భీమన ఇతఁడు భారతమును తెనిఁగించుటకు మునుపే ఒక భారతమును తెనుఁగున రచియించి ఆ గ్రంథమును నన్నయభట్టారకునివద్దకు కొనివచ్చి దానియందలి లోపములను పరిశీలించి రాజునకు చూపి తనకు సన్మానము కలుగఁజేయవలయును అని అడుగఁగా దానినతఁడు చదివిచూచి అందలి ప్రయోగపద్ధతులు మొదలగునవి మిక్కిలి శ్లాఘనీయములు అయి ఉండఁగా అది బయటవచ్చినయెడల తన భారతము అడఁగిపోవును అని ఎంచి ఆ యభిప్రాయమును బయలుపఱపక భీమకవితో నేను రాజు ప్రేరేఁపణచేత ఒక భారతము రచియించుచు ఉన్నాను. ఆదిపర్వముమాత్రము ఇప్పటికి అయినది. ఇప్పుడు ఈగ్రంథమును రాజునకు చూపిన యెడల తన ప్రయత్నము నెఱవేఱుటకు భంగముగా ఇది ఒకటి వచ్చెను అని తిరస్కరించునుగాని అంగీకరింపఁడు. కనుక సమయముచూచి నీ గ్రంథమును అతనికి చూపి సన్మానము చేయింతును అని చెప్పి అది తీసి తన ఒద్ద ఉంచుకొని, ఆయనను పంపి దానిని కాల్చివేసెను
వ్యాసభారతమును చూసి తెనుగులోన నన్నయ సుకవి ఘనముగ వ్రాయు
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
హస్తపు భూషణమ్మనుచు హైరన నొందక హాయిహాయిగా
నేస్తము లెల్లరున్ పొగడ నేరుగ పోవుచు గ్రంథశాలకున్
మస్తుగ పండితాగ్రణుల మాన్యత చెందిన కావ్యకన్యయౌ
పుస్తక చౌర్యమే యశముఁ బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్
తొలగించండికంది శంకరార్యుల సవరణతో:
ప్రాతః కాలపు సరదా పూరణ:
హస్తపు భూషణమ్మనుచు నాత్రము చెందుచు హాయిహాయిగా
నేస్తము లెల్లరున్ పొగడ నేరుగ పోవుచు గ్రంథశాలకున్
మస్తుగ పండితాగ్రణుల మాన్యత చెందిన కావ్యకన్యయౌ
పుస్తక చౌర్యమే యశముఁ బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండి🙏
నిన్నటి శంకరాభరణం సమస్య
రిప్లయితొలగించండి"ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్య వైముఖ్యమే"
ఇచ్చిన పాదము మత్తేభము నా పూరణము సీసములో
ఘనమగు రాజ్యము కట్టబెట్టి పరిపా
లనము చేయమనగన్ తనువు విడిచె
చిత్రాంగదుడు తన చేతల వలనన్ , వి
చిత్ర వీర్యుని కాంచి శీర్షకమ్ము
పెట్టి పాలనమును పేరిమి తో చేయ
మని తెల్ప మరణించె నధిక మైన
కామ వాంఛ కలుగ,నీమము తప్పక
త్యాగ శీలు డెపుడు ధర్మము కలి
గి ఘన విఙుండుగ గీర్తి దెచ్చును గదా,
కర్తవ్య వైముఖ్య మే రహటు ను
కూర్చును సతము, భీష్ముడు కోరికలను
వీడి, ధర్మ మార్గంబును వీడక తను
చేసి నట్టి బాసకు నిలచి జగ మందు
గొప్ప వాడాయె నెల్లరి మెప్పు బడసి
మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిముస్తాబు చేసికొనినను
రిప్లయితొలగించండికస్తూరీ తిలకమెట్ట ఘనుడనబడునే?
మస్తక మెదుగగ నెంచుచు
పుస్తక చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ గీర్తుల్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ముస్తాబు' అన్యదేశ్యం. 'తిలకమెట్ట' అన్నది వ్యావహారికం. "తిలక మిడగ" అనండి.
🙏ధన్యవాదములు. కావాలని తప్పు వ్రాసితిని సరి చేసుకొందును.🙏
తొలగించండివస్తువుకాదు పుస్తకము వాడిన పిమ్మట పారవేయగా
రిప్లయితొలగించండిహస్తమునందు నుంచుటకు నయ్యది భూషవిశేషమందురా?
మస్తక దీపమై వెలిగి మానసమున్ వికసింపజేయునా
పుస్తక చౌర్య మేయశముఁ బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్?
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిపుస్తకమే పండిత ప్రియ
రిప్లయితొలగించండినేస్తము కరభూషణమది, నేరమె కాదే
పుస్తకమనెడాస్తి నొలుచ!
పుస్తక చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ గీర్తుల్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ప్రియ నేస్తము' దుష్టసమాసం. "పండితులకు నేస్తము..." అనండి.
ప్రస్తుత కలియుగ మందున
రిప్లయితొలగించండిపుస్తక చౌర్యమునఁ గలుఁగు, బుధులకుఁ గీర్తుల్
మస్తుగ మంచిని పెంచగ
మస్తకమును పదును బెట్టు మానవ చేష్టల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిప్రస్తుతసత్కవిత్వగుణభాసురులిర్వురు భక్తిపూతమౌ
పుస్తకమొండు వ్రాసుకొని ముద్రణకీయ ధనమ్ములేక , సూ...
ర్యాస్తమయమ్మునందునొక యాలయమందున నిద్రనుండ , తత్
పుస్తకమున్ హరించి యొక దొంగ, ధనాఢ్యునకమ్మ , నాతడా
పుస్తకమున్ పఠించి కడు మోదమునంది ప్రశంస జేయగా!!
పుస్తక చౌర్యమే యశముఁ బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివాస్తవమోయి స్వచ్ఛమగు భావనతోడ బఠించువారికిన్,
రిప్లయితొలగించండినేస్తములైనవారికిని, నిర్మలులౌ ఘనఛాత్రకోటికిన్
విస్తృత రీతి గ్రంథములు ప్రేమను బంచుటయొప్పు నిద్ధరన్
పుస్తక చౌర్య మేయశముఁ బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్?
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిపుస్తక చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ గీర్తుల్
రిప్లయితొలగించండిపస్తులు యుండుచు పదుగురి
మస్తికము న మంచి జేర్చ మహిలో నెపుడున్
ఇస్తిరహో చదువను తా
పుస్తక చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ గీర్తుల్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పస్తులు + ఉండుచు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "పస్తులె యుండుచు" అనవచ్చు. 'ఇస్తిరి' అన్నది గ్రామ్యం.
🙏🙏
తొలగించండినేటి శంకరాభరణము సమస్య
రిప్లయితొలగించండిపుస్తక చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ గీర్తుల్"
ఇచ్చిన పాదము కందము నా పూరణ సీసములో
భీమన ఇతఁడు భారతమును తెనిఁగించుటకు మునుపే ఒక భారతమును తెనుఁగున రచియించి ఆ గ్రంథమును నన్నయభట్టారకునివద్దకు కొనివచ్చి దానియందలి లోపములను పరిశీలించి రాజునకు చూపి తనకు సన్మానము కలుగఁజేయవలయును అని అడుగఁగా దానినతఁడు చదివిచూచి అందలి ప్రయోగపద్ధతులు మొదలగునవి మిక్కిలి శ్లాఘనీయములు అయి ఉండఁగా అది బయటవచ్చినయెడల తన భారతము అడఁగిపోవును అని ఎంచి ఆ యభిప్రాయమును బయలుపఱపక భీమకవితో నేను రాజు ప్రేరేఁపణచేత ఒక భారతము రచియించుచు ఉన్నాను. ఆదిపర్వముమాత్రము ఇప్పటికి అయినది. ఇప్పుడు ఈగ్రంథమును రాజునకు చూపిన యెడల తన ప్రయత్నము నెఱవేఱుటకు భంగముగా ఇది ఒకటి వచ్చెను అని తిరస్కరించునుగాని అంగీకరింపఁడు. కనుక సమయముచూచి నీ గ్రంథమును అతనికి చూపి సన్మానము చేయింతును అని చెప్పి అది తీసి తన ఒద్ద ఉంచుకొని, ఆయనను పంపి దానిని కాల్చివేసెను
వ్యాసభారతమును చూసి తెనుగులోన
నన్నయ సుకవి ఘనముగ వ్రాయు
చుండగ, భీమన్నపండితుండిచ్చెనొ
క వహిని, చూచెను కవివరుండు
దానిలోని ఘనత ,తనపేరు పోవున
ని తలపోయుచు దానిని దహనమ్ము
కావించి పుస్తక ఘాతమ్ము చేసి జ
గతిలోన జనులచే గరిమ పొందె,
సరసమౌ పుస్తక చౌర్యము నఁ గలుఁగు
బుధులకుఁ గీర్తులి ప్పుడుమి లోన,
ఘనత బడసిన నన్నయ గరిమ కొరకు
గ్రంధ చౌర్యము గావించె కలక లేక,
నేడు చిరుతలు చేయంగ నేర మేల
నయ్య పూసపాటి తెలుప వయ్య యిపుడు
మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈకథ నమ్మదగినది కాదని నా అభిమతం.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
సీనియర్ సలహా (IIT Kharagpur, 1965):
హస్తము నేల నొవ్వెదవు? హాయిగ చేరుచు ల్యాబునందునన్
జాస్తిగ కష్టమొందకయె చప్పుడు చేయక తూగుతీయుచున్
కాస్తయొ కూస్తయో గెలికి కంపము నొందక పూర్వఛాత్రునిన్
పుస్తక చౌర్యమే యశముఁ బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్
పుస్తకము = Lab Khata
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమస్తుగ వ్రాయగ పద్దెము
కుస్తీ పట్టిన కుదరదె కుదురుగ కావ్యం
పుస్తక పుటలను మార్చిన
పుస్తక చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ గీర్తుల్!
*****సరదాగా...!
మస్తిష్కము పెరుగదెన్నడు
తొలగించండిపుస్తక చౌర్యమునఁ : గలుఁగు బుధులకుఁ గీర్తుల్
పుస్తకములందు జక్కని
వస్తువు జొప్పుగ జదివినవారలు మెచ్చన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. "పెరుగ దెపుడు" అనండి.
🙏🏽
తొలగించండిపస్తుల నుండియు నైనఁ న్
రిప్లయితొలగించండిపుస్తక ములు కొన వలయును పుడమిని యనగా ప్రస్తుత మిట్లన నేవిధి
పుస్తక చౌర్యము న గలుగు బుధులకు గీ ర్తు ల్ ?a
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి"పుడమిని ననగా" అనండి.
విస్తరి చింపిన ఫలితము
రిప్లయితొలగించండిపుస్తక చౌర్యమునగలుగు;బుధులకు కీర్తుల్
పస్తుల జేసిన నైనను
నిస్తులమౌ కావ్య మల్ల నిలుచును భువిలో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండివస్తువు దొరకక రాయను
రిప్లయితొలగించండిమస్తక హీనులు వెరువక మాన్యుల రచనల్
మస్తుగ చోరిక చేతురు
పుస్తక చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ గీర్తుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిస్తారముగా దుఃఖము
రిప్లయితొలగించండిపుస్తక చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ; గీర్తుల్
మస్తిష్కపు యతనమ్ములు
నాస్తియయె, మనుజులనింక నమ్మతగదయా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అయె' అన్న ప్రయోగం సాధువు కాదంటారు పెద్దలు.
ప్రస్తుతపు కవులు కొందరు
రిప్లయితొలగించండిమస్తిష్కపుగుంజులేక మాన్యతరహిమిన్
పుస్తకపుట హరియించుత
పుస్తకచౌర్యమునగలుగుబుధులకు కీర్తుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండినేస్తము లంత గూడి యను నిత్యము జేరగ గ్రంథశాలకున్
పుస్తకమందు దూరి కడు పూనిక తోడన పాఠ్యభాగముల్
మస్తకమందు నింప నొక మందుడు జూపగ నస్త విద్యలన్
పుస్తక చౌర్యమే యశము బొందగజేయు బుధాగ్ర గణ్యులన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అస్తవిద్య'?
మస్తకముననొకచక్కని
రిప్లయితొలగించండిపుస్తకమును చదువుకోర్కి పురులనువిప్పన్
వ్యస్తతగలుగలభించక
పుస్తక చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ గీర్తుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండిఆస్తుల నీయకున్న భువి హారతు లందెడు వారసత్వమున్
ప్రస్తుత మీయగా తగును, బాలలు విద్యలు నేర్వ వారివౌ
హస్తములందునన్ దగని హానికరమ్మగు భావముండ నా
పుస్తక చౌర్యమే యశముఁ బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపుస్తక మన్న నజ్ఞతను బో నడపంగను గొప్ప సాధనం
రిప్లయితొలగించండిబాస్తి వివేకవంతులకు నట్టి మహత్తర పుస్తకంబు నే
బ్రస్తుతి చేతు సన్మతి సరస్వతి యంచు మహాత్ములార యా
పుస్తక చౌర్య మే యశముఁ బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్?
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపస్తుల నిలువకిట తినెడి
రిప్లయితొలగించండివస్తువులను దొంగిలించ పద్దతి గాదే
మస్తుగ విద్యను నేర్పగ
పుస్తక చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ గీర్తుల్
🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యుణ్ణి 🙏🙏
తొలగించండిసుస్తుత కావ్యము నరసి ప్ర
రిప్లయితొలగించండిశస్తమ్ముగను గుణ దోష సంశోధనలం
బుస్తక మందలి భావపుఁ
బు స్తక! చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ గీర్తుల్
[పుస్తు +అక = పుస్తక; పుస్తు= కంపు; అక =అక్క]
శస్తపు పండితబ్రువుల శాశ్వత కీర్తి సమార్జ నార్థమై
మస్తక మందుఁ గల్గ ననుమానము మంచి దనంగ నిత్తరిం
బుస్తక చౌర్యమే, యశముఁ బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్
విస్తృత భావ శబ్దముల వెల్గిన కావ్యపు సృష్టి కర్తలన్
[అనుమానము = ఊహించుట]
మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపుస్తకచౌర్యమే యశముబొందగజేయు బుధాగ్రగణ్యులన్
రిప్లయితొలగించండిబుస్తకచౌర్యమున్వలన బొందరుకీర్తిని నెవ్వరీభువిన్
బుస్తకధారణంబొకనపూర్వపుభాగ్యముగా దలంచుడీ
యాస్తులగంటెమిన్నసుమి యారనిజోతులుబుస్తకంబులే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చౌర్యము వలన' అనడం సాధువు. అక్కడ నుగాగమం రాదు.
కందం
రిప్లయితొలగించండిహస్తమ్మున విద్యార్థియె
చూస్తున్నది మంచి దనక శోధించుమురా
దాస్తున్నది తగదైనను
పుస్తక చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ గీర్తుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅస్తు! బుచికో బుచికియని
పుస్తక చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ గీర్తుల్
మస్తకమది మనకేలా !
వాస్తవ మిదియె తెలుసుకొను బంచికి భంభమ్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపుస్తెల నమ్మి తల్లి తగు పుస్తకముల్ చదువుల్లమర్చఁ, చా
రిప్లయితొలగించండిదస్తపు పద్ధతుల్ విడి వితండపు వాదము పోవునే యనెం
బస్తులనున్న తల్లి, కనెఁ బర్బరునిన్, తుద కిచ్చునే యెటుల్
పుస్తక చౌర్యమే యశముఁ? బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రస్తుతి యేల గలుంగును?
రిప్లయితొలగించండిపుస్తక చౌర్యమున; గలుగు బుధులకు కీర్తుల్
ఆస్తుల కన్నను మిన్నగ
విస్తరముగ దాని విలువ వీక్షింపంగన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి( " డిగ్రీలు లేని పాండిత్యంబు లెక్కకు
రిప్లయితొలగించండిరాని యీ పాడుకాలాన బుట్టి " అని కవిసమ్రాట్
విశ్వనాథవారిచే ప్రశంసింపబడిన చరిత్రపరిశోధక
బ్రహ్మ మల్లంపల్లిసోమశేఖరశర్మగారి భావాలు తమవిగా చేసికొని డాక్టరేట్లు అందుకొన్నారు కొందరు )
మస్తకమందు నింతయును
"మల్లముపల్లి" దలంపకుండగన్
విస్తును గొల్పు నంశముల
వెన్నియొ కన్గొనినట్లు థీసిసుల్
మస్తుగ వ్రాసి దర్పమున
మల్లుర పోజుల బెట్టువారిదౌ
పుస్తకచౌర్యమే యశము
బొందగజేయు బుధాగ్రగణ్యులన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివిస్తారంబుగ పాపము
రిప్లయితొలగించండిపుస్తక చౌర్యమునఁ గలుఁగు: బుధులకుఁ గీర్తుల్
పుస్తక పరిరక్షణమున
విస్తరమగు జ్ఞాన జ్యోతి వెలుగగ స్థిరమై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జ్ఞాన జ్యోతి' అన్నపుడు 'న' గురువై గణదోషం.
ఉత్పలమాల
రిప్లయితొలగించండికుస్తిలు పట్టుచున్ విలువ కూర్చిన పట్టున జ్ఞానమార్జిఁచే
పుస్తక చౌర్యమే యశముఁ బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్
మస్తుగ, లేనిచో నొరుల మంచిని నోర్వకఁ చౌర్యమే తగున్
పుస్తక మార్చి పాఠ్యములుపూరిఁచ కీర్తిని నెట్లు పొందుదుర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికొన్ని వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలున్నవి. "జ్ఞానలబ్ధిచే" అనండి. 'పుస్తకమార్చి...పొందుదుర్'?
జాస్తిగ నపవాదు భువిని
రిప్లయితొలగించండిపుస్తక చౌర్యమునఁ గలుఁగు, బుధులకుఁ గీర్తుల్
మస్తుగ ఘటిల్లు చుండును
మస్తకమున నుంచి పలుక మన్యుల కవితల్
జాస్తిగ చెడ్డపేరొదవు సత్కవి గాగ యొనర్చు నట్టిదౌ
రిప్లయితొలగించండిపుస్తక చౌర్యమే, యశముఁ బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్
మస్తక మందు నిల్పియస మానపు ధారణ తోడ కావ్యముల్
మస్తుగ చెప్పుచున్ ప్రజకు మాన్యునిగా చరియించపృథ్విపై
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండివిస్తరమై వెలుంగుగద,వీధినవెల్గగజేయు గ్రంధముల్
రిప్లయితొలగించండిదుస్తరమైన జీవికన,దుర్మదమెక్కిన మానవాధముల్
పుస్తకముల్ పఠించగను, పూర్తిగమారిరి పూర్వగాధ,లా
పుస్తకచౌర్యమే యశముబొందగజేయు బుధాగ్రగణ్యులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వీధిని.. జీవికను..." అనండి.
హస్తమునందు భూషణము,హాయినిబెంచును మానసమ్మునన్
రిప్లయితొలగించండిదుస్తరమైన మార్గముల దూరముజేయగ శక్తియుండి తా
కస్తురివోలె వాసనల క్రమ్మగజేసెడు పుణ్యభావనా
పుస్తకచౌర్యమే యశముబొందగజేయు బుధాగ్రగణ్యులన్
పుస్తకమన్నగొప్ప నిధి ,పూర్తిగసత్యపువాక్యమే యనన్
రిప్లయితొలగించండికస్తురివోలె వాసనల, క్రమ్మగజేసెడు పుణ్యభావనల్
హస్తముకేల భూషణము,హాయిగదానినిబొందగోరుటన్
పుస్తకచౌర్యమే యశము,బొందగజేయు, బుధాగ్రగణ్యులన్.
దోస్తులయందు గొప్పయని దొడ్డగకీర్తినిబొందె గ్రంధముల్
రిప్లయితొలగించండిహస్తినయందురాజులను,హాయిగనుంచెను పూర్వ కావ్యముల్
ఆస్తిగవెల్గిపోవుగద,ఆలనపాలనజూచు వారికా
పుస్తక చౌర్యమున్ యశముబొందగజేయు బుధాగ్రగణ్యులన్.
మీ పై మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిహస్తవిద్య
రిప్లయితొలగించండిమస్తకమందు ధర్మమును,మానసమందున సంస్కృతీప్రభల్
రిప్లయితొలగించండివిస్తరణమ్ము జేయుగద,వీణధరించెడు మాతయెప్పుడున్
పుస్తకపాణి నమ్ముకొన పోషణజేసెడు విజ్ఞతన్నిడున్
పుస్తకచౌర్యమేయశముబొందగజేయుబుధాగ్రగణ్యులన్.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
పుస్తక చౌర్యమునఁగలుఁగు బుధులకుఁ గీర్తుల్
సందర్భము:
మంగల కరని కలిమల హరని
తులసీ కథా రఘునాథ్ కీ..
రఘునాథుని చరిత్రం కళ్యాణ ప్రదమైన స్థితిని సమాజంలో ఆవిష్కరిస్తుం దని కలిదోషాలను నివారిస్తుం దని తులసీదాసు హామీ యిస్తూ రామచరిత మానస రచన ఆరంభిస్తాడు.
శ్రీ మద్రామాయణం ఆది కావ్యం.
రాముని మహిమను వర్ణించి ప్రేమతో మనిషిని తీర్చిదిద్దే మహా కావ్యం.
వాల్మీకి వాగమృతం.
వ్యాసుని ఆధ్యాత్మికాభిమతం.
కాల పరీక్షకు నిలిచిన గ్రంథం.
నేల నాలుగు చెరగులకూ అవసరమైన గ్రంథం.
భక్తులకు సారథి. విమర్శలకు వారధి. సాధకులకు పెన్నిధి. ఒక్క మాటలో చెప్పా లంటే రామ ప్రభు సన్నిధి.
ఆనందదాయిని. మోక్ష ప్రదాయిని.
"పుస్తకం చదువటంతో సరిపోదు. రాముని తత్వాన్ని మస్తకాని కెక్కించుకోవాలి. సాటిలేని రామాయణ పుస్తకాన్ని గ్రంథాలయంలోంచి దొంగిలిస్తా నంటావే! ఇ దేం బాగో లేదు." అంటున్నా డొకడు మిత్రునితో..
~~~~~~~~~~~~~~~~~~~~~~~
శస్తము రాముని తత్త్వము
మస్తకమున నిడక యిట్టి మాటలు తగునే!
"నిస్తుల మగు రామాయణ
పుస్తక చౌర్యమునఁ గలుఁగు
బుధులకుఁ గీర్తుల్"
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
22.11.19
-----------------------------------------------------------
నిస్తేజు లౌదురిలలో
రిప్లయితొలగించండిపుస్తక చౌర్యమున గలుగు బుధులకు కీర్తుల్
మస్తకమునకు ముదమొసగి
హస్తమునకు భూషణముగ నలరారు గదా!