22, మే 2019, బుధవారం

దత్తపది - 157

కడ, జడ, దడ, వడ
పై పదాలను ప్రయోగిస్తూ
ఎన్నికల ఫలితాలకై ఎదురుచూసే
అభ్యర్థుల ఉత్కంఠస్థితిని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి. 

74 కామెంట్‌లు:

  1. మైలవరపు వారి పూరణ

    కడకేమి జరుగునో యని
    జడతన్ నిశ్వాసమెగయ , జననేతకెదల్
    దడదడ దడదడ దడదడ
    వడకుచునుండంగ బెరిగె వడగాడ్పులిలన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మాలినీ వృత్తం..

      కడకు గెలుపు నాదో ? కాదొ , ప్రత్యర్థిదేమో ?
      జడత మదిని నిండెన్ శాంతి లేకుండెనంచున్
      దడదడదడ గుండెల్ తల్లడిల్లంగ నేతల్
      వడకిరి పరదైవప్రార్థనాయత్తచిత్తుల్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  2. కడకది యెట్టివార్త విన
    గావలెనో ! జయమా ? తదన్యమా ?
    జడముగ మారుచుంటి ; గడు
    జంకును గొంకును లేక వాగితిన్ ;
    దడదడలాడుచుండె నెద ;
    ధన్యుడనయ్యెద నేను గెల్చినన్ ;
    వడకుచునుండె గొంతు ; కల
    భగ్నము కాదుగదా సమస్తమున్ !

    రిప్లయితొలగించండి


  3. కడగట్టి నోటును భళా
    దడకట్టి సరి సరి వేయ దమ్ముగ ఢిల్లీ
    జడమయు లేకన్ పాలిం
    ప డమడమ వడముడి మోడి పడలుపడునొకో!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరిపాదం మనోహరంగా ఉన్నది.

      తొలగించండి

  4. కం!!

    కడ కేమి జరుగునో యని

    "దడదడ"కొట్టుకొనుచుండ దండిగ నెద నా

    తడు వడకన్ దొడగుచు నా

    జడదారిని వేడుకొనెను జయము లభించన్


    🌱 ఆకుల శాంతి భూషణ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  5. కడవలకొద్ది పోసితిమి కమ్మని మద్యము త్రాగువారికిన్
    జడలకు పూలు నింతులకు సారెలు చీరల నందజేయగా
    దడదడ బుట్టె పోలు ఫలితమ్ముల నంచన తారుమారులై
    వడకెను దేహమంత కడుపారతినన్ మనసొప్ప లేదయో!

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  6. చ. దడదడ గుండె శబ్ధమును దాచుట కష్టమె శ్వాస యుండునే
    కడ ఫలితమ్ము తేల పది గంటలె కాలమె యోర్చుటెట్లనో
    జడతయు పొంగెనెందులకు? సర్వము నీవని నమ్మ తిన్గదా
    వడకుటనాప గల్గి మన వారల గెల్పువినంగవచ్చునే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర ప్రసాద్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  7. నిలకడయుండదు మనసుకు
    అలజడలజడిగనుతోచె అన్నగెలుచునా!
    గెలిచెదడని' బెట్టే' సితి
    గెలవడమే జరుగకున్న గేలియగునుగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణీంద్ర గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అలజడి + అలజడి' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. గెలిచెదడని...? "గెలుచుననుచు బెట్టేసితి" అనండి.

      తొలగించండి
    2. నిలకడయుండదు మనసుకు
      అలజడియలజడిగదోచె అన్నగెలుచునా!
      గెలుచుననుచు 'బెట్టే'సితి
      గెలవడమే జరుగనిచో గేలిచేతురే.

      తొలగించండి
  8. పోకడ వడదెబ్బ దడతాను బొందినట్లు!
    జడత వడిదిరుగు కడకుజంకునందు!
    దడను గుండియె బెంచుసందడులనడుమ
    అదురు బెదురున నిదురించు నలజడందు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో గణదోషం. 'అలజడి + అందు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
  9. ఫలితము ల రాకడ తెలుపు పత్రిక లను
    చదివి కొందరు త డ యక జడి యు టేల ?
    ఈవి యమ్ము ల జడ లోన నిరుకు కొని యె
    వడ కి పోకుండ జూడ గా వలయు నిపుడు

    రిప్లయితొలగించండి
  10. చంపకమాల (సరసీ)
    దడదడ గుండె శబ్ధమును దాచుట కష్టమె శ్వాస యుండునే
    కడ ఫలితమ్ము తేల పది గంటలె కాలమె యోర్చుటెట్లనో
    జడతయు పొంగెనెందులకు? సర్వము నీవని నమ్మ తిన్గదా
    వడకుటనాపి యెట్టి తడబాటుయె లేని సువార్తనీయుమా


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర ప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తడబాటు + ఎ = తడబాటె' అవుతుంది. యడాగమం రాదు. "తడబాటును లేని..." అనండి.

      తొలగించండి
  11. డా.పిట్టా సత్యనారాయణ
    కడకా నోట్లను గుప్పనీక వెతలన్ గన్నాము;వే దొంగలై
    వడబోతల్ గొని జేబు నింపుకొనిరో;వద్దన్న మాతాపితన్
    జడధారుల్ య(అ)నుకొంటి, నీ దడ విడన్ చాంచల్య *యీ. వీ.యము*ల్
    విడుపున్ జూపునొ బై-యెలక్షనులనే వీరంగమే జేయునో?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాతాపితల్ అనాలి కదా? 'జడధారులనుకొంటి' అవుతుంది. అక్కడ విసంధిగా గాని, యడాగమంతో గాని వ్రాయరాదు.

      తొలగించండి
    2. ఆర్యా, ధన్యవాదాలు
      మాతన్ బితన్....2వ పాదంలో
      జడధారీద్వయమంచు నీ దడ విడన్...3వపాదంలో
      రీ యెలక్షనులనన్......4వ పాదంలో ..
      సవరణను స్వీకరించండి.*బేగీ కా కామ్ షైతాన్ కా హోతా హై*

      తొలగించండి
  12. ఎన్నిక పోకడ జూడగ
    మన్నియమమ్ములను వీడి మతులే జడగా
    కన్న కలలు దడ పెంచగ
    పన్నాగమ్ములు వడకుచు భారత మొప్పెన్

    ఎన్నిక-గణనము

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. గడబిడ అక్కడ ఇక్కడ
    జడవని నాయకులు లేరు జనుల పరీక్షన్
    దడ దడ లాడుచు నెండల
    వడ దెబ్బల కన్న మిగుల భయమగుచుండన్ 😃

    రిప్లయితొలగించండి
  15. జడకుచ్చులు చేయింతును
    పడతీ దీవించు, నేనవజితిని పొందన్
    కడకేమగునో యని యెద
    దడతో వడవడ వడకెను ధైర్యము లేకన్

    రిప్లయితొలగించండి
  16. కడపటి ఫలితంబులవిగొ
    వడకించుచు వెలువడంగ వచ్చెడుదినమున్
    జడజాణల తీర్పెటులనొ
    దడదడ లాడెనుగగుండె దలపోయగనే!

    రిప్లయితొలగించండి
  17. //కడ, జడ, దడ, వడ//
    కడవరకుఁ మనసు నిలువదు
    జడతయుఁ ముసురగఁ గనుగొనఁ జడుపుయుఁ గలుగున్
    దడదడ పెరుగుచు నొడలును
    వడకగ తడబడుఁ రసనయుఁ బలుకగ వెరచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాకుమార గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జడుపును' అనండి.

      తొలగించండి
  18. కేదారనాథ్ గుహలో మోడి ధ్యానం.....

    జడజంగమ గుహన నపర
    జడభరతుఁడవోలె కడకు జపమున్ జేసెన్
    వడకుమల దేవర భయము
    దడయు కలిగి వేడె భారతమ్మును గావన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గుహన' అనరాదు. "గుహను" అనండి.

      తొలగించండి
  19. జడతాభావమునొందుచు
    దడదడనికవడకుచుండ్రితద్దయుసభ్యుల్
    కడకేమిజరుగుననుచును
    విడివిడిగానొక్కరొకరుభీతియుగలుగన్

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. కౌంటింగ్ ఏజంటుకు అభ్యర్థి ఆదేశం/విన్నపం

    కందం
    కడవరకున్ బయటపడకు
    జడవక యే చిన్న తప్పు సాకుగ దొరకన్
    దడబుట్టించఁగ జూడుము
    వడకక లెక్కింపు క్రియను పరికించుమయా!

    రిప్లయితొలగించండి
  22. మిత్రులందఱకు నమస్సులు!

    'కడకును వచ్చు ఫలిత మిట
    వడఁకించుచునుండె నన్ను! వలచి గెలుతునో,
    వెడ నోడెదనో!' యను దడ
    సడి సేయుచునుండె గుండె! జడ మొదవె మదిన్!

    రిప్లయితొలగించండి


  23. నా పూరణ. చం.మా.
    **** *** ***

    కడకు ఫలంబు గాంచగను ఖ్యాతిని బెంచునొ!లేక త్రుంచునో!

    దడ దడ కొట్టె గుండియ!సదా వడకన్ దొడగెన్ శరీరమున్!

    ఇడుముల దీర్చి బ్రోచు పరమేశుడు శర్వు డుమామహేశుడౌ

    జడముడి జంగమయ్య ననిశంబు జపింతు జయంబు గోరుచున్!


    🌱 ఆకుల శాంతి భూషణ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  24. వడకు భయంపడ కుంటిని
    కడకు ఫలితములను తెలుపు కాలము వచ్చెన్
    దడ పుట్టుచున్న దయ్యో
    జడతవిడివడిన సువార్త చక్కబరచుగా !

    రిప్లయితొలగించండి
  25. తే: ఓట్లపో *కడ* నెరుగను కోట్లు పెట్టి
    కొనియు నను *జ! డం*బమ్మును కోలుపోయి
    బ్రతుకజాలను, *దడ* దడ లాడు చుండె
    గుండె, యె *వడ* నిన్ గెలిపించి కూర్చు శాంతి ?

    రిప్లయితొలగించండి
  26. మాన్యులు శ్రీ నాగిళ్ళ రామశాస్త్రి గారి కోరిక మేరకు చేసిన పూరణము:

    అడుగిడఁ గడఁగియుఁ "దడఁ"బడి
    "వడఁ"కుచు నొడఁబడియు జడుఁడు వడిఁజను గడనన్!
    దడఁగొనెఁ బురుడున గెలువడి
    "కడ" కెటు లడరెడునను జడిఁ, గడు "జడ"మడరన్!!

    (గడనన్=గణన స్థలమునకు, లెక్కింపు జరిగే ప్రదేశమునకు; పురుడున=పోటీలో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      పోతన గారి "అడిగెదనని" పద్యాన్ని అనుకరిస్తూ వ్యత్త్యనుప్రాసతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  27. దడబుట్టెను గుండెలలో
    కడకే మగునో ఫలితము కానగ నైతిన్!
    వడకుట తగ్గదు స్వామీ
    జడమై పోయెను తనువిక చతికిల బడితిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివరామకృష్ణ శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  28. నిలుకడ కఱ వాయెను నా
    కలజ డడరెఁ దడఁబడి వడఁకఁ దొడఁగెఁ గరముల్
    విలయమొ విజయంబో నా
    కలవడునే యీ పద వని కందె నొకండే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      అలజడి + అడరె... అన్నపుడు సంధి ఉండదనుకుంటాను.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      ఆ సందేహము తోనే వ్రాసానండి. అలాగే పదవని లోను. సవరించిన పూరణ:

      నిలుకడ కఱ వాయెను నా
      కల జడతఁ దడఁబడఁగ వడఁకఁ దొడఁగెఁ గరముల్
      విలయమొ విజయంబో నా
      కలవడునే యున్నతి యని కందె నొకండే



      నీ వర | వా యించుక లేక పఱపవలయు రథంబున్‌. భార. వి. 5. 14
      అరవాయి + ఇంచుక
      వినఁ బడయ మఖిల జగములన్ భార. అశ్వ. 4. 163.
      బడయమి + అఖిల

      తొలగించండి
    3. సవరించిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  29. తేటగీతి
    గుండె చప్పుడు దడదడ గొట్టు కొనుచు
    వడకు బుట్టించె నాయకవర్గ మునకు
    జడమనస్కులై చింతించ సాగినారు
    కడకు విజయంబు గలుగునో కలుగదేమొ.
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  30. కందం
    కడసారిగ సర్వమ్మును
    జడవక నే దారపోసి సాగితి గెలువన్
    దడ దడమని లెక్కింపన
    వడకెడు నా గుండె గాట పడునో లేదో?

    రిప్లయితొలగించండి
  31. దత్తపది :-
    *కడ, జడ, దడ, వడ*
    పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
    ఎన్నికల ఫలితాలకై ఎదురుచూసే
    అభ్యర్థుల ఉత్కంఠస్థితిని వర్ణిస్తూ
    నచ్చిన ఛందంలో పద్యం

    *తే.గీ**

    మనసు నిలకడ దప్పుచు మార్పు జెందె
    జడవకని ధైర్యపరచిరి జనులు గూడి
    గెలవడము ఖాయమైనను ఫలితమెట్లు
    వచ్చునోయని యెద డంగు పడెను నేడు

    రిప్లయితొలగించండి


  32. కడకేమగునో నెరుగను
    దడపుట్ఠెను మానసమున తలచిన యంతన్
    జడధారీ కావుము మము
    వడకును తగ్గించి బ్రోచి భద్రము నిడుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అగునో యెరుగను' అని యడాగమం వస్తుంది.

      తొలగించండి