7, నవంబర్ 2019, గురువారం

సమస్య - 3184 (హరుని కరమునందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా"
(లేదా...)
"హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్"

112 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    జరుపుచు యజ్ఞ యాగములు జాప్యము చేయక మాటిమాటికిన్
    కరువుల నాపి వర్షములు కమ్మగ తెచ్చుచు వాడవాడలన్
    వరమగు హైద్రబాదునహ వాసిగ నేలెడి చంద్రశేఖరౌ
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  2. వరదుడు భక్తవత్సలుడు వందిత సర్వ సురేశుడున్ పరా
    త్పరుడు జగమ్ములన్ నిలిపి పాలన చేసెడి చక్రవర్తి యా
    కరి పరితాప నాశనుడు గౌరికి సోదరు డైన మా మనో
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      'మా మనోహరుడు'తో శ్లేషను సాధించారు.

      తొలగించండి
    2. అవును గురువు గారు. మా యొక్క మనోహరుడు, లక్ష్మీ మనోహరుడు. నమస్సులు.

      తొలగించండి
  3. అరవిందాక్షుడు కేశుడు
    శరణాగత వత్సలుండు జల శయనుండౌ
    పురుహూతి లక్ష్మి మానస
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా

    రిప్లయితొలగించండి
  4. బరిచి నలరారు సతతము

    హరుని కరము నందు, చక్రమ లరారు గదా

    హరికరమున,కుసుమమ్ములు

    సిరికర భూషణ ములుగద శిఖలు పొసగుచున్


    బరిచి = శూలము లేదా ఈటె
    శిఖ. = వెలుగు

    రిప్లయితొలగించండి
  5. సురుచిరమైనరీతి నట శోభిలుచుండును కౌస్తుభంబు తా
    నురమున, ఫాలభాగమున నొప్పును కస్తురి, నాసికాగ్రమం
    దరయగ మౌక్తికం, బొడలినంతట చందన మట్లె కంససం
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్"

    రిప్లయితొలగించండి

  6. హరోంహర !

    వరలెడు త్రిశూలమలరగ
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా
    హరిహస్తమందు! శిక్షిం
    చు రావడి సలుపు కఱటుల చువ్వన నెపుడున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'త్రిశూల మలరును' అనండి.

      తొలగించండి
  7. హరినే తెగడుతు ఛేదీ
    పురపతి హద్దులను మీరి మోదము చెందన్
    శిరమును ద్రుంచగ నా ముర
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తెగడుచు' అనండి. 'చేది' ఇకారాంత పులింగ శబ్దం అనుకుంటాను. 'చేదిపురము' అనే ఉంటుంది.

      తొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్"

    ధరణినధర్మవర్తనులు దైత్యులు పెచ్చరిలంగ , క్షీరసా...
    గరశయనుండు లోకహితకాంక్ష దశాకృతులన్ ధరించి, ము...
    ష్కరులను జంపెనా నిగమసన్నుతుడౌ హరి శ్రీరమామనో...
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  9. విరివిగ వరములు పొందియు
    పరపీడకులై చెలంగు పతితులనెల్లన్
    హరియించు వాడు సంకట
    *"హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా"*

    రిప్లయితొలగించండి
  10. పరమేశుని లీలలుగన
    పరికింపగ విశద మౌను పలురీతు లటన్
    హరిహరు లిరువురు లొకటట
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా

    రిప్లయితొలగించండి


  11. "హరిహరులందు భేదము మహాశయ లేదు సుమీ" హితుండనన్
    వరలెడు కైపదమ్మును సవాలుగ వేయుచు నేర్పు తోడుతన్
    "సరె! హితుడా!సమస్యయిదె! చక్కగ నింపుము" శంకరుండనెన్
    "హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్"


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. (పాలసంద్రంలో పద్మనయనుడు )
    స్మరుడు విరించియున్ గొలువ
    జక్కగ నొప్పెడివాడు ; లక్ష్మియున్
    ధరణియు రెండుప్రక్కలను
    దక్కక నిల్వ హసించువాడు ; నా
    గరుడుని శేషు నారదుని
    గారవమొప్పగ గాంచు దుష్టసం
    హరుని కరంబులందు నల
    రారుచునుండును శంఖచక్రముల్ .

    రిప్లయితొలగించండి
  13. మురహరి నమ్మిన వారల
    సరగున బ్రోచును ప్రియముగ స్వామియె ధరలోన్ |
    వరముల నొసగెడి భవభయ
    "హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా"

    రిప్లయితొలగించండి
  14. అరెరే సూలమె ముద్దుగ
    హరుని కరమునందు, చక్ర మలరారుఁ గదా
    హరికి కరము నందు, తలచ
    హరి హరులిరువురు తమ సుర పక్షమునకదా
    🙏🙏

    రిప్లయితొలగించండి

  15. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నరకుచునుగ్రవాదులను నాశము చేయుచు భీతచిత్తులన్
    కరచుచు కాంగ్రెసాదులను కాటులు వేయుచు కమ్యునిష్టులన్
    వరమగు కాశ్మిరమ్మునహ భారత మాతకొసంగు పాకు సం
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్

    పాకు సంహరుడు (శంఖచక్రములు కలవాడు) = (నరేంద్ర) దామోదర్ (మోడి)

    రిప్లయితొలగించండి
  16. శ్రీ గురుభ్యోన్నమః🙏
    సవరణానంతరము.

    హరినే దెగడుచు చేదీ
    శ్వరుడిక హద్దులు మఱచుచు చడమడ దిట్టన్
    శిరమున్ వేయగ నా ముర
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా

    రిప్లయితొలగించండి
  17. నా పూరణ. చం.మా.
    ** *** *** **
    ఉరమున కౌస్తుభమ్మతి మహోన్నతమౌ గుణ భూషణుండు శ్రీ

    కరుడు సుభక్త రక్షకుడు ఖ్యాతి పలాశుల నాశకుండు నా

    సుర మునులాది వందితుడు శోక హరుండును నీరజా మనో

    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్

    �� ఆకుల శాంతి భూషణ్ ��
    �� వనపర్తి ��

    రిప్లయితొలగించండి
  18. సరదా పూరణము

    పరువుగ సైకిల్ షాపున
    విరివిగ పంక్చరు కొరకును విహరింపఁగనేన్
    సరియగు సమయము నా నర
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా
    🙏🙏

    రిప్లయితొలగించండి
  19. అరయఁగ నొప్పును శూలము
    హరుని కరము నందు : చక్ర మల రారు గదా
    హరి కరము న దీపించు చు
    దురహంకా రు ల దునుమ గ దోహద పడుచు న్

    రిప్లయితొలగించండి
  20. కం.
    కరువున త్రాగిన గరళము
    హరుని కరమునందు, చక్ర మలరారుఁ గదా !
    విరజుని హస్తద్వయమున్
    పరిశోభను గాంచ జన్మ పరిపక్వంబౌ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఈ పద్యానికి సవరణలను వాట్సప్‌లో చేసినట్టున్నాను.

      తొలగించండి
  21. కరిమొరలిడ పాహియనుచు,
    దురమున నేతెంచి భువికి,తొలగగనహమే
    కరుణను గాచిన కుంభీ
    హరుని కరమందున చక్రమలరారు గదా!
    కుంభి=మకరము(ఆం.భా.)

    రిప్లయితొలగించండి
  22. హరి హరులకభేదము గని
    నిరతము పోతన జపించె నేర్పరి తనమున్
    హరిహర నాథుని; యా హరి
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నేర్పరి యగుచున్... నాథుని నా హరి...' అనండి.

      తొలగించండి
  23. కరుణాంతరంగు డగుచును
    సురవరులకు సేమమిచ్చు శుభకర వరదుం
    డరి భంజకుండు నౌ శ్రీ
    హరుని కరము నందు చక్ర మలరారు గదా

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. శ్రీ వినాయక
      ఈ నాటి శంకరా భరణము సమస్య
      (హరుని కరము నందు, చక్రమలరారుఁ గదా)
      ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

      ఆగమము లలరు వాగీశు కరమున, వీనియ పట్టును విద్దె లమ్మ,
      పద్మిని కరమున పద్మము భాసిల్లు,వజ్రాయుధము దాల్చు వాసవుండు,
      గదను కలిగి యుండు ఘనముగ సతతము గాడ్పు సుతుడు తన కరము నందు,
      హలమును బట్టును బలరాముడు కరాన, ఖడ్గము చేబట్టు కాయకంటి,
      గాండీవమును పట్టు కపి కేతువు,యముడు పాశమును ధరించు పాణి లోన ,
      గండ్ర గొడ్డలి బట్టు ఖండ పరుశువు, కుంతము నలరారును తరచి చూడ
      నా (హరుని కరము నందు, చక్రమ లరారుఁ గదా) హరి కరమున్, నగజ సతము

      పట్టు చక్రము,శూలము, పాశము, గద,
      గండ్ర గొడ్డలి ఖడ్గము, కార్ముకమ్ము
      శంఖము, కఠారి,మున్నగు శస్త్రములను
      కాళి రూపమున నధిక కరము లందు

      తొలగించండి
    2. మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. కరి మకరంబుతోడ నుదగాహము జేయ యుగాంశకంబులున్
    కరిబలమంతఁ దగ్గగ సుఖంబుల నిచ్చును దేవు డంచు దా
    మొరలిడివేడె నాహరిని,ముఖ్యుడటంచు సదా రమామనో
    హరుని కరంబులందు నలరారుచు నుండును శంఖచక్రముల్

    ఉదగాహము-నీటి పోరాటం,
    యుగాంశకములు- ఏండ్లు

    రిప్లయితొలగించండి


  26. హరి! విష్ణువు! శ్రీపతి! అ
    క్షరుడు!అనంతుడు!కపిలుడు!కమలాక్షుడు! పు
    ష్కరనాభుడు!భరిమ!మనో
    హరుని కరము నందు చక్ర మలరారు గదా


    జిలేబి

    రిప్లయితొలగించండి
  27. హరి యెవ్వడు హరు డెవ్వడు
    తరతమములనె0చ తరమె తప్పగు కానీ
    ఇరువురు నొక్కటి యగుతను
    హరుని కరమున0దు చక్ర మలరారుగదా!

    రిప్లయితొలగించండి
  28. చంపకమాల
    మురహరి! బంధువుల్ గురులు పోరున నిల్వఁగ యుద్ధమెట్టుల
    న్నెఱువుదు నన్న నర్జునుని నిల్పుచు నద్దరి విశ్వరూపమున్
    మెరయఁగ గీత మాధురుల మేటిగ బంచిన చిత్త మోహపున్
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  29. కందం
    మురళీధరుని శతాధిక
    పరివాదముల నుతియించ వైరపు భక్తిన్
    ధర చేది రాజు, పాతక
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా

    రిప్లయితొలగించండి
  30. హరుని కృపావిలాసమున హస్తము తాకిన వారు భస్మమౌ
    వరమును బొంది గర్వమున భర్గుని వెంబడి సాగు ధూర్తునిన్
    మురిపెములాడి లాస్యమున మోహిని రూపున లీలజేయు సం
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  31. వరగుణ శోభితుడా కరి
    వరదుండా నిఖిల లోక వంద్యుండౌ భా
    సుర సుర పూజిత సుమనో
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా

    రిప్లయితొలగించండి
  32. సిరిగల హరికే జెల్లును
    ధరియించగ చక్ర శంఖు తరియింపఁగనే
    సరికాదుగ నిటుల యనుట
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా

    🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చక్ర శంఖువులు' అని కదా ఉండాలి? "సరికా దిట్టుల పలుకగ" అనండి.

      తొలగించండి
  33. శిరమున గంగ చంద్రులఁ, విశేషముగా మెడఁ నాగుబాము లా
    భరణములై ధరించె మయిఁ భస్మఁ, ద్రిశూలము ఝర్ఝరమ్ములే
    హరుని కరంబులందు నలరారుచునుండును, శంఖచక్రముల్
    హరికి గదాయుధమ్ము కమలార్తవమున్ కరమందు శోభిలెన్౹౹

    రిప్లయితొలగించండి

  34. పర దేశపు వస్త్రములను
    పరిత్యజించగ సొయముగ వడకిన నూలున్
    ధరియించు విదేశ పెనుపు
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
      'విదేశ పెనుపు' దుష్టసమాసం.

      తొలగించండి
  35. హరుని కరములఁ ద్రిశూల డ
    మరుకము లుండఁగఁ బ్రకాశమానమ్ములుగా
    వర గోపికా గణ మనో
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా


    విరివిగ వెల్గు నా నెమలి పింఛము శీర్షము నందు గాంతు మా
    యురమునఁ కౌస్తుభమ్ము సత తోజ్వల కాంతి రమా యుతమ్ముగా
    స్థిరముగఁ గేళి లీల దధి ధేను సుధా నవనీత సంత తా
    హరుని కరంబులందు నలరారుచు నుండును శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  36. సురులకు నాధుడు హరి, భవ
    హరుని కరమునందు చక్ర మలరారు గదా
    హరు డగు గణముల కధిపతి
    హరిహరు లిరువురు యొకటని అర్చన చేయుమ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామమోహన్ గారూ, ఆహా! మీ రాక మాకు సంతోషదాయకం.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సురలకు...లిరువురు నొకటని యర్చింపదగున్" అనండి.

      తొలగించండి
  37. కస్తూరి శివశంకర్గురువారం, నవంబర్ 07, 2019 1:43:00 PM

    నిరతము నీ ధ్యానమునే
    పరిపరి విధములగ మేము భవహరమగునే
    వరములు కోరుచు మానస
    హరునికరము నందు, చక్రమలరారుఁ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "విధములుగ జేయ... తామసహరుని..." అనండి.

      తొలగించండి
  38. శరణనెడి భక్తగణమున్
    దరియింపగజేయు స్వామి ధర్మము నిలుపన్
    గరివరదుండైన మకర
    హరుని కరమునందు చక్రమలరారు గదా!

    రిప్లయితొలగించండి
  39. హరునకు హరికిని భేదము
    లరయగ ధరియించునట్టి యాయుధమేగా
    హరునకుశూలంబును శ్రీ
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మురహరుని కరమునందు..." అనండి.

      తొలగించండి
    2. హరునకు హరికిని భేదము
      లరయగ ధరియించునట్టి యాయుధమేగా
      హరునకుశూలంబును ముర
      హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా

      తొలగించండి
  40. హరిహరులందుభేదమననారయవారలయాయుధమ్ములే
    హరుడు ధరించు నాయుధము హస్తమునందుననుండుశూలమే
    కరివరదుండు భక్తులనుగాచెడి వేలుపు శేషశాయి శ్రీ
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శ్రీహరుడు' అంటే మీ అభిప్రాయం?

      తొలగించండి
    2. తప్పు వ్రాశాను గురువుగారూ.'శేషసాయి శ్రీ' బదులు 'శ్రీరమా మనో'(హరుని)అంటే సరిపోతుందాండి?

      తొలగించండి
  41. సరసిజ నాభ కావుమని సామజ మొక్కటి వేడినంతనే
    కరుణను జూపి వేగ జని కాచిన ధృత్యుడు దానవారియా
    పురుష వరుండు భావనుడు పుష్కర నాభుడె యౌ రమామనో
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  42. కందం
    గిరిఁజేయుచు నీ భద్రునిఁ
    గరమందున శంఖ చక్ర కాంతుల వెలయన్
    వరమడుగ సంకుతో నఘ
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా

    రిప్లయితొలగించండి
  43. కరిమొర వినివేగము గా
    సిరికిని చెప్పక పరుగున శ్రీహరి రాగా
    మురహరుడౌ యా దానవ
    హరుని కరమునందు చక్రమలరారు గదా.

    శిరమునశశి,డమరుకమది
    హరుని కరమునందు, చక్రమలరారు గదా.
    కరివరదుండగు నా శ్రీ
    హరికరముల కంబుతోడ ననవరతంబున్

    నిరతం బుండును శూలము
    హరుని కరమునందు, చక్రమలరారు గదా.
    సురలను మునులను కావగ
    కరిరాజ వరదుని దివ్య కరముల యందున్.

    కరుణాకర కావుమనుచు
    కరిమొరలిడనాలకించి కారుణ్య ముతో
    పరుగున వచ్చిన దానవ
    హరుని కరమునందు చక్రమలరారు గదా.

    కరుణను చూపగ రారా
    మురారి యనుచును మొరలిడు పుడమీ సురులన్
    సరుగున గాచిన రక్కస
    హరుని కరమునందు చక్రమలరారు గదా.

    అరదము నెక్కి సాగుచును యామిని యందు
    నవేణువూదుచున్
    మరులను గొల్పి మానినుల మానసముల్ హరియించు చున్నటన్
    నిరతము పాండు పుత్రులకు నెమ్మిని కూర్చిన
    శ్రీరమా మనో
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్"*




    రిప్లయితొలగించండి
  44. హరిశరణుకోరి కరుణకుఁ

    పరిపరివిధముల సిరిగలవానిని, పిలువగ

    కరివరదుడుననుచు, అసుర

    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా

    కంద పద్యం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...కోరి భక్తిని..... వానిని పిలువన్... కరివరదుం డగుచు నసురహరుని..." అనండి.

      తొలగించండి
    2. కంది శంకరయ్య గారికి హృదయపూర్వక నమస్సుమాంజలులు


      హరిశరణుకోరి భక్తిని
      పరిపరివిధముల సిరిగలవానిని,పిలువన్
      కరి వరదుండగుచు, నసుర
      హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా!

      తొలగించండి
  45. ధరణిని ధర్మమున్ నిలిపి దానవ మూకల ద్రుంచనెంచగన్
    నరపతి గాను పుట్టియు వనమ్ముల కేగిన రామచంద్రుడే
    సరసిజ నాభుడాతడె వృషాకపి, శ్రీపతి వాని, దుష్ట సం
    హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్

    రిప్లయితొలగించండి
  46. హరి హరు లొకటే యనగా
    హరికిం పని యుండ వచ్చు ఆయుధ మొసగన్
    బిరబిర వచ్చె నదేమో
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా!

    రిప్లయితొలగించండి
  47. కందపద్యం

    హరి ,మురహరి, శుభకరముగ

    ధరణిన్ దశరూపములను దాల్చెన్ హరియై

    సురరక్షణ చేసిన మనొ

    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా!

    రిప్లయితొలగించండి
  48. కంద పద్యం

    హరిని , భవభయ హరుని , కరి

    వరదుడని , దశావతారుడైనమురహరిన్

    సురరక్షకుడైన మనో

    హరుని కరమునందుచక్ర మలరారుఁ గదా

    రిప్లయితొలగించండి
  49. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా

    సందర్భము:
    ఋష్యశృంగుడు దశరథునిచేత పుత్రకామేష్టి నారంభింపజేశాడు. దేవతలు తమ తమ హవిర్భాగాలను స్వీకరించడానికి విచ్చేశారు. బ్రహ్మతో దేవతలు రావణునివల్ల తమకు కలిగిన బాధలను చెప్పుకున్నారు.
    "దేవతలు మున్నగు వా రందరిచేత చావు లేకుండా రావణుడు వరాలు కోరితే ఇచ్చాను. మానవులవల్ల మాత్రం అత డడుగలేదు. అది ఒక చిన్నచూపు." అన్నాడు బ్రహ్మ.
    ఈలోగా శంఖ చక్ర గదా ఖడ్గ పాణియై విష్ణుమూర్తి అక్కడికి వచ్చాడు. దేవతలంతా
    "మానుషీం తను మాస్థాయ
    రావణం జహి సంయుగే"
    (బా.కాం. 16 స.3 శ్లో)
    "దశరథుని పుత్రునిగా మానవునిగా అవతరించి యుద్ధంలో రావణుని బరిమార్చు" మని ప్రార్థించగా అత డభయ మిచ్చినాడు.
    ఆ సందర్భంలో దేవత లొకరితో ఒక రిలా అనుకున్నారు.
    "అదుగో చూశారా! శ్రీ హరి వచ్చాడు. అదుగో! ఆతని చేతిలో మెరుస్తూ వున్నది సుదర్శన చక్రం. ఆతడే వర గర్వితులైన ఎందరో రాక్షసుల ప్రాణాలను (ఆ చక్రంతోనే)
    హరించాడు.
    భవిష్యత్తులో దశరథ మహారాజుకు రామభద్రుడై జన్మించబోయే వా డాతడే!
    సుర విద్వేషులైన లోక కంటకులైన రావణాదులను సంహరించబోయేవా డాతడే!"
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    హరి యదిగో దశరథు న

    ధ్వరమున కేతెంచె! రామభద్రు డతండే!..

    వర గర్విత ప్రాణ నికర

    హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా!

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    7.11.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి