30, నవంబర్ 2019, శనివారం

సమస్య - 3207 (వడ్డనఁ జేయువాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్"
(లేదా...)
"వడ్డనఁ జేయువాఁడు పగవాడె తినందగు నిర్భయమ్ముగన్"
(ఈరోజు పూరణలు ప్రసార కానున్న ఆకాశవాణి సమస్య)

106 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  "వివాహ భోజనమ్ము..."

  లడ్డు జిలేబులున్ బరిఫి లస్సియు రబ్రియు రాజభోగులున్
  తెడ్డుల తోడ పాయసము తియ్యని హల్వయు కజ్జికాయలన్,
  చెడ్డది పంచదార కడు చేరగ నాదగు రక్తమందు, భల్
  వడ్డన జేయువాడు పగవాడె!...తినందగు నిర్భయమ్ముగన్
  నడ్డిని సూదినిచ్చుకొని నందము నొందుచు పెండ్లిపందిరిన్

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ఇడ్డెను చట్ని లేదిచట యెక్కడ దోసెలు నుత్తపమ్ములున్?
  గ్రుడ్డులు మాంసముండునిట కుండల నిండుగ రాజభోగులున్
  చెడ్డది వంగదేశముర చేపలు పీతలు తిందురేయిటన్
  వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె! తినం దగు నిర్భయమ్ముగన్
  పడ్డవి బాధలన్ మరచి పస్తును మానుచు హాస్టలందునన్

  రిప్లయితొలగించండి
 3. అడ్డము లేదటంచు నభి మానము వీడి వినోద మందునన్
  చెడ్డగ మాట లాడుచును జీవము పోయెడి రీతిగా నిలన్
  వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె , తినందగు నిర్భయమ్ము గన్
  బిడ్డడు కోరినంత మరి బేధము లేకను సంత సంబునన్

  రిప్లయితొలగించండి
 4. లడ్డూలను కోరి తినగ
  నడ్డము లేకుండ జూచి యానందము గన్
  దొడ్డగ చక్కెర వ్యాధికి
  వడ్డించెడి వాడ్ఁడు శత్రువా? తిననొప్పున్

  రిప్లయితొలగించండి


 5. అడ్డడ్డే!మారె ప్రభుత!
  యెడ్డంటేతెడ్డటంచు యెన్కబడుచు నా
  రెడ్డిని తెగడాలెసుమా
  వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్


  జిలేబి

  రిప్లయితొలగించండి


 6. చెడ్డియతండు వేసి తన చెంతకు వచ్చిన నాటి కుంకయే
  యడ్డరి గాను వచ్చెను ప్రయత్నము చేయుచు ముఖ్యమంత్రిగా
  రడ్డుని నేల! విందునకు రమ్మని పిల్చెను పోయెదన్ సుమా
  వడ్డనఁ జేయువాఁడు పగవాడె తినందగు నిర్భయమ్ముగన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి

 7. ఆకాశవాణికి పంపినది :)  రెడ్డియనంగ భీతియొ కరేకర వేయుచు కొట్టు నంచు? నీ
  గడ్డము బట్టి వేడెను! పుకారుల నమ్మకు! రమ్ము నాయనా!
  వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె తినందగు నిర్భయమ్ముగన్,
  చెడ్డతనమ్ము చూపరు విజేతలు పబ్బపు విందువేళలన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   నిన్న ఆకాశవాణిలో మీ పూరణ చదివే ముందు 'కరేకర' శబ్దార్థాన్ని ఆంధ్రభారతిలో చూసి, సమాధాన పడ్డాకే చదివాను.

   తొలగించండి

  2. నమో నమః

   నెనరులు ! యేదో ఆంధ్తభారతి దయని రోజులు గడిచి పోతున్నాయి :)

   జిలేబి

   తొలగించండి
  3. జిలేబి గారు కరేకర వేయుచు నన రాదు. కరేకర మేయుచు ననఁదగును. ఆ యలుక్సమాసమును దత్సమము చేసి తెనుఁగున వాడవలెను.

   తొలగించండి
 8. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  B-1)
  దైవ కృప గల్గిన వారికి
  పగవాడు విషాహారం పెట్టినా సరే యేమీ కాదు :
  __________________________

  చెడ్డను చేయనెంచి ఘన - శీతము జేర్చిన వంటకంబులన్
  లడ్డు జిలేబి పూర్ణములు - రాజదె పెట్టగ గాలిచూలికిన్
  వడ్డనఁ జేయువాఁడు పగ - వాడె తినందగు నిర్భయమ్ముగ
  న్నడ్డము లేదు నాకనుచు - నాబగ మెక్కిన మొత్తమంతయున్
  చెడ్డదె చేయలేదు గద - చిత్రము దైవ సహాయముండుటన్ !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 9. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-1)
  దైవ కృప గల్గిన వారికి
  పగవాడు విషాహారం పెట్టినా సరే యేమీ కాదు :
  __________________________

  చెడ్డను జేయగ రాజదె
  లడ్డాదిగ వంటకముల - రసమెనయించీ
  బిడ్డడు భీమున కిడెనే !
  వడ్డించెడివాఁడు శత్రు - వా? తిననొప్పున్ !
  __________________________
  రసము = విషము

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఒకయించీ... అనడం వ్యావహారికం.

   తొలగించండి
 10. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-2)
  గడ్డు కాలం తిండి లేదు తప్పని తరి తప్పదు మరి :
  __________________________

  గడ్డగు కాలము నందున
  బిడ్డలతో తిండి లేక - విలపించు నెడన్
  చెడ్డగు నంచును తలచక
  వడ్డించెడివాఁడు శత్రు - వా? తిననొప్పున్ !
  __________________________
  రసము = విషము

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 11. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-3)
  పగవాడింట్లో తిన రాదు. మన వాడింట్లోనే తినవలె :
  __________________________

  చెడ్డగు తినరా దది మరి
  వడ్డించెడివాఁడు శత్రు - వా ! తిననొప్పు
  న్నడ్డ మదేమియు లేకను
  వడ్డించెడి వాడు మంచి - వాడయి నంతన్ !
  __________________________

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 12. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  A-4)
  రాజును కాదని, విదురుని యింట కృష్ణుడు :
  __________________________

  ఎడ్డము గల్గునని తలచి
  వడ్డించెడివాఁడు శత్రు - వా ! తిననొప్పున్
  గుడ్డిగ విదురుం డిచ్చిన
  లడ్డుక యంచరటి తొక్క - లక్ష్మీపతియే !
  __________________________
  లడ్డుక = ప్రీతిని కల్గించునది

  వసంత కిశోర్ (కవులూరు రమేష్)

  రిప్లయితొలగించండి
 13. సొడ్డులుబెట్టిరన్నిటికి,సొంపగురీతిన, మాటమార్చుచున్
  దొడ్డతనంబుమాదియని,దోస్తులుమీరని యూహసేయగన్
  విడ్డురమైన వాదనలు వింతగజేయుటమానుడయ్యరో
  వడ్డనజేయువాడుపగవాడె, తినుండికనిర్భయమ్ముగా.

  రిప్లయితొలగించండి
 14. అడ్డముదిడ్డమున్ దిరిగి, యాశలనన్నిటినేలరాల్చగా?
  విడ్డురమైనవాదనలు,వియ్యపువారలు పైకిదెచ్చిరే!
  దొడ్డతనంబుమాదియని,దోస్తులుమేమనియొప్పుకొంటిమే
  వడ్డనజేయువాడుపగవాడె, తినుండికనిర్భయమ్ముగా.
  ----------------------------

  రిప్లయితొలగించండి
 15. గడ్డము మీసముంబెరిగె,గాడినిదప్పగ రాష్ట్రపాలనే
  విడ్డురమైనపోకడలు,వింతగవాగునమాత్యశేఖరుల్
  సొడ్డులుబెట్టనేమిటికి?,సొంపుగ వారలు వండివార్చగా!
  వడ్దనజేయువారు, పగవాడె తినందగునిర్భయమ్ముగన్.

  రిప్లయితొలగించండి
 16. చెడ్డనుజేయగామరిగె,చిన్నతనంబునె తండ్రిచాటునన్
  అడ్డములేదు దోపిడికి,ఆతనిమాటలకడ్డుజెప్పుటా?
  విడ్డురమాయెనిప్పుడిక,వింతగ పాలన చేతికందెలే
  వడ్డనజేయువాడు, పగవాడె తినందగునిర్భయమ్ముగన్.

  రిప్లయితొలగించండి
 17. మైలవరపు వారి పూరణ

  ఆంజనేయుని రెచ్చగొట్టవద్దన్నా వినకుండా గేలి చేశారు.. అనుభవించండి... అంటోంది ఒక రాక్షసి.

  ఎడ్డెమనంగతెడ్డెమని యించుక నా పలుకుల్ గణింపబో...
  రడ్డము దిడ్డమన్న గతి నాతని తూలగ, నుగ్రుడయ్యె , మీ
  నడ్డులు బ్రద్దలౌనటులు నాలుగు గ్రుద్దులు గ్రుద్దు వీపుపై
  వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె తినందగు నిర్భయమ్ముగన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 18. గడ్డము మీసముల్ పెరిగి కన్నుల గ్రౌర్యము చిందునట్టి యా
  వడ్డన జేయువాడె, పగ వాడు తినందగు నిర్భయమ్ముగన్
  దొడ్డమనస్సునే కలిగి తొయ్యలి కూరిమి తోడ సేసెనా
  బిడ్డలు కోరిరంచుకడు ప్రేమను జూపుచు శాకపాకముల్

  రిప్లయితొలగించండి
 19. అడ్డుగ పలుకని వాడై
  చెడ్డ తల o పులను వీడి చెలువపు రీతి న్
  గడ్డు సమస్య గ మారని
  వడ్డించె డు వాడు శత్రు వా ? తిన నొప్పు న్

  రిప్లయితొలగించండి
 20. ఇడ్డెనలను వద్దనకుడి
  దొడ్డమనసు తోడ నాన్న దూరమ్మైనన్
  బిడ్డలకై తెచ్చె, వాటిని
  వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్

  రిప్లయితొలగించండి
 21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 22. ఆకాశవాణిలో మొదటిసారి శంకరార్యులను ప్రత్యక్షంగా తిలకించి థన్యుడనైతిని🙏🙏

  బిడ్డల గోల్పడన్ వగచి భీతిలు నాధృత రాష్ట్రునీగతిన్
  బిడ్డడు ధర్మనం దనుడు ప్రీతిని పూజలొనర్చగా తనన్
  దొడ్డగ గారవింపగను దోచగ చింతిలి మానసంబునన్
  వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె తినందగు నిర్భయమ్ముగన్

  రిప్లయితొలగించండి


 23. రెడ్డి జగన్మోహనుడరె
  చెడ్డీ లన్వేసి తిరిగె చెంతగదా! రా
  బిడ్డా! మనవాడె సుమా
  వడ్డించెడివాఁడు; శత్రువా? తిననొప్పున్


  జిలేబి

  రిప్లయితొలగించండి


 24. శరషట్పదము


  రెడ్డి జగన్మో
  హనుడరె చెడ్డీ
  లన్వేసి తిరిగె చెంతగదా!
  వడ్డించెడి వాఁ
  డు శత్రువా? తిన
  నొప్పున్ రమ్మా రారమ్మా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. యుద్ధములో సాయము చేయమని శ్రీకృష్ణుని అడుగుటకు వచ్చిన ధుర్యోధనునకు దక్కబోయే సైన్యబలమునకు సంతోషిస్తూ మదిలో...

  ఉత్పలమాల

  అడ్డము రాక నాకు హరి నర్జునుఁ డెంచఁగఁ, దప్పదంచుఁ దా
  నొడ్డెను శౌరి వాహిని సుయోధను పక్షము యుద్ధమందునన్
  గుడ్డిగఁ జేసి భాగములఁ గోరినదే మన కంచమందునన్
  వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె! తినందగు నిర్భయమ్ముగన్!!

  వాహిని = సైన్యము

  రిప్లయితొలగించండి
 26. గడ్డిని రుచియగు తొక్కుగ
  వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్
  మడ్డితనమును దిగవిడిచి
  గుడ్డిగ దొరకొనినదెల్ల కొరవడ కుండన్

  రిప్లయితొలగించండి
 27. చెడ్డది కాదు మానసము చేరి విపక్షముఁ పొందె పట్టమున్
  దొడ్డగు పాలనమ్మునను దోచె ప్రజాళి యనంగముల్ వడిన్
  బిడ్డగ నెంచుచున్ పిలిచె విందుకు నన్నును పండుగంచుతా
  వడ్డనచేయువాడు పగవాడె తినన్ దగు నిర్భయమ్ముగన్

  రిప్లయితొలగించండి
 28. (మాచెర్ల చెన్నకేశవస్వామి ఆలయప్రాంగణంలో అన్నికులాలవారికి సహపంక్తిభోజనాలేర్పరచిన మహామంత్రి బ్రహ్మనాయడు తటపటాయిస్తున్న బ్రాహ్మణమునితో ...)
  గడ్డము దువ్వుకొంచు ముని
  గణ్యుడ ! దిక్కుల జూడబోకుమా !
  అడ్డము చెప్పబోవకుము ;
  నందర మొక్కటిగానె యెంచుమా !
  చెడ్డగ వర్ణభేదముల
  జేకొనబోకుము ; చాపకూటిలో
  వడ్డన జేయువాడు పగ
  వాడె ? తినందగు నిర్భయమ్ముగన్ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "అడ్డము చెప్పబోకు మిట నందర..." అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 29. ఉ:

  బిడ్డడు చేత వచ్చెనని బెల్లపుబువ్వను బంచ నెల్లెడన్
  గడ్డము బట్టి వేడుకొన గారము తోడన బెండ్లి జేయుటై
  గొడ్డలిపెట్టు మాటలన గోడలు మాటున దుఃఖమొందగా
  వడ్డన జేయువాడు పగవాడె తినందగు నిర్భయమ్ముగన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 30. గ్రుడ్డిగ నమ్మబోకుమిటు గొప్పగ జెప్పిన నెవ్వరైననా
  వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె; తినందగు నిర్భయమ్ముగన్
  గడ్డియె వండినన్నెపుడు గమ్మగ దోచును నమ్మకస్థుఁడై
  వడ్డన జేయువాఁడు మనవాడగునేని ప్రశాంతచిత్తమున్
  (ఆకాశవాణికి పంపినది)

  రిప్లయితొలగించండి
 31. ఇడ్డెన లావడల్ వరుసనే యివిగో మినపట్టు పొంగలుల్
  దొడ్డవి పాయసాన్నములు దొండయు బెండల వేపుడుల్ భలే
  బిడ్డడ! జాగదేల నడు పిల్చిరిగా బఫె భోజనానికిన్
  "వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె తినందగు నిర్భయమ్ముగన్"

  రిప్లయితొలగించండి
 32. వడ్డనజేయువాడుపగవాడెతినందగునిర్భయమ్మునన్
  వడ్డనజేయువాడకటబంధువ?శత్రువ?చింతలేలరా
  వడ్డనజేయువాటినికవద్దనకుండగనిర్భయంబుగన్
  లడ్డులువడ్డనన్నిడగలజ్జనునొందకనారగింపుడీ

  రిప్లయితొలగించండి


 33. ఆకాశవాణి విశేషములు తెలియ చేయగలరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మన అందరి పూరణలూ చదువబడ్డవి!
   వచ్చేవారానికి సమస్య
   "శంకరు డుమకొరకు పారిజితము దెచ్చెన్!"

   తొలగించండి

  2. సీతాదేవిగారికి

   నెనరులు! పంపించితిమి


   జిలేబి

   తొలగించండి
 34. బిడ్డలు తప్పులు జేసిన
  దొడ్డమనంబున జనకులు దూషణ లిడగా |
  చెడ్డని తలపగ తగదుగ |
  వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్"

  రిప్లయితొలగించండి
 35. బిడ్డల సత్ప్రవర్తనకు విద్యలనేర్పుచు ప్రేమమీదటన్
  గడ్డు సమస్యలన్నెదుర గట్టిపరీక్షలబెట్టి నిగ్గుదేల్చగా
  నడ్డుచు దుష్ప్రవర్తనను నాంక్షలబబెట్టుచు బెత్తమూనుచున్
  వడ్డనజేయువాడు పగవాడె? తినందగు నిర్భయమ్ముగన్

  రిప్లయితొలగించండి
 36. సరదా పూరణము 🙏🙏
  వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్

  గడ్డని యనినను నేనిట
  వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్
  అడ్డేమీ లేదిచటను
  ఫుడ్డుని మస్తుగ బెడుదురు ఫుల్ మీల్స్ యనుచున్
  🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫుడ్డుని కోరిన యనకుము
   వడ్డించెడివాఁడు శత్రువా?, తిననొప్పున్
   విడ్డూరమేమి గాదే
   గడ్డిని పెట్టిన మనకును కడుపే నిండున్
   🙏🙏

   తొలగించండి
  2. మిడ్డే మీల్స్ మనకిట నిల
   వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్
   ఫుడ్డే ఫ్రీగా దొరికిన
   వడ్డించెడి వాడితోన పనిలేదిచటన్
   🙏🙏

   తొలగించండి
  3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 37. వడ్డన కాని వడ్డనల పర్వము పేర 'బఫే'లు చేరగన్
  వడ్డన చేయ గోరగనె వంకర చూపుల జూచు నద్దెకై
  వడ్డన జేయువాడు పగవాడె! తినందగు నిర్భయమ్ముగన్
  లడ్డుల భక్ష్య భోజ్యముల లౌక్యమెఱుంగుచు విందులన్నిటన్ !

  రిప్లయితొలగించండి
 38. లడ్డులు వలదంచు వదలి
  వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్
  అడ్డము లేకేదైనను
  యెడ్డమి మధుమేహపు భయమే లేకున్నన్

  రిప్లయితొలగించండి
 39. లడ్డులు గారెలు బూరెలు
  వడ్డించువాడుశత్రువా?తిననొప్పున్
  వడ్డననుజేయు మనుజులు
  బిడ్డలతోసము లెయండ్రు పెద్దలువినవే?

  రిప్లయితొలగించండి
 40. ఆకాశవాణి కి నేను పంపినది

  దొడ్డ సుఖావహ ప్రమద తోషిత భూషిత సౌఖ్య మేర్పడన్
  గడ్డు సమస్యలన్ దురతి కాల విపద్భయ శోక భీతులన్
  అడ్డు తొలంగ దైవ మహిమాన్విత దృక్కులు చేయు సత్కృపన్-
  వడ్డన జేయువాడు పగ వాడె తినందగు నిర్భయమ్ముగన్

  రిప్లయితొలగించండి
 41. అడ్డపుమార్గమందుజనియన్నివిధంబులదోచి సంపదల్
  దొడ్డతనంబుగా చెలఁగు దొంగల యాస్తి బినామిదారులౌ
  బిడ్డలు బంధులార!  వగపేటికి సంశయమేలమీకికన్
  వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె? తినందగు నిర్భయమ్ముగన్.

  రిప్లయితొలగించండి
 42. విడ్డూరము నీ వన నది
  యొడ్డున వన భోజనమ్ము లుండఁగ మనకే
  మడ్డము చెడ్డ జనాళికి
  వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్


  దొడ్డతనంబు వా రిడఁగ దొడ్డగు గడ్డను దుడ్డు లీయకే
  గడ్డు దినంబు లందకట కన్పడఁ బచ్చడి పప్పుతో నిటన్
  గడ్డ పెరుంగు దప్పళము కమ్మని కూరలు నప్పడమ్ములున్
  వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె! తినందగు నిర్భయమ్ముగన్

  [పగవాఁడె! కాదు]

  రిప్లయితొలగించండి


 43. విడ్డూరముగా వుందే!
  వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్
  లడ్డులు బ్రహ్మాండముగా
  పడ్డవి రుచికరముగా సెబాసు జిలేబీ!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వుందే' అనడం వ్యావహారికం. "విడ్డూరముగా నున్నదె" అనవచ్చు.

   తొలగించండి
 44. విడ్డూరమయ్యె వినగా
  వడ్డించెడు వాడు శత్రువా?తిననొప్పున్
  అడ్డముగా వాదించక
  నెడ్డెతనమ్మునిట చూపకేగుము తినగా.
  మరొక పూరణ

  బిడ్డల యాకలిన్ గనుచు ప్రేమను చూపుచు వంట వండగా
  నడ్డము చెప్పు చున్ వలదటంచును పల్కుట పాడి గాదయా
  వడ్డనఁ జేయువాఁడు పగవాడె తినందగు నిర్భయమ్ముగన్
  లడ్డులు మీకు నిష్టమని రాధన తోడను చేసెనిచ్చటన్

  రిప్లయితొలగించండి
 45. డిసెంబర్ 13, 14, 15 తేదీలలో నేను కర్నూలు మద్దూరి రామమూర్తి గారి శతావధానంలో, 16న తిరుపతిలో జరుగబోయే త్రిగళావధానంలో, 17, 18 తేదీలలో చెన్నైలో ఉంటాను.
  ఆయా చోటుల్లో కవిమిత్రు లెవరినైన కలిసే అవకాశం ఉందా?

  రిప్లయితొలగించండి
 46. గిడ్డడు దైవ కార్యమున కీడు తలంపడు వాని భార్యయున్
  బిడ్డలు కూడ వచ్చె గద బింకము వీడియు నారగించుడీ
  లడ్డులు బంధులార జన రంజక రామ సుపర్వమందునన్
  వడ్డనఁ జేయువాఁడు పగవాడె తినందగు నిర్భయమ్ముగన్

  రిప్లయితొలగించండి
 47. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  వడ్డనఁ జేయువాఁడు పగవాడె
  తినందగు నిర్భయమ్ముగన్

  సందర్భము: సుతీక్ష్ణ మహర్షి చెప్పిన దారిలో సీతా లక్ష్మణ సమేతుడై రాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళుతూ లక్ష్మణునికి అగస్త్యునిగురించి ఇలా వివరించాడు.
  "ఇల్వలుడు వాతాపి రాక్షస సోదరులు. బ్రాహ్మణ రూపధారియై తమ యింట్లో శ్రాద్ధ మని బ్రాహ్మణులను భోజనానికి పిలిచి ఇల్వలుడు మేక రూపం దాల్చిన వాతాపిని వండిపెట్టేవాడు. తిన్నాక "వాతాపీ! ర" మ్మనేవాడు. వాడు పొట్ట జీల్చుకొని వచ్చేవాడు. బ్రాహ్మణులు చచ్చేవారు. అన్నదమ్ములు వారిని భక్షించేవారు. ఇలా చాలామంది చంపబడ్డారు.
  దేవతలు ప్రార్థిస్తే ఒకనా డగస్త్య ముని ఇల్వలునిచే నాహూతుడై భుజించినాడు. ఇల్వలుడు తమ్ముని "ర"మ్మన్నాడు. పొట్ట నిమురుతూ అగస్త్యుడు "ఇం కెక్కడి వాతాపి?.. జీర్ణమైపోయినాడు." అన్నాడు.
  ఇల్వలుడు మునిపై విరుచుకుపడ్డాడు. మునియొక్క తీక్ష్ణమైన కంటిచూపుతో తగులబడ్డాడు."
  ఆరణ్య కాండంలో ఈ ప్రసక్తి వున్నది.
  ఏష లోకార్చితః సాధు
  ర్హితే నిత్యరత స్సతామ్
  (ఈ అగస్త్యుడు సర్వజన పూజితుడు సజ్జనుడు సత్పురుషులకు ఎల్లప్పుడు హితైషి.) అని చెప్పబడింది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  అడ్డము లేక బ్రాహ్మణ జ
  నాళికిఁ దమ్ముని వండి పెట్టి "రా!
  బిడ్డ!" యటంచు నిల్వలుడుఁ
  బిల్వ బయల్పడుఁ బొట్టఁ జీల్చి ..యీ
  గడ్డు సమస్య మౌనుల.. ద
  గస్త్యుని కట్లనె పెట్టి యి ట్లనెన్
  "వడ్డనఁ జేయువాఁడు పగ
  వాడె! తినం దగు నిర్భయమ్ముగన్"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  30.11.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 48. రిప్లయిలు
  1. దొడ్డగ విభీషణుఁడనిన
   గ్రుడ్డిగ ఖండించ, రాము కోదండము నే
   డడ్డఁగ దరమే? యటజని
   వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్!

   తొలగించండి
 49. కం.
  బుడ్డోడొకడు మురిపెముగ
  మడ్డిని వడ్డించుచుండ మరులే గొలుపన్ !
  చెడ్డగ దలవని జననికి
  వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్ !!

  రిప్లయితొలగించండి
 50. అడ్డముదిడ్డమున్ ప్రభుత,ఆస్తులు యమ్ముటయేమిధర్మమో?
  చెడ్డగుయోచనల్ మరువ,చేతనువచ్చెడులాగజెప్పుడీ
  గుడ్డిప్రణాళికల్ విడిచి,గుట్టుగ సంపదబెంచకున్న, పై!!
  వడ్డనజేయువాడు, పగవాడె తినందగునిర్భయమ్ముగన్.

  రిప్లయితొలగించండి
 51. గుడ్డిగ నమ్మినాముగద,గుండముజేసెను ధర్మ రక్షణన్
  అడ్డపుదారులన్ నడిపి,ఆశలనెన్నియొ బెంచె రత్నముల్
  బుడ్డిధరల్ బెరింగెగద, బూజువదిల్చెను తాగువారి,కీ
  వడ్డనజేయువాడు, పగవాడె తినందగునిర్భయమ్ముగన్.

  రిప్లయితొలగించండి
 52. చెడ్డదనంబుతో బెరిగి చేసినవన్నియు క్రౌర్యకార్యముల్
  బిడ్డగ చాటునన్ గునిసి,బేలగ జూచుచు,దోచెసంపదన్
  గుడ్డిగనమ్మగాప్రజలు,గుట్టుగ వంచనజేయునట్టి యీ
  వడ్డనజేయువాడు, పగవాడె తినందగునిర్భయమ్ముగన్.

  రిప్లయితొలగించండి
 53. సమస్య:
  వడ్డన చేయువాడు పగవాడె తినందగు నిర్భయమ్ముగన్!

  పూరణ:

  గడ్డముపెంచె దాల్చెతనకంఠమునన్ మణికంఠమాల నే

  చెడ్డపనిన్ తలంపకభజించుచుస్వామిని ధర్మశాస్తనే

  రెడ్డిటుమెట్లపూజనొనరించెనుపిల్చెనువిందుకెల్లరన్

  వడ్డన చేయువాడు పగవాడె తినందగు నిర్భయమ్ముగన్!

  *గాదిరాజు మధుసూదనరాజు*

  రిప్లయితొలగించండి