14, నవంబర్ 2019, గురువారం

సమస్య - 3191 (చదువని బాలలె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్"
(లేదా...)
"చదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్"

82 కామెంట్‌లు:


 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  పదుగురు మెచ్చు రీతినిట పంతము మీరగ నాస్తిపాస్తులన్
  ముదమున రోజు రోజునను ముద్దుగ జేర్చుచు కాంచనమ్మునున్
  కుదురుగ లాభ నష్టములు కూర్చొని రూకలు లెక్కగట్టుటల్
  చదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్

  రిప్లయితొలగించండి
 2. ఇదినా మాటని తలవకు
  పదవిని గల పెద్దలాడు పలుకులె సుమ్మీ
  ముదమది యాంగ్లమని, తెలుగు
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగునది. అభినందనలు.
   "ఇది నా మాటగ తలపకు" అనండి.

   తొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కుదురుగ లాస్టు బెంచినహ కూర్చొని బోలెడు సీరియస్సుగా
  కదలక నోరు మూసుకొని గప్పులు కొట్టక ప్రక్కవాళ్ళతో
  ముదమున సైన్సు జాగ్రఫిల పొత్తము లందున "కామసూత్రమున్"
  చదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. స్వానుభవంతో చెప్పినట్టుంది. మనోరంజకమైన పూరణ. అభినందనలు.
   ఆ పద్ధతిలో హైస్కూలులో 'అభిసారిక'లు కాదు కాని డిటెక్టివ్ నవలను చదివి, ఒకసారి ప్రక్క విద్యార్థి ఫిర్యాదుతో సారుతో దెబ్బలు తిన్న అనుభవం ఉంది.

   తొలగించండి
 4. కం.
  అదుపాజ్ఞలు లేక దిరుగ
  పదుగురి నోటెంటవచ్చు పౌరుష వాక్కుల్ !
  మదిచేరి గెలుకు చుండగ
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్ !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మల్లి సిరిపురం గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "నోటన్ వెలువడు... కెలుకు..." అనండి.

   తొలగించండి


 5. పదిలంబవగా మదిలో
  చదివిన దెల్లను విరివిగ సభ్యత తోడై
  చదువంగ రాని దానిని
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్

  మదిలో యాలోచనలను
  మధురముగా నిలుపుకొనుచు మంచియు కొరకున్
  పదుగురి యెదుగును తలచిన
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్

  కళ్యాణ్ చక్రవర్తి
  🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కళ్యాణ్ చక్రవర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "మదిలో నాలోచనలను... మంచి కొరకు తా । పదుగురు వృద్ధిని తలచెడి..." అనండి.

   తొలగించండి


 7. కుదురగ మానసమ్ము భళి కూడగ జ్ఞాపక శక్తి, సూక్ష్మముల్,
  వదిగొను విద్య లన్ని విరివాఱుచు చెంగట వచ్చి ధాటిగా
  పదిలమవంగ నా మదిని వర్ధిలి, కూడని వాటినెప్పుడున్
  చదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. కం.
  విదురముగల చదరంగము
  పదునుగ నాడంగ మెచ్చు ప్రతిభావంతుల్ !
  ముదముగ బొగిడిన పొత్తము
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్ !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మల్లి సిరిపురం గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని భావంలో కొంత అస్పష్టత ఉన్నట్టున్నది.

   తొలగించండి
 9. విదురుడు జెప్పునీతులను వీధికినెట్టెడు వారలెక్కువై
  బెదరకనుండుసోమరులు,బెట్టుగనెప్పుడు నుండగోరకన్
  కుదురుగనుండబోరకను ,కుళ్ళున, కుట్రలు బెంచువిద్యలన్
  చదువని బాలబాలికలె,జాతికికీర్తిగడించురెల్లెడన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పురుషోత్తమ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అక' ప్రత్యయం కళ. "...గోరకే... బోరకయె..." అనండి.

   తొలగించండి
  2. విదురుడు జెప్పునీతులను వీధికినెట్టెడు వారలెక్కువై
   బెదరకనుండుసోమరులు,బెట్టుగనెప్పుడు నుండగోరకే
   కుదురుగనుండబోరకయె ,కుళ్ళున, కుట్రలు బెంచువిద్యలన్
   చదువని బాలబాలికలె,జాతికికీర్తిగడించురెల్లెడన్.
   ------------------------------
   [సవరణపాఠము ధన్యవాదాలతో]

   తొలగించండి
 10. ( నెహ్రూజీని చాచా గా పిలుచుకొని ఆయన పుట్టినరోజు తమ పుట్టినరోజుగాభావించే
  భారతబాలబాలికల బాలలదినోత్సవం నేడు )
  నదరుగ మోతిలాలునకు
  నందను ; డాతని మించు బుత్రుడున్ ;
  జెదరని దేశభక్తికిని
  చిహ్నము ; గాంధిమహాత్ము శిష్యుడున్ ;
  గదలెడి శక్తియౌ సుతను
  గాన్క నొసంగిన నెహ్రు వర్తనన్
  జదువని ; బాలబాలికలె
  జాతికి గీర్తి గడింతు రెల్లెడన్ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జంధ్యాల వారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'నెహ్రూ వర్తనమే చదువు + అని' అని మీ పద విభాగమా? అలా అంటేనే అన్వయం కుదురుతున్నది.

   తొలగించండి

 11. నా పూరణ. చం.మా.
  ** *** ***

  కుదురుగ పాఠశాల చని కొల్లగ విద్యల నేర్చు బాలలే

  పదుగురు మెచ్చురీతిగను పాండితి జూపుచు ఖ్యాతి నొందుచున్

  ముదమును భారతమ్మకును భూరిగ నిత్తురు గాని నెవ్విధిన్


  చదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్"  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   ప్రశ్నార్థకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. కం.
  చదవక గాడిద గాసిన
  మృదువచనము నేర్పివాణి మృదువుగ బ్రోవన్ !
  విధిరాత మార్పుజేయగ
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్ !!

  రిప్లయితొలగించండి
 13. పదునుగనుండు భాషయని,పండితులెల్లను మెచ్చిరాంధ్రమున్
  కుదురుగనేర్పబోకనిక ,కూటమిగట్టుచుమార్చెచట్టమున్
  అదనుగజేసికొంటిరిక ,ఆదరబాదరబెట్టు,నాంగ్లమున్
  చదువని బాలబాలికలె,జాతికికీర్తిగడించురెల్లెడన్.

  రిప్లయితొలగించండి
 14. 🙏
  కం.
  అదుపాజ్ఞలు లేక దిరుగ
  పదుగురి నోటన్ వెలువడు పౌరుష వాక్కుల్ !
  మదిచేరి కెలుకు చుండగ
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్ !!

  రిప్లయితొలగించండి
 15. సదమలసంస్కృతీవిభవసంస్తుతమై వెలుగొందుభూమి నా
  హృదయము హర్షపూర్ణమగు నిందలి ధర్మము గాంచ దీనికై
  వదలెద ప్రాణమైన నను భావమునంది విదేశ విద్యలన్
  జదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్"

  రిప్లయితొలగించండి
 16. కొదువేమి లేదు మనకిట
  విదితంబునుజేయు విద్య, విడువక దానిన్
  మదిగొని, యపథవిషయముల
  జదువుని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్!

  రిప్లయితొలగించండి
 17. ముదురుగపాఠముల్ జదివి,ముక్కునబెట్టుచు,నుండువారికిన్
  బెదరగనుండనెవ్వరును ,బేలగ మారరు వారలెప్పుడున్
  సదమలవృత్తులన్ విడుచు ,సాధులు సంతులుజెప్పు వాక్యముల్
  చదువని బాలబాలికలె,జాతికికీర్తిగడించురెల్లెడన్.

  రిప్లయితొలగించండి
 18. కం.
  చదువున నైపుణ్యముగల
  విదుషీమణి వద్దకేగి విద్యలు నేర్వన్ !
  చదివెడి లిపి రాకుండిన
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్ !!

  రిప్లయితొలగించండి
 19. కుదురగు విజ్ఞానంబు ను
  సదమల చిత్తంబు నొసగు చక్కని వగుచు న్
  పొదల ని చెడు పొత్తంబు ల
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తి న్

  రిప్లయితొలగించండి
 20. చదివిరి యెందరో బుధులు చక్కగ కమ్మని మాతృభాషలో
  పదపడి యాంగ్ల మాది పర భాషల నేర్చిరి జ్ఞాన వృద్ధికై
  చదు వన నాంగ్లమే యనెడి సంకర బుద్ధుల దాస్య భావనన్
  జదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్.

  రిప్లయితొలగించండి
 21. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్

  సందర్భము:
  పురారి గిరి సంభూతా
  శ్రీ రామార్ణవ సంగతా
  అధ్యాత్మ రామ గంగేయం
  పునాతి భువన త్రయమ్
  త్రిపురారి (శివుడు) అనే పర్వతంనుంచి బయలువెడలింది.. శ్రీ రాము డనే సాగరంలో సంగమించింది.. ఈ (అధ్యాత్మ) రామాయణం (రామకథ) అనే గంగానది మూడు లోకాలనూ పవిత్రీకరిస్తుంది.. అంటాడు వ్యాస మహర్షి.
  అయోధ్యలోని జనానీకం కుశలవుల గానం విని "ఇది కదా ముక్తి నిచ్చే చదు!" వని ఇలా భావించారు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "ఇదిగొ! కుశలవులు పాడిరి..

  ఎద మీటిన రామగాథ యిది.. తెలిసినచో

  నిది ముక్తిఁ గూర్చగలిగిన

  చదు వని.. బాలలె గడింత్రు జాతికి కీర్తిన్.."

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  14.11.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 22. మదిని వికసింప జేసెడి
  స్వదేశపు ప్రగతిని దెలుపు సంగతి నేర్వన్
  బదులుగ నాశపు కథలను
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్

  రిప్లయితొలగించండి
 23. మైలవరపు వారి పూరణ

  మది మురిపించు నీతికథ మచ్చునకైనను కానరాదు , సం..
  పదపయి దృష్టిదక్క పసిబాలల గోడు రవంత పట్టదే !
  చదువన కార్పొరేట్ బడిఁ జావుకు దగ్గరదారి , దానిలో
  చదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి

  2. మది మురిపించు నీతికథ మచ్చునకైనను కానరాదు , సం..
   పదపయి దృష్టిదక్క పసిబాలల గోడు రవంత పట్టదే !
   చదువన కార్పొరేట్ బడినిఁ జావుకు దగ్గరదారి , దానిలో
   చదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

   తొలగించండి
 24. ఎదలో పోటీ తత్వము
  మదిలో బతుకున కలలను మరువక నెపుడున్
  ఇదినే నేర్చుటయా యని
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్
  🙏🙏

  రిప్లయితొలగించండి
 25. కందం
  మదినుంచి వాణి మాతనుఁ
  బదపడి మన సంఘసేవ భాగ్యమ్మనెడున్
  విదురత నీయని చదువుల
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్

  రిప్లయితొలగించండి
 26. చదువులు తెలుగున బాలలు
  చదివిన నేర్తురు సకలము చాకుల వలెనన్
  సదయత తెలియుడు నాంగ్లము
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్

  రిప్లయితొలగించండి
 27. చం.

  మది కదలాడు చుండెనట మాదిరి నానుడి యిట్టి వేళలన్
  చదివిన వాడి కంటె నిక చాకలివాడె నొకింత మేలనన్
  పదిలము గాదె జీవితము పాటున కోర్చగ నూత కోలమై
  చదువని బాలబాలికలె జాతికి కీర్తి గడింతు రెల్లెడన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 28. చదువున కర్హతమైనవి
  చదువుచుదగుశ్రద్ధతోడసత్పురుషుండై
  చదువగరానివి యెప్పుడు
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్

  రిప్లయితొలగించండి
 29. చదువుల నాటల పాటల
  వదలక సమయము సమముగ పంచుచు నెపుడున్
  మది చెదరించెడి చెత్తను
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్

  రిప్లయితొలగించండి
 30. పదవుల వీడి కానలకు భక్తిగ నేఁగియు పత్ని కోసమై
  పది తలలున్నవాని సులభంబుగ జంపిన వాని గాధలన్
  ముదమున నేర్చి యా కథల పూర్తిగ మార్చిన చెత్తపొత్తముల్
  చదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్

  రిప్లయితొలగించండి
 31. ముదితలఁ గించ పర్చుచును బూతుల నెచ్చుగ మేళవించుచున్
  మదమును మత్సరమ్ములను మానస మందున నింపునట్టి దౌ
  ర్తృదములఁ బెంచు నీచమగు తిక్కట మక్కట గాథలన్
  చదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్

  రిప్లయితొలగించండి
 32. చదువగరానివాటికినిశ్రద్ధనుబెట్టుచు నెల్లవేళలన్
  జదువనిబాలబాలికలె జాతికికీర్తిగడింతురెల్లెడన్
  జదువదియుండ నొప్పునిక సారమునంతయునొప్పుకోలుగా
  మదికినిజేరునట్లుగను మాన్యతనొందగ నుంటమేలుగా

  రిప్లయితొలగించండి
 33. చదివెనె మొదవులు పా లిడ
  చదివెనె వృక్షమ్ము లీయఁ జక్కని ఫలముల్
  చదివెనె సాయి శిరిడిలోఁ
  జదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్


  విదితము లోకు లెల్లరకు విద్య లొసంగును బుద్ధి నిద్ధరన్
  మదము నణంచుఁ జిత్తమున మానవ జాతికి నిశ్చయమ్ముగం
  బదుగురి మేలు కోరెడిని భద్రము నిచ్చెడి జ్ఞాన మిచ్చు నీ
  చదు వని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్

  రిప్లయితొలగించండి
 34. చదివించుముచిన్నారుల
  చదివిజనోద్ధరణజేయు సద్భావనతో
  మదిలో పేరాశలతో
  చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్"

  రిప్లయితొలగించండి
 35. కదలక తిండి లేకను సకాలము నందున పీజు గట్టకన్
  బదుగురి నెంత వేడినను బాలన లేని యభాగ్యు లందరూ
  జదువని బాలబాలికలె జాతికి కీర్తి గడింతు రెల్లడల్
  బదవులు పొంది నేలుదురు భారత మాతను శాంతి సౌఖ్యమున్

  రిప్లయితొలగించండి
 36. ఉదరము నిండక సరిగా
  జదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్
  ముదముగ జదివించిన యెడ
  బదుగురి మన్ననలు బొంది బదిలము జేతుర్

  రిప్లయితొలగించండి
 37. ముదముగనన్నివిద్యలనుముందుగనేరిచి బుద్ధిమంతులై
  చదువులలోనిసారమునుచక్కగనర్థముచేసుకొన్ననా
  చదువులె సార్థకంబులగు, సభ్యతనేర్పనివిద్యలేమియున్
  చదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్

  రిప్లయితొలగించండి
 38. కం.
  ముదముగ జనులే మెచ్చగ
  చదువరి గాకున్న మమ్ము చక్కగ బొగడన్ !
  వదలక మము నాయకుడన
  చదవని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్ !!

  రిప్లయితొలగించండి
 39. చదువదియెంతనేర్చినను చాలదు కూటికి వచ్చుజీతమే
  చదువుల సారమంతయును,చక్కగనేర్చిన వారు గొప్పలై
  అదనుగ సంఘగౌరవము, ఆస్తిగబొందిరి నాటికాలమున్
  చదువని బాలబాలికలె,జాతికికీర్తిగడింతురెల్లెడన్.

  రిప్లయితొలగించండి
 40. పదునుగ మాటలాడుటన, ప్రాభవమిచ్చును మాతృభాషయే
  విదితముసంస్కృతీప్రభల ,వేదికలెక్కగజేయునద్దియే
  ముదురుగ మాటలాడుటకు,ముందుగనేర్చుచు నాంగ్లభాషనే
  చదువని బాలబాలికలె,జాతికికీర్తిగడింతురెల్లెడన్.

  రిప్లయితొలగించండి
 41. చంపకమాల
  వదలుము విష్ణుపాదమును వైరియటంచును, శౌరి గూర్చియున్
  జదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్
  ముదమున నా హిరణ్యకశిపున్ మది నింపుచు నామకీర్తనన్
  సదమల భక్తిఁగొల్వుమని చాటిరి బాలకునెంచి యొజ్జలున్

  రిప్లయితొలగించండి
 42. మధురముగానితీరులకు,మాదగు రాష్ట్రము రిత్తబోయెనా?
  సుధలనుజిల్కు దెల్గునిటు,స్రుక్కగజేయుటధర్మమౌనకో?
  వ్యధలనుబెంచ గానుయిక , వ్యాప్తిని జేయకుడాంగ్లభాషలో
  చదువని బాలబాలికలె,జాతికికీర్తిగడింతురెల్లెడన్.

  రిప్లయితొలగించండి