సందర్భము: అదృశ్యుడై ప్రయోగించే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ధాటికి ఒక్కరోజే 66 కోట్ల వానరులు నెత్తురు ముద్ద లయ్యారు. హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, రామలక్ష్మణులు అంతా నెత్తు రోడుతూ కూలినారు. రక్తం ఏరులయింది. కపిసేన పీనుగుల పెంట అయింది. హనుమంతుని గుండె చెరు వయింది. హనుమద్విభీషణులు జాంబవంతుని ఎంతో శ్రమపడి కనుక్కున్నారు. బాధతో మూలుగుతున్నాడు. నోట మాట రావట్లేదు. ఆయన విభీషణునితో.. "హనుమంతు డెలా వున్నాడు?..ఆయన బాగుంటే అందరూ బాగున్నట్టే!.." అన్నాడు. పక్కనే వున్న పావని నమస్కరించగా జాంబవంతు డన్నాడు. "నాయనా! *త్వత్పరాక్రమ కాలోఽయం నాన్యం పశ్యామి కంచన..* నీ పరాక్రమం చూపించే కాలం మిది. ఇతరు లెవరూ కనిపించట్లేదు." "నీవు హిమగిరికి వెళ్ళాలి. అక్కడ ఋషభగిరి కైలాస శిఖరాల నడుమ ఓషధి పర్వతం మీద మృత సంజీవని, విశల్య కరణి, సువర్ణకరణి, సంధానకరణి అనే ఓషధు లుంటాయి. తీసుకురావలె. అందరికీ నీవే ప్రాణదాతవు." వెంటనే హనుమ అతి వేగంగా ఎగిరి హిమాద్రి చేరాడు. ఓషధు లదృశ్యమైనవి. విపరీతమైన కోపంతో హనుమ ఒక నిప్పుల కొండలా కనిపించాడు హిమగిరియందు... (అని పద్య భావం.) "ఓషధుల కుప్ప లుంటాయి." అన్నాడు బాధతో నోటి మాట రాక జాంబవంతుడు. "ఓషధుల కుప్పెలు.." అనుకున్నాడు సరిగ్గా వినపడక మారుతి. అక్క డక్కడ గిరిజనులు కనిపిస్తారేమో! అడిగితే ఆ కుప్పెలు ఇస్తారేమో అనుకున్నాడు. తొందరపడేటప్పుడు ప్రయోజనంమీదనే తప్ప పనిమీద పరికరాలమీద దృష్టి నిలుస్తుందా! సిరికిం జెప్పడు శంఖచక్రయుగమున్ జేదోయి సంధింప డే పరివారంబును జీరడు.. భక్త పరాధీనుడైన శ్రీ హరి ఎంత తొందరపడ్డాడో గజేంద్రుని రక్షించడానికి. ఆ హరి దూతనే కదా ఈ హరి! మొత్తానికి ఆ కుప్పె లేవీ కనిపించలేదు. మొత్తం కొండనే పెకలించుకువచ్చాడు పావని. వానరు లంతా నిద్ర లేచినట్టు లేచారు. నీహారాద్రిన్ = హిమగిరియందు ~~~~~~~~~~~~~~~~~~~~~~~ గొప్ప కినుకతో "నోషధి
కుప్పెలు గనరా.. విపు డిదె కొండఁ బెకల్తున్
దప్ప" దనె.. రామదూతయె
నిప్పుల కొండ యనఁదగును నీహారాద్రిన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 29.11.19 -----------------------------------------------------------
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
ఒక కాశ్మీరు పండిట్ కన్నెకు ప్రోత్సాహము:
సాహో! యంచును వెంబడించు! భళిగా సంక్రాంతి పర్వమ్మునన్
రాహుల్ గాంధిని పెండ్లియాడుచును పల్ రాగమ్ము లాభమ్ముతో
నాహా! నీ యొడినిన్ గనంగ సుఖమున్ హ్లాదంపు కాశ్మీరునన్
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్!
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండి🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-1)
తల్లిని జేసి పారిపోయిన తకిలుడు దొరికితే, నీహారాద్రి నిప్పులకొండే :
__________________________
గొప్పందము నీ దనుచును
తప్పుడు తల్లిగను జేసె ! - తకిలుడు దొరుకన్
చప్పున చెప్పున బాదిన
నిప్పులకొండ యనఁదగును - నీహారాద్రిన్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
ఒక భారతీయ జవానుకు ప్రోత్సాహము:
సాహో! యంచును వెంబడించు! వడిగా శ్లాఘంపు సైచిన్నునన్
బాహాటమ్ముగ పాకు సైనికులనున్ బ్రహ్మాండమౌ బాంబ్లతో
నాహా! జ్వాలలు క్రమ్మి మండగనహో! హ్లాదమ్మునన్ గాంచగా
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్
😊
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండి🙏
చప్పున చక్కని సొగసును
రిప్లయితొలగించండిమెప్పుగ తిలకించి నంత మిన్నుల నంటున్
ముప్పని తెలియమి కౌగిలి
నిప్పుల కొండయనఁ దగును నీహారద్రిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీహారాద్రిన్
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-1)
కవి నిరంకుశుడు
దేనినైనా యేలాగైనా వర్ణించ నొప్పు :
__________________________
ఆహాహా యని మెచ్చవచ్చు గద జి - హ్వాపంబు నాగారి గా
నాహాహా యని యాదరించ దగు గ్రా- మ్యాశ్వంబు నర్వంబు గా
నాహాహా యని గారవించ నగు వ్యా - ఘ్రాసంబు వ్యాఘ్రంబు గా
నీహారాద్రిని నిప్పుకొండ యని వ - ర్ణింపంగ నొప్పున్ ; గృతిన్ !
__________________________
జిహ్వాపము = కుక్క, నాగారి = సింహము
గ్రామ్యాశ్వము = గాడిద, అర్వము = గుఱ్ఱము
వ్యాఘ్రాసము = పిల్లి, వ్యాఘ్రము = పులి
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
B-2)
ఓ నీరజ నేత్రీ
నీహారాద్రివి కాదు నిప్పుకొండవని
నిరూపించుకో :
__________________________
మోహావేశము కన్నుగానక నయో - మోసంబు పాలైతివా
హాహాకారము జేయ నేమి ఫలమో - యాపన్నసత్త్వైతివే
ద్రోహాటున్ గనిపెట్టి పట్టుకొని క్రో-ధోద్రేకమున్ జెండినన్
నీహారాద్రిని నిప్పుకొండ యని వ - ర్ణింపంగ నొప్పున్ ; గృతిన్ !
__________________________
ఆపన్నసత్త్వ = గర్భవతి
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'...సత్త్వ + ఐతివే' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
రిప్లయితొలగించండిఎప్పటికో ఫెళ్ళనుచున్
నిప్పు మరల గ్రక్కునణగి నిలచిన కుఠియే
తప్పక! కావున కవిరాట్
నిప్పులకొండ యనఁదగును నీహారాద్రిన్
జిలేబి
రిప్లయితొలగించండిబాహాటమ్ముగ మంచుకొండయె సుమీ బంధాకి పూర్వమ్ము జ్వా
లాహారమ్ముగ వెల్గె; మ్రగ్గెనిపుడే లావాయె; చల్లారగన్
హాహాలమ్మిక నోషధుల్ వెలసె నాహార్యమ్ముగా దానిపై ;
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్
జిలేబి
తొలగించండి👌
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
A-2)
అప్పూతో గురువు :
__________________________
చెప్పుట తప్పది యప్పూ
నిప్పులకొండ యనఁదగును - నీహారాద్రిన్ !
తప్పును తిప్పుచు చెప్పుము
నిప్పుల నిర్ఝరి, యనవలె - నిప్పులకొండన్ !
__________________________
వసంత కిశోర్ (కవులూరు రమేష్)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితప్పుల నొప్పని మిత్రుం
డొప్పుకొనక నెగిరెగిరి పడునతండే పే
రొప్పదు హేమాద్రియనుచు
నిప్పులకొండ యనఁదగును నీహారాద్రిన్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి*నాడు*
బాహాటమ్ముగ ముష్కరాధములు దైవత్వోల్లసచ్ఛృంగసం...
దోహమ్మౌ మన ప్రాంతమందు జనులన్ దుష్టాత్ములై చంపగా
హాహాకారములెల్ల ధూమములుగా వ్యాపింప నల్దిక్కులన్
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగనొప్పున్ కృతిన్ !!
*నేడు*....
జోహారుల్ వొనరింపుడీ ప్రభుతకున్ సొంపౌ గతిన్ శాంతిసం
దోహంబైనది నేడు మా ధరణి .,మీ దుర్మార్గభూయిష్ఠ దు...
ర్వ్యాహారమ్ములు చెల్లవీ గిరిని! మీరై తాక భస్మమ్మె ! మా
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగనొప్పున్ కృతిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండితప్పును జేయగ మారుడు
రిప్లయితొలగించండిముప్పును గలిగింపఁ బూన ముక్కంటి వెస న్
విప్పగ మూడవ కంటిని
నిప్పుల కొండ యన దగును నీహా రాద్రి న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిముప్పిరి గొని కుజ్ఝటికయె
రిప్లయితొలగించండినప్పర్వత శ్రేణినుండి యాకస మెగయన్
జప్పున గాంచిన తోడనె
నిప్పులకొండ యనఁదగును నీహారాద్రిన్
పప్పూ పప్పని పిలుచుచు
రిప్లయితొలగించండినెప్పుడు నవమానపరచు హీనుల దెస తా
నిప్పులు కురిపించుట గన
నిప్పులకొండ యనఁదగును నీహారాద్రిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి(గజాసురుడు గాఢతపస్సు చేసి పరమేశ్వ
రిప్లయితొలగించండిరుని హృదయంలో నిలుపుకోగా వియోగిని
పార్వతీదేవి పడుతున్న పరితాపం )
ఆహాహా ! యెటనుండినాడొ కద నా
ప్రాణేశు ? డెందే నెవం
డూహాతీత తపంబు జేసెనొ ? ప్రభుం
డోహో యటం చార్ద్రతన్
సాహాయ్యంబును సల్ప నేగెనొకొ ? యీ
శర్వాణి ; శోకార్తకున్
నీహారాద్రిని నిప్పుకొండయని వ
ర్ణింపంగ నొప్పున్ గృతిన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశరషట్పద వృత్తము
నిప్పులకొండ య
నఁదగును నీహా
రాద్రిన్ దీదివి మలయన గా
ను సరియగు నయ్య
పంతుల పల్కుల
పరమార్థమెవర రయగలరోయ్!
జిలేబి
ముప్పిరిగొన ముష్కరులట
రిప్లయితొలగించండివిప్పిన క్రౌర్యంపునీడ విహ్వలులౌచున్
ముప్పును మోసెడి ప్రజలకు
నిప్పులకొండ యనదగును నీహారాద్రిన్
చెప్పిన మాటలు వినకను
రిప్లయితొలగించండిచెప్పుడు మాటలు వినుచును చేయగ తప్పుల్
చెప్పులతో కొట్టాసతి
నిప్పులకొండ యనఁదగును నీహారాద్రిన్
🙏🙏
చిప్పలు చేతికివచ్చెడు
రిప్లయితొలగించండితప్పుడువిధముల తకధిమి తప్పని ప్రభుతన్
ఎప్పటికయినాతప్పదు
నిప్పులకొండయనదగును నీహారాద్రిన్
————————-////////-
రావెలపురుషోత్తమరావు
(సవరణ పాఠము ధన్యవాదాలతో)
తప్పులుకుప్పలుజేయుచు
రిప్లయితొలగించండినిప్పులతోజేయచెలిమి నిపుణతయగునా??
ఒప్పులుజేయుటమొదలిడ
నిప్పులకొండయనదగునునీహారాద్రిన్
++++++++++++**********
రావెలపురుషోత్తమరావు
ఊహాలోకమునందు దేలుచు సతం బుండంగ యోచించు నీ
రిప్లయితొలగించండియీహాజీవికి సత్య మింద్రపదమం దిచ్ఛానుసారమ్ముగా
నాహాయంచు జరించగాదగును కావ్యస్రష్టయై యాతడే
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్.
కందం
రిప్లయితొలగించండిగుప్పుమన వార్త సతియే
నిప్పున భస్మమ్మయెనని నీలగళుండున్
చప్పున త్రినేత్రముఁ దెరువ
నిప్పులకొండ యనఁదగును నీహారాద్రిన్
కం.
రిప్లయితొలగించండితప్పుడు లెక్కలు వ్రాయుచు
ముప్పును కొనితెచ్చుకొనుట ముష్కరమవదా
యొప్పగు గణితము వాడుక
నిప్పుల కొండ యనదగును నీహారాద్రిన్
వై. చంద్రశేఖర్
సాహో! చూడుడు కండ్లు నిండునటు కంచన్జంగ అందంబిలన్
రిప్లయితొలగించండినీహారంబిది పిండియారు నటులే నిండారిపోయెన్, సువ
ర్ణాహర్బాంధవునిన్ మయూఖములు తానంబే యొనర్చం గహో
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్౹౹
ఊహం జేసిన వన్నె లద్దు సరణి న్నొప్పారినన్ మేలగున్
రిప్లయితొలగించండిమోహావేశము నుగ్గడించిన మహా మోక్షాప్తిగా దప్పగున్
స్వాహాదేవికి యగ్ని కౌగిలిని జూపం జేయు ఘట్టమ్ములో
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్.
ఆహా శంభుని పాద పద్మముల నత్యంతానురాగమ్ముతో
రిప్లయితొలగించండినీహారాచలపుత్రి యా రమణి దా నిత్యమ్ము సేవించుగా
మోహావేశము రేపి మారుడణగెన్ ముక్కంటి కోపాగ్నిలో
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅప్పా,యరుణాచలగిరి
రిప్లయితొలగించండినిప్పులకొండయనదగును,నీహారాద్రిన్
నప్పరమాత్ముండగు భవు
డప్పార్వతితోడనుండు నార్తులగావన్
అప్పులు పెరుగగ బ్రతుకును
రిప్లయితొలగించండినిప్పులకొండ యనఁదగును ; నీహారాద్రిన్
నొప్పును బాకీ తీరగ,
తప్పని యనుభూతి యిదియె తరచుగ గలుగున్
ఒప్పు = తగినది
ముప్పని దెలిసియు జెత్తను
రిప్లయితొలగించండికుప్పలుగా వదలు యాత్రికుల నికనైనన్
తప్పని వారింపనిచో
నిప్పులకొండ యనఁదగును నీహారాద్రిన్
నీహారాద్రినినిప్పుకొండయని వర్ణింపంగనొప్పున్గృతిన్
రిప్లయితొలగించండినాహాయేమని జెప్పనోపుదు నిటన్ యాయద్రిన్ వర్ణింపగా
బాహాటంబుగనిప్పుకొండయని దాబల్కంగన్యాయంబెరో
నీహారాద్రినిమంచుకొండగనెవర్ణింపంగనొప్పున్ సుమీ
అప్పుల బడబాగ్నిఁ గనమె
రిప్లయితొలగించండియొప్పదె దావానలమ్ము నుర్విన్ రేగన్
గుప్పున శిలాద్రవం బట
నిప్పులకొండ యనఁదగును నీహారాద్రిన్
ఆహా యెంతటి వింత సృష్టిఁ గన గోత్రారణ్యవారాశులన్
బాహాటమ్ముగ నా పరస్పరపు సంబంధంబు జీమూత సం
దోహప్రాంతము నందు లోయ దరి నుత్తుం గాద్రి కన్పించఁగా
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్
[నీహారాద్రినిన్ +ఇప్పు = నీహారాద్రిని నిప్పు; ఇప్పు (విప్పు) = విడఁదీయు]
శార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండిసౌహార్ద్రమ్మున సప్తతంతువునకున్ జామాతనే పిల్వకే
బాహాటమ్ముఁగ కూతుముందు శివునిన్ వర్జించ దక్షుండటన్
ద్రోహంబున్ మదిసైచ లేక సతియే దూకంగ గుండమ్మునన్
హాహాకారము జేయ నల్దెస సహస్రాక్షాఖ్యు కోపాగ్నికిన్
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్
ఆహారంబునునిద్రయున్ వదలి నీహారాద్రియందున్ సదా
రిప్లయితొలగించండిదేహాత్మల్ రిపుసైన్యచేష్టితములందేనిల్పునో సైనికా!
జోహారంచుజనుల్ నుతింత్రునిను తేజోద్వేలముంజూపగా
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్
తప్పవుతిప్పలు పుడమిని
రిప్లయితొలగించండినిప్పులగుండమునుజేయు నిర్వాకముతో
నిప్పచ్చరమ్ము ప్రబలును
నిప్పులకొండ యనఁదగును నీహారాద్రిన్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
నిప్పులకొండ యనఁదగును నీహారాద్రిన్
సందర్భము: అదృశ్యుడై ప్రయోగించే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ధాటికి ఒక్కరోజే 66 కోట్ల వానరులు నెత్తురు ముద్ద లయ్యారు. హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, రామలక్ష్మణులు అంతా నెత్తు రోడుతూ కూలినారు. రక్తం ఏరులయింది. కపిసేన పీనుగుల పెంట అయింది. హనుమంతుని గుండె చెరు వయింది.
హనుమద్విభీషణులు జాంబవంతుని ఎంతో శ్రమపడి కనుక్కున్నారు. బాధతో మూలుగుతున్నాడు. నోట మాట రావట్లేదు. ఆయన విభీషణునితో..
"హనుమంతు డెలా వున్నాడు?..ఆయన బాగుంటే అందరూ బాగున్నట్టే!.." అన్నాడు. పక్కనే వున్న పావని నమస్కరించగా జాంబవంతు డన్నాడు. "నాయనా!
*త్వత్పరాక్రమ కాలోఽయం నాన్యం పశ్యామి కంచన..* నీ పరాక్రమం చూపించే కాలం మిది. ఇతరు లెవరూ కనిపించట్లేదు."
"నీవు హిమగిరికి వెళ్ళాలి. అక్కడ ఋషభగిరి కైలాస శిఖరాల నడుమ ఓషధి పర్వతం మీద మృత సంజీవని, విశల్య కరణి, సువర్ణకరణి, సంధానకరణి అనే ఓషధు లుంటాయి. తీసుకురావలె. అందరికీ నీవే ప్రాణదాతవు."
వెంటనే హనుమ అతి వేగంగా ఎగిరి హిమాద్రి చేరాడు. ఓషధు లదృశ్యమైనవి. విపరీతమైన కోపంతో హనుమ ఒక నిప్పుల కొండలా కనిపించాడు హిమగిరియందు... (అని పద్య భావం.)
"ఓషధుల కుప్ప లుంటాయి." అన్నాడు బాధతో నోటి మాట రాక జాంబవంతుడు. "ఓషధుల కుప్పెలు.." అనుకున్నాడు సరిగ్గా వినపడక మారుతి. అక్క డక్కడ గిరిజనులు కనిపిస్తారేమో! అడిగితే ఆ కుప్పెలు ఇస్తారేమో అనుకున్నాడు. తొందరపడేటప్పుడు ప్రయోజనంమీదనే తప్ప పనిమీద పరికరాలమీద దృష్టి నిలుస్తుందా!
సిరికిం జెప్పడు శంఖచక్రయుగమున్ జేదోయి సంధింప డే పరివారంబును జీరడు.. భక్త పరాధీనుడైన శ్రీ హరి ఎంత తొందరపడ్డాడో గజేంద్రుని రక్షించడానికి. ఆ హరి దూతనే కదా ఈ హరి!
మొత్తానికి ఆ కుప్పె లేవీ కనిపించలేదు. మొత్తం కొండనే పెకలించుకువచ్చాడు పావని. వానరు లంతా నిద్ర లేచినట్టు లేచారు.
నీహారాద్రిన్ = హిమగిరియందు
~~~~~~~~~~~~~~~~~~~~~~~
గొప్ప కినుకతో "నోషధి
కుప్పెలు గనరా.. విపు డిదె కొండఁ బెకల్తున్
దప్ప" దనె.. రామదూతయె
నిప్పుల కొండ యనఁదగును నీహారాద్రిన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
29.11.19
-----------------------------------------------------------
నీహారమ్మది మేఘవాహివలెనున్ నిర్మోకమున్ దాకగా
రిప్లయితొలగించండినాహా! శీతల పర్వతమ్మదియె నేత్రానందమై దోచగా
నూహాలోకములో జరించుకవి తా నూహించెనీ రీతిగా
నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్
శర షట్పద
రిప్లయితొలగించండిఅప్పులు పెరుగగ
బ్రతుకును నిప్పుల
కొండయనదగును ; నీహారా
ద్రిన్ యన గనొప్పు
నా ఋుణము తీర,
నిజమిది ప్రతి బతు కునందు నన్
శా:
రిప్లయితొలగించండిఆహారంబును మాని పూనుకొనగా నార్టీసి సమ్మెంటు వా
రాహాకారము జేయ నెప్పుడును నోరాడించ కుండంగ తా
బాహాటంబొనరించె వారి నడకల్ వారింప నభ్యున్నతిన్
నీహారాద్రిని నిప్పుకొండయని వర్ణింపంగ నొప్పన్ గృతిన్
వై. చంద్రశేఖర్
నిప్పులకుంపటిజేసిరి
రిప్లయితొలగించండితప్పుగ మనరాజధాని తగవుల మునిగెన్
చెప్పిన వినువారెవ్వరు?
నిప్పులకొండయనదగును నీహారాద్రిన్.
నీహారాద్రిగదా!శివుండుగొలువైనిత్యంబు మోదమ్మిడున్
రిప్లయితొలగించండినీహారాద్రిగదా! యుమా జననమై నిర్వ్యాజ ప్రేమంబిడున్
నీహారాద్రియెజీవులందరకుదానే ముక్తిదం బెట్టు లా
నీహారాద్రిని నిప్పుకొండయని వర్ణింపంగ నొప్పున్ గృతిన్!?
మీ, ఆచార్యలక్ష్మణపెద్దింటి యానాం.
నీహారాద్రిగదా!శివుండుగొలువైనిత్యంబు మోదమ్మిడున్
రిప్లయితొలగించండినీహారాద్రిగదా! యుమా జననమై నిర్వ్యాజ ప్రేమంబిడున్
నీహారాద్రియెజీవులందరకుదానే ముక్తిదం బెట్టు లా
నీహారాద్రిని నిప్పుకొండయని వర్ణింపంగ నొప్పున్ గృతిన్! ?
మీ, ఆచార్యలక్ష్మణపెద్దింటి యానాం.
తప్పని తెలిసియు జనములు
రిప్లయితొలగించండికుప్పలు తిప్పలు గచెత్త గుట్టలు గుట్టల్
చప్పున నింపుచు నుండగ
నిప్పులకొండ యనదగును నీహారాద్రిన్