26, నవంబర్ 2019, మంగళవారం

సమస్య - 3203 (రాతిరి భాస్కరుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై"
(లేదా...)
"రాతిరియందు భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్"

101 కామెంట్‌లు:


 1. నడి రేయి సరదా పూరణ:

  ఖాతరు చేయుచున్ ప్రజల కమ్మని నిద్రకు భంగమొందకే
  ప్రాతపు కాలమున్ విడిచి భండన మందున కైపదమ్ముతో
  పాతది కాలమున్ తిరిగి ఫక్కున నవ్వుచు మాకు రాగ నీ
  రాతిరియందు భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్

  భాస్కరుడు = ప్రభాకరుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ప్రాతము = వేకువ జాము (ఈ క్రొత్త మంచి పదమును మన నిఘంటువులందున చేర్చుకొనవలెనని మనవి)

   తొలగించండి

  2. (లేనిచో)

   ప్రాఁత = పూర్వము (శబ్దరత్నాకరము)

   తొలగించండి
  3. అర్ధరాత్రి ప్రభాకరోదయం! మీ పూరణ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
   "ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?" ఘటోత్కచ ఉవాచ! వేసుకోండి వీరతాడు.

   తొలగించండి
 2. నీతిని గాంచగ కోరుచు
  రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై
  మతిపోవగ గతి లేకను
  అతివేగము వెడలె నంట హరి దిక్కునకై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మూడవ, నాల్గవ పాదాలు హ్రస్వాలతో ప్రారంభమయ్యాయి. సవరించండి.

   తొలగించండి
  2. నీతిని గాంచగ కోరుచు
   రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై
   నేతగ మతిపోయిన రవి
   రాతలు మారవ టంచు రయమున వెడలెన్

   తొలగించండి
  3. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదంలో గణదోషం. "మారవని చెప్పి రయమున..." అనండి.

   తొలగించండి


 3. తాతకు మిత్రుడు కైపద
  మాతరుణమున ప్రచురింప మదిమది సరదా
  కైతల పూరణ చేయన్
  రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై!


  భాస్కరుడు- మా జీపీయెస్ అయ్యవారు :)  జిలేబి

  రిప్లయితొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  జాతక రీతులన్ తెలియ జాలరు మానవ మాత్రులయ్యరో
  వ్రాతలు మార్చుటన్ మనకు రాదుగ నీజగమందు శంకరా!
  ఘాతుక చర్యలన్ గఱచి గండర గండుడు; రామరావుకున్
  రాతిరియందు; భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్

  రామ రావు = (అమెరికాలో నుండిన) నందమూరి తారక రామా రావు
  భాస్కరుడు = 😊😊😊

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  తాతతో తెల్లవార్లూ జాతరలో :
  ________________________

  తాతను తోడ్కొని పోతీ
  జాతర దిరిగెను తనివిని ! - చరణాయుధమే
  కూతల్కూయగ, గడచెను
  రాతిరి ! భాస్కరుఁడు వొడమె - ప్రాక్శైలముపై
  ________________________
  చరణాయుధము = కోడి

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పోతీ" అన్నది మనుమరాలు అనే అర్థంలో అన్యదేశ్యమా? "తాతయు దౌహిత్రి కలిసి... దిరిగిరి..." అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
  2. శంకరార్యా ధన్యవాదములు !
   సవరణతో :
   తాతతో తెల్లవార్లూ జాతరలో :
   ________________________

   తాతయు దౌహిత్రి కలిసి
   జాతర దిరిగిరి తనివిని ! - చరణాయుధమే
   కూతల్కూయగ, గడచెను
   రాతిరి ! భాస్కరుఁడు వొడమె - ప్రాక్శైలముపై
   ________________________

   తొలగించండి
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  తాతతో తెల్లవార్లూ జాతరలో :
  ________________________

  జాతర బాలయోగిదది - చల్లని రాతిరి జూడ బోయెనే
  తాతను తమ్మునిన్ గొనుచు - తామరకంటియె మోదమందగన్ !
  కూతల కూయగన్ దొడగె - కుక్కుట మూకలు, పాఱిపోవగా
  రాతిరి ; యందు భాస్కరుఁడు - ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్ !
  ________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాకతాళీయం... ఇప్పుడే మీ పూరణ చదువుతుండగా కోడికూత వినిపించింది.
   (కోడికూత కంటె మా ఆశ్రమప్రాంతంలో నెమళ్ళ కూతలు ఎక్కువగా వినిపిస్తాయి..)

   తొలగించండి
 7. పాతరలోననే యికను ,పాలననంతటి ,పాతిపెట్టగా
  చేతములెమ్మనన్ పనులు,చేసెడుతీరులు జాగుసేయగన్
  ఖాతరుచేయగాదగదు, కార్యకలాపము జేయనెంచుచున్
  రాతిరియందు భాస్కరుడు,ప్రాగ్గిరిపైబొదసూపెజూడగన్.

  రిప్లయితొలగించండి
 8. చేతలె శూన్యమ్మైనను
  నేతల మాటలను విన్న నింగినెగరు గో
  మాతలు దున్నలె యీనున్
  రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై

  నేతల మాటలనేకము
  కోతలతో గాలిలోన కోటలె వెలయున్
  భూతలమే స్వర్గమగును
  రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై

  రిప్లయితొలగించండి
 9. నేతలుమూగ్గురైననిక , నెగ్గిరి రాష్ట్రపు పాలనమ్ముకై
  కోతులకన్నమిన్నగుచు,కోవిదులందరు రాత్రిరాత్రికే
  చేతలుమార్చివేయుచును చేసెదమంచును, మాటమార్చగా
  రాతిరియందుభాస్కరుడు,ప్రాగ్గిరిపైపొడసూపెజూడగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ముగ్గురైన' టైపాటు. 'మిన్న + అగుచు' అన్నపుడు సంధి లేదు. "కోతులకన్న మిన్నగను" అనండి.

   తొలగించండి
 10. జాతర లో పౌరాణిక
  ప్రీతి క ర పు నాటక ము న వీనుల విందౌ
  రీతి గ రాగా ల గడిచె
  రాతిరి :: భాస్కరు డు వొడమె ప్రాక్ శైల ము పై

  రిప్లయితొలగించండి
 11. కోతికి కలిగెను శునకము,
  రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై
  చేతన లేదా? నీవీ
  రీతిగ వినుతించ దాస రీ దోషంబే

  రిప్లయితొలగించండి
 12. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  02)
  కోతల పోటి :
  ________________________

  కోతల పోటి యందునను - కోతలరాయులు యెందరెందరో
  కోతలు కోసినారు మరి - కోరిక హెచ్చ బరాత మందగన్
  పోతన యొక్కడే గెలిచె - మొత్తము విత్తము నిట్లు చెప్పగన్
  "రాతిరి యందు భాస్కరుఁడు - ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్ " !
  ________________________
  బరాతము = బహుమానము

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రాయులు + ఎందరు' అన్నపుడు సంధి నిత్యం. "కోతలరాయులె యెందరెందరో" అనండి.

   తొలగించండి
 13. తాతలునేయిదాగిరని,తవ్వెడు పాత్రన పాతకాలమున్
  నేతలుయంతమూగిరిక, నేతినివాసనజూడగోరుచున్
  చేతలులేనిపాలనము,చేయగ తప్పునుదిద్దనెంచుచున్
  రాతిరియందు భాస్కరుడు,ప్రాగ్గిరిపై పొడసూపెజూడగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పాత్రను' అనండి. 'నేతలు + అంత' అన్నపుడు సంధి నిత్యం. "నేతలె యంత..." అనండి.

   తొలగించండి
 14. ఉత్పలమాల
  భూతలమేలు నా భరత పుత్రుడు, రాముని కానకంపుమన్
  ఘాతకి కైక కోర్కెవిని క్రాలెను పంక్తి రథుండు భీతుఁడై
  రాతిరి యందు, భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్
  వ్రాతలు మారి పోవ వనవాసము నేగు నయోధ్యరామునిన్

  రిప్లయితొలగించండి


 15. కోతల కోసి బువ్వగొని గుప్పెడు పాన్పుని పవ్వళింపగా
  జోతల చేసి నిద్దురని జోగొని కొంతయె వేళ దాటెనా
  రాతిరియందు, భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్
  స్తోత్రపు సర్వమూషకము చువ్వన వచ్చెను లెమ్ము మిత్రుడా!  జిలేబి

  రిప్లయితొలగించండి
 16. మైలవరపు వారి పూరణ

  చేతనతాప్రతీక విరచించి దినమ్మును శ్రాంతి గ్రుంకగా ,
  ప్రీతికరుండు చిత్తముల ప్రేమజనింపగజేయనల్లదే
  శీతమయూఖసంపదలచే తిమిరమ్మును పారద్రోలగా
  *రాతిరియందుభాస్కరుడు* ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రీతిగ జానకిన్ వెదుక ద్రిమ్మరుచుండగ చెట్లకొమ్మలన్
   వాతతనూజునా యరుణవర్ణితవక్త్రుని , కాంతిమంతునిన్
   రాతిరివేళలో నగరరక్షకరాక్షసి గాంచి యిట్లనెన్
   రాతిరియందు భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్.!!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 17. చూతమురారె యందరును చోద్యమ టంచును దెల్పుచుండె నా
  నాతి కుటుంబమంతకును "నమ్ముడు మాంత్రికు డొక్కరుండటన్
  జేతను మంత్రదండమును జేయని పల్కుచు నూపినంతనే
  రాతిరియందు భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్"

  రిప్లయితొలగించండి


 18. నారదా!


  కాతరు లేదా గృహమన?
  వేతన మెచ్చట గలదిక వెచ్చము సేయం
  గా తెమ్మ తల తినగ సతి
  రాతిరి, భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. ఆతఁడు పుట్టెను రాతిరి
  నా తూరుపు కనుమలందు నఱకను పురమున్
  'రాతిరి' యను వంశమునన్
  "రాతిరి భాస్కరుఁడు" వొడమె ప్రాక్శైలముపై

  రిప్లయితొలగించండి
 20. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  03)
  భూతలమందు :
  ________________________

  భూతలమందునన్ సగము - ప్రోలున మాత్రమె రాత్రి యుండెడిన్
  జ్యోతియె వెల్గులన్ మిగులు - చోటుల క్రమ్మును మెల్ల మెల్లగన్
  చేతన గల్గినన్ దెలియు - చిత్రము గాదది యభ్దిమేఖలన్
  "రాతిరి యందు భాస్కరుఁడు - ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్ " !
  ________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 21. కోతులు చింతన్ గడిపిరి
  రాతిరి;భాస్కరుడు వొడమె ప్రాక్శైలముపై-
  సేతువు దాటగ హనుమను
  ప్రీతిగ నుతియించె కపులు విలసన్ముఖులై.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదంలో వచనదోష మున్నది. "ప్రీతి నుతించిరట కపులు..." అనండి.

   తొలగించండి
 22. ( రాత్రిని పగటిగా మార్చిన ఐంద్రజాలికుడు )
  చేతల భ్రాంతిమంతులుగ
  జేసెడి మాయలమారి యొక్కడే
  యాతురపాటుతోడ జను
  లందరు కన్నుల జూచుచుండగా
  జేతుల నూపి చేరువకు
  జేర్చుచు జేసెను నింద్రజాలమే
  రాతిరియందు భాస్కరుడు
  ప్రాగ్గిరిపై బొడసూపె జూడగన్ .

  రిప్లయితొలగించండి

 23. నా పూరణ. ఉ.మా
  ** *** ***
  ( ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలలో
  అర్ధరాత్రి అవుతుండగా ఒక్క నార్వె దేశములో ఉదయమయి సూర్యుడు ఉదయిస్తాడు...అందుకే

  నార్వె దేశమును "అర్ధరాత్రి సూర్యుడు దయించు దేశము "అని అంటారు...)

  ఉ.మా.

  రాతిరి సర్వ దేశముల రాజరుదెంచుచు వెల్గుచుండగన్

  ఆ తరుణంబునం దరయ నర్కుడు "నార్వె" ప్రదేశమందునన్

  ద్యోతితమయ్యె మిక్కిలిని దూరుపు దిక్కుని గాంచ ;" నార్వె "లో

  రాతిరియందు భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్"

  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "వెల్గుచుండగా । నా తరుణంబునం...దిక్కున గాంచ వింతగా..." అనండి. 'నార్వె' పునరుక్తమయింది.

   తొలగించండి
 24. చేతములుల్లసిల్లగను క్షేమము లోకమునందు గూర్చగన్
  భీతిని బారద్రోలగను, విస్తృతదీప్తిని బంచగోరుచున్
  భూతలనాకమైన మనభూమికి జేరగ పర్వుదీయుచున్
  రాతిరియందు, భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్"

  రిప్లయితొలగించండి
 25. శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻

  కౌతుకమునఁ జరవాణిం
  జూతును నే సంభ్రమించి క్షోణీతలమున్ ;
  ఈ తరుణము , మా చీకటి
  రాతిరి , భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "క్షోణితలముపై । నీ తరుణము..." అనండి.

   తొలగించండి
 26. నేతల తీరీ రీతిగ
  మేతయె ప్రాధాన్యమగుచు మేరలు మీరన్
  నీతిని గల నేతల గన
  రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై

  రిప్లయితొలగించండి
 27. చేతనమిచ్చెడు కాంతుల
  జాతుల మేల్కొల్ప నేకచక్రధరుండై
  శీతాంశుతోడ వీడ్కొని
  రాతిరి,భాస్కరుడు వొడమె ప్రాక్మైలముపై

  రిప్లయితొలగించండి
 28. మద్యము మత్తులో అనే ఉద్దేద్యం తో సరదా పూరణము

  సేతిరి మత్తున విందా
  రాతిరి, భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై
  చూతిరి వీనుల విందుగ
  పోతిరి సెల్ఫీలనుచును పోజులు పెట్టన్
  🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. (2)
   పోతిరి తిరుగగ వారల్
   రాతిరి, భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై
   కూతలు కోడివి వినగా
   చేతిరి పయనము పరుగున చేరగ నింటిన్

   తొలగించండి
  2. సేతిరి, చూతిరి, పోతిరి, చేతిరి' శబ్దాలు సాధువులు కావు.

   తొలగించండి
 29. భాతి నిడుచుండె చంద్రుడు
  రాతిరి ; భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై
  నీతముగ వెలుగు నీయగ ,
  నీతీరున ధరనుగాయు నిద్దరు దేవుల్

  రిప్లయితొలగించండి
 30. చింతల చీకటి దాస్యపు
  వంతల మ్రగ్గెడి ప్రజలకు వరమన గాంధీ |
  కాంతుల నిడెగద భళిరే |
  "రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొదటి మూడు పాదాలలో ప్రాస తప్పింది. సమస్యాపాదంలో అనుస్వారం లేని తకారం ఉంది.

   తొలగించండి
 31. ప్రీతిగ చుక్కలన్ని శశి బింబము దోడుగ మింట వెల్గెనా
  రాతిరియందు; భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్
  శీతకరుండు జారుకొనె, చీకటి దుప్పటముల్ దొలంగగా
  భూతలమంత చిందె రవి పొంకపు బంగరు కాంతి పుంజముల్

  రిప్లయితొలగించండి
 32. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  రాతిరియందు భాస్కరుఁడు
  ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్

  సందర్భము: యాగ సంరక్షణకై రామ లక్ష్మణులను తీసుకు వెళ్ళిన విశ్వామిత్రుడు సరయూ నదీ దక్షిణ తీరాన వారికి ఆకలి దప్పులను జయించే బల అతిబల మంత్రా లుపదేశించినాడు. రాత్రి అయింది.
  దశరథ నృప సూను సత్తమాభ్యాం
  తృణ శయనేఽనుచితే సహోషితాభ్యాం
  కుశిక సుత వచోఽనులాలితాభ్యాం
  సుఖ మివ సా విబభౌ విభావరీ చ
  రామ లక్ష్మణు లలవాటు లేని గడ్డి పాన్పుపై శయనించినారు. విశ్వామిత్రుని లాలింపు మాటలతో ఆ రాత్రి హాయిగా నిద్రించినారు.
  రాజకుమారులు. ఒంటరిగా.. కాలి నడకన వెళ్ళటం తెలియదు. మెత్తని పట్టు పరుపులమీదనే తప్ప నేలమీద గడ్డిమీద పడుకోవటం ఎఱుగరు.
  కాని విశ్వామిత్రుని వెంట కాలి నడకన నడచి వెళ్ళారు. గడ్డిమీద పడుకున్నారు. హాయిగా నిద్రించారు కూడ.
  గురువు ననుసరించే వారు గురువు చెప్పినట్టే చేయాలి. శరీర సుఖాల కోరరాదు. ఇవి శిష్యుల లక్షణాలు.
  త్యాగమయమైన దైవ కార్యాలవల్లనే చేతము పల్లవిస్తుంది. పారమార్థిక లాభం చేకూరుతుంది. కుటుంబ పోషణతోడి స్వార్థ జీవితాలు మామూలువే! విశేషం లేనివే!
  దైవ కార్యము = 1.పొద్దున్నే చేసే సంధ్యా వందనం. దేవ సంబంధ కార్యం.
  2. దేవతల కిచ్చిన మాట ప్రకారం రాక్షస సంహార కార్యం
  మేలుకాంచవలె= 1.మేల్కొనవలె..
  2.మేలు (శుభం)పొందవలె
  సూర్యోదయ వేళ విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేల్కొల్పుతూ అంటున్న మాటలు పద్యంలో వున్నవి.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  చేతము పల్లవింపగను
  జేయవలెన్ గద దైవకార్య సం
  ఘాతము!.. మేలు కాంచవలె
  గా రఘు రామ! ప్రభాత మాయెగా!
  ప్రీతిగ గడ్డి పాన్పుపయి
  వేడుకగా నిదురించినారులే
  రాతిరియందు! భాస్కరుఁడు
  ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  26.11.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 33. భూతల మమెరిక యందున
  రాతిరియటమారుకతన ప్రాతమువోలెన్
  రాతిరె పగలుగ గానగ
  రాతిరిభాస్కరుడువొడమెప్రాక్శైలముపై

  రిప్లయితొలగించండి


 34. జాతమగు కలువ శశిగని
  రాతిరి, భాస్కరుడు వొడమె ప్రాక్శైలముపై
  జోతలనిడుచుంద్రు ప్రజ ప్ర
  భాతసమయమందు భక్తి భావము తోడన్  రిప్లయితొలగించండి
 35. చేతన కోలుపోయి తగు స్వీయ విస్రంభము లేనివారలౌ
  జాతినిఁ దేశభక్తియను జ్వాల రగుల్చి ప్రపంచమందునన్
  ఖ్యాతియు పేర్మిఁ బెంచిన సుకర్ముడు మోదియె తోచె నేడిటుల్
  రాతిరియందు భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్౹౹

  రిప్లయితొలగించండి
 36. భాతి వెలుంగుచుఁ దారా
  వ్రాతము గగనమున దీప్తివంతము కా సం
  ప్రీతి నొసఁగ భూజనులకు
  రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై

  [రాతిరి భాస్కరుఁడు = రాత్రిఁ గనిపించు సూర్యుఁడు, చంద్రుఁడు]


  వేతన మెంచఁ బోకు మవివేకిగ జన్మము సార్థకం బగున్
  భూత గణాధినేత సుర పుంగ సమర్చిత పార్వతీ ధవుం
  జూతము చంద్రశేఖరునిఁ జోద్యము మీఱఁగ నిల్చి వెల్గుచున్,
  రా, తిరి యందు భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్

  [తిరి =జట]

  రిప్లయితొలగించండి
 37. ఓ తరుణీలలామ! విభుఁ డొంటిగ నిన్ విడి కార్యమగ్నుఁడై
  చేతము దల్లడిల్లఁ గడచెం గడు దూరము, వాని రాకకై
  నీ తనువెల్లఁ గన్నులుగ నిల్చి ప్రతీక్ష నొనర్చుచుంటివా
  రాతిరియందు; భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. లే! తయినాతియై భళి లెస్సగ చెంపను గొట్ట వేచితిన్
   రాతిరియందు; భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్.

   తొలగించండి
 38. నీతిని గల్గియుండు కతనే వసుదేవుడు దుఃఖమందుచున్
  భీతిని గొల్పురీతి తన బిడ్డల జంపగ చూచి యేడ్చి యా
  రాతిని జంపువానిగ వరాంగుడు బుట్టగ వల్కెమోదమున్
  రాతిరియందు భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్

  రిప్లయితొలగించండి
 39. రాతిరి వెన్నెల కనబడు
  రాతిరి చీకటి యగుపడు రాజులకైనన్
  రాతిరి యననిది నిక యే
  రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై??
  🙏🙏

  రిప్లయితొలగించండి
 40. గోతిరొ! మేలుకొమ్ము తొలి కోడియె కూసెను గాదె లెమ్మికన్
  గూతురు పెండ్లిజేసితిమి క్రొత్తగ కాపుర మంప నెంచుచున్
  బ్రీతిగఁ గట్నకానుకల బెట్టెద మంచు దలంచి నాముగా
  రాతిరి యందు, భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్

  రిప్లయితొలగించండి
 41. ప్రాతమునందుగన్పడుచుభాలువుడొయ్యన మాయమౌగదా
  రాతిరియందు,భాస్కరుడుప్రాగ్గిరిపైబొడసూపెజూడగన్
  జేతనరూపుడైమిగుల చిత్రవిచిత్రపు కాంతిపుంజమున్
  భూతలమంతటన్విసరి భూప్రజకెల్లనుమోదమీయగా

  రిప్లయితొలగించండి
 42. రాతిరి భూతలమందున
  నాతతముగ వాన కుండపోతగ కురియన్
  భీతిలిరెల్లరు, గడచెను
  రాతిరి, భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై.

  రిప్లయితొలగించండి
 43. శీత సమీరము కౌగిట
  భూతల హరితము తుషార భూషణములతో
  ప్రీతింగాన్పడి గడువగ
  రాతిరి; భాస్కరుడు వొడమె ప్రాక్శైలముపై!

  రిప్లయితొలగించండి
 44. నాతిసమూహ మధ్యమున నాట్యముజేసిన వేణుధారియే
  రాతిరియందు భాస్కరుడు;ప్రాగ్గిరిపై బొడసూపె,జూడగన్
  చేతనసారమైన రవి,చేడియలెల్లరు చల్లచిల్కుచున్
  జోతలజేయగా నగెడి చోద్యపు వెన్నలదొంగ కృష్ణునిన్

  రిప్లయితొలగించండి
 45. నీతిగ ధర్మమునిలుపను
  జాతికినొకహితవుజెప్ప జగతిననిలిచెన్
  ఖ్యాతిన్ న్యాయము దెలుపగ
  రాతిరిభాస్కరుడుపొడిచె ప్రాగ్శైలమునన్.

  రిప్లయితొలగించండి
 46. కం.
  చేతడి తప్పదు వలెనన
  వ్రాతన కీడును దెలుపగ రక్షక భటునిన్
  భీతిలి పనిగా వించగ
  రాతిరి భాస్కరుడు వొడమె ప్రాక్శైలము పై

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి


 47. రాతిరికి ముందు భాస్కరు
  డేతా వాతా పడమట డేరా దిగుచుం
  డే! తెల వారి, కనుమరుగ
  రాతిరి, భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 48. మూతిన కూరుచు తుడిచన్
  రాత్రే మెట్లుక్కె బాలల భవితననుచున్
  చేతినిపట్టుచు పోటిన
  రాతిరి భాస్కరుఁ డువొడమె ప్రాక్శై లముపై

  రిప్లయితొలగించండి
 49. చేతలు లేనియీప్రభుత , చేసెడుకార్యములన్ని శూన్యమై
  పూతనకన్నమిన్నయగు,పుట్టువు రాక్షసియాయె రాష్ట్రమే
  మాతలరాతమార్చుటది ?,మన్ననగాదని తేల్చరైతులే
  రాతిరియందుభాస్కరుడు,ప్రాగ్గిరిపై పొడసూపెజూడగన్.

  రిప్లయితొలగించండి