నేటి జనము మారి పొయారు . పద్యములుతో కూడు నాటకములకే అదరణ పూర్తిగా తగ్గినది .మన సినిమాలో పద్యములు పెట్టితీస్తే నష్ట పోతాము అని దర్శకుడు నిర్మాత కు చెప్పు సంఘటన
నిజముల యొప్పుకోనగును,నిందలు వేసెడు వారు ముందుగా . ప్రజలను మభ్యపెట్టుటకు,ప్రాభవమందనిగొప్పపండితుల్ రుజువులు జూపలేరుగద, రూఢిగ బల్కగలేనివారలౌ ప్రజలుధృవీకరించిరట,పద్యకవిత్వము వద్దటంచయో!
..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య 🤷♀.................... ప్రజలు దృణీకరించి రఁట పద్య కవిత్వము వద్దటం చయో
సందర్భము: తాం స శుశ్రావ కాకుత్థ్సః పూర్వ చర్యాం తత స్తతః అపూర్వ పాఠజాతిం చ గేయేన సమభిప్లుతాన్ వారు (లవకుశులు) తన పూర్వ చరిత్రను అపూర్వ పదబంధ రీతిలో గానం చేస్తున్నా రని రాముడూ విన్నాడు. వారితో సహా వాల్మీకినీ తాను చేయబోయే యజ్ఞానికి ఆహ్వానించాడు. రాముని కొలువులోనూ కుశలవులు గానం చేశారు. (అధ్యాత్మ రామాయణం) " *లవకుశ* చలనచిత్రంలో లవకుశులు మధురంగా ఆలపించిన మూడు పాటలు విన్న ప్రేక్షకులు రామ భక్తి హృదయాల్లో నిండారగా ఆనంద బాష్పాలు రాలుస్తూ నాడూ నేడూ కూడా పద్య కవిత్వాన్ని తృణీకరిస్తున్నారు." అని పద్య భావం. 3 పాటలు.. 1. రామకథను వినరయ్యా.. (రామ జననంనుంచి కళ్యాణం వరకు..) 2.వినుడు వినుడు.. (రాముని యౌవ రాజ్య పట్టాభిషేక ప్రయత్నం నుంచి వన గమనారంభం వరకు) 3. శ్రీ రాముని చరితమును.. (పంచవటిలో శూర్పణఖనుంచి.. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చేవరకు)
చిత్రమునందు= సినీమాలో (లవకుశలో) ~~~~~~~~~~~~~~~~~~~~~~~ సుజనులు మెచ్చగా లవకు శుల్ వినిపించిన మూడు పాటలన్ నిజమగు రామ భక్తి హృది నిండగఁ జిత్రమునందు నాలకిం చి, జలకణాలు గన్నుగవఁ జిందగ నాడును నేడుఁ బ్రేక్షకుల్, ప్రజలు దృణీకరించి రఁట పద్య కవిత్వము వద్దటం చయో!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 10.11.19 -----------------------------------------------------------
రిప్లయితొలగించండిగజిబిజి జిబిజిగ జిజిగన
రె! జిలే బివిడువక తుంటరి పదములట ను
గ్గజ గజ లాడింపంగన్
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే!
జిలేబి
మీ గజిబిజి పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
సుజనులు వ్రాయబూనగను శోషను గూర్చెడు పద్యవిద్యనున్
భజనను జేసి యోడగను భండన మందున గండ్రగండులే
గజగజలాడి పారుచును కంపము నొందుచు హైద్రబాదునన్
ప్రజలు దృణీకరించిరఁట పద్యకవిత్వము వద్దటంచయో
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండి🙏
నిజమిది సత్కవిత్వ మనునిత్యము సంఘహితమ్ము గోరుచున్
రిప్లయితొలగించండివిజయము గూర్చుచుండవలె విజ్ఞత జూపుచు నట్లుగానిచో
సుజనశిఖామణుల్!రచన శోభిల దీయుగ మందటంచు నీ
ప్రజలు దృణీకరించిరఁట పద్యకవిత్వము వద్దటం చయో"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినేటి జనము మారి పొయారు . పద్యములుతో కూడు నాటకములకే అదరణ పూర్తిగా తగ్గినది .మన సినిమాలో పద్యములు పెట్టితీస్తే నష్ట పోతాము అని దర్శకుడు నిర్మాత కు చెప్పు సంఘటన
రిప్లయితొలగించండిగిజిగిజి నగు పెట్టుబడి,య
పజయము నొందు సినిమా,యువతచూడరుగా
నిజమని తెలుపగ వచ్చును
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ముల నే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిగిజగిజ లాడి మాలికని గీరుచు పద్యమటంచు యత్నముల్
గజగజ కందపద్యమని కట్టుచు పేర్పుడు రాళ్ళ పాదముల్
జజజజ లన్ ఫెడేల్మనుచు ఛందపు రీతులటంచు మోదుటల్!
ప్రజలు దృణీకరించిరఁట పద్యకవిత్వము వద్దటం చయో!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రజల కాంగ్లమె మోజయె
రిప్లయితొలగించండిస్వజులనమెరికాకు పంపి భాగ్యము కుడువన్
రజితా! తెలుగే వద్దను
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. "ప్రజలకు నాంగ్లమె మోజట" అనండి. (అయె అనడం సాధువు కాదు).
సుజలము వంటి ఛందమున
రిప్లయితొలగించండిశోభితసత్కవి నన్నపార్యుడే
సుజనవిధేయుడై వెలుగు
సూక్తుల నాంధ్రము దీర్చిదిద్దగా ;
నిజమున కా పటుత్వమును
నింత నెరుంగక బుద్ధిమాంద్యులై
ప్రజలు దృణీకరించిరట !
పద్యకవిత్వము వద్దటం చయో !!
అద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండి"పటుత్వరుచి నింత నెరుంగక..." అంటే ఇంకా బాగుంటుందేమో?
ప్రజలకునాంగ్లమె మోజట
రిప్లయితొలగించండిస్వజులనమెరికాకు పంపి భాగ్యము కుడువన్
రజితా! తెలుగే వద్దను
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే
నిజమిద్ది యెఱుగ నెప్పుడు
రిప్లయితొలగించండినజరామరమగుచు పద్యమానందమిడున్
నజరును గానకిటీవల
ప్రజలెల్లరు రోసిరయ్యె పద్యమ్ములనే!
నజరు=సౌందర్యము
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
విజయము కోరి పూరణను వెంటనె వ్రాయగ వాటుసప్పునన్
మజగొని మీరు దిద్దుచును మంచిది పద్యమనంగ నేనిటన్
భుజములనెత్తి శంకరయ! ముద్దుగ పాడగ,...నాదు కొంపనున్
ప్రజలు దృణీకరించిరఁట పద్యకవిత్వము వద్దటంచయో! 😢
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే
రిప్లయితొలగించండిప్రజలకు నాంగ్లము మోజే
ప్రజలకు తెలుగిట పడదుగ పల్కులు పలుకా
నిజమిది నమ్ముము రా మన
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే
🙏🙏
నిజముగ నాంగ్లము మోజే
తొలగించండిసజావు గేమియు తెలియదు సగమయినను నే
సుజనులు యెవ్వరు తెలుపక
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే
🙏🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండివిజయమునొందఁగ జనులిట
తొలగించండిఅజరామరముగ తెలుసుకొ యమ్మ పలుకునే
నిజమగు నీ విషయమొదిలి
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే
🙏🙏
కం.
రిప్లయితొలగించండిస్వజనము పద్యము నేర్పక
భజియించగ మ్లేచ్ఛదేశ భాషలు ప్రియమై !
నిజభాషకు స్వస్తియని
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే !!
శంకరా భరణమునేటి సమస్య
రిప్లయితొలగించండిప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ముల నే
ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో
రాజధాని భూములు అమ్ముకొనగా వచ్చిన ధనముతో శ్రీ క్రుష్ణ రాయభారము సినిమా తీస్తాను అని పద్యములమీద అభిమానమున్న ఒక ఆంధ్ర రైతు అనగా భార్య వారించిన సందర్భము
మురియుచు విరివిగ పరిపరి పరదేశ భాషలు మనరాష్ట పాఠశాల
లందు నేర్పుచునుండ సుందర మైనట్టి తల్లి భాషను వీడి రెల్ల జనము
పరుగులు బెట్టుచు నరుగు తరుణమున తెలుగిలో తల్లినే పిలువ లేరు
మరుగాయెను, (ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ముల నే)డు, నిజమ్ము నమ్మ
వలయు చూడరీ రాష్ట్రాన తెలుగు చలన
చిత్రముల నట్టివి, మనకు చెఱపు కలుగు,
పెట్టు బడియైన రాబోదు పిచ్చి పనులు
వలద నుచు నొక జవరాలు తెలిపె పతికి
సుజన మ నో రంజన మై
రిప్లయితొలగించండియ జ రా మరముగ నిలువగ నర్హ o బ గు చున్
విజయము గా వ్రాయగ నే
ప్రజలె ల్ల రు రోసి ర య్యొ పద్య మ్ము ల నే?
విజయము సేయగ నాంగ్లము
రిప్లయితొలగించండిఅజపజ లేకుండబోవ నాంధ్రమ్మిలలో
గజగజ వణకుచు జదువగ
ప్రజలెల్లరు రోసిరయ్య పద్యమ్ములనే
నిజమిది!శుద్ధభాషనిటు నేర్వగజాలక గంద్రగోళమై
తొలగించండిగుజగుజలాడి బుద్ధికిని గోచరమవ్వక పెన్గులాడుచున్
విజనది యాంగ్లమందుగని వేస్టని టెల్గును దూరముంచుచున్
ప్రజలు దృణీకరించిరట పద్యకవిత్వము వద్దటంచయో!
రిప్లయితొలగించండినిజమిదె!పత్రికల చదువ
ప్రజలెల్లరు రోసిరయ్యొ! పద్యమ్ములనే
సుజనులు వెలయింపంగ స
హజముగ చదువ త్వరపడిరి హస్తపు తొడియై!
జిలేబి
ప్రజలు ఫుజూలగు వ్యంజన
రిప్లయితొలగించండిగజిబిజి గ్రాంథికయు శ్లేష గర్హింతురయా
కుజనులని దూరబోకు
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే
రామ్ కిడాంబి
అజుని కయిన యర్ధమవని
రిప్లయితొలగించండిగజిబిజి భాషల జనులను గాభర జేయన్
నిజమెగ నట భావింపన్
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే
కందం
రిప్లయితొలగించండిసుజనమ్ము ముప్పదిద్దరు
నజరామరమౌ ప్రబంధ యాగముఁ జేయన్
విజయోత్సాహపు సభ నే
బ్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే?
కందం పద్యం
రిప్లయితొలగించండిగజరాజై పద్యము, అ
గ్రజుడనిభాషఁవెలిబుచ్చి గమ్యము చూపె వి
భజనసలిపివికృతముచే
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే
గజకవినను గర్వియొకడు
రిప్లయితొలగించండినిజ నిజమునుచూపుచు యతి నియతి విడుచుచున్
విజరమగు కవిత లల్లగ
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఆంధ్రప్రదేశ్ లో ఆంగ్లమాధ్యమం 🙏
విజయమునిచ్చు పిల్లలకు ట్వింకిలు ట్వింకిలు స్టారు పద్యమే
నిజమని యెంచునీ తెలుగునేలకు జాడ్యము పట్టె ! బాపురే !
భుజగమువంటి యాంగ్లమును ముద్దిడు నేతలు పల్కిరీ గతిన్
"ప్రజలుదృణీకరించిరట పద్యకవిత్వము వద్దటంచయో" !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ప్రజలు తమకు వద్దన్నది
రిప్లయితొలగించండినిజముగఁ దుచ్ఛార్థ దుష్ట నిర్మిత కృతులం
గుజన వచనమ్ము లియ్యవి
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే
అజర వినాశ హీన మగు నర్థ గభీర సు శబ్ద పద్యముల్
వృజన పదవ్రజోక్త రస హీన కృతిం బర నిర్మితమ్మునున్
నిజ పుర పండి తోత్కర వినిర్మిత హృష్టులు కృష్ణదేవ రా
ట్ప్రజలు దృణీకరించి రఁట పద్యకవిత్వము వద్దటం చయో
అజరామరమీ పద్యము
రిప్లయితొలగించండిరుజయెరుగకనెదుగుచుండురోచిస్సులతో
నిజమిది, వదరగతగునా
"ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే!?"
అజితుల జేసె వయోజన
రిప్లయితొలగించండిప్రజలెల్లరు రోశిరయ్యొ పద్యమ్ములనే
నిజముగ నమ్ముచు వ్రాయగ
విజయము జేకూరి వారు విశ్రాంతిగనెన్
నిజముగ పద్య కావ్యముల నింపుగ జేయగ విశ్వసించరా
ప్రజలు దృణీకరించిరట పద్యకవిత్వము వద్దటం చయో
నజరులు వచ్చునప్పుడును నల్గురు మెచ్చగ తెల్సివచ్చులే
అజరము డస్సినప్పుడు విచారణజేతురు కావ్యమాధురుల్
చంపకమాల
రిప్లయితొలగించండినిజమిది నమ్ముమయ్య ధర నేటికి పండితు లెందరెందరో
భుజమున నెత్తుకొంచు ఘన మోదము నందుచు వ్రాసి మెత్తురే
సృజనత మృగ్యమై వినఁగ జెప్పెడు వారల నాంధ్రదేశపున్
ప్రజలుఁ దృణీకరించిరఁట పద్యకవిత్వము వద్దటం చయో
గజిబిజి భావమ్ములతో
రిప్లయితొలగించండిఋజుమార్గములేకయుండ యిప్పటికవులే
కుజనులుగావ్రాయుచుండ
ప్రజలెల్లరురోసిరయ్యొ పద్యమ్ములనే
నిజము వచనకవిత, నవల
రిప్లయితొలగించండిప్రజలకు ప్రియమయ్యె కతలు ప్రాధాన్యంబై
భజనలు సీరియలులకే!
"ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే!!"
రిప్లయితొలగించండికుజనులు వ్రాసెడు కవితల
ప్రజలెల్లరు రోసిరయ్యొ, పద్యమ్ములనే
సుజనులు మెచ్చగ జెప్పిరి
స్వజనము సంతోషమంద సారమునెల్లన్!!
భజన కవిత్వపు పోకడ
రిప్లయితొలగించండిప్రజలెల్లరు రోసిరయ్యొ; పద్యమ్ములనే
ప్రజలకు హితమొనరించెడి
నిజమగు నాయుధమనెంత్రు నేర్పరులెపుడున్
సృజనపు శీలియై నిలిచి ,సృక్కక సోలక వెల్గు పద్యమే !
రిప్లయితొలగించండివిజయపుబాటలన్ గెలుచు,విజ్ఞులుజెప్పిరి పద్య శోభలన్
రుజువులు జూపగోరెదవ?రూఢిగ నమ్మని వారిచెంతనే
ప్రజలుధృవీకరించిరట,పద్యకవిత్వము వద్దటంచయో!
నిజముల యొప్పుకోనగును,నిందలు వేసెడు వారు ముందుగా .
రిప్లయితొలగించండిప్రజలను మభ్యపెట్టుటకు,ప్రాభవమందనిగొప్పపండితుల్
రుజువులు జూపలేరుగద, రూఢిగ బల్కగలేనివారలౌ
ప్రజలుధృవీకరించిరట,పద్యకవిత్వము వద్దటంచయో!
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
ప్రజలు దృణీకరించి రఁట పద్య కవిత్వము
వద్దటం చయో
సందర్భము:
తాం స శుశ్రావ కాకుత్థ్సః
పూర్వ చర్యాం తత స్తతః
అపూర్వ పాఠజాతిం చ
గేయేన సమభిప్లుతాన్
వారు (లవకుశులు) తన పూర్వ చరిత్రను అపూర్వ పదబంధ రీతిలో గానం చేస్తున్నా రని రాముడూ విన్నాడు.
వారితో సహా వాల్మీకినీ తాను చేయబోయే యజ్ఞానికి ఆహ్వానించాడు. రాముని కొలువులోనూ కుశలవులు గానం చేశారు. (అధ్యాత్మ రామాయణం)
" *లవకుశ* చలనచిత్రంలో లవకుశులు మధురంగా ఆలపించిన మూడు పాటలు విన్న ప్రేక్షకులు రామ భక్తి హృదయాల్లో నిండారగా ఆనంద బాష్పాలు రాలుస్తూ నాడూ నేడూ కూడా పద్య కవిత్వాన్ని తృణీకరిస్తున్నారు." అని పద్య భావం.
3 పాటలు..
1. రామకథను వినరయ్యా..
(రామ జననంనుంచి కళ్యాణం వరకు..)
2.వినుడు వినుడు..
(రాముని యౌవ రాజ్య పట్టాభిషేక ప్రయత్నం నుంచి వన గమనారంభం వరకు)
3. శ్రీ రాముని చరితమును..
(పంచవటిలో శూర్పణఖనుంచి.. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చేవరకు)
చిత్రమునందు= సినీమాలో (లవకుశలో)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
సుజనులు మెచ్చగా లవకు
శుల్ వినిపించిన మూడు పాటలన్
నిజమగు రామ భక్తి హృది
నిండగఁ జిత్రమునందు నాలకిం
చి, జలకణాలు గన్నుగవఁ
జిందగ నాడును నేడుఁ బ్రేక్షకుల్,
ప్రజలు దృణీకరించి రఁట
పద్య కవిత్వము వద్దటం చయో!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
10.11.19
-----------------------------------------------------------
నిజముగా మారెను కాలము
రిప్లయితొలగించండినజరామరమైనభాష యా వేదనతో
గజగజ వణకగ భువిలో
ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే"*
అతివేలమ్ముగ గొప్పజెప్పుచునుతానానందమౌ వేడుకన్
రిప్లయితొలగించండిసతితోమేలమునాడుచుండుగదరా ,సాధించుటే హేతువై
మితిగాపద్యములల్లుచూదమనగా మిర్రించునాతండటన్
ప్రతిభా శూన్యుడె మేటిపండితుడుగాప్రఖ్యాతుడౌనిద్ధరన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహితులు మన హితము కోరుచు
రిప్లయితొలగించండిహితబోధలు చేయుచున్న వినవలె నెపుడున్
మతిపోయిన యోచించక
హితబోధల వినెడివారికే కీడొదవున్