సందర్భము: పురారి గిరి సంభూతా శ్రీ రామార్ణవ సంగతా అధ్యాత్మ రామ గంగేయం పునాతి భువన త్రయమ్ త్రిపురారి (శివుడు) అనే పర్వతంనుంచి బయలువెడలింది.. శ్రీ రాము డనే సాగరంలో సంగమించింది.. ఈ (అధ్యాత్మ) రామాయణం (రామకథ) అనే గంగానది మూడు లోకాలనూ పవిత్రీకరిస్తుంది.. అంటాడు వ్యాస మహర్షి. ఓ అరవై డెబ్భై యేండ్ల కింద పెండ్లి కావలసిన ఆడపిల్లలకు అధ్యాత్మ రామాయణ కీర్తనలు విధిగా నేర్పేవారు. పేరంటాలలో హరికథలలో ఆలయాలలో ఆకాశవాణి 'భక్తిరంజని'లోనూ.. "వినవే! గౌరి! సుకుమారి! గిరివర కుమారి!" అనే పల్లవి వినిపించేది. శివుడు రామగాథ వినిపిస్తూ పార్వతితో ఇలా అంటున్నాడు. " ఓ శివా! తరణి యొక్కటే! (అంటే భవసాగరాన్ని దాటించే ఓడ. అజ్ఞాన తిమిరాన్ని తొలగించే సూర్యుడు.) రామ కథను వినడమే నిత్యపూజగా భావించు. ఈ నెలంతా నీకు వినిపిస్తాను. ఈ కార్తిక మాసంలో ఇంకో పూజ ఏదో చేస్తూ కూర్చోకు." శ్రవణ మనేది ఆషామాషీ పనేమీ కాదు. నవ విధ భక్తులలో అదొకటి. శ్రవణం కీర్తనం విష్ణో స్స్మ రణం.. అనేది ప్రసిద్ధం.
తరణి= ఓడ.. సూర్యుడు ~~~~~~~~~~~~~~~~~~~~~~~ తరణి యి దొకటే!.. రామ గాథా శ్రవణమె
నిత్య పూజగా నెంచు.. విన్పింతు నేను
మక్కువగ నీ నెలంత.. నిం కొక్క టేదొ
కలికి! శివ! పూజఁ జేయకు కార్తికమున
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 23.11.19 -----------------------------------------------------------
Is it being difficult for you to carry forward the bitcoin transaction on Binance exchange? If you are not getting any solution, you can always take help from the team of skilled experts who are there to assist you. You can call on Binance support number which is functional all the time. The users can talk to the experts anytime related to issues and avail quality and result-oriented solutions from the experts in no time. Speak to the team anytime related to issues and troubles. Contact the team anytime for availing results. more info visit here:- https://www.cryptophonesupport.com/exchange/binance/
సందర్భము: "కాయ వా ఙ్మానస కరణ క్రమమున చేయు పూజా జప చింతలు మేలు" 4. అని భగవాన్ రమణ మహర్షి తన ఉపదేశ సారం (ద్విపద) లో నొక్కి వక్కాణించాడు.
"పూజ...... కాయికము జపము....వాచికము చింతన.....మానసికము ఒకదానికంటె మరొకటి అధిక ఫల ప్రద మంటారు. అందువల్ల నీవు మానసికమైన చింతనమునకు ఈ కార్తిక మాసంలో బాగా అలవాటు పడాలి సుమా! " అంటూ ఒక గురువుగారు శిష్యురాలికి చెబుతున్నాడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ జగతి పూజకన్న జపము.. జపముకన్న చింతన మ్మెక్కువగ నందజేయు ఫలము.. తనువు పలుకుల దాటి నీ మనము నిలుపు.. కలికి! శివ పూజఁ జేయకు కార్తికమున
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 23.11.19 -----------------------------------------------------------
Is 2-factor authentication error bothering you in your Binance account? Is 2-factor authentication creating fuss in your account and you need right process to execute it properly without any trouble? To deal with all the Binance errors, you are advised to directly reach to the team of executives who are there to support you at any point of time. Just dial Binance toll-free number and get immediate solutions and fix your problem on urgent basis so that you can focus on trading without any disturbances.
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
కలువగ స్నేహ భావమున గారవ మొప్పుచు నాశ్రమమ్మునన్
పిలువకు కంది వర్యులను పెద్దగ లేపుచు;...కైపదమ్మునున్
పలికెదరమ్మ తత్క్షణము ప్రౌఢపు దుష్కర ప్రాసనిచ్చుచున్;...
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్
దుష్కర ప్రాసాక్షరము = "ర్తి"
"దుష్కర ప్రాసనిచ్చుచు" లో "ర" ను లఘువుగా పలుకవలెను.
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండి🙏
విరించి
రిప్లయితొలగించండితెలతెల వారవచ్చెనట తిగ్మకరుం డుదయించినంతనే
పలువిధ పూలుదెచ్చితివి భక్తిని గొల్వగ నా దయాళువౌ
మలహరు డాతనిన్, దులసి మాలలవేల వాటితో
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పలు విధ పూలు' దుష్టసమాసం.
మలినము లేని మానసము మౌనము గాపుల కించు గావుతన్
రిప్లయితొలగించండిఫలితము కోరి దైవమును పాపములన్ తొలగించ మన్నచో
కలికిరొ ! కొల్వగాఁ దగదు కార్తిక మాసమునందు శంకరున్
విలసిత మైన మోదమున వేకువ జామున దీప సంపదల్
అక్కయ్యా,
తొలగించండిపద్యం బాగుంది. కాని పూరణలో స్పష్టత లేదు.
చంపకమాల
రిప్లయితొలగించండికులుకుచు దీపమాలికల కోవెల నుంచెడు నార్తిఁ జారగన్
విలవిలలాడ నా నడుము విర్గగ వైద్యులు డబ్బు గుంజిరే!
యొలికిన తైలముల్ గుడుల నుండఁగ బోవుచు వీడి జాగ్రతల్
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినా వాట్సప్ వ్యాఖ్యను గమనించండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించుకుంటాను.
తొలగించండిసవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన
తొలగించండిచంపకమాల
కులుకుచు దీపమాలికల కోవెల నుంచెడు నార్తిఁ జారగన్
విలవిలలాడ నా నడుము ఫెళ్లన వైద్యులు డబ్బు గుంజిరే!
యొలికిన తైలముల్ గుడుల నుండఁగ బోవుచు వీడి జాగ్రతల్
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండితెలతెలవారుచుండగ నదిన్ జని నీటమునింగి భక్తితో
కొలుచుచునీశు, దీపములు కోటివెలుంగుల జిమ్మునట్లు త...
జ్జలములనుంచగావలె., నశౌచము గల్గు దినత్రయమ్మునన్
కలికిరొ ! కొల్వగా దగదు కార్తికమాసమునందు శంకరున్.!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపలుకుచునుండె నత్త బహుభంగుల గోడలికిట్లు మూర్ఖతన్
రిప్లయితొలగించండిగలుములతల్లి పెన్మిటిని గామ్యము దీరగ సంతతం బిటన్
దలచుట యౌను వైష్ణవుల ధర్మము, తప్పకుమీవు, వింటివే
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచ:
రిప్లయితొలగించండితెలుపగ ప్రీతి కార్తికము తీరుగ నొక్కటె నీశు మాధవున్
గొలువగ నీలకంఠుడిని గోర్కెలు దీరగ భక్తి భావనల్,
కలికిరొ! కోల్వ గా దగదు కార్తిక మాసమునందు శంకరున్
తులసిగ ; పూజ సేయ వలె తోయపు ధారల నాభిషేకముల్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచివరి పాదం అన్వయం విషయంలో సందేహం. 'తులసిగ'? ఆభిషేకమనే పదం విషయంలో సందేహం.
అభిషేకమునకు సంబంధించినవి ఆభిషేకములు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
మనసా వాచా కర్మణా:
తలచుచు మానసమ్మునను దండను వజ్రపు టుంగరమ్మునున్...
పలుకుచు నిష్ఠురమ్ములగు భాషలు దెప్పుచు నత్తగారినిన్...
వలచుచు మెండు నంజుడును వండుచు కమ్మగ నారగించుచున్...
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచం.
చలి యనబోక వేకువనె చల్లని నీట నొనర్చి స్నానమున్,
పలుకుచు మాటికిన్ శివశివా యని కోవెల జేసి యర్చనల్,
సలిపిన నక్తముల్ శివుడు సంతస మందును, మెక్కి ప్రొద్దుటే
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువు గారికి.
తొలగించండిAIR సమస్యా పూరణము
రిప్లయితొలగించండివలచిన కాంతుఁతో దిరిగి వంచన జేయగ నెంచబోవ నో
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తిక మాసమునందు శంకరున్
దలచిన కార్యముల్ భవుడు దా నెరవేర్చు నటంచు నమ్మరే
యిల మనుజుల్ సదాశివు, సతీశుని, ఫాలుని కాలకాలునిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాలమిపుడు కలిసి.రాగ కలిగినట్టి
రిప్లయితొలగించండిపదవి మాటున జేసిన పాపముపయి
కలికి శివపూజఁ జేయకు ; కార్తికమున
పురజనులకు సేవయె శివపూజ యగును
కలి = యుద్ధము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిలువల తోవసింప వలె పృథ్వి నుమాపతి చిత్తమున్ గొనన్
రిప్లయితొలగించండికలుషపు మానసమ్మునను కర్కశమౌ గతి పోవుచున్ సదా
సలుపుచు నీచమౌ పనుల సంఘము నందున స్వార్థ బుద్ధితో
కలికిరొ కొల్వగా దగదు కార్తిక మాసమునందుశంకరున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభక్త వత్సలుడు కపాలి, పత్రమొకటి
రిప్లయితొలగించండిబిల్వమును మనసారగా పెట్టుట తగు,
మానుకొని నీ పనులను సమరము వలెను
కలికి! శివపూజఁ జేయకు కార్తికమున.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలియుగ జీవనంబునను కల్మషమందెను భక్తిభావనల్
రిప్లయితొలగించండిసలిలము,పాలుతేనెయును స్వచ్చము వీడెనుకల్కిజేరగన్
మలినము మానసంబుననుమాయలుజేయుచునాట్యమాడగా
కలికిరొ కొల్వగాదగదు కార్తికమాసమునందుశంకరున్
కొరుప్రోలు రాధాకృష్ణారావు,మీర్ పేట్ ,రంగారెడ్డి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచం. బలిమియు సంపదల్ పెఱుఁగ భక్తిని దంత్రముగా దలంచుచున్
రిప్లయితొలగించండిబలుకుల వెన్న జిందుచునె పాపపు బుద్ధిని దేలియాడుచున్
గలికిరొ, గొల్వగా దగదు కార్తికమాసము నందు శంకరున్
మలినము వీడిపేర్కొన నుమాధవు డెల్లర బ్రోచు నీ ధరన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపలికెదవింత వింతగను వాణినినర్పణసేయగా ననున్
రిప్లయితొలగించండివిలువలులేని పాలకుల విత్తమునొందగ,నట్టివారినిన్
కలికిరొ!కొల్వగాదగదు!కార్తికమాసమందు శంకరున్
ఫలితము గోరకుండగను పన్నుగ నిత్యము గొల్వగాదగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి( కొన్ని కార్యాలు చేయనివారు కార్తికమాసంలో
రిప్లయితొలగించండిశివసేవ చేయరాదు )
తెలతెలవారకుండగనె
తేటగు నీటను స్నానమాడకన్ ;
బలుకుల - జేతలన్ - మదిని
భక్తిగ ధ్యానము సల్పకుండగన్ ;
సలలితమౌ నుపాసముల
సాత్వికభాషణ సేయకుండినన్
గలికిరొ ! కొల్వగాతగదు
కార్తికమాసమునందు శంకరున్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'స్నానమాడకే'... (అక ప్రత్యయాంత అవ్యయం కళ కదా!)
అలాగేనండీ ! ధన్యవాదాలు .
తొలగించండిఆకాశవాణిలో ప్రసారం:
రిప్లయితొలగించండికలియుగమందునన్ జనులుకల్మషచిత్తముతోడదైవమున్
కలిమియొసంగవేడెదరు కల్లలుకొల్లలు పల్కుచున్ సదా
కలికపుకోరికల్ మదినికమ్మగ నిట్టుల స్వార్థబుద్ధితో
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్
కలవరపాటుచెంది మది కామితముల్ నెరవేరు కోర్కితో
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్
నిలుపుము భక్తినెమ్మనము నిండుగ నీశునియందు ధ్యాసతో
సలుపుము నిర్వికల్పమగు సాధన నెక్కఁగ ముక్తి సౌధమున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురువుగారూ!
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిశివున కెంత ముఖ్యమ్మొ కేశవున కంతె
ధూప దీప నైవేద్యాల తోడ మిగుల
భక్తి భావమ్ము వెలయించి వరదుని విడి
కలికి! శివపూజఁ జేయకు కార్తికమున
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివచ్చే వారానికి ఆకాశవాణి సమస్య....
రిప్లయితొలగించండి"వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె తినందగు నిర్భయమ్ముగన్"
మీ పూరణలను గురువారం సాయంత్రంలోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి...
padyamairhyd@gmail.com
కులుకుచు హారముల్ నవ దుకూలములందున శ్రద్ధ జూపుచున్
రిప్లయితొలగించండికలికిరొ! కొల్వగా దగదు; కార్తిక మాసమునందు శంకరున్
నిలుపుచు మానసమ్మున పునీతముగా నభిషేక పూజలన్
సలుపుట యుత్తమమ్ము గిరిజాపతి భవ్య కటాక్ష సిద్ధికై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇలనరయంగనేర్వుమిక నీశుని కిష్టపుమాసమౌటచే
రిప్లయితొలగించండిమలినముతోడనుండునెడమానినులెవ్వరుబూలతోడయో
కలికిరొ!కొల్వగాదగదు కార్తికమాసమునందు శంకరున్
గలిములునీయునాతడును,గైటభదైత్యునివైరి మిత్రునిన్
మీ పద్యం బాగుంది. కాని పూరణలో కొంత అస్పష్టత ఉన్నది.
తొలగించండికలికి! శివపూజజేయకు కార్తికమున
రిప్లయితొలగించండిగలనుగంటిరి కాబోలు ఖచ్చితముగ
లేనియెడలను నిట్లుగ లేమకెపుడు
చెప్పనోపరు గురువులు దప్పుగాను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసర్వ వేళల చేయుము చక్కగాను
రిప్లయితొలగించండికలికి! శివపూజఁ, జేయకు కార్తికమున"*
భంగమెప్పుడు ను నదియు పరమశివుని
కిష్టమైనట్టి మాసమౌ నిలనటండ్రు.
మరొక పూరణ
హరిహరులకుప్రీత్యాస్పద మైన మాస
మిదియటంచు నెరుంగుచు నేమరకను
కలికి! శివపూజఁ జేయకు కార్తికమున
శ్రీహరిని మరచుచు నీవు చిత్త మందు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండివలిపిరినందు వడ్కి తెలవారున స్నానముఁ జేయలేనురో!
రిప్లయితొలగించండివలవల నేడ్చు దేహ ముపవాసము పూర్తి దినంబు నుండ దా
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్
మలుగని శ్రద్ధలేక! నియమంబునఁ గొల్చును భక్తుడెప్పుడున్౹౹
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమద గజయాన వేషమ్ము చాలు నింకఁ
రిప్లయితొలగించండిజిగురుఁ బోఁడి నీ వనిశమ్ము చిత్త శుద్ధి
నువిద సత్యంపు సద్భక్తి నుంచు ములికి
కలికి! శివపూజఁ జేయకు కార్తికమున
ఫలితము నుండ నెంచినను బద్మసులోచన సుంత విన్ము శీ
తల సలి లావగాహనము తప్పక చేసి విశుద్ధ వస్త్రవై
నెలకొన భక్తిచిత్తమున నిష్ఠగ నీ వుపవాస ముండకే
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిమరొక పూరణ
రిప్లయితొలగించండివిలువలు వీడి ధారుణిన వేగిరపాటును చూపుచున్ సదా
కలికిరొ! కొల్వఁగాఁ దగదు, కార్తికమాసమునందు శంకరున్
దలచిన చాలు శూలిని టదండిగ నిచ్చును తా వరంబులన్
సులభముగాను దీవెనిడుచుండును సంశయమేల దెల్పుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ధారుణిని' అనండి.
తులసి దళము లతో అని చెప్పదలచి " తులసిగ" అని రాశాను. అభిషేకము కు సంబంధించి అభిషేకము అని కలిపాను. సవరణ సూచించగలరు. ధన్యవాదాలు
రిప్లయితొలగించండికలువలునీటబాసెనని కాంతల నిద్రనకండ్లుదెర్వరే
రిప్లయితొలగించండివిలువలతీరుమారెననివేదపువిద్యలనీసడించుచున్
సులువుగ పుణ్యమొచ్చునని శుభ్రతవీడెడుయిండ్లలోపలన్
కలికిరొకొల్వగాదగదు కార్తికమాసమునందు శంకరున్
************************
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"నిద్రను...పుణ్యమబ్బునని.. శుభ్రత వీడు గృహమ్ములందునన్..." అనండి.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
*"కలికి! శివపూజఁ జేయకు కార్తికమున"*
సందర్భము:
పురారి గిరి సంభూతా
శ్రీ రామార్ణవ సంగతా
అధ్యాత్మ రామ గంగేయం
పునాతి భువన త్రయమ్
త్రిపురారి (శివుడు) అనే పర్వతంనుంచి బయలువెడలింది.. శ్రీ రాము డనే సాగరంలో సంగమించింది.. ఈ (అధ్యాత్మ) రామాయణం (రామకథ) అనే గంగానది మూడు లోకాలనూ పవిత్రీకరిస్తుంది.. అంటాడు వ్యాస మహర్షి.
ఓ అరవై డెబ్భై యేండ్ల కింద పెండ్లి కావలసిన ఆడపిల్లలకు అధ్యాత్మ రామాయణ కీర్తనలు విధిగా నేర్పేవారు. పేరంటాలలో హరికథలలో ఆలయాలలో ఆకాశవాణి 'భక్తిరంజని'లోనూ.. "వినవే! గౌరి! సుకుమారి! గిరివర కుమారి!" అనే పల్లవి వినిపించేది.
శివుడు రామగాథ వినిపిస్తూ పార్వతితో ఇలా అంటున్నాడు.
" ఓ శివా! తరణి యొక్కటే! (అంటే భవసాగరాన్ని దాటించే ఓడ. అజ్ఞాన తిమిరాన్ని తొలగించే సూర్యుడు.)
రామ కథను వినడమే నిత్యపూజగా భావించు. ఈ నెలంతా నీకు వినిపిస్తాను. ఈ కార్తిక మాసంలో ఇంకో పూజ ఏదో చేస్తూ కూర్చోకు."
శ్రవణ మనేది ఆషామాషీ పనేమీ కాదు. నవ విధ భక్తులలో అదొకటి. శ్రవణం కీర్తనం విష్ణో స్స్మ రణం.. అనేది ప్రసిద్ధం.
తరణి= ఓడ.. సూర్యుడు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
తరణి యి దొకటే!.. రామ గాథా శ్రవణమె
నిత్య పూజగా నెంచు.. విన్పింతు నేను
మక్కువగ నీ నెలంత.. నిం కొక్క టేదొ
కలికి! శివ! పూజఁ జేయకు కార్తికమున
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
23.11.19
-----------------------------------------------------------
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివిలువలువింతగానవుచు వేదము శాస్త్రము రిత్తబోవగన్
రిప్లయితొలగించండిమలినమునంటిమానసమమానుషమైనిటరెచ్చిబోవగా
కలుషముభక్తిజేరినది కాపురుషుండ్లిలగూడుయిండ్లలో
కలికిరొగొల్వగాదగదు కార్తికమాసమునందు శంకరున్
——____
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినవమికి వలదు శ్రీరామ నవమి పూజ
రిప్లయితొలగించండిగణపతికి వలదు వ్రతమున కథ చదువ
కలికి! శివపూజఁ జేయకు కార్తికమున
యనుచు తెలిపిన ఘనులు యెవరు మనకును?
🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ, నాల్గవ పాదాలలో యతి తప్పింది. "కార్తికమున ననుచు.." అని ఉండాలి. 'ఘనులు + ఎవరు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.
ధన్యుణ్ణి గురుదేవా 🙏🙏
తొలగించండిచెప్పిన తప్పులను సవరించి 🙏🙏
తొలగించండినవమికి వలదు శ్రీరామ నవమి పూజ
గణపతికి వలదు వ్రతపు కథలు చదువ
కలికి! శివపూజఁ జేయకు కార్తికమున
ననుచు తెలిపిన ఘనులను నమ్మకెపుడు
🙏🙏
మలినపు బుద్ధితోడ,స్థిరమౌ పరిపూర్ణత లేక నెప్పుడున్
రిప్లయితొలగించండిపలుదెసలన్ జరించెడు మనమ్మున,శుద్ధత శూన్యమై కడున్,
పలలపు కూడు మెక్కుచును,స్వార్థము సుంతయు వీడకుండగా..
కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"లేక యెప్పుడున్" అనండి.
మలినములైన వస్త్రములు మాటల శుద్ధత లేని బూజతో
రిప్లయితొలగించండికలికిరొ !కొల్వగా దగదు కార్తికమాసమునందు శంకరున్
తలపున భక్తిభావనలు తామర తంపర లైచెలంగగా
వెలితియు లేని చిత్తమున వేడిన మెచ్చును వేడికంటియే !!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...లేని పూజతో" అనండి.
నిధి నియమము లేక మరియే నిష్ట లేక |
రిప్లయితొలగించండినాస్తికత్వము నెరపెడి నారి మణికి |
పదుగు రేమందు రోయని భక్తి విడచి
"కలికి! శివపూజఁ జేయకు కార్తికమున"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభక్తురాలని పదుగురు వాసిగాను
రిప్లయితొలగించండిపొగడ వలనంచు దలచుచున్ బోయి గుడికి
మదిని లేకున్న నటనతో మందిరమున
కలికి శివపూజఁ జేయకు కార్తికమున
Is it being difficult for you to carry forward the bitcoin transaction on Binance exchange? If you are not getting any solution, you can always take help from the team of skilled experts who are there to assist you. You can call on Binance support number which is functional all the time. The users can talk to the experts anytime related to issues and avail quality and result-oriented solutions from the experts in no time. Speak to the team anytime related to issues and troubles. Contact the team anytime for availing results.
రిప్లయితొలగించండిmore info visit here:- https://www.cryptophonesupport.com/exchange/binance/
వత్సా! కుమార! చెప్మా
రిప్లయితొలగించండితాత్సారము చేయకిక బుదానుడెవరురా?
తత్సమ మైనట్టి బుచికి
కుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
*"కలికి! శివపూజఁ జేయకు కార్తికమున"*
సందర్భము:
"కాయ వా ఙ్మానస కరణ క్రమమున
చేయు పూజా జప చింతలు మేలు" 4.
అని భగవాన్ రమణ మహర్షి తన ఉపదేశ సారం (ద్విపద) లో నొక్కి వక్కాణించాడు.
"పూజ...... కాయికము
జపము....వాచికము
చింతన.....మానసికము
ఒకదానికంటె మరొకటి అధిక ఫల ప్రద మంటారు.
అందువల్ల నీవు మానసికమైన చింతనమునకు ఈ కార్తిక మాసంలో బాగా అలవాటు పడాలి సుమా! "
అంటూ ఒక గురువుగారు శిష్యురాలికి చెబుతున్నాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
జగతి పూజకన్న జపము.. జపముకన్న
చింతన మ్మెక్కువగ నందజేయు ఫలము..
తనువు పలుకుల దాటి నీ
మనము నిలుపు..
కలికి! శివ పూజఁ జేయకు కార్తికమున
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
23.11.19
-----------------------------------------------------------
Is 2-factor authentication error bothering you in your Binance account? Is 2-factor authentication creating fuss in your account and you need right process to execute it properly without any trouble? To deal with all the Binance errors, you are advised to directly reach to the team of executives who are there to support you at any point of time. Just dial Binance toll-free number and get immediate solutions and fix your problem on urgent basis so that you can focus on trading without any disturbances.
రిప్లయితొలగించండి
తొలగించండిశంకరార్యులకి ఉన్న ప్సమస్యలే సాల్వు కావడం కష్టమవుతూంటే ఈ బడుద్దాయి యెవడో two factor authentication అంటూ సరికొత్త సమస్య తీసుకొస్తాడేంటో :)
జిలేబి