అందరికీ వందనములు ! అందరి పూరణలూ అలరించు చున్నవి ! అలరించ నున్నవి !
B-2) రాము(NTR) సినిమా లో వేశ్య యింటికి తండ్రీ కొడుకు లిద్దరూ ఒకరి తరువాత ఒకరు వెళతారు. కొడుకు రాగానే తండ్రి మంచం క్రింద దూరుతాడు: __________________________
పంచెను లాగి కట్టి తనువంతయు నివ్వెరపాటుతోడుగా మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు సభీతచిత్తుఁడై కొంచెము భార్య చిట్టెలుక కొత్తది దూరెను క్రింద పట్టు మా యంచును పెట్టగాపనిని హద్దరి బన్న విశేష మిద్దియే!
4 నుండి 14 అక్షరములు ఉండును. 6 పాదములు ఉండును. ప్రాస నియమం లేదు గణ లక్షణాలు : ఒకటవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును. రెండవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును. మూడవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును. నాలుగవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును. ఇదవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును. ఆరవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.
సందర్భము: దేవి మంచానికి వీళ్ళు భృతకులు.. భరించువారు.. మంచపు కోళ్ళు.. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః.. (సౌందర్య లహరి.. 92 వ శ్లో.) లలితా దేవియే రాముడు. శ్యామలా దేవియే కృష్ణుడు... అన్నది ప్రసిద్ధం.. "ఇతనికి దేవికిన్ దనరు నింతటి భేదము స్యూత భావనా తతముగ దేవియే యితడు తానగు.." ~ విశ్వనాథ రామాయణ కల్పవృక్షం (రావణుడు రాముని చూడగానే లలితా దేవిగా దర్శన మిచ్చినాడు. రావణుడు పై విధంగా అనుకున్నాడు. పైకే పలికినాడు.) "మించిన = తనను పరాక్రమంలో మించిన.. యుద్ధంలో అతిశయించిన.. విజృంభించిన రాముని చూసి దేవిగా తలపోసి బ్రహ్మ హరి రుద్రుడు ఈశ్వరుడు మంచం కోళ్ళుగా గలిగిన మంచం కింద రావణుడు జొరబడె.. అంటే బెంబేలెత్తి పోయినా డేమో! దాక్కున్నా డేమో! లేదా దేవియొక్క ఆశ్రయం పొందినా డేమో! ఇత డేమి మానధనుడు?.." అనుకొన్నాడు రావణుని సారథి రావణుని స్వగతం (పైకి వినిపించగా) విన్నాడు కాబట్టి.. మానధనుడే!.. అంటే మానధనుడా!.. అంటే కాడు.. అనే అర్థంలో.. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ మించిన రాముని లలితగ
నెంచి, మదిని రావణుడు హ రీశ్వర రు ద్రా
జాంచితులు కో ళ్ళయిన యా
మంచము క్రిందన్ జొరఁబడె.. మాన ధనుండే!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 28.11.19 -----------------------------------------------------------
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
వంచన చేసి వోటరుల వాసిగ జందెము నూని నవ్వుచున్
కొంచెము సిగ్గు వీడుచును కోవెల లందున దూరుచుండగా
దంచగ మోడి రాహులను దారిని గానక పారిపోవుచున్
మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు సభీతచిత్తుఁడై...
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండి🙏
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-1)
మంచం క్రింద మానధనుడు :
__________________________
చంచలయగు నొక చామయె
వంచించుచు విటుని గలియ - వల్లభు డొచ్చెన్ !
పంచెన్ తోడ్కొని యంతట
మంచము క్రిందన్ జొరఁబడె - మానధనుండే !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వచ్చె'ను 'ఒచ్చె' అనరాదు. "పతియే వచ్చెన్/వల్లభుడే రా..." అనండి.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వేరొక తీరు మోడి:
లంచములిచ్చి నేతలకు రాసుల రూకల నప్పుచేయుచున్
వంచన చేసి బ్యాంకులను వాసిగ నవ్వుచు మామ తోడుతన్
సంచుల నిండ వజ్రములు జంకక దోపుచు; లండనందునన్
మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు సభీతచిత్తుఁడై...
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండి🙏
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-1)
ముత్యాలముగ్గు సినిమా ప్రేరణగా :
__________________________
మంచిది, భర్త తోడ బహు - మక్కువ, మన్నన గల్గు దానినిన్
వంచన సేయనెంచి యొక - పాలసు డంతట సంధ్య వేళలో
మంచము క్రిందఁ జొచ్చె నభి - మానధనుండు సభీతచిత్తుఁడై !
త్రుంచగ నమ్మకమ్ము, తన - రుచ్యుడు చూడగ పర్వు లెత్తెనే
కించితు భీతి లేక, భయ - కీలల దిగ్భ్రమమామె పొందగన్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివంచన చేయుచు జగతిని
రిప్లయితొలగించండిసంచల నమురేపి దొంగ సన్యాసు లట
న్నంచెల వారిగ బుట్టగ
మంచము క్రిందన్ జొరఁబడె మాన ధనుండే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-2)
రాము(NTR) సినిమా లో
వేశ్య యింటికి తండ్రీ కొడుకు లిద్దరూ ఒకరి తరువాత ఒకరు వెళతారు.
కొడుకు రాగానే తండ్రి మంచం క్రింద దూరుతాడు:
__________________________
మించిన ప్రేమతోడ నొక - మేలిమి బంగరు కంఠహారమున్
చంచల యైన వేశ్యకిడ - చక్కగ జేరెను తండ్రి; యంతటన్
సంచిత మైన సొమ్ము గడ - సానికి నివ్వ తనూజు డేగగాన్
మంచము క్రిందఁ జొచ్చె నభి - మానధనుండు సభీతచిత్తుఁడై !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-3)
మంచె మీద నుండి భయంతో క్రిందికి దూకిన రైతు :
__________________________
మించిన పంట జూడ కడు - మిక్కిలి జాగ్రతచేయు కోసమై
మంచిగ జొన్నచేను కడ - మర్కట మూకల పారదోలగన్
మంచియ మీద కూర్చొనగ - మర్కమ మొక్కటి ఫూత్కృతించగన్/కోపగించగన్
మంచము క్రిందఁ జొచ్చె నభి - మానధనుండు సభీతచిత్తుఁడై !
__________________________
మంచము = మంచె
మంచియ, మంచె = కూర్చుండుటకై యెత్తుగా వేసెడు పందిరి
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మర్కమము = పాము
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమర్కము శబ్దం ఉంది కాని మర్కమము లేదు. "మర్క మదొక్కటి/ మర్కము చేరియు..." అనండి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-4)
కన్యాశుల్కము ప్రేరణగా :
__________________________
పంచెను గట్టినట్టి యొక - పంతులు-బోనముకత్తె యుండగన్
చంచలు డైనయట్టి మహ - చక్కనివాడు గిరీశు డేగగన్
చించిలికంబు లేని కడు - చీకటి నిండిన; సంశయాత్మతో
మంచము క్రిందఁ జొచ్చె నభి - మానధనుండు సభీతచిత్తుఁడై !
__________________________
చించిలికము = మృదుమారుతము
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"భోగిని యింట నుండగన్" అంటే బాగుంటుందేమో?
రిప్లయితొలగించండికొంచెము తూగుచు, జోగుచు
కొంచెము, జారుచు మరింత కొంచెము మంచెం
బంచున సర్రున నరరే
మంచము క్రిందన్ జొరఁబడె మానధనుండే!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపంచన బడితిరు గాడెడు
రిప్లయితొలగించండిచుంచెలుకను తరుమనెంచి శూరుని వోలెన్
పంచెను బిగగట్టి వడిన
మంచము క్రిందన్ జొరఁబడె మానధనుండే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వడిని/వడిగ" అనండి.
అంచితమైన సద్యశము లందిన వానిని బండితోత్తమున్
రిప్లయితొలగించండిబంౘను జేరి పిల్చె తన పౌత్రుడు దాగుడుమూత లాడగన్
గాంచుడు చిక్క కాత డతికాయుడు శీఘ్రము శబ్దశూన్యుడై
మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు వివేకవంతుఁడై.
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపంచెను లాగి కట్టి తనువంతయు నివ్వెరపాటుతోడుగా
మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు సభీతచిత్తుఁడై
కొంచెము భార్య చిట్టెలుక కొత్తది దూరెను క్రింద పట్టు మా
యంచును పెట్టగాపనిని హద్దరి బన్న విశేష మిద్దియే!
జిలేబి
మనోరంజకమైన పూరణ. బాగుంది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశరషట్పద వృత్తము
మంచము క్రిందన్
జొరఁబడె మానధ
నుండే చిట్టెలుకను బట్టన్
పెండ్లాము జిలే
బి యానగా భీ
తిలి జలదరింపుల తోడుగా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ వృత్తం లక్షణం?
తొలగించండిశర షట్పద పద్య లక్షణములు
జాతి(షట్పదలు) రకానికి చెందినది
4 నుండి 14 అక్షరములు ఉండును.
6 పాదములు ఉండును.
ప్రాస నియమం లేదు
గణ లక్షణాలు :
ఒకటవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
రెండవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
మూడవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.
నాలుగవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
ఇదవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును.
ఆరవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.
తొలగించండిఆహా యెంతహాయి
రాసుకుంటా పోవచ్చు :)
రెండు నాల్గు మాత్రలు
రెండు నాల్గు మాత్రలు
మూడు నాల్గు మాత్రలు ఒక రెండు మాత్రలు :)
రిపీట్ మాడి
ప్రాస యతుల ఝంఝాటము లేదోయ్ :)
జిలేబి
తొలగించండికోతి కరము చి
క్కెను కొత్త కొబ్బ
రిముక్క మరియిక యేమిజరుగు
నోయెవ రికెరుక
పదమ్ము లువిరుగు
నటునిటు పరుగులిడగ సుమ్మీ
వంచన జేయుచు తన పతి
రిప్లయితొలగించండిచంచల యై పర పురుషుని సరసము గోర న్
కొంచము సవ్వడి కాగా
మంచము క్రింద న్ జొర బడె మాన ధనుం డే a
బాగుంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిమీ పూరణ ఇలా ఉంటే ఇంకా బాగుంటుందని నా సూచన......
వంచన జేసి తన సతిని
చంచలుడై పరసతి గని సరసము గోరన్
కొంచము సవ్వడి కాగా
మంచము క్రిందన్ జొరబడె మానధనుండే
చక్కని సూచన సార్ ధన్యవాదాలు
తొలగించండిసరదా పూరణము 😀🙏
రిప్లయితొలగించండిమంచము క్రిందన్ జొరఁబడె మానధనుండే
కం::
మంచిగ పెండ్ల పిదప బహు
మంచిగ నంపె గదిలోకి మంచము పైకున్
కొంచెము బిడియము చేరగ
మంచము క్రిందన్ జొరఁబడె మానధనుండే
🙏🙏
పెండ్లి
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బహు మంచిగ' దుష్టసమాసం. "కడు మంచిగ.. మంచముపైకిన్..." అనండి.
🙏🙏
తొలగించండి( రారాజు దుర్యోధనుడు సర్వం కోల్పోయి
రిప్లయితొలగించండితుదకు ద్వైపాయనహ్రదంలో దాగినాడు )
మించిన ప్రేమ దమ్ములను
మేదురరీతిని గాంచువాడునై ;
వంచన లేక పౌరులను
వాంఛితపూర్ణుల జేయువాడునై ;
యెంచ వెలుంగు రాజు నిపు
డేమనవచ్చు ? మహాహ్రదంబునా
మంచము క్రింద జొచ్చె ; నభి
మానధనుండు ; సభీతచిత్తుడై .
(మహాహ్రదంబునా - పెద్దమడుగు అనే
మంచం ; మేదురరీతి - చక్కని విధం )
మీ పూరణ ప్రశస్తంగ ఉన్నది. అభినందనలు.
తొలగించండిసంచితమైన పాపములు ,సర్వమునాతనికగ్నికీలలై
రిప్లయితొలగించండిముంచుచునుండెబూడిదన,ముప్పునుయాతడుదల్చకుండగా
పంచుదమన్నరారెవరు,పాపముదెల్సినతోడనాతడే
మంచముకిందజొచ్చె,నభిమానధనుండువివేకవంతుడై
***********************
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ముప్పును నాతడు...పాప మెరింగిన తోడ..." అనండి.
సంచిత పాపకర్మములు ,సర్వమునాతనికగ్నికీలలై
తొలగించండిముంచుచునుండెబూడిదన,ముప్పున నాతడుదల్చకుండగా
పంచుదమన్నరారెవరు,పాపమెరింగిన తోడనాతడే
మంచముకిందజొచ్చె,నభిమానధనుండువివేకవంతుడై
-----------------------
[సవరణ పాఠము ధన్యవాదాలతో]
పంచెద పాపసంపదను, పాపముపేదలు రండిరండనన్
రిప్లయితొలగించండిఉంచుముయన్నినీకడనె ,ఉట్టినిగట్టుముపొమ్ముపొమ్మనన్
కొంచెముగానుబుద్ధిగను,కోర్కెలనన్నిటి దుంచమేలనన్
మంచముకిందజొచ్చె,నభిమానధనుండువివేకవంతుడై
+++++++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఉంచుము + అన్ని' అన్నపుడు యడాగమం రాదు.
పంచెద పాపసంపదను, పాపముపేదలు రండిరండనన్
తొలగించండిఉంచుము దాని నీకడనె ,ఉట్టినగట్టుము,సొమ్ముపొమ్మనన్
కొంచెము గానుబు ద్ధిమెయి ,కోర్కెల సంఖ్యల దుంచమేలనన్
మంచముకిందజొచ్చె,నభిమానధనుండువివేకవంతుడై
---------------
[సవరణ పాఠము ధన్యవాదాలతో]
వంచితుడై కోల్పోవగ
రిప్లయితొలగించండిసంచితసంపద గృహస్థు సంకటపడి యే
తెంచగ ఋణదాతలు తన
మంచము క్రిందన్ జొరబడె మానధనుండై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధనన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండినడిరోడ్డున ప్రతి పక్షము వారి పంచెలూడదీసెదనన్న సందర్భము:
రిప్లయితొలగించండిపంచెల తొలగించెదనని
దంచిన యా నేతపయిన దాడులు జరుపన్
కొంచెమయిన సిగ్గు బడక
మంచము క్రిందన్ జొరఁబడె ; మానధనుండే ?
దంచు = వ్యర్థవాక్యములాడు.
మంచము క్రింద జొరబడు = దాగుకొను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండిలాంచన మంచు జెప్పుచు విలాసపు జీవిత మెంచు పెద్దలే
సంచుల దోచుచుండగ ప్రజాధనమున్ గొని గద్దె, సూన పె
ళ్లంచును చేయిజాపు నసహాయుని గాలము వైచి పట్టగన్
మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు సభీతచిత్తుఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం.
రిప్లయితొలగించండివంచన జేయుచు మిక్కిలి
లంచము గడియింపనెపుడు డంబము మీరన్
పంచన జేరగ ఐటీ
మంచము క్రిందన్ జొరబడె మానధనుండే
వై. చంద్రశేఖర్
ఐ టీ =Income Tax Dept.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివచ్చే శనివారపు ఆకాశవాణి సమస్యను తెలుపగలరు
రిప్లయితొలగించండి"వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె తినందగు నిర్భయమ్ముగన్"
తొలగించండిpadyamairhyd@gmail కు ఈరోజు సాయంత్రంలోగా పంపండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిమంచిదటంచుకొంటినిదె మంచము, పూవులరేకులెన్నొ చ...
ల్లించితి , మేను వాల్చి పవళింపగ, సందులనుండి నల్లి బా...
ధించుచునుండె, గన్గొనగ దీనిని చిక్కదు! ఛీ! యటంచు దా
మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు సభీతచిత్తుఁడై"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఇంచుక చనువునునీయగ
రిప్లయితొలగించండిగంచుకమునుదాకుచుండ కాలునివోలెన్
బంచన గనిపించగబతి
మంచముక్రిందన్జొరబడె మానధనుండే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమించిన పేర్మి మనుమనా
రిప్లయితొలగించండిడించుచు తాతయు శిశువయె, ఢింభకు నాటన్
వంచన జేయు నెపంబున
మంచము క్రిందన్ జొరఁబడె మానధనుండే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంచుల నిండ ధనమ్మును
రిప్లయితొలగించండిబంచ జనులకు దిగు లొంది బంధువు లనఁగా
వించు ముఖచ్యుతపుఁ బలుకు
మంచము, క్రిందన్ జొరఁబడె మానధనుండే
[మంచము = పోషించము]
మించిన దొడ్డ మెర్ములను మేదిని యుర్ముల దద్దరిల్లగన్
ముంచుచు నెల్ల దిక్కులను భూతల మందుఁ బడంగ వర్షమే
కంచెకుఁ బ్రక్క నిద్రకు సుఖమ్మిడ వేసిన తల్పరాజ మా
మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు సభీతచిత్తుఁడై
[మంచము = మంచె]
మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిసరదాగా...
రిప్లయితొలగించండికొంచెము కూడ లే దచట కూర్చొన నైనను చో టదెట్టులో
పంచను సర్ది వస్తువుల పట్టెడ మంచము వేసినారు రం
డంచును మంచకాశ్రయము లాయన బట్టుక పీల్చ రక్తమున్
మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు సభీతచిత్తుఁడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅంచన లెల్ల మారెనని యాధునికమ్మని నేడు చెప్పుచున్
రిప్లయితొలగించండిముంచిరి సాంప్రదాయమును, పూర్వులు మెచ్చిరటంచు నాతడే
పంచను గట్టి వెళ్ళఁ గని బావలు గేలిని సేయ సిగ్గుతో
మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు సభీత చిత్తుడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇంచుకనీయగాచనవు నేకమయౌటకుసిద్ధమౌయెడన్
రిప్లయితొలగించండిబంచనలీలగాగనగ బాహుబలాఢ్యునినొక్కనిన్వెసన్
మంచముక్రిందజొచ్చెనభిమానధనుండు సభీతచిత్తుడై
మంచిగనుండగోరుదును మానినులయ్యెడ నెల్లవారునున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివంచనజేయ మిత్రులు తనభాగ్యమునంతయు గోలుపోవగా
రిప్లయితొలగించండిసంచితమౌ ఋణంబు గడుసంకట పెట్టగ ఖిన్నుడౌచు నే
తెంచగ ద్రవ్యదాతలట దీనతనొందుచు భార్యసాయమున్
మంచము క్రిందజొచ్చె నభిమానధనుండు సభీతచిత్తుడై!
కందం
రిప్లయితొలగించండిపంచుచు భువిపై వెన్నెల
వంచన తోడ గురు పత్ని వాటుకుఁ జన నే
తెంచిన గురుఁగని సోముఁడు
మంచము క్రిందన్ జొరఁబడె! మానధనుండే?
వంచన చేయుచు పరులను
రిప్లయితొలగించండిసంచితమొనరించుకొనుచు చక్కగ ధనమున్
పొంచిన పోలీసులు రాన్
మంచము క్రిందకు చొరబడె మానధనుండే
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
మంచము క్రిందన్ జొరఁబడె మానధనుండే
సందర్భము: దేవి మంచానికి వీళ్ళు భృతకులు.. భరించువారు.. మంచపు కోళ్ళు..
గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః..
(సౌందర్య లహరి.. 92 వ శ్లో.)
లలితా దేవియే రాముడు.
శ్యామలా దేవియే కృష్ణుడు...
అన్నది ప్రసిద్ధం..
"ఇతనికి దేవికిన్ దనరు నింతటి భేదము స్యూత భావనా తతముగ దేవియే యితడు తానగు.."
~ విశ్వనాథ రామాయణ కల్పవృక్షం
(రావణుడు రాముని చూడగానే లలితా దేవిగా దర్శన మిచ్చినాడు. రావణుడు పై విధంగా అనుకున్నాడు. పైకే పలికినాడు.)
"మించిన = తనను పరాక్రమంలో మించిన..
యుద్ధంలో అతిశయించిన..
విజృంభించిన
రాముని చూసి దేవిగా తలపోసి బ్రహ్మ హరి రుద్రుడు ఈశ్వరుడు మంచం కోళ్ళుగా గలిగిన మంచం కింద రావణుడు జొరబడె.. అంటే బెంబేలెత్తి పోయినా డేమో! దాక్కున్నా డేమో! లేదా దేవియొక్క ఆశ్రయం పొందినా డేమో! ఇత డేమి మానధనుడు?.."
అనుకొన్నాడు రావణుని సారథి రావణుని స్వగతం (పైకి వినిపించగా) విన్నాడు కాబట్టి..
మానధనుడే!.. అంటే మానధనుడా!.. అంటే కాడు.. అనే అర్థంలో..
~~~~~~~~~~~~~~~~~~~~~~~
మించిన రాముని లలితగ
నెంచి, మదిని రావణుడు హ రీశ్వర రు ద్రా
జాంచితులు కో ళ్ళయిన యా
మంచము క్రిందన్ జొరఁబడె..
మాన ధనుండే!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
28.11.19
-----------------------------------------------------------
పంచన జేరిన పడతిని
రిప్లయితొలగించండివంచించిన కపటికి గుణపాఠము నేర్పన్
పంచగ చీపురు దెబ్బలు
మంచము క్రిందన్ జొరఁబడె మానధనుండే
పంచుటదేమిగొప్పయగు?పంచెడుదంతయు రాష్ట్ర సంపదే
రిప్లయితొలగించండికంచెలదాటు దానములు,కంతలుబెట్టుఖజానకెప్పుడున్
సంచులకొద్ది రత్నములు,సంపదబెంచదు నెప్పుడేననన్
మంచముకిందజొచ్చె,నభిమానధనుండువివేకవంతుడై.