కచుని శుక్రా చార్యుని వద్దకు విద్య నేర్చు కోవటానికి బృహస్పతి ఆదేశిస్తాడు. “శుక్రుడు అసుర గురువు దుర్మార్గుడు అతని వద్దకు వెళ్ళి ఎలా విద్య నేర్చుకోగలను” అని సందేహము వెలి బుచ్చ బృహస్పతి కుమారుని గాంచి పలికిన పలుకులు
సమరము జరుగెడు సమయమున సురలె ల్లరు మరణించ నసురులు విజయ
సందర్భము: శుభం హితం పవిత్రంచ విభీషణ వచః ఖలు ప్రతి జగ్రాహ నైవాఽ సౌ మ్రియమాణ ఇవౌషధం శుభమూ హితమూ పవిత్రమూ ఐన ధర్మాన్ని చెప్పాడు విభీషణుడు. చావు మూడిన వాడు ఔషధాన్ని వలె రావణుడు నిరాకరించాడు. (అధ్యాత్మ రామాయణం) స బభూవ కృశో రాజా! మైథిలీ కామ మోహితః అసన్మానాచ్చ సుహృదాం పాపః పాపేన కర్మణా సాధ్వియైన సీతమ్మపై కామం.. సాధువైన విభీషణునిపై క్రోధం.. ఈ రెండు పాపాలవల్లనే రాజైన రావణుడు నశించిపోయాడు.. అన్నాడు వాల్మీకి. నా మాటలు వినడు. పైగా తిడుతాడు.. అని రావణుని గురించి రామునితో చెబుతున్నాడు విభీషణుడు శరణు వేడుతూ. "రామా! శరణు.. శరణు.. మంచి మాటలు చెబితే వినడాయె.. నా సోదరుడే పరు డాయె..(శత్రువాయె) ఆతడు చేసే పనులలో మేలు గూర్చేవి లేవాయె. నా మీద వూరకే కత్తులు దూస్తున్నాడు.. (తిట్టిపోస్తున్నాడు.)" ~~~~~~~~~~~~~~~~~~~~~~~ శరణు శరణు రామా! శ్రీ
కర! సూక్తులను వినడాయె గద! సోదరుడే
పరుడాయెఁ.. గార్యముల హిత
కరములు లేనట్టివాఁడు.. కత్తుల దూసెన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 25.11.19 -----------------------------------------------------------
రిప్లయితొలగించండిఅరయగ ధైర్యము తోడై
మరణమ్మును కదురుకొనుచు మహిమాన్వితుడై
చురుకుగ నుప్పొంగుచు నా
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
విష్ణు మాయ :) ఏమాయె పొద్దుటే వచ్చేసె?
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వసంత కిశోర్' గారి కోరిక మేరకు షెడ్యూల్ మార్చాను. ఎవ్వరూ దీనికోసం నిద్ర చెడగొట్టుకోవద్దని మనవి.
తొలగించండిజిలేబి గారూ:
"పొద్దుటే"?
....హా తెలిసెన్....
:)
రిప్లయితొలగించండిఅరయగ సాహసమ్మును సహాయము గాగొని దావరీడుడా
కరములు లేనివాఁడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో
విరివిగ నూచమట్టుగొని బెట్టుగ చువ్వన ద్రోలి ద్రోహులన్
తిరముగ దేశభద్రతను తీరుగ నిల్పె ప్రభాతవేళలో!
ಜಿಲೇಬಿ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅరరే శకార సాయ
మ్ము రమ్మ కైపద మునే సముచితము పూరిం
ప రవంత జిలేబులమర
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
జిలేబి
👌🏻👏🏻💐
తొలగించండిఅర్థరాత్రి బుట్టె నాకరములు
😀🙏🏻
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివరకరుణాసముద్రుడయి భాగ్యముగూర్చెడి చంద్రశేఖరున్
రిప్లయితొలగించండినిరతము మానసంబునను నిష్ఠనుబూని స్మరించువారికిన్
ధరపయి సత్వవృద్ధియగు తథ్యము తద్గత చిత్తదీప్తితో
గరములు లేనివాఁడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిశిరమున దాల్చి దేశమును శ్రీకరు లాంగ్లుల పోరి నవ్వుచున్
స్థిరముగ సత్యమున్ గొనుచు చేతిని పూని యహింసనున్ భళా
మురియుచు నార్జనమ్ముగను ముప్పది రూకలు మించకుండగా
కరములు లేనివాఁడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో
కరము = కప్పము (Income Tax)
తొలగించండిసారు! బ్లాగులో సమస్య కాలమును అర్ధరాత్రికి మార్చారా (మాకు చెప్పకుండా)?
😢
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమారిన కాలం గురించి పైన, వాట్సపులో ప్రస్తావించాను.
తొలగించండి🙏
నాకైతే రోజులో ఏ సమయమైనా ఒకటే...కోడి కునుకులు.
అర్ధ రాత్రీ, తెల్లవారు జామున బ్రహ్మ ముహుర్తం కూడా మెలకువే.
తొలగించండిమీ సమస్య ఎచ్చటైనా సరే ప్రచురణ అయిన పదిహేను నిమిషాలలో నా సరదా పూరణ పడకపోతే ప్రాణం గిజగిజలాడుతుంటుంది
😊
'శతావధాని' ఆముదాల మురళి గారి పూరణ.....
రిప్లయితొలగించండిస్థిరతర ధర్మరక్షణకుఁ జేసిన భారతయుద్ధమందు మొ
గ్గరమున నొంటిగా దుమికి కౌరవసేనను నుగ్గుసేసి వీ
ర రస నిజావతార మవురా! యభిమన్యుఁడు శౌరి సత్కృపా
కరములు లేనివాఁడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో.
తొలగించండి👏👌🙏
👌🏻👏🏻💐🙏🏻
తొలగించండి🙏🙏💐💐👏👏
తొలగించండి👌👌👌🙏🙏🙏
తొలగించండినాదీ సరదాపూరణే మరి...😊
రిప్లయితొలగించండిశరములు వేయగ వచ్చును
కరవాలము చేతబట్టి కాట్లాడగలన్
బరిపరి విధముల ననుచును
"కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్"
కరములు = తొండములు
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅరివీరులఁ దునుమాడగ
రిప్లయితొలగించండిశరవేగమ్మున కదులుచు సమరము జేయన్
కరుణయు మమకారము కని
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికరవాఁడి శరములు దివా
రిప్లయితొలగించండికరుఁగరములు పృధ్విజనులుకటకటనొందన్
కరుణయు,కార్పణ్యము, మరి
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కరవాఁడి'?
అత్యంత పదునైన very sharp
తొలగించండిఈ నాటి శంకరా భరణము వారి సమస్య
రిప్లయితొలగించండికుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్"
ఇచ్చిన పాదము కందములో నా పూరణము సీసములొ
కచుని శుక్రా చార్యుని వద్దకు విద్య నేర్చు కోవటానికి బృహస్పతి ఆదేశిస్తాడు. “శుక్రుడు అసుర గురువు దుర్మార్గుడు అతని వద్దకు వెళ్ళి ఎలా విద్య నేర్చుకోగలను” అని సందేహము వెలి బుచ్చ బృహస్పతి కుమారుని గాంచి పలికిన పలుకులు
సమరము జరుగెడు సమయమున సురలె
ల్లరు మరణించ నసురులు విజయ
మును పొందు చుండిరి, ముడుగును
దివిజులు రయముగ, భువికి వెడలి
నీవు శు క్రాచార్యునికి సేవనముచేయ
గ మృతసంజీవని కలుగు, యాతు
ధానుడు కుత్సితుఁడైనట్టి వాఁడె, గు
రువన నొ ప్పు నెపుడు భువన మందు
శత్రువునకైన ముదముగ చదువు నేర్పి
పండితునిగ తీర్చెడివాడు, పంతు వలదు
నీకు కచుడా, కరుణతోడ నేర్పు విద్య
ననుచు పలికె వాగ్మి సుతుని తనువు నిమిరి
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిసీసం రెండవ పాదంలో గణభంగం. సవరించండి.
ఇరు మాసమ్ముల సమ్మెకు
రిప్లయితొలగించండిఅరకొర జీతమ్ము లవియు నందని వారై
మరు దారేగానక పరి
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
(Honeymoon Battles)
కురియుచు పండు వెన్నెలను కూరిమి మీరను వెఱ్ఱివెఱ్ఱిగా
విరియుచు నూత్న దంపతుల వెచ్చని కౌగిలిలోన దూరుచున్
మురియుచు పున్నమందునను ముద్దుల గుద్దులలో, స్వయమ్ముగా
కరములు లేనివాఁడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో
కరము = కిరణము
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండి__/\__
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివరహరదత్తమైనదగు పాతపతాస్త్రము లేని క్రీడి ,సం...
గరమున కార్ముకమ్ము గొన కాలుడనన్ చెలరేగు , రామరా...
జరిగణకార్తవీర్యుడు భళా! గణియింపగ వేలసంఖ్యలో
కరములు లేనివాఁడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
* పాశు
తొలగించండిమైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి*కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్*
రిప్లయితొలగించండిసరదా పూరణము
చరవాణి గేమునందొక
వరముగ శక్తియు దొరికెను వధియింపగనేన్
అరెరే మాయే గదరా
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి( రణరంగంలో బాలచంద్రుని వీరవిహారం )
రిప్లయితొలగించండిఅరయగ బాలచంద్రు డని
యందున గిర్రున బొంగరమ్ముగా
తిరుగుచు శత్రులన్ దునిమి
తీవ్రముగా తన దేహమంత నె
త్తురులవి చిమ్మగా ; కినిసి
ధూర్తుల పైబడి యెట్టి యాయుధా
కరములు లేనివాడు చుర
కత్తుల దూసెను యుద్ధభూమిలో .
(ఆయుధాకరములు - ఆయుధసమూహాలు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపరులను దూషణ జేయుచు
రిప్లయితొలగించండిదురిత ము లొనరించ బూను దుష్టుడు భువిలో
వెరపును వీడియు దా కని
కరములు లేనట్టి వాడె కత్తులు దూసె న్ i
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమరణము అనివార్యం బనుకొని
రిప్లయితొలగించండిపరదారల వెంబ డించు భాగ్యం బందున్
సరియగు సమయము దొరకని
కరములు లేనట్టి వాఁడు కత్తుల దూసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణదోషం. "మరణ మ్మనివార్యంబని" అనండి.
విరిసిన వెన్నెల సొగసులు
రిప్లయితొలగించండికురిసిన తెలిమంచు సౌరు కోరెను చెలినే
పరిపరి విధముల యలిగిన
కరములు లేనట్టి వాఁడు కత్తుల దూసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విధముల నలిగిన' అనండి.
శ్రీ గురుభ్యో నమః
రిప్లయితొలగించండిగిరిసుతను సుందరాంగినిఁ
బరికింపగఁ బరమశివుడు పదునని త్వరితన్
మరుఁడేసెఁ దలిరుటాకులు
గరములు లేనట్టివాఁడు కత్తులు దూసెన్ !
పదును = సమయము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధరణిని ధర్మమున్ నిలుపి దానవ కోటిని ద్రుంచనెంచి తా
రిప్లయితొలగించండినరునిగ జన్మనెత్తిన జనార్దను డాతడె రామభద్రుడా
పరసతిఁ గోరు రావణుని పంచము జేయగ శాంతమూర్తి యా
కరములు లేనివాఁడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో.
ఆకరము = ఆగ్రహము, మదము, గర్వము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికరువు సమయాన రైతు తనకి పంట లేకపోయినా పక్క రైతు పంటకోయడానికి సాయపడెను అనే భావముతో 🙏
రిప్లయితొలగించండివిరివిగ పంటలు పోవఁగ
కరువిట తాండవము జేయఁ కలికాలమునన్
పర రైతుబతుకు కోరి యె
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్!
🙏🙏
మూడవ పూరణ 🙏
తొలగించండిశరణని వేడిన శత్రువు
శిరమును నరికిట రణమున శిధిలము జెయ్యన్
మరణము నెంచి జుగుప్సా
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'పరరైతు' దుష్టసమాసం.
🙏🙏
తొలగించండి🙏🙏
తొలగించండిఒక సజ్జనుని బోధ
రిప్లయితొలగించండిఅరకొర పూజల భక్తియె
కొరవడెనో కుజనులార!గుణసంవృద్ధిన్
తెరలుము సద్గతి యని సం
కరములు లేనట్టివాడు కత్తులు దూసెన్
సంకరము=కూడిక ఆం.భా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండికంటిచూపుతో చంపేస్తా!!
రిప్లయితొలగించండిపరుషపు పదజాలముతో
కరకగుజూపు బ్రసరించి కయ్యమునందున్
గరమున బెట్టిదపుం బరి
కరములు లేనట్టివాడు కత్తులుదూసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగతంలో ఇచ్చిన సమస్య.... "కంటిచూపుతో జంపెడి ఘనులు గలరు"
ధన్యవాదములు గురుదేవా నమస్సులు! కంటిచూపుతో కామునిగాల్చిన మన(ఘన) జంగమదేవర ఉన్నారుకదా!!
తొలగించండికరముల కొరకై తానే
రిప్లయితొలగించండిసారా , బీడీలనమ్ము సాధన జేయన్
పరిపాలనపై యే వ్యతి
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
కరము = కప్పము
వ్యతికరము = వ్యసనము
కత్తులు దూయు = గొడవ పెట్టుకొను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపర మతముల దయయును కని
రిప్లయితొలగించండికరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
పర మత సహనము జూపుటె
వరమని జాటుచు కవి యిటు పద్యము వ్రాసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితిరుమల వెంకటపతిపై
రిప్లయితొలగించండిపరిపరివిధములజగతినబలికిననీచున్
అరివీరభయంకరుడై
కరములులేనట్టివాడుకత్తులుదూసెన్
++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"జగతిని" అనండి.
రిప్లయితొలగించండికరములుమోడ్చిమ్రొక్కుకలికాలపుదైవమువెంకటేశుపై
తిరముగబుద్ధిలేనివొక తిక్కగుమంత్రియెవాగపిచ్చగా
నరములుపర్వులెత్తగను నాయకుడన్నదిలెక్కబెట్టకన్
కరములులేనివాడుచురకత్తులుదూసెనుయుద్ధభూమిలో
++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'లేని యొక' అనండి.
రిప్లయితొలగించండిఎట్లా పూరించాలో తెలియని వాడు రివర్స్ కత్తుల దూసెన్ :)
సరిసరి మీరేమన్నను
సరిసరి యే గురువరా! పసందుగ పూరిం
ప రచయితలు వత్తురు! పరి
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపరిపరి విధముల వేడెను
కరములు లేనట్టివాఁడు, కత్తుల దూసెన్,
శరణుశరణనిన వినకన్,
చరిత్ర హీనుడు క్రమించె సంగరమందున్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వినకయె' అనండి.
(గాంధీ - గాడ్సే)
రిప్లయితొలగించండిహరిజనులను కరుణ గనెను;
దొరజనులను తరిమె గాంధి; ధూర్తుల మార్చెన్;
పుర జనుడగు గాడ్సే, కని
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్.
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిసమస్య :-
రిప్లయితొలగించండి"కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్"
*కందం**
పరులను జంపెడు వృత్తిన
పరోప కారపు గుణములు ప్రక్కన నిడుచున్
మరణించె దరని దయ,కని
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
.......................✍చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వృత్తిని' అనండి.
విరుగగ చాపబాణములు భీతిలడే యభిమన్యుడంచు సం
రిప్లయితొలగించండిగరమున శత్రు పుంగవులు గర్జన జేసి పతాక సారధుల్
తురగము లన్ని గూల్చ ఘన దోర్బలుడంతట యుద్ధమందప
స్కరములు లేనివాఁడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅరయగ వీరులు భుజబల
శరీరులై రిపు గెలచుట సహజమె నెపుడున్
వెరవక రణమున నేయవ
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సహజమె యెపుడున్' అనండి.
ఒరు లేయవి యొన రించిన
రిప్లయితొలగించండిగర మప్రియముగను నెంచు కాపురుషుండై
పరుల యెడల సుంతయు శుభ
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపరమాత్ము నుంచి యెడఁదను
రిప్లయితొలగించండిధరణీశుఁడు విక్రముండు ధైర్యముతో శాం
కరి బలము దక్క సైన్య ని
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
కురుబల మెల్లఁ దల్లడిలఁ గుంతికి నిష్టుఁడు ఖడ్గ వీరుఁడే
భరత కులాగ్ర శేఖరుఁడు భండన దిక్కరి వానిఁ గాంచు మ
ద్దరి నకులుండు ధర్మజుని తమ్ముఁడు వీరుఁడు దాఁ దలంచ దు
ష్కరములు లేనివాఁడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఈ రోజు శంకరాభరణము వారి సమస్య
రిప్లయితొలగించండికరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్"
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
అభిమన్యు డుగ్రుడై య్యాలము లో నొక్క శరముతో రారాజు సంప రాయు
ని వధించె, బాణంబు నిడి శల్యు పుత్రుని పరిమార్చె ,,శకుని సోదరుని గాంచి
భీముడై వాజితో పేరడ గించె, సువర్చ,శృతంజయ వర భటులను
నాళీకములు తోడ నఱుకాడె, భీతుండై దుర్యోధనుండ నివార్యమనుచు
కర్ణునికి తెలిపి కపటముతో ధనువును కూల్చగ నభిమన్యుని కరమున
లేవు పుష్కరములు. లేనట్టి వాఁడు కత్తుల దూసె న్వెసన్, ద్రుహులపైన
కత్తి డాలును చేబట్టి కదన రంగ
మున దుమికి రిపులను దునుము సమయమున
ద్రోణుడు సుతుని తోగూడి త్రుంచగ, నభి
మన్యుడు రధ చక్రము బట్టి మాఱువెట్టె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినమస్కార పూర్వక ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండి"మహా" మాయ :) ఎప్పుడు తొలగునో :)
అరె! కాంగ్రెస్సెన్సీపీ
కరములు మేలనగ కంచుకంఠపు టజితుం
డరె యెన్సీపీ నేనని
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపుష్కరములు ,వాజి నాళీకము = బాణములు
రిప్లయితొలగించండికరమును నెయ్యముజూపుచు
రిప్లయితొలగించండిసరసములేనాడుచుండ చతురతతోడ
న్నరసితె చిత్రము నేయా
కరములులేనట్టివాడు కత్తులుదూసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమరణమె మేలను విధముగ
రిప్లయితొలగించండికరములు లేనట్టి వాడు కత్తులు దూసెన్.
పరిపరి మాటల యీటెల
దురమును చేయక పరుగిడె దురముగ తానున్.
దురము=యుద్ధము,వేగము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితిరముగజేయజాలడుతదేకపుదృష్టిని నేపనిన్సుమా
రిప్లయితొలగించండికరములులేనివాడు,చురకత్తులదూసెనుయుద్ధభూమిలో
గరమగుసాహసంబుననుగాంతయొకర్తె శత్రుమూకలున్
జెరియొకవైపుపర్వులిడజేసెనుభీకరరూపమొందుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణదోషం. "...యొకర్తెయె..." అనండి.
వెరువక కౌరవేశ్వరుని భీకర సైనిక సంచయమ్ములన్
రిప్లయితొలగించండిపొరిగొనె మేటి శత్రువుల పోరున ఫల్గుణసూను డల్లదే
అరయుడు వానిపౌరుషము నచ్చెరువౌను వయస్సు రెండు పు
ష్కరములు లేనివాడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో.
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువు గారు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్
సందర్భము:
శుభం హితం పవిత్రంచ
విభీషణ వచః ఖలు
ప్రతి జగ్రాహ నైవాఽ సౌ
మ్రియమాణ ఇవౌషధం
శుభమూ హితమూ పవిత్రమూ ఐన ధర్మాన్ని చెప్పాడు విభీషణుడు. చావు మూడిన వాడు ఔషధాన్ని వలె రావణుడు నిరాకరించాడు. (అధ్యాత్మ రామాయణం)
స బభూవ కృశో రాజా!
మైథిలీ కామ మోహితః
అసన్మానాచ్చ సుహృదాం
పాపః పాపేన కర్మణా
సాధ్వియైన సీతమ్మపై కామం.. సాధువైన విభీషణునిపై క్రోధం.. ఈ రెండు పాపాలవల్లనే రాజైన రావణుడు నశించిపోయాడు.. అన్నాడు వాల్మీకి.
నా మాటలు వినడు. పైగా తిడుతాడు.. అని రావణుని గురించి రామునితో చెబుతున్నాడు విభీషణుడు శరణు వేడుతూ.
"రామా! శరణు.. శరణు.. మంచి మాటలు చెబితే వినడాయె.. నా సోదరుడే పరు డాయె..(శత్రువాయె) ఆతడు చేసే పనులలో మేలు గూర్చేవి లేవాయె. నా మీద వూరకే కత్తులు దూస్తున్నాడు.. (తిట్టిపోస్తున్నాడు.)"
~~~~~~~~~~~~~~~~~~~~~~~
శరణు శరణు రామా! శ్రీ
కర! సూక్తులను వినడాయె గద! సోదరుడే
పరుడాయెఁ.. గార్యముల హిత
కరములు లేనట్టివాఁడు.. కత్తుల దూసెన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
25.11.19
-----------------------------------------------------------
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి