సతతము భక్తుల సేమము గతిదప్పకసేయునట్టి కార్యమ్మే స ద్గతినింజూపును గదయీ రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!!
****దక్షయజ్ఞం లో దాక్షాయణి ఆత్మాహుతి అయ్యాక పర్వతరాజు గా జనించిన పార్వతి కి పరమేశ్వరుని తో పరిణయం జరిగి వారికి తారకాసుర సంహారము నకై కార్తికేయుని జననం జరగాలని దేవతలు కోరుకున్న సందర్భంలో.....
సందర్భము: మహర్షి వాల్మీకి ప్రణీతమైన *శ్రీ యోగవాసిష్ఠం* ఒక ఉత్త మోత్తమమైన అధ్యాత్మశాస్త్రం. సంస్కృత గ్రంథం. వాసిష్ఠ రామాయణ మని వసిష్ఠగీత అని కూడ దీన్ని పిలుస్తారు. ఇందులో 32000 శ్లోకా లుంటాయి. వైరాగ్య, ముముక్షు, ఉత్పత్తి, స్థితి, ఉపశమ, నిర్వాణా లనే 6 ప్రకరణా లుంటాయి. అద్వైత వేదాంతం అద్భుతంగా ప్రతిపాదించబడింది. వసిష్ఠుడు రామునికి చేసిన తత్త్వోపదేశం ఇందలి విషయం. మహర్షి సద్గురు మళయాళ స్వామి వారు ఆంధ్ర తాత్పర్యంతో తెలుగు లిపిలో బహుశః 1957 ప్రాంతంలో తొలిసారి ప్రచురింపజేశారు. శ్రీ నిర్వికల్పానంద స్వామి సగభాగం శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారు సగభాగం తెనిగించారు. వ్యాసాశ్రమం ఏర్పేడు చిత్తూరు జిల్లా వా రీ గ్రంథాన్ని శ్రీ పూర్ణానందస్వామి వారి అనువాదంతో 8 సంపుటాలుగా ప్రచురించారు. ఇది ప్రస్తుతం కనిపిస్తున్నది. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ జిత సర్వేంద్రియ భూరి సత్వ నిలయుం జేసెం గదా! రామునిన్ మతిమంతున్ బొనరింపఁ జెప్పెను గదా! మాన్యుండు సద్దేశికుం.. డతు లానంద సు ధోపమాన మహితం బౌ " *యోగ వాశిష్ఠ* " భా రతియే మూలము సర్వ ధర్మముల సం రక్షింప లోకమ్మునన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 8.11.19 -----------------------------------------------------------
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
మతియున్ పోవుచు శంకరాభరణమున్ మర్యాదగా జొచ్చినన్
సతమున్ నేర్వగ నర్థముల్ తెలుగునన్ సంక్షిప్తమౌ తీరునన్
గతియున్ తెల్పుచు శబ్దముల్ విరివిగా కల్యాణమౌ నాంధ్ర భా
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
(కంది వారి సవరణతో)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిశబ్దార్థాలను తెలియజేస్తూ సర్వధర్మ సందేహాలు తీరుస్తున్న ఆంధ్రభారతి గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅంతర్జాలములో "ఆంధ్రభారతి" ఉనికిని సూచించి శంకరాభరణ ప్రాంగణమున కాస్తో కూస్తో నా ప్రాణ విత్త మానములను కాపాడిన గౌరవనీయ గురుతుల్యులు శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారికి శత సహస్ర వందనములు!
ఇట్లు
జి. ప్రభాకర శాస్త్రి
నమస్సులండి.
తొలగించండిచాలా చాలా బాగుంది
తొలగించండిఆ ఊహ రావటమే మెచ్చదగింది.
ఇతిహాసాది పురాణముల్ వివిధ సాహిత్యమ్ములే గాంచ స
రిప్లయితొలగించండిద్గతి మార్గమ్మును జూపుచున్ నడిపెడుద్గ్రంథమ్ములేకావుటే
క్షితిపై సాహితి సంపదల్ సతము సంక్షేమమ్మునేగూర్చు భా
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
చతురానను బ్రియ సతియే
రిప్లయితొలగించండిమతినిచ్చెడు తల్లియంచు మహికొలువన్ స
ద్గతి మార్గాచరణకు భా
రతి మూలము సర్వధర్మ రక్షణ కొరకై
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'కావుటే'?
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశ్రుతిపౌరాణికవాక్యసంకలితమై శుద్ధార్థసంపత్తి భా...
సితమై వ్యాసమునీంద్రశోభితమునై శ్రీమంతమై దేశసం...
స్కృతిరక్షాకవచమ్ము సంస్కృతము వాసింగాంచె , తద్దివ్యభా...
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోజ్ఞంగా, ఉత్కృష్టంగా ఉన్నది.
తొలగించండిసతతానందదసత్కవిత్వరచనా సత్కార్యయత్నస్థితా
రిప్లయితొలగించండియతభావాఢ్యకవీంద్రసంఘమునకీ యజ్ఞంబునందిందు స
న్నుతసామాజికవస్తుజాలముపయిన్ నూత్నంబుగా వెల్గు స
ద్రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్.
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
సతతము కొలిచిన వరమిడు
రిప్లయితొలగించండిమతిపోయిన వాని కైన మార్గము జూపున్
మితిమీరిన భక్తి నిలుప భా
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
కం.
రిప్లయితొలగించండిపతియగు బ్రహ్మకుసతి భా
రతి మూలము, సర్వధర్మ రక్షణ కొఱకై !
యతిపుంగవు లడిగినపుడు
గతినివ్వగ మానవాళి కవితలు నేర్చెన్ !!
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
మతినిన్ వీడుచు ఖర్గపూరునకు తా మౌనమ్ముగా జేరుచున్
సతమున్ మెచ్చెడి శాస్త్రివర్యునకు భల్ సంతోషమున్ గూర్చగా
పతితో గూడుచు భావి భారతమునన్ ప్రాణమ్ములన్ పోయుటన్
రతియే మూలము, సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితతియై సంతతి వృద్ధికి
రతి మూలము, సర్వధర్మ రక్షణ కొఱకై
మతి మూలము!పరమాత్ముని
స్థితి మూలము మన మనుగడ తిరముపడుటకున్!
జిలేబి
తొలగించండిఅద్భుతం!
శాస్త్రి గారన్నట్లు నిజంగానే అద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండి( మానవుల పరస్పరమాన్యతారతియే విశ్వరక్షణకు
రిప్లయితొలగించండికారణమౌతుంది )
సతియే మూలము భర్త కెప్పుడును సం
స్థాపింప గార్హస్థ్యమున్ ;
మతియే మూలము కావ్యకర్తలకు స
మ్మానంబు జేకూర్పగన్ ;
శ్రుతియే మూలము భారతీయులకు ; సం
స్తుత్యంబునౌ మాన్యతా
రతియే మూలము సర్వధర్మముల సం
రక్షింప లోకమ్మునన్ .
(శ్రుతి - వేదం ;మాన్యతారతి - గౌరవించే కోరిక )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసతతము భావ విహారిణి
రిప్లయితొలగించండిప్రతి భాషా లాస్య చతుర రాగిణి వాణీ!
వితతిన్గొని వెల్గెడి భా
రతి మూలము సర్వధర్మ రక్షణ కొరకై!
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండిస్తుతమతి మేలగు నడతల
రిప్లయితొలగించండివితతానందానురక్త విజ్ఞత పొసగన్
సతతము నిరపేక్ష్యంబను
రతి మూలము సర్వ ధర్మ రక్షణ కొఱకై.
రతి=అనురాగము,ఆసక్తి
ఆంధ్ర భారతి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిమత జాడ్యము విడనాడుచు
రిప్లయితొలగించండిమతి పేదల సేవకొరకు మళ్ళించి ధృతిన్
సతతము ప్రజాళిపై నను
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మరలించి' అనండి.
మతము ల వెన్నియు నైనను
రిప్లయితొలగించండిసతతము కాపాడు వాడు సర్వేశ్వ రు డా
పతి వేడుచు నొస గెడు హా
రతి మూలము సర్వ ధర్మ రక్ష ణ కొఱకై
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిమత భేదాలన్ని తొలగి
రిప్లయితొలగించండిక్షితిలో నుండెడి మనుజుల క్షేమము కొఱకై
మతిమంతులు నుడివెడి యభి
"రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిలతవలె నెదిగిన పుత్రికి
రిప్లయితొలగించండిప్రతతిన వెదకగ మతిగల వరుడే రాగా
తతరతిఁ వనితల కదలా
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!
ప్రతతి-సమూహము;
తతరతిన్-హెచ్చిన ఆనందముతో;
కదలారతి-వధూవరులు ప్రవేశించునపుడు పసుపు జలముతోకూడిన పళ్ళెముతో ఎత్తు హారతి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ప్రతతిని' అనండి.
కందము:
రిప్లయితొలగించండిగతి నీవని హరిని గొలువ
అతి గరుణయు కనికరమున యక్కున జేర్చున్
మతి నిలుప జపతపముల, ని
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కనికరమున నక్కున...' అనండి.
క్షితిపై సకల చరాచర
రిప్లయితొలగించండితతులకు సుఖజీవనమును తగ నేర్పరుపన్
గతులున్న దివ్య వేద ని
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై.
స్థితిగతుల మంచిచెడులను
మతి నెంచని కామ మెన్న మాపు ప్రథను సం
తతి కొఱకే నిర్దేశము
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యాదాలండీ.
తొలగించండిసతతము భక్తుల సేమము
రిప్లయితొలగించండిగతిదప్పకసేయునట్టి కార్యమ్మే స
ద్గతినింజూపును గదయీ
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!!
****దక్షయజ్ఞం లో దాక్షాయణి ఆత్మాహుతి
అయ్యాక పర్వతరాజు గా జనించిన పార్వతి కి పరమేశ్వరుని తో పరిణయం జరిగి వారికి
తారకాసుర సంహారము నకై కార్తికేయుని జననం జరగాలని దేవతలు కోరుకున్న సందర్భంలో.....
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమతిగల్గిన మానవులకు
రిప్లయితొలగించండిగతితప్పని యర్ధకామ గ్రహణమునందున్
సతతమ్మూనెడు ధర్మని
రతి మూలము సర్వధర్మరక్షణ కొరకై
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండిపతితుల శ్రేయము కొరకై
రిప్లయితొలగించండిసతతము శ్రమియించు సాధు సత్పురుషులకున్
మితమెరుగనట్టి త్యాగని
"రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై"
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిరతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై
రిప్లయితొలగించండిపతనము కోరక జనులిట
సతతము పూజలు జరుపుచు సద్భావన తో
వెతలను తల్వకి చ్చెడి హా
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై
🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వెతల దలప కిచ్చెడి..." అనండి.
ధన్యోస్మి 🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిసతియే మూలము గేస్తుడన్ని విధులన్ సాధింప సం పూర్తిగా
తతియై సంతతి వృద్ధిగాన, ధరణిన్ దార్ఢ్యమ్ముతోవెల్గగా
పతి ధర్మమ్మును వీడకన్, గృహిణి చేపట్టై నిధానమ్ముగా
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅతిసాగెడి సమ్మెలతో
రిప్లయితొలగించండిగతి తప్పిరిసర్వజనులు గమనము నిలువన్
మతితోనిడుమంగళహా
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిగతి యేదో భువిపైనటంచు ఋషులున్ గార్యార్తులై దీక్షతో
మతి ధ్యానమ్మున నిల్పి లోకమను నిర్మాణమ్ము సృష్టిస్థితుల్
క్షితిపై నాశపు రీతులున్శ్రుతుల నిక్షిప్తమ్మనన్నేర్వ భా
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిహితమన్నది మది నెంచుచు
రిప్లయితొలగించండిసతతము నేత లిట పనుల చక్కంజేయన్
గతితప్పక చూపెడి యను
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులకునమస్సులు, ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిమతి సమ్మతి సన్మతి యభి
రతి, యవిరతి కొఱతిలేని ప్రతికర్మముగా
యతికాని విధముగా యను
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కొఱతలేని' టైపాటు. "విధముగా ననురతి..." అనండి.
నుతు లిడుదు నొకటి వినుమా
రిప్లయితొలగించండివితండ వాదము లొసఁగు భువి వివాదములే
సతతము నరులకు ధర్మ ని
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై
[ధర్మ నిరతి = ధర్మాసక్తి]
విత తావేశముఁ గల్గఁ జేయు నిఁక హ్రీ భీత్యాదులం ద్రోయు సం
తత మెవ్వారికి నైన నొక్క త్రుటిఁ జిత్తభ్రాంతి కల్గించునే
యతులం బౌచుఁ జెలంగి కన్పడు మనో వ్యాప్తారి షడ్వర్గ యు
ద్రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
[యుత్ + రతి = యుద్రతి; యుత్ = యుద్ధము; అరిషడ్వర్గ యుద్ధ మందు రతి; యుత్కారము = యుద్ధము సేయుట]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిసతతం బోర్పు క్షమాగుణంబు విధిగా సత్యంబె మాటాడు టా
రిప్లయితొలగించండియతమౌ ధీనిధి విద్య శౌచవిధమున్ యక్రోధ భావంబు న
చ్యుతమౌ యింద్రియ నిగ్రహంబు ఒసగున్ ఉచ్చంబుకే పట్టు హా
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్౹౹
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విధమున్ + అక్రోధ' అన్నపుడు యడాగమం రాదు. 'ఒసగున్ + ఉచ్చంబు' అని విసంధిగా వ్రాయరాదు. సవరించండి.
సుతులే లేనిది యుత్తమ
రిప్లయితొలగించండిగతులే లేవని చెబుదురు కల్పము నందున్
సతిపతులకు సంతు నొసగు
రతి మూలము సర్వధర్మ రక్షణ కొరకై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచతురత సరస రసజ్ఞత
రిప్లయితొలగించండిశ్రితజన పాలన సమాజ సేవా నియతిన్
మత సహనము సత్కర్మ ని
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅతి సరదా పూరణ:
మా చిన్నప్పటి Jain Jeweller, Nellore:
మతిబోవంగను నాడువారి కిచటన్ మామూలుగా నాంధ్రనున్
చతికిల్ బడ్చును కూరుచుండి నగలన్ సంతోషమై చేర్చుటన్
పతులన్ గూడుచు మమ్ముజేరు సతులన్ వంచించుటన్ మేలుగా
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
రతి = గురిగింజ
(బంగారు తూకములో అన్ని గురిగింజలు సరాసరి ఒకే బరువుతో నుండును:
8 Ratti = 1 Masha; 12 Masha = 1 Tola (11.6 grams).)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
రతియే మూలము సర్వధర్మముల సం
రక్షింప లోకమ్మునన్
సందర్భము: మహర్షి వాల్మీకి ప్రణీతమైన *శ్రీ యోగవాసిష్ఠం* ఒక ఉత్త మోత్తమమైన అధ్యాత్మశాస్త్రం. సంస్కృత గ్రంథం. వాసిష్ఠ రామాయణ మని వసిష్ఠగీత అని కూడ దీన్ని పిలుస్తారు. ఇందులో 32000 శ్లోకా లుంటాయి. వైరాగ్య, ముముక్షు, ఉత్పత్తి, స్థితి, ఉపశమ, నిర్వాణా లనే 6 ప్రకరణా లుంటాయి. అద్వైత వేదాంతం అద్భుతంగా ప్రతిపాదించబడింది. వసిష్ఠుడు రామునికి చేసిన తత్త్వోపదేశం ఇందలి విషయం.
మహర్షి సద్గురు మళయాళ స్వామి వారు ఆంధ్ర తాత్పర్యంతో తెలుగు లిపిలో బహుశః 1957 ప్రాంతంలో తొలిసారి ప్రచురింపజేశారు. శ్రీ నిర్వికల్పానంద స్వామి సగభాగం శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారు సగభాగం తెనిగించారు.
వ్యాసాశ్రమం ఏర్పేడు చిత్తూరు జిల్లా వా రీ గ్రంథాన్ని శ్రీ పూర్ణానందస్వామి వారి అనువాదంతో 8 సంపుటాలుగా ప్రచురించారు. ఇది ప్రస్తుతం కనిపిస్తున్నది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
జిత సర్వేంద్రియ భూరి సత్వ నిలయుం
జేసెం గదా! రామునిన్
మతిమంతున్ బొనరింపఁ జెప్పెను గదా!
మాన్యుండు సద్దేశికుం..
డతు లానంద సు ధోపమాన మహితం
బౌ " *యోగ వాశిష్ఠ* " భా
రతియే మూలము సర్వ ధర్మముల సం
రక్షింప లోకమ్మునన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
8.11.19
-----------------------------------------------------------
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమత్తేభము :
రిప్లయితొలగించండిసతియే ధాత్రిని గానగా నలువయే సాగించు సృష్టే దనుఁన్
పతియే జూడగ బీజకుండుఁ గద నింపారంగ వంశంబునున్
మితియే లేనిది జీవితంపు కడలిన్ మీనంబులై నీదగన్
రతియే మూలము, సర్వధర్మముల సంరక్షింప, లోకమ్మునన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సృష్టి + ఏ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
విరివిగ మతములుగల భా
రిప్లయితొలగించండిరతదేశము సతము కలహ రహితమెటులనన్
మతముల నడుమన గల యను
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅతుకుల బొంతయగు బతుకు
న తరుణి తీరంగ సేద నాకిక దిక్కై
సతియై నావమ్మా భా
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!
ఓ మగడు పెనిమిటి తో
జిలేబీయము :)
రిప్లయితొలగించండిసతతము దేవళమందు వి
నుత! పరమాత్ముని కెడన్ తనువు మైమరపున్
స్మృతిని తలపించెడా భా
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!
జిలేబి
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'తలపించెడి + ఆ' అన్నపుడు సంధి లేదు. "తలపించు నా..." అనండి.
రిప్లయితొలగించండిసతి మేనన్ సగమై వికారి యగుచున్ సన్యాసియై మించుచున్
క్షితిలో సర్వ చరాచరమ్ములను భాసింపంగ తా నౌచు కిం
చితు నీ సృష్టికి నంటక న్నిలుచుచున్ జెన్నొందు శంభు స్వహృ
ద్రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్.
... కించితు నీ సృష్టికి....
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువు గారూ
తొలగించండికం.
రిప్లయితొలగించండిఇతిహాసము పరికింపన
సతతము ధర్మము నిలుచన సంతతి బలమున్
హితమగు హిందువు పెంపగు
రతి మూలము సర్వ ధర్మ రక్షణ కొరకై
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పరికింపను/పరికింపగ' అనండి.
మతజాడ్యమ్ముల నుజ్జగించుచును సన్మార్గమ్ముచూపించుచున్
రిప్లయితొలగించండిమతిలో కల్మషమున్ త్యజించి కడు సమ్మానమ్ముతో, గాఢమౌ
ధృతితోనిత్యము పండితోత్తములె యుద్దీపించి బోధించు భా
రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు. అసనారె
తొలగించండిఅతులిత శాస్త్రాధ్యయనము
రిప్లయితొలగించండిమితసంభాషణముమరియు మేదినియందున్
సతతము సత్సాంగత్య ని
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిఈ నాటి శంకరాభరణము వారి సమస్య
రిప్లయితొలగించండిరతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
ఇచ్చిన పాదము మత్తేభము నాపూరణము సీసములో
వ్యాసుని చూచి సత్యవతి పలుకు మాటలు అంబికకు అం,బాలికకు సంతానము ప్రాప్తించ మని అడుగు సన్నివేశము
చిత్రాంగదుండు సంస్ధితి పొందె గంధర్వు జేతిలో, జేయ విచిత్ర వీర్యు
నకు పెండ్లి మరణించె నధిక మౌ స్త్రీ లోలతన కొన్ని నాళ్ళకున్ , మనువు నాడ
మనిన యీ భీష్ముడు వినకుండె, యీ వంశమును కాచ వలయును, వినుము తాప
స, రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్,క్షితిపతి
లేని రాజ్యము శోభయే లేక నుండు
శత్రు రాజులు చేతురు శంబరమును
వ్యాస పుంగవా నిలుపుము వంశమిపుడు
ననుచు పలికె సత్యవతి నను నయముగను
మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సత్యవతి యనునయముగను' అనండి.
కందం
రిప్లయితొలగించండిఅతికూడదు నే పనులన్
స్థితితప్పక సృష్టి నుంచ సేమము కదరా!
క్షితిపై పర్యావరణ ని
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అతి కూడ దేపనులలో' అనండి.
రిప్లయితొలగించండిరతినిర్వేదము పోగొ
ట్టు తెంపుగల స్వాతియే కిటుకుగా వేమూ
రి తెలుగునాట నిలిచె! "గిరి",
"రతి" మూలము సర్వధర్మ రక్షణ కొఱకై!
నారదా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్షితిపై జీవుల సృష్టిజేయుచును సాక్షీభూతుడై నిల్చుచున్
రిప్లయితొలగించండిపతియై వారికి పూరుషార్ధముల సంప్రాప్తింపగా జేయుచున్
గతి తానౌచును ముక్తినిచ్చునుగ నేకాత్ముండు నీశాను హృ
ద్రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యోస్మి గురుదేవా,నమస్సులు!!
తొలగించండి
రిప్లయితొలగించండిమతిపోయిన "జీవుల"కే
రతి మూలము; సర్వధర్మ రక్షణ కొఱకై
మతమేదైనను విదురులు
హితమును కోరెదరు ప్రజలహీనులు గాకన్!
జిలేబి
వెతలను బాపుమ టంచును
రిప్లయితొలగించండిసతతము జగతిని జనులను చల్లగ కావన్
హితమొసగెడు శ్రీహరి హా
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై
సతతము జ్ఞాన మరయభా
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై
హితమును బోధించెడి యా
యితిహాసమ్ములను చదువుమింపుగ పుత్రా.
సతిపతులు సంతు పొందగ
రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై
మితమగు కోర్కెల తోడను
హితకరమగు పనులు చేయ యిమ్మగు మదికిన్