(అయ్యప్పస్వామికి భక్తుల విన్నపం ) " శరణము స్వామి ! నీవు మము జల్లగ జూడుము నెల్లవేళ ; నీ చరణములే కదా మదుల జక్కగ నిల్పితిమయ్య ! మాయ సం వరణమునందు నుంటిమి ; ని వారణ జేయు " మటంచు భక్తి నా మరణము గోరుకొందురట మానవులెల్లరు ముక్తకంఠులై .
అరచుచు మోడి చోరుడని హైరన నొందుచు వాడవాడలన్ పరుగులు పెట్టి జందెమును భారత మాతకు చుట్టి వేడ్కతో వరుడగు సోని పుత్రుడిట వర్ధిలు వేళ ప్రధాన మంత్రియై మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై...
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో "తరుణమ్మనుకొని కరుణను విడిచి" అనండి. రెండవ పూరణలో 'పరితరియించెడి'? మూడవ పూరణలో 'సమయాన్నే' అనడం సాధువు కాదు. "సమయమ్మున" అనండి.
సందర్భము: మారుతి సంజీవనీ పర్వతాన్ని తెచ్చేటపుడు విఘ్నం కలిగించమని రావణుడు చెబితే "సీతాం ప్రయచ్ఛ రామాయ.." (రామునికి సీత నిమ్ము.) అని కాలనేమి చెప్పినాడు. (అధ్యాత్మ రామాయణం..యుద్ధకాండం 6 స. 46 శ్లో) ఇతః పరం వా వైదేహీం ప్రేషయస్వ రఘూత్తమే అధ్యాత్మ రామాయణం.. (యుద్ధ కాండం.. 10 స. 54 శ్లో) ఇకనైనా సీతను రాముని వద్దకు పంపించు.. అని మండోదరి చెప్పినది. ఇంకా విభీషణుడు కుంభకర్ణుడూ చెప్పినాడు.. ఎవరు చెప్పినా రావణుడు వినలేదు.
ధర్మప్రియులు నరులు. నరులంటే మానవులు. ధర్మాధర్మ విచక్షణ లేని వారు అసురులు. అసురులంటే రాక్షసులు. అసురులతో నరుల కెప్పుడూ బాధ లుండనే వుంటవి. రావణాదులు రాక్షసులు. రామాదులు మానవులు. మానవుల ధన మాన ప్రాణాదులను దోచుకోవటం రాక్షసుల సరదా.. ఐతే ఆ యుగంలో నర నారీ పీడాసక్తుడు ఒక్క రావణుడే కనిపిస్తున్నాడు. కాబట్టి ఒక్క రాము డవతరించడంతో సరిపోయింది. కాని ఈనా డడుగడుగునా నారీ పీడాకరు లంటే స్త్రీలను పీడించేవారు.. అత్యాచారాలు హత్యాచారాలు చేసేవారు సమాజంలో మితిమీరిపోతున్నారు. ఇది అత్యాశ అనుకోకపోతే ఇంటింటా ఒక రాము డవతరించాల్సిన తరుణం ఏతెంచింది. కాబట్టి యువతీ యువకు లందరూ కేవలం సంతానం కలుగా లని మాత్రమే కోరుకోవడానికి అలవాటుపడటం పొరపా టని తెలిసికొని రామునిలాంటి సంతానం మాత్రమే కలుగా లని కోరుకోవడం నేర్చుకోవాలి. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ సరిగా రామునిఁ బోలిన నరునిం గనఁ గోరుకొంద్రు.. నారీ పీడా కర రావణా ద్యసురులకు మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 6.11.19 -----------------------------------------------------------
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
తరుమగ భార్య వెంటబడి తన్నుచు కొట్టుచు చీపురెత్తుచున్
కరవగ పిల్ల జెల్లలును క్యాన్సరు రాగను బుర్రలోననున్
పరమును చేరుటందునను పండుగ జేయుచు వంద యేండ్లకున్
మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై...
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఅరయగ తప్పనిదగు నా
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
తరలిక కష్టమ్ములపడ
క, రోగములులేక పోవ కాటికి సుమ్మీ
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తరలి + ఇక' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
తొలగించండితరలిక - యాత్ర
ఆంధ్రభారతి ఉవాచ :)
జిలేబి
విరివింటి దొర శరమ్ముల
రిప్లయితొలగించండిగరిమను తెల్పంగ వశమె కల్పము నందున్
నిరతము కోర్కెల తో కా
మ రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
విరించి గారూ,
తొలగించండిచక్కని విరుపుతో ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
భరణము లీయగ విసిగిన
రిప్లయితొలగించండిమరణమ్మును గోరుకొంద్రు మానవు లెల్లన్
వరమని కోరిన ప్రాణము
మరిమరి నిలుపంగ లేడు మాధవు డైనన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నరకసమాన మాపురము నమ్ముడు రాజయి దానికొక్కడున్
రిప్లయితొలగించండినిరత మనంతదుఃఖములు నిల్పుచు పౌరుల జీవనంబునన్
చెరచుచునుండ సౌఖ్యములు, చేకొన దౌష్ట్యము జూపి సంపదల్
మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై.
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
పరపీడన పరమావధి
రిప్లయితొలగించండిదురహంకారులకు నెల్ల దుస్సహమౌరా !
నరకాసురు వంటి ఖలుల
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
ఖలుల మరణంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై"
తొలగించండిధర జనియించియుంటిని విధాతృకృపారసలేశమంది, శ్రీ..
హరి కరుణాకటాక్షములనంది శుభంబుగనుంటి , నింక శం..
కర ! భవబంధమున్ దునిమి కావుమటంచు భవమ్ము లేనిదౌ
మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండి
రిప్లయితొలగించండితరుగుట తప్పదా కలిమి దారిని పుట్టిన వారికిన్, సఖీ
యరయగ తప్పదమ్మి నరులా సుడుగాడుకు బోవ తీరగన్
తరలిక, భోగభాగ్యముల దందడి! రోగపు లేమితోడుతన్
మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(అయ్యప్పస్వామికి భక్తుల విన్నపం )
రిప్లయితొలగించండి" శరణము స్వామి ! నీవు మము
జల్లగ జూడుము నెల్లవేళ ; నీ
చరణములే కదా మదుల
జక్కగ నిల్పితిమయ్య ! మాయ సం
వరణమునందు నుంటిమి ; ని
వారణ జేయు " మటంచు భక్తి నా
మరణము గోరుకొందురట
మానవులెల్లరు ముక్తకంఠులై .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపెరుగును జబ్బులు ముదిమిని,
రిప్లయితొలగించండిదరిజేరరు సతి సుతులును తరుగక జబ్బుల్
తరిమిన ,సుఖముగ కలిగెడు
మరణమ్మునుకోరుకుంద్రుమానవులెల్లన్
సుఖమరణంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
అమిత్ షా ఉవాచ:
అరచుచు మోడి చోరుడని హైరన నొందుచు వాడవాడలన్
పరుగులు పెట్టి జందెమును భారత మాతకు చుట్టి వేడ్కతో
వరుడగు సోని పుత్రుడిట వర్ధిలు వేళ ప్రధాన మంత్రియై
మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై...
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండి🙏
రిప్లయితొలగించండిఅరకొర తెలివిడి వలదని
మరణమ్మును, గోరుకొంద్రు మానవులెల్లన్
చిరకాలమ్ము బతుకగా!
పరమార్థకవి పలికె సెలవా మరణమ్మే!
జిలేబి
రిప్లయితొలగించండిపరుగిడి కోరుకొనుమ యొరి
మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
సరియైనదికాదది విను
మ! రణమ్మును గోరుచుట్టు మచ్చుగనుమికన్!
జిలేబి
రిప్లయితొలగించండిపరుగుపరుగుల నెపుడు ధన
ము రొప్పుచు ములుగును చూచి ముచ్చటపడుచున్
పరపతి తోడుత గొప్పగ
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
జిలేబి
రిప్లయితొలగించండిసరిసరి జిలేబి కోరకు
మరణమ్మును! గోరుకొంద్రు మానవులెల్లన్
జరలేని బతుకు! కోరుకొ
ను రవంతయు నీవదియె మనుగడయె సాగన్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మరణము తథ్యము మనిషికి
రిప్లయితొలగించండితరుణమ్మాసన్నమైన తప్పదుబోవన్
పరువగు జీవనగతిలో
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
రిప్లయితొలగించండిసరియగు కోర్కెలు కలుగక
పరులను జూచిన మనసిక భరియింపని, యా
యరిషడ్వర్గమ్ముల తగు
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
🙏🙏
సిరులను యెన్నియు కలిగిన
తొలగించండిసరియగు వైద్యులు దొరకక సహకారమునన్
భరియింపని రోగము నా
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి"సిరులవి యెన్నియు..." అనండి.
ధన్యుణ్ణి గురువర్యా 🙏🙏
తొలగించండిశ్రీశైలములో ఇప్పటికినీ "వీరశిరోమంటపము" అనేది ఒకటున్నది.
రిప్లయితొలగించండిమోక్షముకొరకు శైవులు ప్రాణత్యాగ జేసెడివారు.
కం.
స్మరణము జేసిన వినడని
నరులున్ శ్రీశైలమందు నటరా జెదుటన్ l
శిరముల్ ఖండించి సుకృత
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్ ll
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసూసైడ్ స్పాట్ అన్నమాట
తొలగించండి
రిప్లయితొలగించండియోగవాశిష్టము
"మరిమని" వశిష్టుడనె, "రా
మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
శరణాగతి జీవితమున
నరయగ మేలగునయా వినాశమ్మీగన్"!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినా పూరణ. చం.మా.
** *** *** **
ధరపతులెల్ల యుద్ధమున దస్యుని ద్రుంచుట శౌర్యమౌను గా
ని రణమునందు వైరి గని నివ్వెఱ జెందుచు వెన్ను జూపుచున్
పరిగిడ గేళిజేయుదురు పత్నులె;సంగర మందు వీరమౌ
మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పరుగిడ' అనండి.
శ ర ణ ము గోరియు రుద్రుని
రిప్లయితొలగించండివరమి మ్మ ని వేడు కొనుచు బాధ ల సుడి లో
కరము గకల త లు బడు చు న్
మర ణ మ్మె గోరు కొంద్రు మానవులె ల్ల న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపరిపరి విధముల కోరిక
ల రహస్యముగ తలదాల్చి లాభము కొరకై
పొర కనుల కట్టగా కా
మ రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివరుసఁగ హత్యలు చేయుచు
రిప్లయితొలగించండిమరణమ్మును కోరితెచ్చు మానవమృగమున్
దురహంకారుని దుష్టుని
మరణమ్మును కోరుకొంద్రు మానవులెల్లన్
? గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తరుగగ ప్రాయము ధనమును
రిప్లయితొలగించండిజరయందున రుజలనంది జాయాసుతులే
బరువంచును వేసారగ
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
విరిసిన యౌవనంబదియె వీగగ ద్రుంచుచు గర్వమంతయున్
తొలగించండికురులవి వెల్లబారగను కూరిమితగ్గగ లోకవాంఛలన్
సరగున జేరగాదివిని సారసనేత్రుని బూజసేయుచున్
మరణము గోరుకొందురట మానవులెల్లను ముక్తకంఠులై
ముక్తకంఠులు = ముక్తినివ్వమని ప్రార్ధించువారు
మానవులెల్లరు
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅరె ప్రెసిడెంటవగ, యొబా
మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
నెరపితి వీవెగ శాంతిని!
పరిగ్రహించుకొనుమింక ప్రైజిదె నోబెల్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచిరుతన యాటల తోడన
రిప్లయితొలగించండితరుణిమ ఘన కీ ర్తితోడ దనుపుగ గడువన్
జరయందున రోగరహిత
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"చిరుతను క్రీయలతోడను" అనండి.
వరియించిన పూబోడిక
రిప్లయితొలగించండిసరిజోడై తోడు రాగ సరసము తోడన్
పరిపరి గోరుచునా కా
మ రణమ్మును గోరుకొంద్రు మానవు లెల్లన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పూబోడి + ఇక' అన్నపుడు సంధి లేదు. "పూబోడియె" అనండి.
రిప్లయితొలగించండిప్రత్యక్ష ప్రమాణము - మిలాల్ :) వుంటే వద్దంటామా ? :)
అరె! ణిసిధాత్వర్థముగా
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
పరమాత్మునికొలువందు క
లరూపు తధ్యమనగా! మిలాల్ లేదు కదా:)
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపరువము దాటి కాలమున భాగ్యము లెన్నియొ బొంది ముచ్చటన్
రిప్లయితొలగించండివరుసగ ముత్తరంబులను వార్థకమందున జూచి తృప్తులై
జరఠపు బాధలేని సహజంబగు దీర్ఘ సుషుప్తి నొందెడిన్
మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువుగారూ నమస్సులు. ధన్యవాదములు 🙏
తొలగించండిధరలో కష్టము లందుచు
రిప్లయితొలగించండినరకమ్మగు బాధ చేత నానా రోతల్
భరియించువారు నిజముగ
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండిజీపీయెస్ వారి మరియు యితర కవుల ఐఫోను ఆండ్రాయిడు ఫోనుల కంకితము :)
విరివిగ పొద్దుపొడువ శం
కరాభరణమందు విడువక టకాల్మనుచున్
చరవాణి నొక్కి కైపద
మ! రణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
జిలేబి
😀😇😋🤔🤗🙏
తొలగించండిభలే
తొలగించండి😀👌🏻👏🏻💐🙏🏻
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిపిరమగు జీవితమ్ము గద వేదనలెన్నియొ చుట్టుముట్టినన్
రిప్లయితొలగించండిస్థిరమగు భావనన్ జెలఁగి తేకువతోఁ బెనఁగాడుచున్ బ్రభున్
వరముల నీయమంచు భవవార్ధిని దాటగ నంత్యమందు నా
"మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినరకమ్మె లేదు! స్వర్గం
బరయగ తధ్యము జనాళి ప్రభువుని చేరం
గ రయము రారండన సం
స్మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(3)
రిప్లయితొలగించండిమరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
సరియగు తరుణము యనుకొని
కరుణను లేక జనులనిట కఠినముగా సం
హరణము జేసెడి లష్కర
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
🙏🙏
సరిహద్దున సైనిక సో
తొలగించండిదరుల మరణమును గన పరితరియించెడి యా
పరదేశ శత్రువులకు దు
ర్మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
🙏🙏
మురిపెముగా జూచు కొనెడి
తొలగించండిసరియగు తోడు వయసయెడి సమయాన్నే లే,
మరు జన్మమె వలదని యిక
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
🙏🙏
::6::
తొలగించండిసరదాగా రాసినదే జిలేబి గారి స్పూర్తితో 🙏😀
సరియగు నెట్వర్క్ తెలియక
సిరులన్నియు పోసితిమిగ సిగ్నల్ కొరకున్
విరివిగ డేటా దొరకక
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
🙏🙏😀
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణలో "తరుణమ్మనుకొని కరుణను విడిచి" అనండి.
రెండవ పూరణలో 'పరితరియించెడి'?
మూడవ పూరణలో 'సమయాన్నే' అనడం సాధువు కాదు. "సమయమ్మున" అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిModi no to RCEP agreement signing
అరె! ఆర్. సి.ఇ.పి.వలదయ
త్వరితము చైనా దినుసులు తలమించునికన్
విరివిగ! దేశపు వృద్ధికి
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్?
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిరిబాలలు విచ్చకనే,
రిప్లయితొలగించండిమరి రవియుదయించులోన మానసమున శం
కరులిచ్చు సమస్యా గరి
మ రణమ్మును గోరుకొంద్రు మానవు లెల్లన్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధరలో ముదిమిని వ్యాధులు
రిప్లయితొలగించండిభరియింప వశమె జనులకు భారమె కాదా
బరువుగ జన్మము తలచుచు
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితరిగొన సంఘంబులు రా
రిప్లయితొలగించండిష్ట్ర రవాణా నిలువ నేడు రాజీ రాజా
త్వరమే మాన్పుడి లేదా
మరణమ్మును గోరుకొంద్రు మానవు లెల్లన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిదొరలుచు దుముకుచు కాదం
బరి కౌగిలిని కరుగుచు సఫలమనుకొనుచున్
మురుగప్పా వైన్సు కెడని
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండినిరతము తమతమ కర్మల
నెరవేర్చెడు ధ్యాస లోన నిర్గుణు నెదలో
మఱచుచుఁ గష్టమ్ములలో
స్మరణమ్మును గోరు కొంద్రు మానవులెల్లన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమురుకులు జిలేబి లడ్డులు
కరకర యంచు నములుచు ప్రకాశము గా వీ
రరసమ్మిదె యనుకొనుచున్
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ నాటి శంకరా భరణము బ్లాగు వారి సమస్య
రిప్లయితొలగించండిఇచ్చిన పాదము కందము నా పూరణము సీసము లో
నేటి జనతను గాంచి ఆలయములొ ఒక గొప్ప సాధువు పలుకు మాటలు
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్ (సమస్య)
ముప్పది వచ్చిన ముద్దాడు నధికమౌ
రక్తపోటు లలన రమ్య గతిని,
నలుబది దాటిన చెలిమిని కోరును
మధుమేహపు మగువ మనసు బడుచు,
యేబది లో జేర డాబుగ, పైబడి
దంతపు టింతులు దాడి జేయు,
తరుణము దొరికిన కరుణను తలచక
కాలేయపు కలికి కాటు వేయు,
పాపం బనుకొనక నూపిరి తిత్తుల
పడతుక లిరువురు బాధ పెట్టు,
తినకున్న నూపిరి తిత్తులు నలుగు, తి
నిన మధు మేహము నిబ్బరించు,
నిజసతి దరిజేర గజగజ వణుకును
వాసన నిడుచుండు వపువు గాంచి,
హతవిధీ నిరతము హత్నువుల్ కూడుస్వ
ర్గమనము వలదు, సుగమ
ముగ కలు
గు మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్ల
నెప్పుడు ధరలోన నిజము సుమ్మి,
కలుగు మీకట్టి మరణము కాంక్ష లెల్ల
వీడి సతతము దేముని వేడుచున్న,
కరుణ నిడి కొనిపోవును పరమ పదము
నకని పలికె బైరాగి జనతను గాంచి
వపువు = శరీరము హత్నువుల్ = రోగములు
మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచంపకమాల
రిప్లయితొలగించండిదొరికిన దెల్లఁ దోచి మది తోషము నందఁగ పుత్రపౌత్రులున్
మురిసెదరంచు భావనల ముందుకు సాగుచు నంత వృద్ధులై
తరుమగ కన్నవారలె యధార్థము నెంచక యాశ్రమమ్ముకున్
మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅరయగనెల్లజీవులకునాయువుమూడుట తథ్యమేకదా
రిప్లయితొలగించండిజరయొకశాపమౌను మనుజాళికి రుగ్మత సంక్రమింపగన్
కరుణనుజూచువారెవరుకానక తల్లడమందువేళలన్
మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినెరవేర కోర్కెలు గడిపి
రిప్లయితొలగించండిధరణిని సుఖజీవితమ్ము తద్దయు ప్రీతిన్
కఱకంఠుని యాజ్ఞ సహజ
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం.
రిప్లయితొలగించండివిరివిగ వాడిన ప్లాస్టిక్
తరగని రాసులు నిలిచిన తాకగ తెవులున్
నరకము దలుపన జగతిన
మరణమ్మును గోరు కొంద్రు మానవులెల్లన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"జగతిని" అనండి.
సరియగు పంటలు పండక
రిప్లయితొలగించండికరువిట నాట్యములు జేయఁ కలికాలమునన్
వరదలు తోడుగ ముంచిన
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శ్రీ కంది శంకరయ్య గారి నమస్సుమాంజలి🙏🙏 .. ధన్యుణ్ణయితిని 🙏🙏
తొలగించండినావి మరియు ఇంకొందరివి, మరికొన్ని పూరణలు మీ పరిశీలనకు నోచుకోలేదు..
దయచేసి పరిశీలింప ప్రార్ధన 🙏🙏
నిరతమ్మిట జోడించుచుఁ
రిప్లయితొలగించండిగర యుగ్మమ్ములు ముదమ్ముగఁ బ్రశాంతంబౌ,
శరణమ్మని వేడు కొనుచు,
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
పరఁగిన శిష్ట కార్యరతిఁ బార్థుల నెల్లరు భక్తి యుక్తులై
నిరతము కోరుకొందు రట నీరజ పత్ర విలోచనా భువిం
బరఁగిన దుష్ట కార్యరతిఁ బార్థలతోడ జితాంబుజాస్య! లే
మ! రణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై
మీ రెండు పూరణలలో మొదటిది ప్రశస్తంగా ఉన్నది. రెండవది అర్థం కాలేదు. దయచేసి వివరించండి.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఅంతగా నన్వయలోపముగా నున్నదాండి నా పూరణము!
నా భావము పద విభజనతో విశదపఱచఁ బ్రయత్నించెద నండి.
శిష్ట కార్యరతిఁ బరగిన బార్థుల నెల్లరు భక్తి యుక్తులై నిరతము కోరుకొందురట భువిన్
దుష్ట కార్యరతిఁ బరఁగిన బార్థల తోడ రణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై
మిగిలినవి సంబోధనలే.
నీరజ పత్ర విలోచనా
జితాంబుజాస్య: జయింపఁబడిన చంద్రుఁడు గల ముఖము కలదానా
లేమ: మగువా
గుణదోషములఁ దెలుప గోరెదను.
అరువగ జూచు భార్య పయి నామెయు వృద్ధయె యేమి చేయులే
రిప్లయితొలగించండిసరియని తగ్గు, ప్రేమగను చల్లగ నామెను తాక నామెయున్
సరిసరి యిప్పు డేమి సరసాలను, వృద్ధులె యైన భార్య ప్రే
మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై.
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువు గారికి.
తొలగించండిగరళము మ్రింగి కాచె నలికాక్షుడు, పాపులు లోకకంటకా
రిప్లయితొలగించండిసురులను సంహరించి యిలఁ స్యూమము నిల్పిన దాదిశక్తియే
నరులకు దారహమ్ము రఘునందనుఁ జీవన మిట్టి దేవతా
స్మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై౹౹
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'రఘునందను' తరువాత అర్ధానుస్వారం అవసరం లేదు.
ధరణిని జీవరాశి కది ధర్మమటంచును జాతిపెంపుకై
రిప్లయితొలగించండివిరివిలుకాడు బాణముల వేయు నటందురు సత్యమే కదా
హరిసుతుడైన మన్మథుని యస్త్ర మహత్తది మోహమందు కా
మ రణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివరమై దొరికిన జీవన
రిప్లయితొలగించండిహరువున్, బరువులకు నోర్చి
యాస్వాదనమున్
దరిజేర్చి, ముక్తి నొందగ
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఉరగము కంఠాభరణము
రిప్లయితొలగించండికురులందున సుమమువోలె కుముదేశుడనే
ధరియించిన శివ నామ
స్మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కుదేశు దలన్ ధరియించిన..." అనండి.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
*"మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్"*
సందర్భము:
మారుతి సంజీవనీ పర్వతాన్ని తెచ్చేటపుడు విఘ్నం కలిగించమని రావణుడు చెబితే
"సీతాం ప్రయచ్ఛ రామాయ.." (రామునికి సీత నిమ్ము.) అని కాలనేమి చెప్పినాడు. (అధ్యాత్మ రామాయణం..యుద్ధకాండం 6 స. 46 శ్లో)
ఇతః పరం వా వైదేహీం
ప్రేషయస్వ రఘూత్తమే
అధ్యాత్మ రామాయణం.. (యుద్ధ కాండం.. 10 స. 54 శ్లో)
ఇకనైనా సీతను రాముని వద్దకు పంపించు.. అని మండోదరి చెప్పినది.
ఇంకా విభీషణుడు కుంభకర్ణుడూ చెప్పినాడు.. ఎవరు చెప్పినా రావణుడు వినలేదు.
ధర్మప్రియులు నరులు.
నరులంటే మానవులు.
ధర్మాధర్మ విచక్షణ లేని వారు అసురులు.
అసురులంటే రాక్షసులు.
అసురులతో నరుల కెప్పుడూ బాధ లుండనే వుంటవి.
రావణాదులు రాక్షసులు.
రామాదులు మానవులు.
మానవుల ధన మాన ప్రాణాదులను దోచుకోవటం రాక్షసుల సరదా..
ఐతే ఆ యుగంలో నర నారీ పీడాసక్తుడు ఒక్క రావణుడే కనిపిస్తున్నాడు. కాబట్టి ఒక్క రాము డవతరించడంతో సరిపోయింది. కాని ఈనా డడుగడుగునా నారీ పీడాకరు లంటే స్త్రీలను పీడించేవారు.. అత్యాచారాలు హత్యాచారాలు చేసేవారు సమాజంలో మితిమీరిపోతున్నారు. ఇది అత్యాశ అనుకోకపోతే ఇంటింటా ఒక రాము డవతరించాల్సిన తరుణం ఏతెంచింది.
కాబట్టి యువతీ యువకు లందరూ కేవలం సంతానం కలుగా లని మాత్రమే కోరుకోవడానికి అలవాటుపడటం పొరపా టని తెలిసికొని రామునిలాంటి సంతానం మాత్రమే కలుగా లని కోరుకోవడం నేర్చుకోవాలి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
సరిగా రామునిఁ బోలిన
నరునిం గనఁ గోరుకొంద్రు.. నారీ పీడా
కర రావణా ద్యసురులకు
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
6.11.19
-----------------------------------------------------------
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండిపూరణను మించి సందర్భము కూడాన్ను :)
జిలేబి
నిరతము పరమాత్ముని శ్రీ
రిప్లయితొలగించండిచరణములే దిక్కు నమ్మి శరణమ్మంచున్
పరమును వరముగ దలచుచు
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబరువయి కన్నవారలకు, బాధగ జీవనమై, కదల్చగా
రిప్లయితొలగించండికరమును కాలు నింకొకరి గానక, గ్రమ్మిన పక్షవాతమై,
నిరతము శయ్యకుం దగిలి, నిత్యము చచ్చుట లేలరా? హఠా
న్మరణము గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై.
కరుణరసాత్మకమైన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువు గారూ.
తొలగించండికరములుమోడ్చుచునెపుడున్
రిప్లయితొలగించండిహరిహరబ్రహ్మాదిదులెల్ల హాయిగమదిలో
నిరతమునిలుపుచుభువిలో
మరణమ్మేగోరుకొంద్రుమానవులెపుడున్
++++++++++++++++++++++++
రావెలపురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బ్రహ్మాదులెల్ల' టైపాటు.
సమస్య :-
రిప్లయితొలగించండి"మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్"
*కందం**
జ్వరమునకు కారణమ్మై
భరియించగలేని హెచ్చు బాధలు పెట్టన్
పురమున పీడిత దోమల
మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్
.....................✍చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పీడిత దోమల' దుష్టసమాసం. అవి పీడించేవే కాని పీడితాలు కావు కదా! "పురమున హెచ్చిన దోమల" అనండి.
కరిమొర వినివేగము గా
రిప్లయితొలగించండిసిరికిని చెప్పక పరుగున శ్రీహరి రాగా
మురహరుడౌ యా దానవ
హరుని కరమునందు చక్రమలరారు గదా.
2.కం:శిరమునశశి,డమరుకమది
హరుని కరమునందు, చక్రమలరారు గదా.
కరివరదుండగు నా శ్రీ
హరికరముల కంబుతోడ ననవరతంబున్
3.కం:నిరతం బుండును శూలము
హరుని కరమునందు, చక్రమలరారు గదా.
సురలను మునులను కావగ
కరిరాజ వరదుని దివ్య కరముల యందున్.
4కం:కరుణాకర కావుమనుచు
కరిమొరలిడనాలకించి కారుణ్య ముతో
పరుగున వచ్చిన దానవ
హరుని కరమునందు చక్రమలరారు గదా.
5.కం:కరుణను చూపగ రారా
మురారి యనుచును మొరలిడు పుడమీ సురులన్
సరుగున గాచిన రాక్షస
హరుని కరమునందు చక్రమలరారు గదా.
6.చం:అరదము నెక్కి సాగుచును యామిని యందు
నవేణువూదుచున్
మరులను గొల్పి మానినుల మానసముల్ హరియించు చున్నటన్
నిరతము పాండు పుత్రులకు నెమ్మిని కూర్చిన
శ్రీరమా మనో
హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్"*