తావుల తావి బొగ్గరము దాని విశేషము బట్టి మారు నే తావుల చూడ గాను గల దైవము హృత్కమలంబుగాను నె త్తావిని చేర్చు గాదుటె? నిదానము గాంచు తలోదరీ యెటుల్ దేవుడు లేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్?
దేవుడు లేని తావెచట దేవిన నీ సువిశాలవిశ్వస ర్వావరణమ్ములందు గలదా? సకలమ్ము తదీయరూపమౌ ధీవర! యీ విరుద్ధసముదీరితవాక్యమసంగతమ్మె, యే దేవుడు లేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్?
( దేవుడు నిలవని గుడి - దేవుడు నిలచిన గుడి ) తావలమౌను బూజులకు ; త్రాచులు తేళ్లును బ్రాకుచుండెడిన్ ; బావురుమంచు గానపడు బారులు దీరెడి గబ్బిలాలతో దేవుడు లేని మందిరము ; దివ్యమునై విలసిల్లు నిచ్చలున్ దేవుడు నిల్చినట్టి గుడి దివ్వెల గంటల మంత్రసేవతో గావగజేయు సంస్తుతుల గప్పురహారతి కాలవాలమౌ .
చెరనుబెట్టె ద్విజుడనది చెడ్డ రాజు ఉసురు దీసుకునె నతండు ఉపవసించి రాకుమార్తెలు కొలిచె కారాగృహమున విప్రుడు కరుణించగ ఖైదు వినుతికెక్కె దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె
ఆ గుడిలో విగ్రహం ఉండదు. మొగవారికి కూడా అనుమతి ఉండదు
విగ్రహం లేని గుడా ఇదేంటి విచిత్రంగా.. ఎక్కడైనా విగ్రహం లేకుండా గుడి ఉంటుందా.. అయితే ఈ గుడి ఎక్కడుండి అనుకుంటున్నారా.. ఉత్తరప్రదేశ్ లో.. ఎటువంటి దేవతావిగ్రహం లేకుండానే నిత్యం పూజాకార్యక్రమాలు నిర్వహించే ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడికి ఇంతవరకూ మగవారు అడుగుపెట్టనేలేదత. కేవలం మహిళలు మాత్రమే ఈ ఆలయంలోకి వెళ్లి పూజలు, వ్రతాలు, నోములను నిర్వహించుకుంటారు. ఇలా మగవారు ఆ గుడిలో అడుగుపెట్టకపోవడానికి గల బలమైన కారణానికి ఒక కథ కూడా వుంది.1870వ సంవత్సరకాలంలో సాకాలేదిహ అనే ప్రాంతాన్ని పాలించే ఒక రాజుకి కొంతమంది కుమారులు, కుమార్తెలు కూడా వుంటారు. అదే ప్రాంతానికి చెందిన శ్రీపాదుడు అనే బ్రాహ్మణుడు గోవులను పెంచుకుంటూ సుఖంగా జీవిస్తూ వుంటాడు. ఒకనాడు శ్రీపాదుడి ఆవులు అనుకోకుండా రాజుగారి పొలంలోకి ప్రవేశిస్తాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన రాజు, అతని కుమారులు శ్రీపాదుడిని నిర్బంధించి ఒక కారాగారంలో పడేస్తారు. ఆ బ్రాహ్మణుడు వారిని.. ‘‘అయ్యా! పొరపాటు జరిగిపోయిందయ్యా… నన్ను క్షమించడం. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను’’ అని ఎంతగా వేడుకున్నా.. రాజు తన భటుల ద్వారా అతనిని అనేక చిత్రహింసలకు గురిచేశాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురయిన శ్రీపాదుడు.. ఆ మరుక్షణం నుంచి అన్నపానీయాలను మానేసి, నిరాహారంగానే కాలం గడుపుతుంటాడు. ఈ విషయం మొత్తం తెలుసుకున్న రాకుమార్తెలు చాలా బాధపడతారు. ఒక బ్రాహ్మణున్ని ఈ విధంగా ద్రోహం చేసి, చిత్రహింసలు పెట్టడం వల్ల వారి రాజవంశానికే అరిష్టమని భావించి ఆ రాకుమార్తెలు కారాగారంలో బంధించబడి వున్న శ్రీపాదుడుని రహస్యంగా కలుసుకుంటారు. తమ తండ్రి, సోదరులు చేసిన అన్యాయానికి, ద్రోహానికి క్షమించమని అతనితో వారు వేడుకుంటారు. దానికి శ్రీపాదుడు మాత్ర ఎటువంటి సమాధానం ఇవ్వకుండా, నిశ్శబ్దంగానే వుండిపోతాడు. ఒకనాడు రాకుమార్తెలు తులసీతీర్థాన్ని తీసుకునివచ్చి.. శ్రీపాదుడిని అది తాగి దీక్ష విమరించుకోమని కోరుకుంటారు. కారాగారంలో బంధీగా వున్న బ్రాహ్మణ శ్రీపాదుడు వారిచ్చిన తులసీతీర్థాన్ని తీసుకుని… ‘‘మీకెప్పుడూ మంచే జరుగుతుంది. కలకాలం సుఖంగా జీవించండి’’ అని దీవిస్తూ.. తను కూర్చున్న చోటే ప్రాణాలను విడుస్తాడు. అది జరిగిన కొన్నాళ్ల తరువాత శ్రీపాదుడిని బంధించిన రాజు, అతని కుమారులు ఒకరోజు రథంలో వెళుతుండగా… అది లోయలో పడి వారందరూ ఒకేసారి మరణిస్తారు. అయితే రాకుమార్తెలు మాత్రం తమ తండ్రి చనిపోయినందుకు దు:ఖించకుండా.. బ్రాహ్మణుని ఆశీర్వాదం వల్లే తాము ప్రాణాలతో వున్నామని నమ్ముతూ… అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. శ్రీపాదునికి కృతజ్ఞతాభావంగా ఆ రాకుమార్తెలు… అతనిని బంధించిన కారాగారాన్నే దేవాలయంగా తయారుచేసి, అతను కూర్చున్న చోటును దైవపీఠంగా భావిస్తూ, పూజలు చేసేవారు. ఆ విధంగా నిర్మించిన ఆలయంలో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశమని… మగవారు ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలికి రాకూడదని వారు శాసించారు.
బాలకృష్ణ గారూ, చక్కని ఐతిహ్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'చెరను బెట్టె నొక ద్విజుని చెడ్డరాజు...' అనండి. ఆ దేవాలయ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
జీవము లేని దేహమును చెక్కర లేని పాయసాన్నమున్ భావము శూన్యమైన కవి వర్యుడు వ్రాసిన కావ్యరాజముల్ దేవుడు లేని మందిరము, దివ్యము నై విలసిల్లు నిచ్చలున్ పావను డైన రాఘవుని పాదముఁ జేరిభజించు వారలున్
[ఒక భార్య కీర్తిశేషుడైన తన భర్త అనే దేవుడు తమ యింటిలో యిప్పుడు నిల్చి లేకున్నా, తన హృదయమనే మందిరంలో నిలిచివుండి, తనకు సూచనలిస్తూ, అనునిత్యమూ విలసిల్లుతున్నాడని తెలిపే సందర్భము]
గొల్ల వారి దేవుడనియు కులపు వేల్పు కోమటి కుల మాతగ వాసవీ మఠములు కుల మతములన్ని దేవుని గుడికి గలవు కుల మతములంటని బడియే గుడిగ మారె దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె ......................✍చక్రి
దేవుడు లేని మందిరమ! తెల్పు మదేడనొ? ,తాదృశమ్మునై భూవలయమ్మునం దొకటి పూజలతో నలరారెనే?,యిలన్ దేవళమెట్లు దివ్యమగు దివ్యుడు లేనిచొ?, యెట్టి రీతిలో దేవుడు లేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్?
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండికోవెలలో మసీదునను గొప్పగ చర్చిని నున్నవారిలో
దేవుడు వేరువేరనుచు దెప్పుచు కొట్టుచు చంపబోకయే
చావును జన్మమే కనక చక్కగ హృత్తున; రూపు రేఖలన్
దేవుడులేని; మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిభావము ప్రేమభావనవభాసురపద్మముగాగ , నందులో
జీవుడు దేవుడై నిలుచు చేతనతాప్రతిరూపమై , మహిన్
జీవము లేని దేహము రుచించెడి వారిటు బల్క నొప్పెడున్
"దేవుడులేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్" !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమరుగు పడెనట భక్తియె మనిషి కిపుడు
తొలగించండిదోచి నంతనె మిగులును దొరలు కాగ
ధనము కంటెను మించిన దైవ మేది
దేవు డేలేని గుడికడు దివ్య మయ్యె
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యోన్నమః🙏
రిప్లయితొలగించండిదేహ మేగద భువినందు దేవు నిల్లు
అన్ని ప్రాణుల నుండగా అల్పు డగున
విగ్రహంబు లయందునీ వెదక నేల
దేవుడే లేని గుడికడు దివ్య మయ్యె
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విగ్రహంబులయందునే' అనండి.
రిప్లయితొలగించండివెల్ల యున్ లేక వెలలేక వెలసెనయ్య
దేవుడే లేని గుడి, కడు దివ్యమయ్యె,
వెలుగులను జేర్చి జనులకు, వెలసెనయ్య
దేవుడున్న తలము జగతిని వసతిగ!
జిలేబి
రిప్లయితొలగించండితావుల తావి బొగ్గరము దాని విశేషము బట్టి మారు నే
తావుల చూడ గాను గల దైవము హృత్కమలంబుగాను నె
త్తావిని చేర్చు గాదుటె? నిదానము గాంచు తలోదరీ యెటుల్
దేవుడు లేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్?
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమా ఊరి రచ్చబండ
సీ. జన్మదినమేయైన, అన్నప్రాశనమైన,
జనులందరము జేరి జయములనుచు;
ఉత్సవములైనను, ఊరి పండుగలైన,
సంతోషమున మేము సదము సల్పు;
యువతులకు పోటీలు, యువకులకు పోటీలు,
అక్కడే జేరి మేమమలు జేయు;
భజన పాటలకు, పంచాయితీలకు,
తీర్పునిచ్చేటి ధర్మపు తేరు మాకు:
తే.గీ. ధనుల, నిర్ధనుల కలిపేటి ధరణి కొండ
రమ్యమైనట్టి మా ఊరి రచ్చబండ
మాకు నా రచ్చబండయే భవ్యమయ్యె!
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె!
వామన కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గణదోషాలున్నవి. "జన్మదినమె యైన... ఉత్సవాలైనను... యువతుల పోటీలు యువకుల పోటీలు... భజన పాటలకును... తీర్పు నిచ్చెడి ధర్మదేవతగను... నిర్ధనుల కలిపెడి..." అనండి.
అలవాటు తప్పిన వైనం...
తొలగించండిక్షమ్యతాం.
నడచుఁ నభ్యాసమై వాణి బడినఁ దాను
రిప్లయితొలగించండిజాలు వారుఁ జ్ఞానముగ గ్రంథాలయమున
కానరాకున్న నేమి విగ్రహపు జాడ
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె
భావన గొప్పదై హృదయ
తొలగించండివాటిని శుద్ధిగ నుంచ నెప్పుడున్
దీవెన తానెయై నడచు
తెన్నును చూపును వెన్నుఁదట్టుచున్
కోవెల దేహమై కనగఁ
గూటిన ప్రాణము దీపమౌ నహో
దేవుడులేని మందిరము
దివ్యమునై విలసిల్లు నిచ్చలున్!
రాకుమార గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
'గూటిని' అనండి.
భక్తి హీనము తిమిర విభ్రాంత సీమ
రిప్లయితొలగించండిదేవుడు లేని గుడి, కడు దివ్యమయ్యె
దేవదేవుని సన్నిధి-ప్రోవు చేయు
ఆత్మ సంశుద్ధి,కైవల్య మమరు బుద్ధి.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దేవుడే లేని' అని ఉండాలి. లేకుంటే గణభంగం.
అది టైపాటు ధన్యవాదములు
తొలగించండిదేహరమ్మైన మరియు నీ దేహమైన
రిప్లయితొలగించండిశిథిలమైపోయి భూమిలో జేరు తుదకు
దేవుడేలేని గుడి, కడు దివ్యమయ్యె
దైవముండిన ప్రతిచోట ధరణిలోన.!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దేవుడు లేని తావెచట దేవిన నీ సువిశాలవిశ్వస
రిప్లయితొలగించండిర్వావరణమ్ములందు గలదా? సకలమ్ము తదీయరూపమౌ
ధీవర! యీ విరుద్ధసముదీరితవాక్యమసంగతమ్మె, యే
దేవుడు లేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్?
కంజర్ల రామాచార్య
వనస్థలిపురము.
రామాచార్య గారూ,
తొలగించండిఅధిక్షేపాత్మకమైన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ప్రేమ కరుణయు త్యాగమ్ము విరివిఁ గలిగి
రిప్లయితొలగించండినిరతము పరోప కారమే నేమముగను
మదితలచు మహ నీయుని హృదయ మదియె
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేనెలూరెడు విధమున దివ్యముగను
రిప్లయితొలగించండివార్తలోకెక్కెనాబడి నార్తజనుల
కలయ జూడంగ పిల్లల కలకలములె
పాఠములుజెప్ప గురువులు బడిన లేరు
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె!!
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బడి యార్తజనుల' అనండి.
ధన్యవాదములు!
తొలగించండిదేవుడ oత ట కల డను భావ మునను
రిప్లయితొలగించండిమనె డు వారికి ప్రతి చోట మహిత మైన
దైవ శక్తి యె కను పింప తగు న దె ట్లు
దేవు డే లేని గుడి కడు దివ్య మగును ?
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
( దేవుడు నిలవని గుడి - దేవుడు నిలచిన గుడి )
రిప్లయితొలగించండితావలమౌను బూజులకు ;
త్రాచులు తేళ్లును బ్రాకుచుండెడిన్ ;
బావురుమంచు గానపడు
బారులు దీరెడి గబ్బిలాలతో
దేవుడు లేని మందిరము ;
దివ్యమునై విలసిల్లు నిచ్చలున్
దేవుడు నిల్చినట్టి గుడి
దివ్వెల గంటల మంత్రసేవతో
గావగజేయు సంస్తుతుల
గప్పురహారతి కాలవాలమౌ .
జంధ్యాల వారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిభక్తి యెరుగక, లేకయే పాపభీతి
రిప్లయితొలగించండిదేవుని ప్రసాదముల నెన్నొ దేవుచుంద్రు
హీను లగువారు, మరియట్టి హేయమైన
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె !
*దేవుడు = దేవుకొనుట (దొంగిలించటమని యిక్కడి భావము)
తొలగించండిజనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరాభరణం
రిప్లయితొలగించండి13/05/2019 సోమవారం
సమస్య
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె
నా పూరణ.
**** **** *
ఎన్న తల్లి యుండును ప్రతి యింటి యందు
కన్నబిడ్డల వృద్ధికై కష్టపడును
తనదు ప్రేమను గురిపించు తల్లి వలన
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె"
🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
🌷 వనపర్తి 🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కీటకాలకు గబ్బిలాల్ చాటుకొరకు
రిప్లయితొలగించండిమాటువేసెడి దొంగల మనసుకొరకు
శిల్పి కల్పనసౌంధర్య కల్పనలకు
దేవుడే లేనిగుడికడుదివ్యమయ్యె!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సౌందర్య' టైపాటు.
ఊరు మునుగగ వాగులు పొంగి పొరల
రిప్లయితొలగించండిగూడు చెదిరిన పేదల గోడు తెలిసి
నీడ తానాయె వారి కన్నీరు తుడిచి
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె
సూర్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉ. చావడి మందిరమ్ము గని సాయిని మొక్కగ కోట్లలో జనుల్
రిప్లయితొలగించండిపోవుటఁ జూడ నచ్చెరువె! పూజలు చేతురు నిష్టగా నటన్
వేవురు భక్తి శ్రధ్దలన పేటిక నుంచిన యూర్ధ్వ దేహమున్
దేవుడులేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్!
శంకర ప్రసాద్ గారూ,
తొలగించండినమస్కారం.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'నిష్ఠగా' టైపాటు.
ధన్యవాదములు, సరిచేసుకొందును.
తొలగించండిగూడు లేనట్టి జీమల గోడు వినగ
రిప్లయితొలగించండిమడిని బడిలోన దేవుని గుడినె గాక
దేవుడే లేని స్థానమదెటులనగును
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె ?
కృష్ణారావు గారు,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె
రిప్లయితొలగించండిరమణియే లేని యిలు కడు రమ్యమయ్యె
నేతయే లేని గుమి కడు నెయ్యమయ్యె
చూడ నివియన్ని జిగి లేని చుక్కలయ్యె
నెయ్యము= అనుకూలము
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లడ్డు పులిహోర పేరిట లాఘ వముగ
రిప్లయితొలగించండిదర్శనమునకు రుసుముల దారి వెదక
రాజ కీయంబు కెరసినా రామ విభుఁడు
మూల పురుషుడు జేరగ మునుల మదుల
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉండదెక్కడగ్రామముపుడమినరయ
రిప్లయితొలగించండిదేవుడేలేని,గుడికడుదివ్యమయ్యె
భక్తజనములరాకతోబ్రభవమొంది
మూడురెట్లగువృద్ధితోబుంజుకొనుచు
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.
ఖండినిగన
తొలగించండిచెరనుబెట్టె ద్విజుడనది చెడ్డ రాజు
రిప్లయితొలగించండిఉసురు దీసుకునె నతండు ఉపవసించి
రాకుమార్తెలు కొలిచె కారాగృహమున
విప్రుడు కరుణించగ ఖైదు వినుతికెక్కె
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె
ఆ గుడిలో విగ్రహం ఉండదు. మొగవారికి కూడా అనుమతి ఉండదు
విగ్రహం లేని గుడా ఇదేంటి విచిత్రంగా.. ఎక్కడైనా విగ్రహం లేకుండా గుడి ఉంటుందా.. అయితే ఈ గుడి ఎక్కడుండి అనుకుంటున్నారా.. ఉత్తరప్రదేశ్ లో.. ఎటువంటి దేవతావిగ్రహం లేకుండానే నిత్యం పూజాకార్యక్రమాలు నిర్వహించే ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడికి ఇంతవరకూ మగవారు అడుగుపెట్టనేలేదత. కేవలం మహిళలు మాత్రమే ఈ ఆలయంలోకి వెళ్లి పూజలు, వ్రతాలు, నోములను నిర్వహించుకుంటారు. ఇలా మగవారు ఆ గుడిలో అడుగుపెట్టకపోవడానికి గల బలమైన కారణానికి ఒక కథ కూడా వుంది.1870వ సంవత్సరకాలంలో సాకాలేదిహ అనే ప్రాంతాన్ని పాలించే ఒక రాజుకి కొంతమంది కుమారులు, కుమార్తెలు కూడా వుంటారు. అదే ప్రాంతానికి చెందిన శ్రీపాదుడు అనే బ్రాహ్మణుడు గోవులను పెంచుకుంటూ సుఖంగా జీవిస్తూ వుంటాడు. ఒకనాడు శ్రీపాదుడి ఆవులు అనుకోకుండా రాజుగారి పొలంలోకి ప్రవేశిస్తాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన రాజు, అతని కుమారులు శ్రీపాదుడిని నిర్బంధించి ఒక కారాగారంలో పడేస్తారు. ఆ బ్రాహ్మణుడు వారిని.. ‘‘అయ్యా! పొరపాటు జరిగిపోయిందయ్యా… నన్ను క్షమించడం. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను’’ అని ఎంతగా వేడుకున్నా.. రాజు తన భటుల ద్వారా అతనిని అనేక చిత్రహింసలకు గురిచేశాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురయిన శ్రీపాదుడు.. ఆ మరుక్షణం నుంచి అన్నపానీయాలను మానేసి, నిరాహారంగానే కాలం గడుపుతుంటాడు. ఈ విషయం మొత్తం తెలుసుకున్న రాకుమార్తెలు చాలా బాధపడతారు. ఒక బ్రాహ్మణున్ని ఈ విధంగా ద్రోహం చేసి, చిత్రహింసలు పెట్టడం వల్ల వారి రాజవంశానికే అరిష్టమని భావించి ఆ రాకుమార్తెలు కారాగారంలో బంధించబడి వున్న శ్రీపాదుడుని రహస్యంగా కలుసుకుంటారు. తమ తండ్రి, సోదరులు చేసిన అన్యాయానికి, ద్రోహానికి క్షమించమని అతనితో వారు వేడుకుంటారు. దానికి శ్రీపాదుడు మాత్ర ఎటువంటి సమాధానం ఇవ్వకుండా, నిశ్శబ్దంగానే వుండిపోతాడు. ఒకనాడు రాకుమార్తెలు తులసీతీర్థాన్ని తీసుకునివచ్చి.. శ్రీపాదుడిని అది తాగి దీక్ష విమరించుకోమని కోరుకుంటారు. కారాగారంలో బంధీగా వున్న బ్రాహ్మణ శ్రీపాదుడు వారిచ్చిన తులసీతీర్థాన్ని తీసుకుని… ‘‘మీకెప్పుడూ మంచే జరుగుతుంది. కలకాలం సుఖంగా జీవించండి’’ అని దీవిస్తూ.. తను కూర్చున్న చోటే ప్రాణాలను విడుస్తాడు. అది జరిగిన కొన్నాళ్ల తరువాత శ్రీపాదుడిని బంధించిన రాజు, అతని కుమారులు ఒకరోజు రథంలో వెళుతుండగా… అది లోయలో పడి వారందరూ ఒకేసారి మరణిస్తారు. అయితే రాకుమార్తెలు మాత్రం తమ తండ్రి చనిపోయినందుకు దు:ఖించకుండా.. బ్రాహ్మణుని ఆశీర్వాదం వల్లే తాము ప్రాణాలతో వున్నామని నమ్ముతూ… అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. శ్రీపాదునికి కృతజ్ఞతాభావంగా ఆ రాకుమార్తెలు… అతనిని బంధించిన కారాగారాన్నే దేవాలయంగా తయారుచేసి, అతను కూర్చున్న చోటును దైవపీఠంగా భావిస్తూ, పూజలు చేసేవారు. ఆ విధంగా నిర్మించిన ఆలయంలో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశమని… మగవారు ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలికి రాకూడదని వారు శాసించారు.
బాలకృష్ణ గారూ,
తొలగించండిచక్కని ఐతిహ్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చెరను బెట్టె నొక ద్విజుని చెడ్డరాజు...' అనండి.
ఆ దేవాలయ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
క్రొత్త విషయాన్ని చాలా చక్కని విషయం చెప్పారు.చక్కని పూరణ నిచ్చారు.అభినంధనలు!
తొలగించండితావియె లేని పూవు గద దాహము దీర్పగ లేని చెర్వులున్
రిప్లయితొలగించండిదేవుడు లేని మందిరము; దివ్యమునై విలసిల్లు నిచ్చలున్
దైవము నిండినట్టి మది, ధన్యత గూర్చును జీవితమ్మునన్
పావన భక్తి మార్గమది భవ్యముగా నిల మానవాళికిన్
సూర్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉద్భవం బొందఁ జేయు నత్యుత్తమ మను
రిప్లయితొలగించండిజుల ధరాతల మందు విశ్రుతముగఁ గన
జ్ఞాన మింపుగఁ బంచు ననూనపు బడి,
దేవుఁడే లేని గుడి, కడు దివ్యమయ్యె
సావన కార్య మగ్నత దయా రస పూర్ణ మనో విలాసతం
గావఁగఁ బూను నిత్యము జగమ్ముల మేలుగ దేవుఁ డందఱిం
బావన భక్తి తత్పరతఁ బన్నుగ నిత్య మనర్చితుండు నౌ
దేవుఁడు లేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిపాడుపడు నుపాసన చేయ వచ్చు పుడమి
రిప్లయితొలగించండిదేవుడే లేని గుడి, కడు దివ్యమయ్యె
వేంకటేశుని కోవెల పృథ్విపైన
సకల పూజల పారులు సలుపు కతన
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆకలన్నవారికి కడునాదరమున
రిప్లయితొలగించండిరేయిబగలనక శ్రమను లెక్కగొనక
నన్నపూర్ణయై తినిపించు కన్నతల్లి
డొక్కసీతమ్మ యిల్లదే నిక్కమరయ
దేవుడేలేని గుడి కడుదివ్యమయ్యె!
నాల్గవ పాదము చివర
తొలగించండినిక్కముగను గా చదువ ప్రార్ధన!
సీతాదేవి గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండిపావనమైన చిత్తమున బాధ్యతతో చనుదెంచి నిత్య భూ
రిప్లయితొలగించండిదేవులు పూజనమ్ములను తీరుగ చేయుచు నుండ భక్తితో
దేవళముల్ సతమ్ము కడు తేజము జూపును సుమ్ము, యెట్లు భూ
దేవుడులేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్ ?
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
ఎన్నికల హంగామా:
కావుము మమ్మటంచు నతికష్టము తోడను రమ్ము పంచుచున్
కావడి కుండలన్ ధనము కమ్మగ తీయుచు పంచిపెట్టునా
"సేవకు" లెల్లరిన్ పిలిచి చెంపల దెబ్బల నిచ్చుచుండెడిన్
దేవుడులేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఈ వారపు ఆకాశవాణి వారి సమస్య తెలుపగలరు
జిలేబి
"రణమే శాంతికి మూలమౌననుచుధర్మజ్ఞుండు బుద్ధుండనెన్" 18 వతేదీ బుద్ధ జయంతి సందర్భంగా ఇచ్చిన సమస్య.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆర్తులకువైద్యసేవలనాదరించి
రిప్లయితొలగించండిఆదుకొనువాడెమాన్యుడీయవనియందు
వైద్యమందించునాతనివైద్యశాల
దేవుడే లేని గుడి, కడు దివ్యమయ్యె.
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జీవము లేని దేహమును చెక్కర లేని పాయసాన్నమున్
రిప్లయితొలగించండిభావము శూన్యమైన కవి వర్యుడు వ్రాసిన కావ్యరాజముల్
దేవుడు లేని మందిరము, దివ్యము నై విలసిల్లు నిచ్చలున్
పావను డైన రాఘవుని పాదముఁ జేరిభజించు వారలున్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని కొంత అన్వయదోష మున్నట్లున్నది.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[ఒక భార్య కీర్తిశేషుడైన తన భర్త అనే దేవుడు తమ యింటిలో యిప్పుడు నిల్చి లేకున్నా, తన హృదయమనే మందిరంలో నిలిచివుండి, తనకు సూచనలిస్తూ, అనునిత్యమూ విలసిల్లుతున్నాడని తెలిపే సందర్భము]
"కావఁగ సంసృతీ తరణిఁ గైకొని యీఁదుచుఁ బెద్ద స్థాయికిన్
దేవఁగ నెన్నియో వెతలఁ దేలుచు వెల్గిన నాదు దేవుఁ డీ
భావిని నిల్చి లేఁడు! కన, వచ్చి మదీయ హృదబ్జ సీమలో
దేవుని వోలె నిల్చి, నను దిద్దుచుఁ దీర్చుచుఁ, దాను వెల్గుచో,
దేవుడులేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్!"
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిసమస్య :-
రిప్లయితొలగించండి"దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె"
*తే.గీ**
గొల్ల వారి దేవుడనియు కులపు వేల్పు
కోమటి కుల మాతగ వాసవీ మఠములు
కుల మతములన్ని దేవుని గుడికి గలవు
కుల మతములంటని బడియే గుడిగ మారె
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె
......................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
దేవుడు లేని మందిరమ! తెల్పు మదేడనొ? ,తాదృశమ్మునై
రిప్లయితొలగించండిభూవలయమ్మునం దొకటి పూజలతో నలరారెనే?,యిలన్
దేవళమెట్లు దివ్యమగు దివ్యుడు లేనిచొ?, యెట్టి రీతిలో
దేవుడు లేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్?
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లేనిచొ' అని 'చో'ను హ్రస్వంగా ప్రయోగించవచ్చునా అని సందేహం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినా ప్రయత్నం :
రిప్లయితొలగించండితేటగీతి
గుడి యనంగనే భావము గోపురముగ
ప్రభువు నూహల నిండగ పరవశమున
భక్తి పొంగుచుఁ జారఁగ బాష్పమెటుల
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె?
ఉత్పలమాల
ఆవరణమ్ము క్రొత్త గృహ, మందున స్వాములఁ బిల్చి గీతనే
జీవుడు బాధ్యతన్ దెలియఁ జేతనతో ప్రవచింప జేయఁగన్
భావము నందు బొమ్మ భగవంతుడటంచును నమ్మ జూడఁ ద
ద్దేవుడు లేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిగుడియు మడి పేర జనులు బల్ గ్రుడ్డివార
లైరి కలతలన్ బెనగగ లావుదప్పి
ఇంట యోగసాధన దేల యిడుములేవి?
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిదేవుని నిల్పి యాత్రలను తీరిచి దిద్దుట "బేర"మాయె నా
జీవుని బాలశిక్ష యది;చేర సుశిక్షిత మోక్ష మార్గమున్
కావలె యోగ శాలలును గాంచవలెన్ వెలుగన్న బ్రహ్మమున్
దేవుడులేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్
అమ్మ యున్న సదనమిల నాలయమ్ము
రిప్లయితొలగించండినామె వాక్కులనవరత మమృతమయము
సంతసమ్మది హెచ్చేను జనులు కెల్ల
దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె