papers, he sat up, closed his eyes, and turned inward in meditation"

      http://the-wanderling.com/ramana.html

      తొలగించండి
  32. కర్కశపు హృదయు లెపుడు వి
    తర్కపు వాదనలతోడ తలచ రుచితమున్
    తర్కము చేయు మొఱకులకు
    శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ

    రిప్లయితొలగించండి
  33. కర్కశ హృదయుని మాటలు
    మర్కటమై చేష్టలందు మంచినిదలచే
    తర్కము నెట్లుండుననగ?
    శర్కర చేదగును! మరి విషమ్ము మధురమౌ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తలచే' అనడం వ్యావహారికం.

      తొలగించండి
  34. కర్కశ మైన మాటలను కాంతయె పల్కునటంచు వీడి సం
    పర్కము గోరిభోగినుల పంచన జేరితి వీవు, న్యాయమా
    తర్కము మాని చేరుమిక దారను వేగ వినాశకాలమున్
    శర్కర చేదుగానగు విషంబు గొనన్ మధురంబు నౌసఖా!

    రిప్లయితొలగించండి
  35. కర్కశ మతియై ప్రేయసి
    మర్కటమువలె నిన్ను ద్రోలి మండ్రాడింపన్
    దర్కింపగ ననిపించును
    శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ"

    రిప్లయితొలగించండి