28, మే 2019, మంగళవారం

సమస్య - 3031 (అన్నమే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు"
(లేదా...)
"భావ్యంబౌనొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్"

42 కామెంట్‌లు:

 1. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


  గురుభ్యోనమః నిన్నటి పూరణ గైకొన మనవి


  " గవ్వకు గూడ జూడ కొరగావు కవీంద్రుడ నందువే " యటం

  చివ్విధి ‌‌మాటలాడ తగునే ‌ ? యిపుడేమి కొరంత కల్గెనో‌ ?‌

  బువ్వకు లోటు లేదు గద ! ప్రోగొనరించగ నేల సొమ్మిక ?

  న్నివ్వదు తృప్తి మానవుల కెన్నడు విత్తము | కందిశంకరుం

  డెవ్వరి నేమి కోరి యొనరించును సాహితి సేవ , చెప్పుమా ?

  యవ్వడిఁ గూర్చగావలయు నందరు నే డల‌ పద్యవిద్యకున్ ! !


  ( వడి = ప్రాణము , బలము , ప్రాబల్యము )


  { చివరిపాదములో " నెవ్వడిఁ గూర్చగా వలయు " అని వ్రాస్తా

  మని అనుకొంటిని నెర + వడి = నెవ్వడి సంధి కరక్టేనా ?}

  -------------------------------------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  క్రవ్యంబుండగ మేక కోడులవిభల్ కంపించ నాల్కల్నహా!
  దివ్యంబైనవి రమ్ము బ్రాండి మనకున్ తీర్థంబులై తోచగా
  నవ్యంబైనవి పిజ్జ పస్త కొనగన్ నందమ్ముతో మెక్కుటన్
  భావ్యంబౌనొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్

  రిప్లయితొలగించండి
 3. అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు
  కాదు పడమటి తెగుదారి కాటు వేయ
  అహము పెరిగిన యగచాట్లు హత్తు కొనగ
  కనుల మైకము గప్పిన కండ క్రొవ్వు

  రిప్లయితొలగించండి
 4. అన్నమే లేక జీవులీ యవని యందు
  నిలువ లేవను మాటయే నిజము కనుక
  అన్నమే పర బ్రహ్మమౌ ననుట తప్పు
  కాదని వచియించిరి కదా కల్పమందు.

  రిప్లయితొలగించండి


 5. భావ్యంబౌనొ శరీరమే నిజముగా బ్రహ్మంబుగా నెంచఁగన్?
  భావ్యంబౌనొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్?
  భావ్యంబౌనొకొ ప్రాణ మే సరి బరబ్రహ్మంబుగా నెంచఁగన్?
  భావ్యంబైన పరాత్పరాత్మ తెలియన్ ప్రార్థింపుమానీశునే !  గోలుగోలు
  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి


 7. మన శరీరమే నిజమను మాట తప్పు
  అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు
  ప్రాణ మే పరమాత్మగ పాటి గాదు
  వీటి కావల గలవాడె విభుడు, సాక్షి!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. నవ్యంబౌ జనజీవనమ్ముఁగనఁ హీనంబయ్యె నన్నింటిలో
  సవ్యమ్మైన విధాన విందునిడు సంస్కారమ్ము లేదెచ్చటన్
  దివ్యంబౌ తినుతిండిఁబెంటలకుఁనెత్తించేటి కాలమ్మునన్
  భావ్యంబౌనొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్

  రిప్లయితొలగించండి
 9. మైలవరపు వారి పూరణ

  హవ్యంబియ్యది దేహమధ్యగతదీప్తాగ్నిచ్ఛటామాలకున్
  గవ్యంబంత పవిత్రమైనది బుభుక్షన్ దీర్చు మార్గమ్మిదే !
  నవ్యోద్వాహవృథాప్రయుక్తమగుచో న్యాయ్యంబె ! దూషింపగా
  భావ్యంబౌనొకొ ? ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 10. Dr.pitta satyanarayana
  తప్పు!పెట్టిన దంతయు కుప్ప జే సి
  తి నుట కే సూత్ర మొక్కటి తెలియజేయు
  అమ్మ మాటన మ dhuమేహమ వత రించె
  అన్నమే పర బ్రహ్మ మౌ నను ట తప్పు

  రిప్లయితొలగించండి
 11. జీవి మనుట కు వలసిన చేవ నొసగి
  ధర్మ కార్యా ల నొన రింప దన్ను నిచ్చు
  నన్న మే పర బ్రహ్మ మౌనను ట తప్ప
  టo చు ను బలు క మంచి దా యెంచి చూడ ?

  రిప్లయితొలగించండి

 12. శంకరాభరణం 28/05/2019

  సమస్య

  భావ్యంబౌనొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్"

  నా పూరణ. శార్ధూలము
  ***** **** ***
  సవ్యంబౌ ఫల కాయగూరలు సదా స్వాస్థ్యంబు చేకూర్చవే?

  భావ్యంబౌ నెటు త్రోసి వాటిని, దినన్ వ్యర్థంబు హీనంబులౌ

  నవ్యంబౌ యపకారమున్ సలుపు చైనా దేశ పాకంబులన్ ??

  భావ్యంబౌనొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్"

  🌱 ఆకుల శాంతి భూషణ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 13. సర్వ భూతము లందున సాంబు డుండు
  అన్న మూలమున బెరుగు యవని యంత
  నన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు
  గాదె, మందబుద్ధి పలుకు ఘనుడు గాదు

  రిప్లయితొలగించండి
 14. రక్కసులవలె నమలి కరకర, మింగి
  నిర్గుణోపాసన యనగ నివ్వెఱపడె
  దేవుడినెటుల తినిదెరు తెలియ లేము
  అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు

  రిప్లయితొలగించండి
 15. అన్నసూక్తము జదివిన నవగతమగు
  నన్నమే పరబ్రహ్మమౌ ననుట,తప్పు
  తిన్నను మితిమీరి రసన తృప్తికొరకు
  నెన్న సాత్వికాహారమే మిన్నయగును

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. సవ్యంబై మనుజాళికిన్ దనువునన్ చైతన్యమూలంబునై
   హవ్యాకవ్యములన్ ప్రధానదినుసౌ నన్నంబు దూషింపగా
   భావ్యంబౌనొకొ? ప్రాఙ్ఞులన్నము పరబ్రహ్మంబుగా నెంచగా
   దివ్యంబేయది గోఘృతంబు గలియన్ దీపించు బ్రాణంబులన్

   తొలగించండి
 16. అన్నమె నిలుపు ప్రాణము లెన్నడైన
  ననెడి సత్యము దెలియు మనువు గానె
  యెటుల పలుకంగ దగునురా యిటుల మార్చి
  "అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు"

  రిప్లయితొలగించండి
 17. కండ కావరమున మున్గు కవి బలికెను
  అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు ;
  ప్రాణవాయువు వలె సదా ప్రాణులకును
  జీవనాధార మగు భుక్తి గావలె గద !

  రిప్లయితొలగించండి
 18. శార్దూలవిక్రీడితము

  దివ్యంబౌ నటనా ప్రదర్శనమునే తీపింగఁ జూపించుచున్
  శ్రావ్యంబౌ మురళీ రవమ్ముఁజెవులన్ సౌమ్యమ్ము విన్పించుచున్
  నవ్యంబౌ ఫలహారమే సురిచితో నంజంగ నందించగా
  "భావ్యంబౌనొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్

  రిప్లయితొలగించండి
 19. త్రాగుబోతులమాటలుదలపయిదియ
  యన్నమేపరబ్రహ్మమౌననుటతప్పు
  మిన్నదేదియులేదిలనన్నమునకు
  గాన పరబ్రహ్మ యేయనికవులుసెప్పె

  రిప్లయితొలగించండి
 20. తినెదనమ్మా, కొదవ లేదు - థేపలాలు
  ఢోక్ల చాటులు పాస్త నూడుల్సె గాక
  శాండువిచ్చు పీజ్జాలవి తోడు కాగ
  అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు౹౹
  (కొడుకు తల్లితో భోజనాలవేళ అన్న మాటలు)

  రిప్లయితొలగించండి
 21. అన్న తగ దన్న నీ విటు లన్న నొల్ల
  నంచిత మతి నిడు భగవ దర్పిత వర
  శుద్ధ ధవళాన్నమ యగును క్షుద్రవ దవ
  టాన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు

  [క్షుద్రవత్ + అవట + అన్నము; అన్నము = 1. అన్నము, 2. నీరు; అవటము = గొయ్యి]


  సవ్యంబౌ విధి నుంచు తర్కములు నిస్సందేహ చిత్తమ్మునన్
  దివ్యర్షి వ్రజ మేల పల్కును వృథా తిర్య గ్గిరా బోధనల్
  భావ్యంబే యిటు లన్నిటన్ విశయ సంభారమ్ము లేపారగన్
  “భావ్యంబౌ నొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్”

  రిప్లయితొలగించండి
 22. అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు
  గాదు గద మరి యెట్టుల గల్గె నీకు
  దుష్ట చింతనమ్మిది మది దొరలనీక
  నమ్ము మన్నమె బ్రహ్మము నడుపు జగము 🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. భావ్యంబౌనొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్
   శ్రావ్యంబౌనొకొ విజ్ఞు లందరును శాస్త్రమ్ముల్ సదా మెచ్చుటన్
   సవ్యంబౌనొకొ ధీమతాగ్రణులు సుజ్ఞానమ్ము బోధించుటన్
   నవ్యంబంచు వినూత్న రీతులె ప్రమాణార్హంబుగా నెంచినన్

   తొలగించండి
 23. రిప్లయిలు
  1. ఆటవిడుపు సరదా పూరణ:
   (జిలేబి గారికి అంకితం)

   ద్రవ్యంబుండగ లెక్కపెట్టి కులుకన్ తండోపతండాలుగా
   శ్రావ్యంబైనవి పాటలుండగనిటన్ శాస్త్రీయ బీటిల్సునన్
   కావ్యంబుండగ శంకరాభరణమన్ కందీశు బ్లాగందునన్
   భావ్యంబౌనొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్

   తొలగించండి
 24. నాల్గు దినములయి తినక మూల్గుచుండు
  మానవుని ముందుగల కంచమందు పట్టె
  డన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు
  యెటుల నగు? చెప్పు మిత్రమా ! యిప్పుడైన

  రిప్లయితొలగించండి
 25. ద్రవ్యంబుల్ విరజిమ్మి హాలికుడు ఖేదంబుల్ భరించున్ సదా
  భవ్యంబౌ వ్యవసాయపద్ధతులలోపండింపనాయన్నమున్
  సవ్యంబౌవిధి యోచనన్ సలుపుచున్ సంరక్ష ణన్జేయకన్
  భావ్యంబౌనొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్?

  రిప్లయితొలగించండి
 26. 1. అన్నగత ప్రాణులు మనుజులనగ వింటి
  అన్నమును గన్నులద్దియే దామును దిన
  అన్నమా యను పరదేశ జనము లహహ
  అన్నమును పరబ్రహ్మయే యనగ దప్పు ...

  2. అన్నము దినగ నెరుగరు వారలెపుడు
  అన్నమనగ పిజ్జాలును యన్న మనుచు
  అన్నము దెలియని విదేశమాశ్రయించి
  అన్నమును పరబ్రహ్మయే యనగ దప్పు ...

  రిప్లయితొలగించండి
 27. బ్రతుక వలయు నన్న ప్రజకువసుధయందు
  అన్నమే పర బ్రహ్మమౌ ననుట తప్పు
  కాదు వినుమయ్య పిల్లల కైన పెద్ద
  వారలకును నొసగు చుండు బలము నిజము

  మరొక పూరణ

  అన్నమే పర బ్రహ్మమౌ ననుట తప్పు
  యనెడి వాడొట్టి మూర్ఖుడౌ నవని యందు
  బ్రతుక వలెనన్న భువిలోన వాసిగాను
  నవసరమ్ముగాదె మనకు నన్నమెపుడు

  రిప్లయితొలగించండి
 28. స్వార్థ జీవనసారంబె సర్వమనుచు
  కాటకంబున కాసులమూట గట్టి
  ధనమె యింధనమనియు "నధములనిరి
  అన్నమే పరబ్రహ్మ మౌననుటతప్పు"!

  రిప్లయితొలగించండి
 29. శార్దూలవిక్రీడితము
  దివ్యత్వంబున దైవమందరికిఁ దాదిక్కౌచు కాపాడగన్
  ద్రవ్యంబన్నది దేవుడిచ్చినది సొంతంబందురే కొందరున్
  సవ్యంబౌనె మరొక్కరన్నమును దుశ్చర్యన్ ప్రయోషించగన్!
  భావ్యంబౌనొకొ? ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్

  రిప్లయితొలగించండి
 30. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు

  సందర్భము: అన్నం పరబ్రహ్మ స్వరూపం.. పారవేయరాదు.. అంటే ఓ దుడుకు బాలు డిలా అంటున్నాడు..
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  కూర పచ్చడి పప్పు సాంబారు చారు

  పెరుగుతో గూడినప్పుడే పిలువ దగును

  అన్నమును పరబ్రహ్మ మౌ నంచు.. వట్టి

  అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  28.5.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 31. నవ్యా! పాములు పాలు ద్రావుననుచున్ నాడెందరో చెప్పుటన్
  శ్రావ్యంబౌ మధురస్వరాలకిల పాషాణమ్ములే కర్గుటన్
  భావ్యంబౌ నొకొ? ప్రాజ్ఞులన్నముఁ బర బ్రహ్మంబుగా నెంచగన్
  భావ్యంబే గద జీవకోటికదియే ప్రాణమ్మునే నిల్పదే.

  రిప్లయితొలగించండి
 32. ఒక భిక్షార్థి ఆవేదన....

  తేటగీతి
  భిక్షగాడిగఁ బుట్టితి వెతలఁ బడితి
  అన్నమో! రామచంద్రా! యనన్న భిక్ష
  పట్టె డన్నము పెట్టెడు ప్రభువు లేరి?
  అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు!

  రిప్లయితొలగించండి
 33. అన్నమనగ పరబ్రహ్మ మౌను కాని
  పంచ భక్ష్య సహిత మౌచు పరగెడి పర
  మాన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు!
  బ్రతుకు నిలుపు మెతుకె పరబ్రహ్మ మగును!

  రిప్లయితొలగించండి
 34. తిండి గలిగిన కండలు తీరుగాను
  ధైర్యమిచ్చును కొండంత స్థైర్యమేను
  ఒద్దికైనట్టి మాటల కున్న విలువ
  అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు!!

  ***వ్యంగ్యాత్మక పూరణ.!

  రిప్లయితొలగించండి