మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు. *మీకటంచును మిమున్.... క్రీస్తంచు మా । మతమున్ జేరుమటంచు... మామూళ్ళ నిప్పించి నా । హితబోధల్...* అంటే అన్వయం ఇంకా బాగుంటుందని సూచన.
సందర్భము: విశ్వామిత్రుడు రామలక్ష్మణులకై రాగా దశరథుడు సందేహించగా వశిష్ఠు డన్న మాట లివి... పితృగణ సంతృప్తికై యజ్ఞం చేస్తే మారీచ సుబాహులు విఘ్నాలు కలిగిస్తే విశ్వామిత్రుడు రామలక్ష్మణులచేత రాక్షస సంహారం చేయించేందుకై దశరథుని వద్దకు వచ్చాడు. రామునిపై మోహంతో దశరథుడు సతమతమైతే వశిష్ఠుడు విశ్వామిత్రుని మహత్వాన్ని వివరించి, "రామునితో సీతను కూర్చడానికి వచ్చినా డితడు. హితం చేయటమే స్వభావం. రామునికి మేలే జరుగుతుంది." అన్నాడు. దశరథుడు పంపించినాడు. విశ్వామిత్రుడు బల అతిబల అనే విద్యలను ప్రసాదించినాడు. తాటకను వధింపజేసినాడు. అదే రాక్షస సంహారానికి నాంది. రాముడు చేయగల డని లోకానికి తెలిసింది. విశ్వామిత్రుడు సర్వాస్త్రాలు రామున కిచ్చినాడు. (సర్వాస్త్ర జాలం స రహస్య మంత్రం ప్రీత్యాభిరామాయ దదౌ మునీంద్రః.. అధ్యాత్మ రామాయణం) రాముడు సుబాహుని వధించినాడు. మారీచుని నూరామడలకు విసిరివేసినాడు. విశ్వామిత్రుడు వారిని మిథిలకు తీసుకువెళ్ళాడు. దారిలో అహల్యా శాపవిమోచనం జరిగింది. చివరకు శివధనుర్భంగం చేయించి రాముని కళ్యాణానికి మార్గం సుగమం చేశాడు. వీ టన్నిటితో విశ్వామిత్రుని కొరిగిం దేమీ లేదు. అతడు జితకాముడు. కృతపుణ్యుడు. అలాంటి వాడే హితు డంటే... ~~~~~~~~~~~~~~~~~~~~~~~ *"జితకాముడు, కృతపుణ్యుడు,* *హితకారియు గాధిసూను;* *డీ రామునకున్..* *సతతము మేలే జరుగును..* *హితబోధల వినెడివారి కే కీ డొదవున్?"*
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 20.11.19 -----------------------------------------------------------
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
సతమున్ పోరుచు హైందవత్వమును భల్ సాధించి బాధించుచున్
గతియే లేదుర మీకటంచు మిములన్ కాపాడు క్రీస్తంచుచున్
మతమున్ మార్చుమటంచుచున్ విరివిగా మామూళ్ళ నిప్పించుచున్
హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్
తొలగించండికంది వారు ఉవాచ:
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
*మీకటంచును మిమున్.... క్రీస్తంచు మా । మతమున్ జేరుమటంచు... మామూళ్ళ నిప్పించి నా । హితబోధల్...* అంటే అన్వయం ఇంకా బాగుంటుందని సూచన.
🙏
తొలగించండి
తొలగించండి"*మామూళ్ళ నిప్పించు నా । హితబోధల్..* టైపాటు."
తొలగించండి(సవరించిన) ప్రాతః కాలపు సరదా పూరణ:
సతమున్ పోరుచు హైందవత్వమును భల్ సాధించి బాధించుచున్
గతియే లేదుర మీకటంచును మిమున్ కాపాడు క్రీస్తంచుమా
మతమున్ జేరుమటంచుచున్ విరివిగా మామూళ్ళ నిప్పించు నా
హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్
సతతము క్షేమమె కోరెడు
రిప్లయితొలగించండిచతురుల నుడులాలకింప స్వస్థత కూరున్
మతిలేని వాడు చెప్పెడి
హితబోధల వినెడివారికే కీడొదవున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅతివినయము వలదెప్పుడు
రిప్లయితొలగించండిపతిమాటనుదాటవలదు,పనిమాలంగా
సతతముసత్యముబలుకని
హితబోధలవినెడువారికేకీడొదవున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పని మూలమునన్" అనండి.
సుతునిం జూచి యొకండు తెల్పె నిటులన్ శుద్ధాత్ముడై "బాలకా!
రిప్లయితొలగించండిమతిహీనుల్ తమమేలుగోరి పలుకన్ మన్నించ రెందేని, నీ
వతులానంద యుతుండవౌచు సతతం బాసక్తినిం జూపుచున్
హితబోధల్ విను, వారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్".
సుతునిం జీరి
తొలగించండివిరుపుతో అద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికతలను జెప్పుచు నిరతము
రిప్లయితొలగించండివెతలను కలిగింప జేయు వేయి విధమ్ముల్
మతిలే కనుమౌ నముగా
హితబో ధల వినెడి వారికే కీడొదవున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమితి మీరిన మోసముతో
రిప్లయితొలగించండిగతి లేకనె జెప్పెనుబహు ఘనముగ పల్కుల్
హితమే తెలియని వారల
హితబోధల వినెడివారికే కీడొదవున్
🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమతి యించుక లేకున్నను
రిప్లయితొలగించండిమతిమంతులమంచు పూని మంత్రాంగంబుల్
అతిగా జరిపెడు వారల
హితబోధల వినెడువారికే కీడొదవున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మంత్రాంగములే । యతిగా..." అనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశ్రుతులన్ దూరుచు , భారతీయమతసుశ్లోకప్రధానమ్మలౌ
యితిహాసమ్ముల గేలిచేయుచు, నిదే యెంతేని యోగ్యమ్ము మా
మతమంచున్ వచియించువారల మహామాయావచోరూపగ....
ర్హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండిమతబోధలు విని తరచుగ
రిప్లయితొలగించండినుతమ మతులుచెడి తికమక తలపులు జేతుర్
మతములు మనుషుల జెడిపెడు
హితబోధల వినెడివారికే కీడొదవున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో యతి తప్పింది. '... నుతమ'? 'చేతుర్' అన్న ప్రయోగం సాధువు కాదు. సవరించండి.
మతి లేకనె పాలించుచు
రిప్లయితొలగించండిఅతిగా జనులకు నిరతము యధికారముతో
మతమును మార్చుము యను నా
హితబోధల వినెడివారికే కీడొదవున్
🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మతి లేకయె పాలించుచు । నతిగా జనులకును నిరత మధికారముతో... మార్చుకొను మనెడి । హితబోధల..." అనండి.
ధన్యోస్మి, గురువుగారు చెప్పిన మార్పులతో
తొలగించండిమతి లేకయె పాలించుచు
నతిగా జనులకును నిరత మధికారముతో
మతమును మార్చుకొన మనెడి
హితబోధల వినెడివారికే కీడొదవున్
🙏🙏
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
మితమౌ రీతిని మందు కొట్టుమనుచున్ మేధస్సునున్ దొల్చుచున్
సతమున్ బీడిని పీల్చుటన్ భడవరో చాలించు నేడంచు నీ
సతినే కొల్వుము సర్వదా యనుచువే సాధించు నత్తయ్యవౌ
హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపత న ము గోరు చు సతతము
రిప్లయితొలగించండిమతుల ను మార్చెడు విధమగు మాటల తోడ న్
గతి తప్పించె డు మనుజుల
హిత బోధల వినె డు వారికే కీడొ ద వు న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి( వేటగాని వలలోని గింజలు తిందామన్న ముసలి
రిప్లయితొలగించండిపావురం మాటలు నమ్మి వలలోపడ్డ పావురాలు )
" మతితో నా పలుకుల్ వినుండిట వట
క్ష్మాజంబు క్రీనీడలో
తతులై నిండిన నూకలన్ని భుజియిం
తం " బంచు వృద్ధం బనన్
గతులే మారిన పావురాలు వలలో
గన్నీరు మున్నీరయెన్ ;
హితబోధల్ వినువారికే యొదవు గీ
డెల్లప్డు యోచించినన్ .
(పంచతంత్రంలోని మిత్రలాభం కథ ఆధారంగా )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమితిమీరిన ధనదాహము
రిప్లయితొలగించండిపతనమునకు హేతువౌను భద్రము పుత్రా!
గతితప్పిన స్నేహితుల య
హితబోధల్ వినెడువారికే కీడొదవున్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండిసతమతమై వెతలంబడి
రిప్లయితొలగించండిరతిపతి భవు వలన బూది రాశిగ మారెన్
గతిలేక సురల తనుపగ--
హిత బోధల వినెడు వారికే కీడొదవున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిసతి మాటలు వినకనెపుడు
రిప్లయితొలగించండిమితి మీరిన నమ్మకమును మిత్రుల పైనన్
సతతము తప్పులు జెప్పెడి
హితబోధల వినెడివారికే కీడొదవున్
🙏🙏
రెండవ పాదము గణ భంగము చివర
తొలగించండిమన్నించాలి, 🙏మార్పు చేసాను,
తొలగించండిపరిశీలించ ప్రార్ధన
*4*
సతతము మోసముతో మన
పతనము కోరెడి జనులగు పదుగురు మనకే
హితులని తలచుచు వారివి
హితబోధల వినెడివారికే కీడొదవున్
🙏🙏
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిసతతావేశము గల్గి శాత్రవ,వినాశమ్మే ప్రధానమ్ముగా
రిప్లయితొలగించండిమృతికిన్ స్వాగత మీయ భీతిలని దుర్మేధుల్ మతోన్మాదులున్
తతులై హద్దులు దాటివచ్చి యిట విధ్వంసమ్ముకై చేయు మో
హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగతమున్ చేసిన స్నేహముల్ వదలు, సౌఖ్యంబిచ్చు స్వేచ్ఛే పరా
రిప్లయితొలగించండిగతిబట్టున్, పతి పాద సేవనమె ముఖ్యంబౌ, శరీరం బధో
గతి పాలౌనులె గర్భమొంది, వల దీ కష్టం బనం గావివా
హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్౹౹
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం.
రిప్లయితొలగించండిహితముల నుచితము నొసగగ
చతురత తమదే యటంచు చాటుచు దిరుగన్
పతితాగ్రేసరు నమ్మిన
హితబోధలు వినెడి వారికే కీడొదవున్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
హితబోధల వినెడివారికే కీడొదవున్
సందర్భము: విశ్వామిత్రుడు రామలక్ష్మణులకై రాగా దశరథుడు సందేహించగా వశిష్ఠు డన్న మాట లివి...
పితృగణ సంతృప్తికై యజ్ఞం చేస్తే మారీచ సుబాహులు విఘ్నాలు కలిగిస్తే విశ్వామిత్రుడు రామలక్ష్మణులచేత రాక్షస సంహారం చేయించేందుకై దశరథుని వద్దకు వచ్చాడు.
రామునిపై మోహంతో దశరథుడు సతమతమైతే వశిష్ఠుడు విశ్వామిత్రుని మహత్వాన్ని వివరించి, "రామునితో సీతను కూర్చడానికి వచ్చినా డితడు. హితం చేయటమే స్వభావం. రామునికి మేలే జరుగుతుంది." అన్నాడు.
దశరథుడు పంపించినాడు.
విశ్వామిత్రుడు బల అతిబల అనే విద్యలను ప్రసాదించినాడు. తాటకను వధింపజేసినాడు. అదే రాక్షస సంహారానికి నాంది. రాముడు చేయగల డని లోకానికి తెలిసింది.
విశ్వామిత్రుడు సర్వాస్త్రాలు రామున కిచ్చినాడు. (సర్వాస్త్ర జాలం స రహస్య మంత్రం ప్రీత్యాభిరామాయ దదౌ మునీంద్రః.. అధ్యాత్మ రామాయణం)
రాముడు సుబాహుని వధించినాడు. మారీచుని నూరామడలకు విసిరివేసినాడు.
విశ్వామిత్రుడు వారిని మిథిలకు తీసుకువెళ్ళాడు. దారిలో అహల్యా శాపవిమోచనం జరిగింది.
చివరకు శివధనుర్భంగం చేయించి రాముని కళ్యాణానికి మార్గం సుగమం చేశాడు.
వీ టన్నిటితో విశ్వామిత్రుని కొరిగిం దేమీ లేదు. అతడు జితకాముడు. కృతపుణ్యుడు. అలాంటి వాడే హితు డంటే...
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*"జితకాముడు, కృతపుణ్యుడు,*
*హితకారియు గాధిసూను;*
*డీ రామునకున్..*
*సతతము మేలే జరుగును..*
*హితబోధల వినెడివారి కే కీ డొదవున్?"*
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
20.11.19
-----------------------------------------------------------
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివితత కలు షాబ్ధి జల సం
రిప్లయితొలగించండిప్లుత ఘోర నరాధమ కృత బోధనములు కు
త్సిత చిత్తుల, పాటించక
హితబోధల, వినెడివారికే కీ డొదవున్
ధృతి యుక్తమ్ముగ నిత్య కర్మముల నిర్దేశమ్ము సంధానమున్
మతి నూహించి స్వయమ్ముగాఁ దివిరి సన్మాన్యుండ వర్తించుమా
సతతక్రోధ మనో౽వివేక ఖర శంసా స్వార్థ చింతా ప రా
హితబోధల్ వినువారికే యొదవుఁ గీ డెల్లప్డు యోచించినన్
[పర+ అహిత బోధల్ = పరాహిత బోధల్]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిపతితో సతి సతితో పతి
రిప్లయితొలగించండిసతతము కలహముల గడుపు సంసారములన్
మతి మాలిన మూర్ఖపు స్నే
హితబోధల వినెడివారికే కీడొదవున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిsubbaraoనవంబర్ 20, 2019 1:06 PM
రిప్లయితొలగించండిసతతము శుభములు గలుగును
హితబోధలవినెడివారికే,కీడొదవున్
మతిహీనులపలుకులువిని
యతిగావర్తించునెడల నదియేమనకున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిస్థితిమారెన్ అభివందనాలనుచు మీచే బ్యాంకువౌ మీ నమో
దితముల్ జెప్పెడు రీతి లక్షలిపుడందించంగ సిద్ధమ్మనన్
మతిహీనంబుగఁ జెప్ప మీదు నిధులౌ మాయమ్ము! యెట్లౌనివే
హితబోధల్? వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్!
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిమతిమంతులు కరువయ్యిరి
రిప్లయితొలగించండిశ్రుతులను వినిపించు కొనట చేదాయెనుగా!
గతితప్పిన కలియుగమున
హితబోధల వినెడివారికే కీడొదవున్ !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికంద పద్యము
రిప్లయితొలగించండిహితులు మన హితము కోరుచు
హితబోధలు చేయుచున్న వినవలె నెపుడున్
మతిపోయిన యోచించక
హితబోధల వినెడివారికే కీడొదవున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
మతిలో మత్సర ద్వేషముల్ ముసిరి దుర్మార్గంపు టాలోచనల్
రిప్లయితొలగించండిమితిమీరంగ సుయోధనా!కుజన మైత్రింగూడి దాయాదుల
న్నతికష్టంబుల పాలుజేసితివి,దుర్వ్యాపార దోషాయుతా
హితబోధల్ వినువారికే యొదవు గీడెల్లప్డు యోచించినన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మత్సర ద్వేష' మన్నపుడు 'ర' గురువై గణదోషం.
మత్సర పొచ్చముల్ అనవచ్చా గురువుగారూ?
తొలగించండిసతతము శ్రీహరినామము
రిప్లయితొలగించండిమతిగల్గుచు మనసునందు మంచిగబలుకన్
స్తుతమతి మెచ్చును గాదా
హితబోధలువినెడువారికే కీడొదవున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసతతమసత్యముబల్కున
రిప్లయితొలగించండిహితకారుల మాటనమ్మనిక్కట్టులెగా
వెతలకుమూలమ్మౌనా
హితబోధల వినెడివారికే కీడొదవున్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅతిగా పరభాషప్రేమ
రిప్లయితొలగించండిమితముగనే,యమ్మపలుకు మ్రింగుడుపడునా??
మతిదప్పి చెరుపుజేసే
హితబోధలువినెడువారికే, కీడొదవున్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణదోషం. 'చేసే' అనడం వ్యావహారికం.
కందం
రిప్లయితొలగించండిమతితో మీ బ్యాంకు నమో
దితముల రాబట్టి మీరు దిగ్గురన నిథుల్
గతికెడు జిత్తుల మారుల
హితబోధల వినెడివారికే కీడొదవున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమతమను ముసుగున మౌఢ్యపు
రిప్లయితొలగించండిగతులను జనులను నడిపెడి కపటపు యతులన్
నతిగా నమ్ముచు వారల
"హితబోధల వినెడివారికే కీడొదవున్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కపట యతులనే । యతిగా నమ్ముచు..." అనండి.
అతిగా స్వార్థము కల్గినట్టి జనులున్ వ్యాపారులున్ మూఢులున్
రిప్లయితొలగించండియతిగా వేషము దాల్చి భూరిగ ధనమ్మార్జించు సన్యాసులున్
మతియేలేని వివేక శూన్యులును దుర్మార్గుండ్రిలన్ చెప్పెడిన్
హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసతతము మంచిని కోరుచు
రిప్లయితొలగించండిసుతిమెత్తనిమాటలాడి సూచన లిడస
న్మతితోడను విడువక యా
హితబోధల వినెడి వారికే కీడొదవున్?
సతతము శుభమే జరుగును
హితబోధలు వినెడి వారికే కీడొదవెన్
మతిహీనంబగు పనులను
మితిమీరగచేయుచుండమేదిని యందున్.
పతులుం బంధులు జూచుచుండ సభలో పాంచాలినిం బిల్చి సం
రిప్లయితొలగించండితతముం మిత్రుడటంచు పేర్కొనెడి రాధా బుత్రునిం బల్కులన్
సతి వస్త్రంబుల నూడిపించి కురురాజంకంబునం గూలె గ
ర్హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్
పతులుం బంధులు జూచుచుండ సభలో పాంచాలినిం బిల్చి సం
తొలగించండితతముం మిత్రుడటంచు పేర్కొనెడి రాధా బుత్రునిం బల్కులం
దతివన్ పెక్కు పరాభవించి కురురాజంకంబునం గూలె గ
ర్హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్