..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య 🤷♀.................... ప్రతిభ లేనివాఁడె పండితుండు
సందర్భము: ఏకైక మక్షరం ప్రోక్తం మహా పాతక నాశకం ప్రతి అమృత బిందువూ ప్రాణ ప్రదమే యైనట్టు రామాయణంలో ప్రతి అక్షరమూ పాప నాశనమే! అంటాడు వాల్మీకి. అటువంటి రామాయణాన్ని చదువడంలోనే గాని అల్పమైన కృతులలో గొప్ప అర్థాలు కల్పించే ప్రతిభ ఎవనికి లేదో వాడే పండితుడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ అనఘ మమృత తుల్య మయిన రామాయణ మమల మతిఁ జదువుటయందె గాని యల్ప కృతుల గొప్ప యర్థాలు కల్పించు ప్రతిభ లేని వాఁడె పండితుండు
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 11.11.19 -----------------------------------------------------------
కాళిదాసు భార్య , విద్యోత్తమ. అతనిని మొదటి ప్రశ్నగా, అస్తి కశ్చిత్ వాగ్విశేషా:? (నీ భాషలో ఏమైనా ప్రత్యేకత యున్నదా?) అని అడుగుతుంది.దానికి ప్రతిగా కాళిదాసు తన మందబుద్ధితో అరకొరగా సమాధానము ఇస్తాడు. కానీ మాత అనుగ్రహముతో, గొప్ప జ్ఞానసముపార్జనతో ఇంటికి తిరిగి వచ్చిన కాళిదాసు భార్యతో, ఆమెను తన భార్యగా కన్నా, తనకు జ్ఞానమార్గోపదేశము చేసిన గురువుగా తలచి, ఆమె ప్రశ్నకు నివాళిగా, ఆమె గతములో సంధించిన ప్రశ్నలోని మూడు పదాలతో ప్రారంభింపబడిన తన మూడు కావ్యాలలోని మొట్ట మొదటి వాక్యాల ద్వారా తన సరికొత్త ఉనికిని తెలియచేస్తాడు. అవే అస్తితో మొదలయ్యే (అస్త్యుతారాస్యా దిశి) కుమార సంభవము , కశ్చిత్ తో మొదలయ్యే (కశ్చిత్ కాంతా) మేఘ సందేశము మరియు వాక్ తో మొదలయ్యే (వాగర్థావివ సంపృక్తౌ) రఘువంశము వ్రాసి అమెకు అంకితము చేస్తాదు పుట్టుకతో కాని యుక్త వయస్సులొ కాని కాళిదాసు ప్రతిభ లేని వాడె పండితుండు కాళి మాత దీవెనల్ తొ అయినాడు అన్న భావన
సీసము
“అస్త్యుతా రాస్యాది “ననుచు మొదలిడె కుమారసం భవమున్ విశారధుండు, మేఘసందేశము మిన్నగ మొదలయ్యె, “కశ్చిత్ " పదము తోడ, కాళి దాసు రఘవంశ ముయును నారంభము చేసె "వాగర్ధావి" పదముతో, కాంచ ఘనుడు కాడు పుట్టుక తోడ, కపటంబు నెరుగని పామరుండు, బసాలు భంగ పరచె, చదువు కొనని వాడు ,సంస్కృత భాషలో (ప్రతిభ లేని వాడె ,పండితుండు) గా ఘనతను పొంది కాళిదాసయ్యెగా కాళి దీవెన లిడి కరుణ జూప
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
సతితో పోరక రాత్రి ప్రొద్దుటను వే శాస్త్రమ్ములన్ నేర్చుచున్
ప్రతిభన్ గూర్చుచు పద్యమల్లుటను తా బ్రహ్మాండమౌ రీతినిన్;
మతి లేకుండను లౌక్యమందునిట భల్ మాట్లాడెడిన్ తీరునన్
ప్రతిభాశూన్యుఁడె మేటి పండితుఁడుగాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండి🙏
అతిశయములు పలుకగ తగునా? నేస్తమ
రిప్లయితొలగించండిశాస్త్రములవి యెన్నొ చదివినట్టి
పటిమ గలుగు వాడు ప్రాజ్ఞుడె, టులగురా
ప్రతిభ లేనివాఁడె పండితుండు?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితెలివి గలిగి నంత తీరుతెన్ను లుగన
రిప్లయితొలగించండిగిట్ట దెవరి కైన మట్టు పెట్టు
డప్పు కొట్టు కొనుచు డాంబికములు బల్కు
ప్రతిభ లేని వాడె పండి తుండు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివచన కవిత లందు పస లేని భావాలు
రిప్లయితొలగించండిరచన జేసి తాను రా ణ కెక్కి
ప్రముఖ కవిగ వెలుగు పాండి త్య మేలేని
ప్రతిభ లేని వాడె పండి తుండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిలోకమెల్ల నేలి లోకేశు మరిచేను
రిప్లయితొలగించండితెలివి మాత్ర మున్న తిరుగు పోతు
పుడమి నెపుడు మోస మొనరింప నట్టి యా
ప్రతిభ లేనివాఁడె పండితుండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచదువు లెన్నొ నేర్చి సంస్కారమే గల్గి
రిప్లయితొలగించండిసంస్కృతాంధ్ర మెరుగు చక్కగాను
కల్లలాడి పరుల కనులుఁగప్పుటలోన
ప్రతిభ లేని వాడె, పండితుండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితన పురమును వీడి దమ్మిడి కొరగాడు
ప్రతిభ లేనివాఁడె, పండితుండు
పేరు గాంచు నెల్ల పేట లందు ధరణి
లోన! విద్యయే ములుగు జనులకు!
జిలేబి
'విద్వాన్ సర్వత్ర పూజ్యతే'
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
అమిత్ షా ఉవాచ:
వెతలన్ గూర్చుచు కాశ్మిరమ్మునితడే వేగమ్ముగా పాకుకున్
మతి లేకుండను ధారపోయుచును భల్ మాట్లాడుచున్ శాంతినిన్
చితిలో దూర్చుచు భారతీయతను తా చీనీయులన్ గెల్చుటన్
ప్రతిభాశూన్యుఁడె మేటి "పండితుఁడు"గాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి__/\__
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిమతిమంతుల్ సడి చేయకున్నపుడు , ధీమాంద్యున్ పతాకాగ్రసం...
స్థితునిన్ చేయగ పత్రికావళులు పుంజీభూతసంపత్తిచే,
కృతులున్ వ్రాయకపోయినన్ , గలిగెడిన్ కీర్త్యున్నతుల్ వింతయే ?
ప్రతిభాశూన్యుఁడె మేటి పండితుఁడుగాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండి
రిప్లయితొలగించండిమతమేదైనను సమ్మతిన్ పగటుచున్ మానావ మానమ్ములన్
ప్రతిపక్షమ్ముగ చూచి మట్టముగ నాపాదించి వాగీశుడై
మతితో కూర్పుగ సౌష్టవమ్ము సయి ప్రామాణ్యమ్ములన్ చూపుడ
ప్రతిభా శూన్యుఁడె, మేటి పండితుఁడుగాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభజన పరులు చేరి భళిభళీ యనుచుండ
రిప్లయితొలగించండిబిరుదులెన్నొ కలిగె బేరమేల?
దోషమెంచనేల దుశ్శాలువా గప్పు
"ప్రతిభలేని వాఁడె పండితుండు"
చిరుసవరణతో..😀
తొలగించండిభజన పరులు చేరి భళిభళీ యనుచుండ
బిరుదులెన్నొ కలిగె బేరమేమి?
దోషమెంచనేల దుశ్శాలువా గప్పు
"ప్రతిభలేని వాఁడె పండితుండు"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
ప్రతిభ లేనివాఁడె పండితుండు
సందర్భము:
ఏకైక మక్షరం ప్రోక్తం
మహా పాతక నాశకం
ప్రతి అమృత బిందువూ ప్రాణ ప్రదమే యైనట్టు రామాయణంలో ప్రతి అక్షరమూ పాప నాశనమే! అంటాడు వాల్మీకి.
అటువంటి రామాయణాన్ని చదువడంలోనే గాని అల్పమైన కృతులలో గొప్ప అర్థాలు కల్పించే ప్రతిభ ఎవనికి లేదో వాడే పండితుడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
అనఘ మమృత తుల్య మయిన రామాయణ
మమల మతిఁ జదువుటయందె గాని
యల్ప కృతుల గొప్ప యర్థాలు కల్పించు
ప్రతిభ లేని వాఁడె పండితుండు
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
11.11.19
-----------------------------------------------------------
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసాహితీ రణమున స్ఖలనము బడయును
రిప్లయితొలగించండిప్రతిభ లేని వాడె,పండితుండు
జన సమూహ మునకు సాహితీ
సుధలను
పంచి గణుతి కెక్కు పర వశమున
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపండితాః సమదర్శనః
రిప్లయితొలగించండిసర్వ జీవులందు సమరసభావము
గల్గియుండు వాడె కర్మయోగి
భేదభావమెంచి భేషజమునుజూపు
ప్రతిభ లేనివాడె పండితుండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచాక చక్యముయును చతురత గలిగిన
రిప్లయితొలగించండిడాబు దర్పముగల డాంబికులిల
అల్పవిద్య జూపి నలరెడి ఘనులుగ
ప్రతిభ లేనివాఁడె పండితుండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"చాకచక్యము మఱి చతురత...జూపి యలరెడి..." అనండి.
కాళిదాసు భార్య , విద్యోత్తమ. అతనిని మొదటి ప్రశ్నగా, అస్తి కశ్చిత్ వాగ్విశేషా:? (నీ భాషలో ఏమైనా ప్రత్యేకత యున్నదా?) అని అడుగుతుంది.దానికి ప్రతిగా కాళిదాసు తన మందబుద్ధితో అరకొరగా సమాధానము ఇస్తాడు. కానీ మాత అనుగ్రహముతో, గొప్ప జ్ఞానసముపార్జనతో ఇంటికి తిరిగి వచ్చిన కాళిదాసు భార్యతో, ఆమెను తన భార్యగా కన్నా, తనకు జ్ఞానమార్గోపదేశము చేసిన గురువుగా తలచి, ఆమె ప్రశ్నకు నివాళిగా, ఆమె గతములో సంధించిన ప్రశ్నలోని మూడు పదాలతో ప్రారంభింపబడిన తన మూడు కావ్యాలలోని మొట్ట మొదటి వాక్యాల ద్వారా తన సరికొత్త ఉనికిని తెలియచేస్తాడు. అవే అస్తితో మొదలయ్యే (అస్త్యుతారాస్యా దిశి) కుమార సంభవము , కశ్చిత్ తో మొదలయ్యే (కశ్చిత్ కాంతా) మేఘ సందేశము మరియు వాక్ తో మొదలయ్యే (వాగర్థావివ సంపృక్తౌ) రఘువంశము వ్రాసి అమెకు అంకితము చేస్తాదు
రిప్లయితొలగించండిపుట్టుకతో కాని యుక్త వయస్సులొ కాని కాళిదాసు ప్రతిభ లేని వాడె పండితుండు కాళి మాత దీవెనల్ తొ అయినాడు అన్న భావన
సీసము
“అస్త్యుతా రాస్యాది “ననుచు మొదలిడె కుమారసం భవమున్ విశారధుండు,
మేఘసందేశము మిన్నగ మొదలయ్యె, “కశ్చిత్ " పదము తోడ, కాళి దాసు
రఘవంశ ముయును నారంభము చేసె "వాగర్ధావి" పదముతో, కాంచ ఘనుడు
కాడు పుట్టుక తోడ, కపటంబు నెరుగని పామరుండు, బసాలు భంగ పరచె,
చదువు కొనని వాడు ,సంస్కృత భాషలో
(ప్రతిభ లేని వాడె ,పండితుండు)
గా ఘనతను పొంది కాళిదాసయ్యెగా
కాళి దీవెన లిడి కరుణ జూప
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజనత కంతయు సుఖశాంతులమరు నట్లె
రిప్లయితొలగించండిగాని , వారి మదిని కష్టపెట్టు
కవనముల రచనలు గావించు చుండెడి
ప్రతిభ లేనివాఁడె పండితుండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువు గారు నమస్కారము నిన్నటి పూరణము పరిశీలించండి
రిప్లయితొలగించండిప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ముల నే
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
రాజధాని భూములు అమ్ముకొనగా వచ్చిన ధనముతో శ్రీ క్రుష్ణ రాయభారము సినిమా తీస్తాను అని పద్యములమీద అభిమానమున్న ఒక ఆంధ్ర రైతు అనగా భార్య వారించిన సందర్భము
మురియుచు విరివిగ పరిపరి పరదేశ భాషలు మనరాష్ట పాఠశాల
లందు నేర్పుచునుండ సుందర మైనట్టి తల్లి భాషను వీడి రెల్ల జనము
పరుగులు బెట్టుచు నరుగు తరుణమున తెలుగిలో తల్లినే పిలువ లేరు
మరుగాయెను, (ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ముల నే)డు, నిజమ్ము నమ్మ
వలయు చూడరీ రాష్ట్రాన తెలుగు చలన
చిత్రముల నట్టివి, మనకు చెఱపు కలుగు,
పెట్టు బడియైన రాబోదు పిచ్చి పనులు
వలద నుచు నొక జవరాలు తెలిపె పతికి
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిసకల విద్యలు తెలిసియు సత్తు లేక
రిప్లయితొలగించండిప్రతిభ లేని వాడె, పండితుండు
మంచి గోరుచు సత్వపు మార్గ మెంచి
మేలు గొల్ప జేసి మెప్పు పొందు
(గాంధీజీని గురించిన కరుణశ్రీ గారి పద్యాలను ఇటీవల తనవిగా "ఆంధ్రజ్యోతి" లో ప్రచురింప జేసికొన్న ఒక అసమర్థకుకవి కలిగించిన స్ఫూర్తితో )
రిప్లయితొలగించండిఅతిగా వాగుచు ; నౌచితీరహితుడై
యాడంబరుండౌచు ; స
న్మతిహీనుండయి ; సత్కవీంద్రు రచనల్
మత్తెక్కి " నావం" చు గు
త్సితచిత్తంబున బత్రికన్ బ్రచురణన్
సేయించు నాపేడి యౌ
ప్రతిభాశూన్యుడె మేటిపండితుడుగా
బ్రఖ్యాతుడౌ నిద్ధరన్ .
మతితో యోచన చేయు నాతడు తగన్ మంచిన్ జెడున్,
రిప్లయితొలగించండికార్యమం
దతి శ్రద్ధన్ గనబర్చు, విజ్ఞుల సహాయం బందు, నల్పుండె పో
మతికిందోచిన మంచిమాట పలుకన్ మన్నించు నీ మాన్యుడే
ప్రతిభాశూన్యుఁడె? మేటి పండితుఁడుగాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్.
విర్రవీగబోడు విజ్ఞుడ నేనని
రిప్లయితొలగించండివిద్య నేర్చు కొలది వినయ మబ్బు
విలువ నిలుపుకొనుచు మెలగును బూటక
ప్రతిభ లేనివాఁడె పండితుండు.
అతిగ నాశగలిగి ఆశ్రయమొందును
రిప్లయితొలగించండిఅవనినాథు దయకు నాత్ర పడగ
జ్ఞాని యైన నేమి కానబోరెవరును
ప్రతిభ లేనివాఁడె పండితుండు!
ఎక్క డుండు నెప్పు డేరీతిఁ గన్పించు
రిప్లయితొలగించండినెవ్వఁ డరసె నంచు నింత యైన
సత్య నిరతి లేక నిత్యము శంకించు
ప్రతిభ లేనివాఁడె పండితుండు
అతు లానంద మనస్కుడున్ సకల దేవానుగ్రహప్రాప్త పూ
జిత నారాయణ పాదపద్మ యుగ నిశ్చింతుండు శాస్త్రాగ మాం
చిత విజ్ఞాన వికాస మానసుఁడు దుశ్చింతా సమాయుక్త దు
ష్ప్రతిభా శూన్యుఁడె మేటి పండితుఁడుగాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్
ఆటవెలది
రిప్లయితొలగించండిజలదరింపఁ జేయ జంటబాసిన పక్షి
య'మ్మరా' 'మరా' 'మరా' 'మ్మరా' లు
ప్రాజ్ఞత నిడ బోయ రామాయణము వ్రాసె
ప్రతిభ లేని వాడె! పండితుండు!!
మత్తేభవిక్రీడితము
అతిహేయంబుగఁ బక్షిఁగూల్చి మదిలో నావేదనన్ జెందుచున్
శ్రుతి జేయంగ 'మరా' 'మరా' ల ముని తా శ్లోకాల రామాయణ
మ్ము తిరమ్మయ్యెడి గాథఁ గూర్చెఁ! కన రామోత్కృష్ట నామార్చనన్
బ్రతిభాశూన్యుఁడె మేటి పండితుఁడుగాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్!!
పాదములపయిఁ బడి ప్రణుతించి నిత్యము,
రిప్లయితొలగించండివ్యర్థ మౌ పదముల పద్యములను
వ్రాసి, దీవెనలను బడయ గురువు నుండి,
ప్రతిభ లేనివాఁడె పండితుండు
ప్రతిభలేనివాడె పండితుండనుటను
రిప్లయితొలగించండినిజముకాదుసుమ్ము నీరజాక్షి!
పండితుండు సతముబ్రతిభావంతుడై
గారవింపబడును గవులజేత
అతడో బోయడు జంతుజాలములఁ సంహారమ్మునే జేయ తా
రిప్లయితొలగించండిసతతమ్మాటవి లో జరించుచు సదాసారంగుడే వేటతో
బ్రతికే వాడతడైననేమి ఘనమౌ రామున్ కథన్ వ్రాసెగా
ప్రతిభాశూన్యుఁడె మేటి పండితుఁడుగాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రతివాదమ్మునె పాడిగా దలచు దా వాచాలుడౌచున్ సదా
రిప్లయితొలగించండిప్రతిభాశూన్యుఁడె; మేటి పండితుఁడుగాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్
ప్రతిభాసాన్విత భాషణా పటిమ నొప్పారంగ శాస్త్రాదులన్
ప్రతిభన్ జూపుచు భావ గర్భితముగా వాదించు ధీశాలియే
కాల మెంత మారె గాంచుడు జనులార
రిప్లయితొలగించండిధనమదొక్క టున్న ధరణియందు
వెలుగు చుండు తాను విద్వాంసుని యటుల
ప్రతిభ లేని వాడు పండితుండు.
నమ్మ రాని యట్టి నగ్నసత్యమిదయు
వినగ చోద్యమగుచు వింత యయ్యె
నెట్టులయ్యె తెలుపు మిలలోన నిజముగా
ప్రతిభ లేనివాడు పండితుండు
అతిరిక్తమ్మగు నిష్ఠతోసతత మధ్యాయమ్మునన్ బోవుచున్
రిప్లయితొలగించండిగతినీవేయని శుద్ధమానసమునన్ కావించపూజల్ సర
స్వతి ప్రేమమ్మున తానొసంగు తెలివిన్ సంతృప్తితో రూఢిగా
ప్రతిభాశూన్యుఁడె మేటి పండితుఁడుగాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅన్ని తానె యంచు నాదర్శ వాదిగా
రిప్లయితొలగించండిహెచ్చు లాడు చుండు హీను డెపుడు
లోక రీతి నుండి లోకేషుడే గాచు
ప్రతిభ లేనివాడె పండితుండు
తెలియకున్ననేమి తెలివిగా నటియించి
రిప్లయితొలగించండిపెద్దకవిగ తాను పేరుపొందె
గ్రంధచౌర్యమందు గణుతి సాధించిన
ప్రతిభలేనివాడె పండితుండు
యతియున్బ్రాసలు తప్పినన్గనడుగా యంత్రంబువోలెన్ సదా
రిప్లయితొలగించండిమతిహీనంబుగ పెక్కుపొత్తములనామంత్రించుచున్ తామహో
ద్ధతితో నెల్లరమెప్పుపొందుటకునై దారుల్ గవేశించునా
ప్రతిభా శూన్యుఁడె మేటి పండితుఁడుగాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్