19, మే 2019, ఆదివారం

సమస్య - 3023 (పుస్తకావిష్కరణోత్సవము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గ్రంథావిష్కరణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ" 
(ఛందోగోపనం)
(లేదా...)
"పుస్తకావిష్కరణోత్సవమ్ములను వేడ్క నొనర్పగ నేల వెఱ్ఱివే" 
(ఛందోగోపనం)

57 కామెంట్‌లు:

 1. పుస్తకావిష్కరణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ"

  ఇందులో పొరపాటు కలదు...ఏ చంధస్సో తెలియజేయండి

  రిప్లయితొలగించండి
 2. గురు మూర్తి ఆచారి
  ******************

  నిన్నటి పూరణ స్వీకరింప మనవి


  అర్కసమానతేజుని - మహాత్ముని భీష్ముని సద్ధితాంశమే,

  కర్కశ మౌచు తోచెనొకొ ! కౌరవనాయక దుష్టకర్ణసం

  పర్కము కీడు సేయు గద, మందుడవైతివి ; తియ్యతియ్యనౌ

  యర్కకుమారు డియ్యెడల నాడు నుడుల్ విషబిందుతుల్యముల్ ;

  శర్కర చేదుగానగు విషంబు గొనన్ మధురంబునౌ సఖా

  ***************************

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 3. ప్రాతః కాలపు సరదా పూరణ:

  దుష్కృత మంతయున్ తెలిపి దుష్టుల చేష్టలు వెల్లడించుచున్
  పుష్కల రీతిగా పొగిడి పూజ్యుల తీరులు చాటి చెప్పగా
  ముష్కరులాడు మాటలివి బుద్ధియు శుద్ధియు లేక: "పుస్తకా
  విష్కరణోత్సవమ్ములను వేడ్క నొనర్పగ నేల వెఱ్ఱివే"

  రిప్లయితొలగించండి
 4. మిత్రులందఱకు నమస్సులు!

  దుష్కరమున్ సుదుర్లభము దుఃఖకరమ్మగు దుష్పదంపు టా
  విష్కృత భాజనమ్మగుచు వేదనఁ బెంచుచు దుర్నయంపు టా
  విష్కరణోద్ధృతమ్మగుచు వేఁగఁగఁ జేయుచు నుండు పుస్తకా
  విష్కరణోత్సవమ్ములను వేడ్క నొనర్పఁగనేల వెఱ్ఱివే?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   ఇది కొంత ఈనాటి ఆవిష్కరణోత్సవానికి అన్వయిస్తుంది సుమా! ఎండాకాలం.. మిట్టమధ్యాహ్నం నిర్వహిస్తున్నందున వేదనఁ బెంచి, వేఁగఁగఁ జేయుచు... ఇబ్బంది పెట్టేదే!

   తొలగించండి
 5. మైలవరపు వారి పూరణ

  మేనిఫెస్టో...

  దుష్కరకార్యజాలమును తోరమనంగ పదేపదే సభన్
  శుష్కవచోవిలాసముల సొంపుగ బల్కి , జనాళి ముంచునీ
  ముష్కర రాజకీయగణముఖ్యుల మాటలు జేర్చి
  పుస్తకా...
  విష్కరణోత్సవమ్ములను వేడ్క నొనర్పగ నేల వెఱ్ఱివే ?!


  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 6. శుష్కములౌ వాదనలను
  ముష్కరులను బెంచునట్టి పుస్తకమనినన్
  దుష్కృతమె, యట్టి "గ్రంథా
  విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ"

  రిప్లయితొలగించండి

 7. శంకరాభరణం 19/05/2019

  సమస్య

  పుస్తకావిష్కరణోత్సవమ్ములను వేడ్క నొనర్పగ నేల వెఱ్ఱివే" 

  నా పూరణ. ఉ.మా.
  ***** **** ***

  పుష్కలమైన జ్ఞానమును పుస్తక మిచ్చును మిక్కిలంబుగన్

  విష్కిని ద్రాగి పిచ్చలము పిచ్చిగ నివ్వధి వాగినవొ!మ

  స్తిష్కము బోవ బల్కితివొ !చెప్పుట భావ్యమె యిట్టు?..."పుస్తకా

  విష్కరణోత్సవమ్ములను వేడ్క నొనర్పగ నేల వెఱ్ఱివే" 

  🌱 ఆకుల శాంతి భూషణ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   మీ అధిక్షేపాత్మక పూరణ బాగున్నది. అభినందనలు.
   టైపాట్లున్నవి. 'మిక్కిలంబుగన్'? "పుస్తక మిచ్చును పెక్కురీతులన్" అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
  2. పెక్కురీతిగన్....

   వాగినావొ

   తొలగించండి
 8. దుష్కర ప్రాసలను మలచి
  పుష్కల పద్దెములు గట్టి పూజింప దగున్
  ముష్కరు పలుకుల గ్రంధా
  విష్కర ణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పుష్కల పద్యముల గట్టి...' అనండి.

   తొలగించండి
  2. దుష్కర ప్రాసలను మలచి
   పుష్కల పద్యముల గట్టి పూజింప దగున్
   ముష్కరు పలుకుల గ్రంధా
   విష్కర ణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ

   తొలగించండి
 9. దుష్కర కార్యం బియ్యది
  పుష్కల వాగ్దాన తతు ల పొగిడెడి మాటల్
  శుష్కము గాగన్ గ్రంధా
  విష్క ర ణోత్సవ ము లేల వెఱ్ఱి వె సుమ్మీ

  రిప్లయితొలగించండి
 10. రిప్లయిలు
  1. " హుష్ ," కరమా! కవిత్వమన? నున్నతకావ్యరసమ్ము గ్రోలవే!
   శుష్కవితర్కవాదఖలశుంఠవచోవికటంపు మాటలా?
   ముష్కరమూర్ఖభాషణమ? మున్ను విమర్శల జేసి పుస్తకా
   విష్కరణోత్సవమ్ములను, వేడ్క నొనర్పగ నేల వెఱ్ఱివే


   "హుష్" అనునది హుష్ ఇంతేనా? అనే ధ్వన్యనుకరణపదము

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 11. దుష్కర ప్రాసలతో,పలు
  శుష్కములౌ భావజాల సూక్తులతోడన్,
  దుష్కృతమౌ పర గ్రంథా
  విష్కరణోత్సవములెల్ల వెఱ్ఱివె సుమ్మీ.

  రిప్లయితొలగించండి
 12. దుష్కర ప్రాసల కనుగొన
  ముష్కరమైగోచరించె,ముద్దుగ నామ
  స్తిష్కమ్మునకీ గ్రంథా
  విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె,సుమ్మీ!!

  రిప్లయితొలగించండి
 13. ముష్కరమను మాట తగదు,
  దుష్కర మగు కార్యమంచు దూరుట యేలా?
  శుష్కపు మాటది.గ్రంథా
  విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె? సుమ్మీ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పుష్కల భావసమ్మిళిత పూర్ణగుణాత్మక శోభితమ్ములై
   పుష్కర కాలముల్ చనిన పోడిమివాడక పాఠకాళి మ
   స్తిష్కము లందువెల్గెడు విశేష విరాగపు దివ్య పుస్తకా
   విష్కరణోత్సవమ్ములను వేడ్క నొనర్పగ నేల వెఱ్ఱివే?

   తొలగించండి
 14. డా.పిట్టా సత్యనారాయణ
  పుష్కలముగ పుస్తకములు
  దుష్కర ప్రాసలను గడవ దోర్బలుడవె పో
  విష్కంభ యోగ గ్రంథా
  విష్కరణోత్సవము లేల?వెర్రివె సుమ్మీ!

  రిప్లయితొలగించండి
 15. కందము
  శుష్క వచనాల గ్రంథము
  ముష్కరులను సిద్ధపరచు ముప్పు రగుల్చున్
  దుష్కరమె యట్టి గ్రంథా
  విష్కరణోత్సవము లేల వెర్రివె సుమ్మీ.
  ఆకులశివరాజలింగం వనపర్తి

  రిప్లయితొలగించండి
 16. డా.పిట్టా సత్యనారాయణ
  పుష్కల సంఖ్యలన్ వెలయు పుస్తకముల్ జదివేరె పద్యమా
  దుష్కర యత్నమే తగదు దోసిలినొగ్గిన రారు చూడగన్
  పుష్కరిణిన్ బడేయగను పుణ్యము దక్కునదేమొ పుస్తకా
  విష్కరణోత్సవమ్ములను వేడ్క నొనర్చగనేల వెర్రివే?

  రిప్లయితొలగించండి
 17. పుష్కలపు ధార లేదే
  దుష్కర ప్రాసల రచింప దుర్లభమయ్యెన్ (త్రోసి శిశువులన్)
  ముష్కరులు వ్రాయు గ్రంథా
  విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ

  రిప్లయితొలగించండి
 18. ( మెరమెచ్చులు పలికే మిత్రుల మాటలు విని తన తవికలు
  కవితలనుకొని గ్రంథాలుగా అచ్చువేసి బంగారమంతా వెచ్చించిన కీర్తికండూతి భర్తతో భార్యామణి )
  నిష్కము నంత గ్రంథముల
  నీటుగ నచ్చొనరింప వాడితే !
  శుష్కములైన వాక్కులను
  చోద్యపు మిత్రులు బల్క నమ్మితే !
  నిష్కృతి లేదు నీ పనికి
  నింకను ఖర్చును బెట్టి పుస్తకా
  విష్కరణోత్సవమ్ములను
  వేడ్క నొనర్పగ నేల ? వెర్రివే ?
  ( నిష్కము -బంగారము ; నిష్కృతి - ప్రాయశ్చిత్తము )

  రిప్లయితొలగించండి
 19. ముష్కర మూకల ద్రోలగ
  దుష్కర దుశ్చర్యలెల్ల దునుమాడంగన్
  నిష్కారణముగ గ్రంథా
  విష్కరణము లేల వెఱ్ఱివె సుమ్మీ"

  రిప్లయితొలగించండి
 20. శుష్కమగు మిత్రసంగము
  దుష్కర కార్యముల తోడ దూకుడు బెంచున్
  నిష్కా సాధిని గ్రంథా
  విష్కరణోత్సవము లేల వెర్రివె సుమ్మీ

  నిష్క- పతకం, 108 మాడలు

  రిప్లయితొలగించండి
 21. పుష్కలమౌ జ్ఞానవిదులు
  ముష్కరి చేత చదివించు ముచ్చట తీరన్
  శుష్క ప్రయాస ; గ్రంథా
  విష్కరణోత్సవము లేల ? వెఱ్ఱివె సుమ్మీ

  రిప్లయితొలగించండి
 22. దుష్కరప్రాసలరచనలు
  పుష్కలముగనుండిమనకుముచ్చట గొలుపన్
  దుష్కరమగునీగ్రంధా
  విష్కరణోత్సవమునేలవెఱ్ఱివెసుమ్మీ

  రిప్లయితొలగించండి
 23. ఎవరి పిచ్చి వారికానందము!!
  ఇద్దరు మిత్రుల సంభాషణ!

  దుష్కర ప్రాసల గూడిన
  శుష్కపు కవితల జదువగ శోషయెగా మ
  స్తిష్కము జెడును గ్రంథా
  విష్కరణోత్సవము లేల వెర్రివి సుమ్మీ!!

  శుష్కములని నీవందువు
  విష్కంభపు పద్యపుష్టి వీనులవిందౌ
  పుష్కల ఙ్ఞానపు గ్రంథా
  విష్కరణోత్సవము లేల వెర్రివి సుమ్మీ??

  విష్కంభపు = విరివైన

  రిప్లయితొలగించండి
 24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 25. పుష్కలమైన జ్ఞానమును పుస్తకమే మన కంద జేయుటన్
  శుష్కపు మాటగా దలచి సూటిగ పోటిగ మాటలాడుచున్
  ముష్కరు లందు రిట్టులనె "మూర్ఖత వీడుము జాలు పుస్తకా
  విష్కరణోత్సవమ్ములను వేడ్క నొనర్పగ నేల వెఱ్ఱివే"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. శుష్క వివాదము లాపుము
   నిష్కర్షగ చెప్పెదనిక నేడీ కవితల్
   శుష్కప్రియములు గ్రంథా
   విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ

   తొలగించండి
  3. నిష్కల్మషముగ జెప్పెద
   ముష్కర రీతుల నుతించు మూర్ఖపు వ్రాతల్
   దుష్కర కవితల గ్రంథా
   విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ

   తొలగించండి
 26. శుష్కింపరు సుఖము కలుగు
  పుష్కలముగ సాయినాధ పురమున నేడున్
  ముష్కర జూడక గ్రంథా
  విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ

  రిప్లయితొలగించండి
 27. దుష్కరప్రాసయున్గలిగిదుష్టసమాసములుండుపుస్తకా
  విష్కరణోత్సవములనువేడ్కనొనర్పగనేలవెఱౢివే
  పుష్కలమౌగదానరయపోడిమిపద్యములందుబాటులో
  దుష్కలయత్నమున్సలిపిదుఃఖమునొందకురాజశేఖరా!

  రిప్లయితొలగించండి
 28. రిప్లయిలు
  1. నిష్కారణ మేల వ్యయము
   దుష్కరము సుమీ భరింప దుస్సాహసమే
   శుష్కశ్రమములు గ్రంథా
   విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె చుమ్మీ


   పుష్కల శబ్ద భావముల మూర నలంకృతు లచ్చ టచ్చటన్
   నిష్కపట స్తవమ్ముల ఫణి ప్రవ రాస్తరు నెంచి భర్తగం
   బుష్కర మందు నొక్కటిగఁ బూని రచించి చెలంగి పుస్తకా
   విష్కర ణోత్సవమ్ములను వేడ్క నొనర్పఁగ నేల వెఱ్ఱివే

   తొలగించండి
 29. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  నాలుగేండ్ల క్రితం నేను వ్రాసిన "రాజకీయ హాస్య వెలదుల శతకం" కేవలం నలుగురికే పంపబడినది (కంది వారితో సహా)

  దుష్కర రాజకీయముల దుమ్ములు దుల్పుచు చీల్చిచెండుచున్
  ముష్కర రాజరాజులను మొట్టుచు తిట్టుచు గేలి జేయుచున్
  పుష్కల రీతిగా కులుకు ముచ్చటి పద్యము లొల్కు పుస్తకా
  విష్కరణోత్సవమ్ములను వేడ్క నొనర్పగ నేల వెఱ్ఱివే

  (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

  రిప్లయితొలగించండి
 30. దుష్కర ప్రాసల తోడన్
  శుష్కములౌ కవితల నిడి శుభదిన మనుచున్
  ముష్కర కవిదగు గ్రంధా
  విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ

  రిప్లయితొలగించండి
 31. నిష్కర్షగానుతెలిపెద
  దుష్కర్మలొనర్చికవులుదుష్టత్వమునన్
  తస్కరకవితాగ్రంథా
  విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ

  రిప్లయితొలగించండి
 32. సుమిత్రతో కౌసల్య మాట్లాడుతూ.....

  శుష్కపు మాటలవేలనె
  దుష్కృతమా కావ్యరచన దురితమ్మా యా
  విష్కరణము మరి గ్రంథా
  విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె, సుమ్మీ.

  రిప్లయితొలగించండి
 33. నిష్కల్మష సత్యంబును
  పుష్కలముగ బంచలేని పుస్తకమన్నన్
  విష్కంబనుటౌ! గ్రంథా
  విష్కరణోత్సవములేల వెర్రివెసుమ్మీ!

  రిప్లయితొలగించండి
 34. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పుష్కలముగ నీతులొసగి
  దుష్కర్మల నణగజేయు త్రోవల నిడునౌ
  విష్కంభ శూన్య గ్రంథా
  విష్కరణోత్సవములేల వెఱివె సుమ్మీ?

  రిప్లయితొలగించండి
 35. దుష్కృత మంచు పల్కెనొక ధూర్తుడు కావ్యము లన్ రచించుటే
  నిష్కుట మందు దాచుటకు నిష్ఫల మౌ కృతు లేలయంచు నా
  శుష్కపు మాటలన్ బలుకు శుంఠయొకండు వచించె పుస్తకా
  విష్కర ణోత్సవమ్ములను వేడ్కనొనర్పగ నేల వెఱ్ఱివే.

  రిప్లయితొలగించండి


 36. శుష్కంబగు పదములతో
  దుష్కరమగు ప్రాసలన్ చదువరుల తలపై
  పుష్కలము రుబ్బు గ్రంథా
  విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ  నారదా


  జిలేబి

  రిప్లయితొలగించండి
 37. నా ప్రయత్నం :

  కందం
  పుష్కలముగ భావమ్ము ల
  యస్కాంతములవలె పాఠకాళిని బట్టన్
  నిష్కల్మషముగ గ్రంథా
  విష్కరణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ?

  ఉత్పలమాల
  తస్కర భావ జాలములఁ దాకక పాఠకులెల్ల మెచ్చెడున్
  బుష్కలమౌ నలంకృతులు ముచ్చట జేయఁగ పండితాళి తే
  జస్కమటంచు సన్నుతుల జైయని దీవెనలీయ పుస్తకా
  విష్కరణోత్సవమ్ములను వేడ్క నొనర్పగ నేల వెఱ్ఱివే?

  రిప్లయితొలగించండి