9, నవంబర్ 2019, శనివారం

సమస్య - 3186 (చలికాలమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్"
(లేదా...)
"తగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్"

102 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పాళము'? 'పిలగాడు' అన్నది మాండలికం.

   తొలగించండి

 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  చలిలో నాతో మాటలు
  కలుపగ పక్కింటి భామ గడపకు సరసన్
  తలుపులు దభేలు మనగనె
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్

  రిప్లయితొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  చలి యని వేడిగ వడలను
  చెలి వండుచునుండ., జేరి చెక్కిలి నొక్కన్
  లలితముగ విసిరెనొక వడ !
  చలికాలమున వడదెబ్బ చప్పున తగిలెన్.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి

  2. అదురహో !

   మరీ కిసుకిసుగా వుంది :)   జిలేబి

   తొలగించండి

  3. పగిలిన గ్రుడ్డునుండి యదె వచ్చెను గెంతుచు పక్షిపిల్ల , తా
   నెగురుట జూచి తల్లిని, రహిన్ వినువీథికి బోవనెంచగా
   గగనమునందహస్కరుడు కాంతులు చిందగ లేత యొంటిపై !
   తగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్.!!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 4. మిత్రులకు విన్నపం....
  ఎవరైనా scribd.com లో Kumbha vivaha vidhi పుస్తకం pdf డౌన్ లోడ్ చేసి పంపగలరా? అత్యవసరం.

  రిప్లయితొలగించండి
 5. వలనయిన కాపురంబున
  తొలిసారిగ మగడు తనను దూరిన పూటన్
  చెలి నోయుట జూడ, తెలిసె
  "చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్"

  రిప్లయితొలగించండి
 6. రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కలిసివచ్చిన' అనడం సాధువు. 'ఒచ్చిన' అనరాదు. 'వేళను' అనండి. రెండవ పాదంలో అన్వయం సరిగా లేదు. 'తెలుపన'?

   తొలగించండి
 7. లలనామణి పర్వంబున
  పలు వంటలు చేసి యుంచె వానిం గొనగా
  తలపడిన మగని ముఖమున
  చలికాలమున వడదెబ్బ చప్పున తగిలెన్

  మగడొకనాడు మేలమున మానినిపై సరసోక్తు లెన్నియున్
  దగునని వైచుచున్ కుసుమ తాడనమున్ బొనరించుచుండ దా
  నగణితమైన ప్రేమమున నాయమ భక్ష్యము లంది
  త్రోయగా
  తగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్.

  వడ=గారె.

  రిప్లయితొలగించండి
 8. కలి కాలమున గద కరుణ
  యెలేక విపరీతములవి యెన్నగ దెలుపన్‌
  గెలుపోటము లెంచకుమీ
  చలి కాలమున వడదెబ్బ చప్పున తగిలెన్

  రిప్లయితొలగించండి
 9. *చలికాలమున వడదెబ్బ చప్పున తగిలెన్*

  *కం||* 1

  కలియుగ మందున జనులిట
  విల విల లాడర యెపుడును విధి యాటలలో
  కలుషిత మైన యవనిలో
  చలి కాలమున వడదెబ్బ చప్పున తగిలెన్

  *కం|| 2*
  సరదాగా రాసినదే

  తలచినదే తరుణముగా
  అలిగిన యాలిని వదలగ యత్తింటన నేన్
  తెలియగ నా యానందము
  చలికాలమున వడదెబ్బ చప్పున తగిలెన్

  *కం||3*

  చెలి వెళుదుము యని యన్నది
  చలికాలమున, వడదెబ్బ చప్పున తగిలెన్
  నిల తీసుకు వెళ్ళగ నే
  చెలియనెడారికి, యిసుకన ఎండలనపుడున్

  *కం||4*

  అలిగిన యాలిని యడుగగ
  కలుపుచు పిండిని వడలకు కడు కోపమునన్
  పులుపుగ పంటికి తగలగ
  చలికాలమున, వడ దెబ్బ చప్పున తగిలెన్!!

  🙏🙏🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   2లో '..యత్తింటను' అనండి.
   3లో 'చెలి యేగుదమని యన్నది' అనండి. 'నిల'?
   4లో '...యాలిని నడుగగ' అనండి.

   తొలగించండి
 10. కందం
  కలుషిత వాతావరణము
  వెలయుచు ఋతుగతుల మార్చెఁ బృధ్వీ స్థలిపై
  జలదము శరత్తున గుఱిసె
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్

  రిప్లయితొలగించండి
 11. చలిమలమాటునజేరిన
  చలమరియగు శత్రుసేన చలమడగింపన్
  చెలగినమన వీరులఁగన
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్

  రిప్లయితొలగించండి

 12. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  రగులగ రొంప తుమ్ములును లాగుచు కుంపటి నీటి పాత్రనున్
  వగచుచు యూకలిప్టసును భగ్గున కల్పుచు వేడి యావిరిన్
  మొగమును కప్పి దుప్పటిని మోదము తోడను పీల్చుచుండగా
  తగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్

  రిప్లయితొలగించండి
 13. చెలియనురాగపుచూడ్కులు
  కలవరమొదవగమనమునకాంక్షలురేపున్
  చెలియలిగియురిమి చూడగ
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్

  రిప్లయితొలగించండి
 14. విరించి.


  మగువయె వంట నేర్చుకుని మక్కువ తోడను పిండి వంటలే

  మొగనికి వండిపెట్టఁ దల పోయుచు చేసెడు వేళ నంతలో

  జగడమె యంకురింపకను జవ్వని కొట్టెను వేడి గారెతో

  తగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్

  రిప్లయితొలగించండి
 15. అలుకలు తొలగును జంట కు
  చలి కాలమున : వడ దెబ్బ చప్పున తగి లె న్
  చెలరే గె డి రవి కిరణ ము
  తల ల కు నేరు గ ను దాక ధాత్రీ జను ల న్

  రిప్లయితొలగించండి
 16. ౧.

  వలపులదొర పున్నమి వె
  న్నెలలో, హేమంతమందు, నిగుడింప శర
  మ్ముల, చెలిదరి చేరనిచో
  చలికాలమున వడదెబ్బ చప్పున దగిలెన్

  రిప్లయితొలగించండి 17. అలకలు తీరిన తరుణము
  చెలివలపుల సంగ మంబు చేర్చును నభమున్
  విలవిల లాడిన మనసులు
  చలి కాలమున , వడదెబ్బ చప్పున దగిలెన్

  రిప్లయితొలగించండి


 18. అలపద్మహస్త వికసిత
  పు లపనసఖి చంద్రముఖి కపురపు పిసాళ
  మ్ముల ణిసిధాత్వర్థమ్మున
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్!

  నారదా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ అర్థం చేసికొనడానికి నారదుడు ఆంధ్రభారతి తలుపు తట్టమన్నాడు.
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 19. ఆకాశవాణికి పంపినది :)


  అలకొలకొల్కియె వలచుట
  వలదని త్రోయంగనరె దవదవానలమై
  వలపది మీరగ మగనికి
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. మగువ తలంపు నిత్యమును మానసమందున చేరి కాల్చగా
  సెగ రగిలించ మన్మథుడు చెచ్చెర చేరి మనస్సునందునన్
  మగనికి రేగ దేహమున మంటలు, శ్రీమతి లేని యింటిలో,
  తగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్

  రిప్లయితొలగించండి

 21. బెంగుళూరు, చెన్నై మార్గమున,8th Nov 2019 రాత్రి పలమనేరు మొగిలి ఘాటు రోడ్డు ఘోర ప్రమాదము


  పగిలెను గుండె చూడ జనవాసము దాటుచు ఘాటురోడ్డులో
  మొగిలి సమీపమందు వెస మోదగ ట్యాంకరు మారుతిన్ తటా
  లు గివురి దారితప్పుచు పెళుక్కున, మాంసము చిమ్మరేగగా
  తగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్.


  నివాళి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సమకాలీనాంశంపై స్పందించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 22. ఆకాశవాణి వారి సమస్య వచ్చే వారానికి

  *ధర్మము వీడు వారలకు తప్పక గల్గును శాంతి సౌఖ్యముల్*

  పంపించాల్సిన చిరునామా

  Padyamairhyd@gmail.com

  గురువారం సాయంత్రం లోగా చేరాలి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. నెనరుల్స్ ! అంపితిమి :)

   ఈ వారపు విశేషములేమిటి ?


   జిలేబి

   తొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు గారు ఈరోజు మీ పూరణ పద్యాన్ని ఆకాశవాణిలో చదివారు.

   తొలగించండి
 23. అలిగిన సతి కనులవియే
  మలగిన దీపములుగాగ మగనికి నిశినిన్
  కలువల రేడయి కుతపుడు
  చలికాలమున వడదెబ్బ చప్పున దగిలెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వగపున పుట్టినింటికిని వారిజనేత్రయె యేగవేగమే
   తగదని వెంటనేగుచును దక్షిణనాయకు డాలివేడగా
   బిగువున మాటలాడకను వీథినిద్రోయగ భర్తగారికిన్
   దగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!!

   తొలగించండి
 24. చెలియలికట్టను వేచెడి
  చెలియను దరి జేరగ మది చిందులువారెన్
  వలపుల కాకయె రగిలెను
  చలికాలమున వడదెబ్బ చప్పున తగిలెన్

  రిప్లయితొలగించండి
 25. చెలియలికట్టను వేచెడి
  చెలియను జేరితి దడవున జిక్కున బడితిన్
  అలసత సైపని చెలి గన
  చలికాలమున వడదెబ్బ చప్పున తగిలెన్

  రిప్లయితొలగించండి
 26. ఆకాశవాణి హైదరాబాదు నందు నేడు ప్రసారమైన నా పూరణము

  కందం
  చెలి యనురాగమ్మునఁ దా
  వలపున్ బంచఁగఁ దనువడు వరునకు విరహా
  నలమిడుచు కాన్పు కేగగఁ
  జలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్

  (తనువడు = చల్లబడు)

  రిప్లయితొలగించండి
 27. సమస్య :-
  "చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్"

  *కందం**

  చెలి వడలు జేయు సమయము
  పలుమార్లు సరస పలుకులు పలుకగ వేసెన్
  చెలి చిరు కోపమున వడలు
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్
  ......................✍చక్రి

  రిప్లయితొలగించండి
 28. కందం
  చెలిమిని వలపులు రేపిన
  చెలి శుభలేఖ నిడగ తన చెంతను చేరన్
  కలకరుగ చెలుని కయ్యో
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్

  రిప్లయితొలగించండి
 29. లలనా!వినుమీపలుకులు
  చలికాలమునవడదెబ్బచప్పునతగిలె
  న్నిలనెన్నివింతలింకను
  గలియుగమునజూడవలయుగలిప్రభుచేష్టల్

  రిప్లయితొలగించండి


 30. తొలగును ముకద్దమాయిక
  తెలవారగ; మదిని చట్టు తీవ్రతరముగా
  పలుమార్లు నాటి తలపుల
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్!


  రిప్లయితొలగించండి


 31. అలుకయె తోడు జిలేబులు
  కులుకుల సరసమ్ముల రతగురువుల కాల్చన్
  తెలుసుకొనవె చెలికాళ్ళకు
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్!


  రిప్లయితొలగించండి
 32. ( పగలంతా పూలతోటలో శ్రమించి ఎండదెబ్బ తిన్న భర్తను గురించి లలితకు చెప్తున్న లావణ్య )

  సొగసుల వన్నె చిన్నియల
  సొంపులు నిండిన పూలతోటలో
  పగటిని మొత్తమున్ దరుల
  పాదుల ద్రవ్వుచు రాలనేరుచున్
  సెగలకు లక్ష్యమయ్యెగద
  చెల్వగు భర్త ; యికేమి చెప్పెదన్ ?
  దగిలెను శీతకాలమున
  దారుణమౌ వడదెబ్బ చప్పునన్ .

  రిప్లయితొలగించండి
 33. ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
  సమస్యాపూరణ కార్యక్రమంలో...
  09/10/2019 శనివారం ప్రసారమైన నా పూరణ..

  చలికాలమున వడదెబ్బ చప్పున గలిగెన్

  నా పూరణ. కం
  **** *** ***

  పలురక కాలుష్యమ్ములు

  గలుగుగ పర్యావరణము గతిదప్పెను వా

  నలు గురిసెను వేసవినన్

  చలికాలమున వడదెబ్బ చప్పున దగిగెన్

  -- ఆకుల శాంతి భూషణ్

  వనపర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పలురకముల కలుషమ్ములు' అనండి.

   తొలగించండి
 34. బలశాలియు మగధీరుఁ డ
  మలాంతరంగునకు నకట మాటల యందుం
  దెలిసెను వేసవిఁ, గాదట
  చలికాలమున, వడదెబ్బ చప్పునఁ దగిలెన్


  విగత వివేకుఁడై పడఁగ వేగమ కాంచిరి బంధు మిత్రులే
  పగళులు రాత్రులందుఁ దమి వంటలు సేయఁగ గాడిపొయ్యి చెం
  తఁ గరము మండు చుండగను దద్దయు వేడిని సైఁచు చుండగం
  దగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్

  రిప్లయితొలగించండి
 35. మగువను వెంటబెట్టుకొని మాపటి వేళను బూటకూటి యి
  ల్లుఁ గని క్షుధార్తి మెక్కిరట రుచ్యకవో‌ష్ణసుభోజనమ్ములన్,
  దగు నిధి లేక జంట యటఁ దంచిరి రుబ్బిరి స్వేదమూరగన్
  దగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్.

  రిప్లయితొలగించండి
 36. కం.
  మలి పొద్దున చెలి బిలువగ
  కలిగిన వేడిమికి తనువు కళపెళ లాడన్ !
  తొలిచూపుల కౌగిలిలో
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్ !!

  రిప్లయితొలగించండి
 37. వగచుచు నా నలుం డరిగె వారిజనేత్రిని వీడి కానలన్
  తగిలి మహా విషాజనిత తక్షకు వ్రేటుకు బాహుకుం దలం
  పగ దమయంతి మారుమనువంచ టు చాటగ నాతడేవినన్
  తగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్


  నలుడా దమయంతిని విడి
  పలుదేశమ్ములు దిరుగుచు బాహుకు పేరన్
  మలిపెళ్ళి సభర్తృకకన
  చలికాలమున వడదెబ్బ చప్పున దగిలెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. 🙏 ధన్యవాదములు.
   మీ ప్రేరణే నాలో నుత్సాహము నింపుచున్నది.

   తొలగించండి

 38. సలసల కాగిన నూనెను
  చెలి నదరుగ వేచి తెచ్చె జిహ్వకు రుచిగా
  నిల మరచితి తన్మయమున
  చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్.

  రిప్లయితొలగించండి

 39. కలిపులి నేడ్సును వడయన
  వెలయాలుల చెంతజేరి విలువలు దప్పన్,
  బులబాటముబుద్బుదమై
  చలికాలమునవడదెబ్బ చప్పున‌‌ దగిలెన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు , మీర్ పేట్,రంగారెడ్డి

  Show quoted text

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బులపాటము' అనండి.

   తొలగించండి
  2. కలిపులి నేడ్సును వడయన
   వెలయాలుల చెంతజేరి విలువలు దప్పన్,
   బులపాటముబుద్బుదమై
   చలికాలమునవడదెబ్బ చప్పున‌‌ దగిలెన్
   కొరుప్రోలు రాధాకృష్ణారావు , మీర్ పేట్,రంగారెడ్డి

   తొలగించండి
 40. కం.
  నిలువగ యెన్నిక గెలుచగ
  ఫలితము మెండుగ దలచుచు భాసుర మొందన్
  తెలువగ భిన్నపు పోకడ
  చలికాలమున వడదెబ్బ చప్పున దగిలెన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొంత అన్వయలోపమున్నది. 'నిలువగ నెన్నిక గెలువగ' అనండి.

   తొలగించండి
 41. సెగలను క్రక్కు వేసవిని స్వెట్టరు శాలువ కప్పుకొంటి, నే
  పుగ పడు వర్ష ధారలను ముర్కులఁ బెట్టిన వైనమేమిటో
  తగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్
  తెగులిది ప్రేమమైకమిది తేరుకొనంగ నుపాయమేమిటో౹౹

  రిప్లయితొలగించండి
 42. చంపకమాల

  రగిలెను మానసంబుఁ. విరహంబున నెర్ర నివేడి మంటలున్
  మిగిలెను వేద నాశ్రువులు మీటగ. మానసవీణ మూగబోయ్
  పగిలెను నాలి రాగ మ నురాగ మువీడ గమండె గుండెలోన్
  తగిలెను శీత కాలము నదారుణమౌ వడదెబ్బ చప్పునన్!

  రిప్లయితొలగించండి
 43. చంపకమాల
  మగనికి నిష్టమౌ వడల మస్తుగ జేయఁగ సంకురాత్రికిన్
  బొగలిడు చుండఁ గొన్ని తగ భోజన మందున కొన్ని సంధ్యవే
  ళ గదురుకొంచు కొన్ని సుత రంజిల బెట్టుచుఁ గొన్ని మెక్కగన్
  దగిలెను శీతకాలమున దారుణమౌ 'వడ' దెబ్బ చప్పునన్

  రిప్లయితొలగించండి
 44. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  తగిలెను శీతకాలమున దారుణమౌ
  వడదెబ్బ చప్పునన్

  సందర్భము:
  న చాస్య మహతీం లక్ష్మీం
  రాజ్య నాశోఽపకర్షతి
  (రాముని ముఖంలోని కాంతిని రాజ్యభ్రంశం కొంచెంకూడా తగ్గించలేకపోయింది వనగమనారంభంలో..) అంటాడు వాల్మీకి.
  మన ముం దొక గ్రంథరాజ మున్నది. దాని పేరే...
  "రఘు రామ రాజ చరితము" (అనగా ఇక్కడ రాముని చరితము.. అని కాకుండా రామునియొక్క రాజ చరితము లేదా రాజుగా రాముని చరితము అని అర్థం తీసుకోవాలి.) అదే చలికాల మనుకుంటే...
  ఆ పుస్తకంలో "అరణ్య గమన" మనే ఒక సన్నివేశ మున్నది. అదే ఒకానొక వడదెబ్బయై సోకిం దనుకుంటే...
  పాఠకులకు విషాదం మితిమీరి విలవిలలాడిపోయారు. (చక్రవర్తి అవుతా డనుకొన్న రాముడు తెల్లవారేటప్పటికి అరణ్యానికి పయనం కట్టవలసివచ్చింది కదా!)
  నిజంగానే చలికాలంలో వడదెబ్బ తగిలినట్టే అయింది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  తగ రఘు రామ రాజ చరి
  తం బను శీతల కాలమం దర
  ణ్య గమన సన్నివేశ మర
  యన్ వడదె బ్బయి సోకగా విషా
  ద గురుతచేతఁ బాఠకులు
  తల్లడ మందిరి.. నిక్కమే కదా!
  తగిలెను శీతకాలమున
  దారుణమౌ వడదెబ్బ చప్పునన్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  9.11.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 45. చలికాలమున వడదెబ్బ చప్పున దగిలెన్

  కలుషితమగు నీ యవనిన
  పలు గాలులు పెరుగగ నిల భయపెట్టగనే
  తెలుసు కొనుట మంచిది నిక
  చలికాలమున వడదెబ్బ చప్పున దగిలెన్

  🙏🙏

  రిప్లయితొలగించండి
 46. చెలియను నేనని నమ్మగ
  పలుకుచు సర్వమును దోచి పరుగులు దీయన్
  తలపై కొట్టిన దెబ్బకు
  చలికాలమున వడదెబ్బ చప్పునదగిలెన్.

  రిప్లయితొలగించండి


 47. పలికెనతడు క్రోధముతో
  నిలువెల్లనకంపనని పనితనము సరి లే
  దిలని పనివాండ్లది! చలా
  చలి కాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్!


  చలాచలి - వేగిరపాటు ఆంధ్రభారతి ఉవాచ


  జిలేబి

  రిప్లయితొలగించండి


 48. కులుకుచు చూపుల తడుముచు
  పలుమారులు ముకమలు తెర పలపల తొలగిం
  ప, లలంతికపు తళుకు పుం
  శ్చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్!

  పుంశ్చలిక+అలము - పుంశ్చలికాలము :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 49. హైదరాబాదు ఆకాశవాణి ప్రసారం చేసినది
  పలుకుల కోపము,రోషము
  చిలుకుచు శత్రువు మహోగ్ర ఛీత్కారముతో
  నిలు నిలు మనె కఠినోక్తుల--
  చలికాలమున వడదెబ్బ చప్పున తగిలెన్

  రిప్లయితొలగించండి
 50. చిలిపిగ జూచుచు సఖియే
  పిలిచెను రారమ్మనుచును విరహము తోడన్
  జెలికన్నులలో తాపమె
  చలికాలమున వడదెబ్బ చప్పున దగిలెన్.

  రిప్లయితొలగించండి
 51. విరించి.


  చలిమంట ముందు కూర్చుని

  పలువురతో మాటలాడు పాళము నందున్

  జెలిమరి గారెను విసురగ

  చలికాలమున వడదెబ్బ చప్పున తగిలెన్.

  రిప్లయితొలగించండి