..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య 🤷♀.................... వ్యాధి నయ మొనర్చు న్యాయవాది
సందర్భము: ప్రదీయతాం దాశరథాయ మైథిలీ..(రామునకు సీత నిమ్ము..) అని సర్వ వినాశనం సంభవించక ముందే జాగ్రత్త వహించు మని రెండు సార్లు యుక్తి యుక్తంగా నొక్కి చెప్పినాడు విభీషణుడు. అన్ని విధాలా చెప్పి చివరి మాటగా.. నరేంద్ర పుత్రాయ దదాయ పత్నీమ్.. (రామునికి పత్నిని అప్పజెప్పుదాము.) అనీ అన్నాడు. రావణుడు వినలేదు. సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః (రాజా! ఇచ్చకా లాడే వా రెప్పటికీ లభిస్తారు. వినడాని కింపు కాకున్నా మేలు చేసే మాటలు చెప్పే వాడూ వినే వాడూ కూడా దుర్లభుడే!) అన్నాడు. విభీషణుడు కేవలం న్యాయ మేదో చెప్పి చేతులు కట్టుకొని కూర్చోలేదు కుంభ కర్ణునిలాగా.. తన హితోక్తులు వృథా యైన వెంటనే ప్రయత్నించి రాము నాశ్రయించినాడు. ఎవరినైనా ఆశ్రయించవచ్చు. శత్రువు నాశ్రయించటం వారి నమ్మకాన్ని పొందటం అనేవి మామూలు విషయా లేమీ కావు. కేవల న్యాయవాదిగానే కాక వైద్యునిగాను మారినాడు విభీషణుడు. మందు వేసుకోమంటే వేసుకో నన్నాడు రోగి. శస్త్ర చికిత్స చేసైనా సరే వ్యాధి నిర్మూలనం చేసి తీరుతా నని అలాగే చేసినాడు విభీషణుడు. రామ బాణ మనే శస్త్రచికిత్స చేత రావణునిలోని కామ మనే రోగాన్ని నయం చేయటాని కుపక్రమించే వైద్యు డైనాడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఆ విభీషణుండు న్యాయవాదియె కాదు.. వసుధలోనను ఘన వైద్యు డగును.. రామబాణమునను రావణ కామ మన్ వ్యాధి నయ మొనర్చు న్యాయవాది
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 18.11.19 -----------------------------------------------------------
వైద్యుడనవరతము వచ్చిన జనముల
రిప్లయితొలగించండివ్యాధి నయ మొనర్చు, న్యాయవాది
సతత ము దరి చేరు జనులను జలగల
వలె రుధి రము పీల్చి వ్యాధి నిడును
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
మేధను తొల్చి వేయుచును మేకల రూకల పాడి పంటలన్
క్రోధము నిచ్చి మానసము క్రుంగగ జేయుచు తాపమిచ్చెడిన్
బాధలు వ్యాజ్యమందునను బాదర బందిని జేయుచుండునా
వ్యాధిని న్యాయవాదియె నయం బొనరించును వాగ్బలంబునన్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి*అమాత్యుని ఉద్బోధ*
బాధలు దీర్చువాడనని పల్కుచు నెన్నికలందు గెల్చి , నీ
బోధను నమ్ము లోకులను మూర్ఖులుగా గణియించు రాజ !
రా...
జ్యాధికృతప్రమత్తత నయక్షయమై కనుచూపు పోవుచో..
వ్యాధిని న్యాయవాదియె నయం బొనరించును వాగ్బలంబునన్.!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తమ్ముడక్రమముగ తనదాస్తి కాజేయ
రిప్లయితొలగించండినామయావి యైన నతని గాంచి
బాధ వలదటంచు వచియించి నీమనో
వ్యాధి నయ మొనర్చు న్యాయవాది.
(ఆమయావి....రోగి)
మేను కున్న జబ్బు మించు నంతవరకు
రిప్లయితొలగించండివైద్యు డెపుడు మెలగు వ్యాప రించు
కోర్టు చుట్టు త్రిప్పి కోట్లుకోరు కొనుచు
వ్యాది నయ మొనర్చు న్యాయ వాది
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
క్రోధము నందునన్ మనసు క్రుంగగ మోడిని తిట్టిపోయగా
శోధన జేయుచున్ పడతి జుత్తును పట్టుచు కోర్టుకీడ్చగా
బాధను కాళ్ళు పట్టమని బంధువు లెల్లరు ప్రోత్సహించ నా
వ్యాధిని న్యాయవాదియె నయం బొనరించును వాగ్బలంబునన్
పడతి = Meenakshi Lekhi
న్యాయవాది = AM Singhvi
https://www.google.co.in/amp/s/www.indiatoday.in/amp/india/story/supreme-court-rahul-gandhi-chowkidar-chor-hai-contempt-apology-case-closed-1618779-2019-11-14
(న్యాయస్థాన రణరంగంలో బాధితార్జునుని బాధలు
రిప్లయితొలగించండిపోగొట్టే ప్రతిభాకృష్ణుడే న్యాయవాది )
యోధుని వోలె వాదమిడి
యొక్కడె పోరును సల్పి కోర్టులో ;
మేధను నైగనిగ్యములు
మెండుగ నిండగ న్యాయసూత్రముల్
శోధన జేసి బాధితుని
శోకము నార్తిని నాతృతన్ మనో
వ్యాధిని , న్యాయవాదియె న
యం బొనరించును వాగ్బలంబునన్ .
రోగ బాధ దీర్ప వేగమె వైద్యుడు
రిప్లయితొలగించండివ్యాధి నయ మొనర్చు : న్యాయ వాది
తగవు లన్ని తీర్ప తన దైన శైలి లో
వాదన లను జేయు పలు విధాల
మేను నొచ్చి నపుడు మేలుగ వైద్యుడు
రిప్లయితొలగించండివ్యాధి నయ మొనర్చు ; న్యాయవాది
న్యాయము జరిపించు వ్యాజ్యము నడిపించి
న్యాయమూర్తి యెదుట న్యాయమడిగి
వాదనలను జేసి పలువిధమ్ములుగను
రిప్లయితొలగించండిబ్రజలమనసుమిగుల రంజిలునటు
మంచితీర్పునిచ్చి మానసికంబగు
వ్యాధినయమొనర్చు న్యాయవాది
ఆ.వె//
రిప్లయితొలగించండిభ్రాంతి దీర్చువాడు ప్రాణదుడైనచో
వ్యాధి నయ మొనర్చు, న్యాయవాది !
వాదన వినిపించి వ్యాజము చేతను
సంతసంబు నింపు సద్యముగను !!
లంచగొండితనము ప్రబలె సంఘము నందు
రిప్లయితొలగించండినంటు వ్యాధి వోలె యన్ని విధుల
వైద్యుడౌచు తనదు వాదమ్ము వినిపించి
వ్యాధి నయ మొనర్చు న్యాయవాది
తగవులబడి భూమి తగలడి పోవగ
రిప్లయితొలగించండికోర్టు కేసులనుచు గుబులు తోడ
శయ్య బడగ గేహి, స్వాంతన మిడి, మనో
వ్యాధి నయ మొనర్చు న్యాయవాది
దనపిశాచి బిగియ తగులు కున్నట్టిదౌ
రిప్లయితొలగించండిసంఘ జీవనమును సంస్కరింప
న్యాయ విద్య నేర్చి సాయమందించుచు
వ్యాధి నయ మొనర్చు న్యాయవాది
గాధలు వేనవేలు గనగా,జగమందున న్యాయశాలలో
రిప్లయితొలగించండిబాధయె కాల్చు నంతమున వాజ్యము గెల్చిన నోడినన్ సదా!
అంధులమైన గర్వమున నార్థికమౌ స్థితినందు నట్టిదౌ
వ్యాధిని న్యాయవాదియె నయం బొనరించును వాగ్బలంబునన్
దేహమందు ముదురు దీర్ఘపు వ్యాధుల
తొలగించండిపీచమణిచి వేయు వెజ్జు డెపుడు!
దేశమందు ప్రబలు తీవ్రపు యవినీతి
వ్యాధి నయ మొనర్చు న్యాయవాది!!
వీటి కెల్ల గొప్ప పేరున్న వైద్యుఁ డి
రిప్లయితొలగించండితండు చేతి వాసి మెండు కూడ
వీడు మయ్య చింత నే డిఁక నీకున్న
వ్యాధి నయ మొనర్చు న్యాయవాది!
ఈ ధర లోన సంతతము నీసు నసూయయు నాశ లెంచఁగా
బాధల కెల్ల హేతువులు వాటిని గెల్చిన దక్కు సౌఖ్యముల్
క్రోధుని మూర్ఖ శేఖరుని కుత్సిత సంచిత దుష్ట వాద దు
ర్వ్యాధిని న్యాయవాదియె నయం బొనరించును వాగ్బలంబునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమేధనుసానబెట్టియునుమీరకహద్దులనెల్లవేళలన్
రిప్లయితొలగించండిశోధనజేసిన్యాయమగుసూత్రములన్నియు జెప్పువారునున్
బాధలుదీర్చువారనుచువ్యాజ్యము జెప్పినచోదగన్
వ్యాధిని న్యాయవాదియెనయంబొనరించునువాగ్బలంబునన్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
వ్యాధి నయ మొనర్చు న్యాయవాది
సందర్భము:
ప్రదీయతాం దాశరథాయ మైథిలీ..(రామునకు సీత నిమ్ము..) అని సర్వ వినాశనం సంభవించక ముందే జాగ్రత్త వహించు మని రెండు సార్లు యుక్తి యుక్తంగా నొక్కి చెప్పినాడు విభీషణుడు.
అన్ని విధాలా చెప్పి చివరి మాటగా.. నరేంద్ర పుత్రాయ దదాయ పత్నీమ్.. (రామునికి పత్నిని అప్పజెప్పుదాము.) అనీ అన్నాడు. రావణుడు వినలేదు.
సులభాః పురుషా రాజన్
సతతం ప్రియవాదినః
అప్రియస్య తు పథ్యస్య
వక్తా శ్రోతా చ దుర్లభః
(రాజా! ఇచ్చకా లాడే వా రెప్పటికీ లభిస్తారు. వినడాని కింపు కాకున్నా మేలు చేసే మాటలు చెప్పే వాడూ వినే వాడూ కూడా దుర్లభుడే!) అన్నాడు.
విభీషణుడు కేవలం న్యాయ మేదో చెప్పి చేతులు కట్టుకొని కూర్చోలేదు కుంభ కర్ణునిలాగా.. తన హితోక్తులు వృథా యైన వెంటనే ప్రయత్నించి రాము నాశ్రయించినాడు. ఎవరినైనా ఆశ్రయించవచ్చు. శత్రువు నాశ్రయించటం వారి నమ్మకాన్ని పొందటం అనేవి మామూలు విషయా లేమీ కావు.
కేవల న్యాయవాదిగానే కాక వైద్యునిగాను మారినాడు విభీషణుడు. మందు వేసుకోమంటే వేసుకో నన్నాడు రోగి. శస్త్ర చికిత్స చేసైనా సరే వ్యాధి నిర్మూలనం చేసి తీరుతా నని అలాగే చేసినాడు విభీషణుడు.
రామ బాణ మనే శస్త్రచికిత్స చేత రావణునిలోని కామ మనే రోగాన్ని నయం చేయటాని కుపక్రమించే వైద్యు డైనాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఆ విభీషణుండు న్యాయవాదియె కాదు..
వసుధలోనను ఘన వైద్యు డగును..
రామబాణమునను రావణ కామ మన్
వ్యాధి నయ మొనర్చు న్యాయవాది
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
18.11.19
-----------------------------------------------------------
తగువు లాడు చుండ దాయాదులు కనలి న్యాయమూర్తి వద్ద నద్భుత ముగ నిలచి వాదనముల సలిపి, మానసిక మౌ వ్యాధి నయమొనర్చు న్యాయవాది
రిప్లయితొలగించండినీ ధన మున్ హరింతురిక నేస్తపు గాళ్ళని క్రుంగుచుంటివే
రిప్లయితొలగించండిశోధన లెన్నొ జేసి పరిశోధకు లెందరొ తెల్పిరే మనో
వ్యాధికి మందు లేదిలను వైద్యుల కన్నను చక్కగా మనో
వ్యాధిని న్యాయవాదియె నయం బొనరించును వాగ్బలంబునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికంది శంకరయ్య గారికి నమస్సుమాంజలులు ఇది నా మొదటి ఉత్పలమాల పద్యం మీరు తప్పక సవరణ చేయవలెను
రిప్లయితొలగించండిఉత్పలమాల
రోదిఁచె బాధతో మదిని రోగము చేవ్యథ చెందుచుం డగన్
వ్యాధిని మందుతో హరిఁచి వైద్యము సేయఁగ బాథతీ ర్చగన్
వేదిక నెక్కుచున్ వివిధ. వేషము వేసెడి మానవున్ మనో
వ్యాధిని న్యాయవాదియె నయం బొనరించును వాగ్బలంబునన్
కంది శంకరయ్య గారికి నమస్సుమాంజలులు ఇది నా మొదటి ఉత్పలమాల పద్యం మీరు తప్పక సవరణ చేయవలెను
రిప్లయితొలగించండిఉత్పలమాల
రోదిఁచె బాధతో మదిని రోగము చేవ్యథ చెందుచుం డగన్
వ్యాధిని మందుతో హరిఁచి వైద్యము సేయఁగ బాథతీ ర్చగన్
వేదిక నెక్కుచున్ వివిధ. వేషము వేసెడి మానవున్ మనో
వ్యాధిని న్యాయవాదియె నయం బొనరించును వాగ్బలంబునన్
ఆస్తి యక్రమముగనన్యుల పాలైన
రిప్లయితొలగించండిన్యాయమూర్తిముందు నియతితోడ
వాదనలనుసలిపి వేదనపోకార్చి
వ్యాధి నయ మొనర్చు న్యాయవాది
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగోదనదించివాదులను,గోడకు గొట్టిన సున్నమై చనన్
రిప్లయితొలగించండిమేధకు మేలుగాపదును,మేదినబెట్టెడువాడు శూరుడై
నీదయమాకుచాలునను, నిస్పృహనందునముంచునాతడే
వ్యాధిని న్యావాదియె, నయంబొనరించును వాగ్బలంబునన్
తగువు లాడు చుండ దాయాదులు కనలి
రిప్లయితొలగించండిన్యాయమూర్తి వద్ద నద్భుత ముగ
నిలచి వాదనముల సలిపి, మానసిక మౌ
వ్యాధి నయమొనర్చు న్యాయవాది
ఆదిన ఆస్తిపంపకము, అందరునచ్చెడురీతిజేయగా
రిప్లయితొలగించండివాదనయందుగొప్పయని,వ్యాజ్యమువేయగ జేసెనాతడే
మేదిన మోసకారి యయి, మెండుగజేసెను మాకుక్షౌరమా
వ్యాధిని న్యాయవాదియె, నయంబొనరించును వాగ్బలంబునన్
నాధుని లెక్కచేయక సనాతన ధర్మము మంటఁ గల్పుచున్
రిప్లయితొలగించండిబాధలు పెట్టుచున్ మెలఁగు పత్ని కతమ్మున గొన్న దౌ మనో
వ్యాధిని న్యాయవాదియె నయం బొనరించును వాగ్బలంబునన్
శోధన చేసి సత్యమును చూపుచు తీర్పరికిన్ నిజమ్ము తాన్
ఆటవెలది
రిప్లయితొలగించండివరుస న్యాయశాస్త్ర, వైద్యశాస్త్రమ్ముల
రాటుదేలి నట్టి ప్రముఖుఁడతఁడు
వీరి చేత నోడి జారి పడిన వారి
వ్యాధి నయ మొనర్చు న్యాయవాది
ఆస్తి పంపకాలు ఆందోళనమొనర్చ
రిప్లయితొలగించండిఅంధకారమయ్యె ఆలిమనసు
అసలు మర్మమెఱుగ అవగతమ్మగు మనో
వ్యాధి నయ మొనర్చు న్యాయవాది!!