1, నవంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3179 (కార్తికమాసమందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే"
(లేదా...)
"కార్తికమాసమందుఁ జొరగం దగ దే శివమందిరమ్మునన్"

38 కామెంట్‌లు:


 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  ఆర్తుని జేయుచున్ మిగుల హైరన నిచ్చి యుపోషణమ్మునన్
  భర్తను పస్తుబెట్టుచును పండుగ జేయుచు పూజలందునన్
  వార్తలు ప్రోగు చేయగను ప్రక్కన కొంపవి నీలవేణికిన్
  కార్తికమాసమందుఁ జొరగం దగ దే శివమందిరమ్మునన్

  రిప్లయితొలగించండి
 2. మూర్తీ! మొక్షపదమ్మది
  కార్తికమన శివుని గుడినిఁ గాలిడఁ, దగునే
  ధూర్తునివగుచును పాయిగ
  వర్తించుట, మానుమింక పదుగురు మెచ్చన్.

  రిప్లయితొలగించండి
 3. వర్తిల భక్తితోడ భవబంధము లన్నియు బాపు జ్వాలి మీ
  రార్తిగ పిల్చినంత హృదయమ్ముల సోముడు కొల్వుదీరు సం
  వర్త యుపేక్ష సేయడు ప్రభావము చూపును పల్కనిత్తరిన్
  *కార్తికమాసమందుఁ జొరగం దగ దే శివమందిరమ్మునన్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి

 4. మూర్తి! జిలేబి పలుకులివి
  కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగు, నే
  నార్తియె ముఖ్యమనెద నిక
  స్ఫూర్తి వలయు దేనికైన శుభముల బడయన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. వార్తలలోని కెక్కె నిది వాస్తవ మొక్కగృహంబునందు దీ
  నార్తుల బ్రోచు దైవముల నాగక దిట్టుచు నాస్తికత్వమున్
  ధూర్తత నందియున్న యొకదుష్ట యనెన్ దనవారి కీగతిన్
  కార్తికమాసమందుఁ జొరగం దగ దే శివమందిరమ్మునన్"

  రిప్లయితొలగించండి
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  స్ఫూర్తిని నమక చమకములు
  పూర్తిగ భక్తిని పఠించు పూజారులతో
  భర్తి యగు చుండు నుత్తమ
  కార్తికమున శివుని గుడిని గాలిడ దగునే!

  రిప్లయితొలగించండి

 7. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  పూర్తిగ సిగ్గునున్ విడిచి బూరెలు గారెలు స్వీట్లతోడుతన్
  ధూర్తుల నెల్లరిన్ పిలిచి తోషము మీరగ పార్టిజేర్చుచున్
  కీర్తన జేయుచున్ భళిగ కేదరనాథుని వోట్లకోసమై
  కార్తికమాసమందుఁ జొరగం దగ దే శివమందిరమ్మునన్

  కేదరము = కేదారముయొక్క రూపాంతరము (శబ్దరత్నాకరము)

  రిప్లయితొలగించండి


 8. వర్తన మేలుగాంచవలె వల్లని కోరిక లెల్ల వీడుమా
  మర్తుడు వ్యర్థ మైన యుశి మానసమెల్లెడ వ్యాప్తిగానగా
  కార్తికమాసమందుఁ జొరగం దగదే శివమందిరమ్మునన్
  వర్తి ప్రవిస్తరింప వలె ప్రార్థన నిండు మనస్సు తోడుతన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే

  కర్తా ఖర్మ క్రియలు, నిల
  వర్తించవు నాకనుచును బహుపల్కులతో
  కార్తికమును నమ్మని యా
  కార్తికమున, శివుని గుడినిఁ గాలిడఁ దగునే?

  (సృష్టి, స్థితి లయ కారకుడని గాని, కార్తీక మాస పవిత్రత తెలియని ఒకడు గుడికి వెళ్లడం గురించి అన్నట్లు గా) 🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే

   పూర్తిగ తెలియక కడు చెడు
   వార్తలనిటనమ్మబల్కి వాదించుచు తా
   కార్తిక విలువే దనొకడు
   కార్తికమున, శివుని గుడినిఁ గాలిడఁ దగునే?

   🙏🙏

   తొలగించండి
  2. కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే

   స్ఫూర్తిని యిచ్చుచు కపటపు
   మూర్తిని తనలో నిలుపుచు మోసమొనపు దా
   హార్తిని చూపెడి జనులిడ
   కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే?

   మొనపు = కలిగించు
   🙏🙏

   తొలగించండి


 10. ఆర్తిగ వ్యోమకేశుని మ
  హాద్భుతరూపము భావయుక్తవి
  స్ఫూర్తిగ దివ్యు -లయ్యపలు
  బూర్ణపు భక్తిని బాడుచుండగన్ ;
  ధూర్తులు - వక్రబుద్ధులును -
  దొంగలు - భ్రష్టులు - మద్యపాయులున్
  కార్తికమాసమందు జొర
  గం దగ దేశివమందిరమ్మునన్ .
  (వ్యోమకేశుడు - ఈశ్వరుడు ; అయ్యపలు - అయ్యప్పస్వామి భక్తులు )

  రిప్లయితొలగించండి
 11. మైలవరపు వారి పూరణ

  🕉నమశ్శివాయ 💐🙏🌹

  ధూర్తులు సత్యధర్మగుణదూరులు కాముకులైనవార, ల....
  న్నార్తుల గోడు పట్టని ధనాంధులు పాపులు క్రూరదుష్టదు...
  ర్వర్తనులీ పవిత్ర శివభావశుభంకరదివ్యమైనదౌ
  కార్తికమాసమందుఁ జొరగం దగ దే శివమందిరమ్మునన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 12. ధూర్తులు మత్తులు త్రాష్టులు
  కార్తి క ము న శివుని గుడిని గాలిడ దగునే?
  యార్తిగ శివ భక్తి పరులు
  కార్తి క ము న వెళ్ళ వలయు కాలుని గుడికిన్

  రిప్లయితొలగించండి
 13. ఆర్తిని విడువక విష్ణుని
  మూర్తిని కొలిచెడి బగుతులు మూర్ఖత మతులై
  ధూర్తత పలికెద రటులన్
  కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే

  రిప్లయితొలగించండి
 14. ఆర్తియె తొలగును జనులకు
  కార్తికమున శివునిగుడిని గాలిడ;దగునే
  వర్తిల మరచుచు నాసమ
  వర్తిని నియమించు భక్తవత్సలునిలలో

  రిప్లయితొలగించండి
 15. కందం
  పూర్తిగ నాస్తిక వాదులు
  ఆర్తియు, భక్తిని యెరుగని యనుచిత చిత్తుల్
  ధూర్తులు, దుష్టులు, భ్రష్టులు
  కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే

  రిప్లయితొలగించండి
 16. 1. ఆర్తిగ భక్తులు వడివడి
  కీర్తించుచు శివ చరితలు కేకల జేరన్
  పూర్తిగ నిండెను జలమున
  కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే

  2. పూర్తిగ బస్సుల ప్రకటన
  వార్తల నమ్మిన జనులట వర్షము రాగా
  మూర్తిని దలచుచు వెడలిరి
  కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే

  రిప్లయితొలగించండి
 17. మూర్తినె కానీ దైవము
  నార్తిగ గొలువంగ లేని యంధుండగునా
  స్ఫూర్తి కొఱవడిన వాడనె
  "కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే"
  **)()(**
  (వెయ్యేళ్ళ క్రితం శైవ,వైష్ణవుల మధ్య విద్వేషాలు తారాస్థాయిన ఉండేవి)

  రిప్లయితొలగించండి
 18. ఆర్తినిఱేయింబగలును
  కీర్తించుచుసోమనాధుగీర్తనతోడన్
  బూర్తిగమైమఱచినయెడ
  కార్తికమునశివునిగుడినిగాలిడదగునే

  రిప్లయితొలగించండి
 19. నర్తన సేయుచు త్రాగుచు
  ధూర్తులు చెడు వర్తనమున దూరుచు శంభున్
  పూర్తిగ గుడి పాడు చేయగ
  కార్తికమున శివుని గుడిని కాలిడదగునే

  రిప్లయితొలగించండి
 20. ఆర్తినిబూజజేయుచునునాశివపార్వతిపాదపద్మముల్
  పూర్తిగబ్రేమతోడుతనబూరెలుగారెలునారగించగా
  గీర్తనలెన్నియోదనరగేలునుమోడ్చుచుబాడుచుండుచో
  గార్తికమాసమందుజొరగందగదేశివమందిరమ్మునన్

  రిప్లయితొలగించండి
 21. కీర్తించి మనస్ఫూర్తిగ ,
  నార్తిగ నీశ్వరుని కర్త యనుచు, గుడిలోని
  మూర్తిని తలపున నిలిపిన
  కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే  రిప్లయితొలగించండి
 22. ఆర్తిం గొలువుము భక్తి
  స్ఫూర్తిని విశ్వేశుఁ జంద్రచూడుని సతమున్
  ధూర్తా సపాదరక్షలు
  కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే


  కర్తృ మనోభ వాభవ సకాశ విలాస సతీ నిజాంగక
  స్ఫూర్తి వినోద శీతకర చూడ విరాజిత శంభు వాసమే
  సార్త వపో వినిర్మల రుషా పరివర్జిత చిత్త శుద్ధితోఁ
  గార్తికమాసమందుఁ జొరగం దగదే! శివమందిరమ్మునన్

  [స్ఫూర్తి = కాంతి; తగదే : తగును]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నమస్పూర్వక అభినందనలు


   అత్యద్భుతమైన పూరణ కామేశ్వరరార్య.

   తొలగించండి
 23. ఆర్తిగ నమ్మవారికిని యర్చనలే తగ దశ్వినమ్మునన్
  పూర్తిగ మున్గరాదు హరి పూజలయం దిల మార్గశీర్షమున్
  కార్తికమాసమందుఁ జొరగం దగ దే శివమందిరమ్మునన్
  వర్తనమందు దేవునకు ప్రార్థన వ్యర్థము నాస్తికేశ్వరా౹౹

  రిప్లయితొలగించండి
 24. ఆర్తి తొలగు శుభకరమగు
  కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ; దగునే
  కర్తవ్యమ్మును విడి దు
  ర్వర్తనులై దైవమును మరచు దుర్గుణమే

  రిప్లయితొలగించండి
 25. ఆర్తి శమించును, భక్తులు
  కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ, దగునే
  ధూర్తమనస్కులు పొందగ
  కీర్తిని కల్లతనముఁ జేయు కీర్తన లవనిన్

  రిప్లయితొలగించండి
 26. మూర్తియె చెప్పెనిట్లు తన ముద్దుల చెల్లెలు చెంతకేగి, నీ
  భర్తయె పోయెనంచు కడు బాధను జెందితి నిన్న పత్రికన్
  వార్తను గాంచి వచ్చితిని, వత్సర మంతయు సూతకమ్మె గా
  కార్తిక మాసమందుఁ జొరగం దగదే శివమందిరమ్మునన్

  రిప్లయితొలగించండి
 27. నర్తనప్రియుని కనుటకై
  కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే
  గుర్తుగ చెప్పులు విడువక,
  కర్తవ్యము సలుపకున్న కలుగును దోషమ్

  రిప్లయితొలగించండి
 28. కందం
  ఆర్తిగ దీపము నుంచుచు
  మూర్తినిఁ గన బోవ జార పుచ్చె పగిలె! జా
  గర్తల నూనె పొడఁ గనక
  కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే?

  ఉత్పలమాల
  ఆర్తిగ లింగనిన్ గొలువ నంచిత భక్తిని దీపముంచుచున్
  మూర్తిని మ్రొక్క బోవఁగనె ముందుకు తూలఁగ మూతి చిట్లెనే!
  పూర్తిగ తైలమొల్కగను ముంచిన దివ్వెల జాడ లేమరన్
  గార్తిక మాసమందుఁ జొరగం దగ దే శివమందిరమ్మునన్!!

  రిప్లయితొలగించండి
 29. కార్తిక దీపము జూచిన
  ఆర్తులకిల బాధలన్ని అణగారునులే
  స్ఫూర్తిగ నాస్తిక వాదిగ
  కార్తికమున, శివునిగుడిన గాలిడదగునే

  రిప్లయితొలగించండి
 30. ఆర్తిగ చర్చికి పోవుచు
  కీర్తింతువు గాదెనీవు క్రీస్తును సతమున్
  మార్తులు హిందువు లనుచును
  కార్తికమన శివుని గుడినిఁ గాలిడఁ, దగునే

  రిప్లయితొలగించండి
 31. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  కార్తికమాసమందుఁ జొరగం దగ
  దే శివమందిరమ్మునన్

  సందర్భము: ఆంజనేయుడు వాలి వధ పిదప సుగ్రీవునితో సీతాన్వేషణకు త్వరపడమని చెబుతూ ఇలా అన్నాడు.
  ఫుల్ల సప్తచ్ఛదా శ్యామా
  ప్రవృత్తా తు శర చ్ఛివా..
  విరిసిన ఏడాకుల అరటి పూలచే అందమైన శరత్తు వచ్చేసింది. (కిష్కింధాకాండం..32 స 13 శ్లో.)
  సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను నేల నాలుగు చెరగులా పంపిస్తూ ఇలా ఆదేశించాడు.
  "ఈ శరదృతువులోనే సీత జాడ కనుక్కొని రావాలి. భద్రంగా (జాగ్రత్తగా) వెళ్ళి రండి. ఒకే నెల గడు విస్తున్నాను. ఆ లోపల తిరిగి వచ్చేయాలి. రాగానే యుద్ధానికి సిద్ధం కావలసిందే! ఆలస్యం చేయడానికి ఎంతమాత్రం వీల్లేదు సుమా!
  మీరే కర్తలు.. అంటే చేసేవారు. రాముని పని నెరవేర్చడమే మన కర్తవ్యం. రాముడే మన దేవుడు. కర్యవ్యమే మన అర్చన. ఇది గుర్తుపెట్టుకొనండి. లోక మంతటా ఏ దిక్కు వెళ్ళినా శివ మందిరాలు (దేవతా గృహాలు) వుండనే వుంటాయి. శివుని ఆరాధనా వుంటుంది.
  శివునికి ప్రీతికరమైన కార్తిక మాసం వచ్చేసింది కదా అని కర్తవ్యం విస్మరించి చాపల్యంతోనో భక్తి పేరుతోనో అందులో దూరి కాలక్షేపం చేయరాదు సుమా! ముందున్నది మహత్తరమైన కర్తవ్యం. అది సాధించాక మీ యిష్టం."
  ఆలయా లంటే ఆగమ శాస్త్ర ప్రకారం విగ్రహాలను తయారు చేయించి ప్రతిష్ఠించి నిత్య పూజాదికాలను కొనసాగించడం. మందిరా లంటే రకరకాల చిత్రపటాలను పెయింటింగ్సును శిల్పాలను నేత్రోత్సవంగా అమర్చి అప్పుడప్పుడు అనేక కార్యక్రమాలు నిర్వహించటం.
  శరదృతు వంటే ఆశ్వయుజ కార్తిక మాసాలు. మామూలుగా శుక్లపక్ష అష్టమినుంచి కృష్ణపక్ష అష్టమివరకు శుభ దినాలుగానే పరిగణించటం కద్దు. కాబట్టి ఆశ్వయుజ బహుళ అష్టమి లోపల సుగ్రీవుడు వానరులను సీతాన్వేషణకై పంపించి వుంటా డనుకోవచ్చు.
  నెల రోజుల గడువంటే కార్తిక బ॥ అష్టమివరకు వారు తిరిగి వచ్చేసివుంటా రనుకోవచ్చు (ఒక్క దక్షిణం దిక్కుకు వెళ్ళిన హనుమదాదులు తప్ప)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  వర్తిలు నీ శరత్తుననె
  భద్రము! సీతనుఁ జూచి రావలెన్..
  బూర్తిగ మాసమే గడువు..
  పోరుకు సిద్ధము గావలెన్ సుమా!
  కర్తలు మీరె! రాఘవుని
  కార్యమె యర్చన.. భక్తి పేరిటన్
  కార్తికమాసమందుఁ జొర
  గం దగ దే శివ మందిరమ్మునన్!

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  1.11.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 32. (మహిళారాజ్య మహారాణి ప్రమీల సమరానికి సంసిద్ధమై
  పాండవమధ్యముడైన పార్థునితో )
  అలుకను బూనినాము పురు
  షాధము లందరిపైన నర్జునా !
  అలికులవేణు లందర న
  గాధములోనికి నెట్టినారలే !
  మెలకువ నందినార ; మిక
  మిన్నగ నుండుట కల్ల ; చూడుమా !
  కలువలు కత్తులయ్యెడిని ;
  కార్ముకముల్ విరిదండలయ్యెడిన్ .

  రిప్లయితొలగించండి