5, నవంబర్ 2019, మంగళవారం

న్యస్తాక్షరి - 66

కవిమిత్రులారా,
'సు - ప్ర - భా - తం'
పై అక్షరాలతో వరుసగా నాలుగు పాదాలను ప్రారంభిస్తూ
సూర్యోదయాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి. 

70 కామెంట్‌లు:

 1. మైలవరపు వారి పూరణ

  సుమములన్నియు వికసించి సొంపులీన
  ప్రకృతి చైతవ్యవంతమై పరిఢవిల్లు!
  భానుడా! నిన్ను జూచుట భాగ్యమయ్య!
  తండ్రి! గొనుమయ్య శతకోటి దండములివె!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 2. సుపతుడుద్భవింప శోభిల్లె ప్రాగ్దిశ
  ప్రభలు వెల్లి విరియ వసుధ మురిసె
  భాస్కరాగమనము పరికించి శకునముల్
  తందరమును వీడె తరువు లందు.

  రిప్లయితొలగించండి
 3. సుకవి యెదలోన కదలాడు సూక్తులట్లు
  ప్రబలుచుండిన కిరణాల పంక్తితోడ
  భానుబింబము తూర్పున ప్రభవమందె ;
  తండ్రి గాంచిన విశ్వమ్ము ధన్యమయ్యె .

  రిప్లయితొలగించండి
 4. సుంద రంబైన కిరణంపు సోయ గములు
  ప్రకృతి పులకించు నుదయాన పలుక రించి
  భాను తేజపు విటమిను ప్రాణ బిక్ష
  తనరు మదినిండ నినుగొల్చు ధన్య మయ్య

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నాల్గవ పాదం 'తం'తో ప్రారంభం కావాలి. "తండ్రి! మదినిండ నినుగొల్చి ధన్యనైతి" అంటే సరి!

   తొలగించండి
  2. సుంద రంబైన కిరణంపు సోయ గములు
   ప్రకృతి పులకించు నుదయాన పలుక రించి
   భాను తేజపు విటమిను ప్రాణ బిక్ష
   తండ్రి మదినిండ నినుగొల్చి ధన్య నైతి

   తొలగించండి
 5. (సు)మధురానందభాగ్యమ్ము చొప్పుమీర
  (ప్ర)తిదినమ్మును భువిపైన బంచగోరి
  (భా)ను డేతెంచు జగతికి బంధుడగుచు
  (తం)బి! మ్రొక్కంగ రావోయి తన్మయమున.

  రిప్లయితొలగించండి


 6. సుదిన మిదియె రండి సుందర మైనది
  ప్రగతి కిది భళా సభాస్థలి! మది
  భారము తొలగంగ భాసిలు తేజము
  తంకవమ్ము ద్రోలు తరుణమిదియె!

  శుభోదయం రేపటి న్యస్తాక్షరి :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రేపటి న్యస్తాక్షరి'?

   తొలగించండి

  2. ఇవ్వాళ సుప్రభాతం‌ ఇచ్చేరు రేపు శుభోదయం ఇస్తారేమోనని :)   జిలేబి

   తొలగించండి
 7. సుగుణ కౌసల్య ముద్దుల శుద్ధ ముక్త!
  ప్రకృతి వొడిలోన నిదురించు పావనత్మ!
  భానుడుదయించె తూర్పున పసిడి వోలె
  తండ్రి యికలేచి వర్తించు తగిన రీతి

  రిప్లయితొలగించండి
 8. సుప్త జగతిని మేల్కొల్పు జోత యనగ
  ప్రభవమందిన యరుణపు బంతి యనగ
  భాగ్య సంపూజ్య దినకర ప్రాభవములు
  తంబురలు మీటు ధ్వనులను ధాత్రి నింపె.

  రిప్లయితొలగించండి
 9. సుమములరవిచ్చె స్రవియించె హిమము తరుల
  ప్రభలు తూరుపుదిక్కునపరచె బాల
  భానుడుదయించెతిమిరమ్ము భగ్నమాయె
  తండ్రి శ్రీరామ సుప్రభాతమ్ము నీకు

  రిప్లయితొలగించండి


 10. నా పూరణ. తే.గీ.
  ** *** *** **

  సుమము వోలె ప్రాగ్దిశ విచ్చె సూను డంత

  ప్రకృతి మేల్కొని ముదమొందె ప్రభల గాంచి

  భాను డిడ శక్తి బరుగిడు బ్రతుకు బండి

  తండ్రి వోలె గాచు నిడు వందనము భక్తి


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
 11. సురుచి రంబైన కిరణాలు శోభి లంగ
  ప్రకృతి పులకించి వికసించె భాసి లంగ
  భాను డు ద యింప తూర్పున భవ్య ముగను
  తండ్రి యనుచు ను ప్రణ మిల్లె ధాత్రి యంత

  రిప్లయితొలగించండి
 12. (సు)దృఢమైనట్టి ధైర్యమ్ము నెదలలోన
  (ప్ర)స్ఫుటింపగ జేయుటే పనిగ గొనుచు
  (భా)సురంబైన రూపాన బ్రాచి నదిగొ
  (తం)డ్రి యౌచును విచ్చేసె తరణి కనుడు.

  రిప్లయితొలగించండి
 13. సుజన జీవుల చైతన్య శోభ నింప |
  ప్రకృతి యెల్ల పరవశించి పాట పాడ |
  భాను డుదయించె ప్రాగ్దిశ భాసురముగ |
  తంనమామి యని కొలుతు ! తపను నెపుడు |

  రిప్లయితొలగించండి

 14. సురగురు పూజ్యా! సూర్యా!
  ప్రసరణ మాత్రేణ సర్వప్రాణ సుఖాయా!
  భాస్కర! వసవే! దేవా!
  తం!కరుణాలయ! జయాయ! తరుణా! అరుణా!
  (తం - పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) ధనధాన్యాలను సిద్ధింపజేసే శక్తి కలిగిన మోహకర బీజాక్షరం)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది. ఇది కందపద్యమనుకుంటే ప్రాసభంగం. మొత్తం సంస్కృత సంబోధనలతో ఉంది. ఆర్యావృత్తమా?

   తొలగించండి
 15. (సు)క్కురుండుదయించగా సుక్రతుండు
  (ప్ర)భలు వెదజల్లి ప్రాగ్దిశన్ పరిఖ మద్య
  (భా)వుకమునిడ నతనికి పక్షులెల్ల
  (తం)ద్ర వీడి పలికె స్వాగతంబునపుడు

  తూర్పు దిశలొ శుక్రుడు సూర్యుని కన్నా ముందుగా ఉదయిస్తాడు. సూర్యుడు కొండ నడుమ మధ్య నుంచి శుభము నిడగా అప్పటిదాకా (తంద్ర = కునికిపాటు )పదుచున్న పక్షులు స్వాగతము పలికినయ్యి అను భావన

  రిప్లయితొలగించండి
 16. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సున్నితమ్ముగ పుష్పాలు సోకు లొందె
  ప్రకృతి పరవశ మొందుచు వన్నె మీఱె
  భాస్కరోదయ మెల్లెడ పసను దెచ్చె
  తండ్రి రవి నెంచి జనులిల థన్యు లయ్యె.

  రిప్లయితొలగించండి
 17. సుతవుడు వెలుగునీయ వ సుధమురిసె
  ప్రమితి నొసగగ నుదయించె ప్రాచి నందు.
  భారిగ తన శక్తినొసగె భవ్యముగను
  తండులము నుడికించుము తగినరీతి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సుతవుడు/సుతపుడు... టైపాటు.
   మొదటి పాదంలో గణభంగం. "..వసుధయె మురిసె" అనండి.

   తొలగించండి
 18. సుమములన్నియు విరిసెను సుందరముగ
  ప్రమదలల్లిరి ముగ్గులు వాకిళులను
  భాను కాంతుల విప్పారె పంకజములు
  తండ్రి! లోక బాంధవ నీదు దర్శనమున

  రిప్లయితొలగించండి
 19. తే గీ..🙏🙏 అర్థవంతముగా ఉన్నదో లేదో గురువులు చెప్పాలి ..
  ఇది నా మొదటి తేట గీతి పద్యప్రయత్నం 🙏🙏

  (సు)దినమున వచ్చును మనకు సుకిరణములు
  (ప్ర)జలకు జరుగునుగ మంచి ప్రార్థన నిట
  (భా)నుడి కిరణములు మన బాధ దీర్చు
  (తం)డ్రి గ తలచి జరుపుము తగిన పూజ

  అర్థవంతముగా లేనియెడల మన్నించ ప్రార్థన 🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యోస్మి 🙏🙏🙏🙏🙏

   ఇది రాయడానికి పడ్డ కష్టం, పోస్ట్ చేసిన అనంతరం పడ్డ టెన్షన్ నాకే తెలుసు..
   మరియొక సారి 🙏🙏🙏

   తొలగించండి
 20. డా. జి.సీతాదేవి గారి పూరణలు.....
  (1)
  సుమము లన్నియు విరిసెను చుక్కలలసె
  ప్రకృతి పులకించి పాడెను పరవశాన
  భానుడుదయించ ప్రాగ్దిశ భాసురముగ
  తంకమేటికి మాకిక తామసారి!
  (2)
  సుప్త జగతిని మేల్కొల్పు సూర్యదేవ
  ప్రభవ మొందెదవీవదె ప్రతిదినమ్ము
  భాసమాన మగుచు సుప్రభాతవేళ
  తండ్రి! నీకంటె మిత్రుడు ధరకుగలడె!

  రిప్లయితొలగించండి
 21. తేటగీతి
  సుగతిఁ గొన సుషుప్తి విడచి సతపునంది
  ప్రకృతి కాంత బొట్టుగఁ జేసి బయలుదేర
  భావి కర్తవ్యమదియేదొ వదలకుండు
  తంత్రమిదనెడు బోధలఁ దలపులందె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. 🛐ధన్యోస్మి గురుదేవా🛐

   మొదటి పాదంలో టైపాటు 'సుతపు నంది' అని చదువుకొన ప్రార్థన

   తొలగించండి
 22. ఈ నాటి శంకరా భరణము సమస్య

  దత్త పది ( సు, ప్ర , భా, తం) ఈ అక్షరములు పాద అరంభములొ వచ్చు నట్లు సూర్యోదయ వర్ణన
  నా పూరణ సీసములో ప్రతి పాదము మొదలు మరియు యతి స్ధానములలొ ఆ అక్షరములు వచ్చు నట్లు సీసము మరియు ఎత్తు గీతిలో కూడా పూరణ  (సు)తపుడు !సూతుడు!(సు)క్రతుడు!సవిత!
  శూరుడు!శుష్టుడు!సూరి!హర్త!

  (ప్ర)త్యూషుడు!పితువు!(ప్ర)ద్యోతనుడు!పాసి!
  పద్మినీ కాంతుడు!పటుగభస్తి!

  (భా)స్కరుండు!భుజుడు!(భా)సుడు!ఖాఁకుడు
  కాశ్యపేయుడు!కాశి!గగన మణి! ప

  (తం)గుడు!పాతంగి (తం)డ్రి!దివామణి!
  దినపతి!ధరణుడు!దిశ్యకరుడు!

  (సు)ప్ర భాత సమయమున (సు)షమ నిడుచు
  (ప్ర)త్యహమ్మున నుదయించు (ప్ర)భలతోడ,
  (భా)ను డా స్వాగతమని జం(భా)ల నిడుచు
  (తం)ద్ర వీడి పల్కె పతంగ (తం)డమపుడు

  జంభాలు = అవలింత , తంద్ర = కునికి పాటు , తండము = గుంపు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిత్రకవితా విశారదులు మీరు. ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
 23. ఆ.వె.
  సుఖము నీదు వెలుగు సూచించ ప్రగతిని
  ప్రజల మేలు గోరి ప్రజ్వరిల్లు
  భాగ్య దాత వీవు బహుశుభ హేతువు
  తండ్రి నీదు కృపన తగ్గు నార్తి

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 24. సురుచిరమయిన కాంతితో ధరణిపైన
  ప్రజ్వరిల్లి రక్షింతువు ప్రకృతి నెపుడు
  భాస్కరా నీదు దర్శన భాగ్యము సత
  తంబుదయమున శుభమిడు తప్పకుండ

  రిప్లయితొలగించండి
 25. సుప్రభాత మన వసుధకు నెల్ల వర వి
  ప్ర కుల భాజను లటఁ బ్రాజ్ఞ తంత్ర
  భానునిఁ గొలువ నిలువఁగఁ తండ్రి ప్రజకు స్వ
  తంత్ర రీతి జలధిఁ దరణి లేచె

  సుప్రభాత మ..........
  ప్ర.. భా......తం.
  భా..........తం.....
  తం...........

  రిప్లయితొలగించండి
 26. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  న్యస్తాక్షరి
  *'సు - ప్ర - భా - తం'*
  పై అక్షరాలతో వరుసగా 4 పాదాలను
  ప్రారంభిస్తూ
  సూర్యోదయాన్ని వర్ణిస్తూ
  మీకు నచ్చిన ఛందంలో పద్యం

  సందర్భము: సుగ్రీవుడు రామునితో ఆంజనేయుని గొప్పతనాన్ని బాల్యాన్ని గురించి చెబుతూ..
  "బాల భానుని చూచి పండుగా భ్రమించి ఎగిరి పట్టబోయాడట!" అన్నాడు.
  యుగ సహస్ర యోజన పర భానూ
  లీల్యో తాహి మధుర ఫల జానూ..
  (హనుమాన్ చాలీసా.)
  పం డనుకొని 16000 మైళ్ళ దూరంలో వున్న సూర్యుని వద్దకు ఒక్క ఉదుటున ఎగిరి పట్టుకున్నాడు.
  శ్రీ పరాశర సంహితలో ఈ వృత్తాంతం చక్కగా వుంది.
  ఒక అమావాస్యనాడు బాలుడు తల్లి నడిగినాడు ఆహారం కావా లని. "సుపక్వం చ ఫలం సూనో యత్ర కుత్రాపి భుజ్యతామ్" (ఎక్కడైనా బాగా పండిన పండు దొరికితే తిను.) అన్నది.
  ఆంజనేయః ప్రహృష్టాత్మా
  దివ ముత్పత్య వేగత
  శిశు రుద్యంత మాదిత్యం
  ఫలబుద్ధ్యా గృహీతవాన్
  (ఆంజనేయు డానందంతో వేగంగా నింగి కెగిరి ఉదయించే బాలసూర్యుని ఫల మనుకొని పట్టుకొన్నాడు.) శ్రీ పరాశర సంహిత 6 వ పటలం 50 వ శ్లోకం
  వెంటనే దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టగా విఫలమయింది. దేవత లంతా ప్రార్థిస్తే హనుమ సూర్యుణ్ణి విడిచిపెట్టాడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "సునయనా! రామ! అంజనీ సుతునియొక్క
  ప్రకటి తోత్సాహ మే మనవచ్చు.. బాల
  భాను డుదయింప నెఱ్ఱని పం డనుకొని,
  తంకమును వీడి, తిన నింగి దాక యెగిరె.."

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  5.11.19
  -----------------------------------------------------------
  తంకము= భయము

  రిప్లయితొలగించండి
 27. తే.గీ. సుప్రభాతమో యరుణుడ! శుభముల నిడు
  ప్రగతి నెఱుపును సూచింప జగతి నేలు
  భాస్కరుండ! గైకొను నాదు వందనముల
  తండ్రి! చైతన్య మందించు ద్వాదశాత్మ!

  రిప్లయితొలగించండి


 28. 1ఆ.వె:సుప్తిని విడె జగతి శుకపిక రవముతో
  ప్రకృతి పరవశించి ప్రభలు నింపె
  భానుడుదయమొంద భక్తితో జనులు స
  తంబు మ్రొక్కు చుంద్రు ధరణి యందు

  2ఆ.వె:సులభ రీతి లోన సుజను లెల్లరు చేరి
  ప్రత్యహమును విడక వాసి గాను
  భాను కర్ఘ్య మొసగి భక్తితో మ్రొక్కుచు
  తండ్రి గొనుమటండ్రు తన్మయతను

  3.తే.గీ:సుమము లెల్లయు వికసించె సుందరముగ
  ప్రమద లెల్లమాలగ కట్టి పరవశమున
  భానుమూర్తిని నచ్చోట భక్తి కొలిచి
  తండ్రి దీవించు మనుచును దండ మిడిరి

  4.తే.గీ:.సురుచిరంబగు కాంతిని సూక్తి గతిని
  ప్రజల కిల ప్రత్యహంబును పంచునట్టి
  భాసురాంగుడ వీవని భక్తి మోడ్తు
  తండ్రి గొనుమిదే యంజలి తరణి దేవ.


  రిప్లయితొలగించండి
 29. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  న్యస్తాక్షరి
  *'సు - ప్ర - భా - తం'*
  పై అక్షరాలతో వరుసగా 4 పాదాలను
  ప్రారంభిస్తూ
  సూర్యోదయాన్ని వర్ణిస్తూ
  మీకు నచ్చిన ఛందంలో పద్యం

  సందర్భము: రఘువంశ రాజులకు పురోహితుడైన వశిష్ఠుడు చెప్పగా ఆ విధంగానే రాముడు సూర్యునికి పుష్పాంజలి సమర్పించినా డన్నది పద్యంలోని భావం.

  వశిష్ఠుడు:
  "రామచంద్రా! అదిగో! నీ వంశకర్త సూర్య భగవానుడు. రఘుకు లాన్వయమునకు మూల పురుషుడైన ఈ మహనీయునకు పుష్పాంజలులు సమర్పించు నాయనా!"

  రాముడు:
  "సప్తాశ్వ రథ మారూఢం
  ప్రచండం కశ్యపాత్మజమ్
  శ్వేతపద్మ ధరం దేవం
  తం సూర్యం ప్రణమా మ్యహమ్"

  ( *లవకుశ* చలనచిత్రంలోని సన్నివేశాన్ని స్మరించవచ్చు.)

  తంపు= జ్ఞాపకం
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "సుప్రభాత రవికి సురభి పుష్పాంజలి
  ప్రమద మొప్ప నిడుమ! రామ!" యన్న
  భాను కుల తిలకుడు వర పురోహితు మాట
  తంపున నిడి యా విధముగఁ జేసె

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  5.11.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 30. తే౹౹
  సుగుణ సతి భ్రూవు కనుమలఁ సుందరముగ
  ప్రస్ఫురిల్లు కుంకుమఁ బోలె ప్రాగ్దిశన ప్ర
  భాకరు డుదయించగ పటాపంచలయ్యె
  తంద్ర చీకట్లు, వెల్గు లతలు పెనగొనె౹౹

  రిప్లయితొలగించండి
 31. సుదినమాయె దైవ సుస్మరణంబుతో

  ప్రణవనాద సుధలు పలికె మదిని

  భానుడుదయ కాంతి భాసురముగ జల్ల

  తంబురప్ర ణవము తనువుఁ మీటె
  🙏🙏

  రిప్లయితొలగించండి
 32. సుమము వికసించె నరుణంపు సొబగు లీని
  ప్రభల జిందించె నుదయాద్రి క్రమముతోడ
  భాను బింబోష్ణ కిరణముల్ ప్రాపు గొనగ
  తంత్రులై మీటె పులకింత ధాత్రి పైన!

  రిప్లయితొలగించండి