24, నవంబర్ 2019, ఆదివారం

సమస్య - 3201 (కుత్సితుఁడైన....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్"
(లేదా...)
"కుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్"

46 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    (రాజకీయ రహస్యము)

    కుత్సితమైనదీ జగము కుత్సిత మెల్లను హృత్తు జేర్చుచున్
    మత్సరమెల్ల వీడుచును మంచిని నేర్పుచు మాటకారియై
    కుత్సితులైన శిష్యులను కూరిమి జేర్చుచు తీర్చిదిద్దునా
    కుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ సర్వీసులో కుత్సిత విద్యార్థు లెందర్ని చూసారో కదా!

      తొలగించండి

    2. 🙏

      అవును మరి...ముల్లును ముల్లుతోనే తీయాలి కదా!
      లేకపోతే నలభై సంవత్సరాలు బెంగాలులో గడిపి బ్రతికి బైట పడడం అసంభవం...మా అబ్బాయి నాకన్నా రెండాకులు ఎక్కువే "చదివాడు" అచ్చట!

      తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    సత్సహితామృతోపమవిశాలపురాణకథాప్రసంగసం...
    పత్సుగుణాన్వితుండగుచు సూక్ష్మములన్ విశదీకరించుచున్
    మత్సరపూర్ణశిష్యులకు మంచిని నేర్పగ, వారి దృష్టిలో
    కుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్.!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పై పద్యములో రెండవపాదంలో యతిని సవరించాను 🙏🙏

      సత్సహితామృతోపమవిశాలపురాణకథాప్రసంగసం...
      పత్సుగుణాన్వితుండగుచు మానిత సూక్ష్మములన్ వచించుచున్
      మత్సరపూర్ణశిష్యులకు మంచిని నేర్పగ, వారి దృష్టిలో
      కుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్.!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  3. సత్సాంగత్యము లేకనె
    మాత్సర్యము పెరిగినీవు మాటాడితివో
    వత్సా! యేవిధి జగతిని
    కుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్

    రిప్లయితొలగించండి
  4. వత్స! వచించుచుంటి విను! బ్రహ్మము చెప్పిన నాటివాక్యముల్
    మత్సుత!యంచు దెల్పె నొక మాన్యుడు తండ్రి "జగంబునందునన్
    సత్సుఖమందు దుష్టమతి, సన్నుతి గాంచును దొంగ , భావినిన్
    కుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్.

    రిప్లయితొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మాయల మరఠ్వాడా:

    కుత్సితుడైన మామ భళి కూరిమి జేరగ సోనియమ్మనున్
    కుత్సితుడౌచు నల్లుడహ గుట్టుగ జేరగ భాజపానహో
    మత్సరుడైన ఠాకరియె మండిపడంగను వానికోసమై
    కుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకూ ఈ మామాఅల్లుళ్ళు ఎవరు? నాకంతగా రాజకీయ పరిజ్ఞానం లేదు.

      తొలగించండి
    2. 🙏

      మామ = Sharad Pawar
      అల్లుడు = Ajit Pawar
      ఠాకరి = Uddhav Thackeray

      (పరవా లేదు లెండి...వారెవరికీ తెలుగు పద్యాలు రావు) 😊

      తొలగించండి
  6. ఉత్సుకమున్ జనింప సమరోద్యుతులైన వినీత కోటికిన్
    సత్సఖుడై ప్రబోధమున శత్రు సమూహము నందు నుండెడిన్
    మత్సర వంతులై కపట మార్గము నెంచెడి వారిపాలిటన్
    కుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్

    రిప్లయితొలగించండి

  7. ఉత్సవ ధురీణు నెంచగ
    తత్సమయమునందు తుదకు తనవారిపయిన్
    వాత్సల్యముంచు టందున
    కుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్

    రిప్లయితొలగించండి


  8. మత్సరముల మత్తుగొనును
    కుత్సితుఁడైనట్టివాఁడె, గురువన నొప్పున్
    పత్సలము చూపి, విద్యల
    వాత్సల్యమున గరిపెడయవారె జిలేబీ


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. సందర్భము: ఒక దుర్మార్గుడు తన కొడుకుని దుర్మార్గములు చేయడానికి గురువు దగ్గర చేర్చినప్పుడు ఆ గురువు కూడా అలాగే ఉండాలి అనే భావముతో 🙏🙏
    కం:
    కుత్సితుడగు పుత్రుని తో
    కుత్సితుడగు దండ్రియె పలు కుట్రలు నేర్పన్
    వత్సా! నేర్వుము నిచటన,
    కుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్

    రిప్లయితొలగించండి


  10. మత్సరముల్ మదిన్ గొనుచు మద్యపు తూగుని బోవ దుష్టుడా
    కుత్సితుఁడైన వ్యక్తియె తగున్; గురువై జన సంస్తుతుల్ గొనన్
    పత్సలమున్ వినీతులకు వర్ధిల చూపుచు విద్య లన్నిటిన్
    వత్సల భావ వీచికల వారికి నేర్పగ నౌత గాదుటే!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. మత్స ర ము న కీడు సలుపు
    కుత్సి తు డై నట్టి వాడె :గురు వన నొప్పు న్
    వత్సల త జూపి శిష్యుల
    సత్సంగు లు గా నొన ర్చు సజ్జనుడ గు చు న్

    రిప్లయితొలగించండి
  12. మత్సరములు పెంచునెపుడు
    కుత్సితుఁడైనట్టివాఁడె; గురువన నొప్పున్
    సత్సంబంధములేర్పడ
    ప్రోత్సాహంబిడు సుజనుని, పూజ్యుండతడే

    రిప్లయితొలగించండి
  13. ద్రుపదుడికి ద్రుష్టద్యుమ్నుడి జననం. మీ సమస్య- ఈ వత్స పూరణము.🙏

    మత్సాంగత్యుడు ద్రోణుడు
    కుత్సితుఁడైనట్టివాఁడె, గురువన నొప్పున్?
    తత్సమబలుడౌ వత్సుని
    మాత్సర్యముతోఁ డభిహవ మందున బడసెన్

    రిప్లయితొలగించండి
  14. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

    కుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్"

    ఇచ్చిన పాదము కందములో నా పూరణము సీసములొ


    కచుని శుక్రా చార్యుని వద్దకు విద్య నేర్చు కోవటానికి బృహస్పతి ఆదేశిస్తాడు. “శుక్రుడు అసుర గురువు దుర్మార్గుడు అతని వద్దకు వెళ్ళి ఎలా విద్య నేర్చుకోగలను” అని సందేహము వెలి బుచ్చ బృహస్పతి కుమారుని గాంచి పలికిన పలుకులు

    సమరము జరుగెడు సమయమున సురలెల్లరు మరణించ నసురులు విజయ

    మును పొందు చుండిరి, ముడుగును దివిజులు రయముగ, భువికి వెడలి

    నీవు శుక్రా చార్యునికి సేవనము చేయగ మృతసంజీవని కలుగు, యాతు

    ధానుడు కుత్సితుఁడైనట్టి వాఁడె, గురువన నొ ప్పునెపుడు భువన మందు


    శత్రు వునకైన ముదముగ చదువు నేర్పి
    పండితునిగ తీర్చెడివాని, పంతు వలదు
    నీకు, కచుడా కరుణతోడ నేర్పు విద్య
    ననుచు పలికె వాగ్మి సుతుని తనువు నిమిరి







    రిప్లయితొలగించండి
  15. మాత్సర్యంబున శిష్యుని
    వత్సా!నీ బొటనవేలు పావడమిడుమా!
    యుత్సాహముతో నాకను
    కుత్సితుడైనట్టి వాడె గురువన నొప్పున్
    పావడము=కానుక

    రిప్లయితొలగించండి
  16. వాత్సల్యమ్మే లేకయె
    యుత్సాహముపై నీరు జల్లి యుడికించుచునే
    వత్సల నొంచగ నెట్టుల
    కుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్ ?

    రిప్లయితొలగించండి
  17. వాత్సల్య పూరితాత్ముఁడు
    తాత్సారం బింత యేని తాల్చని వాఁడున్
    సత్సంగ రత విదూరిత
    కుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్

    [గురువు = కులముపెద్ద]


    కృత్స జగద్వివేక వరకీర్తిత మానధనుండు సద్గుణా
    దిత్సువు సూత వంశజుఁడు దివ్య మునీంద్ర నికాయ పూజ నా
    ర్హత్సమ రౌమహర్షణి పురాణ విదుండును గాంచ జాతిలోఁ
    గుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్

    [సద్గుణ + ఆదిత్సువు = సద్గుణాదిత్సువు; మంచి గుణములను గ్రహింప నిచ్ఛ గలవాఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాత్సల్య పూరితాత్ముఁడు
      తాత్సారం బింత యేని తాల్చని వాఁడున్
      సత్సంగుఁడు దూరీకృత
      కుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్

      తొలగించండి
  18. వత్సా వినుమిది ఖలుడన
    కుత్సితుఁడైనట్టివాఁడె. గురువన నొప్పున్"*
    సత్సంబంధము కూర్చుచు
    .వాత్సల్యంబునిల చూపు వాడే జగతిన్

    రిప్లయితొలగించండి
  19. మత్సరమూని పాండవుల వంచన జేసిన ధార్తరాష్ట్రులన్
    వత్సలుడంచు వంచకుని పంచన జేరిన సూత పుత్రునిన్
    కుత్సితులన్ దురాత్ములను ఘోర మదాంధుల రూపు మాపగా
    కుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్

    రిప్లయితొలగించండి
  20. ఉత్సవమయ్యి కాగితపు టోడలు క్లాసున మిట్టు వేళ, సం
    వత్సర మంతయూ చదువుపట్ల యుపేక్షయె, యారుదూఱు నం
    దుత్సుకులయ్యి త్రుళ్ళిపడు దుష్టులగుంపుకు బుద్ధిచెప్పగా
    కుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్౹౹

    రిప్లయితొలగించండి
  21. సరదాగా.....

    బొత్స! అవేమి మాట లిట బొత్తిగ? సత్తెము కాని సుద్దులా?
    మత్సర మూని మీ యెడల మాన్య గురుం డొనరించెనేమి యా
    వత్సర మట్టి యాగమును భాసిల చంద్రుడు? నీదు దృష్టిలో
    గుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్.


    రిప్లయితొలగించండి
  22. వత్స సుయోధనా! వినుము వాస్తవ మియ్యది కుంభ జన్ము డే
    మత్సర మూని విద్యలను మప్పడు, పార్థుడు బుద్ధిశాలియై
    యుత్సుకతన్ గడించె నవి, యొజ్జను కుత్సితు డందు వేమి యా
    గుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్.

    రిప్లయితొలగించండి
  23. ఉత్సాహమెయురుకెత్తగ
    ప్రోత్సాహమునిడెడువారిపొందదిమేలౌ
    మత్సరముగల్గుకనులకు
    కుత్సితుడైనట్టివాడె గురువననొప్పున్

    రిప్లయితొలగించండి
  24. కుత్సితమైన బుద్ధులవి,కూర్పుగనేర్పడుపాలనమ్ములో
    మత్సరమున్ననేతలకు,మారణహోమము రాజ్యపాలనే
    వత్సరమైనగానిమన,వంటికి నప్పెడు దుష్టయోచనల్
    కుత్సితుడైనవ్యక్తియెతగున్,గురువై జనసంస్తుతిన్ గనన్.

    రిప్లయితొలగించండి
  25. మత్సరమున తన శిష్యుని
    వత్సగతలుపకనతనిని వక్రపుబుద్ధిన్
    వత్సరములుచదివించని
    కుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్?

    రిప్లయితొలగించండి
  26. వత్సలురన్న ప్రేమమెయి,వాస్తవదృష్టియె కండ్లుగప్పగా
    మత్సరమెంతబెంచెగద,మారణహోమమె మార్గమవ్వగా
    కుత్సితబుద్ధి కౌరవులు,కూల్చిరిబంధము యట్టివారికీ
    కుత్సితుడైనవ్యక్తియెతగున్,గురువై జనసంస్తుతిన్ గనన్.

    రిప్లయితొలగించండి
  27. వత్సా! కుమార! చెప్మా
    తాత్సారము చేయకిక బుదానుడెవరురా?
    తత్సమ మైనట్టి బుచికి
    కుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్

    రిప్లయితొలగించండి
  28. కుత్సితమైన ప్రేమలకు,కుళ్ళుకుతంత్రముతోడెయైనచో!
    మత్సరమొచ్చిహెచ్చుగను,మానసమంతయుమంటబెట్టగా
    ఉత్సవవిగ్రహమ్ముగను ఊరికిముందర దిష్టిబొమ్మగా
    కుత్సితుడైనవ్యక్తియెతగున్,గురువై జనసంస్తుతిన్ గనన్.

    రిప్లయితొలగించండి
  29. మత్సర మందునన్ బలుకు మాటలు వీడుము దేశికుండిలన్
    దత్సముడే త్రిమూర్తులకు, ధారుణి యందున పూజనీయుడే
    వత్సుడవైన నీవిటుల వాగుట మానిన క్షేమమెవ్విధిన్
    కుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్ ?

    రిప్లయితొలగించండి
  30. సత్సంగములను జేరుచు
    మత్సరముల బారద్రోలి మాన్యత నింప
    న్నుత్సహుడై కుటిలత విడఁ
    గుత్సితుఁడైనట్టివాడె గురువననొప్పున్!

    రిప్లయితొలగించండి
  31. మాత్సర్యంబుననుండును
    గుత్సితుడైనట్టివాడె,గురువననొప్పున్
    దాత్సారమదియలేకను
    నుత్సాహముతోడవిద్యనుడివెడునతడే

    రిప్లయితొలగించండి
  32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  33. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్

    సందర్భము: యద్ధంలో రావణుడు ప్రయోగించిన శక్తికి లక్ష్మణుడు మూర్ఛిల్ల మారుతి ఓషధులకై ద్రోణగిరి కేగగా రావణ ప్రేరితుడై కపటమునియై కాలనేమి రాక్షసుడు దారిలో విఘ్నం కలిగించా లనుకున్నాడు.
    మారుతి మున్యాశ్రమ మని వెళితే సరస్సులో కండ్లు మూసుకొని స్నానం చేసి వస్తే ఓషధి కనిపించే మంత్రం (ఉపదేక్ష్యామి తే మంత్రం యేన ద్రక్ష్యసి చౌషధీః..) ఉపదేశిస్తా నన్నాడు కపట ముని. సరస్సులో దిగితే మొసలి పట్టుకోగా హనుమ దాన్ని వధిస్తాడు. అది ధాన్య మాలిని యనే అచ్చరయై "నా శాపం తొలగింది."
    "విను మిది కృత్రిమాశ్రమము వీడు మునీంద్రుడు గాడు రావణుం డనిపిన కాలనేమి ద్విజహంత మహాసురు డిందు నీకు విఘ్న నిరతి జేయ మౌనియయినా డటు గావున వీని ద్రుంచి నీ వనఘ రయంబునం జను మహౌషధ శైలము జేరవారకన్"
    (కాణాదం పెద్దన సోమయాజి అధ్యాత్మ రామాయణంనుండి)
    అన్నది.
    గృహాణ మత్తో మంత్రాం స్త్వం
    దేహి మే గురు దక్షిణామ్.. (త్వరగా మంత్రం తీసుకో గురుదక్షిణ యివ్వు..) అన్నాడు వాడు. హనుమ ఒక్క పోటు పొడిచాడు. భీకర యుద్ధంలో హనుమ వాణ్ణి సంహరించాడు.
    అచ్చర మాటలే పద్యంలో వున్నవి.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    చి త్సుఖద! రామదూత! కు
    భృ త్సుపథా! కాలనేమి వీ.. డసురుం.. డో
    వత్సా! నమ్మకు.. మిచ్చట
    కుత్సితుఁడైనట్టివాఁడె గురు వన నొప్పున్

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    24.11.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  34. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  35. మత్సరమొందుచున్ప్రజలమధ్యన నుంటకుభీతినొందుగా
    కుత్సితుడైనవ్యక్తియె,తగున్గురువైజనసంస్తుతుల్గొనన్
    మత్సరమెచ్చటన్గనకమాన్యతగల్గుచుమెల్గువాడునై
    నుత్సుకగల్గగాభువినినోపికతోడనువిద్యనేర్పుచో

    రిప్లయితొలగించండి