21, నవంబర్ 2019, గురువారం

సమస్య - 3198 (విజ్ఞుఁ డననొప్పు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"విజ్ఞుఁ డననొప్పుఁ గర్తవ్యవిముఖుఁ డెపుడు"
(లేదా...)
"ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్యవైముఖ్యమే"

63 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    తనివిన్ తీరెడు రీతినిన్ బలుపుగా ధైర్యమ్ము శౌర్యమ్ముతో
    పనియున్ లేకయె శంకరాభరణనున్ పద్యమ్ములన్ పేర్చుచున్
    మనమున్ దోచెడు పింఛనుండగను భల్ మైకమ్మునన్ వ్రాయగా
    ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్యమౌఖ్యమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      'శంకరాభరణనున్'?.... "శంకరాభరణ సత్పద్యమ్ములన్..." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి

    2. 🙏

      ప్రాతః కాలపు సరదా పూరణ:

      తనివిన్ తీరెడు రీతినిన్ బలుపుగా ధైర్యమ్ము శౌర్యమ్ముతో
      పనియున్ లేకయె శంకరాభరణసత్పద్యమ్ములన్ పేర్చుచున్
      మనమున్ దోచెడు పింఛనుండగను భల్ మైకమ్మునన్ వ్రాయగా
      ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్యవైమౌఖ్యమే

      తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    మన భాషల్ చదువంగరాదు , మనవౌ మంత్రమ్ములన్ నమ్మరా...
    దనిశమ్మాంగ్లమె నేర్వగావలె , నసత్యమ్మే శిరోధార్యమౌ,
    దనుజున్ బోలి చరించుమా, యిదియె కర్తవ్యమ్మనన్ నేర్పగా.,
    ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్యవైముఖ్యమే !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  3. జనహితమొనర్చు కార్యముల్ జంకులేక
    పటిమఁ జూపుచుఁ జేసెడు వాడుకాదె
    విజ్ఞుఁ డననొప్పుఁ, గర్తవ్య విముఖుఁ డెపుడు
    విఘ్నములటంచు భీతిలి విడుచు పనులు.

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    శనియున్ మొత్తగ నోడుచున్ ఘనముగా సర్దారుడౌ మోడికిన్
    జనముల్ మెచ్చెడి తీరునన్ పదవికిన్ సన్యాసమున్ పూన్చుచున్
    పనికిన్ మాలిన రీతినిన్ వడివడిన్ పారంగ థైలాండుకున్
    ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్యవైమౌఖ్యమే

    "Lok Sabha Speaker takes note of Rahul Gandhi's absence from House"

    ...Hot News Item

    రిప్లయితొలగించండి
  5. యజ్ఞ యాగమ్ము లొనరించు ప్రాజ్ఞు డనగ
    విజ్ఞుఁ డననొప్పుఁ . గర్తవ్య విముఖుఁ డెపుడు
    జనుల మెప్పించ డాబుగ జాల మందు
    గణన కెక్కును జగతిని ఘనుడు గాను

    రిప్లయితొలగించండి
  6. ఘనమాలిన్యము వీడగా దివియె సాగ్రమ్మై చివాలంచు కాం
    తిని దీప్తించెడు రీతి మబ్బులొదలన్ తిగ్మాంశుడిన్ తేజమై
    ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్యవైముఖ్యమే
    మనసున్ వీడగ మానవుండరయ ప్రామాణ్యమ్ముగా వెల్గుచున్

    రిప్లయితొలగించండి
  7. పాప భీతిని కలిగిన పాలనమున
    విజ్ఞు డనదగు సరియైన విధులు సలుప
    పాప భీతిని తొలగించు పాలనమున
    విజ్ఞు డననొప్పు గర్తవ్య విముఖు డెపుడు
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  8. వర్షములు విరివిగ కురువవలె నన్న
    మానులనుబెంచ కర్తవ్యమనుచు తెలుప
    విజ్ఞుఁ డననొప్పుఁ ; గర్తవ్యవిముఖుఁ డెపుడు
    కరవు దినములధికముగ గాంచు చుండు

    రిప్లయితొలగించండి
  9. విధినియెదిరించినిలుచుట విజ్ఞతౌన?
    జనులబాధించుతత్వమ్ము జాతి హితమ?
    కోరివరియించునేతల కొసరియెట్లు
    విజ్ఞుడనగనొప్పుకర్తవ్యవిముఖుడెపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "విధిని నెదిరించి..." అనండి. 'విజ్ఞత + ఔన' అన్నపుడు సంధి లేదు. "విజ్ఞతయొకొ" అనండి.

      తొలగించండి
  10. వినగానొప్పడు యెవ్వరేమనిన తా,వేదాంతతన్మూఢుడై
    ఘనకార్యమ్ముగనెంచునా జనులనే,గాఢాంధకారమ్మునన్
    పనిగానెంచును పాతభావనలతాపాల్మాలగా జేయునా
    ఘనవిజ్ఞుండుగ కీర్తిన్దెచ్చునుగదాకర్తవ్యవైముఖ్యమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒప్పడు + ఎవ్వరు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "వినగా నొప్ప డెవార లేమనిన..." అనండి.

      తొలగించండి
  11. పర హితంబు ను గోరుచు పరగు వాడు
    విజ్ఞు డ న నొప్పు : కర్తవ్య విము ఖు డె పు డు
    పరుల సాయము కొఱకు నై పరుగు దీసి
    బ్రతుకు చుండును సతతం బు వెతల తోడ

    రిప్లయితొలగించండి
  12. ( తెలుగుతల్లి ముద్దుబిడ్డడు పీవీ నరసింహారావు
    గారు వేచి చూచి సమస్యాపరిష్కారం చేస్తారు )
    జనులందున్ బహుభాషలన్ దెలియు వా
    చావల్లభుండై; మహా
    మునియై;భారతనేతయై;కవియునై;
    ముమ్మూర్తిచాణక్యుడై
    మన పీవీజి సమస్యలందున " విలం
    బశ్రీ " గ బేరొందెనే !
    ఘనవిజ్ఞుండుగ గీర్తి దెచ్చునుగదా !
    కర్తవ్యవైముఖ్యమే .
    ( మహాముని - గొప్పమౌనంతో ఉండేవాడు ;
    విలంబశ్రీ - ఆలస్యంలో మొనగాడు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఆలోచించి నింపాదిగా చేయడంలో కార్తవ్య వైముఖ్య మేమున్నది?

      తొలగించండి
    2. కొంతమంది అలా అనుకొనేవారండీ ! ఐనప్పటికీ
      ఆ అపరచాణక్యుడు కీర్తిమంతుడైనాడని నా భావం.

      తొలగించండి
  13. తల్లిదండ్రుల బాగోగులెల్ల విడచి
    తుదకు వృద్ధాశ్రమంబులో వదలివేసి
    దూర దేశాల పెద్ద యుద్యోగియైన
    విజ్ఞుడననొప్పు కర్తవ్య విముఖుడెపుడు.

    రిప్లయితొలగించండి
  14. సజ్జనుడనుకొని ప్రజలు సమయమీయ
    విజ్ఞుఁ డననొప్పుఁ, గర్తవ్యవిముఖుఁ డెపుడు
    వివిధ మగు చేష్టల నొసగి విసుగు దెచ్చె
    గతిచెడిన పనులనిలనుఘనమను గొని
    🙏🙏

    రిప్లయితొలగించండి
  15. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    విజ్ఞుఁ డననొప్పుఁ గర్తవ్య విముఖుఁ డెపుడు

    సందర్భము: రామునికి సుగ్రీవుడు మిత్రుడైనాడు. వాలివధ జరిగింది. సుగ్రీవుడు కామోపభోగాల్లో మునిగినాడు. కాలం గడచింది. రాముడు లక్ష్మణునితో అన్నాడు.. (అధ్యాత్మ రామాయణం కిష్కింధా కాండం)
    రాజ్యం నిష్కంటకం ప్రాప్య
    స్త్రీభిః పరివృతో రహః
    కృతఘ్నో దృశ్యతే వ్యక్తం
    పానాసక్తోఽతికాముకః
    నిష్కంటకమైన రాజ్యాన్ని (నా వల్ల) పొంది, స్త్రీలతో అంతఃపురంలో క్రీడిస్తూ మద్యపానాసక్తుడై అతి కాముకుడై కృతఘ్నుడుగా కన్పిస్తున్నాడు సుగ్రీవుడు.
    నాయాతి శరదం పశ్య
    న్నపి మార్గయితుం ప్రియామ్
    పూర్వోపకారిణం దుష్టః
    కృతఘ్నో విస్మృతో హి మామ్
    శరత్కాలము రావటం చూసికూడా నా ప్రియురాలిని వెదుకడానికి రావడం లేదు. దుష్టుడై కృతఘ్నుడై ఎంతో మేలు చేసిన నన్ను మరచిపోయినాడు.
    వాలి గతి యే మయిందో.. తెలియదా!.. అన్నాడు రాముడు. "ఆ పని నేనే చేస్తాను.. అనుజ్ఞ నివ్వం" డన్నాడు లక్ష్మణుడు. కాని రాముడు మెత్తబడి "నీవు వెళ్లి కొంచెం భయపెట్టు.. జాగ్రత్త!.. అను.. ఏం చెబుతాడో విని రా!" అన్నాడు రాముడు.
    "ప్రత్యుపకారం చేయటం విజ్ఞుని కర్తవ్యం. సుగ్రీవు డది విస్మరించినాడు. విజ్ఞు డెలా ఔతాడు?.." అని రాము డన్నాడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    విశ్వసించితి సుగ్రీవు విజ్ఞు డనుచుఁ..

    గాని, మనలను ప్రత్యుపకార బుద్ధి

    మాని మరచెను.. భోగాలు మరిగె.. నెటుల

    విజ్ఞుఁ డన నొప్పుఁ గర్తవ్య విముఖుఁ డెపుడు?

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    21.11.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  16. అనుమానం బొకయింతలేదు సతతం బన్నింట కష్టం బిటన్
    దనకుం గూర్చుచు నెల్లవేళల మనస్తాపంబు కల్గించుచున్
    తన జ్యేష్ఠత్వమునైన గాంచనియెడన్ ధర్మాత్ముడౌవానికిన్
    ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్యవైముఖ్యమే

    రిప్లయితొలగించండి
  17. అజ్ఞుండేలగ నాతని
    నాజ్ఞల ధిక్కారణ కడు నావశ్యకమౌ
    విజ్ఞులు పలికెద రిట్టుల
    "విజ్ఞుఁ డననొప్పుఁ గర్తవ్యవిముఖుఁ డెపుడు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్యాపాదం తేటగీతి అయితే మీరు కందం వ్రాసారు. సవరించండి.

      తొలగించండి
  18. విఙ్ఞతగలిగి వర్తించువినయమతిని
    విఙ్ఞుడననొప్పు,గర్తవ్యవిముఖుడెపుడు
    దిరుగుచుండును బనిపాటులరయకుండ
    పూటకొకయూరుసోమరిపోతువోలె

    రిప్లయితొలగించండి
  19. విధులు చేయుటె మేలుగ విబుధులకిల
    గీత బోధల పార్ధుడు గెలిచె రణము
    దోష మీ మాట, నిది సత్య దూర మయ్య
    విజ్ఞుఁ డననొప్పుఁ గర్తవ్యవిముఖుఁ డెపుడు

    రిప్లయితొలగించండి
  20. మత్తేభవిక్రీడితము
    తననే నేతగ నెన్నినప్పటికి సాధ్యాసాధ్యముల్ జూచుచున్
    జనసేమమ్మదె ముఖ్యమంచుఁ గని విశ్వాసాల్ వివాదాస్పద
    మ్మనెడున్ యంశముఁ బ్రక్కనుంచుటయె సంభావ్యమ్మనన్ వీడినన్
    ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్యవైముఖ్యమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవుల సూచన మేరకు సవరించిన పూరణ :
      మత్తేభవిక్రీడితము
      తననే నేతగ నెన్నినప్పటికి సాధ్యాసాధ్యముల్ జూచుచున్
      జనసేమమ్మదె ముఖ్యమంచుఁ గని విశ్వాసాల్ వివాదాస్పద
      మ్మను నంశమ్ములఁ బ్రక్కనుంచుటయె సంభావ్యమ్మనన్ వీడినన్
      ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్యవైముఖ్యమే

      తొలగించండి
  21. తనదు కర్తవ్యమెన్నడుతప్పకుండ
    సమయపాలనపాటించు సజ్జనుండు
    విజ్ఞుఁ డననొప్పుఁ ,గర్తవ్యవిముఖుఁ డెపుడు
    కార్యసాధనయందునిర్వీర్యుడగును

    రిప్లయితొలగించండి
  22. తేటగీతి
    యుద్ధమందున సాయమ్ము నొగ్గి పిలచి
    బంధుల గురుల తో పోరు పడనటంచు
    వెన్ను జూపుట తగదయ్య! విశ్వమంద
    విజ్ఞుఁ డననొప్పుఁ గర్తవ్యవిముఖుఁ డెపుడు! !

    రిప్లయితొలగించండి
  23. ఆజ్ఞలఁ బరిగణించఁ డహరహ మందు
    విజ్ఞులందు భక్తిఁ జనఁడు వినయ మరుదు
    ప్రాజ్ఞు లన విందు నే నిల ప్రముఖ శూన్య
    విజ్ఞుఁ డననొప్పుఁ గర్తవ్యవిముఖుఁ డెపుడు


    జనహర్షప్రద సత్ఫలప్రద సవాంఛాజాల సంయుక్తమౌ,
    ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా, కర్తవ్య నిర్వాహమే
    జన సంత్రాస నిబద్ధ జాతఫలవాంఛా జాల సంయుక్తమౌ,
    ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా, కర్తవ్య వైముఖ్యమే

    రిప్లయితొలగించండి
  24. తనకర్తవ్యమునిర్వహించుసమయంబందంతరాయంబులన్
    తనవిణ్ణానముజూపిపోనుడుపుకర్తవ్యోన్ముఖత్వంబిలన్
    ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా, కర్తవ్యవైముఖ్యమే
    పనులన్ జూపనివాడెపో ఘనుడు సంప్రాప్తించు సౌఖ్యంబులే

    రిప్లయితొలగించండి


  25. గురువు నేర్పిన విద్యలు కూర్మితోడ
    నభ్యసించిన జగతి యందనవరతము
    విజ్ఞుఁ డననొప్పుఁ,, గర్తవ్యవిముఖుఁ డెపుడు
    సోమరితనమ్మున తిరుగుచు చెడు గాదె

    రిప్లయితొలగించండి
  26. ప్రజ్ఞచే మార్గదర్శియై ప్రముఖుడగుచు
    కష్టపడి, దైవ కార్యంబఁ కర్మ సేసి
    విజ్ఞుఁ డననొప్పుఁ , గర్తవ్య విముఖుఁ డెపుడు
    సోమరితనమున పరులసొమ్ముఁ కోరు!

    రిప్లయితొలగించండి
  27. వినుడీ నేటి యదార్థమున్ - యెరుపు కాపేదెవ్వడే బండి? ఇం
    ధనకాలుష్యము తగ్గఁజేయగను సాదా బస్సుయానంబు చే
    యునదెవ్వండు? సదా నిబంధనలనే యుద్దేశ్యపూ ర్వాతిలం
    ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్యవైముఖ్యమే౹౹

    రిప్లయితొలగించండి
  28. పనులన్ శ్రద్ధను జూపుచున్నెపుడు నావంతైన లోపింపకన్
    తన కర్తవ్యమె ముఖ్యమంచు దగు ప్రాధాన్యమ్ము పాటించుటే
    ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా; కర్తవ్యవైముఖ్యమే
    తన ఫైఫల్యపు కారణమ్మగును దా భ్రష్టత్వమున్ బొందునే

    రిప్లయితొలగించండి
  29. తే.గీ.

    బుద్ధి శాలిగ పేరొంద పురము నందు
    తానె సర్వము దెలిసిన దక్షుడనగ
    కాలయాపన జేయుచు గడుపుచుండ
    విజ్ఞుడననొప్పు గర్తవ్య విముఖుడెపుడు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  30. నేటి శంకరాభరణం సమస్య


    "ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్య వైముఖ్యమే"

    ఇచ్చిన పాదము మత్తేభము నా పూరణము సీసములో

    ఘనమగు రాజ్యము కట్టబెట్టి పరిపా
    లనము చేయమనగన్ తనువు విడిచె


    చిత్రాంగదుడు తన చేతల వలనన్ , వి
    చిత్ర వీర్యుని కాంచి శీర్షకమ్ము


    పెట్టి పాలనమును పేరిమి తో చేయ
    మని తెల్ప మరణించె నధిక మైన

    కామ వాంఛ కలుగ,నీమము తప్పక
    త్యాగ శీలు డెపుడు ధర్మము కలి

    గి ఘన విఙుండుగ గీర్తి దెచ్చును గదా,
    కర్తవ్య వైముఖ్య మే రహటు ను


    కూర్చును సతము, భీష్ముడు కోరికలను

    వీడి, ధర్మ మార్గంబును వీడక తను

    చేసి నట్టి బాసకు నిలచి జగ మందు

    గొప్ప వాడాయె నెల్లరి మెప్పు ‌బడసి

    రిప్లయితొలగించండి
  31. ఘనమౌ కార్యములెన్నియో భువినిసాకారంబుజేయంగసూ
    ఘనవిఙ్ఙుండుగగీర్తిదెచ్చునుగదాగర్తవ్యవైముఖ్యమే
    యనుమానంబిసుమంతయున్వలదు తాదాత్శ్యంబునొందంగనో
    యనసూయావినువిఙ్ఞుడేధరనుదాధర్మంబుగాపాడుగా

    రిప్లయితొలగించండి
  32. వాడుకొనుచుండ నధికార వర్గములను
    స్వార్థ పరమైన పనులకు సంతతమ్ము
    నట్టినేతల నెదిరించ గట్టిగాను
    విజ్ఞుడననొప్పు కర్తవ్యవిముఖుడెపుడు

    రిప్లయితొలగించండి
  33. మందబలముందిమాకని మత్తుబెరిగి
    మాటలందున మన్నన మరచిపోవు
    మనసులేనట్టినేతగు మందునెటుల
    విజ్ఞుడననొప్పు కర్తవ్యవిముఖునెపుడు.

    రిప్లయితొలగించండి
  34. తనకేనన్నియుదెల్సులెమ్మనుచు,తాతప్పుల్ సదాజేయుచున్
    వినడే యెవ్వరదేమిజెప్పినను,యేవీటన్సదాబుద్ధిగన్
    ధనమేరాజ్యమునేలుచుండునని,తాధర్మమ్మునే వీడనే
    ఘనవిజ్ఞుండుగకీర్తిదెచ్చునుగదా,కర్తవ్య వైముఖ్యమే

    రిప్లయితొలగించండి
  35. అనుమానమ్ము మదిన్ దలంపక సదా యడ్డంకులెన్నున్న తా
    వెనుకాడంగను లేని యత్నమే కదా విశ్వమ్ములో గాంచగన్
    ఘన విజ్ఞుండుగఁ గీర్తి దెచ్చును కదా, కర్తవ్య మౌఖ్యమే
    నిను నిర్వీర్యుని జేయునందురిలలో నిక్కమ్మిదేనమ్ముమా!

    రిప్లయితొలగించండి
  36. ఘనమౌ వంశము నందు బుట్టి ధృతితో కార్యమ్ములన్ నీతితో
    డను తా చేయుచు నిర్మలమ్ముగ నిరాటంకమ్ముగా నెప్పుడున్
    మనుచున్నట్టి నిజాయితీ పరుడు దుర్మార్గమ్ములన్ తాకుచున్
    ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్యవైముఖ్యమే

    రిప్లయితొలగించండి
  37. వినగానొప్పడు యెవ్వరేమనిన తా,వేదాంతతన్మూఢుడై
    ఘనకార్యమ్ముగముంచునా జనులనే,గాఢాంధకారమ్మునన్
    పనిగానెంచును పాతభావనలతాపాల్మాలగా జేయునా
    ఘనవిజ్ఞుండుగ కీర్తిన్దెచ్చునుగదాకర్తవ్యవైముఖ్యమే

    రిప్లయితొలగించండి