సందర్భము: సర్వర్తు కుసుమై రమ్యాం ఫలవద్భిశ్చ పాదపైః పుష్పితానా మశోకానాం శ్రియా సూర్యోదయ ప్రభామ్ అన్ని ఋతువుల్లో లభించే పూవులతో ఫలవృక్షాలతో రమ్యమైనది అశోకవనం. అశోక వృక్షా లన్నీ పుష్పించివుండటంవల్ల ఉదయ సూర్య కాంతితో ఒప్పారుతున్నాయి. కర్ణికార కింశుక పున్నాగ చంపక (సంపంగి) వృక్షాలూ ఎంతో విశాలమైన ఆ పూదోటలో బాగా పుష్పించివున్నాయి. అక్కడ ఆంజనేయుడు ఒక శింశుపా వృక్షంకింద అశ్రు పూర్ణ ముఖి, దీన, దుఃఖ పరాయణ యైన సీతను చూసినాడు. ఆమె ఆహారం సరిగా తీసుకోకపోవటంవల్ల చిక్కిపోయినది. శోకంలో మునిగిపోయినది. చెట్టు కొమ్మలలో దాగుండి రామ దాసు వినిపించిన రామకథ అనే అమృతాన్ని సేవించి మత్తిల్లినది సీత అనే షట్పదం. ఇక విలాప మనే ఝంకారం చేస్తుందా! మనోరాట్ పదపాళి = మనస్సుకు రాజైన (మనోనాథుడైన) రామునిగురించిన మాటల సమూహం (సమాచారం) రేత్రము= అమృతం పుష్ప వాటిక= అశోక వనం ~~~~~~~~~~~~~~~~~~~~~~~ షట్పదమన్న భూమిసుత.. ఝంకృతి నా జను నేడ్పు.. రామ స మ్రా ట్పద దాసుడైన కపి రామ కథన్ వినిపించగా మనో రా ట్పద పాళి రేత్రమయి గ్రాలగ గ్రోలగ మత్తిలంగ నా షట్పద మెప్పుడేనియును ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 27.11.19 -----------------------------------------------------------
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
తొలగించండినడిరేయి సరదా పూరణ:
షట్పదముల్ రచింపగను జాలక ముందున నాంధ్రమందునన్
ఫట్ఫట శంకరాభరణ పండిత వర్యుల మెప్పునొందెనే
ఛట్పట చెప్పు శంకరయ! శాస్త్రిని గాంచుచు శంకయేలనో:
షట్పద మెప్పుడేనియును ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్?
మొదటి పాదములో:
షట్పదములు = ఆరు పదములు :)
తొలగించండి*పట్పట
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఛందస్సులో షట్పదములున్నవి. తెలుగులో కంటే కన్నడంలో ప్రసిద్ధాలు.
తొలగించండి🙏
దుష్కర ప్రాసకు దుష్టపూరణ
రిప్లయితొలగించండిచిట్పటలాడగ గ్రీష్మము
పిట్పటలాడెడు సుమములు బిట్టుగవాడన్
పట్పట్మని రెక్కలుడిగి
షట్పద మొనరించునొక్కొ ఝంకారమునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-1)
గురు శిష్య సంవాదము :
__________________________
షట్పద మనగా నేమిటి?
షట్పదమొనరించు నొక్కొ - ఝంకారమ్మున్?
షట్పదమనగా తుమ్మెద !
షట్పదమొనరించు నెపుడు - ఝంకారమ్మున్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-1)
గురు శిష్య సంవాదము :
__________________________
షట్పద మెప్పుడేనియును - ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్ ?
షట్పద మన్న నేమి యది ? - స్పష్టముగా మరి చెప్పు మన్నచో
షట్పద మెన్నడున్ మృదుల - ఝంకృతి జేయును పుష్పవాటికన్ !
షట్పదమన్న తుమ్మెదని - చక్కగ జెప్పెను శిష్యు డయ్యెడన్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'తుమ్మెద + అని' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ "తేటి యని" అనవచ్చు.
శంశంకరార్యా, ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
ఫట్ఫట నిద్రలేచి వడి ప్రక్కను వీడుచు నాత్రమందునన్
షట్పద మాదటన్ జనుచు ఝంకృతిఁ జేయగ పుష్పవాటికన్
ఫట్ఫట ముల్లు గ్రుచ్చుకొన బావురు మంచును పారుచుండెడీ
షట్పద మెప్పుడేనియును ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్?
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండి🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిషట్శాస్తమ్ముల వలెనే
రిప్లయితొలగించండిషట్పదములతోడ భ్రమర స్వాగత గీతుల్
షట్పదులై యలరారగ
షట్పద మొనరించునొక్కొ ఝంకారమ్మున్.
మీ ప్రయత్నం ప్రశసార్హమే. కాని మొదటి పాదంలో ప్రాస తప్పింది.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిపట్పటనిద్రలేచుటయె,పానుపుపైననె కాఫిదాగుచున్
రిప్లయితొలగించండితట్పటబొందనేలనొకొ?? ,తాహతుమించిన గోర్కెలేనిచో!
షట్పదమేల ఝంకృతిని,షాకుగనిచ్చును పుష్పలావికై?
షట్పదమెప్పుడేనియును,ఝంకృతిజేయునె పుష్ప వాటికన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పుష్పలావిక + ఐ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
షట్పది కాకలి వేయగ
రిప్లయితొలగించండిషట్పది వెదకు చు విరులను సందడి చేసెన్
షట్పది నిరాశ జెంద గ
షట్పద మొనరించు నొక్కొ ఝ o కార మ్ము న్ ?nk
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిషట్పదములతో కవితలు
రిప్లయితొలగించండిషట్పద మొనరించునొక్కొ, ఝంకారమ్మున్
షట్పదములె జేయు నిజము
రాట్పడ బోకుము పడంతి రమ్మిటు చెలియా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివిట్పతి! పొద్దదె గూకెను!
త్విట్పతి వాలెనదె కమ్మతెమ్మర తోడై
రాట్పడి నటునిటు నెగురుచు
షట్పద మొనరించునొక్కొ ఝంకారమ్మున్!
ಜಿಲೇಬಿ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిషట్పదముల ఝంకారము
తొలగించండిషట్పదమొనరింపకెటుల శాంతినిబొందున్
షట్పదముల విరినూన్చక
షట్పద మొనరించునొక్కొ ఝంకారమ్మున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(చిత్రకారుడు రాజైన గిరిరాయని సభలో జీవకళనిండిన పూలతోటను,
రిప్లయితొలగించండితుమ్మెదలను వర్ణరంజితంగా చిత్రించాడు.కానీ --)
రాట్పదమందుకొన్న గిరి
రాయని జూడగనెంచి శీఘ్రమే
రాట్పుర మేగుదెంచె నొక
రంగుల హంగుల చిత్రకారుడే ;
షట్పదచాలితంబయిన
చక్కని పువ్వులతోట గీసినన్ ;
షట్పద మెప్పుడేనియును
ఝంకృతి జేయునె పుష్పవాటికన్ ?
మనోహరమైన భావంతో ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
తొలగించండికం.
రిప్లయితొలగించండిజట్పట్ గా, కవినోటన్
షట్పద గీతము వెలువడ ఝరిలో వినగన్ !
షట్పద ప్రజ్ఞాశాలికి
షట్పద మొనరించునొక్కొ ఝంకారమ్మున్ !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిజట్పటు నేర్వ నాంగ్లమిక చాలిక చేరును! మీదు వారికా
రాట్పడు లెల్ల తీరు! మన రాష్ట్రపు పిల్లలు వృద్ధి గాంతురే
విట్పతి నైతి మార్చెద! సువీజిక గంధము లేని పువ్వుపై
షట్పద మెప్పుడేనియును ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిత్విట్పతి పొందు కోస మరవిందము లెన్నడు వేచిచూచునే
రిప్లయితొలగించండివిట్పతి యత్తమామలను విత్తము నాస్తియు కోరుకొందునా
షట్పద మెప్పుడేనియును ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్
రాట్పడు యంతరంగమును రంజిలజేయుట నొప్పునే యిలన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రాట్పడు నంతరంగమును' అనండి.
త్విట్పతి మబ్బుల దాగెను
రిప్లయితొలగించండికాట్పడె సుమ వనములెల్ల కాలము మారెన్
రాట్పాటై తేనెల కిక
షట్పద మొనరించునొక్కొ ఝంకారమ్మున్
(త్విట్పతి = సూర్యుడు, కాట్పడు = నశించు, రాట్పడు = శ్రమపడు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిషట్పది వ్రాయగ బూనఁ వి
రిప్లయితొలగించండిరాట్పురుషుని దీవెనల్ నిరంతరముండన్
యీ 'ట్ప'నను ప్రాసఁ వ్రాసిన
షట్పద మొనరించునొక్కొ ఝంకారమ్మున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'...బూన' తర్వాత అరసున్న అవసరం లేదు.
షట్పదిఁ గాంచి సద్గురువు ఛాత్రుని తో వచియించె నిట్లుగా
రిప్లయితొలగించండిషట్పదమన్న నేమొ తెలుసా? మకరందము గ్రోలగన్ సదా
రాట్పడు చుండునట్టి క్రిమి, చక్కగ కోకిల వోలె పాడదీ
షట్పద మెప్పుడేనియును, ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాట్పతినామధారియయి ప్రాజ్ఞమహోదయపండితాళి స
రిప్లయితొలగించండిమ్రాట్పరమేశనందనుడు మందుడు మూర్ఖుడసత్యవాక్య సం
సృట్పరివేష్టితుండొకడు చేసెను ప్రశ్న వివేకశూన్యుడై
షట్పద మెప్పుడేనియును ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్?
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఒక యాచకుడు... రాజుతో అంటున్నాడు.. మీ పాదమే మాకు దిక్కు.. మీ ఆనందమే మాకానందం.. మీరు నవ్వితే మేము కేరింతలు కొడతాం.. మీరు కోపిస్తే మేము మిన్నకుంటాం...
రాట్పదపద్మమెన్నగ శరణ్యము మాకను యాచకాళి యా
రాట్పదమంటి భక్తిననురక్తిని గొల్చును ప్రేమ జూపుచో .,
షట్పదమేని యాచనమె సల్పును., పద్మము నవ్వకున్నచో
షట్పద మెప్పుడేనియును
ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరాట్పడు జెందితి నకటా
రిప్లయితొలగించండిషట్పద పూరణ మనసుకు సంఘర్షణవన్
షట్పరి విధముల నామది
షట్పద మొనరించునొక్కొ ఝంకారమ్మున్
(నామది షట్పదము - మనసనే తుమ్మెద )
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'షట్పరి విధములు' అనడం సాధువు కాదు.
ప్రాట్పదమందుచు ఘన కవి
రిప్లయితొలగించండిరాట్పతి లో ప్రతిభ జూడ లంఘించె నటన్
కాట్పాటు జేయుమని, యనె
"షట్పద మొనరించు నొక్కొ ఝంకారమ్మున్!"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసరదాగా చేసిన పూరణము, తప్పులున్న మన్నించ ప్రార్థన
రిప్లయితొలగించండిషట్పదమనినను తెలియక
షట్పద పదమును స్మరించె షటపు యనిననూ
షట్పదమున వాఖ్యమిదెయె
షట్పద మొనరించునొక్కొ ఝంకారమ్మున్!
🙏🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికొన్ని టైపు దోషాలున్నవి.
మూడవ పాదము లో
తొలగించండిషట్పదమను వాఖ్యమిదియె అని ఉండాలి
ధన్యోస్మి గురుదేవా 🙏
త్విట్పింగ సిత వరాంభో
రిప్లయితొలగించండిరుట్పావన కౌసుమమ్ము గ్రోలుఁ దమిని భూ
రుట్పతిత సుమములం గని
షట్పద మొనరించు నొక్కొ ఝంకారమ్మున్
[త్విట్పింగసిత = ప్రకాశమానమైన గోరోజనము, తెలుపు రంగులుకల; అంభోరుట్ = తామర; భూరుట్పతిత = చెట్టునుండి రాలిన]
త్విట్పతి మండ భీతిలును వీచును గాలియు మంద రీతినిన్
విట్పతి రాజ రాజునకు వీర వరేణ్యుఁడు తిర్గుచుండగా
రాట్పుర నంద నోపమ విలాస వనాంతర సంస్థితమ్మునౌ
షట్పద మెప్పుడేనియును ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్
[ త్విట్పతి = సూర్యుఁడు; విట్పతి = అల్లుఁడు; రాట్పురము = రాజనగరము]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండికం.
రిప్లయితొలగించండిషట్పది పద్యము కొరకని
షట్పదముల వెదకునపుడు శంకలు గలుగన్
షట్పద మొకటే వొకటన
షట్పద మొనరించు నొక్కఝంకారమ్మున్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'..మొకటే యొకటన' అనండి.
పట్పటలాడుచుబలికితె?
రిప్లయితొలగించండిషట్పదమొనరించునొక్కొఝంకారమ్మున్
షట్పదమేయొనరించును
దత్పటయే యేలమీకు తర్కములేలా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిషట్పది యన్న పద్యమున చక్కని పాదము లారు గల్గుచున్
రిప్లయితొలగించండిషట్పద మో యనంగ కడు చక్కగ నాడు కవిత్వవాటిలో,
షట్పది కేది రాగ మన జాలు పఠించిన తేనె ద్రావుచున్
షట్పద మెప్పుడేనియును ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిషట్పదమెప్పుడేనియునుఝంకృతిజేయునెపుష్పవాటికన్
రిప్లయితొలగించండిషట్పదిగూరిచిన్బలుకశాస్త్రపుసమ్మతమౌనెయద్దియున్
షట్పదమెప్పుడున్నలరిఝమ్మనురావముజేయునేగదా
తత్పటుపాటులేకయిక,తర్కములాడకయుండుమారమా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తత్పటుపాటు'?
చిట్పడలాడనేలయికచీయనిదిట్టిరినారులందరున్
రిప్లయితొలగించండితట్పడలాడకుండనిక తధ్యముజేయురు రాజధానినే
పట్పటనక్కడన్ భవన పాలనజేయక నిమ్మకున్నచో
షట్పదమెప్పుడేనియునుఝంకృతిజేయునె పుష్పవాటికన్
————————————
రావెలపురుషోత్తమరావు
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
షట్పద మెప్పుడేనియును
ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్
సందర్భము:
సర్వర్తు కుసుమై రమ్యాం
ఫలవద్భిశ్చ పాదపైః
పుష్పితానా మశోకానాం
శ్రియా సూర్యోదయ ప్రభామ్
అన్ని ఋతువుల్లో లభించే పూవులతో ఫలవృక్షాలతో రమ్యమైనది అశోకవనం. అశోక వృక్షా లన్నీ పుష్పించివుండటంవల్ల ఉదయ సూర్య కాంతితో ఒప్పారుతున్నాయి.
కర్ణికార కింశుక పున్నాగ చంపక (సంపంగి) వృక్షాలూ ఎంతో విశాలమైన ఆ పూదోటలో బాగా పుష్పించివున్నాయి.
అక్కడ ఆంజనేయుడు ఒక శింశుపా వృక్షంకింద అశ్రు పూర్ణ ముఖి, దీన, దుఃఖ పరాయణ యైన సీతను చూసినాడు. ఆమె ఆహారం సరిగా తీసుకోకపోవటంవల్ల చిక్కిపోయినది. శోకంలో మునిగిపోయినది.
చెట్టు కొమ్మలలో దాగుండి రామ దాసు వినిపించిన రామకథ అనే అమృతాన్ని సేవించి మత్తిల్లినది సీత అనే షట్పదం. ఇక విలాప మనే ఝంకారం చేస్తుందా!
మనోరాట్ పదపాళి = మనస్సుకు రాజైన (మనోనాథుడైన) రామునిగురించిన మాటల సమూహం (సమాచారం)
రేత్రము= అమృతం
పుష్ప వాటిక= అశోక వనం
~~~~~~~~~~~~~~~~~~~~~~~
షట్పదమన్న భూమిసుత..
ఝంకృతి నా జను నేడ్పు.. రామ స
మ్రా ట్పద దాసుడైన కపి
రామ కథన్ వినిపించగా మనో
రా ట్పద పాళి రేత్రమయి
గ్రాలగ గ్రోలగ మత్తిలంగ నా
షట్పద మెప్పుడేనియును
ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
27.11.19
-----------------------------------------------------------
రిప్లయితొలగించండిశరషట్పద వృత్తము :)
భలే బాగుంది. నో యతి నో ప్రాసల ఝంఝాటపు ఝంకృతి :)
తెలుగు సీమలో మొదల్ మురయాగ జిలేబీయపు శరషట్పద :)
షట్పద మొనరిం
చునొక్కొ ఝంకా
రమ్మున్ జిలేబి శరషట్పద
మిదియె సుమా సుల
భమైనది నేర్వ
గా ప్రాసయతులు లేవు సుమా
ఆహా యెంతహాయి
రాసుకుంటా పోవచ్చు :)
రెండు నాల్గు మాత్రలు
రెండు నాల్గు మాత్రలు
మూడు నాల్గు మాత్రలు ఒక రెండు మాత్రలు :)
రిపీట్ మాడి
జిలేబి
రిప్లయితొలగించండిషట్పద గీతాలాపన
రాట్పదముల చెంత చేయ రహియది కలుగన్
షట్పది వోలెను మనసది
షట్పదమొనరించు నొక్కొ ఝంకారమునన్