19, నవంబర్ 2019, మంగళవారం

సమస్య - 3196 (రాజధాని లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాజధాని లేని రాజ్యమయ్యె"
(లేదా...)
"రాజ్యము రాజధాని గనరానిది రాజెట నుండి యేలునో"

75 కామెంట్‌లు:


  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    వ్యాజ్యము చేయుచున్ దవిలి భండన మందున పార్లమెంటులో
    భోజ్యములన్నియున్ గతికి పోరుచు నుండగ ముండమోపులే
    పూజ్యులు పార భీతిలుచు ముందును వెన్కను చూడకుండెడిన్
    రాజ్యము రాజధాని గనరానిది రాజెట నుండి యేలునో

    రిప్లయితొలగించండి
  2. భర్త లేని భార్య బహుదీన యగునట్లు
    ఉప్పు లేని కూర చప్పి డంట
    ప్రభువు పాల నందు ప్రభవించు జనులంట
    రాజ ధాని లేని రాజ్య మయ్యె .

    రిప్లయితొలగించండి
  3. పనులు లేక జనులు పస్తులుండేరయా
    మాతృ భాషనచట మట్టుబెట్టు
    కుట్రజరుగు నట్టి కుజన పాలన లోన
    రాజధాని లేని రాజ్యమయ్యె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఉండేరయా' అనడం వ్యావహారికం. "పస్తులుండిరి కదా" అనండి.

      తొలగించండి

  4. తిండి పెట్టినాడ! తీరుగ నేలితి
    రాజ ధాని లేని రాజ్య మయ్యె
    యంచు రగడలేల నందరినిక బొక్క
    లోన దోస్త వలదు లొల్లి మీకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రాజ్యమయ్యె । నంచు... లేల యందరి..." అనండి. 'తోస్త' వ్యావహారికం.

      తొలగించండి
  5. (యుద్ధం జరగకముందే రాముడు విభీషణుని రాజుగా అభిషేకించిన సందర్భంలో వానరులు )
    పూజ్యుడు రాముడిప్డు ఘన
    పుణ్యజలంబుల జల్లు చల్లుచున్
    ప్రాజ్యపు రేడుగా నితని
    పావనభావు విభీషణాఖ్యునిన్
    త్యాజ్యుడు పంక్తికంధరుని
    తమ్ముని ; సందియమాయె ; నిప్పుడే
    రాజ్యము ? రాజధాని గన
    రానిది ? రాజెటనుండి యేలునో ??
    ( ప్రాజ్యపురేడు - పెద్ద ప్రభువు , త్యాజ్యుడు - విడువ దగినవాడు ; పంక్తికంధరుడు - రావణుడు )

    రిప్లయితొలగించండి
  6. ఊక దంపు మాట లొకకోటి చెప్పేడు
    భూమి లక్షలాది బొక్కినాడు 
    వేల వేలు మింగి విడువంగ నేడిలా 
    రాజధాని లేని రాజ్యమయ్యె  

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెప్పేడు, ఇలా' అన్నవి వ్యావహారికాలు. "చెప్పెను.. నేడిట్లు" అనండి.

      తొలగించండి
  7. ప్రగతి భవను గూలె ప్రాజెక్టు లేదాయె
    ఇసుక నేమొ జనుల యుసురు దీసె
    మాతృభాష జచ్చె మతమార్పిడి పెరిగె
    రాజధాని లేని రాజ్యమయ్యె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఇసుక యేమొ... భాష సచ్చె/చచ్చె" అనండి.

      తొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    సద్బోధ...

    భోజ్యము కాదు సంపద , విమోహము వద్దు, కులాల చిచ్చులో
    నాజ్యము పోయబోవకు, మహాత్ముల తూలక, హర్నిశల్ శ్రమన్
    పూజ్యుడవై యశమ్ము గొను, పొల్పుగ గట్టుము రాజధాని, మా
    రాజ్యము రాజధాని గనరానిది రాజెట నుండి యేలునో ?

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  9. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    circa 2014:

    భోజ్యము లన్నియున్ గతికి బొక్కస మందున హైద్రబాదునన్
    రాజ్యము జేయ కాంగ్రెసులు రాధన మిచ్చుచు సోనియమ్మకున్
    పూజ్యుడు చంద్రశేఖరుడు బుఱ్ఱను దొల్చుచు పారద్రోల నా
    రాజ్యము రాజధాని గనరానిది రాజెట నుండి యేలునో!

    రిప్లయితొలగించండి

  10. ఆజ్యము పోయకుండ్రి; అడియాళుర తోడుత దొమ్మిగూడుచున్
    పూజ్యము చేసి పోయినడు బొక్కస మున్ తొలి నాటి నేత; యీ
    రాజ్యము రాజధాని గనరానిది; రాజెట నుండి యేలునో?
    భోజ్యపు దారి చూపితిని పూటకు పూటకు తృప్తిగానుడీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని వ్యావహారిక పదాలున్నవి. "పోయవద్దు.. పోయె గద...తృప్తి గాంచుడీ" అనండి.

      తొలగించండి
  11. ఇసుక దోపిడీ లు హెచ్చ య్యె గా నేడు
    రాజ ధా ని లేని రాజ్యమయ్యె
    నని వి పక్ష నేత లను ట ను చూడంగ
    విస్మ యంబు పుట్టె వింత గాను

    రిప్లయితొలగించండి
  12. రాజధాని లేని రాజ్యమయ్యె

    ప్రజలు మెచ్చి నీకు పట్టమే గట్టెరా
    బతుకు భార మనుచు పరుగులిడిరి
    మతము మార్చ మనగ మట్టున బెట్టర
    రాజధాని లేని రాజ్యమయ్యె
    🙏🙏

    రిప్లయితొలగించండి
  13. రాజ్యముభోజ్యమాయెగద,రాష్ట్రముయందరి మేతయాయెగా!
    ఆజ్యముబోసిబెంచిరిక, ఆటగనాడుచు రాజధానిపై
    పూజ్యముజేసినారుగద, పూర్తిగ సంపద నేలగూల్చగా
    రాజ్యము రాజధానిగన రానిది, రాజెటనుండియేలునో?

    రిప్లయితొలగించండి
  14. నంది గ్రామమందునన్ యోగి వరుడగు
    భరతు పాలనమ్ము వాసికెక్కె
    రాజు యోగ్యుడైన రాణించు నిలలోన-
    రాజధాని లేని రాజ్యమయ్యె.

    రిప్లయితొలగించండి
  15. *సీతా రామ లక్ష్మణులరణ్యము కేగువేళ వారిననుసరించి వచ్చిన జనులు రాముని తో పలికిన మాటలుగ.....*



    తండ్రి మాట కొరకు ధావము కేగెడు
    ధర్మమూర్తి వీవు ధరణి యందు
    మీరు లేని చోట మేమెటులుందుమో
    రాజ, ధానిలేని రాజ్యమయ్యె.

    రిప్లయితొలగించండి

  16. పిచ్చివాళ్ళు రాష్ట్ర విభజన గావించ
    రాజధాని లేని రాజ్యమయ్యె
    కష్ఠమైన గాని కట్టుకొం దమనిన
    తిక్కలోడు వచ్చి తేల్చడయ్యె

    రిప్లయితొలగించండి
  17. రాజకీయ మందు రక్షించు వారేరి
    జనులు సమిధలెపుడు జగడమందు
    ప్రజలపీడ బాపి పాలనమ్మునుసేయ
    రాజధాని లేని రాజ్యమయ్యె!!

    రిప్లయితొలగించండి
  18. రాష్ట్రరాజధాని రాజిల్లె ప్రభలతో
    కలిసిమెలిసియున్న కాలమందు
    కాలగతిని రెండుగా చీలిపోగానె
    రాజధాని లేని రాజ్యమయ్యె

    రిప్లయితొలగించండి
  19. రాజ్యమనగ ప్రజలు రాజధానియె కాదు
    భవన చయము కాదు పాలననిన
    సాగుచుండ నెటుల చక్కని పాలన
    రాజధాని లేని రాజ్యమయ్యె ?

    రిప్లయితొలగించండి
  20. ఆంధ్రరాష్ట్రమిపుడ యరయగ బ్రజలార!
    రాజధాని లేనిరాష్ట్రమయ్యె
    నరకొరగను గట్టియాపివేయుఘనత
    చంద్రబాబునకిల సార్ధమయ్యె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చంద్రబాబు కయ్యె సార్థకంబు" అనండి.

      తొలగించండి
  21. పూజ్యుఁడు పద్మసంభవుఁడు భూవరుఁడొక్కని సృష్టి చేసి సా
    మ్రాజ్యపు పాలనంబమర రాజ్యము సేయుమటంచు పల్కగా
    పూజ్యము తండ్రి విశ్వమున భూమియటంచును పల్కెనివ్విధిన్
    రాజ్యము రాజధాని గనరానిది రాజెట నుండి యేలునో

    రిప్లయితొలగించండి
  22. ఆ.వె.
    రామకృష్ణ కమిటి రాజిల్ల సూచించ
    రాజధాని నగర రచన శైలి
    తన్ను గాద నంచు తానేగ ఫలితమే
    రాజధాని లేని రాజ్యమయ్యె

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  23. రాజ్యము వీరభోజ్యమని రాజన పేరిట సీట్లుగెల్చి తా
    ద్యాజ్యము పూర్వపాలకుల యావతుచర్యలు తిప్పికొట్టుడన్
    వ్యాజ్యములేగ నల్గడల!ప్రాభవమంతయు గోలుపోవగా
    రాజ్యము,రాజధాని గనరానిది,రాజెటునుండి యేలునో?!

    రిప్లయితొలగించండి
  24. రాజ్యమురాజధాని గనరానిదిరాజెటనుండియేలునో
    రాజ్యముభోజ్యమౌవిధము రాజులపాలననుండుచోభువిన్
    రాజ్యమురాజధానిగనరావుగరాజులకేరికిన్సుమా
    భోజ్యముజేయువారలకు పుట్టదురాజ్యపువృద్ధిజేయగన్

    రిప్లయితొలగించండి
  25. పూజ్యము దేశభాషలను బోడిమి గల్గి వెలుంగుచుండుటన్
    త్యాజ్యము సంశయమ్మనుచు దాను వచించెను కృష్ణరాజు యీ
    వ్యాజ్యమలేల దీనిపయి యౌర! మహాపద వచ్చె యిచ్చ టీ
    రాజ్యము రాజధాని గనరానిది, రాజెట నుండి యేలునో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కృష్ణరాజు + ఈ' అన్నపుడు యడాగమం రాదు. "కృష్ణరాజె యీ... దీనిపయి నౌర... వచ్చె నిచ్చ..." అనండి.

      తొలగించండి
  26. నిధన మంద రాజు నిర్జీవ మగుచును
    రాజధాని లేని రాజ్య మయ్యె
    ప్రభువు లేని యట్టి పాలన మెట్లుండు
    ననుచు పల్కు చుండి రవని జనులు.

    రిప్లయితొలగించండి
  27. శత్రు రాజు లడరి సంగ్రామ మొనరించ
    సప్త సప్తి వంశ చక్రవర్తి
    బాహుకుండు భీతిఁ బాఱఁగ నిఁక రాజు
    రాజధాని లేని రాజ్యమయ్యె


    రాజ్యము గీజ్యమున్ ధర నిరంతర ముండునె యెట్టి వారికిన్
    భోజ్యము శక్తి వంతులకుఁ బోరున గెల్చిన వేళ శత్రు దు
    ర్భాజ్యము మున్ను నేఁ డకట భద్రపు శాంతము, పోయు వారు వా
    రాజ్యము, రాజధాని గనరానిది రాజెట నుండి యేలునో

    [వారు +ఆజ్యము = వా రాజ్యము]

    రిప్లయితొలగించండి
  28. రాహువు కబళించె రాజ చంద్రునకట
    యంధకారమాయె నాంధ్ర ప్రగతి
    జనుల వరములంచు జరుగు జగన్మాయ
    రాజధాని లేని రాజ్యమయ్యె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కబళించె రాకాశశి నకట" అనండి.

      తొలగించండి
  29. నేటి శంకరా భరణము సమస్య

    రాజధాని లేని రాజ్యమయ్యె"

    నాపూరణము సీస సహిత అట వెలది లో

    ప్రపంచములో మూడు రాజధానులు గల దేశము దక్షిణ ఆఫ్రికా (Pretoria Bloemfontein Cape Town) రెఁడు రాజధానులు గల దెశములు సుమారుగా పది పైన ఉన్నాయి దక్షిణ ఫస్ఫిక్ సముద్రము లోని మార్శల్ ద్వీపము దగ్గరగా సుమరుగా 53 కిలొమేటర్ల భూమధ్య రెఖకు దగ్గిరగా నౌరు అను చిన్న దేశము ఉన్నది దాని జనాభా సుమారు 10 వేలు. దానికి ప్రపంచము గుర్తించిన రాజధాని లేదు గవర్నమెఁటు కార్యక్రమములు దగ్గిరలొని యేరెన్ నగరము నుంచి జరుగుతాయిట ఆ వివరములతొ నేటి సమస్య పూరణము



    రాజధానులు మూడు రమ్యమౌ దక్షిణా
    ఫ్రిక దేశమునకు నీ విశ్వ మందు,

    బొలివియా, శ్రీలంక,బూరుండి, ,చిలి,మలే
    షియ,బెనిన్, హో0డురాసు, యెమను మొద

    లగు చిన్న దేశములకు రెండు రాజధా
    నులు కనిపించె గూగులును తాక,

    కాంచితి నేను ప్రపంచ పటములోన
    నౌరు దేశ మొకటి నమ్మకముగ ,


    జనుల సంఖ్య చూడ స్వల్పము, యేరెను
    పురము లోన జనులు పొదలు చుండ
    ప్రాభవమ్ము వారు పనులు జరుప నది
    రాజధాని లేని రాజ్యమయ్యె"












    రిప్లయితొలగించండి
  30. పూజ్యుడు రామచంద్రుడట పోడుకుఁ బోవునెపమ్ముఁ వీడెనే
    రాజ్యము, కైకపుత్రుడును రాముని కోసమరణ్యమేగె, నీ
    రాజ్యము రాజులేనిదయె, రాముని పాదుక లేలుగాదె యీ
    రాజ్యము, రాజధానిగన రానిది రాజెటనుండి యేలునో.

    రిప్లయితొలగించండి
  31. రాజ్యము విశ్వమంతయును,ప్రాణుల నన్నిటి గాచు వృత్తిలో
    ప్రాజ్యపు ఱేనిగా వెలుగు ప్రాభవ మూర్తియు నొక్కడే సుమా!
    వ్యాజ్యములేల? నమ్ముమిక,భ్రాంతిని పొందకు మిట్లు"ఎక్కడో
    రాజ్యము?రాజధాని గనరానిది, రాజెట నుండి యేలునో!"

    ప్రాజ్యపు ఱేడు... JJK Bapuji గారికి 🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పొందకు మిట్టు లెక్కడో" అనండి.

      తొలగించండి
  32. ఓటు నోటు కేసె యురుకులు పెట్టించ
    పోరుసలుప లేక పారిపోయి
    యట సృజింప లేక యనువైన భవనముల్
    రాజధాని లేని రాజ్యమయ్యె

    రిప్లయితొలగించండి
  33. ప్రగతిబాటనడచి ప్రాభవమందరు
    దివ్య భావనలకు దిక్కుగనము
    వెలుగులీనలేక వేదన మిగిలించి
    రాజధానిలేని రాష్ట్రమయ్యె

    రిప్లయితొలగించండి
  34. రాహుకేతులిచట రాజులై నిలువంగ
    హితముజెప్పునట్టి హితులగనము
    కొత్తరాష్ట్రమింక కొరతగా జూడగ
    రాజధానిలేని రాష్ట్రమయ్యె

    రిప్లయితొలగించండి
  35. వానలెన్నొగురిసి వరదలు వచ్చిన
    రాజధాని వాటి రాకగనము
    పాలనమ్మునందు ప్రగతియే గనలేము
    రాజధానిలేని రాష్ట్రమయ్యె

    రిప్లయితొలగించండి
  36. వానలెన్నివున్న?వంకలులేనట్లు
    సంస్కరించలేని చదువులాగ
    రాజధానిలేని రాష్ట్ర మయ్యెననకు
    మంత్రు లండచేత మారగలదు
    శ్రీ. కెఈశ్వరప్ప.ఆలూరు

    రిప్లయితొలగించండి
  37. ఉత్పలమాల
    భాజ్యమటంచు రాష్ట్రమును స్వార్థపరుల్ విభజించి వైచగన్
    పూజ్యల బృందముల్ వెదుకఁ బోవఁగ నాంధ్రకు రాజధానికై
    ప్రాజ్యపు భావనల్ దెలియఁ, భావ్యమె యిట్టుల గేలిఁ జేయఁగన్
    "రాజ్యము రాజధాని గనరానిది రాజెట నుండి యేలునో? "

    రిప్లయితొలగించండి
  38. రాజ్యమె మాకుభోజ్యమని, రాతనుమార్చిరి రాష్ట్రమంతటన్
    ఆజ్యముబోసి గాల్చిరిక,ఆశలసౌధములన్నియొక్కటై
    పూజ్యముజేసి యాశలను,పూర్తిగ మార్చిరి జాతకమ్మునీ
    "రాజ్యము రాజధాని గనరానిది, రాజెట నుండి యేలునో? "

    రిప్లయితొలగించండి